
సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది.
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని పుల్కల్ మండలం కొర్పోల్ గ్రామంలో నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. గ్రామంలోని యువకులు హోలీ వేడకలు జరుపుకున్నారు. వేడుకల అనంతరం స్థానిక మంజీర నదిలో స్నానానికి వెళ్లారు.
ఈ క్రమంలో నదిలో దిగిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. చనిపోయిన ఇద్దరు చిన్నారులు సాయికుమార్, సాయి కిరణ్‌లుగా గుర్తించారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా హోలీ ఆడిన చిన్నారులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.