financial package
-
బీఎస్ఎన్ఎల్ గట్టెక్కుతుందా?
కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)కు లక్షా 64 కోట్ల ఆర్థిక ప్యాకేజీ అందించాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో నగదు వాటా రూ. 43,964 కోట్లు కాగా, ఇతరేతర రూపాల్లో లక్షా 20 వేల కోట్లు సమకూరుస్తారు. ఇదంతా నాలుగేళ్ల కాలవ్యవధిలో అందిస్తారు. 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కూడా ఇందులో భాగం. అందరూ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం పూర్తయిన కొన్ని గంటలకే ఈ నిర్ణయం వెలువడింది. ఎయిరిండియా సంస్థను పూర్తిగా టాటాలకు అమ్మిన తరహాలోనే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను కేంద్రం వదుల్చుకుంటుందని భావిస్తున్న తరుణంలో ప్యాకేజీ ప్రకటన చాలామందిని సంతోషపరిచిందనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్యాకేజీ తులసి తీర్థంగా మిగులుతుందా, సంస్థకు జవసత్వాలిస్తుందా అన్నది మున్ముందు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఛత్రఛాయలో ఉండే టెలిఫోన్ విభాగం నుంచి మహానగరాల్లో కార్యకలాపాల కోసం 1986లో ఎంటీఎన్ఎల్ పేరిట ఒక లిమిటెడ్ కంపెనీని ఏర్పాటుచేసిన చాన్నాళ్లకు... అంటే 2000 సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ ఏర్పడింది. ఎంటీఎన్ఎల్ ఎటూ మొదటినుంచీ నష్టాలతోనే సాగుతోంది. అయితే బీఎస్ఎన్ఎల్ ప్రాభవం అడుగంటడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణా లున్నాయి. టెలికాం రంగంలో గుత్తాధిపత్యం ఉన్న రోజుల్లో ఓ వెలుగు వెలిగిన టెలిఫోన్ విభాగం బీఎస్ఎన్ఎల్గా మారి, ప్రైవేటు ఆపరేటర్లతో పోటీపడవలసి వచ్చాక క్షీణించడం మొదలుపెట్టిం దని తీర్మానించడం తొందరపాటవుతుంది. దాన్నొక సంస్థగా మార్చాక వృత్తి రంగ నిపుణులకు అప్పజెప్పి, సమర్థవంతంగా పోటీని ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేయాల్సిందిపోయి కేంద్రం యధావిధిగా పెత్తనం చలాయించడం బీఎస్ఎన్ఎల్కు శాపంగా మారింది. ఇప్పుడు టెలికాం రంగంలో మెరుస్తున్న సంస్థలతో పోలిస్తే అనుభవంలోనూ, వనరుల్లోనూ బీఎస్ఎన్ఎల్ ఏమాత్రం తీసిపోదు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయివుండి కూడా సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక, వాటిని సక్రమంగా అమలు చేయలేక అది బోర్లాపడింది. అంతక్రితంతో పోలిస్తే లాభాలొస్తున్న మాట నిజమే అయినా గత మూడేళ్లుగా బీఎస్ఎన్ఎల్ నష్టాలు దాదాపు రూ. 30,000 కోట్లు. ఇప్పుడు టెలికాం రంగంలో 5జీ మోత మోగిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే 60 దేశాలు ఆ సర్వీసులు ప్రారంభించాయి. మన దేశంలో 5జీ స్పెక్ట్రమ్ వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఒకటి రెండేళ్లు పడుతుంది. ఇలాంటి తరుణంలో బీఎస్ఎన్ఎల్కు అందిస్తున్న 4జీ వల్ల ఏమంత ప్రయోజనం ఉంటుందన్నది చూడాల్సి ఉంది. 2016లోనే ప్రైవేటు సంస్థలు 4జీ స్పెక్ట్రమ్ దక్కించుకుని వినియోగదారుల్లో 98 శాతంమందిని చేజిక్కించుకున్నాయి. దేశంలో వైర్లెస్, వైర్‌లైన్ సేవలు రెండింటినీ కలుపుకొంటే మొత్తంగా 110 కోట్లమంది వినియోగదారులుంటే అందులో బీఎస్ఎన్ఎల్ వాటా ప్రస్తుతం 12 కోట్లు. అంతక్రితం గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ హవా ఉండేది. కానీ రాను రాను అది కూడా క్షీణించింది. ఇప్పుడు గ్రామీణ వినియోగదారుల్లో బీఎస్ఎన్ఎల్ వాటా ఏడు శాతం. ఇది ఉద్దేశపూర్వకంగా సంస్థను నీరుగార్చడంవల్ల వచ్చిన ఫలితం. వీఆర్ఎస్ అమలు చేయడం మొదలెట్టాక సిబ్బంది కొరత ఏర్పడి చురుగ్గా సేవలందించే స్థితి మందగించింది. ఒకప్పుడు 1.65 లక్షలమంది ఉద్యోగులతో కళకళ లాడిన సంస్థలో వారి సంఖ్య 64,536కి పడిపోయింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం గురించిన చర్చోపచర్చలే దశాబ్దంపాటు సాగాయి. ఇప్పటికీ అవి వేర్వేరుగానే ఉంటున్నాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే 4జీ స్పెక్ట్రమ్ గురించి బీఎస్ఎన్ఎల్ ఆత్రుత పడింది. దాన్ని వేలం వేసే సమయానికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా బీఎస్ఎన్ఎల్కు 4జీ దక్కలేదు. 4జీకి అవసరమైన పరికరాల కొనుగోలుకు కావాల్సిన రూ. 25,000 కోట్లు సమకూర్చడం ఎలా అన్న ఆలోచనలోనే ఏళ్లు గడిచిపోయాయి. ఈ జాప్యం ప్రైవేటు సంస్థల లబ్ధి కోసమేనని సిబ్బంది సంఘాలు ఆరోపించినా జవాబిచ్చినవారు లేరు. 2019 అక్టోబర్‌లో సంస్థను గట్టెక్కించడానికి కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఆ తర్వాత అక్కడక్కడ 4జీ సేవలు ప్రారంభించగలిగింది. కానీ పూర్తి స్థాయి 4జీ సేవలకు గ్రీన్‌సిగ్నల్ రావడానికి మరో మూడేళ్లు పట్టింది. పూర్తి స్థాయి సేవలు వినియోగదారులకు అందడానికి మరెంత సమయం పడుతుందో? 2019లో ప్యాకేజీ ప్రకటించాక సంస్థ నష్టాలు క్రమేపీ తగ్గడం మొదలయ్యాయి. 2019–20లో రూ. 15,500 కోట్లుగా ఉన్న నష్టం నిరుడు రూ. 7,441 కోట్లకు పరిమితమైంది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఇప్పటికైనా బీఎస్ఎన్ఎల్కు పూర్వ వైభవం వస్తుంది. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే ప్రైవేటు సంస్థలు ఈనాటికీ గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. వాటి టారిఫ్‌లు గ్రామీణులు అందుకోలేని స్థితిలో ఉంటున్నాయి. దేశంలో విస్తృతంగా టవర్లు, ఇతర వనరులు ఉన్న సంస్థల్లో ఇప్పటికీ అగ్రగామి బీఎస్ఎన్ఎల్ అనడంలో సందేహంలేదు. వేగవం తంగా నిర్ణయాలు తీసుకోవడం, తీసుకున్న నిర్ణయాలను చురుగ్గా అమలు చేయడం, లక్ష్య సాధనపై సర్వశక్తులూ కేంద్రీకరించడం వంటివి చేస్తే ఆ సంస్థ మళ్లీ పట్టాలెక్కుతుంది. ఉద్దేశపూర్వకంగా దానికి బ్రేకులు వేయాలని చూస్తే ఎప్పటిలానే నిస్తేజంగా మిగిలిపోతుంది. సంస్థను ప్రాణప్రదంగా చూసుకుంటూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటే దాన్ని లాభాల బాటకు మళ్లించడం కష్టమేమీ కాదు. -
పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించాలా? ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు సవాళ్ల నుంచి గట్టెకేందుకు నగదు ముద్రణ సరికాదని ప్రముఖ ఆర్థికవేత్త పినాకి చక్రవర్తి స్పష్టం చేశారు. అలాంటి చర్య ద్రవ్య అస్థిరతకు దారితీస్తుందని విశ్లేషించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ తరహా నిర్ణయం తీసుకుంటుందని కూడా తాను భావించడం లేదన్నారు. ఈ మేరకు 1996లో కేంద్రం–ఆర్బీఐ మధ్య జరిగిన ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఇకముందు కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మూడవ వేవ్ లేకపోతే భారత్ ఆర్థిక రికవరీ వేగంగా ఉంటుందని చక్రవర్తి పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) డైరెక్టర్ కూడా అయిన చక్రవర్తి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ముఖ్యాంశాలు.. - పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గిస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు కూడా తీవ్రంగా పెరుగుతుందన్న విషయం పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్య నిర్వహణ విషయంలో ఇది చాలా క్లిష్టమైన అంశం. - ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ద్రవ్యోల్బణం ఆందోళనకరం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2 నుంచి 6 శాతం శ్రేణిలో ధరల స్పీడ్‌ను కట్టడి చేయాలి. - కోవిడ్–19 మొదటి వేవ్‌తో పోల్చితే ప్రస్తుతం భారత్ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. - ఉపాధి అవకాశాల మెరుగుదలకు ఆర్థిక వ్యవస్థ పురోగతే కీలకం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. - ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకూ సామాన్యుని జీవన భద్రతకు కొన్ని ద్రవ్య పరమైన చర్యలు అవసరం. - కరోనా సవాళ్ల నేపథ్యంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. - 2020–21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 9.5 శాతంకాగా, 2021–22లో ఈ లోటు 6.8 శాతం ఉంటుందని బడ్జెట్ అంచనావేసింది. అయితే ఇది మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. -
రాష్ట్రానికి కోవిడ్ సాయం రూ.353 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ నియంత్రణకు అత్యవసర ఆర్థిక ప్యాకేజీ కింద అధికంగా సొమ్ము పొందిన రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.6,309.9 కోట్ల ఆర్థిక సాయం అందజేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద విడుదల చేసిన ఈ సొమ్ములో అత్యధికంగా తమిళనాడుకు రూ.773.24 కోట్లు, తర్వాత ఢిల్లీకి రూ.651.46 కోట్లు, మహారాష్ట్రకు రూ.592.82 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.474.78 కోట్లు, కేరళకు రూ.453.56 కోట్లు, తెలంగాణకు రూ.353.13 కోట్లు సాయం అందింది. అత్యంత తక్కువగా లక్షద్వీప్‌కు రూ.40 లక్షల సాయం లభించింది. 1,400 వెంటిలేటర్లు.. దేశవ్యాప్తంగా 36,651 వెంటిలేటర్లను సరఫరా చేయగా, అందులో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 1,400 వెంటిలేటర్లను అందజేసింది. అత్యధికంగా ఏపీకి 4,960, మహారాష్ట్రకు 4,434, ఉత్తరప్రదేశ్‌కు 4,016 వెంటిలేటర్లను సరఫరా చేసింది. దేశవ్యాప్తంగా 1.02 లక్షల ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయగా, అందులో 1,000 తెలంగాణకు వచ్చాయి. అత్యధికంగా మహారాష్ట్రకు 22,064 ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశారు. తెలంగాణకు ఎన్–95 మాస్క్‌లు 14.85 లక్షలు, పీపీఈ కిట్లు 2.81 లక్షలు, హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు 42.5 లక్షలు కేంద్రం సరఫరా చేసింది. అలాగే రాష్ట్రానికి 91,100 ట్రూనాట్ కోవిడ్ టెస్ట్ కిట్లను, 5.84 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లను అందజేసింది. -
ఫలితాలు కనిపిస్తున్నాయి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, క్రమంగా లాక్డౌన్ ఎత్తివేయడం వంటి చర్యల ఫలితాలు కనిపించడం మొదలైందని ఒక సర్వేలో వెల్లడైంది. వ్యాపారాల పనితీరు మెరుగుపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ – ధృవ అడ్వైజర్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో వివిధ రంగాల సంస్థలకు చెందిన 100 పైగా టాప్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు (సీఎక్స్‌వో) పాల్గొన్నారు. రికవరీ దాఖలాలు కనిపిస్తున్నప్పటికీ, ఇది స్థిరంగా నిలబడి ఉండేలా ప్రభుత్వం నుంచి నిరంతరంగా తోడ్పాటు అవసరమవుతుందని సర్వే తెలిపింది. మార్కెట్ డిమాండ్‌ను మెరుగుపర్చడానికి గట్టి చర్యలు అవసరమని లేకపోతే ప్రాథమిక స్థాయిలో ఉన్న ఈ రికవరీ మళ్లీ కుంటుపడిపోతుందని పేర్కొంది. సర్వే ప్రకారం ప్రస్తుతం 30 శాతం సంస్థలు 70 శాతం పైగా వ్యాపార సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నాయి. 45 శాతం సంస్థలు సమీప భవిష్యత్తులో ఈ స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోనున్నాయి. ఇక సవాళ్ల విషయానికొస్తే, దశలవారీగా అన్లాకింగ్, ఖర్చుల నియంత్రణ, బలహీన డిమాండ్, నిధుల లభ్యత మొదలైన వాటిని సీఎక్స్‌వోలు ప్రస్తావించారు. కరోనా వైరస్ మహమ్మారి రెండో విడతలో మరింతగా విజృంభించిన పక్షంలో వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని కొందరు సీఎక్స్‌వోలు అభిప్రాయపడ్డారు. ఇక చైనా నుంచి అకస్మాత్తుగా దిగుమతులు ఆగిపోవడం వంటి అంశాలు సైతం ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఉద్యోగాల కోత..: తమ తమ కంపెనీల్లో దాదాపు 10 శాతం మేర ఉద్యోగాల్లో కోత పడొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో 32 శాతం మంది సీఎక్స్‌వోలు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం వీరి సంఖ్య 40 శాతం. ఎకానమీ అన్‌లాకింగ్‌తో క్రమంగా ఎగుమతులు, నిధుల ప్రవాహం, ఆర్డర్లు, సరఫరా వ్యవస్థలు మెరుగుపడటం మొదలైందని సర్వే పేర్కొంది. ఇటీవలి కాలంలో ఎగుమతులు మెరుగుపడ్డాయని 22 శాతం మంది సీఎక్స్‌వోలు తెలిపారు. ఇక 25 శాతం మంది ఆర్డర్ బుక్ మెరుగుపడిందని, 21 శాతం మంది నిధుల లభ్యత బాగుపడిందని పేర్కొన్నారు. కొనుగోళ్లకు మరింత సమయం.. మరోవైపు, ఆర్థిక ప్యాకేజీకి విషయానికొస్తే.. అయిదింట ఒక కంపెనీ మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర రుణ హామీ పథకం ఫలితాలిస్తోందన్నాయి. రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు కేవలం పావు శాతం సంస్థలకు లభించింది. అది కూడా స్వల్పంగా 25–50 బేసిస్ పాయింట్ల స్థాయిలో మాత్రమే దక్కింది. -
రూ. 50 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు రూ. 50,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సంస్థ ఉద్యోగుల జాయింట్ ఫోరమ్ ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. దేశానికి ఎయిరిండియా చాలా అవసరమని, ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో సేవలు అందిస్తూ కీలకంగా ఉంటోందని వివరించింది. ఆర్థిక ప్యాకేజీ వల్ల ఎయిరిండియాతో పాటు మొత్తం ఏవియేషన్ రంగం, ఎకానమీకి కూడా తోడ్పాటు లభించగలదని తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభంతో వివిధ దేశాల్లో చిక్కుబడిపోయిన వారిని స్వదేశానికి చేర్చడంలో ఎయిరిండియా మరోసారి కీలకపాత్ర పోషించిందని, సిబ్బంది వ్యక్తిగత రిస్కులు తీసుకుని మరీ ఇందులో పాలుపంచుకున్నారని వివరించింది. -
ముంచుకొస్తున్న మాంద్యం..
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత్ ఆర్ధిక మాంద్యం బారిన పడుతుందని తాజా నివేదిక స్ప్టష్టం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌లో ప్రకటించిన చర్యలు సరఫరా మెరుగునకు ఉపయోగపడినా ప్రజల చేతిలో నగదు లేకుంటే సరుకులు, సేవలకు డిమాండ్ పెద్దగా ఉండబోదని ఆ నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల ఆదాయం, ఉద్యోగాలు కోల్పోడం, వినిమయ కార్యకలాపాలు మందగించడంతో మాంద్యం ముప్పు పొంచిఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ర్టీట్ వెల్లడించిన ఎకనమిక్ అబ్జర్వర్ నివేదిక తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ సమర్థ అమలు, ఇది ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై భారత్‌లో ఆర్ధిక వ్యవస్థ రికవరీ ఆధారపడిఉందని పేర్కొంది. చదవండి : 2.5 కోట్ల ఉద్యోగాలకు కోత లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు తీసుకునే సమయం, ఉద్దీపన ప్యాకేజ్ కింద ప్రకటించిన చర్యలను సమర్ధంగా ఎంతకాలం అమలు చేస్తారనేది కీలకమని డన్ అండ్ బ్రాడ్‌స్ర్టీట్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్‌తో పాటు ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించడం, మారటోరియం వ్యవధిని మరో మూడు నెలలు పొడిగించడం వంటివి కొంత ఉపశమనం కలిగిస్తాయని సింగ్ పేర్కొన్నారు. -
ఆత్మనిర్భర్ ఆర్థిక ప్యాకేజీపై నీలం సాహ్ని సమీక్ష
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీతో ఏఏ శాఖలకు ఎంత మేరకు నిధులు సమకూరుతాయే అంచనా వేసి తద్వారా వివిధ పథకాలన్నీ ప్రజలందరికీ లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం ప్యాకేజీ అమలుపై సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తూనే.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీని పటిష్టంగా అమలు చేయడం ద్వారా ప్రతి ఒక్కపేదవారికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ దిశగా సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. (‘ఉద్దీపన ప్యాకేజ్‌తో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’) ఈ విషయమై వచ్చే సమావేశంలో సవివరంగా చర్చిద్దామని ఆలోగా శాఖల వారీ పూర్తి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. అంతకుముందే ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీతో రాష్ట్రంలోని వివిధ శాఖలకు కలిగే ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆలాగే వ్యవసాయం, పాడి పరిశ్రమాభివృధ్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కార్మిక ఉపాధి కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి బీ ఉదయలక్ష్మి, ఇంధన, మున్సిపల్ పరిపాలన శాఖల కార్యదర్శులు ఎన్. శ్రీకాంత్, జే శ్యామలరావు, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం వారి వారి శాఖలకు సంబంధించి ఎంతమేరకు ఆర్ధిక ప్యాకేజి లబ్ధి కలుగుతుందనే వివరాలను తెలియజేశారు. కాగా ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ, ఎస్ఎల్బిసి కన్వీనర్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!) -
ప్యాకేజ్ ప్రకంపనలు : కేంద్రానికి కాంగ్రెస్ సవాల్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పిస్తూ రైతులు, వలసకూలీలు, చిరువ్యాపారులు సహా పలువురిని ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌పై కాంగ్రెస్ పెదవివిరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 లక్షల కోట్లు కాకుండా కేవలం రూ 3.22 లక్షల కోట్ల ప్యాకేజ్‌నే ప్రభుత్వం ప్రకటించిందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రూ. 3.22 లక్షల కోట్ల ప్యాకేజ్ జీడీపీలో కేవలం 1.6 శాతమేనని, ప్రధాని ప్రకటించిన తరహాలో 10 శాతం కాదని అన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపించాలని తాను ఆర్థిక మంత్రి, ప్రధానికి సవాల్ విసురుతున్నానని చెప్పారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ప్యాకేజ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను తప్పుదారిమళ్లించిందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మాట్లాడాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. వలస కూలీల ప్రాథమిక హక్కులను కాలరాసినందుకు ప్రభుత్వం వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రణాళిక లేకుండా లాక్డౌన్ అమలు చేయడంతో వలస కూలీలు రోడ్లపై దయనీయస్ధితిలో నడిచివెళ్లేలా చేశారని, వారి దుస్థితిపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. ఢిల్లీలో వలస కూలీలతో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ మాట్లాడటాన్ని నిర్మలా సీతారామన్ డ్రామాగా కొట్టిపారవేయడంపై ఆయన మండిపడ్డారు. చదవండి : లాక్డౌన్ 4.0 : కేంద్రం కీలక నిర్ణయం -
ఎఫ్‌డీఐ పరిమితి 49 నుంచి 75 శాతానికి పెంపు!
న్యూఢిల్లీ: రక్షణ రంగం, భద్రతా సిబ్బందికి అవసరమైన అధునాతన ఆయుధాలు, పరికరాలను భారత్‌లోనే తయారుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలపై క్రమక్రమంగా నిషేధం విధించి... ఆ జాబితాను నోటిఫై చేస్తామని తెలిపారు. అదే విధంగా రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఆటోమేటిక్ రూట్లో 49 శాతం నుంచి 75 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. దేశీయ మూలధన సేకరణ కోసం బడ్జెట్లో ప్రత్యేక ప్రొవిజన్ పెడతామన్నారు. రక్షణ పరికరాల దిగుమతి వ్యయాన్ని తగ్గించుకుంటామని పేర్కొన్నారు. మేకిన్ ఇండియాను బలోపేతం చేస్తూ... దిగుమతి చేసుకునే విడిభాగాలను భారత్‌లోనే తయారు చేస్తామని వెల్లడించారు. (నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యం) ఇక రాబోయే కాలంలో భారత్ విమానాల నిర్వహణ, మరమతులు, పరిశోధనలకు గ్లోబల్ హబ్ మారుతుందని నిర్మల అన్నారు. భారత గగనతల వినియోగ నిబంధనలు సులభతరం చేస్తామని.. తద్వారా పౌర విమానయానం మరింత మెరుగుపడుతుందన్నారు. తద్వారా ఏడాదికి రూ. 1000 కోట్ల మేర విమానయాన రంగానికి లబ్ది చేకూరనుందని వ్యాఖ్యానించారు. పీపీపీ విధానంలో భాగంగా ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న 12 ఎయిర్‌పోర్టులతో పాటుగా.. మరో ఆరు విమానాశ్రయాలను సైతం ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబన భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ నిర్మలా సీతారామన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.(పన్నులు తగ్గించినా ఫలితం లేదు!) -
‘ఆర్థిక ప్యాకేజీని పునఃపరిశీలించండి’
న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఈ ప్యాకేజీపై స్పందించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. దేశం తరఫున మాట్లాడుతున్నాను. ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించి చాలా మంచి పని చేసింది. అయితే ఈ ప్యాకేజీ స్వభావం గురించి నాకు తీవ్రమైన ఆక్షేపన ఉంది. ప్రభుత్వం ప్యాకేజీని పునఃపరిశీలించాలి. దీనిలో కేటాయించిన డబ్బును ఎక్కువ శాతం అవసరమున్నవారికి, వలస కూలీలకు, రైతులకు అందేలా చూడాలి. డబ్బును నేరుగా ప్రజల చేతిలో పెట్టడం ముఖ్యం. అప్పుడే ఈ ప్యాకేజీకి సార్థకత’ అన్నారు రాహుల్.(రైతులకు 2 లక్షల కోట్లు) -
భారీ నష్టాల నుంచి రికవరీ
ఆర్థిక ప్యాకేజీ ద్రవ్యలోటుపై భారం మోపుతుందనే ఆందోళనతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, ముడి చమురు ధరలు 2% మేర పెరగడం, అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 350 పాయింట్ల మేర నష్టపోయినప్పటికీ, సెన్సెక్స్ చివరకు 25 పాయింట్ల నష్టంతో 31,098 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 9,137 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 545 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 526 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత లాభ,నష్టాల మధ్య దోబూచులాడి చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఒక దశలో 173 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ మరో దశలో 353 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 526 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. రియల్టీ, బ్యాంక్, వాహన,ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ జరగ్గా, ఇంధన,లోహ,టెలికం షేర్లలో వేల్యూ బయింగ్ జరిగింది. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5 శాతం మేర నష్టంతో రూ.381 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 40కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఇండియా సిమెంట్స్, అజంతా ఫార్మా, అలెంబిక్ ఫార్మా, ఆర్తి డ్రగ్స్, రుచి సోయా తదితర షేర్లు వీటిలో ఉన్నాయి. ► చైనాలో గత నెలలో పారిశ్రామిక వృద్ధి పుంజుకుందన్న వార్తలతో లోహ షేర్లు లాభపడ్డాయి. -
ప్యాకేజ్ 3.0 : సాగు బాగు కోసం రూ లక్ష కోట్లతో నిధి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో మూడవ విడత ఉద్దీపన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం వెల్లడించారు. వ్యవసాయం, సాగు అనుబంధ రంగాలకు ఊతమిచ్చే చర్యలను ఆమె ప్రకటించారు. వ్యవసాయంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. లాక్డౌన్ కాలంలో రైతుల ఖాతాల్లో రూ. 18,730 కోట్లను జమచేయడంతో పాటు రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఊతమిచ్చేలా ఉద్దీపన ప్రకటించామని పేర్కొన్నారు. చదవండి : ‘ఉద్దీపన ప్యాకేజ్‌తో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’ ప్యాకేజీ 3.0: పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి మూడవ విడత ప్యాకేజ్ వివరాలు వ్యవసాయం అనుబంధ రంగాలపై ప్యాకేజ్ ప్రకటన మత్స్య, పశుసంవర్థక ,డెయిరీ , ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఊతం మూడో విడత ప్యాకేజ్‌లో 11 అంశాలపై దృష్టి వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కోసం రూ లక్ష కోట్లతో నిధి కోల్డ్‌స్టోరేజ్‌లు, ధాన్యాల గిడ్డంగుల నిర్మాణం లాక్డౌన్లో రైతుల ఖాతాల్లో రూ 18,700 కోట్ల నగదు బదిలీ రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు డెయిరీ రైతులకు రూ 5వేల కోట్లతో అదనపు సాయం 2 కోట్ల మంది డెయిరీ రైతులకు లబ్ధి రూ 30 వేల కోట్లతో రైతులకు అత్యవసర సహాయ నిధి సహాయ నిధితో 3 కోట్ల మంది రైతులకు లబ్ధి ఆక్వా రైతుల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్యాచరణ స్ధానిక ఉత్పత్తుల ఎగుమతుల కోసం రూ 10,000 కోట్లతో నిధి చిన్నతరహా ఫుడ్ ప్రాసెసింగ్ సంస్ధల కోసం రూ 10,000 కోట్లతో నిధి రెండు లక్షల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు లబ్ధి మత్స్య అనుబంధ రంగాలకు రూ 20,000 కోట్లు మెరైన్ ఎగుమతుల పెంపునకు 55 లక్షల ఉద్యోగాలు ఆక్వా కల్చర్‌కు రూ 11,000 కోట్లతో నిధి ప్రధాని మత్స్యసంపద యోజన కింద రూ 20,000 కోట్లతో నిధి మత్స్యకారులకు బీమా సౌకర్యం పశుసంవర్ధక మౌలిక వసతులకు రూ 15,000 కోట్లు పశువులు, జీవాలకు వ్యాక్సిన్ల కోసం రూ 13,300 కోట్లు 53 కోట్ల జీవాలకు నూరు శాతం వ్యాక్సినేషన్ ఔషధ మొక్కల సాగుకు రూ 4000 కోట్లతో నిధి తేనెటీగల పెంపకందారులకు రూ 5000 కోట్లు ధరల నియంత్రణకు నిత్యవసర చట్టంలో మార్పులు -
మార్కెట్లకు ప్యాకేజీ నచ్చలే..!
ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆర్థిక ప్యాకేజీ ఉసూరుమనిపించడంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ప్రపంచ మార్కెట్లు పతనమవడం, ముడి చమురు ధరలు 4% మేర ఎగబాకడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం.....ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 955 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరకు 886 పాయింట్ల నష్టంతో 31,123 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 241 పాయింట్లు క్షీణించి 9.143 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.77 శాతం, నిఫ్టీ 2.57 శాతం చొప్పున నష్టపోయాయి. రోజంతా నష్టాలు...: ప్రపంచ మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ కూడా భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజంతా స్టాక్ సూచీల క్షీణత కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మరింతగా పెరగడంతో నష్టాలు కూడా మరింతగా పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, మీడియా,హెల్త్‌కేర్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, లోహ, ఆర్థిక, ఇంధన, బ్యాంక్, టెలికం షేర్లు నష్టపోయాయి. మరిన్ని విశేషాలు.... ► టెక్ మహీంద్రా షేర్ 5% నష్టంతో రూ.516 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పడిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, దాదాపు 40 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. అలెంబిక్ ఫార్మా, ఆర్తి డ్రగ్స్, రుచి సోయా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► కంపెనీల ఐటీ వ్యయాలు 8 శాతం మేర తగ్గుతాయని గార్ట్నర్ సంస్థ వెల్లడించడంతో ఐటీ షేర్లు 5 శాతం వరకూ నష్టపోయాయి. ► 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఎన్బీసీసీ,ఐనాక్స్ విండ్, జుబిలంట్ లైఫ్‌సైన్సెస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. మరోవైపు మహీంద్రా సీఐఈ ఆటోమేషన్ ,జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ తదితర 200 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. రూ.2 లక్షల కోట్లు ఆవిరి... మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.1.99,620 కోట్లు హరించుకుపోయి రూ.122.68 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే.... నిరాశపరిచిన ప్యాకేజీ 2.0: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ 2.0 మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. రూ.6 లక్షల కోట్ల మేర ఆమె ప్రకటించిన ఉద్దీపన చర్యలు సరిపోవని, ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాల్లేవనే ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉద్దీపన చర్యలు సానుకూలంగానే ఉన్నాయని, కానీ వాటి ఆచరణే కీలకమని పలు బ్రోకరేజ్ సంస్థలు వ్యాఖ్యానించాయి. ప్రపంచ మార్కెట్ల పతనం: స్పానిష్ ఫ్లూ తదితర వైరస్‌ల్లాగా కరోనా వైరస్ కనుమరుగయ్యే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు తీవ్ర అనిశ్చితిలో ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. ఈ రెండు అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1–2 శాతం, యూరప్ మార్కెట్లు 2–3 శాతం రేంజ్లో నష్టపోయాయి. లాక్డౌన్ 4.0: ఈ నెల 18 నుంచి కొత్త నిబంధనలతో నాలుగో దశ లాక్డౌన్ మొదలు కానున్నది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటివరకైతే వెల్లడి కాలేదు. ఇప్పటికే 50 రోజులకు మించిన లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ 4.0 మరింత ప్రతికూల ప్రభావం చూపగలదన్న ఆందోళన నెలకొన్నది. పెరుగుతున్న కరోనా కేసులు: దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా 2.0 కేసులు కూడా పెరుగుతుండటం తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. -
భారత్‌పై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు
న్యూయార్క్: కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ సర్కార్ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక నిపుణులు ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి (డబ్ల్యూఈఎస్పీ) నివేదిక ఆవిష్కరణ సందర్భంగా గ్లోబల్ ఎకనమిక్ మానిటరింగ్ బ్రాంచ్ చీఫ్ హమీద్ రషీద్.. భారత ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగిందని పేర్కొన్నారు. ‘‘ఇండియా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఉత్తమంగా ఉంది. ఆ దేశ జీడీపీలో ఇది 10 శాతం. ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంత భారీ ప్యాకేజీని ప్రకటించలేదు. అయితే ప్యాకేజీకి ఎలా రూపకల్పన చేశారన్న అంశాన్ని బట్టే దాని ప్రభావం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. (భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్) ఇక అసోసియేట్ ఎకనమిక్ అఫైర్స్ ఆఫీసర్ జూలియన్ స్లాట్‌మన్ మాట్లాడుతూ.. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ మార్కెట్లను పుంజుకునేలా చేస్తుందన్నారు. అయితే ప్రజలు కొనుగోళ్లు జరపకపోతే.. ఆశించిన ఫలితాలు వెంటనే రావని అభిప్రాయపడ్డారు. ఇక కరోనా వ్యాప్తి తొలినాళ్లలోనే లాక్డౌన్ విధించి భారత్ మంచి నిర్ణయం తీసుకుందని ఆయన ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడం ద్వారా భారత ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగిందన్నారు. అయితే అదే సమయంలో పేదలు, వలస కూలీలు, బలహీన వర్గాలతో పాటు ఆర్థిక వ్యవస్థపై కూడా లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. కానీ కరోనా తీవ్రమవుతున్న తరుణంలో ఒకేసారి కాకుండా క్రమక్రమంగా నిబంధనలు సడలించడం ద్వారానే మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుందన్నారు. (‘ఉద్దీపన ప్యాకేజ్‌తో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’) -
‘ఉద్దీపన ప్యాకేజ్‌తో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’
సాక్షి, న్యూఢిల్లీ : రైతులు, వలస కూలీల కోసం గురువారం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కల్పిస్తుందని, ఆహార భద్రత చేకూరడంతో పాటు రైతులు, వీధి వ్యాపారులకు రుణ లభ్యత మెరుగవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలు రైతులు, వలస కూలీలకు లబ్ధి చేకూర్చుతాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి వెల్లడించిన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రగతిపథంలో నడిపిస్తాయని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ రెండో దశలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు భారీ రుణ వితరణ, వలస కూలీల సంక్షేమానికి పలు చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న రెండు నెలల్లో వలస కూలీలందరికీ రేషన్ కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేస్తామని మంత్రి ప్రకటించారు. వలస కూలీల సంక్షేమానికి రూ 10,000 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. కనీస వేతన పెంపుతో పాటు పట్టణాల్లో వారి కోసం వసతి శిబిరాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. చదవండి : చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట! -
ప్యాకేజ్ 2.0 : రైతులు, వలస కూలీలకు భరోసా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో వ్యవసాయం, వలస కూలీల సంక్షేమానికి చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తామని, వారి కోసం పలు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రకటించారు. రూ 86,600 కోట్ల వ్యవసాయ రుణాలు ఆమోదించామని తెలిపారు. పాతిక లక్షల మంది నూతన కిసాన్‌కార్డు దారులకు రూ 25,000 కోట్ల రుణం అందచేస్తామని తెలిపారు. వలస కూలీలకు ఊరట కల్పించే చర్యలు ప్రకటించామని చెబుతూ మధ్యతరగతి కోసం ప్రత్యేకంగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. చదవండి : ఏ దేశం ఎలా ఖర్చు చేసింది ప్యాకేజ్ వివరాలు మార్చి, ఏప్రిల్‌లో రైతులకు రూ 86,600 కోట్ల రుణాల ఆమోదం చిన్నసన్నకారు రైతులకు రూ 4 లక్షల కోట్ల రుణాల మంజూరు 25 లక్షల మంది నూతన కిసాన్కార్డుదారులకు రూ 25,000 కోట్ల రుణం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు రూ .6700 కోట్లు నాబార్డు ద్వారా 29,500 గ్రామీణ బ్యాంకులకు నిధులు రబీలో సన్నకారు, మధ్యతరహా రైతులకు రూ 30 వేల కోట్ల రుణాలు సహకార బ్యాంకుల ద్వారా 3 వేల కోట్ల మంది రైతులకు అదనంగా రుణాలు చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు వివిధ పథకాలు రైతులు,పేదల కోసం 9 పాయింట్ ఫార్ములా వలస కూలీలను ప్రభుత్వం విస్మరించలేదు రైతులను ఆదుకునేందుకు ప్యాకేజ్‌లో రెండు పథకాలు సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు రైతులకు మరిన్ని పథకాలు కొనసాగుతాయి రైతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అందుబాటులో నగదు వలస కార్మికుల ఉపాథికి రూ 10,000 కోట్లు వలస కార్మికులు, వీధి వ్యాపారులపై ప్రత్యేక దృష్టి రోజుకు కనీస వేతనం రూ 182 నుంచి రూ 202కు పెంపు పట్టణ పేదల వసతికి రాష్ట్ర విపత్తు నిధుల వినియోగానికి అనుమతి గ్రామీణ మౌలిక వసతులకు రూ 4200 కోట్లు ఎస్ఆర్డీఎఫ్ కింద 11,002 కోట్ల నిధులు మార్చి 1 నుంచి మే 31 వరకూ రుణాలు చెల్లించే రైతులకువారికి వడ్డీ రాయితీ వచ్చే రెండు నెలలు వలస కూలీలకు ఉచిత రేషన్ రేషన్‌కార్డు లేని వారికి పదికిలోల బియ్యం, శనగలు నగరాల్లో నిరాశ్రయులకు బలవర్ధక ఆహారం కార్మికులందరికీ కనీస వేతన హక్కు ఫ్లాట్‌ఫాం వర్కర్లకు సామాజిక భద్రత పథకం కార్మికులకు ఉద్యోగ నియామక పత్రాలు ఈ రేషన్ కార్డుతో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటు ప్రధాన నగరాల్లో ప్రభుత్వ నిధులతో నిర్మాణం 50 లక్షల వీధి వ్యాపారులకు రూ. 5,000 కోట్ల రుణాలు వీధి వ్యాపారులకు రుణ పరిమితి పెంపు డిజిటల్ పేమెంట్లు చేసేవారికి మరిన్ని రాయితీలు మధ్యతరగతి వారికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం రూ.6-18 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి రాయితీ 2021 మార్చి వరకూ ఈ పథకం వర్తింపు అర్బన్, సెమీ-అర్బన్‌లో ఉపాథి కల్పనకు రూ. 6000 కోట్లు -
విద్యుత్ కంపెనీలకు రూ. 90 వేల కోట్లేందుకు?
భోపాల్: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఆర్థిక ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట కేంద్రం రూ. 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్మికులకు ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ముందుగా రూ. 90 వేల కోట్లను విద్యుత్ ఉత్పతి కంపెనీలకు కేటాయించారని ఆయన ట్విటర్లో వేదికగా విమర్శించారు. ఎవరు ఎక్కవ సంఖ్యలో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలను కలిగి ఉన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. (నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ : నేడు వ్యవ‘సాయం’) కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభ సమయంలో దెబ్బతింటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం మీడియాకు వివరించారు. ముందుగా రూ. 6 లక్షల కోట్ల వివరాలను ఆమె తెలియజేస్తూ.. రూ. 90 వేల కోట్లను విద్యుత్ ఉత్పతి కంపెనీలకు కేటాయించినట్లు వెల్లడించారు. मज़दूरों को राहत देने के पहले, मोदी जी ने बिजली उत्पादन कंपनियों को ₹९०,०००/- करोड़ की राहत दे दी है। अब पता लगाइए अधिकॉंश बिजली उत्पादन कंपनीयॉं किसकी है। कहावत है ना “अंधा बॉंटे रेवड़ी चीन चीन के देय” — digvijaya singh (@digvijaya_28) May 14, 2020 -
ఆర్థికశాఖ సహాయ మంత్రిపై ట్విటర్లో విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్పై ట్విటర్లో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికుల ప్రభావం చూపించబోదని మార్చి నెలలో ఆయన ట్విటర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది. ఈ కష్ట కాలంలో దెబ్బతింటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రధాని మోదీ ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. (నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ : నేడు వ్యవ‘సాయం’) ఇక ఈ ప్యాకేజీలో భాగంగా చిన్న సంస్థలు, బ్యాకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు, రియల్టీ మొదలైన కొన్ని రంగాలకు దక్కే ప్రయోజనాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆమె ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో వివరించారు. కాగా అదే సమయంలో ఈ ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ హింది భాషలో అనువదించి చెప్పారు. దీంతో కరోనా వైరస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతికుల ప్రభావం ఉండదని గతంలో మంత్రి అనురాగ్ ఠాకుర్ చేసిన చేసిన ట్విట్‌ను గుర్తు చేస్తూ నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు. -
‘22వ తేదీ నుంచి ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు’
సాక్షి, విజయవాడ: దేశంలో అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కోరిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారని తెలిపారు. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో అవే అంశాలను ప్రధాని మోదీ చెప్పారని మంత్రి అన్నారు. ఈ నెల 22 నుంచి ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు చేస్తామని తెలిపారు. ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ వివరించారని ఆయన చెప్పారు. పరిశ్రామిక ప్యాకేజీ కావాలని ప్రధానికి లేఖ కూడా రాశారని ఆయన గుర్తుచేశారు. రెవెన్యూ లోటుని కూడా భర్తీ చేయాలని గతంలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. (ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ తరలింపు) ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రంగాలకు కేంద్రం సాయం చేస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం జగన్ ఎంత వాస్తవికంగా ఆలోచిస్తారో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. దానివల్ల కార్మికులు, ప్రజల్లో నమ్మకం కలిగిందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు ప్రారంభమవుతున్నాయని మంత్రి చెప్పారు. క్రమంగా ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టామని గౌతమ్‌రెడ్డి చెప్పారు. -
ప్యాకేజీ ఆశలతో చివర్లో రికవరీ
ముంబై : ప్రపంచవ్యాప్తంగా రెండో దశ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా మంగళవారం పతనమైంది. భారీ నష్టాల నుంచి మార్కెట్ కోలుకున్నప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లో లాభాల స్వీకరణ కారణంగా నష్టాలు తప్పలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పతనమై 75.51కు చేరడం, లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తారన్న అంచనాలు... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 31,500 పాయింట్లు, నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దీపన చర్యలు ప్రకటించవచ్చన్న ఆశలతో ట్రేడింగ్ చివర్లో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. ఇంట్రాడేలో 716 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 190 పాయింట్ల నష్టంతో 31,371 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 195 పాయింట్ల వరకూ పతనమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 43 పాయింట్లు నష్టంతో 9,197 పాయింట్ల వద్దకు చేరింది. రోజంతా నష్టాలు... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ నష్టాల్లోనే మొదలైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. చివరి గంటలో నష్టాలు కొంచెం తగ్గాయి. రిలయన్స్ జియో–ఫేస్బుక్ డీల్‌కు వ్యతిరేకంగా జస్టిస్ బి.ఎన్. కృష్ణ వ్యాఖ్యలు చేయడంతో మార్కెట్ బలహీనంగా ట్రేడైందని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ ఎస్. రంగనాధన్ వ్యాఖ్యానించారు. అయితే హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల దన్నుతో నష్టాలు తగ్గాయని వివరించారు. మరోవైపు కరోనా కేసులు తొలిసారిగా వచ్చిన వూహాన్లో చాలా వారాల తర్వాత రెండు రోజుల్లో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక దక్షిణ కొరియాలో కూడా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. రెండో దశ కరోనా కేసులు పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు 1 శాతం, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. • రిలయన్స్ ఇండస్ట్రీస్ 6 శాతం నష్టంతో రూ.1,480 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ పది శాతం మేర పెరగడంతో లాభాల స్వీకరణ జరిగింది. • దాదాపు 130కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఎస్బీఐ, డీసీబీ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. నేడు భారీ గ్యాపప్‌తో ఓపెనింగ్! ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో భారీ ప్యాకేజీని ప్రధాని మోదీ మంగళవారం రాత్రి గం.8.00కు ప్రకటించారు. ఈ తాజా ప్యాకేజీ, గతంలోని ప్యాకేజీ, ఆర్బీఐ ఉద్దీపనలను కూడా కలుపుకుంటే, మొత్తం ఉద్దీపన చర్యల విలువ రూ. 20 లక్షల కోట్ల మేర ఉంటుంది. ఇది మన జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం. ఈ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిఫ్టీకి ప్రతీక అయిన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ భారీగా లాభపడింది. రాత్రి 11.30 ని.సమయానికి 426 పాయింట్లు (4.6 శాతం) లాభంతో 9,600 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో నేడు మన మార్కెట్ భారీ లాభాలతో ఆరంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ ప్యాకేజీ కోసమే మార్కెట్ ఎదురు చూస్తోందని, ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణ ఉండొచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. -
ఊరట : రెండ్రోజుల్లో ఆర్థిక ప్యాకేజ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తితో సంక్షోభంలో కూరుకుపోయిన ఎకానమీలో ఉత్తేజం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈఎంఐల చెల్లింపుపై ఆర్బీఐ మూడు నెలల మారటోరియం విధించినా పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నందున కేంద్ర ప్యాకేజ్ అనివార్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలుస్తుందని,అయితే ప్రభుత్వానికి ఉన్న పరిమితులనూ గుర్తెరగాలని చిన్నమధ్యతరహా పరిశమ్రలు, రవాణా, హైవే మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మహమ్మారి ప్రభావానికి లోనైన ప్రతి ఒక్కరినీ కాపాడేందుకు తాము చేయగలిగినంతా చేస్తున్నామని స్పష్టం చేశారు. అమెరికా..జపాన్ల ఆర్థిక వ్యవస్ధలు భారత్ కంటే పెద్దవి అయినందునే భారీ ప్యాకేజ్‌లు ప్రకటించాయని గుర్తుచేశారు. కరోనా మహమ్మారితో ప్రభావితమైన వారికి ఊరటగా ఆర్బీఐ మార్చి 27న మూడునెలల పాటు ఈఎంఐ చెల్లింపులను నిలుపుదల చేస్తూ ప్రకటన చేసిందని అన్నారు. ఆదాయపన్ను, జీఎస్టీ రిఫండ్లను తక్షణమే ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టాలని తాను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించానని తెలంగాణ పరిశ్రమ సంస్థతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తెలిపారు. పరిశ్రమకు చేయూత ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ప్యాకేజ్‌ను ప్రకటిస్తుందని మంత్రి వెల్లడించారు. చదవండి : గుడ్ న్యూస్: త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు.. -
పరిశ్రమలకు ప్యాకేజీ ప్రకటించాలి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను రక్షించేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను విస్మరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె ప్రధాని మోదీకి రాసిన లేఖలో హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన ఈ రంగం కోసం రూ.లక్ష కోట్ల వేతన ప్యాకేజీని అందించాలి. అంతే మొత్తంతో సమానమైన రుణహామీ నిధిని ఏర్పాటు చేయాలి. పరిశ్రమలను ఆదుకునేందుకు రోజంతా పనిచేసే హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలి’అని అందులో కోరారు. -
లక్ష దాటిన కోవిడ్ మరణాలు
జెనీవా/వాషింగ్టన్/రోమ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈస్టర్ సంబరాల వేళ ప్రపంచ జనాభాలో సగం మంది ఇంటి పట్టునే ఉండడంతో ఎక్కడా సందడి కనిపించడం లేదు. సామాజిక, ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లన్నీ కళావిహీనంగా మారిపోయాయి. కోవిడ్ బారిన పడి విలవిలలాడుతున్న దేశాల్లో అమెరికాయే ముందు వరసలో ఉంది. 24 గంటల్లో 1,700 మంది మృతి చెందారు. వైరస్ దెబ్బకి అగ్రరాజ్యంలో ప్రతీ 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతే, తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు. ప్రపంచ శాంతికి భంగకరం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని భగ్నం చేస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గ్యుటెరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొండి వ్యాధిపై కొన్ని తరాల వారు పోరాడాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు. త్వరలోనే ప్రపంచ దేశాల్లో సామాజిక అస్థిరత, హింసాత్మక పరిస్థితులు వస్తాయని భద్రతా మండలిని హెచ్చరించారు. కోలుకుంటున్న జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. ఆయనను ఐసీయూ నుంచి వార్డుకి మార్చారు. జాన్సన్ ఆరోగ్యాన్ని రేయింబవళ్లు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. జాన్సన్‌తో ఆయన తండ్రి స్టాన్లీ జాన్సన్ మాట్లాడారు. ఇటలీలో మాఫియా కదలికలు కోవిడ్‌తో అతలాకుతలమైన ఇటలీపై పట్టు బిగించడానికి మాఫియా పన్నాగాలు పన్నుతోంది. వివిధ నేరగాళ్ల ముఠాలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కొనుగోలు చేసి, ఆకలితో అలమటిస్తున్న వారికి పంపిణీ చేస్తున్నాయి. నిరుపేదల్ని ఆదుకొని వారందరినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని రచయిత రోబెర్టో సావియానో అనుమానం వ్యక్తం చేశారు. యెమన్‌లో తొలి కరోనా కేసు యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమన్‌లో మొట్టమొదటి కరోనా వైరస్ నమోదైంది. తీవ్రస్థాయిలో మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెమన్‌లో కోవిడ్ జాడలు ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందోనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. క్లినికల్ ట్రయల్స్ దశలో ప్లాస్మా థెరపీ న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ విధానం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన యాంటీ బాడీస్‌ను కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధపడుతున్న వారికి ఎక్కించడమే ప్లాస్మా థెరపీ. ఈ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలోని శ్రీచిత్ర పెరుమాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని రోగులపై ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. అయితే, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా ట్రయల్స్‌కు అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని దేశాల్లో కరోనా సోకి విషమంగా ఉన్న రోగులకు, వెంటిలేటర్‌పై ఉన్న వారికి ఈ విధానాన్ని పరిమిత సంఖ్యలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. -
కేంద్రం నుంచి మరో ఆర్థిక ప్యాకేజీ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నుంచి పరిశ్రమలను బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గత నెలలో రూ.1.70 లక్షల కోట్ల మేర పేద ప్రజలకు సాయమందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్యాకేజీని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు లౌక్‌డౌన్ (అన్ని కార్యకలాపాలను నిలిపివేసి, ఎక్కడివారక్కడే ఉండేలా చేయడం) విధించగా, అది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. (కరోనా పడగ: అంబానీ సంపద ఆవిరి) లౌక్‌డౌన్ కారణంగా ఎక్కువ ప్రభావితమయ్యే రంగాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించే ఓ ప్యాకేజీని కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించే పనిలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనికితోడు పేదలు, బలహీన వర్గాల వారిపై ప్రభావాన్ని తగ్గించే మరిన్ని సహాయక చర్యలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన పరిస్థితులను పర్యవేక్షించేందుకు గత వారం ప్రధాన మంత్రి కార్యాలయం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నేతృత్వంలో ఏడుగురు సభ్యుల సాధికార గ్రూపును ఏర్పాటు చేసింది. కాగా, ప్రభుత్వం నుంచి ప్రకటన లౌక్‌డౌన్ ముగిసేనాటికి వస్తుందని సమాచారం. (చదవండి: బ్యాంక్‌లపై కరోనా పిడుగు) -
కరోనా రిలీఫ్ : పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పలు ఊరట చర్యలు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీని జూన్ 30 వరకూ పొడిగించారు. ప్రస్తుతం ఈ గడువు మార్చి 30 వరకూ ఉంది. పాన్, ఆధార్ లింకింగ్‌కు డెడ్‌లైన్‌ను కూడా మార్చి 31 నుంచి జూన్ 30 వరకూ పొడిగించారు. ఇక ఆదాయ వివరాల దాఖలుపై లేటు ఫీజును 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించామని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వివాద్ విశ్వాస్ స్కీమ్ గడువు కూడా జూన్ 30 వరకూ పెంచారు. రూ 5 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన కంపెనీలకు జీస్టీ రిటర్న్స్‌పై వడ్డీ, లేటు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. రూ 5 కోట్లకు మించిన టర్నోవర్ కలిగిన కంపెనీలకు లేటు ఫీజు ఉండదు..కానీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ -19 ఆర్థిక వ్యవస్ధపై చూపే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్థిక ప్యాకేజ్‌పై కసరత్తు సాగుతోందని, ఇది పూర్తయిన వెంటనే వివరాలు ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా జీఎస్టీ, ప్రత్యక్ష పన్నులు, దివాలా చట్టం అమలుపై కొన్ని కీలక చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాంకింగ్, వాణిజ్యం, ఫిషరీస్, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని అన్నారు. నగదు విత్‌డ్రాలపై ఆంక్షల సడలింపు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలను సవరించారు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసినా ఎటువంటి చార్జీలుండవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. మూడు నెలల వరకూ ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా చార్జీల భారం లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ పరిమితిని కూడా తొలగించారు. లాక్డౌన్ సమయంలో ఈ చర్యలు సామాన్య ప్రజలకు కొంత మేర ఊరట కల్పిస్తాయి. చదవండి : త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తాం -
కరోనాకు సంబంధించి అనేక పథకాలు ప్రకటించబోతున్నాం
-
త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తాం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న రంగాలకు ఆర్థిక ప్యాకేజీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం భరోసానిచ్చారు. అయితే, ఇందుకు ఎన్ని రోజులు పడుతుందన్న వివరాలను ఆమె వెల్లడించలేదు. పౌర విమానయానం, పర్యాటకం, ఎంఎస్ఎంఈ, పశుసంవర్థక శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి సీతారామన్ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయా శాఖల నుంచి వచ్చిన డిమాండ్లపై విస్తృతంగా చర్చించినట్టు మంత్రి తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శనివారం అంతర్గతంగా మరో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రధాని ప్రకటించిన కోవిడ్–19 ఎకనమిక్ రెస్పాన్స్ టీమ్ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఆర్థిక రంగానికి సంబంధించి ఉపశమన చర్యల గురించి మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు.. సెబీ ప్రకటించిన నియంత్రణ చర్యలు మార్కెట్లలో కొంత స్థిరత్వాన్ని తీసుకొస్తాయన్నారు. ప్రస్తుత స్థితిలో ప్రతీ ఒక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకుని వాటిపై పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు చెప్పారు. పర్యాటకానికి గడ్డు పరిస్థితి ‘‘పర్యాటక రంగంపై ప్రభావం ఉన్న విషయం మన అందరికీ తెలుసు. ఈ రంగానికి వచ్చే నష్టాల గురించి పూర్తి అధ్యయనం అనంతరం ఏదైనా ప్యాకేజీ ప్రకటించే అంశాన్ని నిర్ణయిస్తాం’’ అని పర్యాటక మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు. ఆర్థిక సాయం అవసరం : క్రిసిల్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్, హోటల్స్, మాల్స్, మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లు, రిటైలర్లకు స్వల్ప, మధ్యకాలిక ఆర్థిక సాయం వెంటనే అందించాలని క్రిసిల్ తన నివేదికలో కోరింది. చైనాలో కొత్తగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మే చివరినాటికి సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వివరించింది. ఇది జరక్కపోతే స్టీల్, జెమ్స్, జువెల్లరీ, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్, టెక్స్టైల్ రంగాలూ కరోనా బారిన పడతాయని హెచ్చరించింది. నగదు రాక తగ్గింది..: ఫిక్కీ దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 50 శాతంపైగా కంపెనీల కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందని ఫిక్కీ తెలిపింది. ఫిక్కీ నిర్వహించిన సర్వేలో 80 శాతం కంపెనీలు నగదు రాక తగ్గినట్టు తెలిపాయి. కరోనాతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, డిమాండ్. సరఫరా దెబ్బతిందని ఫిక్కీ వివరించింది. ఉద్యోగుల వేతనాలు, వడ్డీ, రుణ చెల్లింపులపై ప్రభావం ఉంటుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్బీఐ పాలసీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఫిక్కీ కోరింది. నగదు సాయం చేయండి : సీఐఐ పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల కోతతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీ పన ప్రకటించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది. వ్యాపారాలకు భారీ అంతరాయం రానుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. కరోనా మూలంగా రియల్టీ, విమానయా నం, పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. ‘ఆధార్ ఆధారంగా గ్రామీణ, పట్టణ నిరుపేదలకు ఒక్కొక్కరికీ రూ.5,000 నేరుగా వారి ఖాతాకు జమచేయాలి. బలహీన వర్గాలు, వృద్ధులకు రూ.10,000 అందించండి. వ్యక్తుల్లో ఆర్థిక భయాలను తొలగించేందుకు ఇది దోహదం చేస్తుంది’ అని తన లేఖలో తెలిపారు. వేతనాలను తగ్గించుకోవాలి.. వ్యయ భారం తగ్గేందుకు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ స్థాయిలో వేతనాలను కుదించుకోవాలి అని చంద్రజిత్ సూచించారు. ‘ప్రభుత్వం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 10 శాతమున్న పన్నును ఎత్తవేయాలి. టోటల్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను 25 శాతానికి చేర్చాలి. ఇన్వాయిస్ల ఆధారంగా కాకుండా బిల్లుల వసూళ్లపై మాత్రమే జీఎస్టీ అమలు చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. -
ఆర్థిక ఒత్తిడిని జయించాలంటే..!
ఇప్పుడు ఎవరినోటవిన్నా వినిపిస్తున్న మాట.. ఒత్తిడి. జీవనశైలిలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులే దీనికి ప్రధాన కారణమంటూ సర్వేలు ఊదరగొడుతున్నాయి. ఇక మన దేశానికొస్తే... ప్రతీ పది మందిలో ఒక్కరు మినహా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లకు ఆర్థిక అంశాలే మూలమని సిగ్నా 360 వెల్ బీయింగ్ సర్వే పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వారు 86 శాతం అయితే, మన దేశంలో మాత్రం 89 శాతంగా ఉన్నారు. ఉద్యోగం కోల్పోవడం లేదా కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణంతో అప్పులు... ప్రణాళిక లేని ఖర్చులు ఇలా ఆర్థిక ఒత్తిళ్లకు ఎన్నో కారణాలు ఉంటున్నాయని పీక్ ఆల్ఫా ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రియా సుందర్ తెలిపారు. ఈ ఒత్తిళ్లు ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీయవచ్చు. ఆర్థిక ఆందోళన ఎక్కువ కావడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 13 శాతం ఉంటుందని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ అంటోంది. వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడం, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం చెందడం వంటివీ ఆర్థిక కుంగుబాటుకు కారణాలుగా ఉన్నాయి. అందుకే పక్కా ప్రణాళికతో, నియంత్రణ చర్యలతో ఈ ఒత్తిళ్ల నుంచి బయటపడే మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఆర్థిక ఒత్తిళ్లకు కారణమవుతున్న ప్రధాన కారణాలు, వీటిని అధిగమించడం ఎలాగన్నది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలియజేసే కథనం ఇది... షేర్లు కుప్పకూలితే...! దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినప్పడు, ఫండమెంటల్స్ బలంగానే ఉంటే మార్కెట్ పతనం చూసి ఆందోళన చెందక్కర్లేదు. 2008 ఆర్థిక సంక్షోభం ఇన్వెస్టర్లకు ఎన్నో పాఠాలు నేర్పింది. అయినప్పటికీ ఇన్వెస్టర్లు మార్కెట్లలో కరెక్షన్ మొదలైందన్న సంకేతం రాగానే వెంటనే అమ్మేయాలన్న ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ‘‘ఇన్వెస్టర్లు ఎలా స్పందించాలన్నది తెలుసుకోవాలి. కానీ, మార్కెట్ కదలికలను చూసి ప్రతిస్పందించకూడదు’’ అని 5నాన్స్ సహ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా పేర్కొన్నారు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసిన వారు స్వల్ప కాల ఆటుపోట్లపై ఆందోళన చెందక్కర్లేదని సూచించారు. ‘‘మార్కెట్, గ్రూపు, పథకం మూలాలు బలంగా ఉన్నాయా, లేవా అన్నది చూడాలి. మ్యూచువల్ ఫండ్ పథకం పనితీరు చక్కగా ఉంటే పెట్టుబడిని ఎప్పటిలాగానే కొనసాగించాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడే ఎంత కాలానికి అన్న స్పష్టత అవసరం. మార్కెట్లలో పెద్ద కరెక్షన్ ప్రతీ 6–7 ఏళ్లకోసారి వస్తుంటుంది. దీర్ఘకాల ఇన్వెస్టర్లు అయితే ఆందోళన చెందకుండా సిప్‌ను కొనసాగించాలి’’ అని ఫైనాన్షియలప్లానర్ పంకజ్ తెలిపారు. ఉదాహరణకు... హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్‌లో 2014 నుంచి 2016 వరకు ఇన్వెస్ట్ చేసి ఉంటే, పెట్టుబడి భారీగా వృద్ధి చెంది ఉండేది. అలా కాకుండా 2016 ఫిబ్రవరిలో కరెక్షన్ సమయంలో పెట్టుబడులను వెనక్కి తీసేసుకుని తిరిగి అదే ఏడాది మార్చిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే పై ఉదాహరణ కంటే తక్కువే రాబడులు వచ్చేవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు అయినా... కంపెనీల ఫండమెంటల్స్ బలంగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆర్థిక నిపుణుల సూచన. అయితే, దీర్ఘకాలం కోసం కాని వారు, అవసరమైతే నష్టాలను బుక్ చేసుకుని బయటకు వచ్చేయాలని దినేష్ రోహిరా సూచించారు. ఉదాహరణకు... ఐఎల్‌అండ్‌ఎఫ్ గ్రూపు ఆర్థిక సంక్షోభంతో కొన్ని డెట్ ఫండ్స్ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వీటి రికవరీపై ఆశలు కూడా సన్నగిల్లాయి. ఆ సమయంలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం సరైనదే. ఆశ, భయాలకు దూరంగా ఉండి, క్రమం తప్పకుండా పెట్టుబడులను పరిశీలిస్తూ ఉండాలని రోహిరా సూచించారు. పరిమితికి మించి రుణాలు అప్పటికే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలని చెప్పి మరో రుణాన్ని తీసుకోవడం సరైనది కాదు. రుణమన్నది నిర్వహణను బట్టి స్నేహితునిగాను, శత్రువుగానూ మారగలదని దినేష్ రోహిరా హెచ్చరించారు. ఓ ఆస్తి సమకూర్చుకోవడానికి రుణం చేస్తే (ఇల్లు), క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు బాధ్యతాయుతంగా క్రెడిట్ కార్డును వినియోగిస్తే, రుణం తీసుకోవడమే మంచిది. అవసరం ఉంది కదా అని పెద్ద ఎత్తున రుణం తీసుకుంటే లేదా అధిక వడ్డీ రేటు కోసం వ్యక్తిగత రుణాన్ని తీసుకుంటే బడ్జెట్, నగదు ప్రవాహాలపై ఒత్తిడి నెలకొంటుంది. కొంత మంది ఒక రుణాన్ని తీర్చివేసేందుకు మరో పెద్ద రుణం తీసుకుంటుంటారు. ఇవన్నీ ఆర్థికంగా తలకిందులు చేసే నిర్ణయాలు. ఒకటికి మించి రుణాలు ఉంటే, అధిక వడ్డీతో ఉన్న రుణాన్ని ముందుగా తీర్చివేయడంపై దృష్టి పెట్టాలి. రుణంపై 13 శాతం వడ్డీ రేటు చెల్లిస్తూ... అదే సమయంలో 6–7 శాతం వడ్డీనిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటే... ఉపసంహరించుకుని రుణాన్ని చెల్లించివేయడం వివేకం. అన్ని రుణాల చెల్లింపులు నెల వేతనంలో సగాన్ని మించకుండా చూసుకోవాలి. ఆదాయ–రుణ–వ్యయ నిష్పత్తులను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. రిటైర్మెంట్కు ముందునుంచే రిటైర్మెంట్ జీవితం గురించి మరీ ఆలస్యంగా పొదుపు మొదలు పెడితే అవసరాలు తీరవు. ఆర్థిక సమస్యలతో మలి వయసులోనూ ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది. 25 ఏళ్ల వ్యక్తి ప్రతీ నెలా రూ.20,000 వేలను ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్ల నాటికి రూ.10.9 కోట్లు (12 శాతం రాబడి) సమకూరుతుంది. కానీ, 35 ఏళ్ల వయసు నుంచి ప్రతీ నెలా రూ.20,000 వేలు ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్ల నాటికి కేవలం రూ.3.4 కోట్లే సమకూరుతుంది. ఇంకాస్త ఆలస్యంగా 45వ ఏట నుంచి మొదలు పెడితే రూ.94.3 లక్షలు, 55 ఏళ్ల నుంచి అయితే రూ.16.1 లక్షల దగ్గర నిధి ఆగిపోతుంది. భాగస్వామితో సమన్వయం జీవిత భాగస్వామికి ఆర్థిక లక్ష్యాల్లోనూ చోటు కల్పించడం ఎంతైనా అవసరం. కుటుంబ బడ్జెట్ గురించి ఇద్దరూ మాట్లాడుకోవడం, ఉమ్మడి లక్ష్యాల కోసం చేయాల్సిన పొదుపు విషయాలపై ఏకాభిప్రాయానికి రావాలి. దంపతుల మధ్య ఆర్థిక విషయాల్లో సఖ్యత లేకపోయినా, ఆ కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకునేందుకు దారితీయవచ్చు. ఖర్చులు, పొదుపు, ఇన్వెస్ట్మెంట్, భవిష్యత్తు లక్ష్యాల విషయంలో ఇద్దరూ ఓ నిర్ణయానికి రావడం తప్పనిసరి. ఇద్దరూ ఆర్జనాపరులే కావాల్సిన అవసరం లేదు. దంపతుల్లో ఒక్కరే ఆదాయ పరులైనా కానీ, ఆర్థిక విషయాల్లో ఇద్దరూ ఏకాభిప్రాయంతో, సమన్వయంతో నడుచుకుంటే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. దంపతులిద్దరూ సంపాదిస్తుంటే... ఉమ్మడి బ్యాంకు ఖాతాను తెరిచి, తమ వేతనం నుంచి ఇద్దరూ సమాన మొత్తంలో జాయింటు ఖాతాలోకి కుటుంబ ఖర్చుల కోసం మళ్లించుకోవాలని ఆర్థిక నిపుణులు సుందరం సూచించారు. వ్యక్తిగత ఖర్చులను వారు తమ వ్యక్తిగత ఖాతాల్లో ఉన్న మిగులు నిల్వల నుంచి చేసుకోవచ్చన్నారు. ఇక జీవిత భాగస్వాముల్లో ఒకరే ఆర్జనా పరులైతే, ఒకరు ఇన్వెస్ట్మెంట్, మరొకరు ఇంటి ఖర్చులను నిర్వహించడం చేయాలి. ముందుగానే పక్కా ప్రణాళిక భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక అవసరాలకు ముందు నుంచే సరైన ప్రణాళిక వేసుకోవాలి. మూడేళ్ల చిన్నారి ఉన్నత విద్య కోసం నిధిని సమకూర్చుకోవాలంటే... ఈ రోజు రూ.10 లక్షలయ్యే కోర్సు, 15 ఏళ్ల తర్వాత 7 శాతం ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా రూ.27.59 లక్షలు అవుతుంది. ఆర్థిక సన్నద్ధత తీవ్ర అనారోగ్యం, ప్రమాదానికి గురవడం, ఉద్యోగం కోల్పోవడం, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడం వంటి సందర్భాల్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలకు కారణమయ్యే వాటిల్లో ఇవే అతిపెద్దవి. అత్యవసర నిధి ఈ సమయాల్లో అక్కరకు వస్తుంది. ఉద్యోగం స్థిరంగా ఉంటుందన్న హామీ కష్టమే. ఇక ఆరోగ్యానికి రిస్క్‌తో కూడిన ఉద్యోగాలలో ఉన్న వారు ముందుగానే రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వారు ముందు నుంచే విచక్షణారహిత ఖర్చులకు కళ్లెం వేసి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అనవసర ఖర్చులు వద్దు.. బడ్జెట్‌ను అనుసరించి ఖర్చు చేసే వారికి ఈ పరిస్థితి ఎదురుకాదు. ఆర్థిక ఒత్తిళ్లు అన్నవి చాలా సాధారణం. వీటికి ఎన్నో కారణాలు కూడా ఉంటాయి. మీ వేతనం తక్కువగా ఉంటే, అధిక వేతనం లభించే కొత్త ఉద్యోగ అవకాశం చూసుకోవడం, ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం మినహా ప్రత్యామ్నాయాలు లేవు. ‘‘చాలా మంది విషయంలో నెల చివర్లో నిధుల్లేని పరిస్థితికి కారణం సరైన బడ్జెట్ లేకపోవడమే, నగదు నిర్వహణ నిర్మాణాత్మకంగా లేకపోవడమే’’ అని దినేష్ రోహిరా తెలిపారు. ఇక మనలో చాలా మందికి అసలు ఓ బడ్జెట్ అంటూ ఉండదు. దీంతో వస్తున్న ఆదాయంతో ఖర్చులను సమన్వయం చేసే అవకాశం ఉండదు. నెల వేతనం రాగానే అనవసరమైన ప్రతిదానికీ ఖర్చు చేయడం వల్ల... ఉన్నదంతా నెల మొత్తానికి సర్దుబాటు కాదు. మరో కారణం దుబారాగా ఖర్చు పెట్టే అలవాటు. తప్పనిసరి ఖర్చులు, ఇష్టానికి చేసే ఖర్చుల మధ్య భేదాన్ని చాలా మంది గుర్తించరు. వేతనం రాగానే పెట్టుబడులు, బిల్లు చెల్లింపులు, రుణ ఈఎంఐల చెల్లింపులు ముందుగా చేయడానికి బదులు... రెస్టారెంట్‌కు వెళ్లి కడుపునిండా నచ్చిన విందు చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో అవసరాల కోసం క్రెడిట్ కార్డు లేదంటే మరో రుణమో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రుణ సమస్యల్లో చిక్కుకుంటారు. పరిమితికి మించిన రుణ భారం కూడా మనిషిని ఆర్థికంగా కుంగదీస్తుంది. కారు రుణం, ఇంటి రుణం, వ్యక్తిగత రుణం అన్ని ఈఎంఐలు నెల ఆదాయంలో 50 శాతానికి మించాయంటే సంక్షోభంలోకి వెళుతున్నట్టే. దీన్నుంచి బయటపడేందుకు ముందుగా బడ్జెట్ రూపొందించుకోవాలి. తప్పనిసరి ఖర్చులను విచక్షణ లేకుండా చేసే ఖర్చుల నుంచి వేరు చేయాలి. తప్పనిసరి అవసరాలకు ఖర్చు చేసిన తర్వాత... మీ ఆదాయంలో మిగులు ఉంటే అప్పుడు విచక్షణా రహిత ఖర్చులకు వెళ్లడంలో తప్పులేదు. ఇక ఆర్జన మొదలైన నాటి నుంచే మొత్తం ఆదాయంలో 20–30 శాతాన్ని ఇన్వెస్ట్ చేస్తుండాలని, ఇది చేస్తుంటే ఖర్చులన్నవి పెద్ద సమస్యే కాబోవని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోకపోయినా బడ్జెట్ తలకిందులు అవుతుంది. అత్యవసరాలు చేతిలో ఉన్నదంతా ఖాళీ చేసేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కనీసం మూడు నెలల అవసరాలకు సరిపడా అయినా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఓ కారు ఖర్చులను భరించే సామర్థ్యం లేకపోతే, రుణంపై కారు తీసుకోవద్దు. నెలంతా చేతిలో డబ్బుల్లేని పరిస్థితుల్లో ఉన్నవారు క్రెడిట్‌కార్డు వినియోగానికి దూరంగా ఉండాలి. డబ్బులంతా ఖర్చవడానికి అనవసర ఖర్చులే కారణం అయితే... అటువంటి వారు మరింత ఆదాయం కోసం కష్టపడినా నిష్ప్రయోజనమే. ఎందుకంటే పిండికొద్దీ రొట్టె అన్నట్టు ఎంత వచ్చినా విచక్షణారహితంగా ఖర్చు చేసే అలవాటు పెద్ద ముప్పు. నెలసరి ఆదాయం అంతా నెల మధ్యలోనే ఖాళీ అయిపోతే, అవసరాల కోసం అత్యవసర నిధి జోలికి వెళ్లొద్దు. అధిక ఆదాయం కోసం లాటరీలు, జూదం, చాలా స్వల్ప కాలంలోనే భారీ రాబడులు ఇచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రుణ ఈఎంఐలు, బీమా ప్రీమియంలు, బిల్లులు అన్నీ చేతికి ఆదాయం అందించిన వెంటనే చెల్లింపులు చేసేయాలి. -
చక్కెర పరిశ్రమకు ఊరట : భారీ ప్యాకేజీ
సాక్షి, ముంబై: భారత చక్కెర పరిశ్రమకు కేంద్రం తీపి కబురు అందించింది. చక్కెర పరిశ్రమలో సంక్షోభాలను గట్టెక్కించడంకోసం కేంద్ర క్యాబినెట్ రు.4,500 కోట్ల ప్యాకేజీ అందించనుంది. ఈ మేరకు ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలకు బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈసీ) ఆమోదం లభించింది. తద్వారా చక్కెర మిగులు నిల్వలను పరిష్కరించడానికి, భారీ చెరకు బకాయిలు రూ. 130 బిలియన్ల మేరకు క్లియర్ చేయటానికి సహాయం చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరంలో పెంచిన రు.5.50కు ఇది అదనపు పెంపు. గత జూన్ మాసంలోనే చక్కెర పరిశ్రమకు కేంద్రం రు. 8,500కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. షుగర్ పరిశ్రమలకు ఇచ్చే ఇథనాల్ ఉత్పత్తి రాయితీ రు. 4,400 కోట్ల నిధులు కూడా ఇందులోనే చేర్చారు. తాజా నిర్ణయం ప్రకారం దాదాపు రు.1,332 కోట్ల వడ్డీ రాయితీని కేంద్రం భరించనుంది. 5మిలియన్ టన్నుల ఎగుమతే లక్ష్యం: 2018-19మార్కెటింగ్ (అక్టోబరు-సెప్టెంబర్) సంవత్సరంలో దాదాపు 5 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తులను ఎగుమతి చేయలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. 2017-2018 సంవత్సరానికి గాను 32 మిలియన్ టన్నులకే దిగుమతి పరిమితం కావడంతో ఈ దిగుబడులను మరింత పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 2018-19 5 మిలియన్ టన్నుల వరకు ఎగుమతులపై చెరకు రైతులకు, రవాణాపై మిల్లులకు సబ్సిడీని రెండు రెట్లు పెంచనుంది. షుగర్ షేర్లు జూమ్: నాలుగు వేల కోట్ల ప్యాకేజ్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో షుగర్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శ్రీ రేణుకా షుగర్స్, బజాజ్ హిందుస్థాన్ షుగర్స్, బలరాంపూర్ చిన్నీ, దాల్మియా షుగర్స్, ఈఐడీ ప్యారీ అన్నారిఅమ్మాన్ షుగర్స్ , ద్వారకేష్ షుగర్స్, ఉత్తమ్ షుగర్స్ , రానా షుగర్స్, ఆంధ్ర షుగర్స్ వంటి కంపెనీల షేర్లు పుంజుకున్నాయి. దాదాపు 8శాతానికిపై గా లాభపడ్డాయి. -
హోదా ఇవ్వలేం
-
హోదా లేదు.. దగానే!
-
హోదా ఇవ్వలేం
అధికారికంగా ప్రకటించిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు అటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఇటు ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక కంటి తుడుపు ప్రకటన చేశారు. హోదాకు బదులుగా దానిని భర్తీ చేసేందుకు హోదా ఉంటే ఎంతమేర ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు(ఈఏపీ) వచ్చేవో అంతమేర ఆ ఈఏపీ ప్రాజెక్టులను ఇవ్వడం ద్వారా సహాయం చేస్తామని ప్రకటిం చారు. పైగా చట్టబద్ధంగా అమలుకావాల్సిన రైల్వేజోన్ గానీ, కడప స్టీలు ప్లాంటు గానీ, దుగరాజపట్నం నౌకాశ్రయం గానీ ఉంటుందన్న భరోసా ఇవ్వలేదు. మధ్యాహ్నం నుంచి ఎప్పుడెప్పుడు ప్రకటన వస్తుందా అని ఎదురుచూసిన ప్రజలకు రాత్రి 10.47 గంటలకు జైట్లీ చేసిన ప్రకటన ఉసూరుమనిపించింది. ఆర్థిక శాఖ రూపొందించిన సాయం ప్రకటనను సీఎంకు పంపించి ఆయన సమ్మతించిన తరువాతే టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనాచౌదరితో కలిసి అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ఈ ప్రకటన చేశారు. అసెంబ్లీ సీట్ల కోసమే పట్టు.. ప్యాకేజీ ప్రకటనపై ఉదయం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో, తదుపరి వెంకయ్యతో సుజ నా చౌదరి, టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ భేటీ అయ్యారు. అయితే బాబు సమక్షంలో ప్రకటన చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సీఎంను వెంకయ్య ఢిల్లీకి రమ్మని ఆహ్వానించినట్టు ప్రచా రం జరిగింది. ఎట్టకేలకు 10.47కు జైట్లీ ప్రకటన చేశారు. అయితే, 10రోజుల క్రితమే ము సాయిదాను రూపొందించిన ఆర్థిక శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, అటు ప్రధాని ఆమోదం పొంది ప్రకటన కోసం వేచి చూస్తూ ఉంది. కానీ బుధవారమే ఈ ప్రకటన ను సీఎం పరిశీలించినట్టు.. ఆయన సంతృప్తి చెందనట్టు నాటకాన్ని రక్తికట్టించారు. సీఎం డిమాండ్ చేస్తున్న అసెంబ్లీ సీట్ల పెంపును ఈ ప్రకటనలో చేర్చాలని సుజనా, సీఎం రమేశ్.. జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌తో సంప్రదింపులు జరిపి నా దానికి కేంద్రం సమ్మతించలేదు. రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్నందున కుదరదని తేల్చేసింది. చివరగా పలు అంశాలపై సంబంధిత శాఖలు నిర్ణయం తీసుకుంటాయన్న సవరణ ప్రకటనను సిద్ధం చేసుకుని జైట్లీ విలేకరుల భేటీలో సంబంధిత వివరాలు వినిపించారు. ఇదే ఆ సాయం..: అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన సారాంశం ఇలా ఉంది.. ‘పార్లమెంటు సమావేశాల అనంతరం గత కొద్ది రోజులు కేంద్రం నూతన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పలు అంశాలను పరిశీలన చేస్తూ వచ్చింది. ఏపీకి కేంద్ర సాయం అందించేందుకు 4 అంశాలు దోహదపడుతున్నాయి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 14వ ఆర్థిక సంఘం ద్వారా రెవెన్యూ లోటు భర్తీ, విభజన రోజున ప్రధాని ఇచ్చిన హామీలు, నీతిఆయోగ్ చేసిన సిఫారసులు.. ఈ 4 రూపాల్లో ఏపీకి సాయం దక్కుతుంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చేసిన హామీలన్నింటినీ అమలుచేస్తామని కేంద్రం చెప్పింది. వాటన్నింటికీ కట్టుబడి ఉన్నాం. తొలి ఏడాది రెవెన్యూ లోటు భర్తీకి రూ. 3975 కోట్లు ఇచ్చాం. మిగిలిన మొత్తాన్ని ఇస్తాం. అలాగే రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు ఇచ్చాం. వెనకబడిన ప్రాంతాలకు రూ. 1050 కోట్లు ఇచ్చాం. జాతీయ స్థాయి సంస్థలు నెలకొల్పాం. మంజూరు చేయాల్సిన వాటికి సంబంధించి కార్యచరణ జరుగుతోంది. వీటి ఏర్పాటుకు క ట్టుబడి ఉన్నాం..’ అని అన్నారు. 2014 తరువాతి ఖర్చే..: ‘పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాం. అందువల్ల 1-4-2014 తేదీన జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. ప్రాజెక్టు పూర్తికి నాబార్డ్ నుంచి రుణం తీసుకుని దాన్ని కేంద్రం చెల్లిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టుపై రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ, అవసరం ఉన్నందున ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రానికే అప్పగిస్తున్నాం.. పన్ను రాయితీలు ఇదివరకే ప్రకటించాం. డిప్రీసియేషన్, ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్‌లపై ఉత్తర్వులు జారీచేశాం. ఇక మన్మోహన్ ప్రకటించిన 6 అంశాలు ఐదింటిని వేర్వేరు రూపాల్లో అమలుచేస్తున్నాం. మిగిలింది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కూడా అదనపు రెవెన్యూ గ్రాంట్లే ఇస్తూ వస్తున్నాం. అయితే ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మేం అర్థం చేసుకోగలం. కానీ ప్రత్యేక హోదా ప్రకటన తరువాతే 14వ ఆర్థిక సంఘం వచ్చింది. దీనిని మేం పరిశీలించాం. ప్రధాని ప్రకటన ఉద్దేశం ఆర్థికంగా సాయం చేయడమే. అందువల్ల కేంద్రం హోదాకు బదులు ప్రత్యేక సాయాన్ని అందించ దలిచింది. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఏమేరకు లబ్ధి చేకూరేదో ఆ మేరకు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రూపంలో సాయం చేస్తాం. దీనిని విభజన నాటి నుంచి ఐదేళ్ల పాటు అమలుచేస్తాం. ఈ 7 పేజీల్లో ఉన్న అంశాలకు ఒకవేళ కేబినెట్ ఆమోదం అవసరమైతే ఆమోదం పొందిన తరువాత ఈ నివేదికను మీడియాకు విడుదల చేస్తాం. ఇక రైల్వే జోన్, స్టీలు ప్లాంటు, అసెంబ్లీ సీట్ల పెంపు తదితర అంశాలను ఆయా శాఖలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి’ అనిఅన్నారు. రాజధానికి సాయంపైన గానీ, ఎక్స్టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల విషయంలోగానీ నీతి ఆయోగ్ చేసే గణాంకాల ఆధారంగా సాయం చేస్తామన్నారు. ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం ఈ ఎక్స్టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల ద్వారా ఏటా 2500 కోట్ల మేర నిధులు అందుతాయని తెలుస్తోంది. రైల్వే జోన్‌ను విజయవాడలో ఏర్పాటు చేయబోతున్నారా? అని అడగ్గా.. రైల్వే శాఖ చూస్తుందని పేర్కొన్నారు. నిరంతర సాయం..: వెంకయ్య వెంకయ్య మాట్లాడుతూ.. ‘ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తాం.. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సాయాన్ని అందిస్తాం. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు మంజూరు అయ్యాయి. అవి పనిచేస్తున్నాయి. మిగిలిన గిరిజన వర్సిటీ, కడప స్టీల్ ప్లాంట్ వీటి ఏర్పాటుపై కూడా ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించాం. ఏపీకి కేంద్ర సాయం చేయడం అనేది నిరంతర ప్రక్రియ. ఏపీని విభజించిన తీరు వల్ల కేంద్ర సాయం అత్యవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిగతా రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరే వరకు ఏపీకి అన్ని విధాల సాయపడతాం. చట్టంలో పేర్కొన్న వాటిలో ఇప్పటికే ఎక్కువ భాగం అమలు చేశాం. మిగతా వాటినీ త్వరలో చేస్తాం. చట్టంలో పేర్కొన్న లాంగ్వేజ్‌కు అనుగుణంగా 10 ఏళ్లలోపు హామీ ఇచ్చిన సంస్థలను ఏర్పాటు చేయాలని, కానీ దాని కన్నా ముందుగా ఆయా సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ప్రాజెక్టుల యోగ్యతకు అధ్యయనాన్ని మాత్రమే చట్టంలో పొందుపరిచారు. ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తే సరిపోదు. వా టికి ఆర్థిక యోగ్యత ఉందా లేదా కూడా పరి శీలించాలి. గతంలో శంకుస్థాపన చేసిన పలు పరిశ్రమలు ఇప్పటికీ ప్రారంభం కాని సంగతిని దృష్టిలో పెట్టుకోవాలి..’ అని పేర్కొన్నారు. -
హోదా లేదు.. దగానే!
ఏపీకి ‘ప్రత్యేకం’ కుదరదని తేల్చేసిన కేంద్రం విభజన చట్టం హామీలనే వల్లె వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రెండున్నరేళ్ల ఆశలు ఆవిరి.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు బలి యువత భవితవ్యం అగమ్యగోచరం.. అసలు సూత్రధారి చంద్రబాబే బాబు అంగీకరించాకే జైట్లీ ప్రకటన.. ‘ఓటుకు కోట్లు’ వల్లే కాళ్లబేరం అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరీ కేంద్రం వైఖరిని సమర్థించిన చంద్రబాబు విభజన చట్టం హామీల ద్వారా మనకు రావలసినవి రూ.2లక్షల కోట్లు అవి కాక హోదా కూడా... నాడు పార్లమెంటు సాక్షిగా ప్రధాని హామీ రెండున్నరేళ్లుగా బాబు నాటకాలు.. కేంద్రంపై ఒత్తిడి తేకుండా మౌనం చంద్రబాబు స్వార్థ రాజకీయం వల్ల ఏపీకి తీరని నష్టం.. 5 కోట్ల మంది ఆకాంక్ష ప్రత్యేక హోదా పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ విభజన చట్టం హామీలు కచ్చితంగా అమలు చేయడం కేంద్రం బాధ్యత ఏం జరిగింది? ప్రత్యేక హోదాకు అధికారికంగా మంగళం పాడేశారు. విభజన చట్టం హామీలను అమలు చేస్తున్నామని ప్రకటించారు. బాబుగారి పాత్రేమిటి? ప్రత్యేకహోదా సంజీవని కాదన్నారు.. ప్రజల్లో భావోద్వేగాలు పెరగగానే ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్లు చంద్రబాబు పోజిచ్చారు. ‘ప్యాకేజీ’ మంతనాలు సాగించారు.. చివరకు హోదా లేదన్న కేంద్రం ప్రకటనను తన మంత్రులను పక్కన కూర్చోబెట్టుకుని ఓకే చేశారు. ప్రత్యేక హోదా ఉంటే.. వంద ప్యాకేజీలకు సమానం.. ఎందుకంటే రాయితీలు చూసి వందలాది పరిశ్రమలు వస్తాయి.. ఉద్యోగాలు వెల్లువెత్తుతాయి..కేంద్రం గ్రాంట్లు.. విదేశీ రుణాలలో మినహాయింపులు సరేసరి. కేంద్రాన్ని అర్థించాల్సిన అవసరం లేకుండానే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) అయిపోయింది... భయపడినంతా జరిగింది. ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసింది. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలు నాశనమైపోయాయి. భావితరాలు పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. విభజన కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్రానికి సంజీవని వంటి ‘ప్రత్యేక హోదా’ ఆశను సమాధి చేసేశారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని పట్టపగలు ఖూనీ చేసేశారు. మేనిఫెస్టోలలో పెట్టి మరీ ప్రచారం చేసిన హామీకి పాడెకట్టేశారు. కలసి పోటీ చేసిన బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఎన్నికల సభల్లో ప్రత్యేకంగా ఊదరగొట్టిన ప్రత్యేకహోదాకు మంగళం పాడేశాయి. విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం కేంద్రం బాధ్యత. ఆంధ్రప్రదేశ్‌కు సహజసిద్ధంగా సంక్రమించిన హక్కు అది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని, విభజన చట్టం హామీలనే అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న కేంద్రం ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకించకపోగా జైట్లీ మొక్కుబడి ప్రకటనపైనే సుదీర్ఘంగా మాట్లాడారు. దీనిని బట్టి కేంద్రంతో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను దారుణంగా వంచించిన విషయం తేటతెల్లమైపోయిందని విశ్లేషకులంటున్నారు. ప్రత్యేకహోదా సాధ్యం కాదని పార్లమెంటులో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెబుతుంటే రక్తం మరిగిపోయిందన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదాకు చరమగీతం పాడేసి.. రోజంతా అదే జైట్లీతో ప్యాకేజీ ముచ్చట్లు సాగించారు. ప్రకటన పాఠాన్ని ముందుగా చంద్రబాబుకు పంపి, ఆయన ఆమోదించిన తర్వాతనే జైట్లీ ప్రకటించారని అంటున్నారు. అయితే పైకి మాత్రం ప్రత్యేకహోదా ప్రకటిస్తానంటేనే ఢిల్లీ వస్తానని చంద్రబాబు భీషణమైన ప్రకటన చేసినట్లు ప్రచారాలు సాగాయి. చివరకు ప్రత్యేక హోదా లేదని ప్రకటించి.. ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదని తేల్చేసి కేంద్రం చేతులు దులుపుకుంది. అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే.. ఆంధ్రప్రదేశ్‌కి ఏదో ప్రత్యేకంగా ప్రకటించబోతున్నారంటూ ఢిల్లీలో రోజంతా హడావిడి నడిచింది. చంద్రబాబుతో ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఫోన్లో చర్చించారు. మెరుగైన ప్యాకేజీ కోసం కేంద్రంతో లాబీ చేస్తున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. ప్యాకేజీపై కేంద్రప్రభుత్వానికి, చంద్రబాబుకు మధ్య ఏకాభిప్రాయం కుదరిందని, చంద్రబాబుతో చర్చించే ప్యాకేజీకి కేంద్రం తుదిరూపు ఇస్తున్నదని ప్రచారం చేశారు. సుజనాచౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ తదితరులు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీతో చర్చలు జరిపారు. తొలుత సాయంత్రం 6.30 గంటలకు జైట్లీ ప్రకటన ఉంటుందన్నారు. తర్వాత అది రాత్రి 8.00 గంటలకు మారింది. చివరకు 11.00 గంటలకు విలేకరుల సమావేశం జరిగింది. అరుణ్‌జైట్లీ ప్రకటించే సమయంలో అక్కడ చంద్రబాబు కూడా ఉండాలని కేంద్రం భావించింది. అయితే అందుకు చంద్రబాబు సిద్ధపడలేదు. హోదా ప్రకటిస్తామని చెబితేనే తాను ఢిల్లీ వస్తానని చంద్రబాబు అన్నట్లుగా మీడియాలో ప్రచారం చేయించారు. వాస్తవానికి చంద్రబాబు చెప్పినట్లుగానే, ఆయన ఆశించిన విధంగానే జైట్లీ ప్రకటన ఉన్నపుడు జైట్లీ ప్రకటన చేసే సమయంలో అక్కడ ఉండడానికి చంద్రబాబుకు అభ్యంతరం ఎందుకో బీజేపీ నాయకులకు అర్ధం కాలేదు. ప్రత్యేక హోదా కోసం ప్రజలలో భావోద్వేగాలు పతాకస్థాయిలో ఉన్న ప్రస్తుత సమయంలో బీజేపీపైనే జనాగ్రహం ఉండాలనేది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. తాను చివరి నిమిషం వరకు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని, కేంద్రమే ఈ మొక్కుబడి ప్రకటన చేసిందని ప్రచారం చేయించి తప్పుకోవాలనేది చంద్రబాబు పథకంగా కనిపిస్తోంది. అయితే ప్రత్యేక హోదా లేదని ప్రకటించడానికే కేంద్రమంత్రులు పరిమితమయ్యారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. విభజనచట్టంలోని హామీలనే ప్రస్తావించారు.. అరుణ్‌జైట్లీ, వెంకయ్య చెప్పిన అంశాలలో కొత్తవి ఏవీ లేవని, అన్నీ విభజన చట్టంలో ప్రస్తావించినవేనని విశ్లేషకులంటున్నారు. ఆ హామీలకు దేనికెంత అవుతుందో తెలుపుతూ వాటి గురించి వెబ్సైట్లో పెట్టబోతున్నామని జైట్లీ చెప్పారు.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేయాలంటే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు మనకు కేంద్రం నుంచి రావలసి ఉంటుందని అంచనా. ప్రత్యేక హోదా కన్నా కేంద్రం ప్రకటించబోతున్న ప్యాకేజీయే మెరుగైనదంటూ.. రెండింటినీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయమన్నట్లుగా ప్రచారం సాగించారు. కానీ విభజన చట్టంలోని హామీలన్నిటినీ అమలు చేస్తూనే ప్రత్యేక హోదా ఇస్తామన్నది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట. అవే హామీలతో తెలుగుదేశం, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరీ ఓట్లడిగాయి. ఇపుడు అదే వాగ్దానానికి ఆరెండు పార్టీలు తిలోదకాలిచ్చేశాయి. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలను దేనితోనూ పోల్చలేమని నిపుణులంటున్నారు. ప్రత్యేకహోదాతో వచ్చే పన్ను రాయితీల వల్ల వచ్చే పరిశ్రమల సంఖ్యను, ఉపాథి అవకాశాల సంఖ్యను అస్సలు అంచనా వేయలేమని పరిశ్రమాధిపతులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సహజవనరుల విస్తృతి దృష్ట్యా ప్రత్యేకహోదా ఉంటే అనతికాలంలోనే రాష్ర్టం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని వారంటున్నారు. విభజన చట్టంలోని హామీలకే నిధులు అంచనా వేసి వాటినే ప్యాకేజీగా ప్రకటిస్తే రాష్ట్రానికి అదనంగా వచ్చే ప్రయోజనమేమీ లేదని వారు పేర్కొంటున్నారు. ‘అంతకుమించి’ సాధించాలిగా.. కలసి పోటీ చేసిన బీజేపీ, తెలుగుదేశం ఎన్నికల ప్రచారసభల్లో ప్రత్యేక హోదాపై ఊదరగొట్టాయి. కేంద్రంలోనూ, రాష్ర్టంలోనూ అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత హోదాను గాలికొదిలేశాయి. ప్రత్యేక హోదా అనేది పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి లభించిన హక్కు. కానీ చంద్రబాబు నాయుడు ఏనాడూ అందుకోసం కేంద్రంపై వత్తిడి చేసిన పాపాన పోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి కాశ్మీర్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్రానికి రూ.70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. బీహార్ పర్యటనలో ఆ రాష్ట్రానికి రూ. 1.65లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. కేంద్రంలో బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీ ఏమన్నా సాధించారా అంటే లేదు. ప్రధాని తలచుకుంటే అది అసాధ్యం కాదు కదా? కానీ మనకు ఇప్పటి వరకు అలాంటి అదనపు ప్రయోజనమేమీ లభించలేదు. విభజన చట్టం హామీలు మన హక్కు. ప్రత్యేక హోదా మనకు పార్లమెంటు సాక్షిగా లభించిన హామీ. అలా కాకుండా ప్రత్యేక హోదాకు మంగళం పాడేసి అంతకన్నా మెరుగైనదంటూ విభజన చట్టంలోని హామీలకు ప్యాకేజీ ముసుగేసి ప్రకటించడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లు కాదా? ఎన్నో నాటకాలు.. అంతా వంచన.. గడచిన రెండున్నరేళ్లలో ఎన్నో నాటకాలు.. ఎన్నో మోసాలు.. అంతా వంచన. ప్రజల కళ్లకు గంతలు కట్టి మరీ చంద్రబాబు కుట్రలు సాగించారు. అవినీతి కుంభకోణాలు, ఓటుకు కోట్లు కేసు ముఖ్యమంత్రి నోరు మెదపనీయకుండా చేశాయి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం పాదాక్రాంతం చేశారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా 15 ఏళ్లు తీసుకొస్తామన్న చంద్రబాబు ఎన్నికలు ముగిసి పీఠం ఎక్కగానే ప్లేటు ఫిరాయించారు. హోదాపై వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేశారు. హోదా ఏమన్నా సంజీవనా? అని హాస్యాస్పదంగా మాట్లాడారు. కేంద్రం హోదా ఇస్తానంటే వద్దంటానా అంటూ కోడలు మగబిడ్డను కంటానంటే ఏ అత్త అన్నా వద్దంటుందా అని వ్యాఖ్యానించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం ఒరిగింది అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదాతోనే అభివృద్ధి చెందదు అన్నారు. హోదాయే సరిపోదు అన్నారు. చివరకు ప్రత్యేక హోదా విషయంలో ఐదుకోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచుతూ అలుపెరుగని పోరాటం సాగిస్తుంటే చంద్రబాబు రకరకాలుగా విమర్శించారు. ప్రత్యేక హోదాపై ప్రజలలో భావోద్వేగాలు పెరగ్గానే మళ్లీ మాటమార్చారు. హోదా మనకు జీవన్మరణ సమస్య అని వ్యాఖ్యానించారు. హోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టారు. అరుణ్‌జైట్లీ ప్రత్యేకహోదా సాధ్యంకాదని రాజ్యసభలో వ్యాఖ్యానించినపుడు ‘నా రక్తం మరిగిపోయింది’ అని చంద్రబాబు హూంకరించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ.1.53 లక్షల కోట్లు ఇచ్చిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించగా ఎక్కడిచ్చారు? అంటూ కేంద్రాన్ని ఢీకొంటున్నట్లు పోజు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరపాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించగానే చంద్రబాబు రక్తం చల్లబడిపోయింది. మరోమారు కేంద్రం పాదాల ముందు మోకరిల్లారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు కలర్ ఇచ్చారు. సుజనాచౌదరిని పురమాయించి జైట్లీతోనూ, వెంకయ్యతోనూ, అమిత్‌షాతోనూ ప్రత్యేక హోదాపై చర్చించడం కోసం పురమాయించినట్లు ప్రచారం చేయించుకున్నారు. వాస్తవానికి ప్యాకేజీపై ఓ ప్రకటన చేసి ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని వేడుకున్నట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక హోదాను సమాధి చేసేసి హోదా కన్నా ఈ ప్యాకేజీయే మెరుగైనదన్న ప్రచారం జోరుగా సాగించేందుకు కేంద్రంతో చేతులు కలిపిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేశారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.