న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధి చెందడానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఎంఎస్‌ఎంఈ పోర్టల్‌లో నమోదైన వ్యక్తులు తమ ఐడియాలు, ఇన్నోవేషన్(ఆవిష్కరణలు), పరిశోధనలను అందించడం ద్వారా ఈ రంగ వృద్ధికి తోడ్పాటును ఇచ్చినట్లుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబం« దించిన ప్రత్యేక ప్లాట్‌ఫాం ఎం ఎస్‌ఎంఈ బ్యాంక్ ఆఫ్ ఐడియాస్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment