సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ప్రభుత్వానికి సహకరించాలంటూ ఉద్యోగులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. గురువారం.. ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం.. ఆర్థికేతర అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. సబ్ కమిటీ ఛైర్మన్‌గా భట్టి విక్రమార్క.. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉద్యోగుల సమస్యలపై త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేపు సాయంత్రంలోపు డీఏలపై స్పష్టత ఇస్తామని రేవంత్ తెలిపారు.
భేటీ అనంతరం జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, 51 డిమాండ్లపై సీఎం మాతో చర్చించారని.. 11 ఏళ్ల తర్వాత మంచి చర్చలు జరిగాయన్నారు. గతంలో ఇలాంటి చర్చలు జరగలేదన్నారు. 317 జీవో, హెల్త్ కార్డులు, డీఏలు, పీఆర్‌సీ, సీపీఎస విధానంప కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు. దీపావళి తర్వాత కేబ్‌నెట్ సబ్ కమిటీ 51 సమస్యలపై చర్చిస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: ఖబడ్దార్ రేవంత్.. కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్ కలకలం
Comments
Please login to add a commentAdd a comment