![Mother Attempt Suicide After Daughter Decided To Live With Lover - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/11/mother.gif.webp?itok=2IBxhr4-)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అనంతపురం: ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని తెగేసి చెప్పేసింది. దీంతో ఆమెపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చోళసముద్రం గ్రామానికి చెందిన రాజమ్మ కూతురు ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో రాజమ్మ తన కుమార్తె అదృశ్యమైందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే.. 8వ తేదీ రాత్రి రాజమ్మ కూతురు ప్రేమించిన వ్యక్తితో కలిసి పోలీసుస్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు సోమవారం తహసీల్దార్ కుమార్‌స్వామి ఎదుట అమ్మాయిని హాజరుపరిచారు. ఆ సందర్భంగా తల్లి రాజమ్మ ఇంటికి రావాల్సిందిగా కూతుర్ని వేడుకుంది. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజమ్మ అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను 108లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment