హైదరాబాద్:మానసిక ఒత్తిడిని భరించలేని ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నగరంలోని ఫిలింనగర్ లో ఆదివారం కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా ఫిలింనగర్ లో నివాసం ఉంటున్న రేఖ (18) అనే యువతి మానసిక ఆందోళనతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.