పిల్లలకు విషమిచ్చి.. తల్లి.. | Mother Attempt To Suicide And Give Poison To Children In Krishna district | Sakshi
Sakshi News home page

పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహతాయత్నం

Published Mon, Dec 2 2019 1:52 PM | Last Updated on Mon, Dec 2 2019 4:30 PM

Mother Attempt To Suicide And Give Poison To Children In Krishna district - Sakshi

సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు మగ పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహతాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు విజయవాడలోని అస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన శంకర్ అనే ఐదేళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి అంకమ్మ, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక గన్నవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురు ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణం, కుటుంబ కలహాలేనా.. లేక మరేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement