Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు | Incident on Bihar Police Team in Bhagalpur | Sakshi
Sakshi News home page

Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు

Published Sun, Mar 16 2025 8:16 AM | Last Updated on Sun, Mar 16 2025 8:23 AM

Incident on Bihar Police Team in Bhagalpur

భాగల్‌పూర్‌: బీహార్‌(Bihar)లో గతకొన్ని రోజులుగా పోలీసులపై వరుస దాడులు  చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటన భాగల్‌పూర్‌లో జరిగింది. శనివారం రాత్రి పోలీసులు గస్తీలో తిరుగుతుండగా, వారిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఘటన భాగల్‌పూర్‌ పరిధిలోని అంతీచక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటన గురించి అంతీచక్‌ పోలీసు అధికారి అశుతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ తమ పోలీసు బృందం(Police team) పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో మాధవ్‌ రామ్‌పూర్‌ హరిచక్‌ గ్రామ సమీపంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటాన్ని గమనించారన్నారు. పోలీసులు ఆ వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించారని, అయితే ఇంతలోనే గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారన్నారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారని, పోలీసు వాహనం కూడా కొంతమేరకు ధ్వంసమయ్యిందని తెలిపారు.  

దాడికి పాల్పడినవారిని పోలీసులు అరెస్టు చేశారని, గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అశుతోష్‌ తెలిపారు. ఈ దాడికి ముందు అరారియా, ముంగేర్‌లో పోలీసు బృందాలపై దాడులు జరిగాయి.  ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. 

ఇది కూడా చదవండి: అమెరికాలో తుపాను బీభత్సం.. 17 మంది దుర్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement