Holi celebrations
-
విషాదం నింపిన కోడిగుడ్డు వివాదం
జగిత్యాలరూరల్: కోడిగుట్టు వివాదం విషాదం నింపింది. ఈ గొడవలో కొడవలి వేటుకు గురైన మహిళ తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన మేడిపల్లి సురేశ్–రమ(40)దంపతులకు కొడుకు రిషివర్దన్, కుమార్తె వాణి ఉన్నారు. సురేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. వీరి కుమార్తె వాణిని ఇదే గ్రామానికి చెందిన బోగ ప్రకాశ్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సురేశ్, రమ దంపతులు నిరాకరించారు. కక్ష పెంచుకున్న ప్రకాశ్ సోమవారం జరిగిన హోలీ వేడుకల్లో రమ ఇంట్లోకి కోడిగుడ్డు విసిరాడు. దీంతో రిషివర్దన్ తమ ఇంట్లోకి కోడిగుడ్డు ఎందుకు విసిరావని ప్రకాశ్‌ను నిలదీయగా రిషివర్దన్‌పై దాడిచేశాడు. స్థానికంగా ఉన్న వారు రిషివర్దన్ తల్లి రమకు సమాచారం అందించడంతో అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రకాశ్ కొడవలితో రమ మెడపై దాడిచేశాడు. గొంతుకు తీవ్రగాయాలు కావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి కొడుకు రిషివర్దన్ ఫిర్యాదు మేరకు ప్రకాశ్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐఆరీఫ్ అలీఖాన్, రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. గ్రామంలో విషాదం తిప్పన్నపేట గ్రామంలో మేడిశెట్టి రమ హోలీ సంబరాల్లో కోడిగుడ్డు వివాదంలో హత్యకు గురికాగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అందరు మహిళలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న రమ హత్యకు గురికావడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. దుబాయ్‌లో ఉన్న ఆమెభర్త సురేశ్ మంగళవారం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. -
ప్రముఖ బాలీవుడ్ సినీతారల హోలీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
హోలీ పండుగ మిగిల్చిన విషాదం!
ఆదిలాబాద్: పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. హోలీ ఆడుకుని స్నేహితులతో కలిసి కాలువలో స్నానానికి వెళ్లి ఈత రాక ఇంటర్మీడియెట్ విద్యార్థి నీటమునిగి చనిపోయిన ఘటన దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దండేపల్లి ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం ప్రకారం.. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం ప్రసాద్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఇంటర్మీడియెట్ విద్యార్థి, పెద్ద కుమారుడు కార్తీక్(18) గత ఐదు రోజుల క్రితం తల్లి అశ్వినితో కలిసి దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. అనంతరం వారితో కలిసి తానిమడుగు వద్ద గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్ద కడెం ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. దీంతో అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే మేదరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. అమ్మమ్మ ఇంటికి వచ్చి.. ఇంటర్ పరీక్షలు ముగియడంతో, కాలేజీకి సెలవులు వచ్చాయి. కార్తీక్ తన తల్లి అశ్వినితో కలిసి ఐదు రోజుల క్రితం పాతమామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి సంతోషంగా స్నేహితులతో గడుపుతున్నాడు. ఇంతలో సోమవారం హోలీ పండుగ రావడంతో, స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నాడు. స్నానం కోసం కాలువ వద్దకు వెల్లిన అతను స్నానం చేసేందుకు నీటిలో దిగాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకుపై పెట్టుకున్న ఆశలు అతని అకాల మృతితో ఆవిరయ్యాయి. ఆదిలాబాద్‌లో మరో విద్యార్థి.. పండుగ పూట స్నానానికి వెళ్లి వాగులో గల్లంతై విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. ఆదిలాబాద్‌రూరల్ మండలం భీంసరి శివారులో గల వాగులో స్నానానికి వెళ్లి గుమ్ముల సాత్విక్ (14) అనే విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై ముజాహిద్, స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్నగర్ కాలనీకి చెందిన గుమ్ముల స్వర్ణలతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో వారికి కొన్నేళ్ల క్రితం విడాకులయ్యాయి. ఇద్దరి పిల్లలను తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పోషిస్తోంది. చిన్నారులిద్దరూ పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సాత్విక్ సోమవారం హోలీ సంబరాలు చేసుకొని అనంతరం స్నానానికి మిత్రులతో కలిసి వాగుకు వెళ్లాడు. స్నేహితులంతా వాగు ఒడ్డున నిలబడి ఉండగా.. స్నానం చేస్తానని సాత్విక్ అందులోకి దూకాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు బయటకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
హోలీ ఆడి.. దావత్ కోసమని వెళ్లి..
కరీంనగర్: హోలీ పండగపూట రాయికల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో స్నేహితులతో గడిపిన పట్టణానికి చెందిన నర్ర నగేశ్(21) వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. నగేశ్ తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం దావత్ కోసమని పట్టణ శివారులోని ఓ మామిడితోటకు వెళ్లారు. నగేశ్ బహిర్భూమికోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఎంతకూ తిరిగిరాకపోవడంతో స్నేహితులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి గాలించగా.. బావిలో శవమై కనిపించాడు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
కర్నూలు జిల్లా: స్త్రీ వేషధారణలతో రథి మన్మథులకు పురుషుల పూజలు (ఫోటోలు)
-
విజయవాడలో హోలీ సందడి (ఫోటోలు)
-
అయోధ్య బాల రామ్ ప్రత్యేక ఆకర్షణ బోర్డర్ లో హోలీ సంబరాలు
-
హోలీ సంబురాల్లో మునిగి తేలిన ఐపీఎల్ హీరోలు.. కోహ్లి మాత్రం అలా..!
హోలీ పర్వదినాన ఐపీఎల్ క్రికెటర్లు రంగుల సంబురాల్లో మునిగి తేలారు. ఇవాళ ఉదయం నుంచి చాలా మంది క్రికెటర్లు ఉత్సాహంగా హోలీ సంబురాలు చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులతో కలిసి రంగుల పూసుకుని నీటితో సంబురాలు చేసుకోగా, మరో ముంబై ఇండియన్ సూర్యకుమార్ యాదవ్ తన శ్రీమతితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. Rohit Sharma celebrating Holi with his family & MI team mates. ⭐https://t.co/Kc645b7DOV— Johns. (@CricCrazyJohns) March 25, 2024 The Hitman Rohit Sharma celebrating Holi. pic.twitter.com/kHaTPPQANf — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 Gautam Gambhir and Shreyas Iyer celebrating Holi. pic.twitter.com/dWnjdSiOaz — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ముఖానికి రంగులు పూసుకుని ఫోటోలకు పోజులివ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా ముఖం నిండా రంగులు పూసుకుని తన ఐపీఎల్ సహచరులతో కలిసి సెల్ఫీ దిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో నగరంలో జరిగిన హోలీ సంబురాల్లో పాల్గొని తన ఆటపాటలతో అభిమానులను అలరించాడు. Captain Shreyas Iyer and KKR players celebrating Holi.pic.twitter.com/L5WldKccF3 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024 Delhi Capitals' players celebrating Holi. pic.twitter.com/lqRn9RvLAe — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 VIRAT KOHLI RETURNS AT CHINNASWAMY TODAY. - The GOAT is Ready to Roar..!!!! 🐐 pic.twitter.com/xpHsedcuzD — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 ఐపీఎల్ కామెంటేటర్లు స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్ భారత సంప్రదాయ దుస్తులు ధరించి హోలీ సంబురాలు చేసుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో తరహాలో హోలీ సంబురాలు చేసుకోగా.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మాత్రం ప్రాక్టీస్‌లో మునిగి తేలాడు. Suryakumar Yadav with his wife celebrating Holi. pic.twitter.com/46ltjxTnBG — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 Dwayne Bravo at the Holi Celebrations in Chennai. ❤️pic.twitter.com/27PWVB0rwj — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 ఆర్సీబీకి ఇవాళ మ్యాచ్ ఉండటంతో కోహ్లి హోలీ సంబురాలు చేసుకున్నట్లు లేడు. ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పంజాబ్ తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీను ఓడించి బోణీ విజయం సొంతం చేసుకోగా.. తొలి మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఓడిన ఆర్సీబీ ఖాతా తెరవాల్సి ఉంది. -
హోలీ 2024: సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
విశాఖలో హోలీ రెయిన్ డ్యాన్స్
-
Vizag : విశాఖలో ఘనంగా హోలీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పాలమూరు జిల్లాలో హోలీ సంబరాలు
-
విజయవాడలో హోలీ జోష్..
-
హైదరాబాద్ లో హోలీ సంబరాలు..
-
Holi 2024: మన దేశంలో ఇక్కడ హోలీ సంబరాలుండవు, ఎందుకో తెలుసా?
రంగుల పండుగ హోలీ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. చిన్నా పెద్దా అంతే రంగుల్లో మునిగి తేలతారు. కానీ దేశంలో హోలీ జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హోలీ ఎందుకు ఆడరో..ఆ కారణాలేంటో ఒకసారి చూద్దాం.. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని క్విలీ, కుర్జాన్, జౌడ్లా మూడు గ్రామాలలో కూడా హోలీ పండుగను జరుపుకోరు. తమ ఇష్టమైన దేవత త్రిపుర సుందరి దేవి. ఒకటిన్నర శతాబ్దం క్రితం, ప్రజలు ఈ గ్రామంలో హోలీ జరుపుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించింది. ఇక అప్పటినుంచి ఇక్కడి ప్రజలు హోలీ జరుపుకోవడానికి ఇష్టపడరు.ఇక్కడి త్రిపుర సుందరి దేవతకి శబ్దాలు నచ్చవని స్థానికులు చెబుతారు.హోలీ తమకు అచ్చి రాదని భావిస్తారట. అందుకే 150 ఏళ్లుగా హోలీ సంబరాలు చేసుకోరట. జార్ఖండ్: జార్ఖండ్‌లోని బొకారోలోని కస్మార్ బ్లాక్ సమీపంలోని దుర్గాపూర్ గ్రామంలో సుమారు 100 ఏళ్లకు పైగా ఇక్కడ హోలీ జరుపుకోవడం లేదు. ఒక శతాబ్దం క్రితం హోలీ రోజున ఇక్కడ ఒక రాజు కుమారుడు మరణించాడు. ఆ తర్వాత ఊరిలో హోలీ సంబరాలు చేసుకుంటే అరిష్టమని భావిస్తారు. కానీ కొంతమంది మాత్రం పొరుగూరికి హోలీ పండుగ చేసుకుంటారు. గుజరాత్: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా రంసాన్ గ్రామంలో కూడా ప్రజలు హోలీని జరుపుకోరు. కొంతమంది సాధువులచే శాపగ్రస్తమైందట ఈ గ్రామం. అందుకే అప్పటి నుండి హోలీ జరుపుకోవడానికి భయపడతారు ప్రజలు . మధ్యప్రదేశ్: 125 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని బైతుల్ జిల్లా ముల్తాయ్ తహసీల్‌లోని దహువా గ్రామంలో, బావిలో బాలుడు నీటిలో మునిగి చనిపోయాడట. ఈ విషాద ఘటనతో హోలీ ఆడటం తమకు చెడు శకునంగా భావించారు. దీంతో ఇక్కడ ఎవరూ హోలీ ఆడరని చెబుతారు. తమిళనాడు: దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడు చాలా దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ భక్తి కూడా ఎక్కువ అని చెబుతారు. కానీ ఉత్తర భారతంతో జరుపు కున్నంతగా హోలీని ఇక్కడ జరుపుకోరు. హోలీ పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి, తమిళులు మాసి మాగంగా జరుపుకుంటారు. పవిత్ర నదులు, చెరువులు, సరస్సులలో స్నానం చేయడానికి ,పూర్వీకులు భూమిపైకి వచ్చే పవిత్రమైన రోజు అని నమ్ముతారు. అందుకే ఇక్కడ ఆ రోజు హోలీ ఆడరు. అయితే పుదుచ్చేరి లాంటి టూరిస్ట్ ప్రదేశాలలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. -
అంబటి రాంబాబు హోలీ డాన్స్
-
Hyderabad Holi Photos 2024: హైదరాబాద్‌లో హోలీ వేడుకలు..(ఫొటోలు)
-
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హోలీ వేడుకలు
-
దుబాయ్ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు. భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పలువురికి స్వీట్లు పంచి, హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. #यूएई ♦दुबई के कृष्ण मंदिर में श्रद्धालुओं ने मनाई होली#Holi #Dubai #KrishnaTemple pic.twitter.com/8YojdmjkFL — Knews (@Knewsindia) March 25, 2024 -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మన జీవితాల్లో సంతోషాన్ని వికసించే వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ.. రంగుల హోలీ అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నా’ అని తన సందేశంలో పేర్కొన్నారాయన. అదే సమయంలో.. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్ ఖాతాలోనూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2024 -
Amritsar Holi Photos: రంగుల్లో మునిగి తేలిన అమృత్సర్.. విశేషం ఏంటంటే? (ఫోటోలు)
-
ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం
మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరుని గర్భగుడిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూజారితో సహా 13 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. వారంతా ఆలయంలో జరిగే హోలీ వేడుకలను తిలకించేందుకు వచ్చారు. హారతి సమర్పిస్తున్న పూజారి సంజీవ్ వెనుక నుంచి ఎవరో గులాల్ వెదజల్లడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. बहुत दुखद खबर उज्जैन के महाकाल मंदिर में भस्म आरती के दौरान लगी आग, कई लोग झुलसे ! ईश्वर से सभी के सकुशल होने की कामना करते है !🙄😥🙏#होलिकोत्सव#Ujjain #MahakaleshwarTemple pic.twitter.com/YuuEvpLYHm — Rajni (@RajniRajni2210) March 25, 2024 వెంటనే అక్కడున్న కొందరు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గర్భగుడిలో హారతి సమర్పిస్తున్న సంజీవ్ పూజారి, వికాస్, మనోజ్, సేవాధారి ఆనంద్ కమల్ జోషితో సహా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించినట్లు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భస్మ హారతి జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయని ఆలయ పూజారి ఆశిష్ గురు తెలిపారు. -
Holi Celebrations Photos: హుడా ప్లే గ్రౌండ్లో హోలీ వేడుకలు (ఫోటోలు)
-
Holi 2024: జాలీగా, హ్యాపీగా...ఇంట్రస్టింగ్ టిప్స్, అస్సలు మర్చిపోవద్దు!
పిల్లా పెద్దా అంతా సరదగా గడిపే రంగుల పండుగ హోలీ సమీపిస్తోంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహం గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం, నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణం కంటి గాయాలకు గురవుతున్న అనేక సంఘటనలు జరుగుతాయి.అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం. మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలను గమనించాలి. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు , ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం , ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి.ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకుదారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం. సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగదు. పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి. లోషన్ లేదా నూనె : హోలీ ఆడటానికి వెళ్లే కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్‌ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు. దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని. రంగులనుఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకోవాలిన కోరుతూ హ్యాపీ హోలీ.