ఫిల్మ్నగర్ సొసైటీలో అక్రమాలు: పొంగులేటి | ponguleti alleges of occupations in filmnagar lands | Sakshi
Sakshi News home page

ఫిల్మ్నగర్ సొసైటీలో అక్రమాలు: పొంగులేటి

Published Tue, Sep 30 2014 1:06 PM | Last Updated on Tue, Oct 2 2018 3:40 PM

ఫిల్మ్నగర్ సొసైటీలో అక్రమాలు: పొంగులేటి - Sakshi

ఫిల్మ్నగర్ సొసైటీలో అక్రమాలు: పొంగులేటి

ఫిల్మ్నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ అక్రమాలపై గతంలో జరిగిన విచారణ నివేదికను తక్షణం బయటపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పద్మాలయ స్టూడియోస్కు ఇచ్చిన ఐదెకరాల భూమిని మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. వీటిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని పొంగులేటి అన్నారు. అశోక్నగర్ నాలా ప్రాంతంలోని వంద కోట్ల రూపాయల విలువైన భూమిని భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ కబ్జా చేసిందని ఆరోపించారు. దీనిపై కూడా విచారణ జరిపి నిర్మాణాలను ఆపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement