బిహార్:బిహార్‌లో నిర్మాణంలో ఉన్న అగువాని-సుల్తాన్ గంజ్ తీగల వంతెన పేకమేడలా కుప్పకూలిపోయింది. బాగల్‌పురాలో సాయంత‍్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‍గా మారాయి. ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 3,160 మీటర్ల పొడవు ఉన్న నాలుగ లైన్ల తీగల వంతెనను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందుకు రూ.1,710కోట్లను కేటాయించింది. 2014 ఫిబ్రవరి 23న నితీష్ కుమార్ దీనికి శంకుస్థాపన చేశారు. ఈ వంతెన రెండో సారి కూలిపోవడం గమనార్హం.
ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. నితీష్ నేతృత్వంలోని ప్రభుత్వం అవనీతిమయమైందని ఆరోపించారు. స్థానికంగా పాలన క్షీణిస్తున్నా.. ప్రతిపక్ష ఐక్యత గురించి సీఎం నితీష్ మాట్లాడుతారని ఆరోపించారు. ఘటనపై కమిషన్ నియమించడం రాజకీయ సంప్రదాయంగా మారిందని విమర్శించారు.
Meanwhile in Bihar: The under-construction bridge collapsed.
— BALA (@erbmjha) June 4, 2023
Total cost: ₹1750 crore pic.twitter.com/y4FPFsei5p
ఈ బ్రిడ్జ్ సుల్తాన్ గంజ్, ఖగారియా, సహర్ష, మాదెపుర జిల్లాల మీదుగా ఎన్‌హెచ్-31, ఎన్‌హెచ్ 107కు కలపబడుతుంది.
ఇదీ చదవండి:హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో మణిపూర్ అల్లర్లపై విచారణకు హోంశాఖ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment