కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య | mother killed her son in ananthpuram distirict | Sakshi
Sakshi News home page

కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య

Published Mon, Apr 20 2015 10:25 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య - Sakshi

కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య

ధర్మవరం : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలు, వేధింపులతో మనస్తాపం చెందిన ఓ మహిళ కన్న కొడుకును గొంతుకోసి హత్య చేసి అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మారుతీనగర్‌లో జరిగింది. వివరాల..గ్రామానికి చెందిన శ్రీరామంజీ స్థానికంగా మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య ప్రియాంక(28)తో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరికి ఒక కుమారుడు వంశీ (2) ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో సోమవారం ప్రియాంక కత్తితో తన కొడుకు గొంతు కోసి, అనంతరం తన గొంతు కోసుకుంది.

ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా రక్తస్రావం అయిన ప్రియాంకను వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement