సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో మొత్తం 18 డిమాండ్లపై చర్చించామని ఉద్యోగుల సమస్యలపై వేసిన మంత్రి వర్గ ఉప సంఘం కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా మంత్రి వర్గ ఉప సంఘంతో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఉద్యోగుల శ్రమను ప్రభుత్వం గుర్తిస్తుంది. ఉద్యోగుల పనితీరు బాగుంది. ఉద్యోగ సంఘాలతో 18 డిమాండ్లపై చర్చించాం. రెండున్నర లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులకు శ్రమ దోపిడీ లేకుండా వేతనాలు పెంచాం. పిఆర్సీ బకాయిలన్నీ చెల్లించాం. ఉద్యోగుల బదిలీలపై శనివారం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. రేపు సాయంత్రం ఉపాధ్యా సంఘాలతో చర్చలు జరుపుతాం. బదిలీలు ఈ నెలలో సాధ్యం కాదు. రైతు బంధు పథకం అమలు చేపథ్యంలో బదిలీలు ఉండవని' స్పష్టం చేశారు.
ఉద్యోగులల బదిలీలు, పీఆర్సీల చెల్లింపులపై మరో రెండు సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రులు భరోసా ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల సభ్యులు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘంతో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. అనంతరం ఉద్యోగ సంఘాలకు చెందిన ఓ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ.. బదిలీలు, పీఆర్సీతో పాటు 18 అంశాలపై చర్చించాం. మరో రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. ఉద్యోగులు అశావాద దృక్పథంతో ఉండాలని సభ్యులకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment