
ముంగేర్: బీహార్(Bihar)లోని ముంగేర్‌లో దారుణం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో మద్యం మత్తులో మునిగిన కొందరు యువకులు ఒక పోలీసు అధికారి తల పగులగొట్టారు. వెంటనే స్థానికులు ఆ పోలీసు అధికారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.
ఈ ఘటనలో రోహ్‌తక్(Rohtak)కు చెందిన ఏఎస్‌ఐ సంతోష్ కుమార్ మృతిచెందారు. మీడియాకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ముఫస్సిల్ పోలీస్ స్టేషన్‌కు డయల్ 112కు ఫోను వచ్చింది. నందలాల్‌పూర్‌లో మద్యం మత్తులో ఇరు వర్గాలు ఘర్ణణ పడుతున్నాయని ఆ ఫోను ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఏఎస్‌ఐ సంతోష్‌కుమార్ తన బృందంతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గొడవ పడుతున్న ఇరు గ్రూపులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయితే పోలీసులు ప్రయత్నం ఫలించలేదు. ఇంతలో వారిలో ఒకరు మారణాయుధంతో ఏఎస్‌ఐ సంతోష్ కుమార్ తల పగులగొట్టారు. వెంటనే అతను స్పృహ తప్పి కింద పడిపోయారు. అతని తల నుంచి విపరీతంగా రక్తం కారసాగింది. దీంతో స్థానికులు, పోలీసులు అతనిని వెంటనే ముంగేర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం సంతోష్ కుమార్‌ను ముంగేర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పట్నా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సంతోష్ కుమార్ మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: హోలీ వేళ ఘర్షణలు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment