mother suicide attempt
-
తల్లి ఆత్మహత్యాయత్నం.. బైకుపై బయలుదేరిన కుమారుడు.. అంతలోనే
ఖమ్మం: కుటుంబ కలహాలతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, భర్త, సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. గంటల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కారేపల్లి మండలం జైత్రాంతండా గ్రామానికి చెందిన ధరావత్ కౌసల్య కుటుంబంలో చోటుచేసుకున్న వివాదానికి మనస్థాపం చెంది ఆదివారం ఉదయం పురుగుల మందు తాగింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ పరిస్థితి విషమించటంతో ఖమ్మం ఆస్పత్రికి అంబులెన్స్‌లో పంపించారు. అనంతరం ఖమ్మం ఆస్పత్రికి కౌసల్య కుమారుడు ధరావత్ సురేష్(25) తన తండ్రి ధరావత్ సూర్య, మామయ్య కేలోతు గోపీతో కలిసి ద్విచక్రవాహనంపై ఆదివారం సాయంత్రం బయలుదేరాడు. ఈక్రమంలో ఇల్లెందు – ఖమ్మం ప్రధాన రహదారిపై మంచుకొండ సమీపాన శివాయిగూడెం వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొంది. ఈఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, సూర్య, కేలోతు గోపీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకేరోజు ఒకే కుటుంబంలో ఒకవైపు తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందడం... తండ్రి, మామయ్య తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో జైత్రాం తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం -
ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని తెగేసి చెప్పిన కూతురు.. దాంతో
సాక్షి, అనంతపురం: ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని తెగేసి చెప్పేసింది. దీంతో ఆమెపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చోళసముద్రం గ్రామానికి చెందిన రాజమ్మ కూతురు ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో రాజమ్మ తన కుమార్తె అదృశ్యమైందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే.. 8వ తేదీ రాత్రి రాజమ్మ కూతురు ప్రేమించిన వ్యక్తితో కలిసి పోలీసుస్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు సోమవారం తహసీల్దార్ కుమార్‌స్వామి ఎదుట అమ్మాయిని హాజరుపరిచారు. ఆ సందర్భంగా తల్లి రాజమ్మ ఇంటికి రావాల్సిందిగా కూతుర్ని వేడుకుంది. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజమ్మ అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను 108లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చదవండి: కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె -
పిల్లలకు విషమిచ్చి.. తల్లి..
సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు మగ పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహతాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు విజయవాడలోని అస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన శంకర్ అనే ఐదేళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి అంకమ్మ, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక గన్నవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురు ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణం, కుటుంబ కలహాలేనా.. లేక మరేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
పిల్లలతోసహా తల్లి ఆత్మహత్యాయత్నం
పీసీ.చిన్నప్యాపిలి(వజ్రకరూరు): పిల్లలతో సహా తల్లి బావిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిన్నప్యాపిలి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సుమంగళికి కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన కిష్టప్పతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారులు చరణ్, విఘ్నేష్, కుమార్తె వేదిక ఉన్నారు. శివరాత్రిని పురస్కరించుకుని సుమంగళి పిల్లలతో సహా పుట్టింటికి వచ్చింది. మధ్యాహ్నం గ్రామ సమీపంలోని బావి వద్దకు పిల్లలతో సహా వెళ్లింది. అయితే పెద్ద కుమారుడు చరణ్ అక్కడి నుంచి తప్పించుకుని బయటకువచ్చాడు. అనంతరం సుమంగళి మిగిలిన ఇద్దరు పిల్లలతో సహా బావి లోకి దూకింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే బావిలో పడ్డ తల్లీపిల్లలను బయటకు తీశారు. అయితే అప్పటికే వేదిక(16 నెలలు) మృతి చెందింది. అస్వస్థతకు గురైన విఘ్నేష్‌ను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. సుమంగళి మానసిక స్థితి సరిగా లేక పోవడం వల్లే బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఆగ్రహంతో ఆ అమ్మ తీసుకున్న నిర్ణయం..
ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి కాస్తా పెద్దవయ్యాయి. భార్య పిల్లలను పుట్టింట్లో వదిలేసేటంతగా అవి పెరిగాయి. దీంతో భార్య మానసికంగా కుంగిపోయింది. చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే తాను చనిపోతే పిల్లలు దిక్కులేని వారవుతారని భావించింది. వారితో సహా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో చిన్నారులిద్దరూ చనిపోగా.. తల్లిని మాత్రం స్థానికులు రక్షించారు. ఆవేశంలో.. ఆగ్రహంతో ఆ అమ్మ తీసుకున్న నిర్ణయం.. ఆ చిన్నారులను బలితీసుకుంది. కోరుకొండలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన పలువురిని కలచివేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోరుకొండ (రాజానగరం): గ్రామానికి చెందిన అశ్వినికి రంగంపేట మండలం సుభద్రంపేట గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీనివాస్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నిత్యశర్వాణి(3), జయదేవ్ విక్రమ్(ఆరు నెలల బాబు) ఉన్నారు. కుటుంబంలో గొడవలు కొనసాగుతున్నాయి. 20 రోజుల క్రితం నాగిరెడ్డి శ్రీనివాస్, అశ్విని, పిల్లలతో సహా యానాంలో బంధువుల ఇంటి వద్ద ఉన్నారు. ఆదివారం ఉదయం శ్రీనివాస్ కోరుకొండకు అశ్వినితో పాటు ఇద్దరు పిల్లలను ఆమె పుట్టింటికి తీసుకువచ్చి, వదిలి వెళ్లిపోయాడు. దీంతో అశ్విని మానసికంగా బాధపడుతూ చనిపోవాలనుకుంది. తాను చనిపోతే ఇద్దరు పిల్లలు దిక్కులేని వారవుతారని భావించింది. ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉన్న బావిలో ఆదివారం అర్ధరాత్రి దూకింది. దీంతో ఇద్దరు చిన్నారులు చనిపోగా, అశ్వినిని మాత్రం చుట్టుపక్కల వారు రక్షించారు. అయితే చిన్నారులను కోరుకొండ శ్మశానంలో పూడ్చివేశారు. చివరకు కోరుకొండ వీఆర్ఓ యు.సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. భర్త శ్రీనివాస్, అత్తగారు వేధించేవారని కుటుంబ సభ్యులు తెలిపారని ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం కోరుకొండ తహసీల్దార్, గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో పూడ్చివేసిన బాలిక, బాలుడి శవాలను వెలికితీస్తామని డీఎస్పీ తెలిపారు. భర్త, అత్త వేధింపుల వల్లే.. భర్త శ్రీనివాస్, ఆమె అత్త వేధింపుల వల్లే నాగిరెడ్డి ఆశ్విని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కోరుకొండ డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు, సీఐ ఎన్. మధుసుధనరావు, ఎస్ఐ రావూరి మురళీమోహన్ నాగిరెడ్డి ఆశ్విని ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను విచారించారు. శ్మశానం వద్దకు వెళ్లి పూడ్చివేసిన బాలుడు, బాలిక ప్రదేశాన్ని పరిశీలించారు. -
నారాయణఖేడ్ మండలంలో విషాదం
నారాయణఖేడ్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నం ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. నారాయణఖేడ్ మండలం చిన్ననర్సాపూర్ తండాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించి, తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య
-
కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య
ధర్మవరం : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలు, వేధింపులతో మనస్తాపం చెందిన ఓ మహిళ కన్న కొడుకును గొంతుకోసి హత్య చేసి అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మారుతీనగర్‌లో జరిగింది. వివరాల..గ్రామానికి చెందిన శ్రీరామంజీ స్థానికంగా మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య ప్రియాంక(28)తో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరికి ఒక కుమారుడు వంశీ (2) ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో సోమవారం ప్రియాంక కత్తితో తన కొడుకు గొంతు కోసి, అనంతరం తన గొంతు కోసుకుంది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా రక్తస్రావం అయిన ప్రియాంకను వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.