
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు రూ. 50,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సంస్థ ఉద్యోగుల జాయింట్ ఫోరమ్ ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. దేశానికి ఎయిరిండియా చాలా అవసరమని, ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో సేవలు అందిస్తూ కీలకంగా ఉంటోందని వివరించింది. ఆర్థిక ప్యాకేజీ వల్ల ఎయిరిండియాతో పాటు మొత్తం ఏవియేషన్ రంగం, ఎకానమీకి కూడా తోడ్పాటు లభించగలదని తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభంతో వివిధ దేశాల్లో చిక్కుబడిపోయిన వారిని స్వదేశానికి చేర్చడంలో ఎయిరిండియా మరోసారి కీలకపాత్ర పోషించిందని, సిబ్బంది వ్యక్తిగత రిస్కులు తీసుకుని మరీ ఇందులో పాలుపంచుకున్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment