
హిందూ పండుగలలో మరో ముఖ్యమైన పండగ హనుమాన్ జయంతి నేడు(ఏప్రిల్ 27), ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ హనుమాన్ జయంతికి ఒక ప్రత్యేకత ఉందని, హనుమాన్ మన వాడే అని, ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో తిరుమల తిరుపతి దేవస్థానం రుజువు చేసిందని గుర్తుచేశారు.
‘ఈ హనుమజ్జయంతి కి ఓ ప్రత్యేకత ఉంది.హనుమాన్ మన వాడే అని.. మన తిరుమల కొండల్లోనే జన్మించాడని ఆధారాలతో సహా తిరుమలతిరుపతి దేవస్థానం రుజువు చేసింది.ఎక్కడివాడు ఎప్పటివాడు అన్న విషయం పక్కనపెడితే మన గుండెలో కొలువైన సూపర్ మేన్ లార్డ్ హనుమ’ అంటూ భార్త సురేఖతో కలిసి హనుమంతుడి విగ్రహం ముందు దిగిన ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
కాగా, హనుమంతుడు తిరుమల గిరుల్లోని అంజనాద్రిలో జన్మించాడని టీటీడీ ఆధారాలతో సహా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత, తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది.
చదవండి:
ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే
Comments
Please login to add a commentAdd a comment