న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లను రక్షించేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను విస్మరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె ప్రధాని మోదీకి రాసిన లేఖలో హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన ఈ రంగం కోసం రూ.లక్ష కోట్ల వేతన ప్యాకేజీని అందించాలి. అంతే మొత్తంతో సమానమైన రుణహామీ నిధిని ఏర్పాటు చేయాలి. పరిశ్రమలను ఆదుకునేందుకు రోజంతా పనిచేసే హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలి’అని అందులో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment