offensive attacks
-
Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
భువనేశ్వర్: ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాజకీయ పర్యాటకులు తమ రాష్ట్రానికి తరలివస్తున్నారని, తమపై వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తమ ప్రజలపై ఈ రాజకీయ పర్యాటకుల ప్రభావం ఏమాత్రం ఉండదని తేలి్చచెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పొలిటికల్ టూరిస్టులుగా మారిపోయారని, కేవలం ఎన్నికల సమయంలోనే వారు ఒడిశాలో కనిపిస్తారని, ఆ తర్వాత మటుమాయం అవుతారని ఎద్దేవా చేశారు. నవీన్ పటా్నయక్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పర్యాటకులు అనుచితమైన భాష ఉపయోగిస్తున్నారని, అది తమ రాష్ట్ర ప్రజలు సహించబోరని హెచ్చరించారు. -
రష్యా ఆక్రమణ నుంచి 4 గ్రామాలకు విముక్తి
కీవ్: రష్యా ఆక్రమణలోని మరో గ్రామాన్ని తిరిగి తాము స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. డొనెట్స్క్ ప్రాంతంలోని మూడు గ్రామాలు స్వాధీనమైనట్లు ఆదివారం ప్రకటించింది. సోమవారం సొరొఝొవ్ అనే గ్రామంపై ఉక్రెయిన్ పతాకం మళ్లీ ఎగిరిందని రక్షణ శాఖ పేర్కొంది. ఇవన్నీ కుగ్రామాలేనని సమాచారం. అయితే, ఉక్రెయిన్ బలగాలు ఆక్రమిత ప్రాంతాల్లోకి మరింత ముందుకు చొచ్చుకుపోయేందుకు ఈ స్వల్ప విజయాలే అవకాశం కల్పిస్తాయని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామంపై రష్యా స్పందించలేదు. రష్యా మిలటరీ బ్లాగర్లు మాత్రం.. ఉక్రెయిన్ పేర్కొంటున్న నాలుగు గ్రామాల నుంచి రష్యా బలగాలు ఉపసంహరించుకున్నాయని ప్రకటించారు. జెపొరిజియా తదితర ప్రాంతాల్లో ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగుతోందని చెబుతున్నారు. ఇన్నాళ్ల యుద్ధంలో ఉక్రెయిన్‌లోని ఐదో వంతు భాగం రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. -
సూసైడ్ జాకెట్‌తో పాక్ పాప్ సింగర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన పాప్ సింగర్, నటి రబి పిర్జాదా (27) డమ్మీ బాంబులు అమర్చిన ‘సూసైడ్ జాకెట్’ తొడుక్కొని ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపుకు నిరసనగా ఆమె ఈ చర్యకు పూనుకుంది. మోదీకి హెచ్చరికగా ట్విట్టర్లో చేసిన ఈ పోస్టు వైరల్ అయింది. దీనిపై కొందరు పాకిస్తాన్ పరువు తీస్తున్నావంటూ తిట్టిపోశారు. అనంతరం ఆమె ఆ ఫొటోను తొలగించారు. గతంలో కూడా ఆమె కొండ చిలువలు, మొసళ్ల దగ్గర ఫొటో దిగి వాటిని మోదీపై వదులుతానని వ్యాఖ్యలు చేసింది. అదికాస్తా వైరల్ కావడంతో పంజాబ్ వణ్యప్రాణి రక్షణ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. -
విదేశీ కంపెనీలూ.. వెళ్లిపోండి ఖబడ్దార్!!
విదేశీ కంపెనీలు వెంటనే తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ పాకిస్థానీ తాలిబన్లు హెచ్చరించారు. అఫ్ఘాన్ సరిహద్దుల వెంట ఉన్న ఈ జిల్లాలో వేలాది మంది సైనికులతో తాలిబన్లను వేటాడేందుకు చర్యలు మొదలుకావడంతో వారీ హెచ్చరికలు చేశారు. ''మొత్తం విదేశీ పెట్టుబడిదారులు, విమానయాన సంస్థలు, బహుళ జాతీయ సంస్థలు వెంటనే పాకిస్థాన్‌తో తమ లావాదేవీలు ఆపేసి, పాకిస్థాన్ వదిలి వెళ్లిపోవాలి. లేకపోతే వాళ్లకు ఎదురయ్యే నష్టాలకు వాళ్లే బాధ్యులవుతారు'' అని తాలిబన్ల ప్రతినిధి షహీదుల్లా షహీద్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఉత్తర వజీరిస్థాన్‌లోని ఈ గిరిజన జిల్లాలో తాలిబన్లకు చాలా గట్టి పట్టుంది. ఇక్కడ ఆదివారం రాత్రి నుంచి పాక్ సైన్యం తన ఆపరేషన్లు మొదలుపెట్టింది. కరాచీలోని ప్రధాన విమానాశ్రయంపై తాలిబన్ ఉగ్రవాదులు వరుసపెట్టి దాడులు చేసి అనేకమందిని హతమార్చడంతో పాక్ సైన్యం సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారి వారిపై దాడులు మొదలుపెట్టింది. అయితే, ఈ దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు.