
సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులతో టీటీడీ అడిషనల్ ఈవో, జేఈవో చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని టీటీడీ సభ్యులు కోరారు. పాలక మండలి సభ్యుడు నరేష్‌ను తొలగించే వరకు ఆందోళన విరమించేది లేదని ఉద్యోగులు తేల్చి చెప్పారు.
ఉద్యోగిని దూషించినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని.. టీటీడీ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి 48 గంటలపాటు మౌన నిరసన చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. టీటీడీ ఉద్యోగ సంఘాలతో బోర్డు సభ్యుల చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని టీటీడీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment