ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్‌అలీఖాన్‌పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సైఫ్‌పై దాడి కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్ జాతీయుడు షరిఫుల్ ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ దాడిలో ఇస్లామ్ ఒక్కడే కాకుండా మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో జనవరి 19న ఇస్లామ్‌ను పోలీసులు ముంబయిలోని థానెలో అరెస్టు చేశారు. ఇస్లామ్‌కు కోర్టు జనవరి 29దాకా కస్టడీ విధించింది. తమ విచారణలో ఇస్లామ్ నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో ఉన్న అందరు పనివాళ్లు వేసుకక్ను బట్టలను ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. కేవలం సైఫ్ రక్తమే వాటిపై ఉందా ఇంకెవరిదైనా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు పనివాళ్ల దుస్తులను కోరినట్లు తెలుస్తోంది.
ఇక ఇస్లామ్‌కు సిమ్‌కార్డు అందించిన జహంగీర్ షేక్ అనే వ్యక్తి కోసం ముంబయి పోలీసులు ఆదివారం(జనవరి26) కోల్‌కతా వెళ్లారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత ఇస్లామ్ కొన్ని రోజులపాటు కోల్‌కతాలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు.
కాగా, జనవరి 16వ తేదీ రాత్రి 2 గంటలకు సైఫ్‌అలీఖాన్‌పై ముంబై బాంద్రాలోని అతడి ఇంట్లోనే దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు ఆరు కత్తిపోటు గాయాలయ్యాయి. ఈ గాయాలకు చికిత్స తీసుకున్న సైఫ్ ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనపై దాడికి ముందు పనిమనిషిపై దాడి చేసిన దుండగుడు తనను కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సైఫ్ ఇప్పటికే పోలీసులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment