employee unions
-
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ప్రభుత్వానికి సహకరించాలంటూ ఉద్యోగులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. గురువారం.. ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం.. ఆర్థికేతర అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. సబ్ కమిటీ ఛైర్మన్‌గా భట్టి విక్రమార్క.. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉద్యోగుల సమస్యలపై త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేపు సాయంత్రంలోపు డీఏలపై స్పష్టత ఇస్తామని రేవంత్ తెలిపారు.భేటీ అనంతరం జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, 51 డిమాండ్లపై సీఎం మాతో చర్చించారని.. 11 ఏళ్ల తర్వాత మంచి చర్చలు జరిగాయన్నారు. గతంలో ఇలాంటి చర్చలు జరగలేదన్నారు. 317 జీవో, హెల్త్ కార్డులు, డీఏలు, పీఆర్సీ, సీపీఎస విధానంప కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు. దీపావళి తర్వాత కేబ్‌నెట్ సబ్ కమిటీ 51 సమస్యలపై చర్చిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: ఖబడ్దార్ రేవంత్.. కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్ కలకలం -
ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్ సీఈవోను తొలగించండి: పెల్లుబుకిన ఆగ్రహం
న్యూఢిల్లీ: దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత టెకీలను షాక్‌కు గురిచేస్తుండగా, అటు సోషల్ మీడియాలో బిజినెస్ వర్గాల్లో కూడా తీవ్ర నిరసన వ్యక్త మవుతోంది. ఇప్పటికే దీనిపై కొంతమంది కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12 వేలమందిని తొలగించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు యువర్‌డోస్ట్ ఇంజినీరింగ్ డైరెక్టర్ విశాల్ సింగ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 12వేల మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ చర్య బయట ఉన్న బాధిత సిబ్బంది మరియు టెక్కీలను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన విశాల్ సింగ్ కంపెనీ తాజా పరిస్థితికి సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యత వహించాలన్నారు. అలాగే కంపెనీ బోర్డు ముందు సీఈవోను తొలగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు ప్రగాఢంగా చింతిస్తున్నానని, కంపెనీ ఈ స్థితికి దారితీసిన నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తానని, ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో రాసిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఎందుకు కొనసాగాలి అని ప్రశ్నించారు. వాస్తవానికి ముందుగా ఆయనే రిజైన్ చేయాలన్నారు. తప్పుడు నిర్ణయాలకు వారే బాధ్యత వహించాలి. కంపెనీ వైఫ్యల్యానికి ఆయనే మూల్యం చెల్లించాలి. సింపుల్‌గా కఠిన నిర్ణయాలకు చింతిస్తున్నాం అని తప్పించుకుంటే సరిపోదు..చివరికి రాజకీయ నాయకులు కూడా ఒక్కోసారి దిగి రాక తప్పదు..రాజీనామా చేయాల్సిందే కదాఅంటూ లింక్డ్ఇన్లో రాశాడు. ఇదే నియమం మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్లకు కూడా వర్తిస్తుందంటూ మండిపడ్డారు. మరోవైపు గత త్రైమాసికంలోనే 17 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించిన కంపెనీకి ఇది ఆమోదయోగ్యం కాదని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ (AWU) కంపెనీ నిర్ణయాన్ని విమర్శించింది. దీనిపై టెక్ ఉద్యోగులు సమిష్టిగా పోరాడాలని పిలుపు నిచ్చింది. -
కొత్త ఏడాదిలో అలర్ట్ : దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆయా కంపెనీల ఉద్యోగుల్లో కొన్ని వర్గాలు జనవరి 4న సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణతో ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనం అవుతాయని జాయింట్ ఫోరం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (జేఎఫ్‌టీయూ) ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల లాభాల్లో ఉన్న ఆఫీసులతో పాటు పలు కార్యాలయాలను విలీనం చేయడమో లేదా మూసివేయడమో జరుగుతుందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా దాదాపు 1,000 కార్యాలయాలు మూతబడ్డాయని జేఎఫ్‌టీయూ తెలిపింది. ఇవన్నీ ఎక్కువగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఉండేవని వివరించింది. ఫలితంగా పాలసీదారులపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ సౌరభ్ మిశ్రా ఇష్టా రీతిగా వ్యవహరిస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని జేఎఫ్‌టీయూ తెలిపింది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ రీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల్లోని 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు, అధికారులు జనవరి 4న ఒక రోజు సమ్మెకు దిగనున్నట్లు జేఎఫ్‌టీయూ తెలిపింది. -
సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం
సాక్షి, అమరావతి: సీపీఎస్ అంశంపై సచివాలయం రెండో బ్లాకులో పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశమైంది. ఉద్యోగ సంఘాల ముందు జీపీఎస్(గ్యారంటీ పెన్షన్ స్కీం) ప్రతిపాదనను ప్రభుత్వం ఉంచింది. ఈ కొత్త ప్రాతిపాదన అంగీకరించేది లేదని, సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. చదవండి: సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ ఆర్) శశిభూషణ్ కుమార్, కార్యదర్శులు గుల్జార్, హెచ్.అరుణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)పి.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ, ఏపీ (పీ ఆర్ టి యు) అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, ఏపీటిఎఫ్ అధ్యక్షులు జి.హృదయ రాజు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ కు ఉద్యోగుల బ్రహ్మరథం
-
ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ మరోసారి భేటీ
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి భేటీ అయ్యారు. స్టాఫ్ కౌన్సిల్‌లోని అన్ని సంఘాలను చర్చలకు హాజరయ్యాయి. ఉద్యోగుల సమస్యలపై సమగ్రంగా చర్చించిన సీఎం జగన్ 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. అలాగే, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడనుంది. చదవండి: చేయగలిగినంత చేస్తాం: సీఎం జగన్ -
‘7.5 % ఫిట్మెంట్ ఇస్తే ఊరుకునేది లేదు’
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్–19 నష్టాల నుంచి కోలుకుం టున్నాం. అన్ని రంగాలు తిరిగి యథాతథ స్థితికి వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్లు గణాంకాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక కారణాలను చూపి ఉద్యో గులకు పీఆర్సీ నివేదికలో సూచించినట్లు ఫిట్‌మెంట్‌ను 7.5 శాతం ఇస్తే ఊరుకునేది లేదు. ఇదివరకంటే మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పీఆర్సీ నివేదికలోని లోపాలను సరిదిద్ది ఉద్యోగు లకు ఆమోదయోగ్యమైనట్లుగా సవరణలు చేయాలి’అని ఉద్యోగ సంఘాలు త్రిసభ్య కమిటీ ముందు ముక్తకంఠంతో తేల్చి చెప్పాయి. వేతన సవరణ కమిటీ నివేదిక పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన మరో ఇద్దరు ముఖ్య కార్యదర్శులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించి అభిప్రాయ సేకరణ జరిపింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలను ఒక్కొక్కటిగా పిలిచి నాయకుల వాదనలు, సూచనలు, డిమాం డ్లను త్రిసభ్య కమిటీ సభ్యులు రికార్డు చేసుకున్నారు. ఇదే సమయంలో పీఆర్సీ నివేదికలోని అంశాలు, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సైతం త్రిసభ్య కమిటీ సభ్యులు ఆయా సంఘాల నేతలకు వివరించే ప్రయ త్నం చేశారు. ప్రధానంగా కోవిడ్–19 దెబ్బ రాష్ట్ర ఖజానాపై తీవ్రంగా ప్రభావం చూపించినట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ప్రస్తుతం పీఆర్సీ సూచించిన విధంగా ఫిట్మెంట్, ఇతర అలవెన్సులకు ఒప్పుకోవాలని చెప్పే ప్రయ త్నం చేశారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మరింత లబ్ధి చేకుర్చుతుందని వివరించారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం కమిటీ సభ్యుల సూచనలతో ఏకీభవించలేదు. వేతన పెంపు ఐదేళ్లకోసారి జరుగుతుందని, ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్‌ను ప్రభుత్వం కల్పించాలని, ఇందులో వాయిదాలు వేయొద్దని సంఘాలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘ నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న త్రిసభ్య కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఫిట్మెంట్ 65 శాతం ఇవ్వాలని కోరాం ఉద్యోగులకు ఫిట్మెంట్ 65 శాతం ఉండాలని మొదటినుంచి కోరాం. పీఆర్సీకి కూడా ఇదే విధమైన ప్రతిపాదనలు ఇచ్చాం. కానీ కమిటీ ఉద్యోగులను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో రెవెన్యూ శాఖ కూడా పెద్దది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను విజయవంతంగా అమలు చేయడంలో రెవెన్యూ ఉద్యోగుల కృషి ఎంతైనా ఉంది. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచాలి. పీఆర్సీ రిపోర్టు ఫైనల్ కాదు. ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్. – వంగ రవీందర్ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జూలై 2018 నుంచి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి పీఆర్సీ సూచించిన 7.5 శాతం ఫిట్మెంట్ వద్దు. ఇదివరకు ఇచ్చినదానికంటే మెరుగ్గా ఉండాలి. అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలను కూడా జూలై 2018 నుంచే అమలు చేయాలి. ఉద్యోగుల హెచ్ఆర్ఏను పెంచాల్సిన అవసరం ఉంది. గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెంచాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస బేసిక్‌పేను అమలు చేయాలి. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. – చావరవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 45% ఫిట్మెంట్తో వేతన స్కేళ్లు సవరించాలి వేతన సవరణ కమిటీ సిఫారసులను సవరించి 45 శాతం ఫిట్మెంట్తో వేతన స్కేళ్లను మార్పు చేయాలి. సీపీఎస్‌ను రద్దుచేసి, ఉద్యోగుల హెచ్ఆర్ఏను యథాతథంగా అమలు చేయాలి. ఇంక్రిమెంట్ రేటును 3 శాతం కొనసాగించాలి. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కేడర్ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు 50 శాతం వేతనాలు పెంచాలి. –పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు పి.శ్రీపాల్‌రెడ్డి, బి.కమలాకర్‌రావు ఉద్యోగుల ఆకాంక్షలను గుర్తించాలి ఉద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వమే గుర్తించి వేతన పెంపుపై నిర్ణయం తీసుకోవాలి. పీఆర్సీ నివేదికే వేతన పెంపునకు ప్రామాణికం కాదు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలి. గతంలో కంటే మెరుగ్గా వేతన పెంపు ఉండాలనేది మా ప్రధాన డిమాండ్. ఆర్థిక ప్రయోజనాలను జూలై 2018 నుంచి అమలు చేయాలి. హెచ్ఆర్ఏ పెంచాలి. –జి.సదానంద్‌గౌడ్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు -
ఏపీ: సుప్రీంకోర్టుకు ఉద్యోగ సంఘాలు..
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. రేపు(శుక్రవారం) సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉందని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని, ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టుకు వెళ్లమని కోరుతున్నామని జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చదవండి: ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటం’ స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనలేం.. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవ్వకుండా ఎన్నికల్లో పాల్గొనలేమని.. ఓ వైపు వ్యాక్సిన్, మరో వైపు ఎన్నికలు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరిగాయని.. ఎన్నికల కమిషనర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రూ. 50 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు రూ. 50,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సంస్థ ఉద్యోగుల జాయింట్ ఫోరమ్ ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. దేశానికి ఎయిరిండియా చాలా అవసరమని, ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో సేవలు అందిస్తూ కీలకంగా ఉంటోందని వివరించింది. ఆర్థిక ప్యాకేజీ వల్ల ఎయిరిండియాతో పాటు మొత్తం ఏవియేషన్ రంగం, ఎకానమీకి కూడా తోడ్పాటు లభించగలదని తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభంతో వివిధ దేశాల్లో చిక్కుబడిపోయిన వారిని స్వదేశానికి చేర్చడంలో ఎయిరిండియా మరోసారి కీలకపాత్ర పోషించిందని, సిబ్బంది వ్యక్తిగత రిస్కులు తీసుకుని మరీ ఇందులో పాలుపంచుకున్నారని వివరించింది. -
ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు నిరసన
-
సర్కార్ తీరుపై ఏపీ ఉద్యోగుల సంఘం తీవ్ర ఆగ్రహం
-
రాజకీయ నేతల్లా.. ఉద్యోగ సంఘాల నాయకులు
సాక్షి, కాకినాడ సిటీ: ఉద్యోగుల సంక్షేమం గాలికి వదిలేసి రెండు ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ నాయకులుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమాఖ్య పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఆలోచించండి, మద్దతియ్యండి అంటూ ఉద్యోగుల్లో మార్పు తీసుకువచ్చేందుకు వీలుగా చేపట్టిన ప్రచారం సందర్భంగా శుక్రవారం కాకినాడలోని ట్రెజరీ కార్యాలయం, ఇండస్ట్రియల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమాఖ్య కన్వీనర్ కె.వెంకట్రామిరెడ్డి, కో కన్వీనర్ అరవ పాల్ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎప్పుడూ పట్టించుకోలేదని, ఒక మహిళా ఉద్యోగిపై విచక్షణా రహిత దాడి జరిగినపుడుకాని, ప్రభుత్వం నిరంతరంగా 2, 3 డీఏలు పెండింగ్‌లో పెడుతున్నా, పనితీరు పేరుతో 50 ఏళ్లకే ఉద్యోగుల బలవంతపు పదవీ విరమణ జీఓ తయారైనపుడు కాని, సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌ల వల్ల ఉద్యోగులు తీవ్రమైన వత్తిడికి గురౌతున్నా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. నాయకుల మార్పుతోనే ఉద్యోగుల మనుగడ సాధ్యం అనే నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో రాజధాని ఉద్యోగులను తరలించినప్పుడు, అస్తవ్యస్థమైన బయోమెట్రిక్ విధానంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం పట్టించుకోలేదని విమర్శించారు. గతం ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి అంగీకారంతో ఐఆర్ మంజూరు చేస్తే, ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో కనీసం చర్చించకుండా 20 శాతం ఐఆర్ మంజూరు చేసిందన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల అస్థిత్వాన్ని దెబ్బతీసే చర్యలు చేపడుతున్నా నాయకులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాల ఉద్యోగులు చాలా నష్టపోతారని వెంకట్రామిరెడ్డి, అవరపాల్ వాపోయారు. 2009లో ఉద్యోగులకు 22 శాతం, 2014లో 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చినప్పుడు ఎవరూ సన్మానాలు చేయలేదని, హైదరాబాద్‌లో అత్యంత విలువైన గచ్చిబౌలిలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కోసం ఎకరం రూ. 38 వేలకు ఇచ్చినప్పుడు సన్మానాలు ఎందుకు చేయలేదన్నారు. ఇప్పుడు కేవలం 30 శాతం మధ్యంతర భృతి అదీ పోస్ట్‌డేటెడ్ తరహాలో ఇచ్చినందుకు, కొత్త రాజధానిలో ఎకరం రూ.కోటిపైగా రేటుతో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకు సన్మానాలు చేస్తున్నారంటే మన నాయకులు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించాలని ఉద్యోగులను కోరారు. 2014 నుంచి డీఏలు పెండింగ్ ఉంటూనే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులంతా మేల్కొని నాయకులను మార్చుకోకపోతే ఉద్యోగుల మనుగడకే ప్రమాదమన్నారు. సీపీఎస్ విధానం రద్దు కాదని, భవిష్యత్‌లో ఉద్యోగులకు డీఏ రాదని, పీఆర్సీ ఎప్పుడు అమలవుతుందో తెలియదని, హెల్త్‌కార్డులు పని చేయవని, 50 ఏళ్లకే బలవంతపు పదవీ విరమణ జీఓలు ఏ క్షణమైనా విడుదల అవ్వోచ్చని, బయోమెట్రిక్ విధానంతో ఉద్యోగులను బానిసలుగా చేసుకొంటారని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌తో రెగ్యులర్ విధానాన్ని రద్దు చేస్తారన్న భయం ఉద్యోగుల్లో ఉందని వెంకట్రామిరెడ్డి, అరవపాల్ అన్నారు. ఈ విషయాలపై రాష్ట్రం అంతా తిరుగుతూ ఉద్యోగుల్లో నాయకుల మార్పు కోరుతూ చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రతి విషయంలో ఉద్యోగులకు జరిగే అన్యాయం ప్రశ్నించేందుకు వీలుగా ఒక బలమైన వేదిక అవసరమని గుర్తించి ప్రభుత్వ, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమాఖ్యను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాకర శర్మ, ఎం.రమేష్, లెక్కల జమాల్‌రెడ్డి, ఖాదర్‌బాబా, పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
చలో అసెంబ్లీ.. ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత!
సాక్షి, విజయవాడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యూనియన్ పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి.. ప్రకాశం బ్యారేజీపై బైఠాయించారు. వందలసంఖ్యలో ఉద్యోగులు బ్యారేజీపై బైఠాయించి.. బ్యారేజీని దిగ్బంధించారు. దీంతో దాదాపు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. బ్యారేజీపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉద్యోగులను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ‘చలో అసెంబ్లీ’కి అనుమతి లేదంటూ.. ఉద్యోగులను అడ్డుకోవడానికి అడుగడుగునా పోలీసులు బలగాలను మోహరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సెక్షన్ 30తోపాటు 144 సెక్షన్ విధించారు. ఉద్యోగులను అడ్డుకునేందుకు ప్రకాశం బ్యారేజితోపాటు పలుచోట్ల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు తనిఖీ చేసిన తర్వాతే అసెంబ్లీలోకి సిబ్బందిని, ఇతరులను అనుమతించారు. మరోవైపు విజయవాడలో సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత.. చలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలిరావడంతో ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యారేజీని దిగ్బంధించి.. ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీతోపాటు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసిన పోలీసులు.. ‘చలో అసెంబ్లీ’కి తరలివస్తున్న ఉద్యోగులను పెద్దసంఖ్యలో అరెస్టు చేస్తుండటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
మళ్లీ చర్చలు..
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో చర్చలు మరో రెండ్రోజులు వాయిదా పడ్డాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైనా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే రెండ్రోజులు ఆలస్యమైనా మరింత కసరత్తు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారు. ఈ నెల 16న తాను స్వయంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం తమ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. మంత్రులు ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి ఈ నివేదికను అందజేశారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా మరింత పక్కాగా నివేదికను అందించాలని, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరపాలని సీఎం మంత్రులను ఆదేశించారు. ఈటల సారథ్యంలోని సబ్ కమిటీలో ప్రస్తుతం కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో చర్చల దృష్ట్యా మంత్రివర్గ ఉపసంఘంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని కూడా చేర్చుతూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ నాయకులతో ఈ నెల 16న మధ్యాహ్నం సమావేశమై, అదేరోజు ప్రభుత్వం తరఫున నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో కంటే వేగంగా పీఆర్సీ ఉద్యోగుల వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక ఇవ్వడానికి చాలా సమయం తీసుకుంటోందని, గతంలో ఉన్న ఈ మూస పద్ధతికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. త్వరితగతిన ఈ పని పూర్తి చేసేందుకు అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా పీఆర్సీపై సీఎం కీలక ప్రకటన చేయటం ఖాయమని తెలుస్తోంది. స్పష్టమైన సిఫారసులు లేకుండానే.. ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చలు జరిపిన మంత్రివర్గ ఉపసంఘం మొత్తం 52 అంశాలపై తమ నివేదికను సీఎంకు సమర్పించింది. ఉద్యోగులకు సంబంధించిన 18 అంశాలు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన 34 డిమాండ్లను ఇందులో ప్రస్తావించింది. తక్షణమే పరిష్కరించే సమస్యలు, వివిధ అడ్డంకులున్న సమస్యలు, ఇప్పటికిప్పుడు పరిష్కరించలేని సమస్యలుగా.. వీటిని వర్గీకరించినట్లు సమాచారం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు పీఆర్సీ ఏర్పాటు, ఈలోగా మధ్యంతర భృతి(ఐఆర్) చెల్లింపు, గతేడాది జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల చెల్లింపు, కొత్త జిల్లాలప్పుడు ఇచ్చిన ఆర్డర్ టు సర్వ్ రద్దు చేసి శాశ్వత కేటాయింపులు, ఉద్యోగుల బదిలీలు, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రప్పించే అంశాలకు మంత్రివర్గ ఉపసంఘం తమ నివేదికలో అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఉద్యోగుల డిమాండ్లను యథాతథంగా నివేదికలో పొందుపరిచిన సబ్ కమిటీ.. స్పష్టమైన సిఫారసు చేయకుండానే తుది నిర్ణయాన్ని సీఎంకే వదిలేసింది. రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనను నివేదికలో మాటమాత్రమే ప్రస్తావించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోందని సూచించింది. నేడు, రేపు భేటీలు మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం కొన్ని అంశాలపై మంత్రులను ప్రశ్నించారు. అయితే వారు సరైన సమాధానాలివ్వకపోవటంతో మరోమారు సమావేశమై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 12, 13వ తేదీల్లో అధికారులతో సమావేశాలు జరపాలని సబ్ కమిటీ నిర్ణయించింది. -
పీఆర్సీ ఏర్పాటుపై కసరత్తు
-
ఉద్యోగుల బదిలీలు లేవు: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో మొత్తం 18 డిమాండ్లపై చర్చించామని ఉద్యోగుల సమస్యలపై వేసిన మంత్రి వర్గ ఉప సంఘం కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా మంత్రి వర్గ ఉప సంఘంతో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఉద్యోగుల శ్రమను ప్రభుత్వం గుర్తిస్తుంది. ఉద్యోగుల పనితీరు బాగుంది. ఉద్యోగ సంఘాలతో 18 డిమాండ్లపై చర్చించాం. రెండున్నర లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులకు శ్రమ దోపిడీ లేకుండా వేతనాలు పెంచాం. పిఆర్సీ బకాయిలన్నీ చెల్లించాం. ఉద్యోగుల బదిలీలపై శనివారం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. రేపు సాయంత్రం ఉపాధ్యా సంఘాలతో చర్చలు జరుపుతాం. బదిలీలు ఈ నెలలో సాధ్యం కాదు. రైతు బంధు పథకం అమలు చేపథ్యంలో బదిలీలు ఉండవని' స్పష్టం చేశారు. ఉద్యోగులల బదిలీలు, పీఆర్సీల చెల్లింపులపై మరో రెండు సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రులు భరోసా ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల సభ్యులు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘంతో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. అనంతరం ఉద్యోగ సంఘాలకు చెందిన ఓ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ.. బదిలీలు, పీఆర్సీతో పాటు 18 అంశాలపై చర్చించాం. మరో రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. ఉద్యోగులు అశావాద దృక్పథంతో ఉండాలని సభ్యులకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. -
సమరమే
సర్కారు నిర్లక్ష్యం వీడకుంటే ఉద్యమిస్తాం: ఉద్యోగ సంఘాల హెచ్చరిక ⇒ రాష్ట్రం వచ్చినా ఉద్యోగుల రాత మారదా? ⇒ మా సమస్యలంటే సీఎంకు, సర్కారుకు పట్టింపే లేదు ⇒ ముఖ్యమైన పోస్టులన్నింట్లోనూ ఆంధ్రా అధికారులే ⇒ కొత్త రాష్ట్రంలోనూ వారికిందే పనిచేయాల్సి వస్తోంది ⇒ ఉద్యోగుల విభజనలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ⇒ సర్కారు తీరుతో మా ఆత్మాభిమానం దెబ్బతింటోంది ⇒ సొంత రాష్ట్రంలోనే మాకు విలువ లేకుండా పోయింది ⇒ ఉద్యమ సమయంలో ఒకలా, ఇప్పుడింకోలా సీఎం, మంత్రుల మాటతీరు ⇒ కమలనాథన్ కమిటీని తక్షణం రద్దు చేయాలి ⇒ ఉద్యోగులను టీ, ఏపీ ప్రభుత్వాలే విభజించాలి ⇒ ఏపీకి కేటాయించిన టీ ఉద్యోగులను రప్పించాలి ⇒ {పభుత్వానికి ఉద్యోగ సంఘాల డిమాండ్లు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత కూడా ఉద్యోగులకు వేధింపులు తప్పడం లేదంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కనీస పట్టింపు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఉద్యమ సమయంలో ఎవరికి వ్యతిరేకంగా పోరాడామో ఇప్పుడు వారి కిందే పనిచేయాల్సి వస్తోంది. ఉద్యోగుల విభజనలో ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం’’ అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ తీరు ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేదిగా ఉందంటూ ధ్వజమెత్తారు. నిర్లక్ష్య వైఖరి వీడకపోతే పోరాటం తప్పదంటూ హెచ్చరించారు. ‘మన రాష్ట్రం మన ఉద్యోగులు’ పేరిట తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆదివారం సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగులను ఏపీకి కేటాయించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉద్యోగులను విభజిస్తున్న కమలనాథన్ కమిటీని తక్షణం రద్దు చేయాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను తిరిగి వెనక్కు రప్పిం చాలి’’ అని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె వంటి అద్భుత పోరాటాలు చేసిన ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో విలువ లేకుండా పోయాయని గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ఆవేదన వెలిబుచ్చారు. ఉద్యోగుల విభజన పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ‘‘కమలనాథన్ కమిటీని బూచిగా చూపిస్తున్నారు తప్ప ఈ విషయంలో ప్రభుత్వపరంగా ఎలాంటి చొరవా లేదు. ఉద్యోగులను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వంపై లేదా?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష వైఖరి వీడకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వంతో మాట్లాడి, ఆంధ్రాకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు తప్ప మరేమీ పట్టవా: రఘు విద్యుత్, ఆర్టీసీ మినహా మరే ప్రభుత్వ రంగాన్నీ సర్కారు పట్టించుకోవడం లేదని విద్యుత్ జేఏసీ నేత రఘు విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు తెలంగాణ వచ్చేదాకాఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతున్నారని పబ్లిక్ సెక్టార్ ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్‌బాబు ఆక్షేపించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల కాలుకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్‌కు దేవీప్రసాద్ ఓటమి గుణపాఠం కావాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పన్నుతో తీస్తానన్నందుకు కేసీఆర్‌కు వెన్నుపోటు మిగిలిందన్నారు. ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదని తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. ముఖ్యమైన పోస్టుల్లో ఆంధ్రా అధికారులే ఉన్నారని, తెలంగాణకు ఎంతమాత్రమూ ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. దీనిపై ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. నాటి గిర్గ్లానీ, జయభారత్‌రెడ్డి కమిటీల నుంచి నేటి కమలనాథన్ కమిటీ దాకా ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయమే చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కమల్‌నాథన్ కమిటీని వెంటనే రద్దు చేసి ఉద్యోగుల విభజనను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘‘స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి. జోనల్, మల్టీ జోనల్, జిల్లా క్యాడర్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏ రాష్ట్రం వారైతే ఆ రాష్ట్రానికి కేటాయించాలి’’ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార స్వామి, ఆర్థిక కార్యదర్శి పవన్ కుమార్ గౌడ్ కోరారు.