children died
-
ఎంత విషాదం.. వీధి కుక్కల దాడి.. 2 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి
గత కొన్ని రోజులుగా వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. విచక్షణ రహితంగా పిల్లలను కరిచి, గాయపరచడమే కాకుండా ప్రాణాలు సైతం తీస్తున్నాయి. తాజాగా వీధికుక్కల దాడికి మరో బాలుడు బలైపోయాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. అయితే రెండు రోజుల క్రితమే బాలుడి అన్నను కూడా కుక్కలు కరిచి చంపడం మరింత విషాదం. వివరాలు.. వసంత్ కుంజ్ సమీపంలోని అటవీ భూభాగమైన సింధి క్యాంప్ ఏరియాలో ఎక్కువగా పేదలు గుడిసెలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆనంద్ అనే ఏడేళ్ల బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం నివసించే ఇంటి సమీపంలో ఉన్న అడవిలో అతని కోసం వెతకడం ప్రారంభించారు. రెండు గంటల అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అంతేగాక చిన్నారి శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆనంద్‌పై అడవిలోని వీధి కుక్కలు, మేకలు, పందులు దాడి చేసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపారు. అయితే ఈ విషాదం జరిగిన రెండు రోజుల్లోనే మరో ఘోరం చోటుచేసుకుంది. ఆనంద్ తమ్ముడు ఆదిత్య, అతని బంధువులు కొందరు ఆదివారం వారి ఇంటి నుంచి కొంచెం బయటకు వెళ్లారు. ఆదిత్య దగ్గరి నుంచి కొంచెం దూరంగా వెళ్లిన బంధువు చందన్ కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. అప్పటికే ఆదిత్యను వీధికుక్కలు కరవడం చూశాడు. భయంతో చందన్ గట్టిగా అరవడంతో.. అక్కడే ఉన్న ఆనంద్ మరణంపై దర్యాప్తు చేస్తున్నఓ పోలీసు అధికారి చందన్ అరుపులు విని ఆదిత్యను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములు ఇద్దరూ కుక్కల దాడిలో మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
WHO: ఆ భారత కంపెనీ సిరప్‌లను వాడొద్దు
జెనీవా: భారత్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. ఈ మేరకు.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రెస్ మీడియా ప్రకటన చేశారు. భారత దేశానికి చెందిన మెయిడెన్ ఫార్మాసూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్‌లను వాడడం వల్లే చిన్నారుల కిడ్నీలు దెబ్బ తిని మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల మృతి ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిందన్న ఆయన.. ఈ కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశం వెలుపల పంపిణీ చేయబడి ఉండవచ్చని, కాబట్టి వాటిని వాడొద్దని హెచ్చరించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి భారత్‌కు చెందిన మెయిడెన్ కంపెనీతో పాటు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలిపైనా విచారణ ఉంటుందని ట్రెడోస్ వెల్లడించారు. "WHO has today issued a medical product alert for four contaminated medicines identified in #Gambia that have been potentially linked with acute kidney injuries and 66 deaths among children. The loss of these young lives is beyond heartbreaking for their families"-@DrTedros — World Health Organization (WHO) (@WHO) October 5, 2022 మెయిడెన్ కంపెనీ తయారు చేస్తున్న Promethazine ఓరల్ సొల్యూషన్, Kofexmalin బేబీ కాఫ్ సిరప్, Makoff బేబీ కాఫ్ సిరప్, Magrip N కోల్డ్ సిరప్ ఈ జాబితాలో ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రోజు వరకు కూడా తయారీదారు కంపెనీ ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై WHOకు ఎలాంటి హామీలను అందించలేదని తెలిపింది. పిల్లల్లో వాంతులు, డయేరియా, మూత్రవిసర్జనకు ఆటంకం, తలనొప్పి, చివరికి.. కిడ్నీని దెబ్బ తీసి ప్రాణం తీయొచ్చని హెచ్చరించింది. ల్యాబ్ పరీక్షల్లో.. ఆమోద యోగ్యం కానీ రీతిలో డైథెలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌తో సిరప్‌లను కలుషితం చేసినట్లు తేలింది. ఇదీ ప్రాణాంతకమని కూడా డబ్ల్యూహెచ్‌వో ప్రకటన స్పష్టం చేసింది. గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెలలో ఆసుపత్రులను పారాసెటమాల్ సిరప్‌లను వాడటం మానేయాలని కోరింది. అయితే.. భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అందిన సమాచారం ప్రకారం.. తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు WHO తెలిపింది. అయినప్పటికీ.. అనధికార మార్గాల్లో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు అవి సరఫరా అయ్యి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అంతేకాదు.. మెయిడెన్ కంపెనీ స్థానికంగా(భారత్‌లో కూడా!) అవే కలుషితాలను కలిపి ఉత్పత్తులు విడుదల చేసి ఉంటుందనే అనుమానాల నడుమ ఉత్పత్తుల జాబితా నుంచి వాటిని తొలగించడమే మంచిదని డబ్ల్యూహెచ్‌వో, భారత ఔషధ నియంత్రణ మండలికి సూచించింది. -
పాపం పసిపాప.. అక్షరాభ్యాసం కోసం వెళ్లి వస్తుండగా
సాక్షి, మెదక్/వరంగల్: అభం శుభం తెలియని ఓ పసిపాప తండ్రి అజాగ్రత్తకు మృత్యుఒడికి చేరింది. అక్షరాభ్యాసం కోసం బాసరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అప్పటివరకూ తల్లి ఒడిలో ఉన్న చిన్నారి శాశ్వత నిద్రలోకి జారుకుంది. కళ్ల ముందే చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మాసాయిపేట మండలం స్టేషన్ మాసాయిపేట శివారు 44వ జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో ఏడాదిన్నర వయస్సు గల చిన్నారి మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన వికాస్‌రెడ్డి తన కుటుంబంతో హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకోవడంతో భార్య ప్రవల్లిక, ఇద్దరు కూతుర్లు సాన్విక, ఏడాదిన్నర అద్విక, మరో వ్యక్తితో కలిసి బాసర సరస్వతి ఆలయానికి అక్షరాభ్యాసం కోసం తన కారులో వెళ్లారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి హైదరాబాద్ వెళ్తుండగా మాసాయిపేట మండలం స్టేషన్ మాసాయిపేట శివారు 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులోంచి రోడ్డుపై పడిన చిన్నారి అద్విక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా వారికి గాయాలయ్యాయి. వికాస్‌రెడ్డి సోదరుడు విపుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రకాష్‌గౌడ్ తెలిపారు. నుజ్జునుజ్జయిన కారు అతివేగమే ప్రమాదానికి కారణం అతివేగం, అజాగ్రత వల్లే కారు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. రహదారిపై అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో కారు మొత్తం నుజ్జునుజ్జయింది. కారులో అప్పటివరకు తల్లి చెంతనున్న చిన్నారి అద్విక ఒక్కసారిగా ఎగిరి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలపాలై మృత్యుడికి చేరింది. -
ఎంత పని చేశావమ్మా..? తొట్టెలో ముంచి బిడ్డలను హత్య చేసిన తల్లి
తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లాలో నీటి తొట్టెలో ముంచి ఇద్దరు పిల్లలను హత్య చేసి తల్లి.. ఆ తరువాత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కుళితురై సమీపంలోని కలువన్ దిట్ట కాలనీ ప్రాంతానికి చెందిన జబషైన్ (35). కేరళలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతని భార్య విజి (27). వీరికి ప్రియ (02), ఆరు నెలల వయసున్న ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. జబషైన్ కేరళలో పని చేస్తూ ఉండడంతో విజితో జబషైన్ తల్లి రాజమ్మాల్ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాజమ్మాల్ ఆలయంకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటిలో ఉన్న నీటి తొట్టెలో ఇద్దరు మనవరాళ్లు మృతి చెంది తేలుతుండడంతో స్థానికులకు తెలియజేసింది. ఇంటి లోపలికి వెళ్లి చూడగా అక్కడ విజి ఉరేసుకుని మృతి చెంది ఉండడంతో పోలీసులకు సమా చారం అందించారు. వారు బిడ్డలు, విజి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్ఎస్
న్యూఢిల్లీ: నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారయ్యిన సంగతి తెలిసిందే. ఐతే చిన్నారుల మృతికి హానికరమైన దగ్గు మందే కారణమని విచారణలో తేలింది. డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే చిన్నారులు మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) సోమవారం వెల్లడించింది. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారికి డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్‌ను అందించారు. ఐతే ఈ దగ్గుమందు కారణంగా ముగ్గురు పిల్లలు మృతి చెందగా, మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తాజా దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌తో సహా వివిధ డిస్పెన్సరీలలో పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే మరణాలు సంభవించాయని డీజీహెచ్ఎస్ పేర్కొంది. ‘మా పరిశోధనలో అది హానికరమైన దగ్గు మందని తేలింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ మందు ఇవ్వకూడదని, మొహల్లా క్లినిక్‌లు, డిస్పెన్సరీలలో పంపిణీ చేస్తున్న ఈ మందును వెంటనే సీజ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని డీజీహెచ్ఎస్ ఆదేశించింది. చదవండి: Crying Child Playing The Violin: ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న బాలుడి ఫొటో.. ఎందుకో తెలుసా? -
తిరుపతికి రానన్న భర్త.. భార్య క్షణికావేశం.. మూడు ప్రాణాలు బలి
పిడుగురాళ్ల(గురజాల): క్షణికావేశం.. ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఓ తల్లి తన కన్నబిడ్డలిద్దర్నీ కడతేర్చిన హృదయ విదారక ఘటన పిడుగురాళ్ల పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని మిలటరీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన మానస (27), బండారు శ్రావణ్‌కుమార్‌కు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. ఇటీవల మానస తిరుపతి పుణ్యక్షేత్రం వెళ్లాలని కోరడంతో కుటుంబ సభ్యులంతా సిద్ధమయ్యారు. అయితే మానస భర్త శ్రావణ్‌కుమార్ పని వత్తిడి వల్ల తిరుపతికి రాలేనని అత్తమామలతో కలసి పిల్లలను తీసుకెళ్లాలని సూచించాడు. ఈ విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. అయితే రోజు మాదిరిగానే శనివారం రాత్రి శ్రావణ్ కుమార్ ఇంటి పైపోర్షన్లో పడుకున్నాడు. కింద పోర్షన్లో మానస, పిల్లలిద్దరూ పడుకున్నారు. అయితే ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రావణ్‌కుమార్ నిద్రలేచి కిందకు వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీయకపోవడంతో, భార్యకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తలుపులు పగలగొట్టారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు షర్మిల (3), జ్యోతి (2), మానస విగత జీవులయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ ఎస్ఐ సమీర్ బాషా వివరాలను సేకరించారు. ఇద్దరు చిన్నారుల మెడకు కాటన్ క్లాత్ గట్టిగా బిగించి దివాన్‌కాట్‌కు కట్టేసి చంపేసిన అనంతరం మానస కూడా ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మానస తండ్రి గుంజా శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ సమీర్ బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కుమార్తెకు కోపం ఎక్కువని, గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు. ఈ కోణంలోనే మానస క్షణికావేశంతో ఇద్దరు చిన్నారులను చంపి తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కూడా ఫిర్యాదులో మృతురాలి తండ్రి పేర్కొన్నారని ఎస్ఐ వివరించారు. -
అయ్యో..చిన్నా.. వేడి నీటిలో పడి బాలుడి మృతి
సాక్షి,రఘునాథపాలెం: చిన్న ఏమరుపాటు పసివాడి ప్రాణం తీసింది. ఆ ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది. బద్ధ్యాతండాకు చెందిన రమేష్ – అరుణ దంపతుల చిన్న కుమారుడు నునావత్ గీతమ్‌రామ్(4) ఈ నెల 8వ తేదీన హీటర్‌తో నీటిని వేడి చేసిన బకెట్లో ప్రమాదవశాత్తు పడి..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఇద్దరు కుమారులకు స్నానం చేయించేందుకు టీవీ దగ్గర ఉన్న స్విచ్‌బోర్డు వద్ద తల్లి హీటర్ ప్లగ్ పెట్టి బకెట్లో నీటిని వేడి చేసింది. అదే సమయంలో పెద్ద కుమారుడు అన్నం పెట్టాలని మారాం చేయడంతో అమ్మ అరుణ ప్లగ్ తీసేసి..ప్లేట్లో భోజనం తీసుకొచ్చేందుకు వంటగదిలోకి వెళ్లింది. అదే సమయంలో చిన్న కుమారుడు టీవీ స్వీచ్ వేసేందుకు వెళ్లి అక్కడ జారి..పక్కనే ఉన్న వేడి నీటి బకెట్లో పడి..బిగ్గరగా కేకలు వేశాడు. ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్న తల్లి బిడ్డను బయటకు తీసింది. అప్పటికే తీవ్ర గాయాలైన బాబును తొలుత ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స చేయిస్తుండగా..ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మృతి చెందాడు. గురువారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని, ఈ ఘటన విషాదం నింపిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కొండ చరియలు విరిగిపడి నలుగురు చిన్నారులు మృతి
ఐజ్వాల్: మిజోరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మృతి చెందినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ఘటన బాంగ్కాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ పక్కనే ఉన్న ఇంటిపై అవి పడటంతో ఇల్లు కూలిపోయింది. ఏడుగురు సభ్యులు ఉన్న ఆ ఇంట్లో ఘటన సమయంలో ఆరుగురు ఉన్నారు. అందులో ఇంటి యజమాని లాల్ బయాక్జౌలా (75) ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అనంతరం మరొకరిని కూడా బలగాలు రక్షించగలిగాయి. 3 నుంచి 16 ఏళ్ల వయసున్న నలుగురు శిథిలాల కింద నలిగిపోయి మరణించారు. ముగ్గురు సభ్యులున్న మరో కుటుంబం కొండ పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉన్నారు. అయితే కొండచరియలు విరిగిన శబ్దం రావడంతో వారు బయటకొచ్చి ప్రాణాలు రక్షించుకోగలిగారు. చదవండి: వేప చెట్టు కింద కరోనా మాత.. కూల్చివేతతో ఉద్రిక్తత -
ఒక రోజు వ్యవధిలో అమ్మమ్మ కూడా..
గుడిపాల: మసాలా పొడి అనుకుని గుళికల మందు వేసి వండిన చికెన్‌ను తిన్న మహిళ సైతం బుధవారం కన్నుమూసింది. అమ్మమ్మ వండిన చికెన్‌ను తిన్న ఇద్దరు మనవళ్లు సోమవారం తిని మరణించడం విదితమే. ఆ చికెన్‌ను వండిన గోవిందమ్మ (52) పరిస్థితి కూడా విషమించి బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. వివరాలు..తవణంపల్లె మండలం ఉత్తర బ్రాహ్మణపల్లెకు చెందిన రాంబాబు కుమారులు ఈనెల 13న గుడిపాల మండలంలోని అమ్మమ్మ గోవిందమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం అమ్మమ్మను చికెన్ చేసి పెట్టమని అడిగారు. అయితే గోవిందమ్మకు మతిస్థిమితం సరిగా లేదు. గోవిందమ్మ కోడికూర చేస్తూ మసాలాపొడి అనుకుని గుళికల మందును అందులో వేసింది. వండిన తర్వాత చికెన్‌ను తిన్న ఆమె మనుమళ్లు రోహిత్, జీవ మృతిచెందడం విదితమే. గోవిందమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆమె కన్నుమూసినట్లు గుడిపాల ఎస్ఐ వాసంతి తెలిపారు. ఒక రోజు వ్యవధిలో మనవళ్లు, అమ్మమ్మ మరణించడంతో రెండు మండలాల్లోనూ తీవ్రవిషాదం నింపింది.(మసాలా పొడి అనుకుని చికెన్‌లో..) -
మసాలా పొడి అనుకుని చికెన్‌లో..
గుడిపాల (చిత్తూరు): నాన్న వద్దన్నా అమ్మమ్మ ఇంటికి వెళ్లాలని మారాం చేశారు. పిల్లల కోరిక కాదనలేక తండ్రి సరేనన్నాడు. అక్కడికెళ్లి అమ్మమ్మను చికెన్ కావాలని అడిగారు. మనవళ్ల కోరిక కాదనలేక అమ్మమ్మ చికెన్ తీసుకొచ్చి వండే క్రమంలో పొరపాటుగా మసాలా పొడికి బదులు అక్కడే ఉన్న గుళికల మందు వేసింది. ఆ చికెన్ తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఏఎల్‌పురం గ్రామానికి చెందిన గోవిందమ్మ, సహదేవన్‌ల కుమార్తె ధనమ్మకు తవణంపల్లె మండలం ఉత్తబ్రాహ్మణపల్లెకు చెందిన రాంబాబుతో 13 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ధనమ్మ అనారోగ్యం కారణంగా రెండేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి రోహిత్ (12), జీవ (10) అనే కుమారులు ఉన్నారు. పాఠశాలలు లేకపోవడంతో పిల్లలు అమ్మమ్మ ఇంటికెళతామని మారాం చేశారు. దీంతో రాంబాబు తన తమ్ముడు సురేష్‌తో కలిపి పిల్లలిద్దర్నీ అమ్మమ్మ ఇంటికి పంపాడు. సోమవారం గోవిందమ్మను మనవళ్లు చికెన్ కావాలని కోరారు. చికెన్ చేసే క్రమంలో మసాలా పొడి అనుకుని అక్కడే కవర్లో ఉన్న గుళికల మందు చికెన్‌లో వేసింది. ఆ కూర ఇద్దరు మనవళ్లకు పెట్టి, తానూ తినడం ప్రారంభించింది. ఇంతలో మనవళ్లకు వాంతులు కావడంతో స్థానికులు గుర్తించి, చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెందారు. గోవిందమ్మ పరిస్థితి కూడా విషమంగా ఉంది. గుడిపాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవిందమ్మ -
కారు డోర్ లాక్; ఇద్దరు చిన్నారుల మృతి
లక్నో : కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ఇంటి ముందున్న కారు లోపలికి వెళ్లారు. దీంతో డోర్ లాక్ అయ్యి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోగా, మిగతా ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో మహమ్మద్ అల్తాఫ్ (5), అబ్షర్ రాజా (7) ఉన్నారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితమే వీరి కుటుంబం సెకండ్ హ్యాండ్లో కారు కొనుగోలు చేయగా అదే కారులో చిన్నారులు మృత్యువాత పడ్డారు. (ఇప్పట్లో ముంబైకి వచ్చే సాహసం చేయన: గడ్కరీ) ఎంత సేపటికి పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతగ్గా, కారులో అపస్మారక స్థితిలో కన్పించారు. దీంతో వెంటేనే ఆస్పత్రికి తరలించగా ఇద్దరు చిన్నారులు చనిపోగా, మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు అని మొరాదాబాద్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు. కారు లోపలే దాదాపు రెండు గంటలకు పైగా ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చిన్నారులు చనిపోయినట్లు పేర్కొన్నారు. (16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం ) -
కరోనా: కేరళలో నాలుగు నెలల చిన్నారి మృతి
తిరువనంతపురం: కరోనా ధాటికి దేశంలో ముక్కుపచ్చలారని పసిప్రాయాలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నెలలు నిండని ఓ చిన్నారిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని మంజేరికి చెందిన నాలుగు నెలల చిన్నారికి అధిక జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో తల్లిదండ్రులు ఈ నెల 21న కోజికోడ్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం బుధవారం పాపకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా చికిత్స పొందుతున్న చిన్నారి దురదృష్టవశాత్తు శుక్రవారం ఉదయం మరణించింది. అయితే గత 3 నెలలుగా చిన్నారి గుండె సంబంధిత సమస్యలకు పోరాడుతోందని వైద్యులు తెలిపారు. ఇక మలప్పురం జిల్లాలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. (కరోనా : 24 గంటల్లో 1,684 కేసులు ) కేరళలో గురువారం కొత్తగా కేవలం 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 447 ఉండగా ఆక్టివ్ కేసుల సంఖ్య 129 గా ఉంది. అంతేగాక 23 వేల మంది క్వారంటైన్లో ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కొత్తగా నమోదైన కేసులలో ఇడుక్కి జల్లా నుంచి నాలుగు, కోజికోడ్, కొట్టాయం నుంచి రెండు, తిరువనంతపురం, కొల్లం నుంచి ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు సీఎం పేర్కొన్నారు. కాగా 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదవ్వకపోవడంతో మంగళవారం గ్రీన్ జోన్‌గా ప్రకటించిన కొట్టాయం గడిచిన రెండు రోజుల్లో ఒక్కొక్క కేసును నమోదు చేసింది. (కరోనా : 9నెలల చిన్నారి అద్భుతం.. ) నెల జీతం కట్..వారికి మినహాయింపు -
అజాగ్రత్త; కారు కిందపడి చిన్నారి మృతి
సాక్షి, అయిజ (మహబూబ్‌నగర్) : అజాగ్రత్తగా కారు నడపడంతో ఓ చిన్నారి కారు కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన అయిజలో చోటుచేసుకుంది. ఎస్ఐ జగదీశ్వర్ కథనం ప్రకారం.. అయిజలోని బ్రాహ్మణవీధిలో రాజగోపాల్ అనే వ్యక్తి కారు వేగంగా నడుపుకొంటూ రాగా.. అకస్మాత్తుగా అడ్డువచ్చిన చిన్నారి ఇర్ఫాన్ (20 నెలలు)ను ఢీకొట్టాడు. దీంతో కారు ముందుభాగంలో టైరు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఖాజాబీ, కబీర్‌లకు ఒక కూతురు ఒక కుమారుడు ఉండగా కుమారుడు మృతిచెందాడు. దీంతో వారు దుఃఖసాగరంలో మునిగిపోయారు.చిన్నారి మృతదేహానికి గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కారు డ్రైవర్ రాజగోపాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉసురు తీస్తున్న పసరు
ఆ గ్రామాల్లో నాటు వైద్యం చిన్నారులను చిదిమేస్తోంది. మారుమూల గ్రామాలు కావడం, మెరుగైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆ మందులు వికటించి కొందరు.. సమయానికి వైద్యం అందక మరికొందరు మృత్యువాత పడుతున్నారు. ఏడాదిలో 14 మంది చిన్నారులు మత్యువాతపడ్డారు. ప్రస్తుతం మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సాక్షి, తిరుపతి/కేవీబీపురం: సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండల పరిధిలోని పలు గ్రామాలు పట్టణాలకు దూరంగా అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గ్రామాలకు కోవనూరు, కేవీబీపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. పీహెచ్‌సీలకు వెళ్లాలంటే 8 కి.మీ దూరం ఉంది. అక్కడకు వెళ్లినా మెరుగైన వైద్యం అందే పరిస్థితి లేదు. 24 గంటల ఆస్పత్రి అయినా వైద్యులు ఉండరు. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులు, గర్భిణులకు వ్యాక్సిన్లు వేయాల్సి ఉన్నా ఆ దాఖలాలు లేవని బస్సులు, ఆటోలు అందుబాటులో లేకపోతే బైక్‌పై తీసుకెళ్లాలి. లేదంటే గ్రామంలోనే ప్రాణాలు విడవాల్సిన పరిస్థితి. జయలక్ష్మి కాలనీకి చెందిన దంపతులకు నాలుగేళ్ల తర్వాత కలిగిన మగబిడ్డకు జబ్బు చేసింది. పెద్దలు చెప్పారని నాటు మందులు వాడారు. బిడ్డకు ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. పాలు పట్టిస్తే నేరుగా ఊపిరితిత్తులకు చేరి వాపు రావడంతో భయంతో వారం రోజుల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. డబ్బులు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది. కొన్ని రోజులకు బిడ్డ చనిపోయాడు. బైరాజుకండ్రిగకు చెందిన రెండేళ్ల వయస్సు ఉన్న పాపకు ఎక్కిళ్లు ఎక్కువ కావడంతో గ్రామంలోని పెద్దావిడ మాటలు విని ఆకు పసరు మందు తాగించారు. తీవ్రమైన దగ్గు, ఆయాశంతో పాటు నోటి నుంచి రక్తం కారడం మెదలైంది. చాలా ఆస్పత్రులు తిరిగారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కామెర్లని నుదురు, చేతిపై కాల్చారు దిగువపుత్తూరుకు చెందిన సుప్రియకు చెందిన ఏడాదిన్నర బిడ్డ ఏసుకు కామెర్ల వ్యాధి సోకింది. స్థానిక ఆచారాలు, పెద్దలు చెప్పిన మాట విని ఆ తల్లి నాటు వైద్యుడి చేత చిన్నారి నుదురు, చేతిపై ఇనుప కమ్మిని ఎర్రగా కాల్చి పెట్టించింది. అనంతరం ఆకు పసరు ఇచ్చారు. తొమ్మిది రోజుల తర్వాత ఏసు మరణించింది. సరైన సమయంలో వైద్యం అందక కేవీబీపురం మండలం ఎస్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన శ్యామల బిడ్డకు ఎనిమిది నెలల వయస్సులో జ్వరం వచ్చింది. నాటు మందులు వాడాల్సి వచ్చింది. నాలుగు రోజుల తర్వాత కడుపు బాగా ఉబ్బిపోయింది. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సమయానికి వైద్యం అందకపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ చెయ్యి జారిపోయాడు. స్థానికులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాలంటే 30 కి.మీ దూరంలోని శ్రీకాళహస్తి, 48 కి.మీ దూరంలో ఉన్న తిరుపతికి పరుగులు తీయాల్సి వస్తోంది. చికిత్స పొందుతున్న చిన్నారులు పెరిందేశం గ్రామానికి చెందిన ఇంకా పేరు పెట్టని 53 రోజుల చిన్నారి, లిఖిత (7నెలలు) తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. ఇందులో లిఖిత పరిస్థితి విషమంగా ఉంది. కొప్పేడుకు చెందిన 18 నెలల మోక్షిత, బంగారమ్మకండ్రిగకు చెందిన రెండున్నరేళ్ల వరలక్షి్మ, సరస్వతీకండ్రిగకు చెందిన రోహిణి (17 నెలలు) పుత్తూరు చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాను సమస్య నా దృష్టికి రాలేదు. సంబంధిత పీహెచ్సీ పరిధి నుంచి డేటా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాను. సచివాలయాల ద్వారా ఈ వారంలోపు 372 మంది ఏఎన్ఎంల నియామకాలు జరుగుతాయి. సోమవారం నుంచి వారికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నాం. – పెంచలయ్య, డీఎంహెచ్ఓ -
నీటికుంటలో పడి చిన్నారి మృతి
సాక్షి, ఓబులవారిపల్లె(కడప) : మండలంలోని కొర్లకుంట గ్రామానికి చెందిన పులి వైష్టవి (9) శనివారం ప్రమాద వశాత్తు సంజీవపురం చెరువులోని నీటికుంటలో పడి మృతి చెందింది. బంధువుల కథనం మేరకు.. కొర్లకుంట గ్రామనికి చెందిన పులి సుబ్రమణ్యం కూమార్తె వైష్టవి, గ్రామానికి చెందిన తోటి పిల్లలతో కలిసి సంజీవపురం చెరువులోనికి సాయంత్రం బహిర్భూమికి వెళ్లారు. వైష్టవి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయి కేకలు వేసింది. తోటి పిల్లల కళ్లముందే ఆ చిన్నారి నీటి కుంటలో మునిగిపోయింది. విషయన్ని ఇంటికి వచ్చి పిల్లలు చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటహుటిన కుంటలోకి దిగి చిన్నారిని వెలికితీశారు. అప్పటికే మృతి చెందింది. పులి సుబ్రమణ్యం ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంచాన పడి ఉన్నాడు. వారికి ఒక కూమారుడు కూమార్తె ఉన్నారు. వైష్ణవి మృతితో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డాక్టర్ నాయక్ తెలిపారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరమర్శించారు. -
బాలికను బలిగొన్న నీటికుంట
సాక్షి, బెళుగుప్ప(అనంతపురం) : తగ్గుపర్తి గ్రామ సమీపంలోని నీటికుంట ఓ బాలికను మింగింది. దప్పిక తీర్చుకునేందుకు వెళ్లిన బాలికను నీటికుంట మింగేసింది. మరొక బాలికను అటుగా వచ్చిన ఓ రైతు గమనించి రక్షించాడు. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తగ్గుపర్తి దళితవాడకు చెందిన అస్మిత (13) స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. దసరా సెలవులు రావడంతో ఇంటివద్దనే ఉంటోంది. మంగళవారం స్నేహితులు చిన్ని, శాలినితో కలిసి నల్లరేగడి భూముల్లోనూ, గట్లపైనా కాచే చిన్న కాకరకాయలను తీయడానికి వెళ్లింది. ఎండ తీవ్రతకు దప్పిక వేయడంతో నీటి కోసం వెదికింది. సమీపంలోనే గాలిమరల కంపెనీల రహదారుల కోసం మట్టిని తవ్వగా ఏర్పడిన గుంతల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. లోతు గమనించని చిన్నారులు నీరు తాగేందుకు వెళ్లారు. నీరు తాగుతున్న సమయంలో అస్మిత కాలుజారి కుంటలోకి పడిపోయింది. కాపాడే ప్రయత్నంలో స్నేహితురాలు చిన్ని సైతం పడిపోయింది. గట్టుపై ఉన్న శాలిని గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో పెట్రోలు అయిపోయి ద్విచక్రవాహనం తోసుకుంటూ వస్తున్న రైతు లక్ష్మినారాయణ అక్కడకు చేరుకుని చిన్నిని ఒడ్డుకు చేర్చాడు. లోతు ఎక్కువ ఉన్న చోట మునగడంతో అస్మిత దొరకలేదు. కొంతసేపటి తర్వాత మరికొందరితో కలిసి నీటికుంటలోకి దిగి అస్మితను బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే అస్మిత ప్రాణం విడిచింది. ‘ఇంతవరకు కళ్ల ముందు ఆడుకుంటూ ఉంటిరే.. అంతలోనే కానరాని లోకాలకు వెళ్తివా బిడ్డా’ అంటూ అస్మిత తల్లిదండ్రులు మారెక్క, వన్నరూప్పలు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..
సాక్షి, అమరావతి : ‘ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..’ ‘హోటల్లో బకాయిలు చెల్లించమంటే డీజీపీ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు..’ ‘ఆక్రమణలో ఉన్న నా పొలం నాకు అప్పగించినందుకు కృతజ్ఞతలు..’ ఇలా ఫిర్యాదుదారులు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను కలసి వినతులు అందజేశారు. సోమవారం కమిషనరేట్‌లో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిని సీపీ ద్వారకా తిరుమలరావు, జాయింట్ సీపీ నాగేంద్రకుమార్, డీసీపీ కోటేశ్వరరావు పరిశీలించి సమస్యల పరిష్కారానికి స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 166 ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిని వారంలోగా పరిష్కరించాలని సీపీ ఆదేశించారు. నిజం చెప్పండి.. ‘సార్.. మాది మచిలీపట్నం మండలం గిలకలదిండి గ్రామం. మాకు ఇద్దరు సంతానం. కుమార్తె దివ్యను పల్లితుమ్మలపాలెం గ్రామానికి చెందిన కార్పెంటర్ అంకాని రాంకుమార్‌కు ఇచ్చి వివాహం చేశాం. ఆ సమయంలో కట్నం కింద ఎకరం పొలం, పసుపు కుంకుమ కింద రూ.50 వేలు ఇచ్చాం. దివ్య జనవరిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురుని చూడడానికి తండ్రి మూడు నెలలు మా ఇంటికే రాలేదు. ఐదో నెలలో కుమార్తెను అత్తవారింటికి పంపాం. వారు మూడు నెలల కిందట విజయవాడ శివార్లలోని పెనమలూరుకు వచ్చి నివసిస్తున్నారు. గత ఆగస్టు 20న తన బాబాయ్‌కు ఫోన్ చేసి తనను భర్త కొడుతున్నాడంటూ.. అదనపు కట్నం తెచ్చివ్వాలని వేధిస్తున్నాడంటూ.. తాను ఇంటికి వచ్చేస్తానంటూ బోరుమని విలపిస్తూ చెబుతుండగానే ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత సాయంత్రం 5.30 గంటల సమయంలో మాకు ఫోన్ చేసి మీ కుమార్తె ఉరి వేసుకుని చనిపోయింది. మచిలీపట్నానికి ఆమెను తీసుకొస్తున్నామంటూ చెప్పి ఫోన్ పెట్టేశారు. అనుమానంతో కేసు పెట్టాం.. పెనమలూరు పోలీసులను ఎన్నిసార్లు ప్రయత్నించినా సరైన సమాధానం చెప్పడం లేదు. కుమార్తెను అత్తామామలు, బావ, భర్త కలసి చంపేశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో చెప్పాలని వేడుకున్నా.. ఫలితం లేదు. మీరే మాకు న్యాయం చేయండి’ – బడుగు కనకదుర్గా, ఆదిశేషు, తల్లిదండ్రులు, పల్లితుమ్మలపాలెం బిల్లు అడిగితే బెదిరిస్తున్నాడు.. లంకా దినకర్ మా హోటల్లో రెండున్నర నెలల పాటు ఉన్నాడు. బిల్లు అడిగిన ప్రతిసారి టీడీపీ నేతలతో ఫోన్లు చేయించేవాడు. వారు కూడా ఖాళీ చేసే సమయంలో డబ్బు మొత్తం చెల్లిస్తాడని చెప్పారు. చివరకు రూమ్ ఖాళీ చేసినా బిల్లు డబ్బులు రూ.2.50 లక్షలు చెల్లించలేదు. నిలదీస్తే డీజీపీ గౌతంసవాంగ్ పేరు చెబుతున్నాడు. అరెస్టు చేయిస్తానని బెదరిస్తున్నాడు. – శ్రీనివాస్, మేనేజర్, వైబ్రెంట్ హోటల్ నా పొలం నాకు దక్కింది.. సార్, ఆక్రమణలో ఉన్న నా పొలం మీ జోక్యంతో నాకు దక్కింది. తనఖా పెట్టిన తన భూమిని ఆక్రమించిన వారి నుంచి నా పొలం తిరిగి నాకు అప్పగించమని మీకు గత వారం ఫిర్యాదు చేయగా.. తక్షణమే మీరు స్పందించి నాకు న్యాయం చేశారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. – డొకుపర్తి సత్యనారాయణ, ముస్తాబాద, గన్నవరం -
వేడినీళ్లు పడి చిన్నారి మృతి
సాక్షి, పెదబయలు(విశాఖపట్టణం) : వేడి నీళ్లు పడి ఓ చిన్నారి మృ త్యువాత పడింది. దీంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పర్రెడ పంచాయతీ పెద్దాపుట్టు గ్రామంలో తాంగుల పుష్ప అనే మహిళ స్నానం కోసమని ఈనెల 26వ తేదీ ఉదయం కట్టెల పొయ్యపై నీళ్లు వేడిచేసింది. మరిగిన నీటిని బకెట్లో పోసింది. ఇంతలో ఆమె కుమార్తె లలితప్రియ(03) అటుగా వచ్చి వేడినీరు ఉన్న బకెట్‌పై కాలువేసింది.ఆ నీరు శరీరంపై పడి వీపు భాగం తీవ్రంగా కాలిపోయింది. వెంటనే పెదబయలు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యాధికారి లేకపోవడంతో ముంచంగిపట్టు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సచేసిన వైద్యాధికారి, పాపకు తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే తల్లిదండ్రులు కిలగాల గ్రామంలో నాటు వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. కొద్దిగా తగ్గడంతో బుధవారం స్వగ్రామం తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన వెంటనే పాప మృతి చెందిందని తల్లిదండ్రులు లక్ష్మణరావు, పుష్ప తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విశాఖపట్నం తీసుకువెళ్లి ఉంటే పాప బతికేదని వారు భోరున విలపించారు. షాక్‌కు గురైన తల్లి తన ముద్దుల కుమార్తె మృతి చెందడంలో తల్లి పుష్ప షాక్‌కు గురైంది. ఆమె ఎనిమిది నెలల గర్భిణి. నెల రోజుల్లో ప్రసవించనున్నట్టు వైద్యులు తెలిపారు.ఈ దుర్ఘటన జరగడంతో ఆమె తీవ్రంగా రోదించి, అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. తరువాత సపర్యలు చేయడంతో తేరుకుంది. సమాచారం తెలుసుకున్న రూడకోట పీహెచ్సీ వైద్యాధికారి కనక అప్పారావు వైద్య సిబ్బందిని పెద్దాపుట్టు గ్రామానికి పంపించి ఆమెకు వైద్యసేవలందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి బాగుందని వైద్య సిబ్బంది తెలిపారు. చిన్నారి మృతి చెందడంతో పెద్దాపుట్టలో విషాదఛాయలు అలముకున్నాయి. -
అద్దె ఇల్లే శాపమైంది!
సాక్షి, నందిపేట్(నిజామాబాద్) : బతుకు దెరువు కోసం వచ్చిన ఆ కుటుంబంలో విధి విషాధం నింపింది. తమ పిల్లల భవిష్యత్ కోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన ఆ దంపతుల ఆనందాన్ని గోడ కూలి ఆవిరి చేసింది. కొత్తగా దిగిన అద్దె ఇంట్లో సామగ్రి సర్దుకోక ముందే చిన్న కూతరును గోడ రూపంలో మృత్యువు కబలించింది. కొత్తగా అద్దె ఇంట్లో దిగిన గంటల వ్యవధిలోనే గోడకూలి చిన్నారి మృతి చెందిన ఘటన నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా లింగసముందర్ మండలం ఎర్రేటిపాలెం గ్రామానికి చెందిన రావూరి అంజయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి నిమిత్తం మేస్త్రీ పనిచేసేందుకు నందిపేట మండలానికి వచ్చాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మండల కేంద్రంలోని రామ్‌నగర్ దుబ్బ ప్రాంతంలో గల ఒక ఇంటిలో భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడితో కలిసి అద్దెకు దిగాడు. ఉదయం 8 గంటలకు వచ్చిన వారు సామన్లు సర్దుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భార్యభర్తలు అంజయ్య, చెంచమ్మ ఆరుబయట మెట్ల వద్ద కూర్చుని ఉండగా ముగ్గురు పిల్లలు ఆర్సీసీ బిల్డింగ్‌ను ఆనుకుని ఉన్న రేకులషెడ్డు వంట గదిలో ఆడుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన వంటగది రేకుల షెడ్డు గోడ ఒక్కసారిగా ముగ్గురి చిన్నారులపై కూలింది. తీవ్రంగా గాయపడిన వారి చిన్న కూతురు రేణుక(8) సంఘటన స్థలంలో మృతి చెందింది. అలాగే పెద్ద కుమార్తె శాంకుమారి(12), కొడుకు కొండయ్య(10) తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటిలో చేరిన మొదటి రోజే కూతురును పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు, అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నారి తల్లి చెంచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. -
వికటించిన పెళ్లి భోజనం
నార్నూర్ (ఆసిఫాబాద్): పెళ్లి విందు భోజనం వికటించి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 21 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో చోటు చేసుకుంది. నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ (గణపతిగూడ)లో ఇరవై కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మిబాయి ఇంట్లో మంగళవారం పెళ్లి జరిగింది. బుధవారం విందు ఏర్పాటు చేశారు. భోజనం వికటించడంతో 24 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో చింటు, అయ్యు, కొడప ముత్తు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల మృతితో గిరిజనుల ఆగ్రహం పీహెచ్సీలో సకాలంలో వైద్యం అందకపోవడం, 108 రాకపోవడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారని ఆరోపిస్తూ బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఐటీడీఏ పీవో కొలాంగూడను సందర్శించి పరిస్థితిని ఆరా తీశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మిగతా వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంతరావును ఆదేశించారు. -
ఒకరిని కాపాడబోతే.. 6గురు చిన్నారుల మృతి
పట్నా : బిహార్‌లోని అరారియా జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసిన కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారిని రక్షించే క్రమంలో అదుపు తప్పిన కారు దగ్గర్లోని చెట్టును బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. బాధితులు ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 6గురు చిన్నారులతో పాటు మరో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందగా, ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతులు చిన్నపిల్లలు కావడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. -
బాలురను బలిగొన్న స్విమ్మింగ్‌పూల్
జడ్చర్ల : అభం..శుభం తెలియని బాలురు వారు.. వేసవిలో సరదాగా ఈత నేర్చుకుందామన్న కుతూహలంతో ఇద్దరు చిన్నారులు సమీపంలోని స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లారు.. అక్కడ తోటిపిల్లలు ఈతపడటం చూసి ఉత్సాహంతో వారు సైతం ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండానే అందులో దూకేశారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉం డటంతో ఇద్దరూ మునిగిపోయి మృతిచెందారు. ఈ సంఘటన శుక్రవారం జడ్చర్ల– మహబూబ్‌నగర్ మధ్యలోని జాలీహిల్స్‌లో చోటుచేసుకుంది. సీఐ బాలరాజుయాదవ్ కథనం ప్రకారం.. మండలంలోని శంకరాయపల్లితండాకు చెందిన నరేష్(13), చేతన్(13)తోపాటు అతని తమ్ముడు వంశీలు కలిసి తండా నుంచి సమీపంలోని జాలీహిల్స్‌లోని స్విమ్మింగ్‌పూల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఈత కొట్టేందుకు ఇద్దరికి కలిపి రూ.70 చెల్లించి నిర్వాహకులతో టికెట్లు తీసుకున్నారు. టికెట్ ఇచ్చిన నిర్వాహకులు బాలురను స్విమ్మింగ్‌పూల్‌లోకి అనుమతించి వారు గదిలోకి వెళ్లిపోయారు. టికెట్ తీసుకున్న బాలురు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండానే స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగారు. అయితే నీటిమట్టం దాదాపు ఆరడుగులపైనే ఉండడంతో నీట దిగిన బాలురు ఇద్దరూ ఈత రాకపోవడంతో మునిగిపోయారు. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగకుండా పైన ఉన్న చేతన్ తమ్ముడు వంశీ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి బాలురను బయటకు తీసి ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నమ్మ ఇంటికి వచ్చి.. నరేష్ శంకరాయపల్లితండాకు చెందినవాడు. ఇతని తల్లి బుజ్జి ఆశ కార్యకర్తగా పనిచేస్తుండగా తండ్రి హర్యా కావేరమ్మపేట గ్రామ పంచాయతీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. నరేష్ షాద్‌నగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ ఏడో తరగతి పూర్తి చేశాడు. చేతన్ తిమ్మాజీపేట మండలం పుల్లగిరి చింతగట్టుతండాకు చెందిన సాలీ, లక్ష్మణ్ణ కుమారుడు. లక్ష్మణ్ కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోగా తల్లి సాలి హైదరాబాద్‌లోని మల్కాజ్గిరి ప్రాంతంలో కూలీ పనులు చేసుకుంటూ చేతన్‌ను చదివిస్తుంది. చేతన్ కూడా ఏడో తరగతి పరీక్షలు రాశాడు. అయితే వేసవి సెలవులు కావడంతో చేతన్ శంకరాయపల్లిలో ఉంటున్న చిన్నమ్మ దగ్గరకు వచ్చాడు. చిన్నమ్మ బుజ్జి కుమారుడు నరేష్‌తో కలిసి వెళ్లి ఇద్దరూ నీటిలో మునిగిపోయి మృతిచెందారు. ఆదుకోవాలంటూ రాస్తారోకో.. బాధిత కుటుంబాలకు నిర్వాహకులు, ప్రభుత్వపరంగా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు, బంధువులు జా లీ హిల్స్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చే పట్టారు. రాస్తారోకోకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మ ల్లురవి మద్దతు పలికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రూ.40 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చె ల్లించాలని డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యం గా వ్యవహరించిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో దాదాపు రెండుగంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సంఘటనా స్థలానికి డీఎస్పీ భాస్కర్‌గౌడ్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఏం సమాధానం చెప్పాలి
చిట్టి చిట్టి పాదాలతో నా గుండెలపై గెంతుతుంటే పులకరించిపోయానే.. ఆట వచ్చినా రాకున్నా ఒకరికి మించి ఒకరు ఆడేందుకు పోటీ పడుతుంటే వారి పట్టుదల చూసి సంబరపడ్డానే.. చిచ్చర పిడుగుల్లా ఆటలో చెలరేగుతుంటే వారి ప్రతిభ చూసి ముసిముసిగా నవ్వుకున్నానే.. భగవంతుడా..! మాయదారి పిడుగు ఇక్కడే పడాలా. నిండా 20 ఏళ్లు కూడా నిండలేదు కదయ్యా.. నా ఎదలోతులను చీల్చినా భరించేదాన్నే.. నా చెంత ఆడుకునే బిడ్డలను నిలువునా చిదిమేశావు.. ఆటాడేందుకు నాపై నిలిపిన ఈ రాళ్లు.. మళ్లీ బిడ్డల పాదాల చప్పుడు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తుంటే పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఎలా ఆపుకోవాలి. బిడ్డల తల్లిదండ్రుల గర్భశోకానికి ఏమని సమాధానం చెప్పాలి. వారి గుండెల్లో బాధాగ్నిని ఏ వర్షపు చుక్క ఓదార్చాలి.– మైదానం ఆత్మఘోష అమరావతి, గురజాల: కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకునే తమ బిడ్డలతో విధి ఆటాడుకుందని ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. గురజాల మండలం సమాధానం పేటలో పిడుగుపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మేరాజోత్ దేవానాయక్, భూలక్ష్మిల కుమారుడు మనోహర్ నాయక్ నాయనమ్మ సైదమ్మ వద్ద ఉండి చదువుకుంటాడు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి వెళ్లిపోయాడు. బోజావత్ హనుమంతు నాయక్, కోటమ్మల కుమారుడు శ్రీహరి నాయక్ చిన్నబ్బాయి. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. మూడవత్ సేవా నాయక్, అంజలి భాయ్ దంపతులకు కుమారుడు పవన్ నాయక్. వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చి విగతజీవిగా మారాడు. -
పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్
-
అఫ్గానిస్తాన్‌లో 37 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో సోమవారం జరిగిన పలు ఆత్మాహుతి దాడుల్లో పది మంది విలేకరులు, పదకొండు మంది చిన్నారులు సహా 37 మంది దుర్మరణం పాలయ్యారు. రాజధాని కాబూల్‌లో రెండు బాంబు పేలుళ్లలో కలిపి 25 మంది చనిపోగా, కాందహార్‌లో జరిగిన మరో దాడిలో 11 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మూడు ఘటనల్లో కలిపి 65 మంది గాయపడటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 2001 తర్వాత అఫ్గానిస్తాన్‌లో మీడియాపై జరిగిన అత్యంత భయానక దాడి ఇదేనని ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ అనే సంస్థ వెల్లడించింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన మరో దాడిలో బీబీసీ రిపోర్టర్ అహ్మద్ షా మరణించారు.కాబూల్‌లో జరిగిన రెండు దాడులూ చేసింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాది జర్నలిస్ట్‌లా వచ్చి జనసమూహంలో తనను తాను పేల్చుకున్నాడని కాబూల్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. చనిపోయిన జర్నలిస్టుల్లో పలు స్థానిక చానళ్ల ప్రతినిధులు సహా ఏఎఫ్‌పీ చీఫ్ ఫొటోగ్రాఫర్ షా మరై కూడా ఉన్నారు. మరో ఘటనలో కాందహార్‌లో ఉగ్రవాది బాంబులతో నిండిన కారులో వచ్చి దాడికి పాల్పడటంతో 11 మంది చిన్నారులు మృతి చెందగా అఫ్గాన్, ఇతర దేశాల భద్రతా దళాల సిబ్బంది సహా 16 మంది గాయపడ్డారు.ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. 2016 నుంచి ఇప్పటివరకు అఫ్గానిస్తాన్‌లో 34 మంది జర్నలిస్టులు చనిపోయారనీ, పత్రికా స్వేచ్ఛ సూచీలో ఆ దేశ స్థానం 118 అని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ గుర్తుచేసింది. 2016లోనూ ఓ చానల్‌పై తాలిబాన్లు దాడి చేయగా ఏడుగురు ఉద్యోగులు మరణించారు. గత నవంబర్‌లో కూడా మరో టీవీ చానల్ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. -
అ'మ్మా'నుషం
ఖిలా వరంగల్: రోజంతా పార్కులో కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపిన ఆ చిన్నారులకు అవే చివరి క్షణాలయ్యాయి. నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లే.. ఆ పిల్లల పాలిట మృత్యువైంది. కుటుంబంలో ఏమైయిందో ఏమో కానీ పార్కులో ఆనందగా గడిపిన మహిళ తన పిల్లలను చెరువులో పడేసి తానూ ఆత్మహత్య చేసుకోబోయింది. ఇద్దరు చిన్నారులు మృతి చెందగా తల్లి ప్రాణ భయంతో బయటకు వచ్చింది. ఈ ఘటన ఖిలావరంగల్ మధ్యకోటలోని ఏకశిల పార్కులోని గుండు చెరువులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం సమీపంలోని లక్ష్మీపురానికి చెందిన పత్తిపాక పున్నం చందర్,స్వాతి దంపతులకు కుమారుడు రిత్విక్‌సాయి(5) కూతురు తన్మయ్(11 నెలలు) ఉన్నారు. పున్నంచందర్ వరంగల్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. స్వాతి ఇంటి వద్దే ఉంటూ తన ఇద్దరు పిల్లల ఆలనపాలనా చూస్తోంది. అయితే కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు.. స్వాతి మనోవేదనకు గురై తన ఇద్దరు పిల్లలతోపాటు తానూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మధ్యాహ్నం ఒంటి గంటకు తన ఇద్దరు పిల్లలను తీసుకుని మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్ పార్కుకు చేరుకుంది. పార్కులో చెట్ల నీడన స్వాతి తన ఇద్దరు పిల్లలతో రాత్రి 8 గంటల వరకు ఆనందగా గడిపింది. పార్కు ఇన్చార్జి, సిబ్బంది అందరినీ బయటకు పంపించి గేటుకు తాళం వేశారు. కాగా పార్కులో ఓ మూలన ఉన్న స్వాతి తన ఇద్దరు పిల్లలు తీసుకుని చెరువులోకి వెళ్లింది. తన చేతితోనే ఇద్దరు పిల్లలను నీటి ముంచింది. పిల్లలు మృతి చెందే దాకా ఉండి తానూ ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులోపలికి వెళ్లింది. వెంటనే ప్రాణ భయంతో చెరువులో నుంచి బయటకు వచ్చింది. రోదిస్తూ పార్కు గేటు వద్దకు వెళ్లింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి పిలిచి తన ఇద్దరు పిల్లలు చెరువులో పడి మృతి చెందిన విషయాన్ని చెప్పింది. వెంటనే స్థానికులు, పార్కు నిర్వాహకుడితో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ నందిరాం, ఎస్సైలు రాజన్‌బాబు, డెవిడ్ వెంటనే అక్కడికి చేరుకుని చెరువులో నుంచి పిల్లలను వెలికి తీశారు. చిన్నారుల మృతి విషయం తెలుసుకుని బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని బోరున విలపించారు. ప్రాణభయంతో బయట పడిన స్వాతి గుండెలు బాదుకుంటూ రోదించింది. చిన్నారులు రిత్విక్సాయిచ తన్మయ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. తండ్రి పున్నంచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ నందిరాం తెలిపారు. -
హోలీ పండుగలో విషాదం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని పుల్కల్ మండలం కొర్పోల్ గ్రామంలో నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. గ్రామంలోని యువకులు హోలీ వేడకలు జరుపుకున్నారు. వేడుకల అనంతరం స్థానిక మంజీర నదిలో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలో దిగిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. చనిపోయిన ఇద్దరు చిన్నారులు సాయికుమార్, సాయి కిరణ్‌లుగా గుర్తించారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా హోలీ ఆడిన చిన్నారులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు మృతి!
యునైటెడ్ ఎమిరేట్స్‌లో సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు మరణించారు. అనుకోకుండా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఏడుగురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన దుబాయ్‌కి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న దడ్నా గ్రామంలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఇళ్లంతా దట్టమైన పోగలు అలుముకొని పిల్లలు చనిపోయారని, వారి తల్లి ప్రాణాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. -
చెరువులో పడి నలుగురు చిన్నారుల మృతి
కొరాపుట్(ఒడిశా): ఒడిశాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. కొరాపుట్ జిల్లా పరాజ ఖుడుపి గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మి, సుశాంత, సంజయ్, సబితా అనే చిన్నారులు( అంతా తొమ్మిదేళ్లలోపు వారే) ఆడుకుంటూ చెరువు జారి పడిపోయారు. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో వారు నీట మునిగి చనిపోయారు. మంగళవారం ఉదయం వారి మృతదేహాలను వెలికితీశారు. అయితే, చిన్నారులు ప్రమాదవశాత్తు చనిపోయారా లేక కావాలనే ఎవరైనా వారిని చంపారా అనే దానిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు కొరాపుట్ ఏఎస్పీ వీఆర్ రావు తెలిపారు. -
బాలల దినోత్సవం రోజున విషాదం
అమ్మా.. ఈ రోజు మా స్కూల్లో పండుగ చేస్తారంట.. పిల్లలందరూ అందంగా రెడీ అవ్వాలంట.. నాకు కొత్త దుస్తులు వెయ్యి.. రోజాపూలు పెట్టు..’ అంటూ ఆ చిన్నారి చిట్టిపొట్టి మాటలతో తల్లిదండ్రులను మురిపించింది. తాను అనుకున్నట్టుగానే రెడీ అయ్యి.. స్కూలు వ్యాను ఎక్కి అమ్మకు టాటా చెప్పింది. సాయంత్రం పాఠశాలలో జరిగిన విశేషాలను ఆనందంతో మోసుకొచ్చింది. వాటిని తన తల్లికి తెలియజేయాలని ఉబలాటపడింది. స్కూలు వ్యాను దిగి ఆత్రుతగా ఇంటివైపు వెళ్తోంది. ఇంతలో వ్యాను వెనుకకు రావడం తో ఆ చక్రాల కిందే పడి నలిగిపోయింది. తలమొత్తం నుజ్జునుజ్జుయింది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంధువుల రోదనలతో గ్రామం దద్ధరిల్లింది. ఈ ఘటన బాలల దినోత్సవం రోజైన మంగళవారం యాదమరి మండలంలో విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా / యాదమరి: బాలల దినోత్సవం రోజున ఓ చిన్నారి స్కూలు వ్యాను కింద పడి నలిగిపోయిన ఘటన యాదమరి మండలం దళవాయిపల్లెలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మణి, అరుణకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద పాప కుసుమ(6). ఇంగ్లిష్ చదువులు చదివించాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు. ఆర్థిక స్థోమత సహకరించకపోయినా చిత్తూరులోని ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చేర్పించారు. మురిపించిన చిలుక పలుకలు బాలల దినోత్సవం కావడంతో మంగళవారం స్కూలుకు వెళ్లడానికి కుసుమ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అమ్మ వద్ద చిలుకపలుకుతో అందంగా రెడీ చేయాలని సూచించింది. చాచా నెహ్రూ చిత్రపటం వద్ద పూలు పెట్టాలని రోజాలు కోసివ్వమని చెప్పింది. చిట్టితల్లి చెప్పినట్టుగానే తల్లి చిన్నారిని అందంగా రెడీ చేసింది. మధ్యాహ్నానికి క్యారియర్, పుస్తకాల బ్యాగ్ రెడీ చేసి, రోజాలు కోసిచ్చి బడి వ్యాను ఎక్కించింది. అనుకోని విషాదం సాయంత్రం దళవాయిపల్లెకి స్కూలు వ్యాను చేరింది. ఆత్రుతగా దిగి ఇంటివైపు నడక సాగించింది కుసుమ. స్కూల్లో జరిగిన విశేషాలు తల్లికి తెలియజేయాలని ఉబలాటపడింది. జరిగిన వాటిని తలుచుకుం టూ స్కూలు వ్యాను వెనుక నుంచి ఇంటికి బయలుదేరింది. ఇంతలో డ్రైవర్ వ్యాను వెనుకకు నడపడంతో తప్పించుకోలేక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. బంధువుల రోదనలతో గ్రామం దద్దరిల్లింది. స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జల సమాధి!
రోజూ వెళ్తున్న చెరువే కదాని ఏమరపాటుగా ఉన్నారో.. లేక నాచుపట్టిన మెట్లపై నుంచి జారిపడి నీట మునిగిపోయారో తెలియదుకాని.. మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన కన్నవారిని.. గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది. బట్టలు ఉతికేందుకు చెరువుకెళ్లిన లావేరు మండలం గుర్రాలపాలేం గ్రామానికి చెందిన పతివాడ నాగమ్మ(45), ఆమె కుమార్తె శిరీష(14), వారి ఇంటి సమీపంలో ఉండే మరో బాలిక బడారి దుర్గ(18) నీట మునిగి చనిపోయారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. కన్నవారు గుండెలు బాదుకుంటూ రోజూ వెళ్లిన చెరువే తమవారిని మింగేసిందా అంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. శ్రీకాకుళం జిల్లా: గుర్రాలపాలేం గ్రామానికి చెందిన పతివాడ నాగమ్మ, ఆమె కూతురు శిరీష, వారి ఇంటి సమీపంలో ఉండే మరో బాలిక బడారి దుర్గలు గురువారం ఉదయం 10 గంటలు సమయంలో గ్రామ సమీపంలోని రౌతువాని చెరువు వద్ద బట్టలు ఉతకడం కోసం బకెట్లతో బట్టలు తీసుకొని వెళ్లారు. అయితే తిరిగి ఇంటికి చేరలేదు. ముగ్గురూ చెరువులో శవాలై తేలారు. వీరు ఎలా చనిపోయారో అంతు చిక్కడం లేదు. మెట్లు జారుగా ఉండడంతో కాలుజారి నీట మునిగి చనిపోయి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటంతో పాటు లోతు కూడా ఎక్కువగా ఉండటం, ముగ్గరికీ ఈత రాకపోవడం కూడా వీరి మరణించడానికి కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు చూడడంతో వెలుగులోకి.. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరువు వైపు వెళ్లిన కొందరు రైతులు చెరువులో ముగ్గురి శవాలు తేలి ఉండటం చూశారు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కొంతమంది చెరువులోకిదిగి నాగమ్మ, శిరీష, బడారి దుర్గ మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి అధికారులు –గుర్రాలపాలేంలో ముగ్గురు చనిపోయినట్టు తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లావేరు మండల తహసీల్దార్ బందరు వెంకటరావు, ఆర్ఐ టి.శ్రీదేవి, ఎస్సై సీహెచ్ రామారావు, ఏఎస్ఐ మోహనరావు, హెచ్‌సీ శ్రీనివాసరావు, వీఆర్వో బలివాడ శంకరరావు ప్రమాదానికి కారణమైన చెరువును పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు ఏమైఉంటాయోనని మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలకు శవపంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గ్రామ దేవత పండుగకు వెళ్లి వచ్చిన మరుసటి రోజే.. – గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే ప్రమాదంలో చనిపోవడంతో గుర్రాలపాలెంలో విషాదం నెలకొంది. చనిపోయిన వారిలో బాలిక పతివాడ శిరీష నందిగాం మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల మూడో తేదీన రణస్థలం మండలం మహంతిపాలేం గ్రామంలోని తాతగారింటికి గ్రామదేవత పండుగలకు తల్లి నాగమ్మతో కలిసి వెళ్లింది. బుధవారం సాయంత్రమే తల్లీకూతురు గుర్రాలపాలేం గ్రామానికి తిరిగి వచ్చారు. గురువారం ఉదయం బట్టలు తడిపేందుకు వెళ్లి చెరువులో పడి మృతి చెందారు. శిరీషకు చెందిన బట్టలన్నీ ఉతికి శుక్రవారం నందిగాంలోని పాఠశాలకు దిగబెట్టాలని తల్లిదండ్రులు అనుకున్నారు. ఇంతలోనే చెరువు రూపంలో మృత్యువు శిరీషను బలితీసుకుంది. భార్య నాగమ్మతో పాటు కూతురు శిరీష మృతి చెందడంతో ఇంటియజమాని పతివాడ గొల్ల భార్య, కూతురు మృతదేహాలపై పడి భోరున విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. నేను ఏంపాపం చేశానని భగవంతుడు తనకీ శిక్ష విధించాడని కన్నీరు మున్నీరయ్యాడు. ఏడ్చీ ఏడ్చీ మృతదేహాలపైనే గొల్ల స్పృహతప్పి పడిపోయాడు. చనువు మానేసి తల్లిదండ్రులకు అండగా.. మృతి చెందిన మరో బాలిక దుర్గ ఇంటర్ వరకూ చదువుకుంది. డిగ్రీ చదివించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో ఇంటి వద్దనే వారికి అండగా ఉంటుంది. బట్టలు ఉతకడానికి చెరువుకెళ్లి దుర్గ చనిపోవడంతో కన్నవారు బడారి గొల్ల, ఇందిరలు తీవ్ర విషాదానికి గురయ్యారు. ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే లావేరు మండల ఉపాధ్యక్షుడు మోరం సోంబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు బాద ఆనందరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్‌బాబ్జీ, అల్లంపల్లి నారాయణరావు, కుప్పిలి గొల్ల, లుట్ట శ్రీను, గుర్రాలపాలేం మాజీ సర్పంచ్ జనపాల బానోజిరావు, సర్పంచ్ ప్రతినిధి నేతల అప్పారావు, మనజనం సామాజిక సేవా కేంద్రం ఉపాధ్యక్షుడు జనపాల గోవిందరావు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంపై తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. -
ఫౌంటేయిన్‌లో పడి ఇద్దరు చిన్నారుల మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాగోల్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ వాటర్ ఫౌంటేయిన్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివరాలు..కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచెర్ల గ్రామానికి చెందిన గంటా శివాజి, బంధువుల పెళ్లి నిమిత్తం తన కుటుంబసభ్యులతో కలసి నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్‌కు బుధవారం రాత్రి వచ్చారు. శివాజీ కుమారుడు జితేంద్ర కుమార్(4), సోదరుడి కుమార్తె మనస్విని(5) ఇద్దరూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ వాటర్ ఫౌంటేయిన్‌లో పడి మృతి చెందారు. జితేంద్ర తండ్రి శివాజి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారులను మింగిన చెరువు
బతుకమ్మ వెలుగులను చూడనున్న గంగమ్మ రెండు ఇళ్లలో చీకటిని నింపింది. పండగపూట కొత్తబట్టలు వేసుకుని మురిసిపోవాల్సిన పాపాయిలను పొట్టన పెట్టుకుంది. తల్లిదండ్రుల కంటిపాపలను కానరానిలోకాలకు తరలించింది. నవ్వుతూ తిరగాల్సిన ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యురూపంలో కబళించింది. బాధిత కుటుంబాలను అంతులేని శోకసంద్రంలో ముంచేసింది. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన హృదయవిదారక ఘటన బుధవారం వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో చోటు చేసుకుంది. వరంగల్ రూరల్ ,చెన్నారావుపేట(నర్సంపేట) : పాపయ్యపేట ఊర చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గుండెల లావణ్య, ఐలయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు. రాజేష్, అఖిల(11) 6వ తరగతి, సాయి(8) 3వ తరగతి చదువుతున్నారు. వారు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన పైరాల వీరయ్య, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అజయ్(7) 2వ తరగతి, చిన్నవాడు ప్రదీప్ 1వ తరగతి చదువుతున్నారు. మణెమ్మ కొంతకాలంగా పాపయ్యపేటలో తన తండ్రి ఇంటిలో పిల్లలతో కలిసి ఉంటోంది. బట్టలు ఆరేయడానికి వెళ్లడంతో.. లావణ్య గ్రామ శివారులోని ఊర చెరువులోకి బుధవారం బట్టలు ఉతకడానికి వెళ్లింది. రాజేష్, అఖిల, సాయిలు తల్లి వెంట వెళ్లారు. ఆ చిన్నారులతో ఆడుకునే అజయ్ సైతం వారితో కలిసి చెరువుకు వెళ్లాడు. లావణ్య ఉతికిన బట్టలు ఆరవేయడానికి కట్టపైకి వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఈత కొట్టాలనే సరదాతో చెరవులోకి దిగారు. చెరువులోతుగా ఉండటంతో పోయారు. వారు మునిగిపోవడాన్ని గమనించిన లావణ్య కట్టపై నుంచే కేకలు వేస్తూ చెరువు వద్దకు చేరుకుంది. మునిగిపోతున్న పెద్ద కుమారుడు రాజేష్‌ను చేయిపట్టుకుని బయటకు లాగింది. మిగిలిన వారిని రక్షించడానికి ప్రయత్నం చేయగా వారు అప్పటికే నీటిలో మునిగిపోయారు. లావణ్య అరుపులు విన్న గ్రామస్తులు నీటిలో చిన్నారుల కోసం వెతికారు. అప్పటికే అఖిల, సాయి, అజయ్ మృతి చెందారు. అనంతరం వారి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై కూచిపూడి జగదీష్ మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కూచిపూడి జగదీష్ తెలిపారు. మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. ముగ్గరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలకు ‘పెది’్ద ఆర్థిక సాయం చెరువులో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు సివిల్ సప్లై కార్పొషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి రూ.30వేలు ఆర్థిక సాయాన్ని టీæఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి, పాపయ్యపేట ఎంపీటీసీ బిల్లా ఇంద్రసేనారెడ్డిలతో కలిసి అందించారు. అమ్మ రాకపోతే.. బట్టలు కట్టపై ఆరేయడానికి అమ్మ వెళ్లింది. మేము స్నానం చేయడానికి నీళ్లలోకి దిగి బండను పట్టుకున్నాం. చేతులు జారి నీళ్లలో మునిగిపోయాం. మా అరుపులు విని అమ్మ వచ్చి నా చేయి పట్టుకుని లాగింది. చెల్లె అఖిల, తమ్ముడు సాయి, దోస్త్ అజయ్ నీళ్లలో మునిగిపోయారు. అమ్మ వెతికినా వాళ్లు దొరకలేదు. అమ్మ రాకపోతె నేను కూడా చనిపోదును. – రాజేష్, లావణ్య దంపతుల పెద్ద కొడుకు మృతదేహాల వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు తెల్లవారితే సద్దుల బతుకమ్మ పండుగ. పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొనగా.. చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తన చెంతనే ఉన్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే చెరువు నీటలో మునిగిపోతుంటే.. కాపాడలేని స్థితిలో ఆ తల్లి గుండెలు పగిలేలా అరిచింది. పొరుగు ఉన్నవారు పరుగున వచ్చినా ఫలితం దక్కలేదు. లోతు తెలియక నీటిలోకి దిగిన ముగ్గురు చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. దుస్తులు ఉతుక్కోవడానికి చెరువు వద్దకు వెళ్లిన ఆ మాతృమూర్తి ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది. పిల్లల వెంట వెళ్లిన మరో బాలుడూ మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. – చెన్నారావుపేట(నర్సంపేట) -
వరంగల్ జిల్లాలో విషాదం
-
వరంగల్ జిల్లాలో విషాదం
చెన్నారావుపేట: వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు బాలురు కాగా ఓ బాలిక ఉంది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన గుంజేల అజయ్(10), సాయి(9), అఖిల(9) అనే ముగ్గురు చిన్నారులు ఉర చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గోరఖ్‌పూర్‌లో మరణమృదంగం
-
గోరఖ్‌పూర్‌లో మరణమృదంగం
ఒక్క నెలలోనే 296 మంది చిన్నారుల దుర్మరణం గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) వైద్య కళాశాలలో ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపు 296 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరిలో 213 నవజాత శిశువులు ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 83 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో చనిపోయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పీకే సింగ్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆస్పత్రిలోని మెదడువాపు, చిన్నారుల వార్డుల్లో దాదాపు 1,256 మంది మృతి చెందినట్లు సింగ్ పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 17 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో 37 మంది పిల్లలు (వీరిలో 11 మంది మెదడువాపు వ్యాధితో) ఆస్పత్రిలో మృత్యువాత పడ్డారని సింగ్ వెల్లడించారు. నెలలు నిండకుండానే పుట్టడం, తక్కువ బరువు ఉండడం, కామెర్లు, న్యుమోనియా, ఇన్ఫెక్షన్, మెదడువాపు తదితర కారణాలతో, విషమ పరిస్థితుల్లోనే చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్నారని సింగ్ తెలిపారు. చిన్నారులను కొంచెం ముందుగా ఆస్పత్రికి తీసుకురాగలిగితే చాలామంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు చిన్నారుల మరణాలకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్డీ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రాతో పాటు ఆయన భార్యను ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అరెస్టు చేసింది. -
కడదాకా కన్నపేగు వెంటే
కన్నబిడ్డలను వదిలి ఒక్క క్షణమైనా ఉండలేని అమ్మ ఆఖరకు వారి వెంటే వెళ్లిపోయింది. అమ్మా అమ్మా అంటూ నిత్యం తల్లి వెంట తిరిగే చిన్నారులు చివరకు ఆ తల్లితోనే అనంతలోకాలకు పయనమయ్యారు. అప్పటి వరకు నాన్న అంటూ పిలిచిన బిడ్డలు ఇక లేరని తెలిసి ఆ తండ్రి గుండె తల్లడిల్లిపోతోంది. తమ ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేసిన సాయి, సిరిలు ఇక రారని తెలిసి సిరిపురం కన్నీరు పెట్టుకుంది. నేలబావిలో పడి తల్లీబిడ్డలు మృతి చెందిన ఘటన సిరిపురం గ్రామాన్ని శోకంలో ముంచేసింది. శ్రీకాకుళం జిల్లా : సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో నేలబావిలో పడి తల్లీబిడ్డలు రోహిణి (30), సిరివల్లి (5), సాయిసాత్విక్ (3)లు సోమవారం మృతి చెందారు. మామిడితోటలో జరిగిన ఈ దుర్ఘటనతో గ్రామం ఘొల్లుమంది. మృతుల్లో ముక్కుపచ్చలారని చిన్నారులు ఉండడం స్థానికులను కలిచివేసింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సిరిపురం గ్రామానికి చెందిన పొగిరి అప్పలనాయుడు భార్య పిల్లలతో కలిసి తన మామిడితోటకు కాయలు దించేందుకు సోమవారం వెళ్లారు. రెండు బస్తాల కాయలు రావడంతో ఒక బస్తాను ద్విచక్ర వాహనంపై వేసుకుని తాను ఇంటికి వెళ్తానని, పిల్లలను తీసుకుని రావాలని భార్యకు చెప్పాడు. ఆ బస్తాను ఇంటి వద్ద దించి మళ్లీ తోటకు వచ్చి రెండో బస్తాను కూడా తీసుకెళ్లాడు. అప్పటికీ తన భార్యాపిల్లలు ఇంటికి చేరకపోవడంతో అనుమానం వచ్చి తోటంతా గాలించాడు. చుట్టుపక్కల పరిశీలించగా నేలబావిలో భార్యాపిల్లలు పడి ఉండడం చూసి ఘొల్లుమన్నాడు. సమాచారం అందుకున్న స్థానికులు బావిలోంచి రోహిణితో పాటు చిన్నారులను బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. వీరి మృతదేహాలను చూసి అప్పలనాయుడు తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. సిరిపురం కంట నీరు తల్లీబిడ్డలు నేలబావిలో పడి మృతి చెందడంతో సిరిపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పలనాయుడు సిరిపురం గ్రామంలో ఫొటో స్టూడియో నడుపుతూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈయన కుటుంబంలో ఇంతటి విషాదం సంభవించడాన్ని గ్రామస్తులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మృత్యువాత పడ్డారని తెలుసుకొని గ్రామస్తులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో మామిడితోట శోక సంద్రంగా కనిపించింది. బావిలో బురద రోహిణితోపాటు చిన్నారులు మృతి చెందిన బావిలో కొద్దిపాటి నీటితోపాటు బురద కూడా ఉంది. తొలుత చిన్నారులు బావిలో జారిపడడాన్ని గమనించి వారిని కాపాడే ప్రయత్నంలో రోహిణి కూడా బావిలో దిగి మృతి చెంది ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మామిడికాయలు ఇంటికి తరలించే ప్రయత్నంలో ముందుగా తన పిల్లలను అప్పలనాయుడు ఇంటికి చేర్చి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదికాదేమోనని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు దర్యాప్తు విషయం తెలుసుకున్న రాజాం రూరల్ సీఐ శేఖర్‌బాబుతోపాటు సంతకవిటి ఎస్సై ఎస్.చిరంజీవి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతోపాటు బాధిత కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. -
చిన్నారి మృతి: హాస్పిటల్ లైసెన్స్ రద్దు
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులోని ఒక చిన్నారి అనుమానాస్పద మృతికి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రి లైసెన్సును అధికారులు రద్దు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 18 నెలల బాలుడు గురువారం ఉదయం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనిపై కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌వో దయానంద్స్వామి శ్రీనివాస పిల్లల హాస్పిటల్ వైద్యులే కారణమని తేలంటంతో లైసెన్సును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మృతుని కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు చిన్నారుల సజీవ దహనం
-
ఇద్దరు చిన్నారుల సజీవ దహనం
విజయవాడ: నగరంలోని పటమటలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారికి అగ్నికి బలయ్యారు. వివరాలు.. యనమలకుదురు రోడ్డులో ఉన్న ట్రెజరీ కాలనీలో నివాసముంటున్నఖరగ్పూర్‌కు చెందిన పద్మ తన భర్తతో కలసి పనుల నిమిత్తం విజయవాడకి వచ్చారు. వారికి లోకేష్ (6), రాజేష్( 2) ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలను గుడిసెలో వదిలి తల్లిదండ్రులు పనికివెళ్లారు. ఉదయం ట్రెజరీ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఇంట్లో ఉన్న చిన్నారులు మృత్యువాతపడ్డారు. సమాచారమందుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. సజీవ దహనమైన చిన్నారుల వివరాలు అడిగితెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం మాత్రం చెప్పలేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. -
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
హైదరాబాద్: స్థానిక దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరాంపేట చెరువులో ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. 6 వ తరగతి చదువుతున్న సాయికుమార్, ఎనిమిదవ తరగతి చదువుతున్న జయప్రకాష్ ఇద్దరూ సోమవారం ఉదయం సమీపలోని బౌరాంపేట చెరువులో ఈత కొట్టేందుకు వెళ్ళారు. అయితే చెరువులో లోతు ఎక్కువగా ఉన్నందున ప్రమాదవశాత్తూ మునిగి ఇద్దరూ మృతి చెందారు. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
కూకట్‌పల్లిలో కూలిన గోడ: చిన్నారి మృతి
హైదరాబాద్: ప్రహరి గోడ కూలిన ఘటనలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన నగరంలోని కూకట్‌పల్లిలో శనివారం వెలుగు చూసింది. స్థానిక ఇంద్రాహిల్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న నూతన భవనం పక్కనే ఉన్న చిన్న ఇంటి ప్రహరిగోడ కూలింది. దీంతో అక్కడే ఉన్న వరలక్ష్మీ అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. కొత్త భవనం నిర్మాణంలో ఉండటం వల్లే ప్రహరిగోడ కూలినట్లు స్థానికులు తెలిపారు. -
పాముకాటుకు ఇద్దరు చిన్నారుల మృతి
పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన రాములు కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి తమ గుడిసెలో నిద్రపోతుండగా అర్థరాత్రి రాములు కుమార్తె సవరమ్మ(ఏడాదిన్నర), బంధువుల కుమారుడైన మాసయ్య(10)ను పాముకాటుకు గురయ్యారు. నురగలు కక్కుతున్న చిన్నారులను గమనించిన రాములు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. -
సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
బీబీనగర్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం కొండమడుగులో శనివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు గమనించకపోవడంతో.. నీటి సంపులో పడి మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
నీటిగుంటలో పడి చిన్నారి మృతి
ములుగు: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి తల్లిదండ్రులు పనులు చూసుకుంటుండగా.. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటిగుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
కోటగిరి: చెరువలో స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరిలో శనివారం వెలుగు చూసింది. స్థానిక దామర చెరువులో శుక్రవారం సాయంత్రం స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు అందులో మునిగి పోయారు. రంజాన్ సందర్భంగా కోటగిరిలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చిన సోహెల్(11), సోని(9) శుక్రవారం చెరువు దగ్గరకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా.. చెరువులో రెండు మృత దేహాలు లభించాయి. -
స్కూల్లో బీరువా పడి చిన్నారి మృతి
ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లోని ఓ ప్రైవేటు స్కూల్ లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. స్ధానికంగా ఉండే వాణి స్కూల్ లో చెక్క బీరువా పడి ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. లింగాపురానికి చెందిన భార్గవి అనే చిన్నారి వాణి స్కూల్ లో నర్సీరీ చదువుతోంది. ఈ రోజు ఉదయం ఆడుకుంటున్న చిన్నారిపై బీరువా పడటంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా , స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల చిన్నారి చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యుసాగరం
‘కుంకుమసాగరం’ మృత్యుకుహరంగా మారింది. గత ఏడాది హోలీ వేడుక రోజు పలాస రైల్వే కాలనీకి చెందిన రాపాక వికాస్ అనే విద్యార్థిని మింగేసింది. తాజాగా.. ఇద్దరు చిన్నారుల పాలిట కూడా ఇదే మృత్యుకుహరంగా మారింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. గ్రామంలో అంతులేని విషాదం నింపింది. పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు సూదికొండ కాలనీకి చెందిన వడ్డి కార్తీక్ (9), కోతి మహేంద్ర(10) సూదికొండ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదువుతున్నారు. ఈ ఇద్దరు చిన్నారులు అదే గ్రామానికి చెందిన సింహాద్రి, ఇంద్ర అనే ఇద్దరు సహచరులతో కలిసి గురువారం మధ్యాహ్నం పాఠశాల విడిచిపెట్టిన తరువాత తమ తల్లిదండ్రులు పనిచేస్తున్న పలాస పారిశ్రామికవాడలోని జీడి పరిశ్రమవద్దకు వెళ్లారు. అక్కడ వారి తల్లిదండ్రులను కలిశారు. ఇక్కడే ఆడుకోమని తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పి బయటకు పంపించేశారు. మృత్యువు పొంచి ఉందన్న విషయం తెలియని ఆ చిన్నారులు.. అలవాటు ప్రకారం సమీపంలోని కుంకుమసాగరం చెరువు వద్దకు స్నానాల కోసం వెళ్లారు. స్నేహితుల కళ్లముందే... వడ్డి కార్తీక్, కోతి మహేంద్రతోపాటు సింహాద్రి, ఇంద్ర స్నానాలకని చెరువులో దిగారు. కార్తీక్, మహేంద్ర ఉన్నట్టుండి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఈ హఠాత్పరిణామానికి సింహాద్రి, ఇంద్ర బెంబేలెత్తిపోయి... పరుగుపరుగున వెళ్లి ఇటుకబట్టీలు వద్ద కార్మికులకు తెలిపారు. వారు వెంటనే వచ్చి చెరువులో దిగి ఇద్దరు చిన్నారులను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిం ది. అప్పటికే మృతి చెందినట్టు గుర్తిం చారు. పారిశ్రామికవాడలోని చిన్నారుల కుటుంబీకులకు విషయం తెలియజేయగా వారు హతాశులయ్యారు. అప్పటి వరకు సంతోషంగా నవ్వుతూ కనిపించిన పిల్లలు అప్పడే విగతజీవులుగా మారారన్న విషయాన్ని జీర్ణించుకోలేక పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకుని, బోరున రోదిస్తూ కుప్పకూలిపోయారు. వంశాంకురం పోయింది వడ్డి కార్తీక్ తండ్రి బాబూరావు వికలాంగుడు. స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్నాడు. కార్తీక్ తల్లి పార్వతి పారిశ్రామికవాడలో జీడి కార్మికురాలిగా పనిచేస్తోంది. బాబూరావు పార్వతిలకు కార్తీక్ ఒక్కడే కుమారుడు. దీంతో తన వంశాంకురాన్ని కోల్పోయామని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. కోతి మహేంద్ర తండ్రి శ్రీనివాసరావు, తల్లి ఆదిలక్ష్మి కూడా జీడి పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కోతి మహేంద్రకు ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.దేవప్రసాద్, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు కె.వి. సురేష్‌కుమార్, బి.శ్రీరామ్మూర్తి వెంటనే సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పలాస ప్రభుత్వాస్పత్రి వద్ద టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు రెవెన్యూ అధికారులతో కలిసి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పారు. గతంలోనూ.... గత ఏడాది హోలీ సందర్భంగా పలాస రైల్వేకాలనీకి చెందిన కొంతమంది యువకులు కూడా ఇలాగే స్నానాలకని కుంకుమసాగరం వద్దకు వెళ్లారు. అప్పట్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సిన రాపాక వికాస్ అనే విద్యార్థి ఇదే కుంకుమసాగరంలో పడి మృతి చెందాడు. ఐదేళ్ల క్రితం పలాస మండలం బొడ్డపాడులో జగ్గోరుబంద చెరువులో స్నానాలు చేస్తుండగా ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా చెరువుల లోతు పెంచడంతో లోతు ఎంత ఉందనేది తెలియక దిగిన వ్యక్తులు ఈత రాక ఈ విధంగా మృత్యువాత పడుతున్నారు. ఇటీవల కుంకుమసాగరంలో కూడా చెరువు అభివృద్ధి పేరుతో పొక్లెయిన్‌తో పనులు చేపట్టారు. ఇష్టానుసారంగా పెద్ద పెద్ద గోతులు చేస్తున్నారని, పద్ధతి ప్రకారం తవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువు తవ్వకాలపై అధికారులు ఓ కన్నేసి తగిన నిబంధనలు విధించాలనేది ప్రజలు కోరుతున్నారు. -
చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
-
చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
లక్ష్మణచందా: ఆడుకోవడానికి చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు నీటమునిగి మృతి చెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా లక్ష్మణచందా మండలం వడ్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు లక్కీ(10) బబ్లూ(7), రాజు(6) ఈరోజు చెరువు వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయారు. ఇది గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను వెలికి తీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
డెంగీతో బాలిక మృతి
దాచేపల్లి: డెంగీ జ్వరంతో బాధపడుతున్నబాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కమ్మలపల్లి మౌనిక(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ స్థానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతి చెందింది. -
వైద్యం వికటించి బాలుడి మృతి
నల్గొండ(మిర్యాలగూడ): వైద్యం వికటించి బాలుడు మృతిచెందిన సంఘటన మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాలు..త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామానికి చెందిన గండికోట భానుప్రకాశ్(14) అనే బాలుడు జ్వరంతో బాధపడుతూ ఈ నెల 8న శ్రీ వెంకటకృష్ణ నర్సింగ్ హోమ్‌లో చేరాడు. బాలుడు చేరినపుడు ఆరోగ్యపరిస్థితి సరిగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం అకస్మాత్తుగా మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. -
బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని జలదంకి పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందాడు. వివరాలు..పట్టణంలో పులుసు ప్రభాకర్, సుమతి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు శివకేశవ (3) మంగళవారం ఉదయం ఇంటి ముందున్న ఇసుకలో ఆడుకోవడానికి వెళ్లాడు. అంతలో అటువైపు విద్యార్థులను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ప్రతిభ పబ్లిక్ స్కూల్ బస్సు బాలుడు పై నుంచి వెళ్లింది. టైరు కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. గమనించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (జలదంకి) -
కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య
-
కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య
ధర్మవరం : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలు, వేధింపులతో మనస్తాపం చెందిన ఓ మహిళ కన్న కొడుకును గొంతుకోసి హత్య చేసి అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మారుతీనగర్‌లో జరిగింది. వివరాల..గ్రామానికి చెందిన శ్రీరామంజీ స్థానికంగా మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య ప్రియాంక(28)తో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరికి ఒక కుమారుడు వంశీ (2) ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో సోమవారం ప్రియాంక కత్తితో తన కొడుకు గొంతు కోసి, అనంతరం తన గొంతు కోసుకుంది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా రక్తస్రావం అయిన ప్రియాంకను వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్, లారీ ఢీ: చిన్నారి మృతి
నకిరేకల్ : నల్లగొండ జిల్లా నకిరేకల్ శివారులోని కడపర్తి పెట్రోల్ బంకు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడాది వయసున్న చిన్నారి మృతిచెందగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. చౌటుప్పల్ భీమనకల్లుకు చెందిన దంపతులు బిడ్డతో బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
మండవల్లి(కృష్ణా): రెండేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మండవల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు... మండలంలోని ఇంగిలిపాకలంక గ్రామానికి చెందిన రాఘవులు అనే వ్యక్తి తన కూతురును స్కూల్ బస్సు ఎక్కించేందుకు తన కొడుకు నవీన్(2)తో కలిసి వచ్చాడు. కుమార్తెను బస్సు ఎక్కించే క్రమంలో నవీన్‌ను తండ్రి గమనించలేదు. అక్కడే అడుకుంటున్న నవీన్ ప్రమాదవశాత్తూ స్కూల్ బస్సు చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. -
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి
రామగిరి: అనంతపురం జిల్లాలో డెంగీ లక్షణాలతో ఓ చిన్నారి మృతిచెందింది. వివరాలు... రామగిరి మండలపరిదిలోని పేరూరు గ్రామానికి చెందిన లక్ష్మీ, రమాకాంత్ల కుమారుడు ధీరజ్‌కుమార్(2) గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. చిన్నారికి జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా డెంగీ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం చిన్నారి మృతిచెందాడు. -
పండ్ల రసం తాగి.. ఇద్దరు చిన్నారులు మృతి
కర్నూలు: జిల్లాలోని కోసిగి మండలం శాంతనూర్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పండ్ల రసం తాగిన ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. విషపూరితమైన పండ్ల రసాన్ని తాగిన కొద్ది క్షణాల్లోనే చిన్నారులు ప్రాణాలు విడిచారు. దీంతో శాంతనూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. బంధువులైన సరళ, గోవర్థన్ అనే మూడేళ్ల చిన్నారులు కర్నూలు జిల్లాలోని శాంతనూర్ గ్రామంలో జరిగే జాతరను చూసేందుకు వచ్చారు. జాతరలో ఓ పండ్ల రసం బాటిల్ ను కొనుగోలు చేసి తాగి మృతిచెందారు. దాంతో విగతజీవులైన తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు కన్నీటపర్యంతమైయ్యారు. జాతర చూసేందుకు వెళ్లిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేధన వ్యక్తం చేశారు. విషపూరితమైన పండ్లరసం తాగడం వల్లే తమ పిల్లలు చనిపోయారంటూ చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి తల్లి ఆత్మహత్యాయత్నం
తిమ్మాజీపేట: కుటుంబ కలహాలకు తాళలేక ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఇద్దరు పిల్లల జీవితాలకు ముగింపు పలికింది. మరో కూతురుతో పాటు ఆమె కూడా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం మరి కల్ గ్రామానికి చెందిన గొల్ల భీమమ్మ భర్తతో గొడవపడి సోమవారం తన ముగ్గురు కూతుళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తర్వాత తానూ అంటించుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ నలుగురినీ మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం నందిని (6), విజయలక్ష్మి (4)లు మరణించారు. తల్లి భీమమ్మతో పాటు మరో కూతురు శ్రీలక్ష్మి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. -
యమ ధర్మపురి
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఏడాది పొడవునా కొనసాగుతున్న పురిటి బిడ్డల మరణాలపై అటు ప్రభుత్వం, ఇటు ధర్మపురి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి సైతం భగవ ద్గీత బాటపట్టాయి. ఇవన్నీ సహజమరణాలేనని తేల్చేశాయి. ఆరోగ్యంపై అవగాహనా లేమే కారణమంటూ ప్రజలపై నెట్టేశాయి. ఈ ఏడాది నవంబరు వరకు 321 మంది చిన్నారులు మృత్యువాత పడడం ఆస్పత్రి యంత్రాంగం బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. పెరుగుతున్న శిశుమరణాలు సంఖ్యాపరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న రాష్ట్రంలోని ఆస్పత్రులు శిశుమరణాలను అరికట్టలేకపోతున్నాయి. నాలుగేళ్ల వివరాలను పరిశీలిస్తే ఇది తేటతెల్లం అవుతోంది. 2011లో 2,350 శిశువులు జన్మించగా 270 మంది (11.4శాతం) మృత్యువాత పడ్డారు. 2012లో 3,623కు గానూ 374 మంది (10.3శాతం), 2013లో 4,155కు గానూ 445 మంది (11శాతం) కన్నుమూశారు. ఇక ఏడాది నవంబరు వరకు 4,143 పిల్లలు జన్మించగా 445 మంది (10.74 శాతం) ప్రాణాలు విడిచారు. శిశువుల పాలిట నరకంప్రస్తుతం వార్తల్లోకి ఎక్కిన ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో 2011 ఫిబ్రవరి 23న చిన్నపిల్లల అత్యవసర విభాగాన్ని ప్రారంభించారు. ఆక్సిజన్, వెంటిలేటర్, ఇంక్యుబులేటర్ తదితర అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ధర్మపురి జిల్లాతోపాటూ హోసూరు, కృష్ణగిరి, వేలూరు తదితర జిల్లాల నుంచి రోజుకు సగటున 2500 మంది ఔట్‌పేషెంట్లుగా, 900 మంది ఇన్పేషెంట్లుగా వైద్యసేవలు పొందుతుంటారు. అయినా ఆ ఆస్పత్రిలో శిశుమరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 539 మంది జన్మించగా 34 మంది ప్రాణాలు విడిచారు. మేలో 514కు 39 మంది, జూన్‌లో 444 మందికి 48 మంది, జూలైలో 518కి 41, ఆగస్టులో 485కి 35, సెప్టెంబరులో 504కు 41, అక్టోబరులో 579 మందికి 48మంది, నవంబరులో ఇప్పటి వరకు 35 మంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంటే ఈ ఒక్క ఏడాదిలోనే ధర్మపురి ఆస్పతిలో 321 మంది మృత్యువాత పడ్డారు. గత ఐదు రోజుల్లో 12 మంది చిన్నారులు విగతజీవులుగా మారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. మరో 16 మంది చిన్నారులు మృత్యువుతో పోరాడుతున్నారు. అవగాహనే లోపమట ఈ శిశుమరణాలకు ప్రజల్లో అవగాహనలేమే కారణమంటూ ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రంలో అటవీ సమీప గ్రామాల సంఖ్య గణనీయంగానే ఉంది. అక్కడి ప్రజలకు ఇప్పటికీ సరైన విద్యా, వైద్య సౌకర్యాలు లేవు. కుటుంబ నియంత్రణ, ఆరోగ్యం, అక్షరాస్యత, బాల్యవివాహాల వల్ల ఒనగూరే నష్టాలపై అవగాహన వారు అక్కడ లేరు. కడుపేదరికం వారిపాలిట మరోశాపంగా ఉంది. దీంతో అక్కడి గృహిణులు బిడ్డ బిడ్డకు పాటించాల్సిన వ్యవధిని అవలంభించరు. దీంతో తల్లీ బిడ్డకు పౌష్టికాహారం కరువైపోతుంది. ఈ పరిణామాలు కాన్పు సమయంలో బిడ్డను రోగగ్రస్తం చేస్తున్నాయి. నెలలు నిండకుండానే జన్మించడం, కనీస బరువులేకుండానే పుట్టడం మృతికి దారితీస్తున్నారుు. ఇది కొంతవరకు నిజమైనా ఈ లోటును సరిదిద్దేందుకు ఇన్నాళ్లూ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయనేది ప్రశ్నగా మిగిలింది. తమిళనాడు వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ గీతాలక్ష్మి సైతం ఇవే విషయాలను ధృవీకరించారు. చనిపోతున్న చిన్నారులు 1.25 కిలోల నుంచి 2 కిలోల బరువుంటున్నారని, వారి శరీరం చికిత్సకు సైతం సహకరించడం లేదని చెప్పారు. భారత దేశంలో సగటున వెయ్యిమందికి 21 మంది చిన్నారులు, రాష్ట్రంలో వెయ్యిమందికి 15 మంది చిన్నారులు పుట్టిన నాలుగువారాల్లోనే మరణిస్తున్నట్లు ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం ప్రభుత్వ తప్పిదం ఏమీ లేదని సమర్థించుకున్నారు. మరి కొనసాగుతున్న శిశుమరణాలను అరికట్టేవారెవరో? చిన్నారుల మృతిపై గగ్గోలు ధర్మపురి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వరుస శిశు మరణాలతో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర చిన్నపిల్లల విభాగంలో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న పురిటిబిడ్డలు వరుసకట్టి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నెల 14న ఐదుగంటల వ్యవధిలో వరుసగా ఐదుగురు, 15వ తేదీ మరో చిన్నారి, 16,17 తేదీల్లో ముగ్గురు మగ, ఇద్దరు ఆడ శిశువులు మృతి చెందారు. అంటే కేవలం నాలుగురోజుల్లో మొత్తం 11 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈనెల 17వ తేదీ నాటికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 70 చిన్నారుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ మరో బిడ్డ కన్నుమూసింది. గత వారం పది రోజుల్లో అక్కడ 10 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం 73 మంది చిన్నారులుండగా వారిలో 14 మందికి అత్యవసర చికిత్స చేస్తున్నారు. మరో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆరోగ్యమంత్రి డాక్టర్ విజయభాస్కర్ బుధవారం ఆస్పత్రిని సందర్శించారు. వైద్య మంత్రి రాజీనామా చేయాలి : బీజేపీ వరుస శిశుమరణాలకు నైతికబాధ్యత వహించి వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ విజయభాస్కర్ పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం డిమాండ్ చేశారు. ఒక వైద్యురాలిగా చెబుతున్నా, అక్కడ కనీస వసతులు లేవు, తగిన సిబ్బంది లేరని ఆమె తప్పుపట్టారు. ప్రభుత్వాసుపత్రుల్లో వాస్తవ స్తితిపై శ్వేతపత్రం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. చిన్నారుల చావుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు. -
చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి
జిల్లాలోని మెరకముడిదాం మండలంలో మంగళవారం ఓ విషాదం చోటుచేసుకుంది. గోపన్న వలసలో చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సెలవుదినం కావడంతో వారందరూ చెరువులో ఈతకు వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. ఈతకు వెళ్లిన చిన్నారులు ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేధన వ్యక్తం చేశారు. అయితే చెరువులో పడి మృతిచెందరాని వార్త వినగానే తల్లిదండ్రులు నివ్వేరపోయారు. మృతిచెందిన చిన్నారులు 10 ఏళ్ల లోపు వారే. కాగా, తమ చిన్నారులు తిరిగారాని లోకాలకు వెళ్లిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీటపర్యంతమైయ్యారు. -
నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
రెండు కుటుంబాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లోని పవన్, సంతోష్ అనే ఇద్దరు పిల్లలు నీటి కుంటలో పడి మరణించారు. పిల్లలు ఇద్దరూ వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. దాంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల అంతా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం దొడగట్ట గ్రామ సమీపంలో ఉన్న ఓ నీటి కుంట వద్ద చిన్నారుల మృతదేహాలను స్థానికులు గుర్తించి సమాచారం అందించారు. వీళ్లు ఈతకు వెళ్లి పొరపాటున పడి మరణించారా.. లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పిల్లలు ఆడుకోడానికి ఎలాంటి అవకాశం లేదని, అందువల్ల ఎవరైనా పిల్లలను తీసుకెళ్లి అక్కడ ఏమైనా చేశారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. కానీ సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతే దీనిపై పూర్తి వివరాలు చెప్పగలమని పోలీసులు అంటున్నారు. -
తల్లిదండ్రులకు కడుపుకోత
నీళ్ల తొట్టె పగిలి ఇద్దరు చిన్నారుల మృతి కన్నీరు మున్నీరవుతున్న దంపతులు నాసిరకంగా నిర్మించడమే కారణం మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: సిమెంట్ ఇటుకలతో నిర్మించిన నీళ్ల తొట్టె పగిలి ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. ‘నాన్నా, తల్లీ లేవండ్రా అంటూ’ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోదించడం కంటతడి పెట్టించింది. కూలి కోసం వచ్చిన ఆ దంపతులకు తీరని దుఃఖం మిగిలింది. ఈ సంఘటన ఆదివారం పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. చిన్నారుల తండ్రి కథనం మేరకు.. బెరైడ్డిపల్లె మండలం గౌనితిప్పేపల్లెకు చెందిన హనుమంతప్ప, భాగ్యమ్మ దంపతులు కూలీనాలి చేసుకుని జీవిస్తున్నారు. వీరికి కుమార్తె నవ్య(04), కుమారుడు మోహన్‌బాబు(ఒకటిన్నర సంవత్సరం) ఉన్నారు. ఈడిగపల్లెలో శ్రీనివాసులుకు చెందిన ఇటుకల బట్టీ వద్దే ఉండి పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితమే పనికి కుదిరారు. శ్రీనివాసులు ఇటుక బట్టీలను నిర్వహిస్తుండగా, వారి తమ్ముళ్లు నర్సరీలను ఏర్పాటు చేసుకున్నారు. నర్సరీకి, ఇటుకల బట్టీకి ఉమ్మడిగా సిమెంట్ ఇటుకలతో సుమారు వెయ్యి లీటర్ల పైగా సామర్థ్యం ఉన్న ఆరు అడుగుల నీటితొట్టెను నిర్మించుకున్నారు. నీటితొట్టెకు కిందభాగంలో కొళాయిని ఏర్పాటు చేశారు. ఈ తొట్టెని నాసిరకంగా నిర్మించారు. హనుమంతప్ప తొట్టెకు నీళ్లు పట్టాడు. నిండి పోవడంతో మోటారును ఆఫ్ చేయడానికి వెళ్లాడు. ఇదే సమయంలో ఇతని పిల్లలు నవ్య, మోహన్‌బాబు నీళ్లు పట్టుకోవడానికి తొట్టె వద్దకు వెళ్లారు. కొళాయి వద్ద నీళ్లు పట్టుకుంటుండగా ఒక్కసారిగా నీటితొట్టె పగిలిపోయింది. సిమెంట్ ఇటుకలు, నీళ్లు పిల్లలపై పడడంతో గట్టిగా అరిచారు. తల్లిదండ్రుల కళ్లముందే ఇదంతా జరగడంతో ఏంచేయాలో వారికి అర్థం కాలేదు. గట్టిగా కేకలు వేస్తూ తీవ్రంగా గాయపడిన చిన్నారులను ఆటోలో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బిడ్డలిద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే బిడ్డలను పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులకు మాటలు రాలేదు. మరణించిన బిడ్డలను తలచుకుని ఆ తల్లి బోరున విలపించింది. ఈ సంఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ వైర్లు తగిలి ఇద్దరు చిన్నారులు మృతి
-
‘గొంతువాపు’తో ముగ్గురు చిన్నారుల మృతి
హైదరాబాద్‌లో రెండు రోజుల్లోనే దారుణం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేరిన మరో 33 మంది బాధితులు అపరిశుభ్ర పరిస్థితులు, టీకాలు వేయకపోవడమే కారణమంటున్న వైద్యులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ‘గొంతువాపు (డిఫ్తీరియా)’ మహమ్మారి విజృంభిస్తోంది. రెండు రోజుల్లోనే ముగ్గురు చిన్నారులను బలి తీసుకుంది. పదుల సంఖ్యలో చిన్నారులకు ప్రాణ సంకటంగా మారింది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని గోపన్‌పల్లి రాజీవ్‌నగర్ కాలనీలో నివసించే మునెప్ప, వసంత దంపతుల కుమార్తె వైశాలి(6), గోపి, బేబి దంపతుల కుమారుడు ప్రభు (4)లకు కొద్ది రోజుల కింద తీవ్ర జ్వరం వచ్చింది. చిన్నారులిద్దరికీ పరీక్షలు చేసిన స్థానిక వైద్యులు గొంతువాపుగా గుర్తించారు. దాంతో వైశాలిని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి, ప్రభును నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు. అయితే, నీలోఫర్ ఆస్పత్రిలో ప్రభుకు మొదట ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించిన సిబ్బంది.. అదే సమయంలో మరో అత్యవసర కేసు రావడంతో అవే అత్యవసర చికిత్స యంత్రాలను తీసి ఆ పేషెంట్‌కు పెట్టారని ప్రభు తల్లిదండ్రులు ఆరోపించారు. అత్యవసర పరికరాలు తీసివేసిన అనంతరం ప్రభు నోరు, ముక్కు నుంచి రక ్తస్రావం జరిగిందన్నారు. ఇక చాదర్‌ఘాట్ పరిధిలోని వినాయక నగర్‌కు చెందిన మహ్మద్ రఫీ కుమారుడు ఫారూక్ (6) కూడా గొంతువాపు బారిన పడి మంగళవారం మృతి చెందాడు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సోమ, మంగళవారాల్లో గొంతువాపుతో బాధపడుతున్న 33 మంది రోగులు చేరినట్లు వైద్యులు తెలిపారు. అపరిశుభ్ర పరిస్థితులు, సరైన సమయంలో టీకాలు వేసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని.. ఈ సీజన్లో గొంతువాపు విజృంభించడం సాధారణమేనని పేర్కొన్నారు. మరణించిన ముగ్గురు చిన్నారులకు కూడా సరైన సమయంలో డీపీటీ టీకాలు వేయకపోవడంతోనే మృత్యువాతపడ్డారని చెప్పారు.