పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి.. | Case Against Young Man Harassing Married Woman In Krishna District | Sakshi
Sakshi News home page

పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి..

May 27 2022 3:06 PM | Updated on May 27 2022 5:22 PM

Case Against Young Man Harassing Married Woman In Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దీంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయిం చింది. బాధి తురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గన్నవరం(కృష్ణా జిల్లా): వివాహితను వేధింపులకు గురిచేస్తున్న మాజీ ప్రేమికుడిపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మండలంలోని దావాజీగూడేనికి చెందిన యువతికి కళాశాలలో చదువుకునే రోజుల్లో  కర్నూలుకు చెందిన సహ విద్యార్థి విక్రమ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే  పెద్దలు కుదిర్చిన సంబంధం మేరకు ఆ యువతికి మరో  వ్యక్తితో వివాహం జరిగింది.

ఈ  నేపథ్యంలో విక్రమ్‌ గతంలో  ఆమెతో దిగిన సెల్పీలు, ఫొటోలను ఆమె అత్తమామల సెల్‌ఫోన్‌కు పంపించి వేధిస్తున్నాడు. దీంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయిం చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు.

చదవండి: ఏడేళ్లగా ప్రేమ.. పెళ్లి చేసుకుందామన్న యువతి.. సెల్‌కు ఫోన్‌ చేస్తే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement