
చిరు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు
మెగాస్టార్, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 60వ జన్మదినం నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్ : మెగాస్టార్, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 60వ జన్మదినం నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం ఫిల్మ్నగర్లోని ఆంజనేయస్వామి వారి ఆలయానికి చిరంజీవి భార్య సురేఖ, పెద్ద కుమార్తె సుష్మిత చేరుకున్నారు. అనంతరం వారు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవికి శనివారం 60 వసంతాలు నిండి 61వ వసంతంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.