ఉక్రెయిన్‌లోని కఖోవ్‌కా జలాశయం ధ్వంసం కావడంతో ఖెర్సన్‌లో నీట మునిగిన ఇళ్లు
కీవ్: రష్యా ఆక్రమణలోని మరో గ్రామాన్ని తిరిగి తాము స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. డొనెట్‌స్క్ ప్రాంతంలోని మూడు గ్రామాలు స్వాధీనమైనట్లు ఆదివారం ప్రకటించింది. సోమవారం సొరొఝొవ్ అనే గ్రామంపై ఉక్రెయిన్ పతాకం మళ్లీ ఎగిరిందని రక్షణ శాఖ పేర్కొంది. ఇవన్నీ కుగ్రామాలేనని సమాచారం.
అయితే, ఉక్రెయిన్ బలగాలు ఆక్రమిత ప్రాంతాల్లోకి మరింత ముందుకు చొచ్చుకుపోయేందుకు ఈ స్వల్ప విజయాలే అవకాశం కల్పిస్తాయని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామంపై రష్యా స్పందించలేదు. రష్యా మిలటరీ బ్లాగర్లు మాత్రం.. ఉక్రెయిన్ పేర్కొంటున్న నాలుగు గ్రామాల నుంచి రష్యా బలగాలు ఉపసంహరించుకున్నాయని ప్రకటించారు. జెపొరిజియా తదితర ప్రాంతాల్లో ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగుతోందని చెబుతున్నారు. ఇన్నాళ్ల యుద్ధంలో ఉక్రెయిన్‌లోని ఐదో వంతు భాగం రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment