తిరుమల: తిరుమలలోని అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో శనివారం నుంచి 5వ తేదీ వరకు హనుమాన్ జయంతి నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆకాశ గంగలోని శ్రీఅంజనాదేవి– శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో 1న మల్లెపూలు, 2న తమలపాకులు, 3న ఎర్ర గన్నేరు, కనకాంబరం, 4న చామంతి, 5న సింధూరంతో అభిõÙకాలు చేయనున్నారు.
అలాగే జపాలిలో ప్రతిరోజూ మధ్యా హ్నం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నారు. 1న హరికథ, 2న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సంకీర్తనలు, 3న పురంధరదాస సంకీర్తనలు, 4న హిందూధర్మ ప్రచార పరిషత్ వారి భజన, 5న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల హరికథ గానం ఉంటుంది.
రోజూ సాయంత్రం వేళ ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు ఉంటాయి. అదే విధంగా నాద నీరాజనం వేదికపై ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శ్రీ హనుమాన్ జననం, శ్రీ హనుమంతునికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలపై ప్రముఖ వేద పండితులచే ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment