Film Nagar
-
పొన్నాల ఇంట భారీ చోరీ
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలిం నగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నాంపల్లి కోర్టు వార్నింగ్.. దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు
టాలీవుడుకు చెందిన దగ్గుబాటి వెంకటేష్,సురేష్, రానాలపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. దక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసినందుకు వారిపై కేసు నమోదైంది. దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, అభిరామ్‌పై 448, 452,458,120బి సెక్షన్లపై కేసు నమోదైంది.వివాదం ఏంటి..?డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్‌లోని వెంకటేష్‌కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.దగ్గుబాటి ఫ్యామిలీ ఏం చెబుతుంది..?జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్డు నంబర్ ఒకటిలో వెంకటేష్‌కు చెందిన 1000 గజాలు స్థలాన్ని సుమారు ఆరేళ్ల క్రితం నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. అక్కడ డెక్కన్ కిచెన్ పేరుతో ఆయన ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థలానికి పక్కనే ఉన్న రానాకు చెందిన స్థలాన్ని కూడా నందకుమార్ లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడే వారి మధ్య వివాదం తలెత్తింది. రానా నుంచి తీసుకున్న స్థలం లీజు పూర్తి అయింది. కానీ, ఆ స్థలంలో నందకుమార్ నిర్మాణాలు చేయడంతో రానా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆపై జీహెచ్ఎంసీ అధికారులు నందకుమార్‌కు నోటీసులు జారీ చేసి డెక్కన్ కిచెన్ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ, దగ్గుబాటి కుటుంబ సభ్యులు 60 మంది బౌన్సర్లతో తన రెస్టారెంట్‌ను కూల్చివేశారని నాంపల్లి కోర్టును నందకుమార్ ఆశ్రయించారు. ఈ స్థలం విషయంలో నందకుమార్‌పై కూడా కేసు నమోదు అయింది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్థలాన్ని నందకుమార్ తన స్థలంగా చెప్పుకుంటూ మరో ఇద్దరికి లీజుకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై రెండు కేసులో నమోదు అయ్యాయి. -
ఫిల్మ్ నగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఫిలింనగర్: నూతన సంవత్సర వేడుకల వేళ ఫిలింనగర్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్స్‌తో పాటు ఓ కొనుగోలుదారును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. షేక్‌పేటలోని ఫాల్కన్ కాలనీలో నివసించే ఎండీ అబ్దుల్ ఇర్ఫాన్ కారు డీలర్‌గా పని చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ మహ్మద్ రెహమాన్ అలీ న్యూ ఇయర్ వేడుకలకు అవసరమైన వారికి డ్రగ్స్ విక్రయించేందుకు ముంబై నుంచి ఇటీవలే ఎండీఎంఏ డ్రగ్స్‌ను నగరానికి తీసుకువచ్చాడు. ఇర్ఫాన్‌తో కలిసి నాలుగు రోజుల పాటు డ్రగ్స్ విక్రయించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఫిలింనగర్‌లోని కొత్త చెరువు వద్దకు రెహమాన్ అలీ చేరుకుని మరో పెడ్లర్ ఇర్ఫాన్‌ను అక్కడికి పిలిపించాడు. అవసరమైన వారికి సరుకును విక్రయించే క్రమంలో బహదూర్‌పురాకు చెందిన సయ్యద్ హజ్మతుల్లాను పిలిపించారు. కొత్త చెరువు వద్ద వీరిద్దరూ కలిసి హజ్మతుల్లాకు డ్రగ్స్ ఇచ్చే క్రమంలో అప్పటికే సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. రెహమాన్ అలీ ఇటీవలే డ్రగ్స్‌ను ముంబై నుంచి తీసుకు వచ్చినట్లుగా తేల్చారు. ఇర్ఫాన్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయించాలని పథకం వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేయడానికి వచి్చన హజ్మతుల్లాతో పాటు వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫొటోలు తీసి.. డబ్బులు వసూలు
ఫిలింనగర్: ఫొటోలు తీసి ఓ ‘గే’ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. షేక్‌పేట ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి స్వలింగ సంపర్కుడు (గే). ఇటీవల గ్రిండర్ అనే డేటింగ్ యాప్‌లో అతనికి ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో అతన్ని ఈ నెల 23న తన ఫ్లాట్ రావాలని ఆహ్వానించాడు. ఆ సమయంలో ఇద్దరూ శారీరకంగా కలుసుకునే క్రమంలో సదరు గుర్తు తెలియని వ్యక్తి అతనిని నగ్నంగా ఫొటోలు తీశాడు. తనకు రూ.15,000లు ఇవ్వాలని బాధితుడిని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో తన వద్ద అంత లేవని రూ.10,000లను యూపీఐ పేమెంట్ ద్వారా చెల్లించాడు. తనను బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
కీచక టీచర్ నిర్వాకం.. ట్యూషన్లోనే
సాక్షి,హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదో తరగతి విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు.హైదరాబాద్ పిలింనగర్లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ట్యూషన్ ఉపాధ్యాయుడు రాములు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడు చేసిన పనికి మనోవేదనకు గురైన విద్యార్థిని దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కీచక టీచర్ రాములుపై ఫిలింనగర్ పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. -
లడ్డూ దక్కించుకున్న సినీ నిర్మాత కొండేటి సురేష్
ప్రముఖ సినీ నిర్మాత, సంతోషం అధినేత కొండేటి సురేష్ గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఫిలింనగర్ దైవసన్నిదానంలో శనివారం నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలంలో పాల్గొన్న ఆయన ’ 19 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు గణపతి చేతిలో పూజలందుకున్న లడ్డూ తనకు దక్కడం సంతోషంగా ఉందని, ప్రతియేటా తాను లడ్డూ వేలం పాటలో పాల్గొని లడ్డూను దక్కించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఆలయ కోశాధికారి కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: నందిగిరి హిల్స్‌లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. కారు క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. దీంతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఫిల్మ్‌నగర్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకునే క్రమంలో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులో మంటలు చెలరేగడంతో పాదచారులు భయంతో పరుగులు పెట్టారు. -
నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు నమోదు
ఫిలింనగర్: తన ఇంట్లో అద్దెకు ఉంటున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఇచ్చిన పిర్యాదు మేరకు సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలివీ... నౌహిరా షేక్ ఫిలింనగర్‌లోని తన ఇంటిని నిర్మాత బండ్ల గణేష్‌కు నెలకు రూ. లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చింది.అయితే గత కొంతకాలంగా గణేష్ అద్దె ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. అతను ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని, గుండాల సహాయంతో, రాజకీయ నాయకుల అండతో ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. నౌహీరా ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు బండ్ల గణేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిల్మ్ ఛాంబర్లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు!
హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు భవనం చుట్టు దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్లో ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను కాదంటున్నాడని పక్కా పథకంతో లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడు తన సన్నిహితురాలి భర్తను దారుణంగా హత్య చేశాడు. వివరాలు.. షేక్‌పేట సమీపంలోని జైహింద్నగర్ కాలనీలో నివసించే గౌస్ మొహినుద్దీన్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి దుబాయ్‌లో మూడేళ్ల పాటు పనిచేశాడు. ఇటీవలే నగరానికి వచ్చి భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఆయన భార్య మీనా రూహీ 2002 ఫిబ్రవరిలో ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లింది. మూడు నెలలకే ఆమె భర్త గౌస్ మొహినుద్దీన్ కూడా ముగ్గురు పిల్లలను తీసుకుని లండన్ వెళ్లి ఆమెతో పాటు కొన్నాళ్లు ఉన్నారు. పిల్లల ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. గౌస్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని నగరానికి వచ్చారు. భార్య మీనా లండన్‌లో ఉంది. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన అద్నాన్ హుస్సేన్ (26)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. చదువుకునే సమయంలో ఇద్దరి మధ్యసానిహిత్యం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని మీనా రూహీని బలవంతం పెట్టాడు. ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. వివాహం చేసుకోకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె హైదరాబాద్‌కు తిరిగివచ్చింది. గత నవంబర్ 14న అద్నాన్‌పై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అద్నాన్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే.. మీనాను తనతో పాటు తీసుకెళ్లాలని పక్కా పథకంతో అద్నాన్ లండన్ నుంచి నగరానికి వచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఒకరి జోలికి మరొకరు వెళ్లవద్దని ఒప్పందం చేసుకుని వీడియో రికార్డింగ్ కూడా చేసుకున్నారు. కాగా.. ఈ నెల 14న రాత్రి గౌస్ మొహినుద్దీన్ తన భార్య, ముగ్గురు పిల్లలను తీసుకుని పుప్పాలగూడలో ఓ విందుకు హాజరై రాత్రి 9 గంటల ప్రాంతంలో బైక్‌పై తన ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న అద్నాన్ బలవంతంగా ఇంట్లోకి వెళ్లి మీనా రూహీని తనతో పాటు బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించగా ఆమె భర్త గౌస్ అడ్డుకున్నాడు. దీంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అద్నాన్ ఆగ్రహంతో ఊగిపోతూ గౌస్ గుండైపె గట్టిగా పొడిచాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే గౌస్ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
Hyderabad: ఫిలింనగర్లో ఎన్ఆర్ఐ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇటీవల యూకే నుండి హైదరాబాద్ వచ్చిన ఎన్నారై గౌస్ మొయినుద్దీన్‌ను దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు గౌస్ మొయినుద్దీన్ ఇటీవల యూకే నుండి నుండి హైదరాబాద్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్‌లో ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్.. ఫోటోలు
-
యువతకు ఇందులో అవకాశాలున్నాయి! : సెలబ్రిటీ డిజైనర్ 'షబ్నమ్ గుప్తా'
సాక్షి, హైదరాబాద్: యువతలకు ఇంటీరియర్ డిజైనింగ్‌లో అద్భుతమైన అపారమైన అవకాశాలు ఉన్నాయని, సృజనకు పదును పెట్టుకుంటే విజయాలు సుసాధ్యమని సెలబ్రిటీ డిజైనర్ షబ్నమ్ గుప్తా అన్నారు. నగరంలోని ఫిలిమ్నగర్లో ఏర్పాటు చేసిన కోషా ఇంటీరియర్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన పీకాక్ లైఫ్ బ్రాండ్‌ను నగరానికి పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు. తన ఇంట్లో వేసిన కలర్స్ నచ్చక సొంతంగా రంగులు వేయడం అనే అభిరుచి నుంచి ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ పరిణితి చోప్రా, ఇర్ఫాన్ ఖాన్, కంగనారనౌత్ తదితరుల ఇళ్లకు డిజైన్ చేసే దాకా సాగిన తన 3 దశాబ్దాల ప్రయాణాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. శతాబ్దాల నాటి ఇంటీరియర్ వస్తువులకు కొత్త సొబగులు అద్దుతూ కోషాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలోని ఉత్పత్తుల విశేషాలను సంస్థ సీఈఓ అజితా యోగేష్ వివరించారు. కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు పేజ్ త్రీ సోషలైట్స్, డిజైనింగ్ రంగ ప్రముఖులు.. హాజరయ్యారు. -
ఉదయం అదృశ్యం.. రాత్రికి మృతదేహం
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన నన్నపనేని కార్తీక్ (28) నగరంలోని ఓ టీవీ చానెల్లో కెమెరామన్‌గా పని చేస్తున్నాడు. ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీలో మహిపాల్, భీమా ప్రవీణ్‌తో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ నెల 2న ఉదయం కార్తీక్ ఉద్యోగానికి వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పి తన బైక్‌పై బయలుదేరాడు. రాత్రి తిరిగి రాకపోయేసరికి రూమ్మేట్ ప్రవీణ్ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో రాత్రంతా వెతికారు. ఈ నెల 3న కూడా గదికి రాకపోయేసరికి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కార్తీక్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలిస్తున్న సమయంలో మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ చెరువులో పడి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందింది. మంగళవారం సాయంత్రం శామీర్‌పేట్ చెరువు వద్ద బైక్‌తో పాటు కార్తీక్ మొబైల్ ఫోన్ పోలీసులకు కనిపించింది. దీని ఆధారంగా కార్తీక్ అడ్రస్‌ను కనిపెట్టి ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున కార్తీక్ మృతదేహం ఒడ్డుకురావడంతో అదే విషయాన్ని ఫిలింనగర్ పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్ ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మొన్న తల్లిదండ్రులు.. నిన్న కుమారుడు.. అనాథగా మారిన కూతురు!
హైదరాబాద్: ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో మూడ్రోజుల క్రితం వంట గ్యాస్ లీకై దంపతులు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి కుమారుడు గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో నివసించే మిర్యాల రమేష్.. ఇంట్లోని వంట గ్యాస్ లీకై న విషయాన్ని గ్రహించకుండా.. కరెంటు స్విచ్ వేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకొని గాయాలపాలయ్యారు. అదే రోజు రమేష్ మృతి చెందాడు. మరుసటి రోజు ఆయన భార్య శ్రీలత ఆస్పత్రిలో కన్నుమూసింది. తీవ్ర గాయాలపాలైన కుమారుడు హర్షవర్ధన్ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనతో వడ్డెర బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోదరుడు మృతి చెందడంతో చెల్లెలు అనాథగా మారింది. ప్రస్తుతం ఈ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోజు రోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. నగరంలో రెండు వేరు వేరుప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు డ్రగ్స్ సప్లై చేస్తున్న అరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భారీగా నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మామూనూరు బెటాలియన్ కానిస్టేబుల్ ప్రశాంత్ నాయక్ ఉన్నారు. పోలీస్ సైరన్ వేసుకొని చెక్‌పోస్ట్‌ను దాటేస్తున్న ఈ ముఠా.. పుష్పసినిమా తరహాలో వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది. మరోవైపు ఫిలింనగర్లోనూ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్లో డ్రగ్స్ పిల్స్ విక్రయిస్తున్న బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ పాస్టర్ డేవిసన్‌ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ 11 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.డేవిసన్.. ఆల్ ఇండియా నైజీరియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా దక్షిణ భారత్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వీసా, పాస్పోర్టుతో ఇండియాలో ఉంటున్నట్లు తేలింది. -
ఫిలింనగర్లో కారు బీభత్సం.. ర్యాష్ డ్రైవింగ్‌తో రెచ్చిపోయిన మహిళ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఓవర్ స్పీడ్‌లో చెట్టును ఢీకొట్టింది. తర్వాత కారు కంట్రోల్ అవ్వకపోవడంతో ఎలక్ట్రికల్ పోల్, గోడను ఢీ కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. కారు రెండు టైర్లు విడిపోయి.. కొంత దూరంలో ఎగిరి పడ్డాయి. అయితే కారును అక్కడే వదిలేసిన యువతి.. తన హై హీల్స్ భుజాన వేసుకుని సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కాగా ప్రమాద స్థలంలో గుడిసెలో ఓ వాచ్ మెన్ కుటుంబం నివాసముంటోంది. గుడిసెకు అడుగుదూరంలో కారు ఆగడంతో సదరు కుటుంబం ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలో కరెంట్ స్తంభం, గోడ కూలిపోయాయి. అంతా మట్టి,రాళ్లు గుట్టలుగా పేరుకుపోవడంతో గోడకు తగిలి కారు అయిపోయింది. లేదంటే నేరుగా ఎదురుగా గుడిసెలోకి దూసుకెళ్లేదని స్థానికులు అంటున్నారు. కారు అదే స్పీడ్‌లో వెళ్ళి ఉంటే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కనురెప్ప కంటే తక్కువ బరువు.. వర్షానికి వాసన ఉంటుందా? -
హైదరాబాద్ ఫిలింనగర్ లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం
-
ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడి...
హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడడంతో పాటు ఆమెను నిర్బంధించి దాడి చేయడమే కాకుండా ఇంటిని ధ్వంసం చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలతో ఇద్దరు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్ బస్తీలో నివసించే కవిత అనే మహిళ ఇంట్లోకి అదే బస్తీకి చెందిన పిల్లికళ్ల కురుమూర్తి(38), పిల్లికళ్ల శేఖర్(32) మద్యం మత్తులో ప్రవేశించి దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా ఇంట్లోని సామాన్లను ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించారు. కిటీకి అద్దాలతో పాటు టీవీని ధ్వంసం చేశారు. పూల కుండీలు ఎత్తేస్తూ ఇళ్లంతా బీభత్సం సృష్టించడంతో పాటు ఆమెను భయాందోళనకు గురిచేశారు. అడ్డుకునేందుకు ప్రయతి్నంచిన కవితపై దాడికి దిగారు. ప్రాణాలు ఆరచేతుల్లో పెట్టుకున్న బాధితురాలు వారి బారినుంచి తప్పించుకుని ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ 452,.354(బి), 341, 323, 427 నాన్బెయిలబుల్సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా వీరిద్దరూ ఇటీవల బోనాల పండగ రోజు కూడా మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. దీంతో పాటు దాడులకు పాల్పడడుతూ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది. ఆ ఘటన మరువక ముందే మరోమారు వీరిద్దరూ బస్తీలో దౌర్జన్యానికి దిగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వరుస సంఘటనలతో వినాయక్‌నగర్‌లో పెరిగిపోతున్న దౌర్జన్యాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఒకరితో సహజజీవనం..మరోకరితో ప్రేమాయణం..చివరికీ..
హైదరాబాద్: యువతిని గాఢంగా ప్రేమించాడు.. ఆమె ఫొటోను ఛాతిమీద పచ్చబొట్టుగా వేయించుకున్నాడు... పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు...ఆమెతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ప్రియురాలు నో చెప్పడంతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కర్నూలుకు చెందిన శివ ప్రసాద్(23) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా ఫిలింనగర్‌లోని దుర్గా భవానీనగర్‌లో గది అద్దెకు తీసుకొని కవిత అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఒక వైపు సహజీవనం చేస్తూనే మరో వైపు అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సుతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆమె ఫొటోను..పేరును కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. తనతో సహజీవనం చేస్తూ మరో యువతితో ప్రేమ పేరుతో తిరుగుతున్న శివ ప్రసాద్‌ను సహజీవనం చేస్తున్న యువతి కవిత మూడు రోజుల క్రితం నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను మోసం చేశాడని భావించిన కవిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది జరుగుతుండగానే శుక్రవారం సాయంత్రం ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుందామని శివ ప్రసాద్ అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. సహజీవనం చేస్తున్న యువతి నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చేరడం, ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించకపోవడంతో శివప్రసాద్ శనివారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోలుకున్న యువతి కవితను పోలీసులు ఆస్పత్రి నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిలింనగర్: ఉద్యోగం మానేశానని భర్తకు ఫోన్ చేసి .. ఇంట్లో నుంచి బయటకు
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్‌లోని బాలరెడ్డినగర్‌లో నివసించే సాయి కృష్ణవేణి విప్రో సర్కిల్లోని ఓ బ్యాంక్ లో పనిచేస్తుంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ నెల 1న తన భర్త ప్రవీణ్ కుమార్‌కు ఫోన్ చేసి తాను ఉద్యోగం మానేశానాని ఇంటిలో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పి ఫొన్ స్విచ్ఛాప్ చేసింది. ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. తన భార్య కనిపించడం లేదంటూ ప్రవీణ్ ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
ఫిలింనగర్: ‘అమ్మా.. నేనేం పాపం చేశానమ్మా?’
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లు కూడా నిండని ఆ కొడుకును.. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పైగా కడుపులో మరో బిడ్డ పెరుగుతోంది. అయితే కుటుంబ సమస్యలు.. క్షణికావేశం ఆ తల్లి ఆలోచనా శక్తిని చంపేసినట్లున్నాయ్. ఫలితంగా.. ఘోరానికి పాల్పడిందామె. నగరంలోని ఫిలింనగర్ తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. అత్తింటి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే తాను చనిపోతే పిల్లాడి ఆలనా పాలనా చూసుకునేవారు ఎవరూ ఉండరనుకుందో ఏమో.. ఆ తల్లి ఘోరమైన నిర్ణయం తీసుకుంది. ఆ చిన్నారికి సైతం ఉరేసింది. విశ్వనాథ్, శిరీషలు ఫిలింనగర్‌లోని వినాయక నగర్లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు మనీష్ అనే కొడుకు ఉన్నాడు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులు చాలాకాలంగా శిరీషను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిరీష మరోసారి గర్భం దాల్చింది. మూడు నెలల కడుపుతో ఉన్న ఆమె.. అత్తింటి వారి వేధింపుల్ని భరించలేకపోయింది. శుక్రవారం రాత్రి చిన్నారి మనీష్‌తో పాటు తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృత దేహాలను ఉస్మానియా కి తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ఆమెపై మోజుతో భార్యకు నరకం.. ఫేస్బుక్ లైవ్‌లోనే.. -
Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి
ఫిల్మ్ నగర్(హైదరాబాద్): ఎన్నో సినిమా కథలు రాశాడు. ఎన్నో పాత్రలు సృష్టించాడు. ఆ పాత్రలకు ప్రాణం పోశాడు. వాటిని వెండి తెర మీద చూసి మురిసిపోదామనుకున్నాడు. కానీ పరిస్థితులు కలిసిరాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయాడు. వందలాది కథలు రాసుకున్న ఆయన ‘కథ’ అర్ధాంతరంగా ముగిసింది. ఇది ఓ కథా రచయిత విషాద గాథ. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తిసాగర్ (50) సినిమాల్లో కథలు రాయడంపై మక్కువతో చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. షేక్ పేట్ పరిధిలోని ఓ పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. సినిమా కథలతో పాటు సహాయ దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున టెర్రస్‌పై విగత జీవిగా కనిపించాడు. చదవండి: హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి! ఇది గమనించిన స్నేహితుడు 108 కు సమాచారం అందించాడు. వారు వచ్చి అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళాడు. స్నేహితుడు రాధాకృష్ణ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని గదికి వెళ్లి చూడగా తాను రాసుకున్న వందలాది కథలు గది నిండా ఉన్నాయి. వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు. -
చిన్న ప్రమాదమే, క్షేమంగానే ఉన్నాను: శర్వానంద్
‘నా కారు చిన్న ప్రమాదానికి గురైంది. కానీ, నేను క్షేమంగానే ఉన్నాను’ అంటూ హీరో శర్వానంద్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ జంక్షన్ లో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా శర్వానంద్ స్పందిస్తూ – ‘‘ఈ రోజు (ఆదివారం) ఉదయం నా కారు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా చిన్న ప్రమాదం. మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన పడొద్దు’’ అన్నారు. కాగా జూన్ 3న రాజస్థాన్ లో శర్వానంద్ వివాహం రక్షితతో జరగనున్న విషయం తెలిసిందే. There has been news that my car met with an accident this morning. It was a very minor incident.I am absolutely safe and sound at Home with all your love and blessings. There is nothing to worry about. Thank you all for your concern.Have a great Sunday everyone.— Sharwanand (@ImSharwanand) May 28, 2023 -
హీరో శర్వానంద్‌కు ప్రమాదం..