MSME sector
-
చిన్న సంస్థల కోసం యాక్సిస్ బ్యాంక్ నియో
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన ‘నియో ఫర్ బిజినెస్’ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంను ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఆవిష్కరించింది. బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్యాంకింగ్ లావాదేవీలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. డిజిటల్ సెల్ఫ్ ఆన్–బోర్డింగ్, బల్క్ పేమెంట్స్, జీఎస్టీకి అనుగుణమైన ఇన్వాయిసింగ్, పేమెంట్ గేట్‌వే అనుసంధానం మొదలైన ఫీచర్స్ ఇందులో ఉంటాయని బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గంభీర్ తెలిపారు. ప్రస్తుతమున్న తమ కరెంట్ అకౌంట్ ఖాతాదారులు మొబైల్ యాప్ రూపంలో, వెబ్ ఆధారిత డిజిటల్ రిజి్రస్టేషన్ ద్వారా దీన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రస్తుతానికి సోల్ ప్రొప్రైటర్íÙప్ సంస్థలు, వ్యక్తులకు ఇది అందుబాటులో ఉంటుందని.. త్వరలోనే కంపెనీలు, పార్ట్నర్íÙప్స్, ఎల్ఎల్పీలకు కూడా విస్తరిస్తామని గంభీర్ వివరించారు. -
ఉపాధిలో ‘ఎంఎస్ఎంఈ’ల రికార్డు
సాక్షి, అమరావతి: ఉపాధి కల్పనలో రాష్ట్రంలోని సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) రికార్డు సృష్టిస్తున్నాయి. 2023–24లో ఎంఎస్ఎంఈల ద్వారా కనీసం 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా కేవలం ఐదు నెలల్లోనే లక్ష్యానికి చేరువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా 7,01,975 మంది స్థానికులు కొత్తగా ఉపాధి పొందినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ పోర్టల్ ‘ఉద్యం’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు నాటికే 93 శాతం లక్ష్యాన్ని సాధించడంతో గతేడాది తరహాలోనే రెండు రెట్లు అధికంగా ఉపాధి కల్పించే అవకాశాలున్నట్లు ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. 2022–23లో ఎంఎస్ఎంఈల ద్వారా 1,56,252 మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా ఏకంగా 231 శాతం అదనంగా 3,61,172 మందికి ఉపాధి కల్పించిన సంగతి తెలిసిందే. లక్ష్యాన్ని దాటేసిన తొమ్మిది జిల్లాలు ఎంఎస్ఎంఈ రంగంలో ఉపాధి కల్పనకు పరిశ్రమల శాఖ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించగా తొమ్మిది జిల్లాలు ఇప్పటికే లక్ష్యాన్ని దాటేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిత్తూరు, ఏలూరు, శ్రీసత్యసాయి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలు ఐదు నెలల్లోనే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించాయి. చిత్తూరు జిల్లా లక్ష్యం కంటే ఇప్పటికే 317 శాతం, ఏలూరు 187 శాతం, శ్రీసత్యసాయి 151 శాతం సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ‘ఉద్యం’ పోర్టల్‌లో కనీసం 1.50 లక్షల ఎంఎస్ఎంఈలను నమోదు చేయాలని నిర్దేశించుకోగా ఐదు నెలల్లోనే 97,378 యూనిట్లు కొత్తగా ఏర్పాటైనట్లు అధికారులు వెల్లడించారు. ఐదు జిల్లాలు 80 శాతానికిపైగా లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నాయి. కొత్త యూనిట్ల ఏర్పాటు లక్ష్యంలో ఏలూరు 91 శాతం, పశి్చమ గోదావరి 84 శాతం, ప్రకాశం 81 శాతం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 80 శాతం, కర్నూలు 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. -
ప్రపంచంతో పోటీ పడేలా ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దాలన్న ఏపీ సీఎం వైఎస్ జగన్..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎంఎస్ఎంఈలపై త్రిముఖ సూత్రం
సాక్షి, అమరావతి: అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ దేశాలకు ఎగుమతులు చేసే విధంగా డిమాండ్, టెక్నాలజీ, మార్కెటింగ్ లాంటి మూడు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టి ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు కేవలం స్థానిక మార్కెట్లపైనే ఆధారపడకుండా ఎంఎన్‌సీలతో (బహుళ జాతి కంపెనీలు) అనుసంధానిస్తే మెరుగైన మార్కెటింగ్ ఫలితాలు ఉంటాయని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రంగాల వారీగా సమీక్షించారు. ఎంఎస్ఎంఈలను మరింత ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. డిగ్రీలకు తోడు నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందుబాటులోకి తేవాలన్నారు. రూ.3,39,959 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది దఫాలు ఎస్ఐపీబీ సమావేశాలను నిర్వహించిం 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. వీటిద్వారా రూ.3,39,959 కోట్ల పెట్టుబడులు రానుండగా 2,34,378 మందికి ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు చేసుకోగా ఇప్పటికే రూ.2,739 కోట్ల విలువైన 13 ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. వీటిద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలు కానున్నాయి. 2024 జనవరిలోపు 38 కంపెనీలు, మార్చి లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భాగస్వామ్య సదస్సుల్లో 1,739 ఎంవోయూల ద్వారా రూ. 18,87,058 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోగా 10 శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్నారు. విశాఖ ఖ్యాతిని పెంచేలా ఐటీ హబ్ ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు విశాఖను హబ్‌గా తీర్చిదిద్దేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రముఖ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. దీనివల్ల విశాఖ నగర ఖ్యాతి పెరిగి ఐటీకి చిరునామాగా మారుతుందన్నారు. గత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.44,963 కోట్ల విలువైన 88 ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే 85 శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడం / ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జీఐఎస్‌లో కుదిరిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.38,573 కోట్లు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. రూ.8.85 లక్షల కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకోగా 8 ఎస్ఐపీబీ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. మరో నాలుగు ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానుండగా మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విశాఖ సదస్సు కంటే ముందు 20 విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదరగా 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరో 11 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి ద్వారా రూ.8.85 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,29,650 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తెచ్చేలా కృషి చేయాలని సీఎం ఆదేశించారు. డిమాండ్‌లో తరచూ తీవ్ర వ్యత్యాసం ఉండే టమాటా, ఉల్లి లాంటి పంటల విషయంలో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు. నాలుగేళ్లలో వృద్ధి బాగుంది – స్థిర ధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 5.36 శాతం. ఇది దేశ సగటు 6.5 శాతం కన్నా తక్కువ – గత నాలుగేళ్లలో మాత్రం రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది ట – 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43 శాతానికి పెరిగింది – 2022–23లో జీఎస్డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉంది. – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న ఏపీ – జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం వాటా దాదాపు రూ.13 లక్షల కోట్లు. పారిశ్రామికరంగం వాటా 21 నుంచి 23 శాతానికి పెరుగుదల. – 2022 జనవరి – డిసెంబరు మధ్య రాష్ట్రానికి రూ.45,217 కోట్ల పెట్టుబడుల రాక. – 2022–23లో రాష్ట్రం నుంచి రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి. – 2021–22లో ఎగుమతుల విలువ రూ.1.43 లక్షల కోట్లు కాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ. రూ.1.6 లక్షల కోట్లకు పెరుగుదల. -
చిన్నవైనా.. మిన్నగానే! మరింత అండగా నిలిచేలా నూతన పారిశ్రామిక విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా 2023 – 27 నూతన పారిశ్రామిక విధానంలో పలు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం లాంటి పథకాల ద్వారా ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో మరింత అండగా నిలిచేలా పాలసీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కొత్తగా ఏర్పాటయ్యే ఎంఎస్ఎంఈలతో పాటు ఇప్పటికే ఏర్పాటైన యూనిట్లకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణం ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక వసతులను కల్పించనున్నారు. ఏపీఐఐసీ అభివృద్ధి చేసే నూతన పారిశ్రామిక పార్కుల్లో 33 శాతం భూమిని ఎంఎస్ఎంఈలకు కేటాయించనున్నారు. ఇందులో కూడా తక్షణం కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ప్లగ్ అండ్ ప్లే, స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీ స్పేస్‌లను ఈ రంగ యూనిట్ల కోసం ఏర్పాటు చేయనున్నారు. భూ కేటాయింపుల్లో 16.2 శాతం ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు, 6 శాతం ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక పార్కుల్లో రిజర్వేషన్లు కల్పించింది. ప్రైవేట్ రంగంలో పార్కుల అభివృద్ధి ప్రైవేట్ రంగంలో ఎంఎస్ఎంఈ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. కనీసం 25 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు లేదా కనీసం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో డిజైన్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను నిర్మించే సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. వీటి నిర్మాణ వ్యయంలో 25 శాతం లేదా గరిష్టంగా రూ.కోటిని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం కోసం సేకరించిన భూమికి సంబంధించి 100 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు, భూ వినియోగ మార్పిడికి సంబంధించి 100 శాతం నాలా చార్జీలకు మినహాయింపు లభిస్తుంది. టర్మ్ రుణాల వడ్డీపై 3 శాతం వడ్డీ రాయితీ చెల్లింపు గరిష్టంగా మూడేళ్లపాటు కోటి రూపాయలు లభించనుంది. పార్కుల్లో ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు ఆధారంగా ఈ రాయితీలు చెల్లించనున్నారు. పార్కుల్లో 50 శాతం ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైతే 50 శాతం రాయితీలు, 100 శాతం పూర్తయిన తర్వాత మిగిలిన రాయితీలు చెల్లిస్తారు. పాతవాటికి చేయూత ఇప్పటికే ఏర్పాటైన ఎంఎస్ఎంల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ కష్టాల్లో ఉన్న సంస్థలకు చేయూతనందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను తెస్తోంది. ఎంఎస్ఎంఈల ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఆన్లైన్ ఫ్లాటఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎస్టీ డేటాబేస్ ఆధారంగా ఎంఎస్ఎంఈల టర్నోవర్‌ను పర్యవేక్షిస్తూ ఒకవేళ తగ్గితే అందుకు కారణాలను అధికారులు పరిశీలిస్తారు. కోలుకునేందుకు సూచనలు చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంపై చర్చిస్తారు. ఇందుకు ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా ఒక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పోటీ వాతావరణాన్ని తట్టుకుని వ్యయాలను తగ్గించుకోవడం, అప్‌గ్రెడేషన్ దిశగా ప్రోత్సహించేలా పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. అద్భుతమైన పాలసీ: దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం ఎంఎస్ఎంఈ, స్టార్టప్, మౌలిక రంగ పరిశ్రమలకు అద్భుతమైన పాలసీ అని దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్ ప్రశంసించారు. స్టార్టప్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, విశాఖలో స్టార్టప్ మిషన్ ఏర్పాటుకు ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాకేజింగ్ పరిశ్రమలు, ట్రక్ పార్కింగ్ వ్యవస్థల ఏర్పాటుతో రాష్ట్రంలో లాజిస్టిక్ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని రంగాలను అభివృద్ధి చేసేలా పాలసీ ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌కు దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఇలా ఆదుకున్నారు.. ఎంఎస్ఎంఈ రంగానికి తోడ్పాటునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ యూనిట్ల సంఖ్య 1.10 లక్షలు కాగా గత మూడున్నరేళ్లలో కొత్తగా 1.56 లక్షల యూనిట్లు ఏర్పాటు కావడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో ఒక్కో ఎంఎస్ఎంఈ యూనిట్ సగటున 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. కొత్త యూనిట్ల ద్వారా సుమారు 10.04 లక్షల మందికి ఉపాధి లభించడమే కాకుండా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా గత సర్కారు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెల్లించడమే కాకుండా ఏ సంవత్సరం రాయితీలను అదే ఏడాది చెల్లిస్తోంది. రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను ఈ ప్రభుత్వం చెల్లించింది. అంతేకాకుండా వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం ద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్లు రాయితీలను విడుదల చేసింది. -
ఆదాయంలో ఎంఎస్ఎంఈలో జోరు
ముంబై: కరోనా మహమ్మారి ముందుస్థాయికి సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు(ఎంఎస్ఎంఈలు) నెమ్మదిగా చేరుకుంటున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో దాదాపు అన్ని సంస్థలూ 2020 స్థాయి ఆదాయాన్ని సాధించగలవని అంచనా వేసింది. అయితే అప్పటి మార్జిన్లను సగానికిపైగా కంపెనీలు అందుకోలేకపోవచ్చని అభిప్రాయపడింది. విలువరీత్యా 43 శాతం సంస్థలు కరోనా ముందు ఏడాది స్థాయిలో లాభదాయకతను సాధించలేకపోవచ్చని తెలియజేసింది. పెరిగిన కొన్ని కమోడిటీ ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయలేకపోవడం, రూపాయి క్షీణత వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వివరించింది. ఎంఎస్ఎంఈ రంగంలోని 69 రంగాలు, 67 క్లస్టర్లు ఆధారంగా క్రిసిల్ నివేదికను రూపొందించింది. ఉమ్మడిగా వీటి ఆదాయం రూ. 56 లక్షల కోట్లుకాగా.. జీడీపీలో 20–25 శాతం వాటాకు సమానమని క్రిసిల్ తెలియజేసింది. నివేదిక ప్రకారం.. బౌన్స్‌బ్యాక్ ఆదాయాన్ని పరిగణిస్తే ఈ ఏడాది మొత్త ఎంఎస్ఎంఈ రంగం కరోనా ముందుస్థాయితో పోలిస్తే 1.27 రెట్లు వృద్ధిని సాధించే అవకాశముంది. అయితే విలువరీత్యా 43 శాతం కంపెనీలు 2020 స్థాయి నిర్వహణ మార్జిన్లు అందుకోలేకపోవచ్చు. వీటిలో 30 శాతం కెమికల్స్, పాలు, డెయిరీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలుకాగా.. చమురు, పాల ధరలు ప్రభావం చూపనున్నాయి. మిగిలిన 13 శాతంలో ఫార్మా(బల్క్ డ్రగ్స్), జెమ్స్ అండ్ జ్యువెలరీ నుంచి నమోదుకానున్నాయి. రూపాయి పతనం మార్జిన్లను దెబ్బతీయనుంది. మహమ్మారికి ముందు డాలరుతో మారకంలో రూపాయి విలువ 70.9కాగా.. 2022 అక్టోబర్‌లో 82.3కు జారింది. ఇక ముడిచమురు ధరలు సైతం 2020లో బ్యారల్‌కు సగటున 61 డాలర్లుకాగా.. ఏప్రిల్– అక్టోబర్ మధ్య 104 డాలర్లకు చేరింది. చమురు, చమురు డెరివేటివ్స్‌ను కెమికల్స్, డైలు, పిగ్మెంట్స్, రోడ్ల నిర్మాణం తదితర రంగాలలో వినియోగించే సంగతి తెలిసిందే. దీంతో కెమికల్స్, రోడ్ల నిర్మాణం రంగంలో 2.5–3 శాతం మార్జిన్లు నీరసించే వీలుంది. పాలు, డెయిరీ తదితరాలలో ఈ ప్రభావం 0.5–1 శాతానికి పరి మితం కావచ్చు. చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
కరోనాతో పారిశ్రామిక రంగం కుదేలు
-
చిన్న పరిశ్రమలతో లక్షలాది ఉద్యోగాలు.. ఎంఎస్ఎంఈలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) నిరుద్యోగులకు వరం. వీటి ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్నిస్తోంది. వీటి ద్వారా లక్షలాది ఉద్యోగాలతోపాటు భారీగా పెట్టుబడులూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలకు భారీగా ప్రోత్సాహకాలనిస్తున్నారు. కోవిడ్ సంక్షోభంలో కూడా ఈ పరిశ్రమలు నిలదొక్కుకొనేందుకు వివిధ రకాల ప్రోత్సాహకాలతో ఆదుకున్నారు. చదవండి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ దీంతో ఈ రంగం రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతోంది. 2019 జూన్ నుంచి 2022 సెపె్టంబర్ మధ్య మూడేళ్లలో 1,06,249 ఎంఎస్ఎంఈ యూనిట్లు కొత్తగా ఏర్పాటుకాగా, వీటి ద్వారా 7,22,092 మందికి ఉపాధి లభించింది. రూ.14,656 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన ఎంఎస్ఈ పోర్టల్ ‘ఉదయం’ కూడా ఈ వివరాలను పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 2,32,998 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉండగా అందులో 45.6 శాతం ఈ మూడేళ్లలో వచ్చినవే. ఈ మొత్తం ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 19,41,974 మందికి ఉపాధి లభిస్తుండగా అందులో 7.22 లక్షల మందికి ఈ మూడేళ్లలో లభించినవే. ఎంఎస్ఎంఈ రంగంలో ప్రతి కోటి రూపాయల పెట్టుబడి మీద సగటున 61 మందికి ఉపాధి లభిస్తోంది. ప్రతి యూనిట్ సగటున 8 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుండటంతో యూనిట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ వంటి కష్ట కాలంలో రీస్టార్ట్ ప్యాకేజ్ రూపంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడమే కాకుండా వరుసగా ప్రతి ఏడాదీ రాయితీలను ఇవ్వడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో కలిపి అన్ని పరిశ్రమలకు రూ.3,409.66 కోట్ల పారిశ్రామిక బకాయిలు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని బాగా దెబ్బతీసింది. ఇటువంటి సమయంలో ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లతో పాటు ప్రస్తుత కాలానికి రూ.362.48 కోట్ల ప్రోత్సాహకాలు కలిపి మొత్తం రూ.1,324.53 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. వరుసగా మూడో ఏడాది మరో రూ.738.59 కోట్లు విలువైన ప్రోత్సాహక రాయితీలను చెల్లించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రతి జిల్లాలో రెండు క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 53 క్లస్టర్లను గుర్తించి, 16 క్లస్టర్లకు డీపీఆర్‌లను సిద్ధం చేసింది. ఈ 16 క్లస్టర్ల ద్వారా మరో 28,270 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ విక్రయానికి అవకాశం రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు తయారు చేసిన ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకునేలా వీటిని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) ప్రవేశపెట్టిన ఎంఎస్ఎంఈ మార్ట్‌తో అనుసంధానం చేశాం. ఎంఎస్ఎంఈలకు సులభంగా రుణాలిచ్చేలా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదన దగ్గర నుంచి విక్రయం వరకు అన్ని విధాలుగా చేయూతనిస్తున్నాం. – వంకా రవీంద్రనాథ్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ -
చిన్న సంస్థల ఎగుమతులకు ప్రభుత్వ సహకారం
న్యూఢిల్లీ: చిన్న వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలు మరిన్ని ఎగుమతులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగం తన సామర్థ్యం మేరకు ఎగుమతులు చేసేందుకు నూతన విధానాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ‘ఉద్యమి భారత్’ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ, ఎంఎస్ఎంఈ రంగానికి పలు చర్యలను ప్రకటించారు. భారత దేశ ఎగుమతులు పెరిగేందుకు, మరిన్ని మార్కెట్లకు భారత ఉత్పత్తులు చేరుకునేందుకు ఎంఎస్ఎంఈ రంగం బలంగా ఉండడం అవసరమని చెప్పారు. ‘‘మీ సామర్థ్యాలు, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త విధానాలను రూపొందిస్తోంది. ఇవన్నీ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం, వాటి నాణ్యతను పెంచడం కోసమే. భారత ఎంఎస్ఎంఈల ఎగుమతులు పెంచాలి. ఈ దిశగా పనిచేయాలని విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు చెప్పాం. భారత మిషన్స్.. వాణిజ్యం, టెక్నాలజీ, టూరిజం అనే మూడు అంశాల ఆధారంగా పనిచేస్తుంది’’అని ప్రధాని వివరించారు. రుణాలకు సమస్యలు.. గ్యారంటీలు లేకుండా రుణాలు పొందలేని విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇది సంస్థలను స్థాపించాలని భావించే బలహీన వర్గాల ఆకాంక్షలకు అతిపెద్ద అవరోధంగా పేర్కొన్నారు. అందుకనే తాము ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. దీని కింద ప్రతి భారతీయుడు సులభంగా వ్యాపారం ప్రారంభించొచ్చన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే రూ.19 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలా రుణ సాయాన్ని పొందిన వారి నుంచి ఏడు కోట్ల మంది మొదటిసారి వ్యాపారులుగా మారినట్టు వివరించారు. ముద్రాయోజన కింద 36 కోట్ల రుణ ఖాతాలను మంజూరు చేయగా, అందులో 70% మహిళలకు ఇచ్చినవే ఉన్నాయని చెప్పారు. ఎంఎస్ఎంఈల పనితీరును పెంచే పథకం ‘ఆర్‌ఏఎంపీ’, మొదటిసారి ఎగుమతి చేసే ఎంఎస్ఎంఈల సామర్థ్య నిర్మాణం కోసం ‘సీబీఎఫ్‌టీఈ’ పథకాలను ప్రధాని ప్రారంభించారు. -
ఈ ఏడాది 21,500 ఎంఎస్ఎంఈలు
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటంతో ఈ ఏడాది సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా 2022–23లో కొత్తగా 21,500 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యూనిట్ల ద్వారా రూ.13,368 కోట్ల పెట్టుబడులతోపాటు 2,53,690 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా లక్ష ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2021–22లో 15,000 యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రూ.7,500 కోట్ల పెట్టుబడులు, 1.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. కోవిడ్, ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం వంటి కారణాలతో 2021–22లో కొత్తగా 10,613 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.2,632 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడంతోపాటు 66,310 మందికి ఉపాధి లభించింది. దీంతో 2021–22 సంబంధించి మిగిలిన లక్ష్యాన్ని కూడా ఏడాదిలో పూర్తి చేసే విధంగా ఎంఎస్ఎంఈ 2022–23 యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రతి బుధవారం ఎంఎస్ఎంఈ డే జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా పలు కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం జిల్లాల్లో ప్రతి బుధవారం ఎంఎస్ఎంఈ డేగా ప్రకటించడంతోపాటు ప్రతి నెలా పరిశ్రమలను అనుసంధానం చేసేలా సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఏడాదిలో 624 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహించనుంది. అలాగే కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి గైడెన్స్ ఇవ్వడానికి 2,600 ప్రాజెక్టు రిపోర్టులను రూపొందింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి మంగళవారం 20కిపైగా పారిశ్రామిక సంఘాలతో రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్చువల్ సమావేశం నిర్వహిస్తోంది. -
తగ్గిన ఎంఎస్ఎంఈ ఎన్పీఏలు
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో ఒక్కసారిగా పెరిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈల) నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. లాక్డౌన్ తర్వాత రాష్ట్రంలో రికార్డుస్థాయికి చేరిన ఎంఎస్ఎంఈల నిరర్థక ఆస్తుల విలువ పరిస్థితులు చక్కబడటంతో క్రమేపీ దిగివస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల ఎంఎస్ఎంఈ ఖాతాలను పరిశీలిస్తే 2020 సెప్టెంబర్ నాటికి రూ.4,098 కోట్లుగా ఉన్న నిరర్థక ఆస్తుల విలువ 2021 సెప్టెంబర్ నాటికి రూ.7,005 కోట్లకు చేరాయి. ఆ తర్వాత నుంచి కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుండటంతో క్రమేపీ ఎంఎస్ఎంఈల నిరర్థక ఆస్తులు తగ్గుముఖం పట్టాయి. గత ఆరునెలల్లో ఈ రంగానికి చెందిన ఎన్పీఏలు రూ.1,002 కోట్లు తగ్గాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.7,005 కోట్లుగా ఉన్న ఎన్పీఏల విలువలీ ఏడాది మార్చి నాటికి రూ.5,982 కోట్లకు తగ్గింది. మార్చి నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు 17,19,611 రుణ ఖాతాలను కలిగి ఉండగా మొత్తం రుణవిలువ రూ.69,361 కోట్లుగా ఉంది. గత ఆరునెలల్లో బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు రూ.1,05,028 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేయగా ఇదే సమయంలో రూ.1,002 కోట్ల ఎన్పీఏలు తగ్గినట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ నాటికి మొత్తం రుణాల్లో ఎన్పీఏల వాటా 10.54 శాతంగా ఉంటే అది మార్చి నాటికి 8.62 శాతానికి తగ్గింది. ఎంఎస్ఎంఈల వృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారిస్తుండటంతో రానున్న కాలంలో వీటి నిరర్థక ఆస్తుల విలువ మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు. -
Andhra Pradesh: రీస్టార్ట్‌తో నవోదయం
సాక్షి, అమరావతి: చిన్న పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో రాష్ట్రంలో రెండేళ్లలోనే దాదాపు 23 వేల కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటినుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. పలు రాయితీలు, ఆర్థిక తోడ్పాటు కల్పిస్తూ కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. రీస్టార్ట్... బకాయిల చెల్లింపు కోవిడ్ కష్ట కాలంలో రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ.. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు మూత పడకూడదన్న ఉద్దేశంతో సీఎం జగన్ దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ సత్ఫలితాలనిస్తోంది. గత సర్కారు పెట్టిన పారిశ్రామిక బకాయిలను సైతం ఒకేసారి చెల్లించి పరిశ్రమలు నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టారు. దీంతో పాత యూనిట్లు ఊపిరి పీల్చుకున్నాయి. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడటంతో కొత్త యూనిట్లు భారీగా ఏర్పాటవుతున్నాయి. కోవిడ్ ఉధృతిలోనూ... 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా 22,844 సూక్ష్మ, చిన్న మధ్య తరహా యూనిట్లు కొత్తగా ఏర్పాటు కావడం గమనార్హం. వీటి ద్వారా రూ.7,015.48 కోట్ల పెట్టుబడులు రాగా 1,56,296 మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పారిశ్రామిక రంగంలో ఎంత విశ్వాసాన్ని కల్పించాయంటే కోవిడ్ మహమ్మారి గరిష్ట స్థాయిలో ఉన్న సమయం (2020 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్) మధ్య కొత్తగా 2,364 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. కోవిడ్ సమయంలో కూడా రూ.1,753.86 కోట్ల పెట్టుబడులతో 24,043 మందికి ఎంఎస్ఎంఈలు ఉపాధి కల్పించాయి. ప్రభుత్వం ఇలా ఆదుకుంది... ► కోవిడ్ విపత్తు సమయంలో పరిశ్రమలను ఆదుకుంటూ 2020 మేలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1,110 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజిని ప్రకటించారు. దీనివల్ల 7,718 యూనిట్లు నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగించగలిగాయి. ► గత రెండేళ్లలో 13,844 ఎంఎస్ఎంఈ యూనిట్లకు రూ.2,086 కోట్ల పారిశ్రామిక రాయితీలను ప్రభుత్వం విడుదల చేసింది. ► ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలు ఇచ్చింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్లు రాయితీలిచ్చింది. ► రుణాలు తిరిగి చెల్లించలేక ఎన్పీఏలుగా మారిన 1,08,292 యూనిట్లకు సంబంధించి రూ.3,236.52 కోట్ల విలువైన మూలధన రుణాలను వైఎస్సార్ నవోదయం పథకం కింద పునర్వ్యవస్థీకరించింది. ► కోవిడ్ సమయంలో అదనపు మూలధనం సమకూర్చుకునేందుకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ఈసీఎల్జీఎస్) ద్వారా రూ.5,973 కోట్ల రుణాలను అదనంగా ఎంఎస్ఎంఈలకు అందించింది. దీంతో పరిశ్రమలకు నూతనోత్తేజం లభించింది. పాతవి ఉత్పత్తిని కొనసాగిస్తుండగా కొత్తవి పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. లాక్డౌన్లో ఆదుకుంది లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు నిలిచిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా ప్రోత్సాహకాలను విడుదల చేసి పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద అందిన రూ.75 లక్షలతో రుణాలను సకాలంలో చెల్లించడంతోపాటు ఉత్పత్తి కొనసాగించడడానికి తగిన నగదు సమకూరింది. దీంతో లాక్డౌన్లో కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ కార్మికులకు జీతాలు చెల్లించగలిగాం. మళ్లీ ఉత్పత్తి కొనసాగించాం. కామాక్షి మెటల్ బిల్డింగ్ ప్రోడక్ట్స్, కొండ గుంటూరు, తూర్పు గోదావరి రీస్టార్ట్‌తో కొండంత ఉపశమనం కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అమ్మకం పన్ను రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఒకేసారి రూ.1.04 కోట్లు చెల్లించారు. ఇది మాకు కొండంత ఉపశమనాన్ని కలిగించింది. ఈ మొత్తంతో బ్యాంకు రుణాలను చెల్లించడంతో పాటు ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించగలిగాం. మళ్లీ పరిశ్రమను నడపగలుగుతున్నాం. దాల్మియా లామినేటర్స్ లిమిటెడ్, తడ, నెల్లూరు -
రాష్ట్రంలో 26 ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను బలోపేతం చేయడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ తెలిపారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా 26 ఉత్పత్తులను గుర్తించి అన్ని సౌకర్యాలు ఒకేచోట లభించే విధంగా క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని గవర్నమెంట్ ప్రెస్ ఆవరణలో ఉన్న ఎంఎస్ఎంఈ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించారు. అంతకు ముందు డైరెక్టర్లుగా నియమితులైన ఎన్.రఘునాథ్ రెడ్డి, ఎస్.ఆనందపార్థసారథి, నల్ల బేబీజానకి, భీమవరపు విజయలక్ష్మి, తలారి అంజనీ, గోపర్తి వరలక్ష్మి, కస్గిరెడ్డి శారద, షేక్ కరీముల్లా, మేడా వెంకటబద్రీనారాయణ, శీలమే నదియా, ముదడ్ల గౌరీశంకర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ జగయ్య పేటలో ఆభరణాల క్లస్టర్, కాకినాడలో ప్రింటింగ్, తూర్పుగోదావరి జిల్లా మాచవరంలో పప్పుదిను సులు, రాజమండ్రిలో ఫర్నిచర్, నెల్లూరులో రెడీ మేడ్ దుస్తుల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. 2023 నాటికి అన్ని అసెంబ్లీ నియోజ కవర్గాల్లో 50 నుంచి 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్పొరేషన్ సీఈవో ఆర్.పవనమూర్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
గ్రామీణ పరిశ్రమలకు ఏపీ సర్కారు ఊతం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 5 వేలకు పైగా జనాభా గల గ్రామాల్లో విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా కొత్తగా త్రీ ఫేజ్ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది జూలైలోగా పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా.. అవసరమైతే కొంత గడువు పొడిగించి సంబంధిత గ్రామాలన్నిటిలోనూ విద్యుత్ లైన్లు వేయాలని డిస్కంలు భావిస్తున్నాయి. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రోత్సాహమిస్తున్నారు. చదవండి: పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు మొదలైన కొత్త లైన్ల ఏర్పాటు వ్యవసాయోత్పత్తులకు మంచి ధర కల్పించేలా ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం తర్వాత ఈ రంగం అతిపెద్ద ఉపాధి వనరుగా మారడంతో మెరుగైన ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం దీనికి ప్రాధాన్యతనిస్తోంది. ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను నిర్వహించే రైతులకు తక్కువ ధరకే విద్యుత్ అందిస్తారు. ఇందుకు అనుగుణంగా గ్రామీణ కుటీర పరిశ్రమలకు కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం వ్యవసాయ బోర్లకు 3 ఫేజ్ విద్యుత్‌ను 9 గంటల పాటు అందిస్తున్నారు. మిగతా సర్వీసులకు సింగిల్ ఫేజ్ ఇస్తున్నారు. అయితే కుటీర పరిశ్రమలు, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లకు ప్రత్యేకంగా త్రీ ఫేజ్ లైన్లు వేయాల్సి వస్తోంది. దీనికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగా అవుతోంది. పైగా యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు డిస్కంలు కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నాయి. 33/11 కేవీ సబ్ స్టేషన్ నుంచి గ్రామాలకు 11 కేవీ విద్యుత్ లైన్లు, అల్యూమినియం కండక్టర్లు, 110 కేవీ ట్రాన్స్ఫార్మర్లతో నేరుగా లైన్లు వేస్తున్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలో 123 గ్రామాలు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 123 గ్రామాలను సర్వే ద్వారా గుర్తించాం. వీటిలో 3 ఫేజ్ విద్యుత్ లైన్లు వేసేందుకు రూ.44 కోట్లు వెచ్చిస్తున్నాం. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్ సీపీడీసీఎల్ పరిధిలో రూ.60 కోట్లతో.. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) పరిధిలోని విజయవాడలో 31, సీఆర్డీఏ పరిధిలో 10, గుంటూరు జిల్లాలో 30, ప్రకాశం జిల్లాలో 34 గ్రామాలను గుర్తించాం. ఈ 105 గ్రామాల్లో రూ.60 కోట్లతో లైన్లు వేస్తున్నాం. – జె.పద్మాజనార్ధనరెడ్డి, సీఎండీ, సీపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ పరిధిలోనూ కొత్త లైన్లు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) పరిధిలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని 112 గ్రామాల్లో త్రీ ఫేజ్ విద్యుత్ లైన్లు వేయాలని నిర్ణయించాం. ఇప్పటికే 32 గ్రామాలకు లైన్లు వేశాం. 80 గ్రామాలకు పనులు జరుగుతున్నాయి. ఈ మొత్తం పనులకు రూ.65.19 కోట్లు ఖర్చవుతోంది. – హెచ్.హరనాథరావు, సీఎండీ, ఎస్పీడీసీఎల్ -
ఎంఎస్ఎంఈలకు కేంద్రం భరోసా
న్యూఢిల్లీ: రుణ ఒత్తిళ్లలో ఉన్న సూక్ష్మ, లఘు, చిన్న మధ్య(ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలకు మద్దతుగా రుణ హామీ పథకాన్ని(సీజీఎస్ఎస్డీ) 2022 మార్చి 31వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. 2020 జూన్ 1వ తేదీన ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. అదే ఏడాది జూన్ 24న అమల్లోకి తీసుకువచ్చింది. కాగా ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ప్రముఖ ఖాదీ ఇండియా షోరూమ్ అమ్మకాలు గాంధీ జయంతి సందర్బంగా రూ.1.02 కోట్లుగా నమోదయినట్లు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ మరో ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఫేస్‌బుక్‌కు మరో షాక్..! ఈ సారి రష్యా రూపంలో..!) ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న పలు విజ్ఞప్తుల నేపథ్యంలో ఇటీవల ఖాదీ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా పేర్కొన్నారు. ఈ పథకం కింద రుణాల పంపిణీ గడువును కూడా 2022 జూన్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. 2021 సెప్టెంబరు 24 వరకు ఈ పథకం కింద రూ.2.86 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఇందులో ఇచ్చిన రుణ హమీల్లో 85 శాతం వరకు ఎంఎస్‌ఎమ్‌ఈలకే మంజూరు చేశారు. -
ఎంఎస్ఎంఈలు కోలుకుంటేనే గ్రామీణ ఉపాధికి జోరు
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు.. కరోనా మహమ్మారి దెబ్బ నుంచి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కోలుకోవాల్సి ఉంటుందని దేశంలోని మెజారిటీ కంపెనీలు (57 శాతం) అభిప్రాయపడుతున్నాయి. జీనియస్ కన్సల్టెంట్స్ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. ‘గ్రామీణ నిరుద్యోగం ఒక్కసారిగా ఎందుకు పెరిగింది?’ అనే పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా దెబ్బతినడం అన్ని రంగాలపైనా ప్రభావం పడేలా చేసిందని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగం ఎక్కువ ప్రభావాన్ని చూస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెద్దగా లేకపోవడమే నిరుద్యోగం పెరిగేందుకు కారణమని ఈ సంస్థ సర్వేలో ఎక్కువ మంది చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 10 మధ్య 1,100 కంపెనీల అధిపతుల అభిప్రాయాలను సమీకరించింది. గ్రామీణ నిరుద్యోగం పెరగడానికి లాక్డౌన్ ఆంక్షలు కారణమని 14.3 శాతం మంది చెప్పగా.. కరోనా కేసులు పెరగడం కారణమని మరో 14.3 శాతం మంది పేర్కొన్నారు. మిగిలిన వారు ఈ కారణాలన్నీ నిరుద్యోగం పెరగడానికి దారితీసినట్టు చెప్పారు. -
ఎంఎస్ఎంఈల్లో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల్లో ఇంధన పొదుపుపై ప్రభుత్వం దృష్టిసారించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లోని ఎంపిక చేసిన క్టస్టర్లలో ఇంధన సామర్థ్య సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కేంద్ర విద్యుత్‌శాఖకు లేఖ రాశారు. ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో పర్యావరణంపై తక్కువ ప్రభావం ఉండాలనే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్స్ (ఐఎన్డీసీ) లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సాంకేతికతను వినియోగించటం ద్వారా పరిశ్రమల్లో ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోగలమని తెలిపారు. తద్వారా ఇంధనాన్ని పొదుపు చేస్తూ, కాలుష్యాన్ని నియంత్రించటంతోపాటు అధిక ఉత్పాదకతను సాధించగలుగుతామని వివరించారు. తొలిదశలో మత్స్య, రిఫాక్టరీ, ఫౌండ్రీ క్లస్టర్లలో.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సహకారంతో రాష్ట్రంలోని కొన్ని భారీ పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం పాట్ (పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్)ను విజయవంతంగా అమలు చేస్తోంది. దీనిద్వారా ఇప్పటివరకు 3,430 మిలియన్ యూనిట్లకు సమానమైన 0.295 ఎంటీవోఈ (మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్)ని ఆదాచేసింది. దీని విలువ సుమారు రూ.2,350 కోట్లు. ఇంధన పొదుపునకు ఎంఎస్ఎంఈ రంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం)తో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని 3 ఎంఎస్ఎంఈ యూనిట్లలో (మత్స్య, ఫౌండ్రీ, రిఫాక్టరీల్లో) అధ్యయనం నిర్వహించింది. ఎంఎస్ఎంఈ సెక్టారులో ఇంధనాన్ని పొదుపు చేసేందుకు, నూతన సాంకేతికత మెరుగుదలకు పెద్ద ఎత్తున అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. దీంతో తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్య, రిఫాక్టరీ, ఫౌండ్రీ క్లస్టర్లలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని బీఈఈ ద్వారా అందించాలని కేంద్రాన్ని కోరింది. రూ.2,014 కోట్ల విద్యుత్ ఆదా రాష్ట్రంలో ఏడాదికి సరాసరి 67,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండు ఉండగా.. ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంధన పరిరక్షణ చర్యల ద్వారా 20 నుంచి 25 శాతం వరకు విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉంది. ఎల్ఈడీ వీధిలైట్లు, వ్యవసాయ, పరిశ్రమల రంగాల్లో అమలు చేసిన ఇంధన సామర్థ్య కార్యక్రమాలు తదితరాల వల్ల ప్రాథమిక అంచనా ప్రకారం 2,932 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. దీనివిలువ రూ.2,014 కోట్ల వరకు ఉంటుంది. మరిన్ని ఇంధన సామర్థ్య చర్యలు చేపట్టడం వల్ల మరో 14 వేల మిలియన్ యూనిట్లను ఆదా చేసేందుకు అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 35 శాతం పారిశ్రామిక రంగంలోనే వినియోగం అవుతోంది. – ఎన్.శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి -
ఫేస్బుక్ లోన్లు.. హైదరాబాదీలకు అవకాశం
Small Business Loan Initiative: చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ఫేస్బుక్ ముందుకు వచ్చింది. వీరికి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఆగస్టు 20 నుంచి ఈ లోన్లు ఇస్తామని ఫేస్బుక్ ఇండియా ప్రకటించింది. స్మాల్ బిజినెస్ లోన్ స్టార్టప్ కంపెనీగా ప్రారంభమై ఈ రోజు అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది ఫేస్బుక్. లక్షల కోట్ల రూపాయల సంపద ఈ రోజు ఫేస్బుక్ సొంతం. దీంతో తనలాగే ఎదుగుతోన్న స్టార్టప్‌లు చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పేరుతో గతేడాది 100 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్‌లో ఉన్న సంస్థలకు సాయం చేయాలని నిర్ణయించింది. ఇండియాఫై ద్వారా స్మాల్ బిజినెల్ లోన్ పథకం అమలు చేసేందుకు ఇండిఫై సంస్థతో ఫేస్బుక్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఇండిఫై సంస్థ చిరు వ్యాపారులకు లోన్లు అందించే సంస్థగా పని చేస్తోంది. ఫేస్బుక్ స్మాల్బిజినెస్ లోన్లు పొందాలనుకునేవారు ఇండియాఫై ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో కూడా స్మాల్ బిజినెస్ లోన్ పథకంలో భాగంగా ఇండియాకు 4 మిలియన్ డాలర్లు కేటాయించింది. వీటితో దేశంలో ఉన్న 200 పట్టణాల్లోని చిరు, మధ్యతరహా వ్యాపారులకు లోన్లు ఇవ్వనున్నారు. కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు లోన్లు ఇస్తారు. తొలివిడతగా ఆగస్టు 20వ తేది నుంచి ఈ పథకాన్ని హైదరాబాద్, న్యూఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరులలో అమలు చేయనున్నారు. కనీసం మూడు వేల మందికి అయినా లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ వడ్డీ ఫేస్బుక్లో ప్రకటనలు ఇవ్వడానికి వస్తున్న అనేక స్టార్టప్ కంపెనీలు పెట్టుబడి దొరక్క ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించాం. అందుకే వారికి అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పథకానికి శ్రీకారం చుట్టినట్టు ఫేస్బుక్ ఇండియా, వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మోహన్ అన్నారు. స్మాల్బిజినెస్ ద్వారా ఇచ్చే లోన్‌కి నామమాత్రపు వడ్డీ తీసుకుంటామన్నారు. ఇక మహిళా వ్యాపారులకయితే వడ్డీలో అదనంగా 0.20 శాతం రాయితీతో రుణాలు ఇస్తామన్నారు. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం..హైదరాబాద్‌లోనే -
లఘు, చిన్న పరిశ్రమలకు చేయూత
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిధులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డానికి ఉద్దేశించిన ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లుకు పార్లమెంటు గురువారం ఆమోదముద్ర వేసింది. జూలై 26న బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించగా, తాజాగా రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం వల్ల ఎంఎస్ఎంఈ రంగానికి వర్కింగ్ క్యాపిటల్ లభ్యత కొంత సులభతరం అవుతుంది. ప్రభుత్వం రంగ సంస్థలుసహా తమకు బకాయిలు చెల్లించాల్సిన కంపెనీల నుంచి ఎంఎస్ఎంఈలు త్వరిత గతిన వసూళ్లును చేయగలుగుతాయి. తమకు రావాల్సిన మొత్తాలను మూడవ పార్టీకి విక్రయించి తక్షణ నిధులు పొందడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. చిన్న పరిశ్రమలు వర్కింగ్ క్యాపిటల్ విషయంలో ఎటువంటి ఇబ్బందీ ఎదుర్కొనకుండా తాజా బిల్లు ఆమోదం దోహదపడుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బిల్లు ఆమోదం చర్చ సందర్భంగా పేర్కొన్నారు. యూకే సిన్హా కమిటీ చేసిన పలు సిఫారసులను ఈ బిల్లులో చేర్చారు. 2020 సెప్టెంబర్‌లో బిల్లును తీసుకువచ్చారు. అనంతరం హౌస్ స్థాయి సంఘానికి రిఫర్ చేశారు. -
దివాలా సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) దివాలా ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రవేశపెట్టిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్‌ప్సీ కోడ్ (సవరణ) బిల్లు, 2021ను లోక్‌సభ ఎటువంటి చర్చా లేకుండా బుధవారం ఆమోదించింది. రుణ చెల్లింపుల వైఫల్య పరిమితి రూ.కోటికి లోబడి ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. పెగాసస్‌పై సభ్యుల తీవ్ర ఆందోళనల నడుమ కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ దివాలా చట్ట సవరణ బిల్లును సభ ఆమోదం నిమిత్తం ప్రవేశపెట్టారు. మహమ్మారి ప్రేరిత సవాళ్లను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఊరట కలిగిస్తూ, ఏప్రిల్ 4న తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తాజా బిల్లును తీసుకువచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. రూ.కోటి లోపు రుణ వైఫల్యం జరిగిన ఎంఎస్ఎంఈ దివాలా పక్రియను తాజా బిల్లు సులభతరం చేస్తుంది. తమ రుణాలను పునర్ వ్యవస్థీకరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. -
పెగాసస్ అంశంపై చర్చకు విపక్షాల పట్టు
-
మరో 2 ఎంఎస్ఎంఈ క్లస్టర్లు
సాక్షి, అమరావతి: అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాజమహేంద్రవరంలో ఫర్నిచర్, నెల్లూరులో గార్మెంట్ క్లస్టర్ ఏర్పాటుకు ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తూ చిన్న పరిశ్రమలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఈ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈవో పవనమూర్తి ‘సాక్షి’కి వెల్లడించారు. సుమారు రూ.14.98 కోట్లతో రాజమహేంద్రవరం వద్ద ఫర్నిచర్ క్లస్టర్, నెల్లూరు వద్ద రూ.8.23 కోట్లతో గార్మెంట్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. క్లస్టర్ అభివృద్ధికి ముందుకొచ్చిన సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ 10 % పెట్టుబడి పెడితే కేంద్రం 70 %, రాష్ట్రం 20 % నిధులను కేటాయిస్తుందన్నారు. వేలాది మందికి ఉపాధి రాజమహేంద్రవరం క్లస్టర్ పరిధిలో ఫర్నిచర్, డిజైనింగ్‌కు సంబంధించి 160 యూనిట్ల ద్వారా ఏటా రూ.60 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అంచనా వేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రెండేళ్లలో వ్యాపార పరిమాణాన్ని రూ.90 కోట్లకు పెంచడంతో పాటు అదనంగా 1,000 మంది వరకు ప్రత్యక్షంగా, 4,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. సాధారణంగా ఒక చెట్టును కొట్టిన తర్వాత కలపను ఎండబెట్టి ఫర్నిచర్‌గా మార్చేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈ క్లస్టర్లో వుడ్ సీజనింగ్ మిషన్ టెక్నాలజీ అందుబాటులోకి తేవడం ద్వారా కలపను ఆరబెట్టడం ద్వారా వెంటనే ఫర్నిచర్ తయారీకి వినియోగించవచ్చు. అలాగే క్వాడ్‌కామ్ టెక్నాలజీతో కావాల్సిన డిజైన్లను వేగంగా తీర్చిదిద్దడంతో పాటు బొమ్మలు తయారీకి శాండింగ్, మౌల్డింగ్ టెక్నాలజీలను అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల ఎంఎస్ఎంఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరగడం ద్వారా లాభాలు 20 – 25 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. రెండేళ్లలో ఈ క్లస్టర్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కనీసం నాలుగు నుంచి ఐదు ఎగుమతి ఆధారిత యూనిట్లను ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పవనమూర్తి తెలిపారు. రెడీమేడ్ క్లస్టర్‌తో మహిళలకు ఉపాధి నెల్లూరు జిల్లాలో పలువురు మహిళలు దీర్ఘకాలంగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి మెరుగైన ఆదాయం లభించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు నెల్లూరు జిల్లా మహిళా ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ రెడేమేడ్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. ఎంబ్రాయిడరీ, జాబ్ వర్క్, రెడీమేడ్ గార్మెంట్‌కు సంబంధించి అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. మల్టీ కలర్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ, 5/6 థ్రెడ్ వర్కింగ్, కంప్యూటరైజ్డ్ డిజైనింగ్‌లతోపాటు వీటిపై శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ ట్రైనింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా గార్మెంట్ వ్యాపారం రూ.25 కోట్లు ఉండగా ఈ క్లస్టర్ రాకతో ఈ పరిమాణం రూ.40 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ క్లస్టర్ ద్వారా నేరుగా 1,500 మందికి, పరోక్షంగా 5,500 మందికి ఉపాధి లభించనుందని అంచనా. కనీసం ఐదు ఎగుమతి ఆథారిత కంపెనీలు వస్తాయని కార్పొరేషన్ అంచనా వేసింది. ఇవి కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ప్రింటింగ్/ జీడిపప్పు క్లస్టర్ అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పవనమూర్తి తెలిపారు. -
ఇక చిన్న సంస్థలకూ రేటింగ్స్
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) పనితీరుకు సంబంధించి ఫైనాన్షియల్ రేటింగ్స్ ఇచ్చే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రాథమిక స్థాయిలో ఉన్న చిన్న సంస్థల రుణ పరపతి విషయంలో బ్యాంకులు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. దీని రూపకల్పనకు తగు సూచనలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను కోరారు. ఎంఎస్ఎంఈల కోసం ఇండియన్ బ్యాంక్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. వార్షిక టర్నోవరు, వస్తు..సేవల పన్ను రికార్డులు, ఆదాయపు పన్ను రికార్డులు, ఎగుమతులు, లాభదాయకత తదితర అంశాల ఆధారంగా రేటింగ్స్ వ్యవస్థ ఉండగలదని ఆయన పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలకు అవసరమైన ప్రభుత్వ సర్వీసులన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా ఎంఎస్ఎంఈ శాఖ ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని గడ్కరీ చెప్పారు. వివిధ రకాల ఇంధనాలతో నడవగలిగే ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వాహనాలు త్వరలో రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఇథనాల్ ఆధారిత ’ఫ్లెక్స్ ఇంజిన్ల’ తయారీకి సంబంధించి వచ్చే 3 నెలల్లో స్కీము ప్రకటించనున్నట్లు మంత్రి చెప్పారు. -
World Bank: ఎంఎస్ఎంఈలకు బంపర్ బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో భారీగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్) రంగానికి ప్రపంచ బ్యాంకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఈ రంగం పునరుజ్జీవం కోసం 500 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. భారతదేశం దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కీలక వెన్నెముకలాంటి ఎంఎస్ఎంఇ రంగం కోవిడ్ -19 మహమ్మారి తీవ్రంగా దెబ్బతిందని ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. ఇది తిరిగి పుంజుకునేందుకు సంబంధించిన ప్రయత్నాలనువ్తమ మద్దతును మ రింత ముమ్మరం చేస్తుందని, తద్వారా దీర్ఘకాలిక ఉత్పాదకత-ఆధారిత వృద్ధికి, ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాల ఉత్పత్తికి పునాదులు వేస్తున్నామని ఆయన అన్నారు. కోవిడ్-19 మహమ్మారి ద్వారా తీవ్రంగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ ల యొక్క తక్షణ ద్రవ్యత, క్రెడిట్ అవసరాల కోసం దీన్ని వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రదానంగా 555,000 ఎంఎస్ఎంఈల పనితీరు మెరుగుదలను లక్ష్యంగా పెట్టుకుంది. పోస్ట్-కోవిడ్ రెసిలెన్స్ అండ్ రికవరీ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ 3.4 బిలియన్ల డాలర్లలో 15.5 బిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్‌ను సమీకరించాలని భావిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇందులో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు, హరిత పెట్టుబడులు మహిళల నేతృత్వంలోని వ్యాపారాలు ప్రయోజనం పొందడాన్ని ప్రోత్సహిస్తుందని, ప్రైవేటు రంగాలతో సేవా ప్రదాతలుగా అధిక స్థాయికి చేరుకోవడానికి భాగస్వామ్యాన్ని పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ర్యాంప్ కార్యక్రమం ఐదు "ఫస్ట్ మూవర్" రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. తదుపరి ఇతర రాష్ట్రాలుకూడా చేరే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి : నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్ 5 నిమిషాల మాక్ డ్రిల్: 22 మంది ప్రాణాలు గాల్లో! -
ఆర్బీఐ ఆదేశాలు వెంటనే అమలు చేయండి
ముంబై: మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రకటించిన చర్యలను వేగవంతంగా అమలు చేయాలని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలను బుధవారం ఆదేశించారు. అలాగే ఒడిదుడుకులను తట్టుకునేలా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపైనా దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్బీఐ ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా సవాళ్లు, రుణ లభ్యతపై చర్చ ప్రకటన ప్రకారం, దేశ ప్రస్తుత ద్రవ్య– ఆర్థిక పరిస్థితులు, చిన్న రుణ గ్రహీతలు అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)సహా వివిధ రంగాలకు రుణ లభ్యత, కోవిడ్ రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాలు వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చాయి. ద్రవ్య పరపతి విధాన నిర్ణయ ఫలాల బదలాయింపు, కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపైనా చర్చ జరిగింది. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో బ్యాంకులు పోషిస్తున్న క్రియాశీల పాత్రను తన ప్రారంభోపన్యాసంలో గవర్నర్ ప్రశంసించారు. డిప్యూటీ గవర్నర్లు ఎంకే జైన్, ఎం రాజేశ్వరరావు, మైఖేల్ డీ పాత్ర, టీ రవి శంకర్ తదితర సీనియర్ ఆర్బీఐ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనే క్రమంలో మే నెల మొదటి వారంలో ఆర్బీఐ పలు చర్యలను ప్రకటించిన నేపథ్యంలో తాజా సమావేశం జరిగింది. వ్యక్తులు, చిన్న సంస్థలకు రుణాల పునరుద్ధరణ, రుణ పునర్వ్యవస్థీకరణ, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50,000 కోట్లు, టీకాల తయారీ, ఆస్పత్రులు, ల్యాబ్‌లకు రుణాలు, రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ నిబంధనలు సరళతరం, రూ.35వేల కోట్లతో జీ–సెక్‌ల కొనుగోలు వంటి పలు చర్యలు వీటిలో ఉన్నాయి. -
ఆర్బీఐ రుణ చికిత్స!
ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు మరింత సమయం ఇచ్చింది. రుణాలను రెండేళ్ల కాలానికి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. టీకాల తయారీ సంస్థలు, ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు, కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్య రంగం కింద రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతించింది. ఇందు కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.50,000 కోట్ల లిక్విడిటీని(నిధుల లభ్యత) అందించనుంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు పొందేందుకు ఉద్దేశించిన నిబంధనలను వచ్చే సెప్టెంబర్ 30వరకు సడలించింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమం(జీ–సాప్) కింద 2 వారాల్లో రూ.35,000 కోట్లకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఆర్బీఐ మధ్యంతర నిర్ణయాలను ఆయన బుధవారం ప్రకటించారు. మారటోరియం కాదు.. రుణ పునరుద్ధరణే వాస్తవానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు ఒక్క విడత రుణ మారటోరియంను మూడు నెలలకు కల్పించాలని ఆర్బీఐని ఇటీవలే కోరాయి. కానీ, ఒక్క విడత రుణ పునరుద్ధరణకు.. అది కూడా రూ.25 కోట్ల వరకు రుణాలకే అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయించింది. గతేడాది రుణ మారటోరియం ముగిసిన తర్వాత రుణాల పునరుద్ధరణ అవకాశాన్ని వినియోగించుకోని వాటికే ప్రస్తుతం ఈ సదుపాయం రెండేళ్ల కాలానికి లభిస్తుంది. 2021 మార్చి వరకు స్టాండర్డ్ ఖాతాలుగా (సక్రమంగా చెల్లింపులు చేస్తున్న) ఉన్న వాటికి ఈ వెసులుబాటు పరిమితం. 90 శాతం రుణ గ్రహీతలు ఇందుకు అర్హత సాధిస్తారని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంచనా. రూ.50,000 కోట్ల సాయం.. ఆరోగ్య సేవలు, సదుపాయాల రంగంలో ఉన్న కంపెనీలకు రూ.50,000 కోట్లతో ఆన్‌ట్యాప్ లిక్విడిటీ విండోను ఆర్బీఐ ప్రకటించింది. కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం దీనికింద లభిస్తుంది. రెపో రేటుపై, మూడేళ్ల కాల వ్యవధికి రుణాలు అందిస్తామని.. ఈ విండో 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని శక్తికాంతదాస్ చెప్పారు. బ్యాంకులు ఈ పథకం కింద టీకాల తయారీ కంపెనీలు, టీకాల దిగుమతి దారులు, సరఫరాదారులు, వైద్య పరికరాలు, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, పాథాలజీ ల్యాబ్‌లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల తయారీదారులు, సరఫరాదారులు, కరోనా సంబంధిత ఔషధ దిగుమతిదారులు, లాజిస్టిక్స్ సంస్థలకు తాజా రుణాలను మంజూరు చేయవచ్చు. వీటిని ప్రాధాన్య రంగ రుణాలుగా ఆర్బీఐ పరిగణిస్తుంది. ఈ పథకం కింద మంజూరు చేసే రుణాలతో ప్రత్యేక పుస్తకాన్ని బ్యాంకులు నిర్వహించొచ్చు. బ్యాంకులు తమ దగ్గర మిగులుగా ఉన్న నిధులను కరోనా రుణ పుస్తక పరిమాణం స్థాయిలో ఆర్బీఐ వద్ద ఉంచడం ద్వారా.. రెపో రేటు కంటే 0.25% తక్కువగా వడ్డీని పొందొచ్చు. రూ.35,000 కోట్లతో జీ–సెక్యూరిటీలు ఈ నెలలోనే రూ.35,000 కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలను (జీ–సెక్‌లు) ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. ఆర్బీఐ గత నెలలోనూ రూ.25,000 కోట్లకు జీ–సెక్లను కొనుగోలు చేయడం గమనార్హం. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్‌ను 6 శాతంలోపునకు తీసుకొచ్చే లక్ష్యంతో, ప్రభుత్వ వృద్ధి కార్యక్రమాలకు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. జీ–సెక్ ఈల్డ్స్ తగ్గితే ప్రభుత్వానికి ఉపశమనం లభించినట్టే. కేవైసీ విషయంలో ఇబ్బంది పెట్టొద్దు బ్యాంకులు, నియంత్రిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు 2020 డిసెంబర్ చివరికి కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) వివరాలను అప్డేట్ చేయని కస్టమర్ల విషయంలో కఠిన చర్యలకు దిగొద్దని ఆర్బీఐ కోరింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు ఈ అవకాశం కల్పించింది. అలాగే, వీడియో కేవైసీకి అనుమతించింది. 250 మందితో క్వారంటైన్ కేంద్రం కరోనా సంక్షోభంలో కీలక కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఆర్బీఐ ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 250 మంది సిబ్బంది ఈ కేంద్రంలోనే ఉంటూ కీలక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు శక్తికాంతదాస్ తెలిపారు. ఎస్‌ఎఫ్‌బీలకు 10వేల కోట్లు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు (ఎస్ఎఫ్బీలు) ప్రత్యేక దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్ విండో (ఎస్‌ఎల్‌టీఆర్‌వో)ను సైతం దాస్ ప్రకటించారు. ‘‘ప్రస్తుత కరోనా తీవ్రతతో ఎక్కువగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతు అందించేందుకు ప్రత్యేకంగా మూడేళ్ల కాల వ్యవధిపై రూ.10,000 కోట్లకు ఎస్‌ఎల్‌టీఆర్‌వో నిర్వహించాలని నిర్ణయించాం. రెపో రేటుకే ఎస్‌ఎఫ్‌బీలకు ఈ నిధులు అందిస్తాం’’ అని దాస్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే, రూ.500 కోట్ల వరకు ఆస్తులు కలిగిన సూక్ష్మ రుణ సంస్థలకు ఎస్ఎఫ్బీలు అందించే రుణాలను ప్రాధాన్యరంగ రుణాలుగా పరిగణిస్తామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. భవిష్యత్తుపై ఎంతో అనిశ్చితి భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి నెలకొందన్నారు దాస్. తాజా సంక్షోభాన్ని ఎదుర్కోగల బలమైన మూలాలపై భారత్ ఉందని అభిప్రాయపడ్డారు. వృద్ధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు అంగీకరించారు. ‘‘భారత్ బలంగా కోలుకునే క్రమంలో సానుకూల వృద్ధిలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ కర్వ్ వంగిన కొన్ని వారాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా కారణంగా ఏర్పడే పరిస్థితులను ఆర్బీఐ అనుక్షణం పరిశీలిస్తూ అవసరం ఏర్పడితే అన్ని రకాల వనరులను, అసాధారణ సాధనాలను ఆచరణలోకి తీసుకొస్తుంది’’ అని శక్తికాంతదాస్ చెప్పారు. సాధారణ నైరుతి రుతుపవనాలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉపశమిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డిమాండ్ తగ్గుదల కొంతే... డిమాండ్‌పై లాక్డౌన్ల ప్రభావం గతేడాదితో పోలిస్తే మోస్తరుగానే ఉంటుందని శక్తికాంతదాస్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తాత్కాలికంగా తగ్గిపోవచ్చని, ముఖ్యంగా రిటైల్, ఆతిథ్య రంగాల్లో ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పారు. మొత్తం మీద కీలక గణాంకాలు మిశ్రమ సంకేతాలను ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సకాలంలో సరైన నిర్ణయాలు ఆర్బీఐ ప్రకటించిన నిర్ణయాలను నిపుణులు, పరిశ్రమ వర్గాలు ఆహ్వానించాయి. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్న క్రమంలో సకాలంలో సరైన నిర్ణయాలను ప్రకటించినట్టు పేర్కొన్నాయి. ఆరోగ్యసంరక్షణ, అనుబంధ రంగాలు పెరిగిన డిమాండ్‌తో, సరఫరా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రూ.50వేల కోట్లతో ఆన్‌టాప్ లిక్విడిటీని ప్రకటించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చేదిగా సీఐఐ పేర్కొంది. ‘చిన్న వ్యాపార సంస్థలు, ఫైనాన్షియల్ సంస్థలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న భారాన్ని ఆర్బీఐ చాలా వరకు గుర్తించింది. వారికి మద్దతుగా చర్యలను ప్రకటించింది. లకి‡్ష్యత వర్గాలను ఉద్దేశించిన చర్యలు ప్రస్తుత తరుణంలో ఎంతో అనుకూలమైనవి’ అని అసోచామ్ వ్యాఖ్యానించింది. పలు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తగ్గించే లక్ష్యంతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అనూహ్యమైన నిర్ణయాలు ప్రకటించారు. ప్రకటించిన చర్యలు వినూత్నంగా ఉన్నాయి. కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు రూ.50,000 కోట్ల ప్రత్యేక నిధి ప్రకటించడం అన్నది ఆర్థిక ఆరోగ్యమే కాదు, ప్రజారోగ్యం ఎదుర్కొంటున్న సమస్యలపైనా దృష్టి పెట్టినట్టుంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ సరైన సమయంలో ప్రకటించిన లిక్విడిటీ చర్యలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు ఉపశమనం కల్పిస్తాయి. వ్యక్తులు, చిన్న పరిశ్రమలకు నిధులు లభించేలా చేస్తాయి. – శక్తి ఏకాంబరం, కోటక్ మహీంద్రా బ్యాంకు గ్రూపు ప్రెసిడెంట్ దిగజారుతున్న పరిస్థితులకు స్పందనగా ఆర్బీఐ.. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రూ.25 కోట్ల వరకు రుణాలను ఒక్కసారి పునరుద్ధరించుకునే అవకాశాన్నిచ్చింది. గతేడాది ఇచ్చిన మారటోరియంతో పోలిస్తే ఈ చర్య చిన్నదే. పునరుద్ధరించుకునే రుణాల పరిమాణం తక్కువగానే ఉంటుంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత దిగజారే అవకాశం ఉందని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి. – మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ -
ఎంఎస్ఎంఈలకు రూ.47,402 కోట్ల రుణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) రూ.47,402.15 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఫోకస్ పత్రంలో అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను పెంచాలని నిర్ణయించిందని ఆ పత్రంలో పేర్కొంది. ఇందులో భాగంగా రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని 86 వేల ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు.. రూ.3,900 కోట్ల రుణాలను వైఎస్సార్ నవోదయం పేరిట వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు నాబార్డు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకుందని.. రైతులకు, ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థికసాయం అందించాలని నాబార్డు సూచించింది. రాష్ట్రంలో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ ఏర్పాటు చేస్తోందని తెలిపింది. 2020–23 రాష్ట్ర పారిశ్రామిక విధానంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని నాబార్డు పేర్కొంది. -
ఆ కారణంగానే కడప స్టీల్ ప్లాంట్ పెండింగ్‌లో పడింది..
సాక్షి, అమరావతి: కడపలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుపై పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లిబర్టీ స్టీల్స్ అనే కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించామని, అయితే ఆ కంపెనీ ఆర్ధిక పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడం వల్ల ఆ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టామని పేర్కొన్నారు. లిబర్టీ స్టీల్స్ కు ఫండింగ్ చేసే సంస్థలు దివాళా తీశాయని, ఆ ప్రభావం లిబర్టీ స్టీల్స్‌పై పడిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న విషయం సహేతకం కాదని భావించి పెండింగ్‌లో పెట్టామని వివరణ ఇచ్చారు. ఈ విషయమై లిబర్టీ స్టీల్స్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, ఎల్-2గా వచ్చిన కంపెనీని పరిగణనలోకి తీసుకోవాలా లేక ప్రభుత్వమే నేరుగా చేపట్టాలా అనే అంశం పరిశీలనలో ఉందని, త్వరలో ఏ నిర్ణయం వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వానికి ప్లాన్-బి అమలు చేసే ఉద్దేశం కూడా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పెద్ద, మధ్య తరహా పరిశ్రమలకు సుమారు రూ. 1000 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ. 300 కోట్ల ప్రొత్సహాకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న ఐటీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, వివిధ సంస్థలకు చెందిన సీఈఓలు, సీఎఫ్ఓలు వర్క్ షాపునకు హాజరు కానున్నారని ఆయన వెల్లడించారు. -
చిన్న పరిశ్రమలతో..పెద్ద ఉపాధి
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్ఎంఈ) కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఎంఎస్ఎంఈ రంగం తక్కువ పెట్టుబడితో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో కలుపుకొని 13.95 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో ఒక్క ఎంఎస్ఎంఈ రంగంలోనే 9,68,448 మంది ఉన్నారు. కోటి రూపాయల పెట్టుబడితో ఎంఎస్ఎంఈ రంగంలో 28 మందికి ఉపాధి లభిస్తుండగా, భారీ ప్రాజెక్టుల్లో అయితే ఒకరికి, పెద్ద పరిశ్రమల్లో నలుగురికి ఉపాధి లభిస్తున్నట్లు సమగ్ర పారిశ్రామిక సర్వే ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, వాటికి కావాల్సిన మానవ వనరులు, ఇతర అవసరాలను తెలుసుకొని తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర పారిశ్రామిక సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 98,327 పరిశ్రమలు ఉండగా అందులో ఇప్పటి వరకు 53,945 యూనిట్లలో పూర్తి వివరాలను సేకరించారు. నెల రోజుల్లో మిగిలినవి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెగా ఇండస్ట్రీస్‌లో విద్యుత్ పరిశ్రమలే అధికం ► రాష్ట్రంలో 98 మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటి ద్వారా రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించింది. ఈ మెగా ఇండస్ట్రీస్‌లో 1,64,755 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీటిలో అత్యధికంగా 47 శాతం విద్యుత్ రంగానికి చెందిన పరిశ్రమలు ఉన్నాయి. బేసిక్ మెటల్స్–అల్లాయిస్ 13 శాతం, ఆటోమొబైల్ కంపెనీలు 7 శాతం ఉన్నాయి. ► మెగా ఇండస్ట్రీస్‌లో ఉపాధి విషయానికి వస్తే 21 శాతంతో బేసిక్ మెటల్స్–అల్లాయిస్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత విద్యుత్ రంగంలో 13 శాతం, బల్క్ డ్రగ్–ఫార్మా 12 శాతం, టెక్స్‌టైల్‌లో 11 శాతం మంది పని చేస్తున్నారు. రాష్ట్రంలో 806 భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.0.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 2,62,307 మంది పని చేస్తున్నారు. పెట్టుబడుల పరంగా బల్క్ డ్రగ్ అండ్ ఫార్మా 14 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, విద్యుత్ 13 శాతం, టెక్స్టైల్.. బేసిక్ మెటల్స్, రసాయనాల రంగాలు 12 శాతం చొప్పున ఉన్నాయి. ► ఎంఎస్ఎంఈ రంగంలో 19 శాతం పెట్టుబడులతో ఆగ్రో–ఫుడ్ ప్రాసెసింగ్, సేవా రంగాలున్నాయి. సేవారంగం అత్యధికంగా 19 శాతం మందికి ఉపాధి కల్పిస్తుంటే ఆగ్రో–ఫుడ్ ప్రాసెసింగ్‌లో 17 శాతం మంది, నిర్మాణ రంగ పరికరాల తయారీలో 11 శాతం మంది ఉన్నారు. 42 శాతం కంపెకనీలు రాయలసీమలోనే ► రాష్ట్రంలో అత్యధికంగా పరిశ్రమలు రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 98,327 పరిశ్రమలు ఉంటే అందులో రాయలసీమ నాలుగు జిల్లాల్లోనే 41,228 యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరున్న అనంతపురంలో అత్యధికంగా 14,273 యూనిట్లు ఉండటం విశేషం. ► ఆ తర్వాతి స్థానాల్లో 13,281 యూనిట్లతో గుంటూరు జిల్లా, 12,160 యూనిట్లతో చిత్తూరు, 10,535 యూనిట్లతో కర్నూలు జిల్లాలు ఉన్నాయి. విజయనగరంలో అత్యల్పంగా 2,530 పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. -
చిన్న పరిశ్రమలకు మరో నెల ‘రుణ’ హామీ
న్యూఢిల్లీ: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించి అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఎమర్జె్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్–ఈసీఎల్జీఎస్) కేంద్రం సోమవారం మరో నెలపాటు పొడిగించింది. ఈ పథకం నవంబర్ 30వ తేదీ వరకూ అమలవుతుంది. నిజానికి అక్టోబర్‌తో ఈ పథకం గడువు ముగిసింది. దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకున్న పరిస్థితుల్లో– మేనెల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ. 20లక్షల కోట్ల విలువైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ (స్వావలంభన భారత్) ప్రకటించారు. ఇందులో భాగంగా చిన్న ఎంఎస్ఎంఈలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం లక్ష్యంగా రూ.3 లక్షల కోట్ల ఈసీఎల్‌జీఎస్‌ను ఆవిష్కరించారు. అక్టోబర్ చివరి వరకూ లేదా రూ.3 లక్షల కోట్ల రుణ మంజూరు అయ్యే వరకూ పథకం అమల్లో ఉండాలన్నది పథకం లక్ష్యం. అయితే నిర్దేశించుకున్న మేరకు రూ.3 లక్షల కోట్ల రుణ మంజూరీలు జరక్కపోవడంతో లాంఛనంగా మరో నెలపాటు పథకం గడువును ఆర్థిక మంత్రిత్వశాఖ పొడిగించింది. వచ్చేది పండుగ సీజన్ కాబట్టి, వ్యవస్థలో డిమాండ్ పుంజుకుంటుందని, అలాంటి పరిస్థితుల్లో ఈ పథకం చిన్న పారిశ్రమలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థికశాఖ తెలిపింది. -
పరిశ్రమల పునరుజ్జీవం కోసమే రీస్టార్ట్
తిరుపతి అన్నమయ్య సర్కిల్: కష్టాల్లో కూరుకుపోయిన పారిశ్రామిక రంగాన్ని పునర్ నిర్మించేందుకు రీస్టార్ట్ ప్యాకేజ్ దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.827కోట్ల ప్రోత్సాహక బకాయిలతో పాటు కొత్తగా రూ.1,168కోట్ల రీస్టార్ట్ ప్యాకేజ్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా రూ.512.35కోట్లు సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బటన్ నొక్కి ప్రారంభించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, జీఎండీ ప్రతాప్‌రెడ్డితో కలసి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూతపడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగానే విడతలవారీగా నిధులు విడుదల చేస్తోందని తెలిపా రు. గత ప్రభుత్వంలో ఈ తరహా పరిశ్రమలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టారన్నారు. జిల్లా వ్యాప్తంగా రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మొదటి విడతలో 944 ఎంఎస్ఎంఈలకు రూ.68 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రెండో విడతలో 854 ఎంఎస్ఎంఈలకు రూ.49.87 కోట్లు కేటాయించారని చెప్పారు. ఇంత మొత్తంలో సాయం చేసిన సీఎంకు రాష్ట్ర వ్యాప్తంగా పారి శ్రామికవేత్తలు కృతజ్ఞతలు తెలపడం అభినందనీయమన్నారు. మూతపడిన పరిశ్రమలను ఆదుకున్నారు మూతపడిన పరిశ్రమలను తిరిగి పట్టాలు ఎక్కించేందుకు ముఖ్యమంత్రి సాయం అందించారు. పరిశ్రమలకు కార్పస్ ఫండ్, మార్కెట్ సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రాణం పోశారు. మేము 2018లో పరిశ్రమలు స్థాపించేటప్పుడు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఇబ్బందులుపడ్డాం. ఇప్పుడు కరోనాతో సంక్షోభంలో పడ్డాం. దేవుడిలా ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. – సురేష్, చక్రి ఇండస్ట్రీస్ అధినేత, పెనుమూరు ఆక్సిజన్ ఇచ్చారు ప్రస్తుతం పరిశ్రమలు దివాలా తీసే పరిస్థితి. గత ప్రభుత్వ బకాయిలను కూడా ప్రస్తుతం విడుదల చేయడం వల్ల ఆక్సిజన్ ఇచ్చినట్లు ఉంది. మా గ్రానైట్ పరిశ్రమపరంగా పెట్టుబడి, విద్యుత్, అమ్మకపు పన్నులు, వడ్డీ అన్ని కలిపి పెండింగ్ ఉన్న రూ.30 లక్షలు విడుదలైంది. – జె.రాధిక, గ్రానైట్ పరిశ్రమ యజమాని గంగాధరనెల్లూరు -
చేయూత.. విశ్వసనీయత
ఎంఎస్ఎంఈ రంగానికి గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రాయితీలను చెల్లిస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మే నెలలో రూ.450 కోట్లు మొదటి విడతగా, ఇవాళ రూ.512.35 కోట్లు రెండో దఫా రీస్టార్ట్ ప్యాకేజీలో ఇస్తున్నాం. చిన్న పరిశ్రమలు బాగుంటేనే రాష్ట్రాభివృద్ధిలో వేగం ఉంటుందని భావించి ఈ ఏడాది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. వచ్చే ఏడాది స్పిన్నింగ్ మిల్లులకు కూడా చేయూత ఇస్తూ.. దాదాపు రూ.1,000 కోట్ల బకాయిలు చెల్లిస్తాం. ప్రభుత్వం మాట మీద నిలబడితేనే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. ఆ దిశగా ప్రభుత్వం పూర్తి చేయూత ఇస్తుంది. పారిశ్రామిక రంగానికి అండగా నిలుస్తుంది. దేవుడి దయ, అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో ఇంకా మంచి పనులు చేయాలని ఆశిస్తున్నా. - వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి విశ్వసనీయతను తీసుకువచ్చి, పారిశ్రామిక వేత్తలు ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందు వచ్చేలా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మాట చెబితే దానిపై నమ్మకం ఏర్పడేలా చేస్తానన్నారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉండటంతో పాటు చేయూత ఇస్తుందని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రాయితీల రూపంలో బకాయి పడిన మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం చెల్లించేందుకు రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించింది. అందులో భాగంగా మే నెలలో తొలి విడతగా రూ.450 కోట్లు చెల్లించింది. రెండో విడతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి రూ.512.35 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలలో ఉన్న లబ్ధిదారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పారిశ్రామికవేత్తలతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమలకు ఊతమిస్తేనే ఉద్యోగాలు, ఉపాధి ► రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగంలో మొత్తం 97,428 యూనిట్లు ఉన్నాయి. ఇందులో 72,531 సూక్ష్మ, 24,252 చిన్న, 645 మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వాటి ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ► చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం తోడుగా ఉంటేనే అవి మనుగడ సాగిస్తాయి. తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి, చివరకు మారుమూల గ్రామాలలో కూడా చిన్న చిన్న పరిశ్రమల ద్వారానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ► ఐటీఐ, డిప్లొమా చదివిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేయూత ► గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రాయితీల రూపంలో రూ.800 కోట్లకు పైగా బకాయి పెట్టంది. అవన్నీ పూర్తిగా తీర్చడంతో పాటు, కోవిడ్–19, లాక్డౌన్ వల్ల ఆ పరిశ్రమలకు వెసులుబాటు కల్పించేందుకు దాదాపు రూ.188 కోట్ల మూడు నెలల విద్యుత్ ఫిక్స్డ్ చార్జీలు మాఫీ చేశాం. ► రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ) ద్వారా రూ.200 కోట్ల వరకు పరిశ్రమలకు రుణాల కోసం వెసులుబాటు కల్పించాం. ఆయా పరిశ్రమలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అతి తక్కువ వడ్డీ (6 నుంచి 8 శాతం)తో వర్కింగ్ క్యాపిటల్‌గా రుణం మంజూరు చేశాం. రుణాల చెల్లింపులపై 6 నెలల మారటోరియమ్‌తో పాటు, మూడేళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించాం. కొనుగోళ్లలోనూ ప్రాధాన్యం ► ప్రభుత్వానికి ఏటా అవసరమైన దాదాపు 360 రకాల వస్తువులు, ఇతర సామగ్రిలో 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచి తీసుకోవాలని నిర్ణయించాం. ► వీటిలో 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన కంపెనీలు, మరో 3 శాతం మహిళలకు చెందిన యూనిట్ల నుంచి సేకరించాలని దిశా నిర్దేశం చేశాం. వీటికి 45 రోజుల్లోనే బిల్లులు చెల్లించాలని ఆదేశించాం. ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా.. ► గత ప్రభుత్వం పరిశ్రమలకు దాదాపు రూ.4 వేల కోట్ల బకాయి పెట్టింది. వాటిని సెక్టార్ వారీగా చెల్లిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ఈ ఏడాది ఎంఎస్ఎంఈలకు సహాయం చేశాం. చిన్న చిన్న పరిశ్రమలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. తద్వారా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే గత ప్రభుత్వ బకాయిలు రూ.827 కోట్లు తీర్చడమే కాకుండా.. మొత్తం రూ.1,168 కోట్లతో కార్యక్రమం చేపట్టాం. ► వచ్చే ఏడాది స్పిన్నింగ్ మిల్లులకు చేయూత ఇస్తాం. వాటికి కూడా దాదాపు రూ.1,000 కోట్లు బకాయిలున్నాయి. వాటిని చెల్లిస్తాం. ఆ విధంగా ఏటా ఒక రంగానికి చేయూతనిస్తాం. ► ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. పీపీఈ కిట్ల ఆవిష్కరణ ఏపీ మెడ్ టెక్ జోన్ (ఏఎంటీజడ్)లో కోవిడ్–19 నివారణ, నియంత్రణ కోసం తయారు చేసిన వ్యక్తిగత భద్రత ఉపకరణాలు (పీపీఈ కిట్లు), ఎన్–95 మాస్కులు, ల్యాబొరేటరీ పరీక్ష ఉపకరణాలను సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఎంఎస్ఎంఈల బాగోగులు జేసీ చూడాలి ఎంఎస్ఎంఈలకు సంబంధించి బాగోగులు చూడ్డానికి ఒక జాయింట్ కలెక్టర్ (జేసీ)కు బాధ్యతలు అప్పగించాలని చెప్పాం. పనుల కోసం అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి పారిశ్రామిక వేత్తలకు ఉండకూడదు. అలా అయితే వారు నిరుత్సాహానికి గురవుతారు. అందుకనే జెసీలు దృష్టి పెట్టేలా జిల్లా కలెక్టర్లు చూడాలి. వారికి చేయూత నిచ్చేలా ఉండాలి. అప్పుడే నలుగురికి ఉద్యోగాలు వస్తాయి. కరోనా కష్టకాలంలో మీరు గట్టెక్కించారు ‘బకాయిలు వస్తాయనుకోలేదు.. చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం చేశారు.. ప్రధానితో చిన్న పరిశ్రమల గురించి మాట్లాడిన తొలి సీఎం మీరే.. కరోనా సంక్షోభంలో దేవుడిలా సాయం అందించారు.. అడగకుండానే ఆదుకున్నారు.. మీ మేలు మరవలేం’ అని రాయితీ బకాయి సొమ్ము పొందిన ఎంఎస్ఎంఈ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి సోమవారం వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గడ్డు పరిస్థితి నుంచి బయట పడుతున్నాం.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మాకు.. మీరు ఇచ్చిన ఇన్సెంటీవ్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. గడ్డు పరిస్థితి నుంచి బయట పడుతున్నాం. తొలి విడత ఇచ్చిన సొమ్మును వర్కింగ్ కేపిటల్, టర్మ్ లోన్‌కు వినియోగించాం. ఇప్పుడు రెండో విడత ఇచ్చిన సొమ్ముతో మరింతగా మేలు జరుగుతుంది. మీరు కేంద్రంతో జరిపిన సంప్రదింపుల వల్లే ప్రస్తుతం సరుకు రవాణా సవ్యంగా సాగుతోంది. మీ చొరవ వల్లే ఉత్పత్తి పెరిగింది. మరింత మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. మీరు బాగుంటే.. కోట్లాది మంది బాగుంటారు. – మామిడి వాసుదేవరావు, బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్, విజయనగరం జిల్లా మాలాంటి వారికి మీరే స్ఫూర్తి కష్టాల నుంచి ఎలా బయటకు రావాలో.. మాలాంటి వారికి మీరే స్ఫూర్తి. పొరుగు రాష్ట్రాల్లో వున్న నా మిత్రులకు కూడా మా సీఎంగారు ఇంత గొప్పగా చేస్తున్నారని గర్వంగా చెబుతున్నాను. నేను 2016లో సొంతగా పరిశ్రమను స్థాపించాను. నాతో పాటు మరో 40 మందికి ఉపాధి కల్పించాను. అయితే పరిశ్రమకు సంబంధించిన ఇన్సెంటివ్స్ను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇక అది రాదనుకున్నాం. మీ చొరవ వల్ల నాకు రూ.20 లక్షలు ఇన్సెంటివ్స్ అందింది. – తేజేష్ రెడ్డి, పీవీసీ పైప్స్, నెల్లూరు జిల్లా ఎక్స్లెంట్ పాలన.. కోవిడ్ సమయంలో ప్రధాన మంత్రితో జరిగిన సమావేశంలో చిన్న పరిశ్రమలను ఆదుకోవాలని మా గురించి మాట్లాడిన తొలి సీఎం మీరే. 2016 నుంచి చిన్న పరిశ్రమలకు గడ్డుగాలం మొదలైంది. ఈఎంఐల కోసం బాగా ఇబ్బంది పడ్డాను. చాలా మంది పరిశ్రమను మూసేయమన్నారు. ఇప్పుడు మీరిస్తున్న ప్రోత్సాహంతో నిలదొక్కుకుంటున్నానని గర్వంగా చెబుతున్నాను. మా వద్ద పని చేసేవారందరికీ మీ వల్ల ఎంతో మేలు జరిగింది. కమిట్ మెంట్, సిన్సియారిటీతో ఎక్స్‌లెంట్‌గా పాలన సాగిస్తున్నారు. – జయకుమారి, శ్రీ వెంకటసాయి పవన్ పాలిమర్స్, అనంతపురం జిల్లా మాట నిలబెట్టుకున్న సీఎం చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండవ విడత ఎంఎస్ఎంఈ బకాయిలను విడుదల చేయడం పట్ల పారిశ్రామికవేత్తలందరికీ ఆనందంగా ఉంది. సీఎంకు కృతజ్ఞతలు. కష్ట కాలంలో గత ప్రభుత్వ బకాయిలు చెల్లించడంతో పాటు పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ఒక జాయింట్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించడాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి వారం సమావేశాలు నిర్వహించడం ద్వారా ఎంఎస్ఎంఈ రంగం వేగంగా విస్తరించే అవకాశముంది. – వాసిరెడ్డి మురళీకృష్ణ, అధ్యక్షులు, ఫ్యాప్సియా -
చిన్న సంస్థలకు పెట్టుబడుల ఊతం
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీలో ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ. 20,000 కోట్ల రుణాలు అందించడం, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ద్వారా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటునివ్వడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. రూ. 20,000 కోట్ల స్కీమ్‌తో 2 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపాదనల ప్రకారం రూ. 10,000 కోట్ల కార్పస్‌తో ఎఫ్‌వోఎఫ్ ఏర్పాటు చేస్తారు. అనుబంధంగా ఉండే చిన్న ఫండ్స్ ద్వారా ఇది ఎంఎస్ఎంఈలకు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటు అందిస్తుందని గడ్కరీ చెప్పారు. చిన్న సంస్థలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యే అవకాశం దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని వివరించారు. ఎంఎస్ఎంఈ నిర్వచనంలో సవరణలు .. ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. మధ్య స్థాయి సంస్థల టర్నోవర్ పరిమితిని గతంలో ప్రకటించిన రూ. 100 కోట్ల స్థాయి నుంచి రూ. 250 కోట్లకు పెంచింది. వీధి వ్యాపారులకు రూ. 10,000 దాకా నిర్వహణ మూలధనం ఇచ్చేందుకు ఉద్దేశించిన ’పీఎం స్వనిధి’ స్కీముకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇది 50 లక్షల మంది చిల్లర వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏడాది వ్యవధి లో నెలవారీ వాయిదాల్లో ఈ రుణమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లింపులు జరిపేవారికి 7% వడ్డీ సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమవుతుంది. ముందస్తుగా చెల్లించినా పెనాల్టీలు ఉండవు. చాంపియన్స్ ప్లాట్‌ఫాం ఆవిష్కరణ.. సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలు సమస్యలను అధిగమించి, జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చేలా champions.gov.in పేరిట టెక్నాలజీ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆర్థికాంశాలు, ముడివస్తువులు, కార్మికులు, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర సమస్యల పరిష్కార వ్యవస్థగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తోడ్పడుతుంది. -
నెవ్వర్ బిఫోర్ సీఎం సార్..
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రీస్టార్ట్ పేరుతో ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటించడం సంతోషంగా ఉందని, నిజానికి దీనిని అస్సలు ఊహించలేదని ఎంఎస్ఎంఈలకు చెందిన పలువురు ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో అన్నారు. గత సర్కారు చెల్లించని బకాయిలు ఇవ్వడంతో పాటు ఆ మొత్తాన్ని నేరుగా ఖాతాల్లో జమచేయడం ఇదే తొలిసారని.. దీని ద్వారా చిన్న యూనిట్లకు ఊపిరిపోశారంటూ వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ ఎంఎస్ఎంఈలకు ఎవ్వరూ ఇలాంటి ప్యాకేజీ ప్రకటించలేదని, క్షేత్రస్థాయిలో అంశాలపై పట్టున్న నాయకుడిగానే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వారు ప్రశంసించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆసరాతో ముందడుగు వేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పలువురు ఎంఎస్ఎంఈల ప్రతినిధులు తెలిపారు. రీస్టార్ట్ ప్యాకేజీని శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ స్పందిస్తూ.. తమ జిల్లాలో 10వేల ఎంఎస్ఎంఈలకు ఈ ప్యాకేజీ వల్ల మేలు జరుగుతుందని, జిల్లాకు రూ.55కోట్లు రానున్నాయన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కేంద్రం కూడా పారిశ్రామిక రంగానికి సహాయం ప్రకటించిందని, దాన్ని ఎలా పొందాలి.. ఇక్కడ ఎలా మేలు చేయాలన్నది కలెక్టర్లు, పరిశ్రమల శాఖ అధికారులు ఆలోచించాలని కోరారు. అనంతరం ఇతర జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్ఎంఈల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రితో పంచుకున్నారు. పరిశ్రమల యజమానులు ఏమన్నారంటే.. చరిత్రలో నిలిచిపోతారు రూ.10 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుచేశాను. ఇందులో 200 మంది పని చేస్తున్నారు. పరోక్షంగా వేయి మంది ఉపాధి పొందుతున్నారు. కానీ, గత ప్రభుత్వ హయాంలో ప్రోత్సాహకాలు రాక, చాలా ఇబ్బంది పడ్డాం. ఈ పరిస్థితుల్లో మాకు ఒకేసారి ప్రోత్సాహక మొత్తంగా రూ.905 కోట్లు విడుదల చేయడం ద్వారా మీరు మా పరిశ్రమల రంగం చరిత్రలో నిలిచిపోతారు. ఆ ప్యాకేజీతో నా పరిశ్రమకే రూ.1.30 కోట్లు వస్తున్నాయి. ఈ విధంగా గతంలో ఎవ్వరూ ప్రకటించలేదు. ప్యాకేజి నిర్ణయం మాకెంతో ధైర్యాన్నిచ్చింది. అదే విధంగా ప్రభుత్వానికి అవసరమైన వస్తువులు, సామాగ్రిలో 25 శాతం మా నుంచి కొనాలన్న నిర్ణయం కూడా మాకు మేలు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు పాత్ర పోషిస్తాం. – డీవీ రాజు, చిన్న పరిశ్రమ యజమాని, విశాఖ జిల్లా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం రూ.1.25 కోట్ల పెట్టుబడితో యూనిట్ పెట్టాను. అందులో 25 మందికి ఉపాధి లభిస్తోంది. మాకు 25 లక్షల రాయితీలు రావాల్సి ఉంది. ఇప్పుడు మీరు ఆ సహాయం చేశారు. అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – లక్ష్మి, గ్రానైట్ కంపెనీ యజమానురాలు, ప్రకాశం జిల్లా ప్యాకేజీతో ఎందరికో మేలు జరుగుతుంది ఆటోనగర్‌లో 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. రెండేళ్లుగా మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కరోనా మరింత దెబ్బ తీసింది. మేం కొన్ని రాయితీలు కోరితే వెంటనే ఆమోదించారు. చాలా సంతోషం. నిజానికి ఊహించలేదు కూడా. మార్కెట్లో ఒకేసారి రూ.905 కోట్లు రావడంవల్ల ఎందరికో మేలు జరుగుతుంది. – బాలాజీ, ఆటోనగర్, విశాఖపట్నం ఇది ఎంతో మంచి నిర్ణయం 2017లో కోటి రూపాయల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుచేశాను. అందులో 20 మంది పనిచేస్తున్నారు. నెలకు 2 లక్షలకు పైగా జీతాలు ఈ కోవిడ్ సమయంలో కూడా ఇస్తున్నాం. మాకు పీవీసీ కంపెనీ కూడా ఉంది. రెండింటికీ కలిపి మొత్తం రూ.33 లక్షల సహాయం అందుతోంది. మాకు విద్యుత్ ఛార్జీలు మాఫీ చేశారు. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ కూడా తక్కువ వడ్డీకి ఇస్తామన్నారు. అది కూడా మాకు ఎంతో అండగా ఉండనుంది. ప్రభుత్వ అవసరాల నిమిత్తం మా నుంచి 25 శాతం ఉత్పత్తులు కొంటామన్నారు. ఇది ఎంతో మంచి నిర్ణయం. – విజయభాస్కర్‌రెడ్డి, వెంకటాచలం, నెల్లూరు జిల్లా ఈ ప్యాకేజీ అమృతంలా ఉంది 2018లో కోటి రూపాయలతో కంపెనీ పెట్టాను. అందులో రూ.74 లక్షల రుణం తీసుకున్నాను. మహిళలకు అవసరమైన బయో శానిటరీ నేప్కిన్స్ తయారుచేస్తున్నాను. 2019 జనవరి నుంచి నెలనెలా రూ.1.60 లక్షల ఈఎంఐ కట్టాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో నాకు యూకే నుంచి రూ.20 లక్షల ఆర్డర్ వచ్చింది. కానీ, పెట్టుబడి లేక వద్దనుకున్నాను. ఇప్పుడు నాకు రూ.26.66 లక్షల రాయితీ.. రూ.11 లక్షల వడ్డీ వస్తుంది. దీంతో ఆర్డర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాకేజీ అమృతంలా నిలుస్తోంది. మీరు ‘నవరత్నాలు’ అమలుచేస్తున్నారు. కానీ, మాకు 10వ రత్నం కూడా ఉంది. అది మీరే. నిజంగా మీరు రత్నం వంటి వారు. – పి.శ్రీలత, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా అందరికీ ఆదర్శంగా నిలిచారు.. రూ.2.30 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టాను. అందులో 25 మంది పనిచేస్తున్నారు. గతంలో మాకు రాయితీ ఎగ్గొట్టారు. మాకు ఇప్పుడు రూ.89 లక్షలు వస్తున్నాయి. అందుకు ఎంతో సంతోషం. కోవిడ్‌తో అతలాకుతలమైనా ఎవ్వరూ తీసుకోని నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలిచారు. అందుకు హ్యాట్సాఫ్. – హరిశ్చంద్రశేఖర్, గ్రానైట్ పరిశ్రమ యజమాని, ప్రకాశం జిల్లా -
పరిశ్రమలకు ప్రాణం
ఎంఎస్ఎంఈల్లో దాదాపు 2.80 లక్షల మంది వలస కార్మికులు పనిచేస్తుండగా, వారు వెళ్లిపోయారు. అదే సమయంలో మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి 1.30 లక్షల మంది వచ్చారు. స్కిల్ గ్యాప్ రాకుండా వారికి శిక్షణ ఇవ్వడంపై అధికారులు దృష్టిపెట్టాలి. గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఎగ్గొట్టిన బకాయిలు రూ.828 కోట్లు. 2014–15లో 43 కోట్లు, 2015–16లో 70 కోట్లు, 2016–17లో 195 కోట్లు, 2017–18లో 207 కోట్లు, 2018–19లో 313 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో బకాయిలు రూ.77 కోట్లు. అన్నీ కలిపి రూ.905 కోట్లు మంజూరు చేశాం. ఇవాళ రూ.450 కోట్లు ఇస్తున్నాం. మిగిలినవి జూన్ 29న ఇస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కరోనా విపత్తు వేళ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఊరట కల్పించారు. వీటికి రూ.1,110 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ప్రోత్సాహకాల్లో తొలి విడతగా రూ.450 కోట్లను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. రెండో విడతగా మిగిలిన బకాయిలను జూన్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల్లోని ఎంఎస్ఎంఈల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎంఎస్ఎంఈలు 10 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయని.. నిరుద్యోగం పెరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ వెల్లడించారు. మూడు నెలలకు సంబంధించి కరెంటు ఫిక్స్డ్ ఛార్జీలు రద్దుచేశామని, తక్కువ వడ్డీపై వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేశామన్నారు. అంతేకాక.. దాదాపు రూ.10 లక్షల వరకు రుణాలను 6–8 శాతం తక్కువ వడ్డీకే ఇస్తామని, ఈ రుణాలపై ఆరు నెలల మారిటోరియమ్ ఉంటుందని కూడా సీఎం వివరించారు. దీంతో.. గత సర్కారు చెల్లించని బకాయిలు ఇవ్వడం, విద్యుత్ ఛార్జీల రద్దు నిర్ణయంపై ఎంఎస్ఎంఈల ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పరిశ్రమల శాఖ రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్న పరిశ్రమల నుంచే 25 శాతం కొనుగోళ్లు ప్రభుత్వానికి అవసరమైన 25 శాతం వస్తువులు, సామాగ్రి మొత్తం 360 రకాలను ఈ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోలు చేయాలి. అందులో కూడా 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎంఎస్ఎంఈలు, 3 శాతం మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలి. వీరికి కచ్చితంగా 45 రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం. మూడో జేసీకి బాధ్యతలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందువల్ల జిల్లాల్లో మూడో జేసీకి వీటి బాధ్యతను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. జిల్లాల్లో ఈ పరిశ్రమల అవసరాలు గుర్తించాలని, యువతలో వృత్తి నైపుణ్యం పెంచడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని కోరాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నాం. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఎంఎస్ఎంఈలను కాపాడుకోవాలి ► రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు దాదాపు 98 వేలు ఉంటే, వాటిలో 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రైవేటు రంగంలో జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ఈ రంగం అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోంది. వాటిని కాపాడుకోలేకపోతే నిరుద్యోగ సమస్యను అధిగమించలేం. ప్రభుత్వం తోడు ఉంటే తప్ప అవి మనుగడ కొనసాగించలేవు. అందుకే వీటిపై శ్రద్ధ పెట్టమని కలెక్టర్లను కోరుతున్నా. లాక్డౌన్ వల్ల ఈ రంగం కుదేలైంది. దీనిని నిలబెట్టుకోకపోతే, సమస్యలు పెరుగుతాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగానికి చెందిన ప్రోత్సాహకాలను పట్టించుకోలేదు. చిన్నచిన్న వారితో పరిశ్రమలు పెట్టించి, వారికి ఏ రకమైన ఆర్థిక సహాయం చేయకపోవడంతో వారు చితికిపోయారు. ఈ అంశాలూ దృష్టిలో పెట్టుకోండి ► ఈ పరిశ్రమలను మీరు (కలెక్టర్లు) మానిటర్ చేసేటప్పుడు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోండి. పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాల్లో స్కిల్ గ్యాప్స్ ఉంటే ఏం చేయవచ్చో ఆలోచించండి. గ్రామ, వార్డు వలంటీర్లను ఉపయోగించుకోండి. ఎవరైనా అర్హులుంటే గుర్తించండి. ► ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నాం. వాటికి కావాల్సిన మ్యాన్‌పవర్, స్కిల్డ్ మ్యాన్‌పవర్‌కు అనుగుణంగా, తగిన ఆలోచన చేయండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో శిక్షణనిచ్చి, పరిశ్రమల అవసరాలు తీర్చాలి. ► చివరగా.. దేవుడి ఆశీస్సులతో పరిశ్రమలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు. అనంతరం కంప్యూటర్లో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ప్రచురించిన సమాచార బ్రోచర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్నితో పాటు, పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకున్నా సరే ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి ఉదారంగా ముందుకొచ్చాం. ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆ రంగం బాధ్యతలను మూడో జేసీకి అప్పగిస్తున్నాం. జిల్లాల్లో పరిశ్రమల అవసరాలు గుర్తించాలి. వృత్తి నైపుణ్యం పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, రాష్ట్రంలో 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. 10లక్షల మందికి మేలు ► కరోనా సమయంలో చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి కాబట్టి వాటికి ఇంకా ఏం చేస్తే అవి తమ కాళ్ల మీద నిలబడతాయో ఆలోచించి.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కరెంటు ఫిక్స్డ్ ఛార్జీలు దాదాపు రూ.188 కోట్లు మాఫీ చేస్తున్నాం. ఆ మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 97,428 పరిశ్రమలు.. వాటిలో పనిచేస్తున్న 10 లక్షల మందికి మేలు జరుగుతుందని మనసా వాచా నమ్ముతున్నాం. ► అలాగే, తక్కువ వడ్డీపై వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేయాలని.. దాదాపు రూ.10 లక్షల వరకు 6–8 శాతం వడ్డీపై రుణాలు ఇవ్వాలని.. ఆరు నెలల మారిటోరియమ్ పీరియడ్ పోనూ, మూడేళ్ల కాలంలో ఆ మొత్తం చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ► కలెక్టర్లు కూడా చొరవ చూపి, ఒక జేసీకి ఎంఎస్ఎంఈల బాధ్యత అప్పగించాలి. ఆయనకు ఇక్కడ మంచి మంత్రితో పాటు మంచి అధికారులు ఉన్నారు. -
22న సీఎం చేతుల మీదుగా
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.904.89 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించనున్నారు. ఇందులో మొదటి విడత మే 22న అందించనున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం తెలిపారు. పారిశ్రామిక బకాయిలతోపాటు రూ.188 కోట్ల విలువైన విద్యుత్ డిమాండ్ చార్జీల రద్దు, రుణ వితరణ కోసం రూ.200 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రయోజనాలు పొందే వారిని గుర్తించి వారికి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇందుకోసం ఆన్లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి రీ స్టార్ట్ ప్యాకేజీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తామని తెలిపారు. విద్యుత్ డిమాండ్ చార్జీల రద్దు, కొత్త రుణాలు కోరుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని, వీటిని పరిశీలించాక ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తామన్నారు. ఈ దరఖాస్తు ఉన్న వారికి విద్యుత్ డిమాండ్ చార్జీలను వెంటనే రీయింబర్స్ చేస్తామన్నారు. ఏపీలోని అన్ని పరిశ్రమలకు ఆధార్ సంఖ్యను ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనివల్ల సెక్టార్ల వారీగా పరిశీలించడానికి, ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుందని, ఈ కార్యక్రమాన్ని 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ పరిశ్రమలను జీఐఎస్ మ్యాపింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని భారీ, పెద్ద పరిశ్రమలతో, బ్యాంకులతో ఎంఎస్ఎంఈలను అనుసంధానం చేస్తామన్నారు. పరిశ్రమ ఆధార్ అంటే.. రాష్ట్రంలోని పరిశ్రమలకు 11 డిజిట్లలో ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ నంబర్ చూడగానే అది ఏ రంగానికి చెందిన పరిశ్రమ, ఏ జిల్లాలో ఉంది అనే వివరాలను సులువుగా గుర్తించవచ్చు. ఈ 11 డిజిట్లలో మొదటి మూడు జిల్లాను, తర్వాత రెండు మండలాన్ని సూచిస్తాయి. ఆ తర్వాత సంఖ్య ఏ రంగానికి చెందిన పరిశ్రమ అనే విషయాన్ని తెలుపుతుంది. చివరి 5 డిజిట్ల సీరియల్ నంబర్ ఉంటుంది. -
తక్షణమే రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ కావాలి
న్యూఢిల్లీ: పరిశ్రమలకు తక్షణమే రూ.15 లక్షల కోట్లు లేదా జీడీపీలో 7.5 శాతానికి సమాన స్థాయిలో ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఐఐ కోరింది. కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావానికి కారణమైనట్టు పేర్కొంది. వైరస్ ప్రభావం మరో 12–18 నెలల (చికిత్స లేదా వ్యాక్సిన్ వచ్చే వరకు) వరకు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో పరిశ్రమలకు, పేదలకు తక్షణమే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల నుంచి కోలుకునేందుకు రెండేళ్లు పడుతుందని పేర్కొంది. ప్రభుత్వ పేపర్లను ఆర్బీఐకి విక్రయించడం ద్వారా రూ.2 లక్షల కోట్లు, సెకండరీ మార్కెట్ నుంచి రూ.2 లక్షల కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడం ద్వారా రూ.4లక్షల కోట్ల మేర సర్దుబాటు చేసుకోవచ్చని సూచించింది. ‘‘50 రోజులకు పైగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముందస్తు అంచనాల కంటే కూడా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం గణనీయంగా ఉండనుంది. దీన్ని అధిగమించేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరం. అప్పుడే ఉద్యోగాలు, జీవనోపాధిని కాపాడుకోవచ్చు’’ అని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. ప్రభుత్వ ప్యాకేజీలో రూ.2 లక్షల కోట్లను జన్‌ధన్ ఖాతాదారులకు నగదు బదిలీ రూపంలో అందించడం కూడా భాగంగా ఉండాలని సిఐఐ సూచించింది. కార్మిక చట్టాలను రద్దు చేయండి: కార్మిక చట్టాలను దేశవ్యాప్తంగా రెండు నుంచి మూడేళ్ల కాలానికి రద్దు చేయాలంటూ పారిశ్రామిక సంఘాలు డిమాండ్ చేశాయి. దాంతో కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి పరిశ్రమలు గట్టెక్కగలవని అభిప్రాయపడ్డాయి. కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ శుక్రవారం సీఐఐ, ఫిక్కీ, అసోచామ్ ప్రతినిధులతో ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడం, పరిస్థితుల మెరుగుపై వెబినార్ నిర్వహించారు. చట్ట పరిధిలో సవరణలు ఇవ్వాలని, కార్మికుల పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచాలని కోరాయి. అలాగే, కనీస వేతనం, బోనస్ మినహా కార్మిక చట్టంలోని మిగిలిన సెక్షన్లను సస్పెండ్ చేయాలని కోరాయి. -
చిన్న పరిశ్రమలకు ‘పవర్’ ఫుల్ సాయం
సాక్షి, అమరావతి: చిన్న పరిశ్రమలకు లాక్డౌన్ షాక్ తగలకుండా ఏపీ ప్రభుత్వం పెద్ద సాయం చేసింది. విద్యుత్ డిమాండ్ చార్జీల భారం నుంచి వాటికి విముక్తి కల్పించింది. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొండంత ధైర్యమొచ్చింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 79 వేల ఎంఎస్ఎంఈలకు రూ.188 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది. నెలకు రూ.62.70 కోట్లు లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుంచి పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఎంఎస్ఎంఈల పరిస్థితి దారుణంగా మారింది. పరిశ్రమలు తెరవకున్నా నిబంధనల ప్రకారం కనీస విద్యుత్ (డిమాండ్) చార్జీలు చెల్లించాలి. ఇవి ఆయా పరిశ్రమలు వినియోగించే విద్యుత్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు పనిచేస్తే నెలకు 330 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. దీని విలువ రూ.226 కోట్ల వరకూ ఉంటుంది. ప్రస్తుతం పరిశ్రమలు నడవకపోవడం వల్ల నెలకు రూ.62.70 కోట్ల మేర డిమాండ్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ భారం నుంచి విముక్తి కల్పించాలని ఎంఎస్ఎంఈలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వీటిని తొలగించింది. ఎంఎస్ఎంఈలకు గరిష్టంగా రూ.10 లక్షల రుణం లాక్డౌన్ వల్ల దారుణంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)ను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన రూ.200 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ విధివిధానాలను ఖరారు చేసింది. ముఖ్యంగా లిక్విడిటీ కొరతతో కరెంటు బిల్లులు, జీఎస్టీ, ఇతర పన్నులు, జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న ఈ సంస్థలకు లిక్విడిటీ పెంచే విధంగా వర్కింగ్ క్యాపిటల్ కింద రుణాలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో రూ.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా మిగిలిన మొత్తాన్ని సిడ్బీ, లేదా ఇతర బ్యాంకుల నుంచి సమీకరిస్తారు. 6–8 శాతం అతి తక్కువ రేటుకు రూ.2లక్షలు మొదలుకుని గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. రుణ చెల్లింపు కాలపరిమితి 3 ఏళ్లు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ పథకం అమలుచేసే బాధ్యతను ఏపీఎస్‌ఎఫ్‌సీకి అప్పగించారు. -
ఎంఎస్ఎంఈ రంగ వృద్ధికి ఐడియాలు ఇవ్వండి..
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) అభివృద్ధి చెందడానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఎంఎస్ఎంఈ పోర్టల్‌లో నమోదైన వ్యక్తులు తమ ఐడియాలు, ఇన్నోవేషన్(ఆవిష్కరణలు), పరిశోధనలను అందించడం ద్వారా ఈ రంగ వృద్ధికి తోడ్పాటును ఇచ్చినట్లుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబం« దించిన ప్రత్యేక ప్లాట్‌ఫాం ఎం ఎస్ఎంఈ బ్యాంక్ ఆఫ్ ఐడియాస్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. -
ఎంఎస్ఎంఈలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఊపిరి..
సాక్షి, అమరావతి: కరోనా ప్రభావంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి పట్టాలకెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 2014-15 నుంచి ఎంఎస్ఈలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఇవ్వాలని నిర్ణయించింది. రూ.905 కోట్ల చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఎంఎస్ఎంఈలు సహా కీలక రంగాల్లోని పరిశ్రమలను ఆదుకునేందుకు తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ జేఎన్వీ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఎంఎస్ఎంఈలను కాపాడేందుకు పలు రకాల ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. గత సమావేశంలో సీఎం ఇచ్చిన సూచనల మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలపై చర్చించిన తర్వాత నిర్ణయాలకు సీఎం ఆమోదం తెలిపారు. (ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి మరో శాఖ అప్పగింత) ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల బకాయిలు చెల్లింపు: 2014–15 నుంచి పెండింగులో ఉన్న ఎంఎస్ఈల ప్రోత్సాహకాల బకాయిలను పూర్తిగా చెల్లించాలని సీఎం నిర్ణయించారు. మే నెలలో, జూన్ నెలలో చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకూ గత ప్రభుత్వం హయాంలో ఎంఎస్ఈలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.828 కోట్లు చెల్లించలేదన్న విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. సంవత్సరాల వారీగా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల రూపంలో బకాయిలు 2014–15లో రూ.43 కోట్లు, 2015–16లో రూ. 70 కోట్లు, 2016–17లో రూ.195 కోట్లు, 2017–18లో రూ. 207 కోట్లు, 2018–19లో రూ. 313 కోట్లు అప్పటివరకూ మొత్తం రూ. 828 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో ఎంఎస్ఈలకు బకాయిలు రూ.77 కోట్లు. మొత్తంగా రూ.905 కోట్లను మే, జూన్ నెలలో ఎంఎస్ఎంఈలకు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఎంఎస్ఎంఈల మినిమం కరెంటు డిమాండ్ ఛార్జీల రద్దు ఏప్రిల్, మే, జూన్ నెలల కాలానికి ఎంఎస్ఎంఈల మినిమం విద్యుత్ డిమాండ్ ఛార్జీలను రద్దుచేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో దాదాపు రూ.188 కోట్ల మేర అన్ని ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరనుంది. పై రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకూ, 24,252 చిన్న తరహా పరిశ్రమలకూ, 645 మధ్య పరిశ్రమలకూ మొత్తంగా 97, 428 ఎంఎస్ఎంఈలకు మేలు జరుగనుంది. ప్రస్తుతం ఎంఎస్ఎంఈల తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తూ సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుని, రూ.200 కోట్లు సమకూర్చుకోవడం ద్వారా.. వాటిని వర్కింగ్ కేపిటల్‌గా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అందించాలని నిర్ణయించారు. అతి తక్కువ వడ్డీకింద ఈ వర్కింగ్ కేపిటల్ సమకూర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.. టెక్స్టైల్ పరిశ్రమల సహా, భారీ, అతి భారీ పరిశ్రమలకు 3నెలల (ఏప్రిల్, మే, జూన్ నెలల) మినిమమం డిమాండ్ ఛార్జీల చెల్లింపును వాయిదా వేయాలని నిర్ణయించారు. ఎలాంటి అపరాధ రుసుము, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనివల్ల అన్ని పరిశ్రమలకూ అదనపు వర్కింగ్‌క్యాపిటల్ సమకూరుతుంది. టెక్స్టైల్ సహా ఇతర పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని సీఎం జగన్ ప్రకటించారు. పరిశ్రమలను ఆదుకుంటాం.. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా టెక్స్టైల్ సహా ఇతర పరిశ్రమలను ఆదుకోవడానికి ఆలోచనలు చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వెలువడిన తర్వాత మరోసారి సమీక్షచేసి టెక్స్టైల్ సహా ఇతర పరిశ్రమలనూ ఆదుకోవడానికి అన్నిచర్యలూ తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టంచేశారు. -
పరిశ్రమలకు ప్యాకేజీ ప్రకటించాలి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను రక్షించేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను విస్మరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె ప్రధాని మోదీకి రాసిన లేఖలో హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన ఈ రంగం కోసం రూ.లక్ష కోట్ల వేతన ప్యాకేజీని అందించాలి. అంతే మొత్తంతో సమానమైన రుణహామీ నిధిని ఏర్పాటు చేయాలి. పరిశ్రమలను ఆదుకునేందుకు రోజంతా పనిచేసే హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలి’అని అందులో కోరారు. -
చిన్న సంస్థలకు వరం!
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించి ఒత్తిడిలో ఉన్న ఏ ఒక్క రుణాన్ని మొండి బాకీగా(ఎన్పీఏ)గా 2020 మార్చి వరకు ప్రకటించొద్దని కేంద్రం బ్యాంకులను కోరింది. వాటి రుణాలను పునరుద్ధరించాలని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. బ్యాంకుల పనితీరు, రుణ వృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్పీఏగా ప్రకటించొద్దంటూ ఆర్బీఐ జూన్ 7న ఉత్తర్వులు విడుదల చేసినట్టు చెప్పారు. ఈ ఆదేశాలను అనుసరించాలని, 2020 మార్చి వరకు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించొద్దని కోరినట్టు చెప్పారు. రుణాల పునరుద్ధరణకు పనిచేయాలని సూచించామన్నారు. ఇది ఎంఎస్ఎంఈ రంగానికి మేలు చేస్తుందన్నారు. భవిష్యత్తులో వసూలు కాని నిరర్ధక ఆస్తులుగా మారే అవకాశం ఉన్న వాటిని ఒత్తిడిలోని రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తుంటాయి. బ్యాంకులు కొన్ని ఎన్బీఎఫ్సీలను గుర్తించాయని.. ఆయా ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని మంత్రి సీతారామన్ తెలిపారు. దాంతో లిక్విడిటీ మెరుగవుతుందని, అవసరమైన వర్గాలకు రుణాలు అందుతాయన్నారు. రుణ మేళాలు...: దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు అక్టోబర్ 3 నుంచి రుణమేళాలు నిర్వహిస్తాయని మంత్రి సీతారామన్ తెలిపారు. తాము టై అప్ అయిన ఎన్బీఎఫ్సీలతో కలసి గృహ కొనుగోలుదారులకు, రైతులకు, ఇతరులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ముందుగా అక్టోబర్ 3–7వ తేదీల మధ్య 200 జిల్లాల్లో, మిగిలిన 200 జిల్లాల్లో అక్టోబర్ 11 తర్వాత నుంచి ఈ సమావేశాల ఏర్పాటు ఉంటుందన్నారు. పండుగల సమయంలో సాధ్యమైనన్ని రుణాలను అందించడమే వీటి ఉద్దేశంగా చెప్పారు. -
రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వంలో రెండో సారి మంత్రి అయిన నితిన్ గడ్కరీ తన మంత్రిత్వ శాఖలైన జాతీయ రహదారులు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు సంబం ధించి బృహత్ ప్రణాళికలను ప్రకటించారు. రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఖాదీ, ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ)ని పెంచుతామన్నారు. 22 హరిత ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతోపాటు రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అర్ధంతరంగా నిలిచిపోయిన రహదారి ప్రాజెక్టులను వచ్చే వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గడ్కరీ వివరించారు. విద్యుత్ గ్రిడ్ తరహాలో రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే సమావేశాల్లో మోటారు వాహనాల బిల్లు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోటారు వాహనాల సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి గడ్కరీ చెప్పారు.2017లో లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉందని, అయితే గత ఫిబ్రవరిలో లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడటంతో బిల్లు మురిగిపోయిందని అన్నారు. కొత్త మంత్రి వర్గం ఆమోదం లభించిన వెంటనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. -
చిన్న వ్యాపారులకు భారీ ఊరట
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు వార్షిక వ్యాపారంపై జీఎస్టీ మినహాయింపు ఉండగా... దీన్ని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచింది. దీనికితోడు ఒక శాతం పన్ను చెల్లించే కాంపోజిషన్ స్కీమ్ టర్నోవర్ పరిమితిని రూ.1.5 కోట్లు చేయాలని గతంలోనే నిర్ణయించగా... ఇది వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కౌన్సిల్ ప్రకటించింది. భారీ వరదలతో దెబ్బతిన్న కారణంగా... పునర్నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అంతర్రాష్ట్ర రవాణాపై రెండేళ్ల పాటు ఒక శాతం విపత్తు సెస్సును విధించుకునే అవకాశాన్ని కేరళ రాష్ట్రానికి కౌన్సిల్ కల్పించింది. ఈ మేరకు గురువారం జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ లోపు ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉందని, దీన్ని రూ.40 లక్షలకు పెంచామని చెప్పారు. పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉండగా, ఇకపై రూ.20లక్షలు అవుతుందన్నారు. జీఎస్టీ మినహాయింపును రెట్టింపు చేయడం వల్ల... అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే రూ.5,200 కోట్ల మేర పన్ను రాబడి తగ్గుతుందని అంచనా. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఎంఎస్ఎంఈలు, ట్రేడర్లు, సేవల రంగానికి మేలు చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. సులభమైన ప్రజా అనుకూల జీఎస్టీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కాంపోజిషన్ స్కీమ్ మినహాయింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి వరకు టర్నోవర్ ఉన్న వారు... కాంపోజిషన్ స్కీమ్ కింద టర్నోవర్‌పై ఒక శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచుతూ కౌన్సిల్ నవంబర్ నాటి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్లు, వస్తు, సేవల సరఫరా దారులు రూ.50 లక్షల్లోపు టర్నోవర్ ఉంటే, కాంపోజిషన్ స్కీమ్ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. కాంపోజిషన్ స్కీమ్‌లో టర్నోవర్ పరిమితి పెంచటం వల్ల రూ.3,000 కోట్ల మేర ఆదాయం తగ్గొచ్చని అంచనా. ఈ నిర్ణయాలు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు (ఎంఎస్ఎంఈ) ఉపశమనం కల్పిస్తాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకునే వ్యాపారులు వార్షికంగా ఒకేసారి ట్యాక్స్ రిటర్ను వేస్తే సరిపోతుందని, పన్ను మాత్రం త్రైమాసికానికి ఓ సారి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారాయన. ‘‘జీఎస్టీలో ఎక్కువ భాగం వ్యవస్థీకృత రంగం, పెద్ద కంపెనీల నుంచే వస్తోంది. ఈ నిర్ణయాలు ఎంఎస్ఎంఈలకు మేలు చేస్తాయి. వారికి పలు ఆప్షన్లు ఇచ్చాం. సేవల రంగంలో ఉంటే, 6 శాతం కాంపౌండింగ్ పొందొచ్చు. తయారీ రంగంలో ఉంటే రూ.1.5 కోట్ల టర్నోవర్‌పై ఒక శాతం కాంపౌండింగ్ ఎంచుకోవచ్చు. వీరు రూ.40 లక్షల వార్షిక టర్నోవర్ వరకు పన్ను మినహాయింపును కూడా పొందొచ్చు. సరుకుల సరఫరాదారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్, చెల్లింపు విషయంలో రూ.40 లక్షలు, రూ.20 లక్షల పరిమితులు ఉన్నాయి. పరిమితి పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది’’ అని అరుణ్ జైట్లీ వివరించారు. ఇతర నిర్ణయాలు... ⇒ రియల్ ఎస్టేట్‌పై జీఎస్టీ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఏడుగురు సభ్యుల మంత్రివర్గ గ్రూపును ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ⇒ లాటరీలపైనా ఇదే పరిస్థితి నెలకొనడంతో దీన్నీ మంత్రివర్గ బృందమే తేల్చనుంది. ⇒ ప్రస్తుతం రూ.20 లక్షల్లోపు టర్నోవర్‌కు పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ... 10.93 లక్షల మంది పన్నులు చెల్లిస్తున్నారని కేంద్ర రెవెన్యూ సెక్రటరీ అజయ్‌భూషణ్ పాండే తెలిపారు. రూ.40 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు అనేది సరుకుల వర్తకానికి, ఒకే రాష్ట్రం పరిధిలో వాణిజ్యానికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య లావాదేవీలకు ఇది వర్తించదన్నారు. ⇒ జీఎస్టీ కింద 1.7 కోట్ల వ్యాపారులు నమోదు చేసుకోగా, వీరిలో 18 లక్షల మంది కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకున్నారు. వీరు మూన్నెళ్లకోసారి పన్ను చెల్లించాలి. మిగిలిన వారు ప్రతీ నెలా పన్ను చెల్లించాలి. పైగా కాంపోజిషన్ స్కీమ్‌లో వ్యాపారులు రికార్డులను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. లక్షలాది వర్తకులకు మేలు: పరిశ్రమ వర్గాల హర్షం న్యూఢిల్లీ: రూ.40 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారులకూ జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల దేశ పారిశ్రామిక రంగం హర్షం వ్యక్తం చేసింది. ఇది లక్షలాది వ్యాపారులకు మేలు చేస్తుందని, వ్యాపార సులభత్వాన్ని పెంచుతుందని పేర్కొంది. ‘‘జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఉత్పత్తుల వ్యయాన్ని తగ్గిస్తుంది. ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని పెంచుతుంది’’ అని సీఐఐ పేర్కొంది. కాంపోజిషన్ స్కీములో మూడు నెలలకోసారి పన్ను చెల్లింపు, ఏడాదికోసారి రిటర్నుల దాఖలు అన్నది పన్నుల విధానాన్ని మరింత సులభంగా మార్చేస్తుందని, ఎంఎస్ఎంఈ రంగంపై నిబంధనల అమలు భారాన్ని తగ్గిస్తుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. లక్షలాది చిన్న, మధ్య స్థాయి వర్తకులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని అసోచామ్ పేర్కొంది.జీఎస్టీ మినహాయింపు రూ.40 లక్షలు చేయడం వల్ల, నమోదిత పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50–60% మేర తగ్గుతుందని, వారికి నిబంధనల అమలు భారం తొలగిపోతుందని కేపీఎంజీ పార్ట్నర్ సచిన్ మీనన్ అభిప్రాయపడ్డారు. -
ఎంఎస్ఎంఈలతో స్థిరమైన వృద్ధి
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్రా పుణే : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రుణ మంజూరు మెరుగుదలపై బ్యాంకులు మరింత దృష్టి కేంద్రీకరించాలని ఆర్బీఐ తెలిపిం ది. పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న పరిశ్రమల వల్ల బ్యాంకులకు కలిగే రిస్క్ తక్కువని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణ వృద్ధిని సాధించాలంటే.. ఎంఎస్ఎంఈ రంగంతోనే సాధ్యమవుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్. ముంద్రా చెప్పారు. ఇక్కడ జరిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఫైనాన్సింగ్ కార్యక్ర మంలో మాట్లాడారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎంఎస్ఎంఈల స్థూల ఎన్పీఏలు అధికంగా ఉన్నప్పటికీ.. రుణ పునర్వ్యవస్థీకరణ చా లా తక్కువ స్థాయిలో ఉంటుందన్నారు. బ్యాంకులు వాటి రుణ నాణ్యత విషయంలో ఆందోళనలో ఉన్నాయని తెలిపారు. కేవైసీ, రికవరీ సంబంధిత అంశాల కారణంగా ఎంఎస్ఎంఈలకు రుణాల మంజూరులో బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగంతోనే స్థిరమైన వృద్ధి నమోదౌతుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం ‘ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్’కు సంబంధించి ఏడు దరఖాస్తులు అందాయని తెలిపారు. -
కుటీర పరిశ్రమలు పునరుద్ధరిస్తాం
కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా హైదరాబాద్: దేశంలో కుటీర పరిశ్రమలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని కేంద్ర సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్ఎంఈ) మంత్రి కల్రాజ్ మిశ్రా అన్నారు. మంగళవారం సనత్‌నగర్‌లోని ‘ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్స్’ (ఫెట్సియా) ఎస్ఎస్ఐ సెంటర్ నూతన భవన సముదాయం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్‌మే)లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఏవియేషన్, హెచ్ఏఎల్ వంటి సంస్థలకు కావాల్సిన ఉత్పత్తులను అందించడంలో ఎంఎస్ఎంఈ ముందుందన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు, వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృతనిశ్చయంతో ఉన్నాయన్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి అన్నీ సవ్యంగా ఉంటే 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య కన్వీనర్ రాజ్ మహేందర్‌రెడ్డి, నిమ్స్‌మే డెరైక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఫెట్సియా అధ్యక్షుడు జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రగతి కోసం పనిచేయండి బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రా సూచన సాక్షి, హైదరాబాద్: కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి, దేశ ప్రగతికి కృషి చేయాలని కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా బీజేపీ కార్యకర్తలకు సూచించారు. అధికారిక పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన విద్యాసాగర్‌రావును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాజీ గవర్నర్ రామారావు, మురళీధరరావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Draft policy for MSME sector in 3-4 months: Kalraj Mishra -
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వివిధ దేశాల నుంచి వస్తూత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. దీంతో దేశీయ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమ కుదేలవుతోంది. ఈ రంగంలో ఆధారపడ్డ లక్షలాది మంది భవిష్యత్ ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. భార త సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమ నిలబడాలంటే దిగుమతుల కట్టడి ఒక్కటే పరిష్కారమని అసోసియేషన్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్(ఏఎస్‌ఎస్‌ఐ) కేంద్రానికి స్పష్టం చేసింది. వివిధ దేశాలతో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాను ఢిల్లీలో కలిసి విన్నవించినట్టు ఏఎస్‌ఎస్‌ఐ కన్వీనర్ రాజ మహేందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇన్స్పెక్టర్ రాజ్ వ్యవస్థకు స్వస్తి పలకాలని కోరినట్టు చెప్పారు. పాత కంపెనీలకూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కంపెనీలకు ఇవ్వబోయే ప్రయోజనాలను పాత కంపెనీలకూ వర్తింపజేయాలని మంత్రిని కోరామని ఫెడరేషన్ ఆఫ్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైసెస్ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి చెప్పారు. ‘ప్రభుత్వానికి చెల్లించిన పెనాల్టీలను తిరిగి కంపెనీలకు చెల్లించాలి. పెట్టుబడి పరిమితి విషయంలో రూ.1 కోటి వరకు సూక్ష్మ స్థాయి కంపెనీగా పరిగణించాలి. రూ.1-10 కోట్ల మధ్య చిన్నతరహా, రూ.10-25 కోట్ల మధ్య పెట్టుబడిని మధ్యతరహా కంపెనీగా పరిగణించాలి. రూ.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన కంపెనీకి ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలి. పెట్టుబడి సబ్సిడీని ప్రస్తుతమున్న రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలి’ అని మంత్రికి విన్నవించామన్నారు. రూరల్ క్లస్టర్లు.. ఉపాధిని పెంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించాలని పారిశ్రామిక సంఘాలకు మంత్రి కల్రాజ్ మిశ్రా పిలుపునిచ్చారు. పరిశ్రమ డిమాండ్లను నెరవేరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో క్లస్టర్ల స్థాపనకు తాము సిద్ధమేనని మంత్రికి చెప్పామని రాజ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆగస్టులో హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే విధాన నిర్ణయాల్లో తమనూ భాగస్వాములను చేయాలని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.సుధీర్‌రెడ్డి మంత్రిని కోరారు. మంత్రిని కలిసినవారిలో ఫ్యాప్సీ, ప్లాస్టిక్, ఫౌండ్రీ అసోసియేషన్లు, అలీప్ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు.