హైదరాబాద్ సిటీ క్రైం: హైదరాబాద్ లో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. వివరాలు... ఫిలింనగర్ రోడ్ నెంబర్ 92 లోని ఓ ఇంట్లో ఆగంతకులు చొరబడి రూ.40 లక్షల మేర డబ్బు ఎత్తుకు పోయారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం అక్కడికి చేరుకొని ఇంటి పరిసరాలను పరిశీలించింది. అయితే దొంగలు ఎవరనేది ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు.