occupations
-
చేసే పనీ.. చేటు చేయొచ్చు.. జలుబు నుంచి క్యాన్సర్ దాకా..
ఒక వ్యక్తి రోజులో ఎక్కువ భాగం గడిపే చోటు ఏదైనా ఉందంటే అది ఉద్యోగం/ వృత్తిపరమైన విధులు నిర్వర్తించే ప్రదేశమే. ఎవరికైనా ఇది తప్పనిసరే అయినా.. ఆయా ఉద్యోగాలు/వృత్తి ప్రదేశాలకు వ్యక్తుల అనారోగ్యాలకు సంబంధం ఏర్పడుతోంది. సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమయ్యే దాకా.. వివిధ ఉద్యోగాలు, వృత్తుల ప్రభావం పడుతోంది. ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యే వరకు కూడా చాలా మంది ఈ సమస్యను గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఇటీవలికాలంలో వృత్తి వ్యాపకాల ప్రభావం గతంలో కంటే మరింత పెరిగిందని.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బంది పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. వీటినే ఆక్యుపేషనల్ హజార్డ్స్గా చెప్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆక్యుపేషనల్ హెల్త్‌పై అవగాహన కలిగిస్తున్న పలు సంస్థల అధ్యయనాలు ఏయే రంగాల్లో పనిచేస్తున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నది తేల్చి చెప్తున్నాయి. వాటి ప్రకారం.. – సాక్షి, హైదరాబాద్ అనారోగ్య ‘గనులు’.. గనులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వారు పీల్చే కలుషిత గాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నెమ్మదిగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఎన్ని జాగ్రత్తలు, గట్టి టోపీలు, అగ్నిమాపక భద్రత పరికరాలు, గాగుల్స్ వంటివి వాడినా ప్రమాదం తప్పని పరిస్థితే ఉంటోందని నిపుణులు తేల్చారు. సమస్యల కర్మాగారాలు.. కర్మాగారాల్లో భారీ యంత్రాలు, ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. పెద్ద శబ్దాలు వెలువడతాయి. ఇవన్నీ వ్యక్తుల ఆరోగ్యానికి హానికరమే. ఫ్యాక్టరీ కారి్మకులు, మేనేజర్లు లేదా ఫ్లోర్ వర్కర్లలో వినికిడి లోపం సాధారణంగా మారుతోంది. భవన నిర్మాణం.. ఆరోగ్య ధ్వంసం.. నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరికీ, వారు కార్మికులు, ఉద్యోగులు, డిజైనర్లు ఎవరైనా సరే.. ఎక్కువసేపు అక్కడే గడిపితే ప్రమాదకరమే. సిమెంట్, మట్టి, ఇసుక ధూళి, పెయింట్లు, మరికొన్ని నిర్మాణ ఉత్పత్తులు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. బిపీఓలలో.. బాడీ క్లాక్‌కు బ్రేక్.. బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీఓ) సెంటర్లలో రాత్రి షిఫ్టులలో పనిచేయడం, నిరంతర రాత్రి షిఫ్టులు, తరచూ షిప్టులు మారడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పగటిపూట నిద్రపోతున్నా, షిఫ్టులు మారుతున్నా శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ప్రభావితమవుతుంది. దీర్ఘకాలిక నష్టానికి కారణమవుతోంది. రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్‌తోపాటు సెప్టిక్ అల్సర్లు, గ్యా్రస్టిక్ అల్సర్లు వస్తున్నాయి. శుభ్రత.. ఆరోగ్యానికి లేదు భద్రత.. విభిన్న రకాల ఆవరణలను శుభ్రపరిచే వారికీ ఆరోగ్యపు ముప్పు తప్పడం లేదు. టాయిలెట్, బాత్రూం, ఫ్లోర్ క్లీనర్లు వాడినప్పుడు విష వాయువులు వెలువడతాయి. అవి చాలా ప్రమాదకరం. కంప్యూటర్.. వెన్నెముక కష్టాలు.. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి వెన్ను భాగం, చేతులు, కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల ఈ రకమైన కెరీర్‌ను ఎంచుకుంటున్నవారు పెరిగారు. చాలా మంది వెన్నెముక సమస్యలు, స్లిప్డ్ డిస్క్, కండరాల ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పూల డిజైనర్‌కూ డేంజర్.. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ పూల డిజైనర్ వృత్తి కూడా సమస్య రేపేదే. పూల డిజైనర్ కాండం నుంచి పూలను కత్తిరించి, అందంగా అమర్చే సమయంలో వాటికి దగ్గరగా ఉంటారు. ఆ పూల మొక్కల కోసం వినియోగించే బలమైన పురుగుమందుల ప్రభావానికి లోనవుతారు. వినికిడికి.. ‘ధ్వని’ దెబ్బ.. ఎక్కువ ధ్వని వెలువడే పరిశ్రమలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు వినికిడి సమస్యల బారినపడుతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఏవైనా పరిశ్రమల్లో ఒక ఉద్యోగి 8గంటల పాటు 90 డెసిబుల్స్ ధ్వనిలో పనిచేయవచ్చు. 95 డెసిబుల్స్ ఉంటే 4 గంటలు, 100 డెసిబుల్స్ ఉంటే 2 గంటలు మాత్రమే పనిచేయాలి. అదే 115 డెసిబుల్స్, ఆపైన తీవ్రతతో ధ్వని ఉంటే.. ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. అంతేకాదు.. ఇయర్ ప్లగ్స్, ఇయర్ కెనాల్స్ వంటివి వాడాలి. వృత్తికో వ్యాధి తప్పట్లేదు అనేక రకాల పరిశ్రమలు, రంగాలు, వృత్తులు, ఉద్యోగాలు వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ►ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు, అతిగా నిలబడడం వల్ల వెరికోసిటీస్, వినికిడి సమస్యలు వస్తున్నాయి. ►పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని, డయాబెటిస్, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారని అధ్యయనాలు తేల్చాయి. గట్టిగా మాట్లాడుతూ బోధించడం వల్ల గొంతు సమస్యలూ కనిపిస్తున్నాయని అంటున్నాయి. ► లారీలు, కంటైనర్లు వంటి భారీ వాహనాల డ్రైవర్లకు వెన్ను సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, వాహనాల వైబ్రేషన్ వల్ల రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. కన్నార్పకుండా రోడ్లను చూస్తూ ఉండటం వల్ల కళ్లు పొడిబారుతూ దృష్టి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. ►సిలికా పరిశ్రమలో పనిచేసేవారు ఊపిరితిత్తులకు సంబంధించిన సిలికోసిస్‌కు గురవుతారు. ఆస్బోస్టాస్ పరిశ్రమల్లో పనిచేసేవారు పలు రకాల కేన్సర్లకు, చక్కెర పరిశ్రమలో పనిచేసేవారు పెగసోసిస్ వంటివాటికి గురవుతారు. ముందు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము చేస్తున్న ఉద్యోగం/వృత్తి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో గుర్తించి.. వాటి నుంచి తప్పించుకునే అంశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు.. మధ్యలో కాసేపు లేచి నడవడం, దూరంగా ఉన్న వస్తువులను చూడటం, వీలైతే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మంచిదన్నారు. అపరిశుభ్ర, కాలుష్య పరిస్థితుల్లో పనిచేసేవారు మాస్కులు, గ్లౌజులు వంటివి కచ్చితంగా వాడాలన్నారు. వైద్యులను సంప్రదించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు తీసుకుని పాటించాలని స్పష్టం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. వృత్తి, ఉద్యోగపరమైన బాధ్యతల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటి పై తరచుగా అవగాహన సద స్సులు నిర్వహిస్తున్నాం. గత వారం ట్రాఫిక్ పోలీసులకు వచ్చే సమస్యలపై సదస్సు ఏర్పాటు చేశాం. కొత్తగా పుట్టుకొస్తున్న ప్రొఫెషన్ల వల్ల కూడా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఈ తరహా ఆక్యుపేషనల్ హజార్డ్స్‌కు చికిత్సలు లేవు. అందువల్ల ఆయా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు అవగాహన పెంచుకుని, జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విజయ్‌రావు, జాతీయ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ -
ఆక్రమణలు తొలగించినా సీఎం పైనే నెపం
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదించడం ఈనాడు పత్రికకు అలవాటుగా మారింది. రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆక్రమణదారులకు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెబితే ‘సీఎం వస్తున్నారు.. దుకాణాలు తొలగించాల్సిందే’ అంటూ ఈనాడులో వార్త ప్రచురించారు. చిత్తూరు – వేలూరు రోడ్డులో విజయా డెయిరీని ఆనుకుని పది దుకాణాలు వెలిసాయి. నగర సుందరీకరణకు అడ్డుగా ఉన్నాయని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ నిర్ణయించారు. ఇదే విషయాన్ని వ్యాపారులకు చెప్పారు. ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. వ్యాపారులు కూడా ఆ దుకాణాలను స్వచ్ఛందంగా తొలగించారు. దీనిని వక్రీకరిస్తూ ఈనాడులో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. సీఎం జిల్లా పర్యటనకు వస్తుండడంతో అధికారులు బలవంతంగా దుకాణాలను తీసేయిస్తు న్నారని రాసుకొచ్చారు. రోడ్డుపై ఆక్రమణలు తొలగిస్తే సీఎం పర్యటనకు ఆపాదిస్తూ రాయడం మంచిదికాదని కమిషనర్ అరుణ అన్నారు. -
రష్యా ఆక్రమణ నుంచి 4 గ్రామాలకు విముక్తి
కీవ్: రష్యా ఆక్రమణలోని మరో గ్రామాన్ని తిరిగి తాము స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. డొనెట్స్క్ ప్రాంతంలోని మూడు గ్రామాలు స్వాధీనమైనట్లు ఆదివారం ప్రకటించింది. సోమవారం సొరొఝొవ్ అనే గ్రామంపై ఉక్రెయిన్ పతాకం మళ్లీ ఎగిరిందని రక్షణ శాఖ పేర్కొంది. ఇవన్నీ కుగ్రామాలేనని సమాచారం. అయితే, ఉక్రెయిన్ బలగాలు ఆక్రమిత ప్రాంతాల్లోకి మరింత ముందుకు చొచ్చుకుపోయేందుకు ఈ స్వల్ప విజయాలే అవకాశం కల్పిస్తాయని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామంపై రష్యా స్పందించలేదు. రష్యా మిలటరీ బ్లాగర్లు మాత్రం.. ఉక్రెయిన్ పేర్కొంటున్న నాలుగు గ్రామాల నుంచి రష్యా బలగాలు ఉపసంహరించుకున్నాయని ప్రకటించారు. జెపొరిజియా తదితర ప్రాంతాల్లో ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగుతోందని చెబుతున్నారు. ఇన్నాళ్ల యుద్ధంలో ఉక్రెయిన్‌లోని ఐదో వంతు భాగం రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. -
అడవి అంచున.. అల వైకుంఠపురం
వారంతా సంచార జీవులు.. చెరువు గట్లు, ఊరి చివర జాగాల్లో పాకలు వేసుకుని బతికేవారు. చేలల్లో ఎలుకలు.. బోదెల్లో చేపలు పట్టడం ప్రధాన వృత్తి. అక్కడక్కడా పొలాలకు కాపలాదారులుగా ఉండటం.. కొండకెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకోవడం.. తప్పని పరిస్థితుల్లో వేటగాళ్లుగా మారడం.. అదీ కుదరకపోతే ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి సద్దికూడు బిచ్చమెత్తి పొట్ట నింపుకోవడం చేస్తుంటారు. చింపిరి జుత్తు.. చిరిగిన దుస్తులతో దర్శనమిచ్చే యానాదుల జీవన చిత్రమిది. అత్యంత వెనుకబడిన తెగకు చెందిన ఆ కుటుంబాల్లో కొన్ని అడవి అంచున ఓ గ్రామాన్ని నిర్మించుకున్నాయి. కట్టెలు కొట్టిన చేతితో నాగలి పట్టి రైతు కుటుంబాలుగా మారాయి. తాగుడుకు స్వస్తి పలికి చైతన్యవంతమయ్యాయి. తమ చరిత్ర గతిని మార్చుకున్నాయి. తరతరాల నిరక్షరాస్యతను ఛేదించి అక్షర కాంతి నింపుకుంటున్నాయి. ఇలపై వెలిసిన ఈ అల వైకుంఠపురంలోకి తొంగిచూస్తే.. సాక్షి, అమరావతి బ్యూరో/కారంపూడి: గుంటూరు జిల్లా కారంపూడి మండలం నరమాలపాడు శివారు నల్లమల అడవి అంచున ఉంది వైకుంఠపురం. 1965 నాటికి ఇక్కడ నాలుగైదు యానాద కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఒబ్బాని రంగనాయకులు, చేవూరి లక్ష్మయ్య, రాపూరి అంకులు, కొమరగిరి నీలకంఠం కుటుంబాలతో అక్కడ అప్పట్లో చిన్నపాటి కాలనీ ఏర్పాటైంది. చుట్టూ సారవంతమైన భూములుండటంతో ఆ కుటుంబాలు పంటలు వేయడం ప్రారంభించాయి. తర్వాత కాలంలో వీరిని చూసి ఒక్కొక్క యానాద కుటుంబం అక్కడకు చేరింది. ఇప్పుడు అక్కడ వారివి 310 గడపలయ్యాయి. సుమారు 940 మంది జనాభా నివాసం ఉంది. వ్యవసాయమే వారి ప్రధాన వృత్తిగా మారింది. ప్రతి ఇంటికీ పొలం సమకూరింది. ప్రతి చేనుకు బోరు, మోటార్ సమకూరాయి. సమాజానికి మార్గదర్శకంగా కట్టుబాటు దశాబ్దాలుగా అక్కడ మద్య నిషేధం అమలవుతోంది. అనాదిగా నల్లమల అటవీ ప్రాంతం నాటుసారా తయారీకి అడ్డాగా ఉన్నా.. వైకుంఠపురంలో మాత్రం ఆ వాసనే లేదు. సారానే కాదు.. మద్యం అమ్మడం, తాగడాన్ని కూడా గ్రామస్తులంతా మూకుమ్మడిగా నిషేధించారు. గ్రామంలో ఇప్పటివరకు ఒక్క నేరం కూడా నమోదు కాలేదు. అక్కడి వారెవరూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన దాఖలాలు కూడా లేవు. గ్రామంలోని పిల్లలంతా చదువుకుంటున్నారు. 12 మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇలా వారంతా కష్టాన్ని, విలువల్ని నమ్ముకుని వైకుంఠపురం పేరును సార్థకం చేసుకున్నారు. వందకు పైగా జగనన్న ఇళ్లు వైఎస్సార్సీపీ రాకతో వైకుంఠపురంలో వందకు పైగా కుటుంబాలకు వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇకపై గ్రామంలో పక్కా ఇల్లు లేని వారంటూ ఉండరు. గ్రామం మొత్తం వైఎస్సార్ సీపీ కుటుంబమే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంపీటీసీలుగా ఆ గ్రామస్తులకే అవకాశం ఇస్తున్నారు. చలంచర్ల విశ్వనాథం, ఇండ్ల అప్పారావు, రాపూరి సామ్రాజ్యం, యాకసిరి లక్ష్మి ఎంపీటీసీలుగా పనిచేయగా.. ప్రస్తుతం చేపూరి భవాని ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. వ్యవసాయంలో ముందడుగు వేస్తున్నాం నిజానికి మాకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు. పత్తి, మిరప, వరి, కంది పంటలు సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఉద్యాన పంటలపైనా దృష్టి పెట్టాం. గ్రామంలో పదెకరాల దాకా తైవాన్ జామ తోటలు సాగు చేస్తున్నారు. బత్తాయి, మామిడి తోటలు కూడా పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామంగా రూపుదాల్చక ముందు మేమంతా కరెంటు లేకుండా అడవిలోనే గడిపాం. ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకుని ముందుకుపోతున్నాం. ఇందిరమ్మ, రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చలవ వల్ల అందరికీ ఇళ్లు, స్థలాలు సమకూరాయి. విడతల వారీగా ప్రతి ఇంటికి సేద్యం భూమి లభించింది. – ఒబ్బాని కనకయ్య, వైకుంఠపురం గ్రామ స్థాపకుల్లో ఒకరు రైతులుగా ఎదిగాం మా చిన్నప్పుడు ఇల్లు వాకిలి సక్రమంగా ఉండేవి కాదు. ఏదో ఒక చెరువు గట్టున, ఊరి చివర జాగాల్లో పాకలు వేసుకుని ఉండేవాళ్లం. ఇప్పుడు మాకంటూ ఒక ఊరు ఏర్పడింది. మా పూర్వీకులు తరతరాలుగా గడిపిన జీవితాలను తలుచుకుంటే నిజంగా ఇది ఎంతో ముందడుగే. గతంలో పొలాలకు కాపలా ఉండడం, ఎలుకల బుట్టలు పెట్టడం, చేపలు పట్టడం వంటి పనులతోపాటు కట్టెలు కొట్టుకుని జీవించేవాళ్లం. క్రమేణా ఆ వృత్తుల నుంచి రైతులుగా ఎదిగాం. ఇప్పుడు మంచి పంటలు పండిస్తున్నాం. – చేవూరి లక్ష్మయ్య, గ్రామ పెద్ద, వైకుంఠపురం పొలాలున్నాయ్.. చదువులొచ్చాయ్ మా గ్రామంలో అందరికీ పొలాలున్నాయి. మూడు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాం. జీవితాలు కొంచెం మెరుగుపడగానే పిల్లలను చదివించుకోవాలనే తలంపు వచ్చింది. గ్రామంలో పాఠశాల కూడా పెట్టడంతో పిల్లలను చదివించుకుంటున్నాం. ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పెరుగుతున్నారు. అనేక శతాబ్దాలుగా సంచార జీవితం గడుపుతూ వేటతో పొట్టనింపుకునే స్థాయి నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని చదువులో కూడా ముందడుగు వేస్తున్నాం. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా అభివృద్ధికి అడుగడుగునా అండగా ఉంటున్నారు. – యాకసిరి లక్ష్మి, మాజీ ఎంపీటీసీ -
దర్జాగా కబ్జా
కాశీబుగ్గ: చట్టాల అతిక్రమణ, ఆస్తుల ఆక్రమణ.. సమాజంలో ఏ మాత్రం పలుకుబడి ఉన్నా, రాజకీయంగా పరిచయాలు ఉన్నా చేసే పనులివేనని మాటిమాటికీ రుజువవుతోంది. తాజాగా కాశీబుగ్గలోని దోయిసాగరం ఉదంతం బయటపడింది. రెండు ఎకరాల మేరకు ఆక్రమణలు జరగ్గా.. అధికారులు స్పందించడంతో ఆక్రమణల్లో కొంత భాగాన్ని రక్షించ గలిగారు. పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించాలని రైతులు కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఆక్రమణ లో ఉన్న వారంతా ‘పెద్దవారే’నని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆక్రమించిన వారిలో ఉన్నారని వారంటున్నారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో అనేక పెద్ద సాగరాలు ఉన్నా కాశీబుగ్గకు తూర్పుభాగాన ఉన్నటువంటి దోయిసాగరం ముఖ్యమైనది. ఈ సాగరం ప్రస్తు తం 3వవార్డు పరిధి అంబుసోలి దళిత గ్రామానికి ఆనుకుని ఉంది. సర్వే నంబర్ 243/2 ప్రకారం 37 ఎకరాల సాగరమిది. దీని ఆ యకట్టు పరిధిలో తాళ్లభద్ర, అంబుసోలి, నర్సిపురం, చిన్నబడాం, పద్మనాభపురం రైతులు సుమారు 200 ఎకరాల భూములను సాగు చేస్తున్నారు. ఈ సాగరంలో సుమారు రెండెకరాల స్థలం ఆక్రమణలకు గురైంది. కాశీబుగ్గ–అక్కుపల్లి బీటీ రోడ్డుకు ఆనించి ఉన్న స్థలా న్ని కొందరు ఐదేళ్లుగా క్రమక్రమంగా ఆక్రమిస్తూ వస్తున్నారు. గడిచిన ఎన్నికల ముందు కోడ్ ఉన్నా కూడా వదలకుండా రెండెకరాలకు పైగా స్థలాన్ని అక్రమంగా కట్టడాలు కూడా కట్టేశారు. రూ.3 కోట్లు పలుకుతున్న స్థలం.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు–చెట్టు మొదలుపెట్టారు. అప్పటికే ఈ చెరువుపై కన్నేసిన స్థానిక పెద్దలు ఇక్కడ నీరు చెట్టు కార్యక్రమాలేవీ చేపట్టలేదు. ఎన్నికల సమయంలో రాత్రి వేళ అక్రమ కట్టడాలు కట్టి స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఈ స్థలం దాదాపు రూ.3కోట్లు పలుకుతుంది. ఈ ఆక్రమణలో స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు, టీడీపీ నాయకుల పాత్ర ఉందని స్థానికులంటున్నారు. తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు రిజిస్టేషన్లు జరుపుతున్న ముఠా పలాసలో వీరికి సహకరిస్తోంది. డీ–పట్టా భూములను, చెరువు గర్భాలను, గ్రామ కంఠాలను లింక్ డాక్యుమెంట్లతో మార్పులు చేర్పులు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. స్పందనలో కలెక్టర్‌కు వినతి.. దోయిసాగరంలో నీటిమట్టం స్థిరంగా ఉంటేనే తమ పంటలకు సా గునీరు అందుతుందని అంబుసోలి, ఇతర గ్రామస్తులు భావించా రు. ఆక్రమణ విషయం ఎప్పటి నుంచో తెలిసినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలీక ఊరుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘స్పందన’ కార్యక్రమం ప్రారంభించడంతో నేరుగా కలెక్టర్‌కు వెళ్లి ఫిర్యాదు చేశా రు. అంతకుముందు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌నే సంప్రదించారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ జె.నివాస్ టెక్కలి ఆర్డీఓ కిశోర్‌కుమార్‌కు దీనిపై దర్యాప్తు చే యాల్సిందిగా ఆదేశించారు. ఆయన పలాస తహసీల్దార్ కార్యాల యం నుంచి రికార్డులను తెప్పించుకుని, సర్వేయర్ చంద్రశేఖర్‌తో ప రిశీలించి అక్రమ కట్టడంగా గుర్తించి తొలగించారు. ఆక్రమణదారు లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తొలగించడం సులభమైంది. పూర్తిగా ఆక్రమణలు తొలగించి లోతు చేయాలి.. ప్రస్తుతం గ్రామంలో ఉన్న దోయిసాగరం 37 ఎకరాలకు 35 ఎకరాలు మాత్రమే మిగిలింది. రూ.65లక్షలు విలువ పలికే 80 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుగల ఆక్రమిత ప్రాంతాన్ని తొలగించారు. మిగిలిన ఆక్రమణలు తొలగించడానికి వారం గడువి చ్చారు. ఇప్పటికీ పూర్తిగా తొలగింపులు జరగడం లేదు. ఆలస్యం చేయకుండా సాగరంలో ఉన్న ఆక్రమణలు తొలగించి వెంటనే చెరువును లోతు చేయించి చుట్టూ గట్టు ఏర్పాటు చేయాలి. – తెప్ప గణేష్, నీటిసంఘ అధ్యక్షులు, నర్సిపురం ఆక్రమణ తొలగిస్తాం పలాస తహసీల్దారు పరిధిలో ఉన్న దోయిసాగరం 243/2 సర్వే నంబర్లో ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమే. ప్రస్తుతం వాటిని తొలగించాం. మిగిలిన డాక్యుమెంట్లు చూసి తప్పనిసరిగా ఆక్రమణలను తొలగిస్తాం. ఈ ఆక్రమణలో ఎంతటివారున్నా న్యాయపరమైన చర్యలు చేపడతాం. వారం రోజులు గడువు ఇచ్చాము. సరైన పత్రాలు తీసుకురాకుంటే ఆక్రమిత స్థలంగా భావించి వాటిని తొలగిస్తాం. – కిశోర్‌కుమార్, ఆర్డీఓ, టెక్కలి -
రైల్వే స్థలాల్లో ఆక్రమణల తొలగింపు
కంచిలి : మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ స్థలంలో ఉన్న ఆక్రమణలను రైల్వే అధికారులు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తొలగింపు చర్యలు చేపట్టారు. వాస్తవానికి రైల్వేస్టేషన్‌కు రెండు వైపులా గోడకు ఆనించి, స్టేషన్ సమీపంలోనూ చాలా మంది పేదలు ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఇటీవల కొందరు పక్కా నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు శనివారం ఆకస్మికంగా తొలగింపు చర్యలు చేపట్టారు. ముందస్తు నోటీసులు గానీ, సమాచారం గానీ ఇవ్వకుండా పూర్తి ఫోర్స్‌తో పకడ్బందీగా వచ్చి అక్రమ కట్టడాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా ఎనిమిది ఆక్రమణలను ఈ దశలో తొలగించారు. మిగతా వాటిని దశలవారీగా తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఆక్రమణల్లో కొందరు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అటువంటి నిర్మాణాల జోలికి, పాత నిర్మాణాల జోలికి వెళ్లలేదు. చిన్న బడ్డీలను కూడా వదిలేశారు. త్వరలో వీటిపైనా చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ స్థలంలో ఎవరూ పక్కా నిర్మాణాలు చేపట్టవద్దని సంబంధిత వర్గాలు ఎప్పటి నుంచో సూచిస్తున్నాయి. తాజాగా ఈ చర్యతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. రైల్వే స్థలాల్లో చాలా మంది చిన్నపాటి వ్యాపారాలు చేసుకొని పొట్టనింపుకొంటున్నారు. మరికొందరు సొంత స్థలాలు లేక ఎప్పటి నుంచో షెడ్లు వేసుకొని నివసిస్తున్నారు. ప్రస్తుత పరిణామంతో ఆయా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆక్రమణల తొలగింపును రైల్వే ఎస్ఎస్ఈ వి.కిశోర్‌కుమార్, ఆర్పీఎఫ్ సీఐ దిలీప్‌కుమార్‌ల నేతృత్వంలో చేపట్టారు. జేఈలు శివపాత్రో, పాపారావు, ఏఎస్ఐ బి.రావు, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిల్మ్‌నగర్ సొసైటీలో అక్రమాలు: పొంగులేటి
ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ అక్రమాలపై గతంలో జరిగిన విచారణ నివేదికను తక్షణం బయటపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పద్మాలయ స్టూడియోస్‌కు ఇచ్చిన ఐదెకరాల భూమిని మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. వీటిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని పొంగులేటి అన్నారు. అశోక్‌నగర్ నాలా ప్రాంతంలోని వంద కోట్ల రూపాయల విలువైన భూమిని భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ కబ్జా చేసిందని ఆరోపించారు. దీనిపై కూడా విచారణ జరిపి నిర్మాణాలను ఆపాలని డిమాండ్ చేశారు. -
ఆక్రమణల తొలగింపు... మిన్నంటిన ఆక్రందనలు
ఇళ్లను కూల్చరాదని అడ్డుకున్న మహిళలు బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు పంపిన పోలీసులు రెండు రోజులు సమయం ఇవ్వాలని వేడుకున్న బాధితులు హైకోర్టు స్టేతో ఆక్రమణల తొలగింపునకు తాత్కాలిక బ్రేక్ కోలారు : పేదల ప్రతిఘటన మధ్య నగర సమీపంలోని కోలారమ్మ చెరువులో బుధవారం ఆక్రమణల తొలగింపు ప్రారంభమైంది. అయితే బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో తొలగింపునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆర్డీవో మంజునాథ్ నేతృత్వంలో బుధవారం ఉదయం ఏడుగంటలకే అధికారులు జేసీబీలతో కోర్టు సర్కిల్ సమీపం నుంచి ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. అయితే కొంతమంది తమ ఇళ్లనుంచి హడావుడిగా ఇళ్లనుంచి సామగ్రిని బయటకు తీసుకురాగా మరికొందరు ఇళ్లను కూల్చవద్దని బీష్మించుకూర్చున్నారు. అయితే పోలీసులు ఇళ్ల యజమానులను బలవంతంగా బయటకు పంపి సామాగ్రిని బయటకు తరలించారు. కొందరు మహిళలు బయటకు రాకుండా తాళం వేసుకొని ఇంట్లోనే బైఠాయించారు. తమను ఇంట్లోనే ఉంచి నివాసాన్ని కూల్చాలని, తాము ఇంటి సమేతంగా సమాధి అవుతామని తలుపులు వేసుకున్నారు సీఐ శివకుమార్ సిబ్బంది సహాయంతో బలవంతంగా తలుపులు తెరచి ఇంటిలో ఉన్న మహిళలను మహిళా పోలీసు సిబ్బంది సహాయంతో బయటకు పంపారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి కిందపడిపోయింది. రెండు రోజులు గడువియ్యండి ఇళ్లను కూల్చివేయడానికి అధికారులు రాగా మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సామగ్రిని తరలించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని వేడుకున్నారు. ఆర్డీవో చేతులు పట్టుకుని మరీ వేడుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నందువల్ల తామేమి చేయలేదని ఆయన నిస్సహాతను వ్యక్త పరిచారు. మరో ఇంటి యజమాని అయితే ఏకంగా జేసీబీకి అడ్డు తగిలి తన ఇంటిని కూల్చవద్దని వేడుకున్నారు. పోలీసులు అతనిని బలవంతంగా పక్కకు లాగేశారు. హైకోర్టు స్టే ఓ వైపు ఆక్రమణల తొలగింపు కొనసాగుతుండగా మరో వైపు కొందరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారి విన్నపాన్ని పరిశీలించిన కోర్టు స్టే మంజూరు చేయడంతో ఆక్రమణల తొలగింపును నిలిపివేశారు. భాధితులు అక్కడి నుంచి తరలి వెళ్లడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని హైకోర్టు సూచించినట్లు సమాచారం