వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో జననేత చేపట్టిన పాదయాత్రలో భాగంగా సంతనూతల పాడు నియోజక వర్గంలోని చీమకుర్తిలో ఈ ఉదయం పలువురు విద్యార్థినులు వైఎస్ జగన్‌ను కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు.