innovations
-
రక్షణ ఉత్పత్తుల్లో మన ప్రయాణం గర్వకారణం
న్యూఢిల్లీ: దేశంలో రక్షణ ఉత్పత్తులు, వాటి ఎగుమతులు భారీగా పెరుగుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. రక్షణ ఉత్పత్తుల్లో మన దేశ ప్రయాణం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు. రక్షణ రంగంలో పాలుపంచుకోవాలని కావాలని స్టార్టప్‌లు, తయారీదారులు, వ్యాపారవేత్తలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో నవీన ఆవిష్కరణలు సృష్టించేందుకు ముందుకు రావాలని సూచించారు. చరిత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు మోదీ బుధవారం ‘లింక్డ్ఇన్’లో పోస్టు చేశారు. ‘‘మీ అనుభవం, శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం దేశానికి అవసరం. నవీన ఆవిష్కరణకు ద్వారాలు తెరిచి ఉన్నాయి. మన ప్రభుత్వ విధానాలు మీకు అనుకూలంగా పని చేస్తున్నాయి. రక్షణ రంగంలో లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మనమంతా కలిసి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిద్దాం. అంతేకాదు రక్షణ ఉత్పత్తుల తయారీలోని భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చాలి. బలమైన, స్వయం సమృద్ధితో కూడిన ఇండియాను నిర్మిద్దాం. గతంలో మనం విదేశాల నుంచి రక్షణ పరికరాలు, ఆయుధాలు దిగుమతి చేసుకొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ అద్భుత ప్రయాణం దేశంలో ప్రతి పౌరుడికీ గర్వకారణమే. ఇండియా రక్షణ ఉత్పత్తుల విలువ 2023–24లో రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. ఇక ఎగుమతి విలువ 2014లో కేవలం రూ.1,000 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.21,000 కోట్లకు చేరుకుంది. 12,300 రకాల పరికరాలు, ఆయుధాలు దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు రూ.7,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) నిధుల్లో 25 శాతం నిధులను ఇన్నోవేషన్కే ఖర్చు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రెండు అధునాతన డిఫెన్స్ కారిడార్లు రాబోతున్నాయి’’అని ప్రధాని మోదీ వెల్లడించారు. భారతీయ యువతకు తిరుగులేదు నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతలో భారతీయ యువతకు తిరుగులేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వారు అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత్ నిరి్వరామ ప్రగతి సాధిస్తోందంటూ గిట్‌హబ్ సంస్థ సీఈఓ థామస్ డోహ్మ్కే ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ బుధవారం స్పందించారు. కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంలో అమెరికా తర్వాత భారత్ ముందంజలో ఉందని థామస్ పేర్కొన్నారు. -
ఇన్ఫ్రా, పెట్టుబడులపై ఫోకస్
వాషింగ్టన్: 2047 నాటికి భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి పెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఇన్ఫ్రా, పెట్టుబడులు, నవకల్పనలు, సమ్మిళితత్వం ఉన్నట్లు పెన్సిల్వేనియా యూనివర్సిటీ విద్యార్థులకు వివరించారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల కోసం అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆమె వర్సిటీని సందర్శించారు. ‘2047లో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అప్పటికల్లా సంపన్న దేశంగా ఎదగాలన్నది భారత్ ఆకాంక్ష. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నాలుగు అంశాలపై దృష్టి పెడుతోంది‘ అని సీతారామన్ పేర్కొన్నారు. వంతెనలు, పోర్టులు, డిజిటల్ తదితర మౌలిక సదుపాయాల కల్పన కీలకమని, అలాగే వాటిపై పెట్టుబడులు పెట్టడం కూడా ముఖ్యమని ఆమె తెలిపారు. భారత్‌కే పరిమితమైన సమస్యల పరిష్కారానికి వినూత్న ఆవిష్కరణలు అవసరమన్నారు. ఇక ప్రతి విషయంలోనూ అందరూ భాగస్వాములయ్యేలా సమ్మిళితత్వాన్ని సాధించడం కూడా కీలకమని మంత్రి పేర్కొన్నారు. -
ఇన్నోవేషన్ యాత్ర 2024: ఆలోచనకు పునాది వేయనున్న ముగింపు!
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC), నవమ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యంత విజయవంతమైన 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' ముగింపు వేడుకలకు ఆహ్వానించడానికి 'అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్బాక్స్' ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. నెట్వర్క్ ఆఫ్ ఎకోసిస్టమ్ పాట్నర్స్, ఈవెంట్ స్పాన్సర్‌గా నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్), అసోసియేట్ పార్టనర్‌గా లాజులిన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. 2024 మార్చి 12 నుంచి ప్రారంభమైన ఐదు రోజుల బస్సు యాత్ర 16వ తేదీ ముగుస్తుంది. ఈ ప్రయాణం నిజామాబాద్ నుంచి ప్రారంభమై పర్యావరణ వ్యవస్థలను అన్వేషిస్తూ.. సాగుతుంది. ఈ ప్రయాణం నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట ప్రాంతాలలో పర్యటించి హైదరాబాద్‌లోని ఏసీఐసీ-సీబీఐటీలో ముగుస్తుంది. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు ఇలా.. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు (మార్చి 16) యాత్రలో పాల్గొన్నవారు వారి విజయాలను జరుపుకుంటారు, వారి సృజనాత్మకను కూడా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 6 గంటలకు ACIC-CBIT, గండిపేటలో జరుగుతుంది. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ కింది విషయాలను తెలుసుకోవచ్చు. విజయవంతమైన వ్యవస్థాపకులు, స్థానిక ఆవిష్కర్తల నెట్వర్క్ అనుభవాల ద్వారా సమాజ అవసరాల గురించి లోతైన అవగాహన సమస్యకు పరిష్కారం తెలుసుకునే నైపుణ్యం ఆలోచనను ఉపయోగించి వాస్తవ-ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం భావసారూప్యత గల వ్యక్తుల సహాయక సంఘాన్ని నిర్మించడం గ్రామీణ ఆవిష్కర్తల కథల నుంచి ప్రేరణ -
వైద్య రంగంలో పెనుమార్పులు.. మతి పోగొడుతున్న కొత్త టెక్నాలజీలు!
ఇది సాంకేతిక విప్లవయుగం. సాంకేతిక విప్లవం ప్రపంచంలోని ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, నానో టెక్నాలజీ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు వైద్యరంగంలోకి కూడా దూసుకొస్తున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వైద్యరంగంలో పెనుమార్పులకు దారులు వేస్తోంది. ప్రస్తుత శతాబ్దిలో ఇప్పటికే వైద్యరంగంలోకి అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఏడాది కొత్త కొత్త పరికరాలు వైద్యరంగంలోకి అడుగుపెడుతూ చికిత్స పద్ధతులను మరింతగా సులభతరం చేస్తున్నాయి. జ్వరం తెలుసుకోవాలంటే థర్మామీటర్... ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవాలంటే స్టెతస్కోప్... శరీరంలోని ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడానికి పల్సాక్సి మీటర్...ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న పరికరాలు. ఈ అన్ని లక్షణాలనూ తెలిపే పరికరం తాజాగా రూపుదిద్దుకుంది. మన అందచందాలను చూసుకోవడానికి అద్దం వాడుతుంటాం. మరి, మన మానసిక పరిస్థితిని తెలుసుకోవడానికో? దానికి కూడా ఒక అధునాతన అద్దం అందుబాటులోకి వచ్చేసింది. తలనొప్పి వస్తే తలకు ఏ అమృతాంజనం పట్టించుకోవడమో లేదా ఒక తలనొప్పి మాత్ర వేసుకోవడమో చేస్తుంటాం. ఇక ఆ బెడద లేకుండా, తలనొప్పి తీవ్రతకు తగినంత మోతాదులో ఔషధాన్ని విడుదల చేసే హెడ్‌బ్యాండ్ తయారైంది. ఆరోగ్యరంగంలో పెనుమార్పులకు దారితీయగలిగిన వస్తువుల్లో ఇవి కొన్ని. ఇలాంటివే మరికొన్ని అద్భుతమైన సాంకేతిక పరికరాలు కూడా గడచిన ఏడాదికాలంలో తయారయ్యాయి. ఈ పరికరాలను వాటి తయారీదారులు లాస్ వేగస్‌లో ఈ ఏడాది జనవరి 9 నుంచి 12 వరకు జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో–2024 (సీఈఎస్) వేదికపై ప్రదర్శించారు. వీటికి శాస్త్రవేత్తల నుంచి మాత్రమే కాకుండా, సామాన్య సందర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. సరికొత్త వైద్య పరికరాలపై సంక్షిప్త పరిచయంగా ఈ కథనం మీ కోసం.. ఫోర్ ఇన్ వన్ ‘బీమ్‌ఓ’ అరచేతిలో ఇమిడిపోయే ఈ ఒక్క చిన్నపరికరం దగ్గర ఉంటే థర్మామీటర్, స్టెతస్కోప్ వంటివేవీ అవసరం ఉండదు. ఇది ఫోర్ ఇన్ వన్ పరికరం. అమెరికాలోని శాన్‌హోసే స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సాయంతో ‘బీమ్‌ఓ’ కంపెనీ ఈ ఫోర్ ఇన్ వన్ పరికరాన్ని తయారుచేసింది. దీనిని నుదుటి మీద ఆనించి జ్వరం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఛాతీ మీద ఆనించి ఊపరితిత్తుల పనితీరును, గుండె పనితీరును తెలుసుకోవచ్చు. అలాగే శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవచ్చు. దీనిలోని సెన్సర్లు శరీరంలోని సూక్ష్మమైన తేడాలను సైతం ఇట్టే గుర్తించి, శరీర ఆరోగ్య స్థితిగతులపై కచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇది స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా ఫోన్‌కు చేరిన సమాచారాన్ని డాక్టర్‌కు చూపించి సత్వరమే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. ‘బీమ్‌ఓ’ పరికరం విస్తృతంగా వాడుకలోకి వచ్చినట్లయితే, వైద్యరంగంలో ఇప్పటివరకు వాడుకలో ఉన్న థర్మామీటర్, స్టెతస్కోప్, పల్సాక్సిమీటర్ వంటి పరికరాలు దాదాపు కనుమరుగు కాగలవు. ‘బీమ్‌ఓ’ ఈ ఏడాది జూన్‌లో మార్కెట్లోకి రానుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,701) మాత్రమే! మనసును చూపించే అద్దం అద్దంలో ముఖం చూసుకోవడం మామూలే! ఈ అద్దం మాత్రం మన మనసుకే అద్దంపడుతుంది. మన ఒత్తిడి, చిరాకు, పరాకు, దిగులు, గుబులు వంటి లక్షణాలను ఈ అద్దం ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. అమెరికాలోని సీయాటల్కు చెందిన ‘బారాకోడా’ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ స్మార్ట్ అద్దాన్ని ‘బి మైండ్’ పేరుతో రూపొందించింది. ఈ అద్దం బాత్రూమ్లో ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది టచ్‌స్క్రీన్‌గా కూడా పనిచేస్తుంది. ఇందులోని కేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మన మానసిక స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇందులోని నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా ఈ అద్దం మన భావోద్వేగాల్లోని మార్పులను సత్వరమే గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. భావోద్వేగాల్లో తేడాలు ఉన్నట్లయితే, ఇందులోని లైట్ థెరపీ ఆటోమేటిక్‌గా పనిచేసి, సాంత్వన కలిగిస్తుంది. సీఈఎస్–2024లో ప్రదర్శించిన ఈ స్మార్ట్ అద్దం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఈ ఏడాది చివరిలోగా మార్కెట్లోకి రానుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌వాచీ ఇప్పటికే ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌వాచీలను పలు కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అమెరికన్ కంపెనీ గార్మిన్ తాజాగా ‘లిలీ–2’ పేరుతో ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్‌వాచీని విడుదల చేసింది. దీనిని సీఈఎస్–2024 షోలో ప్రదర్శించింది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్‌వాచీ స్మార్ట్‌ఫోన్ యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌వాచీలతో పోల్చుకుంటే దీని బరువు తక్కువే కాకుండా, డిజైన్ ఆకర్షణీయంగా ఉండటం విశేషం. ‘లిలీ–2’ స్మార్ట్ వాచీలను గార్మిన్ కంపెనీ ‘క్లాసిక్’, ‘స్పోర్ట్స్’ అనే రెండు మోడల్స్‌లో విడుదల చేసింది. దీని డయల్‌పై ఉన్న టచ్‌స్క్రీన్‌ను తడితే, ఇది సమయం చూపడమే కాకుండా, శరీరంలోని ఎనర్జీ లెవల్స్‌ను, స్లీప్ స్కోర్‌ను చూపిస్తుంది. ఇది ధరించిన వారి శరీరం పనితీరును నిరంతరాయంగా గమనిస్తూ, స్మార్ట్‌ఫోన్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. గుండె పనితీరు, అలసట స్థాయి, నిద్ర తీరుతెన్నులు, ఆటలాడేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు ఖర్చయ్యే కేలరీలు, శరీరంలో నీటి స్థాయి, శ్వాస తీరు, ఆక్సిజన్ లెవల్స్, మహిళల నెలసరి పరిస్థితుల వంటి అంశాలపై ఇది కచ్చితమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. లిలీ–2 స్పోర్ట్స్ మోడల్ ధర 249.99 డాలర్లు (రూ.20,782), క్లాసిక్ మోడల్ ధర 279.99 డాలర్లు (రూ.23,276) మాత్రమే! వృద్ధుల కోసం మెడికల్ అలర్ట్ సిస్టమ్ చూడటానికి ఇది దోమలను పారదోలే పరికరంలా కనిపిస్తుంది గాని, ఇది వృద్ధులకు ఆసరగా పనిచేసే అధునాతన మెడికల్ అలర్ట్ సిస్టమ్. ఫ్రాన్స్‌కు చెందిన ‘జో కేర్’ కంపెనీ నిపుణులు దీనిని ‘జో ఫాల్’ పేరుతో రూపొందించారు. కాలుజారడం, రక్తపోటు పడిపోవడం, గుండెపోటు, పక్షవాతం వంటి కారణాలతో ఇళ్లలోని వృద్ధులు అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు వైఫై ద్వారా ఈ పరికరంలోని సెన్సర్లు వెంటనే గుర్తించి, దీనికి అనుసంధానమైన స్మార్ట్‌ఫోన్‌కు చేరవేసి అప్రమత్తం చేస్తుంది. సీసీ కెమెరాలు, తొడుక్కోవలసిన పరికరాలతో పనిలేకుండా, దీనిని గోడకు ప్లగ్ సాకెట్‌కు తగిలించుకుంటే చాలు. నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీనిని అమర్చిన ప్రదేశానికి 800 చదరపు మీటర్ల పరిధిలో నేల మీద ఎవరు పడిపోయినా, వెంటనే అప్రమత్తం చేస్తుంది. సీఈఎస్–2024 షోలో దీనికి సందర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యరక్షణ ఇవి పోషకాల గుళికలు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా తయారైన స్మార్ట్ గమ్మీస్ ఇవి. ఏడు పోషకాలతో కూడిన ఈ స్మార్ట్ గమ్మీస్‌ను ఫిన్లండ్‌కు చెందిన ‘ఇలో స్మార్ట్ న్యూట్రిషన్’ కంపెనీ విడుదల చేసింది. సాధారణమైన విటమిన్ మాత్రలైతే, అందరికీ ఒకేలాంటివి దొరుకుతాయి. వీటిని ఎవరి అవసరాలకు తగినట్లుగా వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకునే వీలు ఉండటం విశేషం. 38.9 కోట్ల కాంబినేషన్లలోని పోషకాల మోతాదులతో కూడిన ఈ స్మార్ట్ పిల్స్‌ను కోరుకున్న రుచులతో త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించుకోవచ్చు. నోటికి నచ్చిన రుచుల్లో దొరికే వీటిని నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు, శరీరంలోని పోషక లోపాలన్నీ సత్వరమే నయమవుతాయి. పోషకాల కాంబినేషన్లను బట్టి ఈ గమ్మీస్ ఒక్కో ప్యాక్ ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల (రూ.1247 నుంచి రూ.1662) వరకు ఉంటుంది. అల్ట్రాహ్యూమన్ హోమ్ వైఫై రూటర్‌లా కనిపించే ఈ పరికరం ఇంటిల్లిపాదికీ ఆరోగ్యరక్షణ కల్పిస్తుంది. అమెరికన్ కంపెనీ ‘అల్ట్రాహ్యూమన్’ ఈ పరికరాన్ని ‘అల్ట్రాహ్యూమన్ హోమ్’ పేరుతో రూపొందించింది. రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ పరికరాన్ని ఇంట్లో అనువైన చోట అమర్చుకుని, ఆన్ చేసుకుంటే చాలు. ఇది నిరంతరం ఇంటి వాతావరణంలోని మార్పులను గమనిస్తూ, యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇంట్లోని ఉష్ణోగ్రత, గాలిలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, ధూళికణాలు, కార్బన్ కణాలు వంటివి ఏ మేరకు ఉన్నాయో కచ్చితంగా చెబుతుంది. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు ఇది అందించే సమాచారం బాగా దోహదపడుతుంది. ‘అల్ట్రాహ్యూమన్’ ఈ పరికరాన్ని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధర 349 డాలర్లు (రూ.29,011) మాత్రమే! స్మార్ట్ పరుపు ఇది చాలా స్మార్ట్ పరుపు. కావలసిన రీతిలో దీని మెత్తదనాన్ని లేదా గట్టిదనాన్ని మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవడానికి వీలుగా దీనికి ఒక బటన్ అమర్చి ఉంటుంది. సాధారణమైన పరుపులతో పోల్చుకుంటే దీని బరువు దాదాపు ఎనబై శాతం తక్కువగా ఉంటుంది. సాధారణ పరుపులలో వాడే స్ప్రింగులు, ఫోమ్ వంటివేవీ ఇందులో ఉండవు. దాదాపు 1.40 కోట్ల పాలీస్టర్ దారపు పోగులతో దీనిని తయారుచేయడం విశేషం. దీని బటన్‌ను ఉపయోగిస్తూ, పది కుషన్ లెవల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కొరియన్ కంపెనీ ‘ఆన్సిల్’ ఈ పరుపును సీఈఎస్–2024 షోలో ప్రదర్శించింది. ‘స్మార్ట్ స్ట్రింగ్ ఐ4’ పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్ పరుపులో మరికొన్ని అదనపు సౌకర్యాలూ ఉన్నాయి. ఇందులోని సెన్సర్లను నిద్ర తీరుతెన్నులను గమనిస్తూ, ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. ఒంటి బరువులో మార్పులు, గురక వంటి ఇబ్బందులను కూడా ఇది గుర్తిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. మార్కెట్లోకి దీనిని ఎప్పుడు విడుదల చేయనున్నదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు ‘ఆన్సిల్’ కంపెనీ తెలిపింది. పర్సనలైజ్డ్ న్యూట్రిషనల్ ఫుడ్ ప్రింటర్ మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో పోషకాహార అవసరాలు ఉంటాయి. ఇళ్లల్లో వండుకునే ఉమ్మడి వంటతోనో లేదా హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికే వంటకాలతోనో పోషకాహార అవసరాలు పూర్తిగా తీరే పరిస్థితి ఉండదు. వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను కోరుకున్న రుచులతో అందించేందుకు అమెరికన్ కంపెనీ ‘ఆనరీ’ ఇటీవల ‘ఇనొవేటివ్ ఇండివిడ్యువలైజ్డ్ న్యూట్రిషనల్ కిట్’ (ఐఐఎన్కే) పేరుతో ఈ త్రీడీ ఫుడ్ ప్రింటర్‌ను రూపొందించింది. ఇందులో ముడి పదార్థాలను తగిన మోతాదులో వేసుకుని, స్విచాన్ చేసుకుంటే చాలు. కొద్ది నిమిషాల్లోనే మనకు కావలసిన ఆహారాన్ని, మనకు అవసరమైన పోషకాలు ఉండేలా ముద్రించి పెడుతుంది. ఇది దాదాపు మిగిలిన త్రీడీ ఫుడ్ ప్రింటర్లాగానే పనిచేస్తుంది. అయితే, దీని తయారీదారులు మాత్రం దీనిని 4డీ ఫుడ్ ప్రింటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం మూడు కొలతల్లో ఆహారాన్ని ముద్రించే త్రీడీ ప్రింటర్ మాత్రమే కాదని, అంతకు మించి ఇది పదార్థాల్లోని పీహెచ్ స్థాయిని, వేడిని కోరుకున్న రీతిలో, కోరుకున్న సమయానికి అందిస్తుందని, అందువల్ల ఇది 4డీ ప్రింటర్ అని చెబుతున్నారు. దీనిని సీఈఎస్–2024 షోలో ప్రదర్శించారు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. పెంపుడు జంతువులకు హెల్త్ట్రాకర్ చాలామంది ఇళ్లల్లో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పర్వాలేదు గాని, వాటి ఆరోగ్యానికి సమస్యలు తలెత్తితే ఇబ్బందే! పెంపుడు జంతువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ పెట్ హెల్త్ట్రాకర్ బాగా ఉపయోగపడుతుంది. ఇళ్లల్లో పెంచుకునే పిల్లులు లేదా జాగిలాలకు మెడలో దీనిని తగిలిస్తే చాలు. యాప్ ద్వారా ఇది వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఇన్వోక్సియా కంపెనీ ఈ పెట్ హెల్త్ట్రాకర్ను ‘మినిటాయిల్జ్ స్మార్ట్ పెట్‌ట్రాకర్’ పేరుతో రూపొందించింది. ఇది పెంపుడు జంతువుల దినచర్యపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతుంది. పెంపుడు జంతువుల తినే వేళలు, నడక వేళలు, ఆట వేళలు, వాటి భావోద్వేగాలు, వాటి జీర్ణ సమస్యలు, గుండె సమస్యలను ఇది తక్షణమే గుర్తించి, యాప్ ద్వారా యజమానులను అప్రమత్తం చేస్తుంది. ఈ పెట్‌ట్రాకర్ శునకాల కోసం ఒక మోడల్, పిల్లుల కోసం ఒక మోడల్ రూపొందించింది. అయితే, రెండిటి ధర ఒక్కటే– 99 డాలర్లు (రూ.8,230) మాత్రమే! ఈ పెట్‌ట్రాకర్ ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి రానుంది. పట్టుతప్పిన చేతులకు స్మార్ట్గ్లోవ్స్ వార్ధక్యంలో కొందరు పార్కిన్సన్స్ వ్యాధి బారినపడతారు. ఈ వ్యాధికి లోనైనవారిలో కీళ్లు బిగుసుకుపోయి, వణుకు పెరిగి, చేతులు పట్టుతప్పుతాయి. పట్టుతప్పిన చేతులతో టీ కప్పు వంటి తేలికపాటి వస్తువులను పట్టుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రిటన్‌కు చెందిన ‘గైరోగేర్’ కంపెనీ ఈ ‘గైరోగ్లోవ్’ను రూపొందించింది. దీని పనితీరును ఇటీవల సీఈఎస్–2024 షోలో ప్రదర్శించినప్పుడు దీనికి నిపుణుల ప్రశంసలు లభించాయి. ఇది మాగ్నటిక్ కనెక్టర్‌తో రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిని చేతికి తొడుక్కుని, ఆన్ చేసుకున్న వెంటనే ఇది చేతి వణుకును నియంత్రిస్తుంది. చేతికి పట్టునిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడేవారు దీనిని తొడుక్కుని తమ పనులను తామే స్వయంగా చేసుకునేందుకు దోహదపడుతుంది. దీని ధర 550 డాలర్లు (రూ.45,726). వైద్య ఆరోగ్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు ఈ వస్తువులు తాజా ఉదాహరణలు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించే స్మార్ట్ వాచీలు, నొప్పి నివారణ కోసం వాడే స్మార్ట్ పట్టీలు, ఇన్సులిన్ ఇంజక్షన్ల బదులుగా వాడే స్ప్రేలు వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ పరిజ్ఞానాలు శస్త్రచికిత్సలను మరింతగా సులభతరం చేస్తున్నాయి. ఈ సాంకేతికత ఆరోగ్యరంగాన్ని మరింత అభివృద్ధి చేయగలదని, మానవాళి ఆరోగ్యానికి మరింత భరోసా ఇవ్వగలదని భావించవచ్చు. -
సువర్ణావకాశం.. ఒక ఐడియా రూ.10 లక్షలు - ట్రై చేయండిలా!
ఆధునిక కాలంలో సృజనాత్మకత పెరిగిపోతోంది. కేవలం చదువుకున్న వారు మాత్రమే కాకుండా నిరక్ష్యరాస్యులు కూడా తమదైన రీతిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏవియేషన్ కంపెనీ బోయింగ్ ఇండియా కొత్త ఆలోచనల కోసం ఒక కార్యక్రమం ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బోయింగ్ ఇండియా తన ప్రతిష్టాత్మక బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ కోసం విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఇతర వర్ధమాన వ్యవస్థాపకులను ఆహ్వానించింది. ఇక్కడ వినూత్న ఆలోచలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఉత్తమ 7మందికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల బహుమతి లభిస్తుంది. ఏరోస్పేస్, రక్షణ, టెక్నాలజీ, సామాజిక ప్రభావం వంటి విషయాలపైన ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్డ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆలోచనలను 2023 నవంబర్ 10 వరకు పంపవచ్చు. గత ఏడాది ఇదే ప్రోగ్రామ్ కోసం టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందిన విద్యార్థుల నుంచి 1600 కంటే ఎక్కువ, స్టార్టప్ ఔత్సాహికుల నుంచి 800 కంటే ఎక్కువ ఆలోచనలు వెల్లువెత్తాయి. కాగా ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: 12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి.. ఈ సంవత్సరం బోయింగ్ బిల్డ్ ప్రోగ్రామ్ కోసం ఏడు ప్రసిద్ధ ఇంక్యుబేటర్లతో జతకట్టింది. అవి సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ - ఐఐటీ ముంబై, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ - ఐఐటీ ఢిల్లీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ - ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ - ఐఐఎస్సీ బెంగళూరు, టీ-హబ్ హైదరాబాద్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ - కేఐఐటీ భువనేశ్వర్. -
90 శాతం భారతీయ ఆవిష్కరణలు ’కాపీలే’
ముంబై: దాదాపు 90 శాతం భారతీయ ఆవిష్కరణలన్నీ ’కాపీక్యాట్ ఐడియాలే’నని హాట్‌మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా విమర్శించారు. క్రియేటర్ల దేశంగా మారేందుకు భారత్ ఇంకా సన్నద్ధంగా లేదని నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టెస్లా వంటి ఆధునిక సంస్థల ప్లాంట్లలో 300–400 మంది మాత్రమే పనిచేస్తున్న నేపథ్యంలో దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల పెద్ద ఉపయోగం ఉండదని భాటియా చెప్పారు. చైనా ఇప్పటికే తయారీ దేశ స్థానాన్ని ఆక్రమించినందున భవిష్యత్తులో తయారీ రంగానికి కాకుండా క్రియేటర్ల దేశానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అయితే ఆ స్థాయికి ఎదిగేందుకు భారత్ ఇంకా సన్నద్ధంగా లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో సమస్యలను స్వతంత్రంగా గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు ఐడియాలను రూపొందించే దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో వికేంద్రీకరణ విధానం అవసరమని భాటియా సూచించారు. ప్రజలు తమ సమస్యలను గుర్తించి, తామే పరిష్కరించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఎయిర్‌బీఎన్‌బీ, టెస్లా, ఉబర్ వంటి ఆవిష్కరణలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. -
టెక్నాలజీతో హెల్త్‌కేర్ ఇన్ఫ్రా మెరుగు
న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు (హెల్త్‌కర్ ఇన్ఫ్రా) మెరుగుపడేందుకు టెక్నాలజీ, ఆవిష్కరణలు కీలకమని నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. అపోలో హాస్పిటల్ నిర్వహించిన 9వ ఎడిషన్ ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ సదస్సులో భాగంగా పరమేశ్వరన్ మాట్లాడారు. వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స అందించే వరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశ హెల్త్‌కేర్ వ్యవస్థను మార్చే కీలక టెక్నాలజీగా పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో డిజిటల్ హెల్త్‌కేర్ పరిష్కారాలు మరిన్ని అందుబాటులోకి వస్తాయన్నారు. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక హెల్త్ కవరేజీకి భారత్ చేరువ అయిందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అపోలో హాస్పిటల్ జేఎండీ సంగీతా రెడ్డి అన్నారు. ఈ క్రమంలో రోగుల భద్రత, డిజిటల్ హెల్త్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం!
పురాతన కాలం నుంచే భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం గురించి మనం చదువుకునే ఉంటాము. అప్పటి వినూత్న వ్యవసాయ పద్దతులతో ప్రజలు.. పంటలను సమృద్ధిగా పండించారు. కాగా, ఓ రైతు తాజాగా వినూత్న తరహాలో వ్యవసాయం చేస్తున్నాడు. కాగా, సృజనాత్మకత విషయానికి వస్తే భారతీయులు ప్రతీ ఒక్కరినీ ఓడించగలరని మరోసారి రుజువైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ రైతు ట్రేడ్మిల్ వంటి యంత్రంపై ఎద్దును నడిపిస్తూ సాగుకు కావాల్సిన నీటిని, మోటర్ల సాయంతో కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాడు. కాగా, ఎద్దు ట్రేడ్మిల్ వంటి యంత్రంపై నడుస్తుండగా పైపుల ద్వారా నీరు పంట పొలాలకు చేరుతోంది. అలాగే, మోటర్ల సాయంతో కరెంట్‌ను సైతం ఉత్పత్తి చేసి పంటల సాగుకు వాడుకుంటున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదరు వీడియోకు ‘రూరల్ ఇండియా ఇన్నోవేషన్. ఇట్స్ అమేజింగ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సదరు క్రియేటివ్ రైతులను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. స్వదేశీ ఆవిష్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతాయని అన్నాడు. మరో యూజర్ మాత్రం.. జంతువులను శారీరకంగా హింసిస్తున్నాడంటూ కామెంట్స్ చేశాడు. RURAL INDIA Innovation. It’s Amazing!! pic.twitter.com/rJAaGNpQh5 — Awanish Sharan (@AwanishSharan) September 23, 2022 -
ఎంఎస్ఎంఈల నుంచి కొత్త ఉత్పత్తులు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రతి మూడింటిలో ఒకటి పండుగలకు ముందే కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాలని అనుకుంటున్నాయి. ప్రచార కార్యక్రమాలు, డిస్కౌంట్లపై దృష్టి పెట్టనున్నట్టు 34 శాతం కంపెనీలు తెలిపాయి. మీషో–కాంటార్ సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. సెప్టెంబర్ 23 నుంచి ఈ కామర్స్ సంస్థల పండుగల ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇప్పటికే సేల్స్‌ను ప్రకటించాయి. ఆన్లైన్ విక్రేతల పండుగల విక్రయాల సన్నద్ధతను తెలుసుకునేందుకు మీషో కాంటార్ సర్వే ప్రయత్నించింది. సర్వే అంశాలు.. ► 36 శాతం మంది కొత్త ఉత్పత్తులను పండుగలకు ముందు విడుదల చేయనున్నట్టు తెలిపాయి. ► ప్రమోషన్లు, డిస్కౌంట్లను ప్రకటించనున్నట్టు 34 శాతం కంపెనీలు వెల్లడించాయి. ► ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడంపై ఇన్వెస్ట్ చేయనున్నట్టు 33 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ► పండుగల డిమాండ్‌ను తట్టుకునేందకు అదనపు స్టాక్‌ను సమకూర్చుకుంటామని 32 శాతం కంపెనీలు చెప్పాయి. ► కొత్త కస్టమర్లను చేరుకోవాలని 40 శాతం కంపెనీలు కోరుకుంటున్నాయి. ► దేశవ్యాప్తంగా 787 ఆన్లైన్ విక్రయదారుల నుంచి ఈ అభిప్రాయాలను మీషో సర్వే తెలుసుకుంది. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు! -
Sagubadi: వారెవ్వా! ఇకపై బండి లాగే ఎద్దుల కష్టం తగ్గుతుంది!
బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించడంతో పాటు రైతుల దైనందిన జీవనాన్ని సులభతరం చేసేందుకు దోహదపడే చక్కని ఆవిష్కరణను అందించి ప్రజలందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు మహారాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులు. సంగ్లికి సమీపంలోని రాజారాంబాపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్.ఐ.టి.)కి చెందిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మూగ జీవాల భుజాలపై బరువును తగ్గించే గొప్ప ఆవిష్కరణను అందించారు. బండిలో సరుకు బరువంతా దానికి ఉన్న రెండు చక్రాల మీద ఉంటుంది. అంతిమంగా ఆ బరువు బండిని లాగడానికి కట్టిన జత ఎద్దుల మెడలపై పడుతుంది. బండిపై చెరకు గడల్లాంటి భారీ లోడు వేసుకొని రోడ్డుపై లాక్కెళ్తున్న క్రమంలో స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు, రాళ్లు రప్పలు, గోతులు, ఎత్తు, పల్లాలు వచ్చినప్పుడు జోడెట్లపై తీవ్ర వత్తిడి ఉంటుంది. ఆ వత్తిడిలో ఒక్కోసారి ఎద్దుల కాళ్లు మడతపడి గిట్టలు దెబ్బతినటం, కాళ్లు విరగటం వంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. అటువంటప్పుడు రైతుకూ చాలా కష్టం కలుగుతుంది. పనులు ఆగిపోవడమే కాకుండా ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. మహారాష్ట్రలో 200కు పైగా చక్కెర మిల్లులకు ఎడ్ల బండ్లపైనే చెరకు గడలను రైతులు తోలుకెళ్తూ ఉంటారు. ఒక్కో మిల్లు పరిధిలో 250 వరకు ఎడ్ల బండ్లు ఉంటాయి. ఓవర్ లోడింగ్ తదితర కారణాల వల్ల తరచూ ప్రమాదాలు జరగడం గమనించిన బీటెక్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థులు ఎద్దుల బండ్ల రైతులు, ఎద్దులు ఎదుర్కొంటున్న సమస్యలనే ప్రాజెక్టుకు ఎంపిక చేసుకున్నారు. ‘సారధి’... ఈ ప్రాజెక్టుకు ‘సారధి’ అని పేరుపెట్టారు. సౌరభ్ భోసాలే, ఆకాష్ కదమ్, నిఖిల్ టిపైలే, ఆకాష్ గైక్వాడ్, ఓంకార్ మిరాజ్‌కర్‌తో కూడిన విద్యార్థి బృందానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సుప్రియా సావంత్ మార్గనిర్దేశం చేశారు. ఈ పరిశోధన క్రమంలో రెండు చక్రాల బండిని లాక్కెళ్లే ఎద్దుల మెడపై పడుతున్న బరువును తగ్గించేందుకు విద్యార్థులు మంచి ఆలోచన చేశారు. రెండు చక్రాల బండి ముందు వైపు పోల్‌కు, రెండు ఎద్దుల మధ్యలో, ఒక చిన్న టైరుతో కూడిన చక్రాన్ని బిగించారు. దీన్ని అమర్చటం వల్ల ఎద్దుల మెడపై పడే బరువులో 80% తగ్గిపోయిందని డా.సుప్రియా సావంత్ తెలిపారు. మిగతా 20% బరువును ఎద్దులు సునాయాసంగా భరించగలుగుతాయి. ఎక్కువ సేపు, ఎక్కువ దూరం అలసిపోకుండా బండిని లాక్కెళ్ల గలుగుతాయి. ‘థర్డ్ రోలింగ్ సపోర్ట్’ ఈ టైరును ‘థర్డ్ రోలింగ్ సపోర్ట్’ అని పిలుస్తున్నారు. ఎద్దుల ఎత్తును బట్టి దీని ఎత్తును సరిచేసుకోవటానికి అవకాశం కల్పించటంతో ఈ ఆవిష్కరణ విజయవంతమైంది. పొలంలో చెరకు గడలను కూలీలు బండికి లోడ్ చేస్తున్న సమయంలో కూడా టైరుతో కూడిన చక్రం సపోర్టుగా నిలుస్తోంది. ఓవర్ లోడ్ చేయడం వల్ల రోడ్డుపై వెళ్లున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లపై ఎద్దుల కాళ్లు జారిపోవడం, కాళ్లు మెలికలు తిరగడం వంటి అనేక ఇబ్బందులు కూడా ఈ ఆవిష్కరణతో తగ్గుతాయి. మేధోహక్కుల కోసం పేటెంట్ కార్యాలయంలో దరఖాస్తు దాఖలు చేశారు. అద్భుతమైన ఈ ఆవిష్కరణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైతులు, కార్మికులు, కూలీలతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రాజెక్టు పరిశోధన కాలంలో అండగా నిలిచి తోడ్పాటునందించిన ప్రొఫెసర్లు డాక్టర్ ఎస్.ఆర్. కుంభార్, ప్రొఫెసర్ పి.ఎస్. ఘటగే, ఆర్.ఐ.టి. డైరెక్టర్ డాక్టర్ సుష్మా కులకర్ణిలకు రుణపడి ఉంటామని సౌరభ్ ఆవిష్కర్తలు కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో వచ్చే చెరకు క్రషింగ్ సీజన్లో ఈ ఆవిష్కరణను రైతులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నామని ఆవిష్కర్తల్లో ఒకరైన సౌరభ్ భోసాలే ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: Terrace Garden: చక్కనింట.. మిద్దె పంట .. ఆదాయం.. ఆరోగ్యం बैलों का लोड कम करने के लिए बैलगाड़ी पर लगाया गया रोलिंग स्पोर्ट. फ़ोटो: साभार pic.twitter.com/icjwYkd0Ko — Awanish Sharan (@AwanishSharan) July 14, 2022 -
ఇలాంటివారి వల్లే అమెరికా అలా మారింది - ఆనంద్ మహీంద్రా
సామాజిక అంశాలపై స్పందించడం, ప్రతిభ ఉంటే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ విషయం రుజువైంది కూడా. పల్లెల్లో దాగున్న ప్రతిభను సైతం గుర్తిస్తారు. ఇలాంటి చిన్న చిన్న అంశాలే పెద్ద మార్పులకు దారి తీస్తాయంటున్నారు ఆనంద్ మహీంద్రా. ప్రతిభకు ప్రతీక ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ ఏశారు. ఇందులో ఒక కూల్‌డ్రింక్ బాటిల్, ఒక పొడవైన కర్ర, కొన్ని తాళ్లు/ దారం సాయంతో చెట్టు చిటారు కొమ్మన ఉన్న పళ్లను ఎటువంటి అలుపు లేకుండా సురక్షితంగా కోసే పరికరం తయారీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆ వీడియోలో దృశ్యాలు ఈ దేశ సామాన్య పౌరుల ప్రతిభకు ప్రతీగా కనిపిస్తాయి. ఆ పరికరం అది పని చేసే తీరు చూసి అబ్బుర పడిన ఆనంద్ మహీంద్రా వెంటనే తన అభిప్రాయలను ట్విటర్లో పంచుకున్నారు. ఇలాంటి వారి వల్లే ‘ఇదేమీ భూమి బద్దలయ్యేంత బ్రహ్మాండమైన ఆవిష్కరణ కాదు. కానీ ఇది కొత్తగా ఆలోచించాలి, కొత్త ఆవిష్కరణలు చేయాలనే ఆలోచనలు పెరుగున్నాయనడానికి (థింకరింగ్) నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే ఈ వీడియో పట్ల నేను ఇంత ఉత్సాహం చూపిస్తున్నాను. ఇలాంటి వారి వల్లే అమెరికా ఈ రోజు గొప్ప దేశంగా నిలిచింది. ఇలాంటి అలవాటు వల్లే అమెరికన్స్ తమ ఇంట్లో ఉన్న గ్యారేజీల్లో బేసేమెంట్లలో ఎన్నో సరికొత్త అంశాలను కనిపెట్టారు. ఇలాంటి ఆలోచనాపరులే రేపటి భారీ ఆవిష్కర్తలు’ అంటూ ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. Not an earth-shattering invention. But I’m enthusiastic because it shows a growing culture of ‘tinkering.’ America became a powerhouse of inventiveness because of the habit of many to experiment in their basement/garage workshops. Tinkerers can become Titans of innovation. 👏🏼👏🏼👏🏼 pic.twitter.com/M0GCW33nq7 — anand mahindra (@anandmahindra) June 2, 2022 చదవండి: Anand Mahindra: ఆవిష్కకర్తలకు ఆనంద్ మహీంద్రా సవాల్? మీరు రెడీనా.. -
అవసరమే ఆవిష్కరణ..
బిడ్డా.. ఈ గోలీ ఎప్పుడు వేసుకోవాలి.. గిది చూసిపెట్టు... ఇది పరగడుపున వేసుకునేదా... పడుకునే ముందు వేసుకునే గోలీనా... ఇలా ప్రతినిత్యం అమ్మ టాబ్లెట్స్ టైమ్‌కు తీసుకోవడానికి çపక్క వారి సహాయం కోసం ఎదురు చూడటం నుంచే ఈ ఎకోఫ్రెండ్లీ మెడిసిన్స్ టైమ్ టేబుల్ బ్యాగ్ తయారు చేయాలనే ఆలోచన వచ్చేలా చేసింది. ఈ ఆలోచనే రాష్ట్రస్థాయిలో పెద్దపల్లి పిల్లలను రాష్ట్ర ఇన్నోవేషన్ చాలెంజ్ విజేతగా నిలిపింది. అలాగే మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా పోర్టబుల్ అంబరిల్లా రూమ్‌ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థినులు రెండవ బహుమతి అందుకున్నారు. మరిన్ని ఆవిష్కరణలు చేస్తా మేం తయారు చేసిన మినీ పోర్టబుల్ రూమ్, అంబరిల్లా టాయిలెట్స్ ఆవిష్కరణకు ఇంత మంచి స్పందన వస్తుందని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉంది. పెద్ద పెద్ద సార్ల చేతుల మీదుగా బహుమతి అందుకున్నాం. ఇప్పుడు మరిన్ని అవిష్కరణలు తయారు చేయాలనే సంకల్పం కల్గింది. మా సార్లు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలు చేస్తాం. – రితిక, 10వ తరగతి, నెల్లికుదురు మోడల్‌స్కూల్, మహబూబాబాద్ సంతోషంగా ఉంది ఎగ్జిబిట్‌ను తయారు చేయడానికి వారం రోజులకు పైగా కష్టపడ్డాం. సార్లు మంచిగా చెప్పి తయారు చేయించారు. ఎగ్జిబిట్ గురించి చెప్పేటప్పుడు ముందుగా భయం వేసింది. తర్వాత వివరించడం సులువయ్యింది. ఇకనుంచి ప్రతి సంవత్సరం ఎగ్జిబిట్స్ తయారు చేస్తా. మా సార్లు, అమ్మానాన్న, మా ఊరిలోని వారు అందరూ మెచ్చుకుంటున్నారు. సంతోషంగా ఉంది. – కీర్తన, 6వ తరగతి, టీఎస్ మోడల్ స్కూల్, నెల్లికుదురు, మహబూబాబాద్ అమ్మ తిప్పలు చూడలేక... సైన్స్ ఇన్నోవేషన్స్ ఛాలెంజ్ కోసం ఐదు నెలల క్రితం నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మెంటర్ శివకృష్ణ సర్ ఆధ్వర్యంలో తమన్నా, నేను సర్టిఫికేషన్ కోర్సు చేశాం. ఇందులో ఆన్లైన్లో 10 వీడియోలు చూసి, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి సర్టిఫికేట్ ఇచ్చారు. అందులో గెలిచిన వారి నుంచి సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కొన్ని సూచనలు చేయాలని చెప్పారు. దాని గురించి రెండు – మూడు ఆలోచనలు చేశాం. అందులో అమ్మ ప్రతిరోజూ టాబ్లెట్స్ వేసుకోవడానికి పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపితే బాగుంటుందని నా ఆలోచన గురించి చెప్పా. నాన్న గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. అమ్మ బీడీలు చుడుతుంది. నాకు చెల్లి, తమ్ముడు ఉన్నారు. అమ్మకు ఒంట్లో బాగుండదు. ప్రతి రోజూ మందులు తీసుకోవాలి. ఆమెకు ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో తెలిసేది కాదు. నేను సహాయం చేస్తుంటాను. అమ్మలాంటి నిరక్షరాస్యులందరిదీ ఇదే సమస్య కదా అనిపించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మందులు సులువుగా తెలుసుకోవడానికి అరలతో సంచి చేద్దాం అనుకున్నాను. ఇలాంటి సంచి ఉంటే ఒక సమయంలో వేసుకోవాల్సిన మందులను మరొక సమయంలో తీసుకోవటం వంటి పొరపాట్లు జరగవు. ఈ ఆలోచనను పైకి పంపించగా మా ప్రాజెక్టు సెలెక్టు అయ్యింది. – జి. శివాని అంధులకు సైతం ఉపయోగపడాలని... తెలంగాణ ఇన్నోవేషన్ చాలెంజ్ కోసం మేము అబ్దుల్ కలాం అనే గ్రూప్‌గా ఏర్పడి ఎకో ఫ్రెండ్లీ మెడిసిన్ టైమ్ టేబుల్ బ్యాగ్‌ను రూపొందించాం. మొదట కేవలం నిరక్షరాస్యుల కోసం బ్యాగ్ తయారు చేయాలనుకున్నాం. తర్వాత మనం తయారు చేసే ప్రాజెక్టు నిరక్షరాస్యులతోపాటు, అంధులు సైతం ఉపయోగించేలా పర్యావరణ హితంగా రూపకల్పన చేస్తే బాగుంటుందనిపించి, నా ఆలోచనను సార్‌తో పంచుకున్నాను. మా సర్ సహకరించారు. ఒక్కో పూటకు ఒక్కో బ్యాగ్ అనుకున్నాం. కానీ ఎక్కువ బ్యాగ్‌లు ఐతే ఇబ్బంది అవుతుందని ఒక్కటే బ్యాగ్‌గా తయారు చేసి ముందు వైపు నాలుగు పాకెట్లు, వెనుక రెండు పాకెట్లు ఉండేలా తయారు చేశాం. ఆ పాకెట్ల పై అందరూ సమయం గుర్తుపట్టేలా సింబల్స్ పెట్టాం. అంధుల కోసం ప్రత్యేకం గా బ్రెయిలీ లిపి గుర్తులు ఉంచాం. మందుల కోసం షాప్‌కి వెళ్లేటప్పుడు ఈ సంచిని తీసుకెళితే షాపు వాళ్లే ఏ పూట వేసుకోవాల్సిన మందులను ఆ అరలో సర్ది ఇవ్వగలుగుతారు. లేదంటే తర్వాత పిల్లలు కానీ తెలిసిన వాళ్ల సహాయం కానీ తీసుకోవచ్చు. నెలకోసారి ఇలా మెడికల్ టైమ్ టేబుల్ బ్యాగ్‌ను సర్దుకుంటే నెలంతా మరొకరి అవసరం లేకుండా సమయానికి మందులు వేసుకోవచ్చు. – బి. తమన్నా, 9వ తరగతి, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, ధర్మారం, పెద్దపల్లి జిల్లా శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
వెలుగుదారులు.. అసామాన్యులు
సోలార్ పవర్.. సౌరశక్తి. ఎంత కావాలంటే అంత. పూర్తిగా ఉచితం. చిన్న పెట్టుబడితో పర్యావరణానికి మేలు చేసే ఎంతో శక్తిని ఉచితంగా పొందవచ్చు. దీనికంతటికీ మూలం సౌర వ్యవస్థ. సూర్యుడి బాహ్య వాతావరణ పొరలో 11 లక్షల డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉంది. అంటే భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటా వాట్ల శక్తి గల సూర్యకిరణాలు వెలువడతాయి. వీటిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. ఇలా ప్రకృతి ఉచితంగా అందించే సౌర శక్తిని ఫొటో వోల్టాయిక్ ఘటాల ద్వారా విద్యుత్తుగా మార్చుతారు. చాలా కాలం క్రితమే సోలార్ విద్యుత్‌ను గుర్తించినా.. అమల్లో మాత్రం ఆలస్యం చేస్తున్నారు. సులభంగా దొరుకుతుంది కదా.. అని బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడ్డాం. హైడ్రో పవర్ అంటే జలవిద్యుత్ ఉన్నా.. దానిపై పూర్తిగా ఆధారపడలేని పరిస్థితి. అందుకే సోలార్ విద్యుత్‌పై దృష్టి పెట్టింది లోకం. అందుకే ఇప్పుడు కొత్త నినాదం ఊపందుకుంది. ఒకే సూర్యుడు – ఒకే ప్రపంచం – ఒకే గ్రిడ్. అంటే వీలైనంత సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. అన్ని దేశాల విద్యుత్ వ్యవస్థలను అనుసంధానం చేయగలిగితే.. పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లమవుతాం. ఎండకాసే దేశాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్.. చీకట్లు నిండిన చోట వెలుగులు నింపుతాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ఇండియా డాటా పోర్టల్ ప్రకారం గత ఏడున్నరేళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 2.6 గిగా వాట్ల నుంచి 46 గిగావాట్ల సామర్థ్యం స్థాయికి చేరింది. ఇక పవన విద్యుత్ ఉత్పత్తి 5.5 గిగా వాట్లకు చేరింది. ప్రత్యామ్నయ మార్గాల ద్వారా ఏకంగా 26 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. రైతుల సాగు కోసం వినియోగించే సోలార్ పంప్‌లు 20 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్లలో మూడు మన దేశంలో ఉన్నాయి. అన్నింటికంటే పెద్ద ప్లాంట్, మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో భాడ్లా అనే గ్రామంలో నిర్మించిన ప్లాంట్. దీన్ని 2,700 మెగావాట్ల సామర్థ్యంతో 14 వేల ఎకరాలలో నిర్మించారు. ఇక కర్ణాటకలో 13 వేల ఎకరాలలో 2,050 మెగవాట్ల సామర్థ్యంతో నిర్మించిన ప్లాంట్‌కు నాలుగో స్థానం దక్కింది. ఏపీలోని అనంతపురం జిల్లా నంబులపులకుంటలోనూ భారీ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మించారు. దీని సామర్థ్యం 1200 మెగావాట్లు. ఇటీవల స్మార్ట్ సిటీ పోటీల్లో తిరుపతి అర్బన్ ఎన్విరాన్ మెంట్ విభాగంలో కైలాసగిరి రిజర్వాయర్‌లో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్ 3వ ర్యాంక్‌ను సాధించింది. 6 మెగావాట్ల సోలార్ విద్యుత్ వినియోగంలోకి రావడంతో తిరుపతి కార్పొరేషన్ కు భారీగా బిల్లు తగ్గింది. ఏకంగా రూ.1.75 కోట్ల మేర సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తుండడంతో మరిన్ని సోలార్ ప్లాంట్లకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సూర్యశక్తిని ఒడిసి పట్టుకుంటున్నది ప్రభుత్వాలే కాదు.. సంస్థలతో పాటు వ్యక్తులు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారం కనిపెట్టి, ప్రపంచ వ్యాప్తంగా మార్పులు తీసుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్ ప్రిన్స్ విలియం ఈ ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ను నెలకొల్పారు. గతేడాది ప్రారంభించిన ఈ ప్రైజ్ ఫైనలిస్టుల జాబితాలో మన దేశానికి చెందిన వాళ్లు ఇద్దరున్నారు. అందులో ఒకరు తిరువణ్ణామళైలోని 9వ తరగతి విద్యార్థిని వినీష. చిన్నప్పటి నుంచే తనకు పర్యావరణమంటే ఎంతో ప్రేమ. దీనికి తోడు సైన్సుపై ఆసక్తి. ఈ రెండింటి కలబోతగానే సోలార్ ఐరన్ కార్ట్‌ను తయారు చేసిందీ టాలెంటెడ్ గర్ల్. ఓ రోజు స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఇంటి దగ్గర ఇస్త్రీ బండి వ్యాపారిని చూసింది వినీష. బాగా మండించిన బొగ్గులను ఇస్త్రీ పెట్టెలో వేసి దుస్తులు ఇస్త్రీ చేస్తున్న పద్ధతిని గమనించింది. ఇంటికొచ్చాక బొగ్గు మండించడం వల్ల కలిగే నష్టాలను ఇంటర్నెట్లో వెతికింది. బొగ్గును ఉత్పత్తి చేయాలంటే చెట్లను నరకాలి. కట్టెలను కాల్చాలి. ఆ పొగతోపాటు కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు వెలువడుతుంది. ఇవన్నీ తెలుసుకున్నాక.. వినీషలో కొత్త ఆలోచన మొదలయింది. ఆ తపన నుంచి వచ్చిన ఆవిష్కరణే ‘సోలార్ ఐరన్ కార్ట్’. ఈ మొబైల్ ఇస్త్రీ బండి సోలార్ విద్యుత్‌ను ఉపయోగించుకుని పని చేస్తుంది. ఈ ప్రయత్నానికి ఎర్త్ షాట్ ప్రైజ్ దిగి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 750 ఎంట్రీల్లో తుది అంచెకు చేరుకున్న 15లో మరొకటి ఢిల్లీకి చెందిన ‘విద్యుత్ మోహన్’ ప్రాజెక్టు. విద్యుత్ మోహన్ .. గత కొన్నాళ్లుగా దేశ రాజధాని ఎదుర్కొంటున్న వాయు కాలుష్యాన్ని గమనిస్తున్నాడు. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఓ వైపు ఉత్తరాది పొలాల్లోని మంటల నుంచి వచ్చే పొగ.. దానికి ఢిల్లీ రోడ్లపై తిరిగే వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం.. అన్నీ కలగలసి ఊపిరాడకుండా చేస్తున్నాయి. టకా అంటే డబ్బు, చార్ అంటే బొగ్గు లేదా కార్బన్ .. కాలుష్యం నుంచి డబ్బు అన్న కాన్సెప్ట్‌లో టకాచార్ అనే ఓ సంస్థను ప్రారంభించాడు మోహన్ . దీని ప్రధాన ఉద్దేశం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టును నడుపుతున్నారు. వ్యవసాయంలో ఉత్పత్తయ్యే చెత్త, చెదారం, పంట కోసిన తర్వాత ఉండే మొదళ్లు, ఇతర వ్యర్థాలను సాధారణంగా చాలా మంది రైతులు తగులబెడతారు. అలా తగులబెట్టే బదులు ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ ఓ యంత్రంలో వేయడం ద్వారా బయోచార్గా మారుతాయి. బయోచార్ను భూసారాన్ని పెంచే ఎరువుగా రైతులు తిరిగి వాడుకోవచ్చు. తద్వారా పంట వ్యర్థాలు మళ్లీ భూమిలోకి చేరడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. (క్లిక్: రోజుకు ఎన్ని వేల లీటర్ల గాలిని పీల్చుకొని వదులుతామో తెలుసా?) ముంబైకి చెందిన మధురిత గుప్తాది మరో విజయగాథ. ముంబైలో వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తా ఓ వైల్డ్ లైఫ్ సంస్థలో వ్యవస్థాపక సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శానిటరీ ప్యాడ్స్‌ను తగులబెట్టడం లేదా భూమిలో పారేయడాన్ని గమనించారు. దీని వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని నివారించాలన్న ఆలోచన కలిగింది. శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతోంది. ఐఐటీలో చదివి ఇంజినీర్‌గా పని చేస్తోన్న తన తమ్ముడు రూపన్ తో కలిసి సోలార్ లజ్జా అనే యంత్రాన్ని రూపొందించారు మధురిత. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్‌ను ఈ మెషీన్ లో వేయడం వల్ల క్షణాల్లో వాటిని బూడిదగా మార్చవచ్చు. ఇతర మెషిన్ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్ . సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్ పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్ ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపోన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. ప్రకృతికి మంచి చేసే మెషిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్ లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ లో ‘ఇన్ స్ప్రెన్యూర్ 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ విమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటు దక్కించుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హరియాణా, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చారు. ఇప్పుడు జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. (క్లిక్: ఆర్ఓ నీటిపై ఆసక్తికర విషయాలు.. టీడీఎస్ 500 ఎం.జీ దాటితే!) గుజరాత్ వడోదర జిల్లాకు చెందిన నీల్ షా వయస్సులో చిన్నోడయినా.. సమాజానికి పెద్ద పరిష్కారం చూపించే పనిలో పడ్డాడు. ఇంటర్ చదువుతున్న నీల్‌ది ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం. అయితే మాత్రం ఆవిష్కరణలపై ఆసక్తి తగ్గించుకోలేదు నీల్‌షా. ఓ సారి స్కూల్లో ప్రాజెక్ట్ కింద అసైన్ మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా సోలార్ సైకిల్ రూపొందించాడు. రూ. 300లతో పాత సైకిల్ కొనుగోలు చేసిన నీల్‌షా.. దానికి రెండు సోలార్ ప్యానెళ్లను అమర్చాడు. ఒక సారి చార్జింగ్ చేస్తే 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ఈ సైకిల్. 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ సైకిల్.. పల్లెల్లో పేద వర్గాలకు ఎంతో ఉపయోగకరం. తమిళనాడులోని మధురైకి చెందిన ధనుష్ కూడా ఇలాంటి సైకిల్‌నే తయారు చేశాడు, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చదివిన ధనుష్.. తాను తయారు చేసిన సైకిల్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చూపించాడు. కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు రుపాయి కన్నా తక్కువే. కేరళ పోలీసులకు వినూత్న ఆలోచన వచ్చింది. రోడ్లపై గంటల కొద్దీ నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులకు సోలార్ గొడుగులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ గొడుగు రెండు రకాలుగా పని చేస్తుంది. మండుటెండల్లో డ్యూటీ చేసే పోలీసులకు నీడ ఇస్తుంది. వేడి నుంచి ఉపశమనం పొందేలా అందులోనే ఫ్యాన్ ఉంటుంది. అంటే గొడుగుపైన సోలార్ ప్యానెల్, గొడుగు కింద బ్యాటరీ. ఇదే టెంట్లో కింద లైటింగ్ సౌకర్యం కూడా ఉంది. రాత్రి పూట కూడా పోలీసులకు ఇది ఉపయోగపడుతుంది. ఎర్నాకుళం జిల్లాలో మొదలైన ఈ ప్రాజెక్టును మరిన్ని జిల్లాలకు విస్తరించారు కేరళ పోలీసులు. (క్లిక్: 2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే.. అదే జరిగితే!) ఇప్పుడంటే ఎలక్ట్రిక్ కార్ల గురించి మాట్లాడుతున్నారు కానీ.. అయిదేళ్ల కిందటే సోలార్ కార్‌ను తయారు చేశారు కర్ణాటకలోకి మణిపాల్ యూనివర్సిటీ విద్యార్థులు. పూర్తిగా సౌర విద్యుత్‌తో నడిచే ప్రోటో టైప్ సోలార్ ఎలక్ట్రిక్ కార్‌ను రూపొందించారు. సోలార్ మొబిల్ పేరిట రూపొందించిన ఈ కారుకు టాటా పవర్ తమ వంతుగా సహకారం అందించింది. అనుదీప్ రెడ్డి, జీత్ బెనర్జీ, వరుణ్ గుప్తా, శివభూషణ్ రెడ్డి, సులేఖ్ శర్మలు కలిసి రూపొందించిన ఈ కారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి చార్జింగ్ పూర్తయితే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే సమయంలో చార్జింగ్ చేసుకోగలదు. సూర్యరశ్మితో నడిచే కార్లను అభివృద్ధి చేసేందుకు విశ్వవ్యాప్తంగా విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి రెండేళ్ల కోసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు తాము రూపొందించిన కార్లతో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియాలో డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3021 కిలోమీటర్ల పాటు ఈ పోటీ జరుగుతుంది. (చదవండి: ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తున్నట్లు?) ఇవే కాదు.. సౌరశక్తితో మరెన్నో వినూత్న ఆవిష్కరణలు మన చుట్టున్నవాళ్లు చేస్తున్నారు. భవిష్యత్తులో మనకెన్నో పర్యావరణ అనుకూల పరిష్కారాలు చూపించనున్నారు. - శ్రీనాథ్ గొల్లపల్లి సీనియర్ అవుట్‌పుట్ ఎడిటర్, సాక్షి టీవీ g.srinath@sakshi.com -
మేడ్ ఇన్ శ్రీకాకుళం
జిల్లా విద్యార్థులు తమ ఆలోచనలతో అదరగొట్టారు. జాతీయ స్థాయి ఇన్స్పైర్ మనాక్ పోటీలకు ఎంపికై ‘మేడ్ ఇన్ సిక్కోలు’ బ్రాండ్‌కు ఊపిరి పోశారు. అమ్మాయిల కోసం ఓ స్కూలు విద్యార్థులు ఆలోచిస్తే.. అన్నదాతల కోసం మరో బడి పిల్లలు ప్రాజెక్టు తయారు చేశారు. అగ్ని ప్రమాదాలను గుర్తించడానికి ఒక పాఠశాలలో ప్రయోగాలు జరిపితే.. దివ్యాంగుల కోసం మరో స్కూలు పరికరాన్ని తయారు చేసింది. జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టులు జాతీయ స్థాయి ఇన్స్పైర్ మనాక్ పోటీలకు ఎంపిక కావడంతో విద్యార్థులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నాలుగు ప్రాజెక్టులను పరిశీలిస్తే.. శ్రీకాకుళం న్యూ కాలనీ,రణస్థలం, రేగిడి, రాజాం సిటీ, హిరమండలం : రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనాక్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 331 ప్రాజెక్టులు పోటీ పడ్డాయి. ఇందులో జాతీయ పోటీలకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 34 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వాటిలో శ్రీకాకుళం నుంచి ఎంపికైనవి నాలుగు ఉన్నాయి. ఈ పోటీలు న్యూఢిల్లీలోని ప్రగతి మైదానం లేదా ఐఐటీ వేదికగా జరగనున్నాయి. తేదీలు ఇంకా ఖరా రు కాలేదు. అంతకుముందు వర్చువల్ విధానంలో జిల్లా స్థాయి పోటీలకు 287 ప్రాజెక్టులు వచ్చాయి. వీటి నుంచి 23 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి పంపించారు. వాటిలో నాలుగు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ‘ఫైర్’ ఉన్న ప్రాజెక్టు ప్రాజెక్టు పేరు: ఫైర్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ విద్యార్థి : గొర్లె ప్రణతి, 10వ తరగతి పాఠశాల : జీఎంఆర్ వరలక్ష్మి డీఏవీ పబ్లిక్ స్కూల్, రాజాం గైడ్ టీచర్ : ఎస్.కిరణ్‌కుమార్(ఫిజికల్ సైన్స్) అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా ముందుగా ప్రమాదాన్ని గుర్తించేలా ప్రణతి తన ప్రాజెక్టుకు రూ పకల్పన చేసింది. పైథాన్ లాంగ్వేజ్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ చేసి దీని ద్వారా అగ్ని ప్రమాదాలను ప సిగట్టవచ్చని వివరించింది. వెబ్‌కెమెరా ద్వారా ఒక కిలోమీటర్ పరిధిలో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఈ సాఫ్ట్వేర్ తన కార్యాలయంలో అందరినీ అలెర్ట్ చేస్తుంది. బీప్ సౌండ్‌తో పాటు కాంతిని కూడా అందించి హెచ్చరిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఖర్చు చాలా తక్కువ. సమయం కూడా ఆదా అవుతుంది. వెబ్‌కెమెరా, సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేస్తే సరిపోతుందని విద్యార్థి ప్రణతి, గైడ్ టీచర్ చెబుతున్నారు. అన్నదాతకు వెన్నుదన్న ప్రాజెక్టు పేరు: రైతు మిత్ర యంత్రం విద్యార్థి: పాలవలస అక్షయ్‌కుమార్ పాఠశాల : జెడ్పీహెచ్‌స్కూల్, రేగిడి గైడ్ టీచర్ : బూరవెల్లి ఉమామహేశ్వరి, బయలాజికల్ సైన్స్ రైతులకు రానురాను సాగు ఖర్చు లు అధికమైపోతున్నాయి. వీటిని తగ్గించే క్రమంలో ఓ ప్రాజెక్టును త యారు చేశాడు రేగిడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి అక్షయ్‌కుమార్. కూలీల ఖర్చు లేకుండా రైతు మిత్ర యంత్రంతో మ నుషులు చేసే పనులు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ రైతు మిత్ర యంత్రంతో అన్నదాతకు చాలా ఖర్చులు ఆదా అవుతాయి. ఈ ప్రాజెక్టుకు అక్షయ్‌కుమార్‌కు జి.హరిబాబు అనే మరో విద్యార్థి సహకారం అందించాడు. ఈ యంత్రంతో రైతులు పొలం చదునుచేయడం, విత్తనాలు చల్లడం, నీరుపెట్టడం, ఎరువులు, పురుగు మందు చల్లడం, పంట చేతికి అందిన సమయంలో ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తడం, బస్తా బరువును కొలవడం, నిల్వ చేసే చోటికి వాటిని తరలించడం చేయవచ్చు. అలాగే దీన్ని నిర్మాణ రంగంలో విని యోగించువచ్చు. దీన్ని పాఠశాలలో వృధాగా పడి ఉన్న పరికరాలు, వస్తువులతో రూపొందించారు. దాతలు సహకరిస్తే దీనిని మరింత ఉన్నతంగా తయారు చేస్తామని గైడ్ టీచర్, విద్యార్థి చెబుతున్నారు. తలుపు తలపు ప్రాజెక్టు పేరు: ఆటోమేటిక్ డోర్‌లాక్ సిస్టమ్ విద్యార్థి : టి.ఢిల్లేశ్వరరావు, 9వ తరగతి పాఠశాల : ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హిరమండలం గైడ్ టీచర్ : ఆర్.అరుణ (బయలాజికల్ సైన్స్) సాధారణంగా దివ్యాంగులను పలకరించడానికి వారి ఇంటికి వెళ్లే వారు తిరిగి వచ్చేటప్పుడు త లుపు వెయ్యరు. మళ్లీ అక్కడ వరకు వెళ్లి తలుపు వేయడం దివ్యాంగులకు చికాకు కలిగిస్తుంది. ఈ సమస్య నివారణకు హిరమండలం హైస్కూల్ వి ద్యార్థి ఢిల్లేశ్వరరావు ఒక ప్రాజెక్టును తయారు చే సుకున్నాడు. అదే ఆటోమేటిక్ డోర్‌లాక్ సిస్టమ్. మంచానికే పరిమితమైన వారిని చూసేందుకు ఎవరైనా వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు ఆటోమేటిక్ సిస్ట మ్ ద్వారా తలుపు క్లోజ్ అవుతుంది. డోర్‌కు సర్క్యూట్ అమర్చాలి. రిమోట్లో బ్యాటరీలు వే యాలి, స్ప్రింగ్ సిస్టమ్ ద్వారా తలుపు ముందుకు, వెనక్కి తెరుచుకుంటుంది. బ్యాటరీలు మాత్రం వేయాల్సి ఉంటుంది. పక్షవాతంతో కాళ్లుచేతులు పని చేయని వారికి ఈ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీని తయారీకి కేవలం రూ.1000 అవసరం అవుతుందని విద్యార్థి ఢిల్లీశ్వరరావు, గైడ్ టీచర్ చెబుతున్నారు. పరిశుభ్రం.. సురక్షితం ప్రాజెక్టు పేరు: అరటి పీచు నుంచి శానిటరీ ప్యాడ్స్ తయారీ విద్యార్థి: కె.గాయత్రి, కె.సుజాత, 10వ తరగతి పాఠశాల: ఏపీ మోడల్‌స్కూల్, కొండములగాం (రణస్థలం మండలం) గైడ్ టీచర్ పేరు: పి.శ్రీదేవి (బయలాజికల్ సైన్స్) ఆడ పిల్లల రుతు సమస్యల గురించి చాలా మంది ఇప్పటికీ బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ దీనిపై ఒక ప్రాజెక్టు తయారు చేసి కొండములగాం మోడల్ స్కూల్ విద్యార్థినులు గాయత్రి, సుజాతలు శభాష్ అనిపించుకున్నారు. అరటి పీచుతో నాణ్యమైన, మేలైన శానిటరీ ప్యాడ్స్ తయారు చేయవచ్చని వారు ప్రాజెక్టును రూపొందించారు. దీని తయారీ గురించి వారిలా వివరించారు. అరటి గెలలు తీశాక అరటి మెక్కలు మిగిలి ఉంటాయి. అందులో కాండం నుంచి పీచును తొలగిస్తారు. వేరుచేసిన పీచును కాటన్ క్లాస్‌తో కలిపి ప్యా డ్స్‌ను తయారుచేస్తారు. ఒక ప్యాడ్‌కు ఆరు గ్రా ముల పీచు అవసరం అవుతుంది. కాటన్ క్లాత్ అవసరం. ఆ కాటన్ క్లాత్‌తోనూ స్ట్రిచ్చింగ్ చే యాలి. ఇది ఈజీగా భూమిలో కలిసిపోతుంది. వేడినీటిలో ఉతికి ఒక ప్యాడ్‌ని అధిక సార్లు వినియోగించవచ్చు. ప్రకృతి నుంచి తయారుచేసిన ప్యాడ్స్ కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అతి తక్కువ ఖర్చు. ఒక ప్యాడ్ తయారు చేయడానికి కేవలం రూ.6 మాత్రమే ఖర్చు అవుతుందని విద్యార్థినులు, గైడ్ టీచర్ చెబుతున్నారు. విద్యార్థులకు, గైడ్ టీచర్లకు అభినందనలు జిల్లా నుంచి జాతీయస్థాయి ఇన్స్పైర్ మనాక్ పోటీలకు రికార్డు స్థాయిలో నాలుగు ప్రా జెక్టులు ఎంపిక కావడం చాలా సంతోషం. అభినందనీయం. జిల్లాకు గర్వకారణం. ఉత్తమ ప్రదర్శనలు కనబర్చిన విద్యార్థులు, గైడ్ టీచర్లకు శుభాకాంక్షలు. వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలి. – బి.లింగేశ్వరరెడ్డి, డీఈఓ శ్రీకాకుళం -
వరల్డ్ ఫస్ట్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ కేవలం ఈ స్మార్ట్‌ఫోన్‌లో...!
Realme GT 2 Pro to Get Three World First Innovations Company Claims: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ మరో అద్భుతమైన ఆవిష్కరణను నెలకొల్పనుంది. ప్రపంచంలోనే మొదటి ఇన్నోవేటివ్ ఫీచర్స్‌ను రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌లో ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రాబోతున్న కొత్త ఫీచర్లను రియల్మీ అధికారిక యూట్యూబ్‌లో ఖాతాలో సోమవారం రోజున ప్రత్యక్ష ప్రసారం చేసింది. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫోటోగ్రఫీ, కమ్యూనికేషన్ విషయాల్లో వరల్ట్ ఫస్ట్ ఇన్నోవేషన్స్‌గా నిలుస్తోందని రియల్మీ పేర్కొంది. రియల్మీ జీటీ 2 ప్రో డిజైన్ ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయంలో పేపర్ నుంచి ప్రేరణ పొందినట్లు కంపెనీ వెల్లడించింది. తన కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను పేపర్ టెక్ మాస్టర్ డిజైన్ కంపెనీ అభివర్ణించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌కోసం ప్రఖ్యాత జపనీస్ ఇండస్ట్రియల్ డిజైనర్ Naoto Fukasawa కంపెనీతో రియల్మీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ SABIC ద్వారా బయో-పాలిమర్ మెటీరియల్‌తో నిర్మించనుంది. దీని ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లో ప్లాస్టిక్ నిష్పత్తి 21.7 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గనుంది. రియల్మీ జీటీ 2 ప్రో కెమెరా ఫీచర్ రియల్మీ నుంచి రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్‌లో భాగంగా రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు న్యూ అల్ట్రావైడ్ సెన్సార్‌ను కూడా అందించింది. ఈ కొత్త సెన్సార్ 150-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూస్‌తో రానుంది. ప్రైమరీ వైడ్ సెన్సార్‌లోని 89-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ కంటే 273 శాతం ఎక్కువగా ఉంది. ఈ "అల్ట్రా-లాంగ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్"తో ఫోటోలను మరింత ఆకర్షణీయంగా తీయవచ్చుని రియల్మీ పేర్కొంది. రియల్మీ జీటీ 2 ప్రో కమ్యూనికేషన్ ఫీచర్ కొత్త రియల్మీ జీటీ 2 ప్రోలో యాంటెన్నా అర్రే మ్యాట్రిక్స్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి "అల్ట్రా వైడ్ బ్యాండ్ హైపర్‌స్మార్ట్ యాంటెన్నా స్విచింగ్" సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతో అన్ని దశల నుంచి ఒకే సిగ్నల్ బ్యాండ్లకు మద్దతు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఉత్తమ నెట్వర్క్ బ్యాండ్‌ని ఎంచుకోవడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది.యాంటెన్నా స్విచింగ్ సిస్టమ్‌తో పాటు, రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో వైఫై సామర్థ్యాన్ని పెంచేందుకు, 360-డిగ్రీ ఎన్ఎఫ్సీ మద్దతుతో రానుంది. చదవండి: ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...! కొత్త లేబర్‌కోడ్స్ అమలులోకి వస్తే..! -
ఎయిర్టెల్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్టెల్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రకటించింది. ఇన్వెస్ట్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కమ్యూనికేషన్స్, డిజిటల్ అడ్వర్టైజింగ్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో విభిన్న పరిష్కారాలను ప్రదర్శించడానికి తొలి దశ సాంకేతిక కంపెనీలను ఆహ్వానిస్తారు. విజేతలుగా నిలిచిన టాప్–10 కంపెనీలకు నగదు బహుమతులు, ఎయిర్టెల్ ఇన్నోవేషన్ ల్యాబ్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఔత్సాహిక స్టార్టప్స్ జనవరి 24లోగా దరఖాస్తు చేసుకోవాలి. -
‘తమ్ముడితో కలిసి ఈ పని చేశా’.. క్షణాల్లో బూడిద చేస్తుంది సోలార్ లజ్జా!
"Solar Lajja" Machine: Learn How to Burn Sanitary Pads and PPE Kits and How to Dispose Diapers.. ‘‘శానిటరీ ప్యాడ్స్ వల్ల ఒక రకంగా మంచి జరిగితే మరోరకంగా పర్యావరణానికి తీవ్రహాని కలుగుతోంది. ఈ ముప్పును నివారించేందుకు విద్యుచ్ఛక్తితో పని చేసే మెషీన్ల ద్వారా వాటిని కాల్చివేయడం జరుగుతోంది. అయితే అలా చేయాలన్నా, ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలున్నాయి. ఒకవేళ సౌకర్యం ఉన్నా, ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు వసు ్తందో తెలియని పరిస్థితి. అందుకు ప్రత్యామ్నాయంగా సోలార్‌తో పని చేసే మెషిన్‌ను తయారు చేయాలని తమ్ముడు, నేను అనుకున్నాము. అనుకున్నట్లుగానే సోలార్ లజ్జాను రూపొందించాం. ఇతర మెషిన్లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు’’ అని చెబుతోంది ముంబైకి చెందిన మధురిత గుప్తా. ప్రకృతికి మంచిచేసే మెషిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లో ‘ఇన్స్పెన్య్రూరు 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ ఉమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటుదక్కించుకుంది. వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తాకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకపక్క తన విధులను నిర్వహిస్తూనే ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ‘మేవాట్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్’లో వ్యవస్థాపక సభ్యురాలిగా పనిచేస్తున్న మధురిత గుప్తా పదేళ్లకు పైగా జూలలో పనిచేస్తూ జాతీయ పార్కుల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను సందర్శించేది. అడవులకు దగ్గర్లోని గ్రామాల్లో పర్యటించినప్పుడు నెలసరి సమయంలో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మధురిత నిశితంగా గమనించేది. అవగాహన లేమితో కొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు గోనెపట్టాను ప్యాడ్‌గా వాడడం చూసింది. ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిన ఆ రోజుల్లో వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు సరిగా లేవని భావించి వెంటనే ఆ మహిళలకు.. నెలసరి సమయంలో వాడుకోవడానికి శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసింది. ప్యాడ్స్ ఇచ్చి మహిళల సమస్యకు పరిష్కారం చూపినప్పటికి, వాడేసిన ప్యాడ్స్‌ను ఆరుబయట పడేయడంతో.. రక్తం వాసనకు క్రూరమృగాలు అక్కడ చేరి, ప్యాడ్లను ఆరగించేవి. ఇది ఇటు గిరిజన మహిళలకు, అటు జంతువులకు కూడా మంచిది కాదు. ప్రాణాలకూ ముప్పే. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాలనుకుని ‘సోలార్ లజ్జా’ను తీసుకొచ్చింది మధురిత. సోలార్ లజ్జా.. అలా కనుగొన్నాం ‘‘శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతుంది. దీనికి ఏదైనా పరిష్కారం వెదకాలి’’ అని మధురిత తన ఐఐటీ ఇంజినీర్ తమ్ముడు రూపన్తో చెప్పింది. ఇద్దరూ కలిసి దాదాపు ఏడాదిపాటు ప్రయోగాలు, పరిశోధనలు చేసి 2019లో ‘‘సోలార్ లజ్జా’’ మెషిన్‌ను అర్ణవ్ గ్రీన్ టెక్ స్టార్టప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్. సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్‌పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్‌ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపాన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. పర్యావరణ హితం... మహిళలకు ఉపాధి ‘‘మేము కనిపెట్టిన ఈ మెషిన్ రోజుకి రెండువందల ప్యాడ్లను బూడిద చేస్తుంది. ఈ బూడిదను పొలాల్లో ఎరువుగా వాడుకోవచ్చు. ప్రస్తుతం వీటిని ప్రైవేటు కంపెనీ, స్కూళ్లు కాలేజీల్లో అమర్చాము. ప్యాడ్స్‌ను పంపిణీ చేయడమేగాక, వాటిని మెషిన్లో ఎలా పడేయాలో కూడా నేర్పిస్తున్నాము. దీనిపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. 2019లో ప్రారంభించిన సోలార్ లజ్జా మెషిన్లను పదకొండు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో అమర్చాము. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హర్యాణ, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చాము. జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, ప్రైవేటు లేదా పబ్లిక్ స్థలాలకోసం ఆర్డర్లు వస్తున్నాయి. సోలార్ లజ్జా ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కూడా కలుగుతోంది. భవిష్యత్‌లో వీటి ఉత్పత్తిని పెంచుతాము’’ అని మధురిత వివరించింది. -
నీటి కాసులను గుర్తిస్తుంది... కత్తిపోటుకు కట్టు వేస్తుంది!
James Dyson Award 2021: Plastic Scanner Device Won Dyson Award: యువత తన మస్తిష్కానికి పదును పెడితే ఎన్నో ఆలోచనలు వస్తాయి. అతి క్లిష్టమైన సమస్యల నుంచి చిన్న చిన్న ఇబ్బందులకు కూడా సమాధానం చెప్పే ఆవిష్కరణలు పుడతాయి. నిత్య జీవనంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రూపొందించిన సృజనాత్మక ఆవిష్కరణలను అంతర్జాతీయంగా గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తున్నారు జేమ్స్ డైసన్. వివిధ దేశాలకు చెందిన యువత రూపొందించిన ఆవిష్కరణలకు ఏటా డైసన్ అవార్డులు అందజేస్తున్నారు. ఈ ఏడాది 28 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వివిధ విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన ఆవిష్కరణలను ఇటీవలే ప్రకటించారు. ఇవీ ఈ ఏడాది డైసన్ అవార్డు సాధించిన ఆవిష్కరణలు.. ఇంట్లోనే కంటి పరీక్ష వృద్ధుల్లో కంటిచూపు మందగించి పోయేలా చేసే నీటి కాసులను ఇంట్లోనే గుర్తించేందుకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు హోప్స్ (హోమ్ ఐ ప్రెషర్ ఈ–స్కిన్ సెన్సర్) పేరుతో వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఫొటోలో చూపిన నల్లటి చేతి తొడుగును కంటి వద్ద ఉంచుకోవడం ద్వారా కంటి లోపలి భాగాలపై పడుతున్న ఒత్తిడిని గుర్తించొచ్చు. ఇందుకోసం పరికరంలో సెన్సర్‌ను అమర్చారు. ఇది కంటిపై పడే ఒత్తిడిని బాగా గుర్తించగలదు. పరికరాన్ని కనురెప్ప మధ్యభాగంలో ఉంచితే ఒత్తిడి సమాచారాన్ని మెషీన్ లెర్నింగ్ సాయంతో విశ్లేషించి ఫలితాలు స్మార్ట్‌వాచ్‌లో ప్రదర్శితమవుతాయి. ఈ పరికరం డైసన్ అవార్డుల్లో అంతర్జాతీయ విభాగంలో విన్నర్‌గా నిలిచింది. ప్లాస్టిక్ రకాలను పట్టేస్తుంది ప్లాస్టిక్ కాలుష్యాన్ని వదిలించుకోవాలంటే.. వ్యర్థాల్లో ఏది ఏ రకమైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటివరకు ఇలా వేర్వేరు రకాల ప్లాస్టిక్‌ను గుర్తించడం కొంత శ్రమతో కూడుకున్న పని. నెదర్లాండ్స్‌కు చెందిన డెఫ్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ వినూత్నమైన ప్లాస్టిక్ సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. పరారుణ కాంతి స్పెక్ట్రోస్కోపీ సాయంతో పనిచేస్తుంది. చిత్రంలో చూపినట్లు చేత్తో పట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ స్కానర్ సాయంతో ఏ రకమైన ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసే అవకాశం ఉందో స్పష్టంగా గుర్తించవచ్చు. ఎక్కడికక్కడ ప్లాస్టిక్ రీసైకిల్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో భారీ రీసైక్లింగ్ కేంద్రాల్లో ప్లాస్టిక్‌ను వేరు చేసేందుకు పెడుతున్న ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఈ పరికరం డైసన్ అవార్డుల్లో సస్టెయినబిలిటీ విభాగంలో తొలిస్థానంలో నిలిచింది. కత్తిపోట్ల చికిత్సకు కొత్త పరికరం కత్తిపోట్లు లేదా శరీరంలోకి పదునైన వస్తువులు చొచ్చుకుపోయినప్పుడు అయ్యే గాయాలకు మెరుగైన చికిత్స కల్పించేందుకు యూకేకు చెందిన లౌబరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వినూత్న పరికరాన్ని తయారు చేశారు. కత్తిపోట్ల గాయల ద్వారా అయ్యే రక్తస్రావాన్ని వేగంగా నిరోధించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఇలాంటి గాయాలైనప్పుడు చాలామంది అందుకు కారణమైన కత్తి, ఇతర వస్తువులను శరీరం నుంచి తీసేస్తుంటారని, దీనివల్ల రక్తస్రావం ఎక్కువవుతుంది. రియాక్ట్ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరంలో సిలికాన్‌తో తయారైన గాలిబుడగ ఉంటుంది. గాయంలోకి ఈ గాలిబుడగను చొప్పించి ఉబ్బిపోయేలా చేస్తారు. అదే సమయంలో గాయం లోపలి భాగాలపై ఒత్తిడి పెరిగి రక్తస్రావం అదుపులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన మెడికల్ విభాగంలో ఈ పరికరం ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. – సాక్షి, హైదరాబాద్ -
నర్సరీ మొక్కలకు ‘బయోపాట్స్’.. గద్వాల విద్యార్థిని ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఓ పాఠశాల విద్యార్థిని వినూత్న ఆలోచన సరికొత్త ఆవిష్కరణకు పురుడుపోసింది. మొక్కల పెంపకంలో సహజత్వానికి, నూతనత్వానికి పాదులు వేసింది. మొక్కల పెంపకానికి నర్సరీల్లో ఉపయోగించే నల్లరంగు ప్లాస్టిక్ కవర్లతో జరుగుతున్న నష్టాన్ని కళ్లారా చూసిన 14 ఏళ్ల విద్యార్థిని శ్రీజ మదిలో కొత్త ఆలోచన మెదిలింది. కవర్లకు బదులుగా వేరుశనగ పొట్టు మిశ్రమంతో తయారు చేసి కుండీల్లో మొక్కలు పెంచితే పర్యావరణహితంగా ఉంటుందని శ్రీజ భావించింది. తన సహ విద్యార్థి రామకృష్ణ, గణిత ఉపాధ్యాయుడు ఆగస్టీన్ సహకారంతో జీవకుండీలు తయారు చేయడంలో విజయం సాధించింది. కుండీల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు కూడా స్థానికంగా లభించేవి కావడం శ్రీజ ఆవిష్కరణకు మరింత ఉపయోగపడింది. శ్రీజ చేసిన ఆవిష్కరణకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌తోపాటు సీఎస్ఐఆర్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల గుర్తింపు లభించింది. టీ వర్క్స్ బయోప్రెస్ యంత్రాల తయారీ జీవకుండీలుగా పిలిచే బయోపాట్స్ తయారీకి రూపొందించిన ‘బయోప్రెస్’యంత్రాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు టీ వర్క్స్ సన్నాహాలు చేస్తోంది. జీవకుండీలను వివిధ రూపాలు, వేర్వేరు సైజుల్లో తయారు చేసేందుకు, ఇంట్లో లభించే స్టీలు గ్లాసులు, ఇతర వంటపాత్రలను శ్రీజ మోల్డ్ (అచ్చులు)గా ఉపయోగించింది. మరోవైపు జీవకుండీల తయారీ ప్రయోగాలలో శ్రీజకు టీ వర్క్స్ సహకారం అందిస్తోంది. శ్రీజ రూపొందించిన బయోపాట్ ఫార్ములేషన్‌కు పేటెంట్ సాధించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని టీ వర్క్స్ ప్రకటించింది. ఒక్కో బయోప్రెస్ యంత్రానికి నెలకు ఒక్కో షిఫ్ట్‌లో 6 వేల జీవకుండీలను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది. బయోప్రెస్ యంత్రం డిజైన్‌కు మార్పులు, చేర్పులు చేస్తే నెలకు 50 వేల కుండీలను కూడా తయారు చేసే అవకాశముంది. 2020 ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో శ్రీజ ఆవిష్కరణ మా దృష్టికి వచ్చింది. ఈ ఆవిష్కరణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతోపాటు ఇతర చోట్ల జీవకుండీల వినియోగం పెరిగేలా మార్కెటింగ్‌పై దృష్టి పెడుతున్నాం. ఈ కుండీల తయారీ నిమిత్తం మహిళా స్వయం సహాయక సంఘాలకు అవసరమైన శిక్షణ ఇస్తాం. – డాక్టర్ శాంత తౌటం, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, టీఎస్ఐసీ పడేసిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయం ఆలోచించా హరితహారంలో నల్ల ప్లాస్టిక్ కవర్లు తొలగించి వృథాగా పడేయడం నాలో ఆలోచనను కలిగించింది. కవర్లు చింపే క్రమంలో మొక్కల వేరు వ్యవస్థ దెబ్బతింటుందని గమనించా. దీంతో మా గ్రామంలో దొరికే వేరుశనగ పొట్టును మిశ్రమంగా చేసి బయోపాట్స్ తయారు చేశా. మొక్కతోపాటు 20 రోజుల వ్యవధిలో కుండీ కూడా భూమిలో కలిసి నైట్రోజన్, ఫాస్ఫరస్ వంటి ఎరువుగా పనిచేసింది. – శ్రీజ, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని, చింతలకుండ, జోగుళాంబ గద్వాల జిల్లా చదవండి: Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే -
శభాష్ శ్రీజ.. పదో తరగతిలోనే స్టార్టప్‌కి శ్రీకారం
స్టార్టప్స్ అంటే ఫ్లిప్‌కార్ట్, ఓలా, జోమాటోలు గుర్తుకు వస్తాయి. స్టార్టప్ ఫౌండర్లు అంటే బైజూస్ రవీంద్ర, అథర్ తరుణ్ మెహతా ఇలా బయటి వారి పేర్లే వినిపిస్తాయి. స్విగ్గీ, రెడ్‌బస్ వంటి స్టార్టప్‌లు తెలుగు వారే స్థాపించిన వీరిలో చాలా మంది అర్బన్ నేపథ్యం, ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన వారే ఎక్కువ. కానీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలోని జిల్లా పరిషత్ స్కూల్‌కి చెందిన ఓ విద్యార్థికి వచ్చిన ఐడియా పెద్ద స్టార్టప్‌కి నాందిగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంట జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన శ్రీజకి వచ్చిన ఐడియా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం రూపు రేఖలనే మార్చబోతుంది. ఆమె ఇచ్చిన ఐడియాతో రూపొందించిన బయోపాట్లను భారీ ఎత్తున తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. సైన్స్‌ఫేర్ కోసం పాఠశాల స్థాయిలో నిర్వహించిన సైన్స్‌ఫేర్ పోటీల్లో ఇంటి దగ్గర దొరికే వస్తువులతో చేతులతోనే ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఉండే కుండీలను శ్రీజ తయారు చేసింది. నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో ఆమె రూపొందించిన కుండీలు ఎంతో ఉపయోకరంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యం తగ్గించడంతో పాటు ప్టాస్టిక్ వినియోగాన్ని కంట్రోల్ చేసే వీలుంది. ముందుకొచ్చిన టీఎస్ఐసీ శ్రీజ బయోపాట్ కాన్సెప్టుని తెలంగాణ ఇన్నోవేషన్ సెంటర్ (టీఎస్ఐసీ) దృష్టికి తీసుకెళ్లారు ఆమె పాఠశాలలో పని చేసే మ్యాథ్స్ టీచర్ అగస్టీన్. శ్రీజ ఫార్ములా ప్రకారం కుండీలు తయారు చేసేందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని రూపొందించేందుకు టీఎస్ఐసీ ముందుకు వచ్చింది. శభాష్ శ్రీజ టీఎస్ఐసీ చేపట్టిన పలు ప్రయోగాల అనంతరం తొలి బయో ప్రెస్ 4టీ మిషన్ సెప్టెంబరు మొదటి వారంలో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ తయారైన కుండీలకు బయోపాట్‌లుగా పేరు పెట్టారు. ఇటీవల శశిథరూర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో పర్యటించిన పార్లమెంటు ఐటీ స్టాండింగ్ కమిటీ పరిశీలించి శ్రీజను మెచ్చుకుంది. భారీ ఎత్తున శ్రీజ ఐడియాని అనుసరించి టీఎస్ఐసీ రూపొందించిన బయోప్రెస్ 4టీ మిషన్‌తో నెలకు 6,000ల వరకు బయోపాట్స్‌ని తయారు చేయవచ్చు. దీన్ని త్వరలోనే 50,000 సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించారు. హరితహారంలో వాడే మొక్కలతో పాటు పలు నర్సరీలకు సైతం వీటిని సరఫరా చేసే యోచనలో ఉన్నారు. దీని కోసం స్వయం సహాయక బృందాల సహకారం తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతంలో సరికొత్త ఉపాధికి ఈ బయోపాట్స్ అవకాశం కల్పిస్తున్నాయి. TSIC congratulates Srija, a Rural Innovator scouted & supported through #ఇంటింటాinnovator & @WEHubHyderabad, for getting a custom machine designed by T-Works to mass manufacture her innovation Bio-degradable pots. Srija's innovation is ready for pilot.@KTRTRS @startup_ts https://t.co/FNdkOYX81Z — Telangana State Innovation Cell (TSIC) (@teamTSIC) September 17, 2021 2 మిలియన్ టన్నులు బయోపాట్లను భారీ ఎత్తున తయారు చేసి దేశవ్యాప్తంగా అన్ని నర్సరీల్లో ఉపయోగిస్తే ఏడాదికి రెండు మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను భూమిపైకి రాకుండా అడ్డుకునే వీలుంది. రాష్ట్ర స్థాయిలో హరితహారం ప్రాజెక్టులో బయోపాట్స్ మంచి ఫలితాలు సాధిస్తే.... జాతీయ స్థాయిలో సైతం వీటిని తయారు చేసి, మార్కెటింగ్ చేసే వీలుంది. అందరూ వింటున్నదే బయోపాట్ స్టార్టప్‌కి శ్రీకారం పాఠశాలో ఉన్నప్పుడే జరిగింది. పాఠశాల స్థాయి నుంచి కాలేజీ వరకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తే అందులో ప్లాస్టిక్ వల్ల తలెత్తే అనర్థాలు, పర్యావరణ కాలుష్యం అనే టాపిక్స్ కామన్. స్కూల్ స్థాయిలో దాదాపు అందరు పిల్లలు వీటి గురించి వినడం, రాయడం చేస్తారు. అయితే తాను తెలుసుకున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం శ్రీజ చేసింది. కళ్లెదుటే సమస్య ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో పిల్లలు మొక్కలు నాటడం విధిగా మారింది. శ్రీజ సైతం ఇలా అనేక సార్లు మొక్కలు నాటింది. అయితే మొక్కలు నాటిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్లను ఇష్టారీతిగా పడేడయం అవి రోజల తరబడి అక్కడే ఉండటం ఆమెకు నచ్చేది కాదు. అంతేకాదు కవర్ల ఊరబెరికేప్పుడు అజాగ్రత్తగా ఉంటే కొన్ని మొక్కలు చనిపోవడం కూడా ఎన్నో సార్లు చూసింది. దీంతో ప్లాస్టిక్ చెత్త అనే సమస్య శ్రీజను ఆలోచనలో పడేసింది. ఐడియా తట్టింది శ్రీజ నివసించే ఏరియాకి సమీపంలో ఉన్న పల్లి నూనె మిల్లుల్లో వేరుశనగ పొట్టును బయట పారేసి కాల్చేస్తుండేవారు. దీంతో ఆమె కళ్ల ముందే వాయు కాలుష్యాన్ని నిత్యం చూసేది. అయితే కాలిపోకుండా మిగిలిన పొట్టు భూమిలో కలిసి పోవడం గమనించింది. వేరుశనగ గింజలకు రక్షణగా ఉండే ఆ పొట్టు మొక్కలకు అండగా ఉండలేదా ? అనే ఆలోచన వచ్చింది. స్నేహితుల సాయంతో స్నేహితుల సాయంతో సేకరించిన పల్లీల పొట్టును మిక్సీలో వేసి పౌడర్‌గా మార్చింది. దానికి నీటిని కలిపి పేస్టులా చేసి ఓ మట్టి పాత్రను తయారు చేసింది. అలా తాను తయారు చేసిన మట్టి పాత్రలో ఓ మొక్కను ఉంచి పాఠశాల ఆవరణలో పాతింది. సరిగ్గా 20 రోజులకు ఆ మట్టి పాత్ర భూమిలో కలిసిపోయి మొక్కకు ఎరువుగా మారింది. అంతే తాన కళ్ల ముందే ఉన్న పోగుపడిన ప్లాస్టిక్ వ్యర్థాలు , వాయు కాలుష్యాలను తగ్గించేందుకు ఉమ్మడి అవకాశం అక్కడే లభించింది. పల్లెల నుంచి జోగులాంబ గద్వాలలోని చింతలకుంట జిల్లా పరిషత్ స్కూల్ వేదికగా ఓ కొత్త స్టార్టప్ రూపుదిద్దుకుంది. దానికి ఊపిరి పోసింది ఓ సాధారణ పాఠశాల విద్యార్థిని అయితే ఆమెకు అండగా ఆ పాఠశాల నిలిచింది. మన గ్రామీణ ప్రాంతంలో ప్రతిభకు కొదవ లేదని మరోసారి నిరూపించింది. పల్లెల నుంచి స్టార్టప్‌లు పుట్టుకొస్తాయంటూ లోకానికి చాటింది. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’ -
అస్పైర్.. ఆవిష్కరణలకు ఇన్స్పైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన అస్పైర్(ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ప్రభుత్వ పారిశ్రామికశిక్షణ సంస్థ(ఐటీఐ)లకు బాసటగా నిలవనుంది. గ్రామీణ యువతను సరికొత్త ఆవిష్కరణల బాటపట్టించడమే ఈ పథకం ఉద్దేశం. దీని కింద ఎంపికైన ఐటీఐలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది ఇక్కడ శిక్షణ పొందుతున్నవారికి సరికొత్త కార్యక్రమాలను పరిచయం చేయనుంది. అస్పై ర్ కింద సిరిసిల్ల, వనపర్తి, ఖమ్మం, నిజామాబాద్, మేడ్చల్, కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐలు ఎంపికయ్యాయి. ఒక్కో ఐటీఐ ఖాతాలోకి రూ.50 లక్షల చొప్పున కేంద్రం జమ చేసింది. ఈ నిధులతో ఐటీఐల్లో లైవ్లీవుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్(ఎల్బీఐ)లను కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ ఐటీఐలు సమీపంలోని పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని స్థానిక నేపథ్యంతో కూడిన సరికొత్త ఆవిష్కరణలు చేయనున్నాయి. త్వరలో మరిన్ని ఐటీఐలు ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశముంది. ►సిరిసిల్ల ఐటీఐ: ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఎల్బీఐ ప్రధానంగా చేనేత పరిశ్రమ ఆధారంగా పనిచేయనుంది. ఈ పరిశ్రమ ఉత్పత్తులు, మార్కెట్ సవాళ్లు, లక్ష్యాలు తదితర అంశాలను అధిగమించి ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది. ►వనపర్తి ఐటీఐ: స్థానిక రైతులకు సులభతర వ్యవసాయం, మార్కెటింగ్ అంశాలపై ఐటీఐ పనిచేయనుంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విత్తనోత్పత్తి, ఎరువులు, విత్తనాల తయారీపై దృష్టి పెట్టనుంది. ►ఖమ్మం ఐటీఐ: వెదురుకు ప్రసిద్ధమైన ఖమ్మం ప్రాంతంలో వెదురు దిగుబడుల ప్రాసెసింగ్‌తోపాటు వీటిపై ఆధారపడిన చేతివృత్తిదారులకు మెరుగైన వసతులు సమకూర్చేదిశగా ఈ ఐటీఐ పనిచేయనుంది. ►నిజామాబాద్ ఐటీఐ: వ్యవసాయ రంగానికి కేంద్రంగా ఉన్న నిజామాబాద్ ప్రాంత రైతాంగం కోసం శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పుట్టగొడుగుల పెంపకం తదితర వాటిపై ఈ ఐటీఐలోని ఎల్బీఐ పనిచేయనుంది. ►మేడ్చల్ ఐటీఐ: నగరానికి చేరువలోని ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటిపై మరింత అవగాహన కలిగించడం, స్థానిక యువతకు ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచడం, వీటికి అనుబంధంగా శిక్షణ తరగతులు నిర్వహించడం వంటి వాటిని ఈ ఎల్బీఐ పర్యవేక్షిస్తుంది. ►కరీంనగర్ ఐటీఐ: ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నప్పటికీ, కుటీర పరిశ్రమల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుపై ఎల్బీఐ పనిచేస్తుంది. ఫుట్‌వేర్, ఆర్నమెంట్, అత్తరు పరిశ్రమలను ప్రోత్సహించే కార్యాచరణతో ముందుకు వెళ్లనుంది. పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు అస్పైర్ పథకం అమలుతోపాటు ఎల్బీఐల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర సలహాకమిటీ, పాలకమండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి సలహా కమిటీకి కార్మికమంత్రి చైర్మన్‌గా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యుడిగా, కమిషనర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మెంబర్ కన్వీనర్‌గా, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ జనరల్, ఉపాధి, శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా కొనసాగుతారు. పాలక మండలి(గవర్నింగ్ బాడీ) చైర్మన్‌గా ఉపాధి శిక్షణా విభాగం కమిషనర్, కొనసాగుతారు. ఈ శాఖ జాయింట్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా, ఎన్ఎస్ఐసీ చీఫ్ మేనేజర్, ఎంఎస్ఎంఈ ప్రతినిధి, ఉపాధి, శిక్షణ డిప్యూటీ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కమిటీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిణి ఉత్తర్వులు జారీ చేశారు. -
సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతే నూతన ఆవిష్కరణలకు మూలమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం సమ్మిళిత ఆవిష్కరణల అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్–2021ను ఆదివారం ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎంపిక చేసిన 105 ఆవిష్కరణలు తోటి భారతీయుల నిజమైన సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వందకంటే ఎక్కువ ఆవిష్కర్తలు వర్చువల్ షోకేస్ ద్వారా తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయం, పారిశుద్ధ్యం, సాంకేతికత, రవాణా, నీరు, ఆరోగ్య రంగాల్లో పాఠశాల విద్యార్థుల నుండి ఇళ్లల్లో తయారీదారుల వరకు, మెకానిక్ నుండి రైతు వరకు వందకి పైగా ఆవిష్కరణలను ఆన్లైన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆవిష్కరణలను ప్రజలు www. teamtsic. telangana. gov. in/ intinta& innovator& exhibition&2021/ పోర్టల్‌లో సందర్శించవచ్చు. ఈ కార్యక్రమం కోసం 33 జిల్లాల సైన్స్ అధికారులు జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. హైదరాబాద్ నుంచి ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. -
షావోమీ నుంచి సైబర్ డాగ్.. దీని ప్రత్యేక ఇదే
CyberDog : బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌గా ఎంటరై మార్కెట్ లీడర్లకే ముచ్చెమటలు పట్టించిన షావోమీ మరో సంచలనానికి తెర లేపింది. బడా కంపెనీలకే సాధ్యం కాని దానిని సుసాధ్యం చేసింది. నిత్య జీవితంలో ఉపయోపడే రోబోలను సైతం తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. క్వాడ్రుపెడ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లో తనకు తానే సవాల్ విసురుకుంది. మార్కెట్లో ఉన్న మిగిలిన కంపెనీలు విస్మయం చెందే తీరులో సైబర్ డాగ్ పేరుతో క్వాడ్రుపెడ్ రోబోని తయారు చేసింది. నాలుగు కాళ్లపై నడిచే ఈ రోబోకి సంబంధించిన కీలక అంశాలను ఎంఐ ప్యాడ్ 5 రిలీజ్ సందర్భంగా షావోమీ వెల్లడించింది. సైబర్‌డాగ్ స్పెషాలిటీస్ ఇంట్లో మనుషులకు పనుల్లో సహాయకారిగా ఉండేలా ఈ సైబర్డాగ్ని షావోమీ రూపొందించింది. కచ్చితత్వానికి మరో పేరుగా ఈ క్వాడ్రుపెడ్ పని చేస్తుందంటూ షావోమీ ట్వీట్ చేసింది. ఇంటెల్ రియల్ సెన్స్‌కి ప్రాసెసర్‌ని ఇందులో ఉపయోగించారు. ఈ క్వాడ్రపెడ్ రోబో సెకనుకి 3.2 మీటర్లు కదులుతుంది. గరిష్టంగా 3 కేజీల బరువు మోయగలదు. నివిడియా సూపర్ కంప్యూటర్ శ్రేణికి చెందిన చిప్సెట్ అమర్చారు. కేవలం వెయ్యి మాత్రమే ప్రయోగాత్మకంగా తొలుత కేవలం వెయ్యి సైబర్ డాగ్ రోబోలను తయారు చేయాలని షావోమీ నిర్ణయించింది. తొలుత వీటిని చైనాలో విడుదల చేసి అక్కడ వచ్చిన స్పందన ఆధారంగా ఇతర దేశాల్లో అందుబాటులోకి తేనుంది. ఈ క్వాడ్రుపెడ్ రోబో ధర చైనా మార్కెట్లో 9,999 యువాన్లుగా ఉంది. మన కరెన్సీలో రూ. 1,14,737 ఉండవచ్చని అంచనా. From the in-house developed high-performance servo to the centimeter-scale obstacle avoidance and navigation, here’s everything that makes #XiaomiCyberDog a true beast. pic.twitter.com/T7JFj9V94X — Xiaomi (@Xiaomi) August 10, 2021 -
డ్రోన్లతో మేఘాలకు ఎలక్ట్రిక్ షాక్..! కట్ చేస్తే..
దుబాయ్: మానవుడు తన మేధస్సుతో అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాడు. అతి తక్కువ వర్షపాతంను అధిగమించడం కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీనుపయోగించి కృత్రిమ వర్షాలు పడేలా చేస్తున్నాడు. క్లౌడ్ సీడింగ్‌తో పోలిస్తే.. మరింత తక్కువ ఖర్చుతో కృత్రిమ వర్షపాతం నమోదయ్యేలా శాస్త్రవేత్తలు మరో ఆవిష్కరణను రూపొందించారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి ఏడారి దేశాల్లో వీపరితమైన ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగేలా కృత్రిమ వర్షపాతం నమోదయ్యేలా కొత్త ఆవిష్కరణకు శాస్త్రవేత్తలు పురుడుపోశారు. డ్రోన్లతో మేఘాలను విద్యుత్ ఆవేశానికి గురిచేసి కృత్రిమంగా వర్షాలు కురిసేలా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతమైంది. దుబాయ్‌లో తాజాగా ఈ టెక్నాలజీనుపయోగించి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను అధిగమించి కృత్రిమ వర్షం పడేలా శాస్త్రవేత్తలు చేశారు. దుబాయ్‌లో ఒక హైవేపై కృత్రిమ వర్షం పడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. క్లౌడ్ సీడింగ్ పోలిస్తే... సాధారణంగా క్లౌడ్ సీడింగ్ పద్దతిలో సిల్వర్ అయోడైడ్ లాంటి రసాయనాలను మేఘాల్లోకి విస్తరింపజేయడంతో కృత్రిమ వర్షపాతాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తారు. క్లౌడ్ సీడింగ్ పద్దతిను 1940లోనే కనుగొన్నారు. అనేక దేశాలు ఈ పద్దతినుపయోగించి ఇప్పటికే కృత్రిమ వర్షాలు నమోదుచేస్తున్నాయి.ఈ ప్రక్రియను చేయడానికి సాధారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను క్యారియర్లుగా ఉపయోగిస్తారు. యూఏఈ శాస్త్రవేత్తలు ఈ పద్దతికి బదులుగా కొత్త టెక్నాలజీను అభివృద్ధి చేశారు. మేఘాల్లోకి డ్రోన్ల సహయంతో ఎలక్ట్రిక్ ఛార్జ్‌ను విడుదల చేయడంతో వర్షం పడేలా మేఘాలను ప్రేరేపిస్తుంది. ఇతర క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ పోలిస్తే డ్రోన్లనుపయోగించి మేఘాలను ఎలక్ట్రిక్ ఛార్జ్ చేయడంతో కృత్రిమ వర్షపాతం కురిసేలా చేయడం మరింత సులువుకానుందని యూఏఈ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డ్రోన్ల ఉపయోగం దుబాయ్‌లోనే కాదు...! డ్రోన్లనుపయోగించి కేవలం దుబాయ్‌లో కృత్రిమ వర్షాలు చేస్తున్నారంటే పొరపడినట్లే.. అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందండం కోసం డ్రోన్ల సహాయంతో సిల్వర్ అయోడైడ్ రసాయనాలను మేఘాలపై విస్తరింపజేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కృత్రిమ వర్షపాతం నమోదవుతుంది. منطقة النصلة #رأس_الخيمة #المركز_الوطني_للأرصاد #أمطار_الخير #أصدقاء_المركز_الوطني_للأرصاد #حالة_الطقس #حالة_جوية #هواة_الطقس #جمعة_القايدي #عواصف_الشمال pic.twitter.com/ZmoveP4OA7 — المركز الوطني للأرصاد (@NCMS_media) July 20, 2021 -
చదివింది తొమ్మిది.. పనులు చూస్తే..
సాక్షి, భైంసా: అసలే కరోనా కాలం.. బడులు మూతపడ్డాయి. పిల్లలంతా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సాయికృష్ణ మాత్రం తన ఆలోచనకు పదును పెట్టాడు. రోజూ తను చూసే సైకిల్‌కు ఎలక్ట్రికల్ పరికరాలు బిగించి.. రూ.8 వేలలోనే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి ఔరా అనిపించాడు. చూసినవాళ్లు అతడిని మెచ్చుకుంటున్నారు. సాయికృష్ణ తండ్రి పోతన్న గుమాస్తా. తల్లి సురేఖ బీడీ కార్మికురాలు. బడులు మూతపడడంతో ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలని అనుకున్నాడు. తన వద్ద ఉన్న సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్‌గా మార్చే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. వెంటనే తన సైకిల్‌కు రెండు బ్యాటరీలు, ఒక హెవీ మోటార్‌ను బిగించి వాటిని వైర్లతో అనుసంధానించాడు. ఈ రెండు బ్యాటరీలను ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. మోటార్ సాయంతో 50 కిలోమీటర్ల వరకు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి రూ.8 వేల వరకు ఖర్చయిందని, ఆ డబ్బు తన తండ్రి ఇచ్చాడని తెలిపాడు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానంటున్నాడీ బాలుడు. ( చదవండి: యాక్టింగ్ ఇరగదీశాడు.. అయినా పోలీసులకు దొరికిపోయాడు.. )