
పాట్నా: బీహార్‌కు చెందిన 19 ఏళ్ల గోపాల్ జీ అతి చిన్న వయస్సులోనే అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. భాగల్‌పూర్ జిల్లాకు చెందిన గోపాల్‌కు నాసా ఆహ్వానం లభించింది. అమోఘమైన తెలివితేటలతో రెండు పేటెంట్ల (మేథోసంపత్తి హక్కుల)ను గోపాల్ సాధించాడు. సమాజానికి సేవ చేయడానికి తన ఆవిష్కరణలు ఉపయోగపడాలన‍్నదే తన ఆకాంక్షగా అతడు పేర్కొన్నాడు. తండ్రి రంజన్ కున్వర్ సాధారణ రైతు అని, కుటుంబ పరిస్థితులను అధిగమించి ఉన్నత చదువులు అభ‍్యసించినట్లు తెలిపాడు. గోపాల్ గొప్ప ఆవిష్కర్తగా, పరిశోధకుడిగా, డిజిటల్ విద్యా సంస్థల బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రేరణ కలిగించే ఉపన్యాసాలతో సమాజానికి తన సేవలను అందిస్తున్నాడు. గోపాల్ ప్రస్తుతం డెహ్రాడున్‌లోని గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ చదువుతున్నాడు.
అరటి, బయో కణాలకు సంబంధించిన ప్రయోగాలు సఫలం కావడంతో గోపాల్ రెండు పేటెంట్లు పొందాడు. అతడి ప్రతిభకు మెచ్చి తైపీ ఎగ్జిబిషన్‌లో 10 దేశాలకు చెందిన 30 స్టార్టప్ కంపెనీలు అతడిని ఆహ్వానించాయి. 2017లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసానని, ఆయనతో పది నిముషాలు మాట్లాడినట్లు గోపాల్ తెలిపాడు. మోదీతో మాట్లాడాక సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని సందర్శించానని, తరువాత తనను అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) కు పంపించారని..అక్కడ మూడు ఆవిష్కరణలు చేసినట్లు తెలిపాడు. అరటి ఆకు ఆవిష్కరణకు గాను తనకు ఇన్స్పైర్ అవార్డు లభించిందని గోపాల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment