Love matter
-
ప్రేమించడమే పాపమా?.. ప్రియురాలిని కత్తితో పొడిచి..
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు అత్యంత కిరాతంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పోదల్లో పడేశాడు. నవీ ముంబై సమీపంలోని ఉరాన్ రైల్వే స్టేషన్ చుట్టూ ఉన్న పొదల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో ఈ ఉదంతం శనివారం వెలుగుచూసింది. యువతి శరీరంపై అనేక గాయలు, కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాలిని యశశ్రీ షిండేగా గుర్తించారు.ఉరాన్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు.. యశశ్రీ షిండే కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇటీవల వీరి ప్రేమ వ్యవహారంలో గొడవలు తలెత్తడంతో యువకుడు ఆమెను హత్య చేసినట్లు తేలింది. మృతదేహాన్ని ఉరాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో పడేసి అతడు పరారయ్యాడు. మరోవైపు యువతి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. యువతి హత్యకు గురైన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు నవీ ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ పన్సారే తెలిపారు. -
ప్రేమ వ్యవహారమే ప్రవళిక బలవన్మరణానికి కారణం: డీసీపీ వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య ఉదంతం కేసుపై డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలియజేశారాయన. ప్రవళిక 15 రోజుల కిందటే హాస్టల్లో చేరింది. ఆమె శివరామ్ రాథోడ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసు. కానీ, అతను ఆమెను మోసం చేశాడు. వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అది తెలిసి ప్రవళిక డిప్రెషన్లోకి వెళ్లింది. వాట్సప్ ఛాటింగ్, సీసీటీవీ ఫుటేజీలతో ఈ వ్యవహారం బయటపడింది. అది తట్టుకోలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది అని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం. శివరామ్‌తోనే ఆమె చివరిసారిగా కాల్ మాట్లాడింది. పూర్తి దర్యాప్తు తర్వాత అతనిపై చర్యలు ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు. ప్రవళిక మృతికి.. పరీక్ష వాయిదాకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటివరకు ప్రవళిక ఎలాంటి పోటీ పరీక్షకు హాజరు కాలేదు. పూర్తిగా వ్యక్తిగతమైన అంశాలే ప్రవళిక ఆత్మహత్యకు కారణం. కాబట్టి.. ఎటువంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అని డీసీపీ వెంకటేశ్వర్లు కోరారు. కేసు వివరాలు.. వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 పరీక్షకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో.. శుక్రవారం ఎవరూ లేని టైంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. ఆమె పరీక్ష వాయిదా కారణంగానే ఆమె తీవ్ర మనోవేదనకు గురైందని.. ఆ ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి జేఏసీ ప్రతినిధులు, విపక్ష పార్టీ సభ్యులు, కొందరు ఉద్యోగాభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆపై నిరసనకారుల్ని అరెస్ట్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు ఆత్మహత్య కాదని.. పరీక్షల వాయిదాతో ప్రభుత్వం చేసిన హత్య అంటూ రాజకీయ విమర్శలు తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగానే.. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సైతం ప్రవళిక మృతిపై పోలీస్ శాఖను నివేదిక కోరారు. పోలీస్ బందోబస్తు మధ్య.. శనివారం మధ్యాహ్నం తర్వాత ప్రవళిక అంత్యక్రియలు పూర్తయ్యాయి. చివరకు.. ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని దర్యాప్తు ద్వారా పోలీసులు తేల్చి చెప్పారు. -
ఎల్బీనగర్ ప్రేమోన్మాది శివకుమార్‌కి నేరచరిత్ర!
సాక్షి, రంగారెడ్డి: ఎల్బీనగర్ ప్రేమోన్మాది ఘాతుకం వ్యవహారంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివకుమార్ స్వస్థలం రంగారెడ్డిలోని నేరెళ్ల చెరువు. కొంతకాలంగా సైకోలా ప్రవర్తిస్తూ.. ఆఖరికి సంఘవి, ఆమె సోదరుడిపై ఘాతుకానికి దిగాడు. అయితే.. అతనిలో ఉన్మాద ప్రవర్తన ఈనాటిదే కాదు. గతంలో.. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు గతంలో తల్లి, తండ్రిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని సుత్తెతో తలపై మోదీ హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ప్రియురాలిపై దాడి, ఆమె తమ్ముడి హత్యతో ఘటనలతో శివకుమార్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. దీంతో తండ్రి హత్యకు సంబంధించిన వివరాలతోపాటు నిందితుడి నేర చరిత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో ఆదివారం ప్రేమించిన యువతి దూరంపెట్టిందని ఓ యువకుడి ఘాతుకానికి పాల్పడిన ఉదంతం విదతమే. ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడటమే కాకుండా ఆమె తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. నిందితుడిని సీరియల్స్‌లో నటుడిగా పనిచేస్తున్న ఫరూఖ్‌నగర్ మండలం, నేరేళ్లచెరువుకు చెందిన శివకుమార్‌గా గుర్తించారు. అతడికి స్థానికులు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆరి్టస్ట్‌గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్వగ్రామంలో విషాదఛాయలు మూడు రోజుల క్రితమే రాఖీ పండుగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన సంఘవి, పృథ్వీ శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం దాడి ఘటన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శివకుమార్ ఆదివారం సాయంత్రం ఎల్బీ నగర్లో ఉంటున్న సంఘవి ఇంటికి వెళ్లి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తమ్ముడు పృథ్వీపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’
ప్రేమ పేరుతో ఆకతాయిల చేష్టలు ఎక్కువైపోతున్నాయి. అమ్మాయి ఒప్పుకోలేదని, దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించి, తనను దూరం పెట్టిందన్న కక్షతో యువతి ఇంట్లో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన షాజపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. 25 ఏళ్ల సుభాష్ ఖరాడి దేవాస్ నగరంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో శివాని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి యువతి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో అతడిని ఆమె దూరం పెట్టింది. అప్పటి నుంచి శివాని, ఆమె కుటుంబ సభ్యులపై సుభాష్ కక్ష పెంచుకున్నాడు. చదవండి: అతి త్వరలోనే ముంబైని పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపులు ఈ క్రమంలో ఆదివారం రాత్రి మలిఖేడి గ్రామంలోని యువతి తండ్రి జాకీర్ ఖాన్ ఇంట్లోకి కంట్రీమేడ్ పిస్టోల్‌తో చొరబడ్డాడు. ఇంట్లో శివానీ ,ఆమె తండ్రి, సోదరుడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో తండ్రి జాకీర్ అక్కడికక్కడే మరణించగా.. యువతి, ఆమె సోదరుడు ఇండోర్ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. అయితే శివాని పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాల్పుల అనంతరం ఖరాడీ తన ఫేస్బుక్లో యువతితో కలిసి దిగిన ఫోటోతో పోస్టు పెట్టారు. ‘ ప్రేమ పేరుతో నాకు ద్రోహం చేసింది. అందుకే ఆమెను చంపాను. జీవితంలో తనకు మర్చిపోలేని బాధను ఇచ్చాను’ అని పోస్టులో పేర్కొన్నాడు. అయితే కొన్ని గంటలకే అతడి మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించింది. కదులుతున్న రైలు నుంచి కిందకు దూకండంతో అతడు మరణించి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా పోలీసు చీఫ్ యశ్పాల్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. -
హైదరాబాద్‌లో దారుణం.. యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది
సాక్షి, హైదరాబాద్: బోరబండలోని బంజారానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. సురేష్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా లక్ష్మీ అనే యువతి వెంటపడుతున్నాడు. అయితే యువకుడి ప్రేమను లక్ష్మీ నిరాకరించింది. ఈ క్రమంలో సోమవారం స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించిన సురేష్.. ఒక్కసారిగా కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. దీంతో లక్ష్మీ గట్టిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న కొంతమంది ప్రేమోన్మాదిని అడ్డుకున్నారు. నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకొని చితకబాదిన స్థానికులు.. ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ప్రేమోన్మాది దాడిలో యువతికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
నవీన్ హత్య కేసు.. ‘సాక్షి’ చేతిలో నిందితుడు హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు నిందితుడు రిమాండ్ రిపోర్టు సాక్షి చేతికి అందింది. హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితమే నవీన్ హత్యకు హరిహరకృష్ణ ప్లాన్ వేసినట్లు తేలింది. గెట్ టు గెదర్ పేరుతో జవరి 16న హత్యకు కుట్ర చేయగా.. వీలు కాకపోవడంతో ఫిబ్రవరి 17న హత్య చేసినట్లు వెల్లడైంది. బ్రహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్‌కు నవీన్ హత్య గురించి చెప్పి, అతని ఇంట్లోనే నిందితుడు హరిహరకృష్ణ గడిపినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా తెలిసింది. అంతేగాక ప్రియురాలిని కలిసి నవీన్ హత్య గురించి తెలపగా.. పోలీసులకు లొంగిపోవాలని ఆమె చెప్పినా వినకుండా వరంగల్ వెళ్లినట్లు వెల్లడైంది. రిమాండ్ రిపోర్టు ప్రకారం..ఈ నెల 17వ తేదీన రాత్రి 9 గంటలకు పెద్దంబర్‌పేట్ తిరుమల వైన్స్ వద్ద నవీన్, హరిహర కృష్ణ మద్యం సేవించారు. ఎల్బీనగర్, నాగోల్, ముసారంబాగ్, సైదాబాద్, చైతన్యపురి, కొత్తపేట పప్రాంతాల్లో నవీన్‌తో కలిసి తిరిగాడు. రాత్రి 12 గంటలకు యువతి ప్రేమ వ్యవహారంలో పరస్పరం వాగ్వాదం జరిగింది. తొలుత గొంతు నులిమి నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ.. అనంతరం కత్తితో నవీన్ శరీర భాగాలను వేరుచేశాడు. బ్యాగ్‌లో తలతో సహా శరీర విడిభాగాలను తీసుకెళ్లాడు. ఫోన్ హైదరాబాద్ నివాసంలో ఉంచిన నిందితుడు.. కోదాడ, ఖమ్మం, వైజాగ్‌లో రెండు రోజులు గడిపాడు. ఈనెల 23న తిరిగి వరంగల్ చేరుకొని తండ్రికి నవీన్ హత్య గురించి చెప్పాడు. ఈనెల 24న తిరిగి బ్రహ్మణపల్లి హత్యా స్థలంలోనవీన్ శరీర భాగాలతోపాటు ఆధారాలను తగలబెట్టిన హరిహరకృష్ణ.. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లొంగిపోయాడు. కాగా హరిహరకృష్ణకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. -
రాముతో ఐటీ ఉద్యోగిని ప్రేమ.. పెద్దలు అంగీకరించలేదని..
సాక్షి, హైదారాబాద్: విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఓ ఐటీ ఉద్యోగిని అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై ఎం.అంజయ్య వివరాల ప్రకారం.. ప్రైవేటు ఉద్యోగి పగడాల ఉమా శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి రాంనగర్ గుండు సమీపంలో గల దుర్గా నివాస్ అపార్ట్మెంట్లోని 301 ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. ఆయన ఏకైక కుమార్తె శ్రీశివనాగ హర్షిత(24) హైటెక్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గత నెల 24న ఉదయం 8 గంటల సమయంలో విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి నేటికీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తండ్రి ఉమా శంకర్ తమ కుమార్తె కనిపించడం లేదంటూ శనివారం సాయంత్రం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా హర్షిత, రాము అనే యువకుడు ప్రేమించుకున్నారని, వారి ప్రేమను తాము అంగీకరించలేదని ఉమా శంకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ప్రేమ?.. 80 రోజుల క్రితం అదృశ్యమై
సాక్షి, ఆదిలాబాద్: 80 రోజుల క్రితం అదృశ్యమైన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20) పట్టణ శివారులోని పసుపువాగు వద్ద చెట్ల పొదల్లో శవమై కనిపించాడు. మృతుడి బ్యాగు, చెప్పులను గుర్తించి శ్రీకాంత్‌గా నిర్ధారించారు. బోధన్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న శ్రీకాంత్ సెపె్టంబర్ 23న కాలే జీ వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా శ్రీకాంత్ అదృశ్యం అనంతరం మండలంలోని భూ లక్ష్మీ క్యాంపు గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం బయటకు వచి్చంది. అతను కనిపించకుండా పోయిన నాలుగైదు రోజులకు యువతి బంధువులు ఐదుగురు ఇంటికి వచ్చి బెదిరించినట్టు తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణ్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించలేదని, తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని అన్నారు. పోలీసులు పట్టించుకోలేదంటూ ధర్నా పోలీసుల నిర్లక్ష్యంతోనే తమ కొడుకు చనిపోయాడని, యువతి తరఫున వారే హత్య చేశారని ఆరోపి స్తూ మృతుని బంధువులు బోధన్ రుద్రూర్ రహదారిపై బైఠాయించి రాత్రి పొద్దుపోయే వరకు ఆందో ళన చేపట్టారు. హత్య కేసులో పోలీసుల పాత్రపై అనుమానాలున్నాయని ఆరోపించారు. డీసీపీ అరవింద్‌బాబు, ఆర్డీవో రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడా రు. డివిజన్ పోలీసుల మీద నమ్మకం లేక పోతే వేరే డివిజన్ పోలీసులతో కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసిన మీదట ఆందోళన విరమించారు. -
ప్రేమ వ్యవహారం.. యువకుడి కుటుంబంపై యువతి బంధువులు కత్తితో దాడి
సాక్షి, కరీంనగర్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిగురుమామిడి మండలంలో ఓ యువకుడి కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. యువకుడితోపాటు ఆమె తల్లి, తండ్రిని కత్తితో పొడిచి పారిపోయారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రేమ వ్యవహారంతోనే యువతి బంధువులు కత్తితో దాడి జరిగినట్లు తెలుస్తోంది. చిగురుమామిడి మండలానికి చెందిన చందు అనే యువకుడు జగిత్యాలకు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న యువతి అన్నయ్య.. తన స్నేహితులతో కలిసి చందు కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడితో పాటు అతడి తండ్రి శ్రీనివాస్, తల్లి స్వప్నకు కూడా గాయాలయ్యాయి. అంతేగాక చందు శరీరంలోనే కత్తి చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: హైదరాబాద్ మలక్‌పేట్‌లో దారుణం.. డాక్టర్ శ్రావణి పరిస్థితి విషమం -
చదువుకునే సమయంలో రాజేష్‌తో ప్రేమ.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా..
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ యువతి అదృశ్యమైన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమిరెడ్డి సత్తిబాబు తన కూతురు రాధిక(19)ను స్వస్థలం ఆంధ్రపదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని మచ్చవాని పాలెంలో చదివిస్తున్నాడు. అయితే అక్కడ రాజేష్ అనే యువకుడు, రాధికలు ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసి రాధికను బాలానగర్‌లోని సాయినగర్‌కు ఆరు నెలల క్రితం తీసుకువచ్చాడు. అయితే 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాధిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన సోమిరెడ్డి సత్తిబాబు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియకపోవటంతో బాలానగర్ పోలీస్‌లను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం.. చివరకు.. -
మిస్సింగ్ కేసుల కలకలం...ప్రేమ.. పెడదోవ
ఇటీవలి కాలంలో ‘అదృశ్యం’ కేసులుపెరిగాయి. ఇందులో ఎక్కువ శాతం టీనేజీ అమ్మాయిలతో మహిళలు ఉండటం కలవరం రేపుతోంది. పిల్లలు విద్య పూర్తి చేశాక.. ఉద్యోగం సంపాదించాక.. వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అయితే చదువుకోవాల్సిన సమయంలోనే పిల్లలు ప్రేమలో పడి తొందరపడుతున్నారు. పెద్దలు ఒప్పుకోరని ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. తీసుకెళ్లిన డబ్బు అయిపోయి.. కష్టాలు చుట్టు ముట్టి.. ఆదరించే వారు లేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులకూ కన్నీళ్లు మిగులుస్తున్నారు. రాయదుర్గం: విద్యార్థి దశలోనే కొందరు అమ్మాయిలు పెడదోవ పడుతున్నారు. తల్లిదండ్రుల గారాబంతో పాటు పర్యవేక్షణ కొరవడటంతో క్రమశిక్షణ తప్పుతున్నారు. కొందరు స్మార్ట్ఫోన్లలో గేమ్స్‌కు బానిసైతే.. మరికొందరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే చదువును పక్కనపెట్టి ప్రేమలో పడుతున్నారు. తల్లిదండ్రులకు తెలిసినా.. మందలించినా ... తమ స్వేచ్ఛను వారు ఏదో హరిస్తున్నారనుకుని అనాలోచిత నిర్ణయాలతో తప్పటడుగులు వేస్తున్నారు. చేజేతులా భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో 2020 నుంచి 2022 జూలై 15వ తేదీ వరకు 2,037 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఇందులో బాలికలు, మహిళలు 1,657 మంది ఉన్నారు. చదువు కోసం పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, గ్రామాల్లో కూలీలు, పరిశ్రమల్లో పనులకెళ్లే మహిళలు ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి వెళ్లిపోవడం.. రోజులు గడిచాక చేసిన తప్పు తెలుసుకుని బాధపడటం చేస్తున్నారు. చివరకు పోలీస్ కౌన్సెలింగ్‌తో మనసు మార్చుకుని ఇంటిబాట పడుతున్నారు. అదృశ్యం కేసుల్లో మచ్చుకు కొన్ని... రాయదుర్గం పట్టణం చన్నవీరస్వామి ఆలయ సమీపంలో నివసిస్తున్న ఓ యువతి షాపింగ్‌కని ఈ ఏడాది ఏప్రిల్ 26న ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మే 4న గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ చేయగా.. గుడ్డిగా నమ్మి.. వెళ్లానని.. తన నిర్ణయం సరైంది కాదని తెలుసుకున్నానని చెప్పడంతో తల్లిదండ్రుల వెంట ఇంటికి పంపించేశారు. రాయదుర్గం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఏప్రిల్ 25న నీళ్లు తేవటానికని బిందె తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. కొళాయి వద్ద బిందె ఉంచి.. ప్రేమికుడితో ఉడాయించింది. కుటుంబ సభ్యులు మూడు రోజులు వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ ఆధారంగా అదే నెల 30న ఎట్టకేలకు ఆ జంటను పోలీసులు అదుపులోకి తీసుకుని.. తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసు కౌన్సిలింగ్ తీరు... ఇంట్లో నుంచి తీసుకెళ్లిన సొమ్ము అయిపోయిన తర్వాత పరిస్థితి ఆలోచించాలి. అసాంఘిక శక్తుల చేతికి చిక్కితే పరిస్థితి ఏంటి? ఇష్టాయిష్టాలను తల్లిదండ్రులకు తెలియజేస్తే మంచిది. ఇష్టం లేని వివాహాలు, చదువులు, ఆశించిన ర్యాంకు రాదనే కారణాలు సహేతుకం కాదు. ఇంటి నుంచి వెళ్లిపోయిన వారిని బంధువులు, సమాజం చులకనగా చూస్తుంది. మొదట్లో బాగున్నా తర్వాత సంసారాల్లో కలహాలు మొదలవుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. టీనేజీ అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు చేసే పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దేలా చూడాలి. (చదవండి: అనుమానం పెనుభూతమై! భార్య పై పాశవిక దాడి) -
చదువు పేరుతో హైదరాబాద్‌లో సహజీవనం.. మాట మార్చిన మహేష్
తుంగతుర్తి (సూర్యాపేట): ప్రేమ పేరుతో ప్రియుడు వంచించాడని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన వెలిశాల ఉమారాణి, అదే గ్రామానికి చెందిన ఉప్పుల మహేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. చదువు పేరుతో ఇద్దరు హైదరాబాద్‌లో ఉండి సహజీవనం చేశారు. ఇటీవల ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని స్వగ్రామానికి వచ్చారు. కులాలు వేరు కావడంతో మహేష్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయాన్ని మహేష్ ప్రియురాలైన ఉమారాణికి చెప్పడంతో పంచాయితీ పెద్ద మనుషుల వద్దకు చేరింది. దీంతో ఉమారాణిని పెళ్లిచేసుకుంటానని మహేష్ ఒప్పకున్నాడు. అనంతరం తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఉమారాణి తుంగతుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు మహేష్‌ను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించగా పెళ్లి చేసుకుంటానిని ఒప్పుకొని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. చదవండి👉ఉత్తరాఖండ్‌లో దారుణం.. కదులుతున్న కారులో తల్లీ, కూతురిపై సామూహిక అత్యాచారం మరొకరితో పెళ్లికి యత్నిస్తున్నారని.. మహేష్ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం తెలియడంతో ఉమారాణి శనివారం సాయంత్రం తిరిగి పెద్ద మనుషులను ఆశ్రయించింది. దీంతో కొంత మంది పెద్ద మనుషులు ఉమారాణిని నువ్వు ఒంటరిగా పోరాటం చేయలేవు.. మహేష్ తల్లీదండ్రుల నుంచి రూ.10లక్షలు ఇప్పిస్తాము ఊరుకోమని సలహా ఇచ్చారు. కానీ ఉమారాణి వినడకుండా మరికొంత మంది పెద్ద మనుషులతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు మహేష్‌ను స్టేషన్‌కు పిలిపించి ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో మహేష్, ఉమారాణిలు పెళ్లికి ఒప్పకున్నారు. అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో లగ్నపత్రికను రాసుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్లాకా మహేష్ మళ్లీ మాట మార్చి ఉమారాణికి ఫోన్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పాడు. దీంతో ఉమారాణి మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఊరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఉమారాణి తల్లి కేకలు వేయడంతో చుట్టూ పక్కలవారు వచ్చి ఆమెను కాపాడారు. అప్పటికే ఉమారాణి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమి త్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉమారాణి తండ్రి వెలిశాల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు మహేష్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డానియేల్‌కుమార్ తెలిపారు. చదవండి👉ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి -
వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి..
సాక్షి, వరంగల్: అతనికీ, ఆమెకు ఓ పెళ్లిలో పరిచయమైంది. తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో రగలిపోతున్న ఆ యువకుడు ఆ విద్యార్థిని ఇంట్లోనే ఆమె గొంతుకోసి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. హనుమకొండ జిల్లాలోని సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. దూరంగా పెట్టిందని దారుణం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన పోలంపల్లి రాములు, రేణుకల కుమార్తె (23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనలియర్ చదువుతోంది. రాములు కుటుంబం హనుమకొండ గాంధీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. రాము లు వెల్డింగ్ షాపులో దినసరి కూలీగా పనిచేస్తుండగా, రేణుక ఇళ్లల్లో పనిచేస్తోంది. వారి కుమార్తె పోటీ పరీక్షల కోసం గత కొంతకాలంగా హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటోంది. ఆమె రెండేళ్ల క్రితం వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో జరిగిన తన మేనమామ కూతురు పెళ్లికి వెళ్లింది. అప్పుడు అక్కడే పక్కింటిలో ఉండే అజార్‌తో పరిచయం ఏర్పడింది. ఒకరి ఫోన్ నంబర్ మరొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ సమయంలో అజార్ ఐటీఐ పూర్తిచేసి కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఫోన్ లో మాట్లాడుకుంటున్న క్రమంలో అజార్ ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె తనకు ఇష్టం లేదని చెప్పింది. ఆమెను ఒప్పించడానికి అజార్ చాలా ప్రయత్నించాడు. అయితే కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. కాగా శుక్రవారం ఉదయమే ఇంటికి వచ్చిన ఆమె తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పటికే స్నేహితుల ద్వారా ఆమె హనుమకొండకు వస్తున్న విషయం తెలుసుకున్న అజార్ ఆమె ఇంటికి వెళ్లాడు. చున్నీతో ముఖాన్ని చుట్టేసి ముందుగానే తనవెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయంతో అరుచుకుంటూ బయటకు వచ్చిన ఆమెను స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. చదవండి👉🏾 ఫేస్బుక్ చాటింగ్.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ ప్రాణాపాయం తప్పింది.. ఆస్పత్రిలో ఆ విద్యార్థిని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. పెళ్లిలో పరిచ యం అయిన అజార్ ప్రేమించాలం టూ వేధించేవాడని, తను ఇంకో వ్యక్తి తో మాట్లాడుతున్నట్లు అసూయపడి కోపం పెంచుకుని దాడి చేశాడని ఆమె చెప్పినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. అజార్‌ను అరెస్టు చేసి 307, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితురాలికి ఆర్ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నామని, ప్రాణాపాయస్థితి నుంచి బయట పడిందని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్లు విద్యార్థినిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. తమిళిసై తీవ్ర విచారం ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. చదవండి👉🏾 మల్కాజ్గిరి మహిళ హత్యలో ట్విస్ట్.. -
నువ్వే నా లోకమంటూ ప్రేమ పేరిట దగ్గరై..
సాక్షి, ఖమ్మం రూరల్ : నువ్వే నా లోకం.. అంటూ ప్రేమ పేరిట దళిత యువతి వెంట పడిన యువకుడు, శారీరకంగా ఒక్కటైన అనంతరం పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తూ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్‌రోడ్డులో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. కోదాడ క్రాస్‌రోడ్డులో నివసిస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన గునిగంటి పవన్‌కృష్ణ, భద్రాద్రి జిల్లా చర్లకు చెందిన దళిత యువతి సీహెచ్. దీప్తిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడగా, శారీరకంగా కలవడంతో దీప్తి గర్భం దాల్చింది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా పవన్‌కృష్ణ కాలయాపన చేస్తుండడంతో ఈనెల 15న ఆయన ఇంటి ఎదుట మౌనదీక్ష చేపట్టింది. ఆ సమయాన పవన్‌కృష్ణ కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు సర్దిచెప్పడంతో దీక్ష విరమించినా ఆ తర్వాత ఫలితం లేకపోవడంతో బుధవారం పురుగుల మందు తాగింది. దీంతో రూరల్ పోలీసులు ఆమెను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో దీప్తి మాట్లాడుతూ.. తనను శారీరకంగా వాడుకుని గర్భవతిని చేసిన పవన్ ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని, తల్లిదండ్రులు కూడా లేని తనకు న్యాయం చేయాలని తెలిపారు. గతంలో అబార్షన్ చేయించుకోవాలని సూచించగా, భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంతో పాటు చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అంతేకాక కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్న పవన్‌కృష్ణ, తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ఈమేరకు అధికారులు స్పందించిన పవన్‌తో తన పెళ్లి జరిపించాలని ఆమె కోరారు. -
ప్రేమ పేరుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మోసం.. పంచాయితీ పెట్టినా ఫలితం లేదు
శాయంపేట (వరంగల్) : ప్రేమపేరుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వేధింపులను భరించలేని ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహారాపూర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. తహారాపూర్ గ్రామానికి చెందిన దొంగరి సంగీత (30) ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐసీడీఎస్ గ్రేడ్– 1 సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తోంది. (చదవండి: భార్యకు చెప్పి.. భర్త ఆత్మహత్య ) హనుమకొండ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సర్వేశ్‌యాదవ్‌కు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకు పెళ్లి కాలేదని సంగీతకు మాయమాటలు చెప్పి ప్రేమపేరుతో నమ్మించాడు. సంగీత బంధువులు అతనికి వివాహమైన విషయం తెలుసుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇకనుంచి ప్రేమ అంటూ వెంటపడొద్దని తెలిపారు. అయినా అతను మూడు నెలల నుంచి సంగీతకు తరచూ ఫోన్ చేస్తూ వేధించసాగాడు. సోమవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సంగీతను రాత్రి సర్వేష్ యాదవ్ ఫోన్లో వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై పురుగుల ముందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆటోలో పరకాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ సర్వేశ్ యాదవ్ వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి దొంగరి వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు తెలిపారు. (చదవండి: రామాయంపేటలో బంద్ ప్రశాంతం) ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మైనర్ ప్రేమ వ్యవహారం.. ప్రేమించిన అమ్మాయిని తీసుకురాకుంటే..
సాక్షి, శ్రీకాకుళం: తాను ప్రేమించిన అమ్మాయిని తీసుకురాకపోతే సెల్‌టవర్ నుంచి దూకేస్తానంటూ పదో తరగతి విద్యార్థి హల్చల్ సృష్టించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో కథ సుఖాంతమైంది. వీరఘట్టం గాసీ వీధికి చెందిన 16 ఏళ్ల బాలుడు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఖాళీ సమయంలో వీరఘట్టం నుంచి విశాఖపట్నం వెళ్లే కాయగూరల వాహనాలకు క్లీనర్‌గా వెళ్తుండేవాడు. ఈ క్రమంలో విశాఖలో 19 ఏళ్ల అమ్మాయితో ఏడాది కిందట పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ వారం రోజుల కిందట ఆ అమ్మాయిని వీరఘట్టం తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు గురువారం వీరఘట్టం వచ్చి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులతో విశాఖ వెళ్లిపోయింది. చదవండి: భర్తతో విసిగిపోయిన భార్య .. సుపారీ ఇచ్చి.. పక్కా ప్లాన్‌తో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అబ్బాయి సాయంత్రం 5 గంటల సమయంలో వీరఘట్టంలోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అమ్మాయిని తీసుకురాకపోతే టవర్ పైనుంచి దూకేస్తానని చెప్పడంతో స్థానికు లు వీరఘట్టం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, పాలకొండ ఫైర్ సిబ్బంది టవర్ వద్దకు చేరుకుని అబ్బాయితో చాకచక్యంగా మాట్లాడి రాత్రి 8 గంటల సమయంలో టవర్ పైనుంచి కిందకు దించా రు. దీంతో మూడు గంటల ఉత్కంఠకు తెరపడింది. -
డిగ్రీ విద్యార్థి హత్య.. ఒంటిపై గాయాలు.. ప్రేమ వ్యవహారమే కారణం?
సాక్షి, కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఎస్సై వెంకటేశ్వర్, స్థానికుల కథనం ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్ (19) డిగ్రీ చదువుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన నూనె శివ, అనిల్‌లు పని ఉందని చెప్పి, ఈ నెల 18న అతన్ని బైక్‌పై తీసుకెళ్లారు. తర్వాత తరుణ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఈ నెల 19న కాల్వశ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం వెన్నంపల్లి శివారులో ఓ యువకుడి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు చెప్పడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దామ పద్మ–మొండయ్య దంపతులకు సమాచారం అందించగా.. వచ్చి, తమ కుమారుడిదేనని గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్యకు గురై ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేశారు. చదవండి: పాకెట్ మనీ కోసం.. మరో లోకంలో విహరించాలని.. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. తరుణ్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టుతోపాటు పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ప్రేమించిన యువతితో విభేదాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయితో విభేదాలు రావడంతో తేజావత్ రాజు అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగం చెరువు తండాలో కుటుంబ సభ్యులతో కలిసి నివసించేవాడు. రాజుకు బంధువుల అమ్మాయితో గత కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం నడిచినట్టు సమాచారం. అయితే, వీరి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు వచ్చినట్టు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన రాజు నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం రాజు తన గదిలో విగతజీవిగా పడిఉండటంతో గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజు మృత దేహన్నీ గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లయిన తొమ్మిది నెలలకే.. కన్నవారింట్లోనే..) -
ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థి కిడ్నాప్.. విషయం తెలిసి తల్లిదండ్రుల షాక్
సాక్షి, రాంగోపాల్‌పేట్: ఇంటర్మీడియేట్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ మీడియేట్ చదువుతుంది. ఈ నెల 9వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తెలిసిన వారు, బంధువుల వద్ద వాకబు చేసినా ఎక్కడా కనిపించ లేదు. సాయంత్రం వేళ ఆ యువతి తన ఫోన్ నుంచి తల్లికి ఫోన్ చేసింది. తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని అతన్ని పెళ్లి చేసుకునేందుకు వెళుతున్నానని చెప్పి పెట్టేసి అటు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాలు లీక్.. ఆ రెండు పరీక్షలు రద్దు -
అక్క ప్రేమ వ్యవహారంలో చెల్లెలి జోక్యం.. అవమానంతో..
సాక్షి, నెక్కొండ(వరంగల్): అక్క ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కూతురును తల్లిదండ్రులు నిలదీయడం.. అనంతరం జరిగిన గొడవతో అవమానం భరించలేక చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై సీమాఫర్హీన్ తెలిపిన వివరాల ప్రకారం... నెక్కొండ రజక వాడకు చెందిన అమృత మండల కేంద్రానికి చెందిన జహీర్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలోపడింది. ఈనెల 5న చెల్లెలు అంజలి(15)తో కలిసి జహీర్ ఇంటికి వెళ్లి ప్రేమ, పెళ్లి విషయమై అతడిని నిలదీశారు. జహీర్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు వారిని దుర్భాషలాడి, అవమానించి వెళ్లగొట్టారు. దీంతో అవమాన భారంతో ఇంటికి వచ్చిన బాలికలను తల్లిదండ్రులు సైతం నిలదీశారు. శనివారం రాత్రి ఇది కాస్త గొడవకు దారి తీయడంతో అంజలి బహిర్భూమికి వెళ్తానంటూ బయటకు వచ్చి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విలపిస్తూ బావి వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. చదవండి: గత కొన్నేళ్లుగా భార్య సాగిస్తున్న నిర్వాకం.. అనారోగ్యం పాలైన భర్త! బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు నర్సంపేట అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామునబాలిక మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలి తండ్రి రామానుజం(అంజి) ఫిర్యాదు మేరకు అక్క ప్రియుడు జహీర్‌తోపాటు అతడి తండ్రి జమాల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: రెండేళ్లుగా ప్రేమ.. ప్రియురాలు లేని లోకం వద్దని.. -
తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అమానుషం.. ఫొటోలు, వీడియోలు తీసి
కాజీపేట: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని పక్కా ప్లాన్‌తో ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తండ్రి, యువతి బంధువులు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేయడంతో ఇరువర్గాలపై కేసు నమోదైంది. బాధితుడి తండ్రి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బైరపాక ప్రభుదాస్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ డీజిల్ కాలనీలో కుటుంబంతో అద్దెకు ఉండేవాడు. ఆయన కుమారుడు ప్రసాద్ ఇంటి యజమాని కూతురుతో ప్రేమగా ఉంటున్నాడనే అనుమానంతో గొడవలు జరిగాయి. దీంతో ప్రభుదాస్ కుటుంబం దూరంగా వేరే ఇంటికి మారింది. ఈ క్రమంలో బుధవారం అమ్మాయితో బంధువులు ప్రసాద్‌కు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. ఇంట్లోకి తీసుకెళ్లి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేస్తూ ఫొటోలు, వీడియోలు తీసి ప్రసాద్ మిత్రులకు పంపించడంతో విషయం వెలుగు చూసింది. (చదవండి: టోనీ వ్యవహారంలో మనీల్యాండరింగ్) బాధితుడి తండ్రి బంధువులు, మిత్రులతో వెళ్లి ప్రసాద్‌ను విడిచిపెట్టాలని వేడుకోగా మరోమారు అమ్మాయి జోలికి రావొద్దని రాయించుకుని వదిలేశారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా యువకుడితో పాటు అతడి కుటుంబసభ్యులపై అమ్మాయిని వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్‌రెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరితోపాటు యువకుడిని చితకబాదిన మాచర్ల శేఖర్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని.. పలుమార్లు లైంగికదాడి చేసి మోసం..) -
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి
సాక్షి, బాలనగర్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడిచేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహుత్ దిన్ తెలిపిన మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడు బాలనగర్ లోని వినాయక్ నగర్ లో నివసిస్తున్నాడు. సొంతంగా వ్యాపారం నిర్వహించుకుంటున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఓ యువతి అతనికి పరిచయం అయింది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెపై లైంగికదాడి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చదవండి: మహిళా ప్రొఫెసర్‌కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు.. -
ఏడేళ్లుగా ప్రేమ.. తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే. మరో అమ్మాయితో..
సాక్షి, ఆదిలాబాద్: పెంబి మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ కుభీర్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మి ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. తీరా పెళ్లి చేసుకోవాలని అడుగడంతో ముఖం చాటేశారు. ఆదివారం వెంకటేశ్ ఇంట్లో లక్ష్మి బైఠాయించి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని తెలిపాడని, అంతేకాకుండా శారీరకంగా లొంగదీసుకుని తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరించాడని తెలిపింది. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని, రెండేళ్ల క్రితం కుభీర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని తెలిపింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాజు, దస్తురాబాద్ ఎస్సై జ్యోతిమయి ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని, ఇంట్లో చొరబడి బైఠాయించడం సరికాదని చెప్పి ఇంటికి పంపించారు. చదవండి: మొయినాబాద్ రోడ్డు ప్రమాదం.. మొన్న ప్రేమిక, నేడు సౌమ్య పెళ్లి చేసుకోవాలని భర్త తమ్ముడి వేధింపులు. వివాహిత ఆత్మహత్య కడెం: మండలంలోని అల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగూడ గ్రామానికి చెందిన మసే జ్యోతి(40) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు వివరాల ప్రకారం.. జ్యోతిని భర్త తమ్ముడు సునీల్ కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన జ్యోతి ఈ నెల 25న ఉదయం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతు శనివారం రాత్రి మృతిచెందింది. భర్త ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దేవు పేర్కొన్నారు. చదవండి: జూబ్లీహిల్స్: స్నేహితురాలి వెంటపడి వేధించి, అసభ్యంగా ప్రవర్తించి -
రెండేళ్లుగా ప్రేమ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
సాక్షి, ఆదిలాబాద్: ప్రేమించిన యువకుడితో పెళ్లికి అతడి కుటుంబీకులు నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని ఖండాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై హరిబా బు తెలిపిన వివరాలు.. ఖండాల గ్రామానికి చెందిన చౌహాన్ సునీత (20), శ్రీనివాస్ గతేడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాస్ కుటుంబీకులు పెళ్లికి నిరాకరించడంతో సునీత ఆదివారం ఇంట్లో పురుగులు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో శ్రీనివాస్‌తోపాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
యువతితో ప్రేమ.. ఆమెకు పెళ్లి అయ్యిందని తెలియడంతో..
సాక్షి, బెంగళూరు : ప్రేమ వ్యవ హారం నేపథ్యంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పుత్తూరు తాలూకా పడువన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవిరాజ్ (31) ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డాడు. ఇతడికి ఓ యువతితో ఈనెల 25న నిశ్చితార్థం నిశ్చయించారు. ఇందుకోసం రవిరాజ్ బెంగళూరు నుండి స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం రాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తానని వెళ్లిన రవిరాజ్ తిరిగి ఇంటికి రాలేదు. మొబైల్ స్విచాఫ్ వచ్చింది. సోమవారం మడ్నూరు గ్రామంలోని తమ కొత్త ఇంట్లో రవిరాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి వెలుగు చూసింది. కుందాపురకు చెందిన యువతిని రవిరాజ్ ప్రేమిస్తున్నాడని, ఆమెకు వివాహం జరిగిందని తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో...
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ దళారీ హితేష్ జోషితో బంగ్లాదేశ్‌కు చెందిన సిరిన అక్తర్ హుస్సేన్‌కు ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఇది ప్రేమగా మారడంతో ఇతడి కోసం ఆమె అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చింది. హైదరాబాద్ నుంచి బోగస్ గుర్తింపు పత్రాలు పొందింది. ఇటీవల ఆ విషయం వెలుగులోకి రావడంతో గుజరాత్ పోలీసులు సిరినను అరెస్టు చేశారు. ఈమెకు ఫోర్జరీ పత్రాలు అందించిన నగరవాసి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందం ఆదివారం సిటీకి చేరుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. చదవండి: ఇక బస్సులపై ప్రకటనలు ఉండవు హితేష్– సిరిన మధ్య 2016లో ఫేస్బుక్ స్నేహం ఏర్పడటంతో ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్స్‌లో ప్రేమించుకున్నారు. తొలుత హితేష్‌ను కలుసుకోవాలని భావించిన సిరిన 2017 మార్చిలో 90 రోజుల విజిట్ వీసాపై భారత్‌కు వచ్చి వెళ్లింది. ఆపై అతడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుని అక్రమ మార్గంలో సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చేసింది. చదవండి: నైపుణ్యానిదే భవిష్యత్తు.. సాధారణ చదువులతో ఉపాధి అంతంత మాత్రమే బంగ్లాదేశ్‌లో ఉన్న దళారుల ద్వారా కోల్‌కతా చేరుకున్న సిరిన అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంది. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యుల ద్వారా గుత్తా సోను బిశ్వాస్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డులు సంపాదించింది. వీటిని తీసుకుని అహ్మదాబాద్ వెళ్లి హితేష్‌ను కలిసింది. 2017 అక్టోబర్ నుంచి అక్కడి సనాతన్ ప్రాంతంలో వీళ్లిద్దరూ సహ జీవనం చేయసాగారు. 2018లో వీరికి ఓ కుమార్తె జన్మించింది. 2020లో సిరిన.. సోను పేరుతో అహ్మదాబాద్ రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టు కూడా పొందింది. దీన్ని వినియోగించి భారతీయురాలిగా బంగ్లాదేశ్ వెళ్లి తన కుటుంబీకులను కలిసి వచ్చింది. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న ఈమె వ్యవహారం హితేష్ మరణంతో బయటకు పడింది. గత నెల ఆఖరి వారంలో హితేష్ అనారోగ్య కారణాలతో కన్నుమూశాడు. ఆపై సిరిన అలియాస్ సోను అతడి తల్లిదండ్రుల ఇంటికి చేరింది. ఆస్తుల పంపకం విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తి వాగ్వాదానికి కారణమైంది. దీంతో ఆవేశానికి గురైన హితేష్ తల్లిదండ్రులు సిరినను ఉద్దేశించి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీ అంటూ దూషించారు. ఈ సమాచారం సనాతల్ పోలీసులకు అందింది. దీంతో పోలీసులు గత వారం సిరినను అరెస్టు చేశారు. సిరినకు సోను పేరుతో ఆధార్, పాన్ కార్డులు తయారు చేసిన ఇచ్చిన నిందితుల కోసం అహ్మదాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఆదివారం హైదరాబాద్ పంపారు. సిరిన కేవలం హితేష్‌పై ఉన్న ప్రేమతోనే ఇలా అక్రమంగా వచ్చిందని, ఈ కేసులో మరే ఇతర కోణం లేదని అహ్మదాబాద్ పోలీసులు చెబుతున్నారు. చట్ట ప్రకారం ఆమె చేసింది నేరం కావడంతో అరెస్టు చేశామని వివరిస్తున్నారు. -
ప్రేమ, పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌తో సహజీవనం.. భర్తకు విడాకులు ఇప్పించి...
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాది కొడుకున్న తనకు భర్తతో విడాకులిప్పించి నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న యువకుడు మోసం చేశాడంటూ ఓ జూనియర్ ఆర్టిస్ట్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సమాచారం మేరకు.. రహ్మత్‌నగర్‌లో అద్దెకుంటున్న జూనియర్ ఆర్టీస్ట్(26)కు నాలుగేళ్ల క్రితం ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తితో రహ్మత్‌నగర్ వీడియోగల్లీలో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. చదవండి: పెద్దసారు పాడుబుద్ధి.. విద్యార్థినులు బడికి వెళ్లకపోవడంతో.. నాలుగేళ్లుగా ఇదే ప్రాంతంలో సహజీవనం చేస్తున్నది. ప్రసాద్‌రెడ్డి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. అప్పటి నుంచి జూనియర్ ఆర్టీస్ట్కు వేధింపులు మొదలయ్యాయి. తనను మోసం చేయడమే కాకుండా వేధింపులకు గురిచేస్తూ మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్న ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రసాద్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 354(డి), 420, 509 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడియో వైరల్: మైనర్ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని.. -
డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో
సాక్షి, జవహర్‌నగర్: ప్రేమ పేరుతో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడి ఆ ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌కు చెందిన నవీన్(23) ఫుడ్ డెలివరీ బాయ్. రెండు సంవత్సరాలుగా స్థానికంగా ఉండే యువతిని పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. చదవండి: Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇటీవలే యువతికి వారి తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న నవీన్ యువతి బంధువులను బెదిరించి యువతి ఇంటిని తగలబెడతానని హెచ్చరించాడు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు వారి నానమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ నెల 10న ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఈ నెల 23న యువతి ఇల్లు కాలిపోయినట్లు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితులు నవీన్ ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! -
రెండేళ్ల ప్రేమ.. ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుంటాను అనడంతో...
సాక్షి, ఆదిలాబాద్: మండలంలోని అంకాపూర్‌కు చెందిన మర్సుకోల గంగుబాయి (18) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాలు.. జైనథ్ మండలం జామ్నికి చెందిన పెందూర్ రవీందర్, గంగుబాయి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వేరే యువతిని వివాహం చేసుకుంటానని రవీందర్ తెలపడంతో గంగుబాయి మనస్తాపం చెంది ఈనెల 24న పురుగుల మందు తాగింది. చదవండి: మరో వ్యక్తితో వివాహం.. ప్రియునితో కలిసి వివాహిత ఆత్మహత్య గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తల్లి శోభబాయి ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: మరొకరితో పెళ్లి.. హైదరాబాద్‌కు వెళ్తూ ప్రియున్ని రమ్మని.. -
ఒక పెళ్లి.. రెండు బరాత్‌లు.. ట్విస్ట్ ఏంటంటే..
లక్నో: కరోనా ఉధృతి కారణంగా అనేక రాష్ట్రాలలో లాక్డౌన్ విధించి, కఠిన నిబంధలను అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం వివాహలపై కూడా పడింది. అయితే, ఈ కరోనా కాలంలో జరిగిన అనేక పెళ్లిళ్లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. తాజాగా, మరో వివాహం ఇలాగే వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఎటా జిల్లాలోని సిటాన్ గ్రామానికి చెందిన మోహనీకి, ఫులాన్పూర్ గ్రామానికి చెందిన బబ్లూతో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరి పెళ్లి వేడుకను బంధువుల మధ్య సిటాన్ గ్రామంలో ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇదివరకే ఆ యువతి, హయత్ నగర్ ప్రాంతానికి చెందిన అజిత్ అనే మరో యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే, వీరి ప్రేమకు యువతి పెద్దలు మాత్రం అంగీకారం తెలపలేదు. ఈ క్రమంలో బబ్లూతో వివాహం జరిపించడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం తెలియగానే అజిత్ తన బంధువులు, బ్యాండ్, బరాత్‌తో కలిసి వివాహం జరుగుతున్న చోటుకు చేరుకున్నారు. కానీ అప్పటికే మోహనీకి బబ్లూతో వివాహం జరిగిపోయింది. అజిత్ కుటుంబ సభ్యులు కాసేపు అక్కడ గందరగోళం సృష్టించారు. ఈ ప్రేమ వ్యవహరం తెలిసిన బబ్లూ తరపు వారు, వధువు కుటుంబ సభ్యులతో వాదనకుదిగారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరువురి బంధువులు తీవ్రంగా వాదించుకున్నారు. అయితే, కాసేపటికి రంగంలోకి దిగిన పోలీసులు, వధువు తండ్రి, మేనమామలను, అజిత్ కుటుంబ సభ్యులను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్.. వైరల్ వీడియో -
ఘోరం: తండ్రి బర్త్‌డే కేక్ కోసం బయటకొచ్చిన యువకుడిని..
న్యూఢిల్లీ: తండ్రి పుట్టినరోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు ఓ యువకుడు. కేక్ తీసుకొచ్చేందుకు బయటకు వచ్చాడు. అయితే అంతలోని కొందరు దుండగులు అతనిపై దాడి చేసి కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘోర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్లో తన తండ్రి బర్త్‌డే కోసం కేక్ కొనేందుకు 19 ఏళ్ల కునాల్ అనే యువకుడు రోడ్డు మీదకు వచ్చాడు. ఇంతలోనే ఓ నలుగురు వ్యక్తులు అతనిని చుట్టుముట్టి దాడికి తెగబడ్డారు. బాధితుడి ఛాతీ, వీపు, పొత్తి కడుపులో పొడిచి హతమార్చారు. అనంతర అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. అంతలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసుల నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఓ యువతి విషయంలో వీరి మద్య తరుచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుడు గౌరవ్, బాధితుడు కునాల్ ఇద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నారని, దీంతో ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడిందన్నారు. అనంతరం నిందితులు కునాల్‌పై కోపంతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఇద్దరు అరెస్టు Cyber Crime: పిన్ని స్నానం చేస్తుండగా వీడియో తీసిన బాలుడు.. ఆపై -
ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని తెగేసి చెప్పిన కూతురు.. దాంతో
సాక్షి, అనంతపురం: ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని తెగేసి చెప్పేసింది. దీంతో ఆమెపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చోళసముద్రం గ్రామానికి చెందిన రాజమ్మ కూతురు ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో రాజమ్మ తన కుమార్తె అదృశ్యమైందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే.. 8వ తేదీ రాత్రి రాజమ్మ కూతురు ప్రేమించిన వ్యక్తితో కలిసి పోలీసుస్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు సోమవారం తహసీల్దార్ కుమార్‌స్వామి ఎదుట అమ్మాయిని హాజరుపరిచారు. ఆ సందర్భంగా తల్లి రాజమ్మ ఇంటికి రావాల్సిందిగా కూతుర్ని వేడుకుంది. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజమ్మ అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను 108లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చదవండి: కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె -
నువ్వు ప్రేమిస్తున్న నీ మేనకోడలిని నేను ప్రేమిస్తున్నా..
సాక్షి, బంజారాహిల్స్: ‘నువ్వు ప్రేమిస్తున్న నీ మేనకోడలిని నేను ప్రేమిస్తున్నా.. నా కోసం నీ ప్రేమను త్యాగం చేయ్... లేకపోతే బాగుండదు’ అంటూ స్నేహితుడికి ఓ యువకుడు మెసేజ్ పెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్నేహితుడు బ్లేడ్‌తో ఆ యువకుడి మెడపై గాట్లుపెట్టాడు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బ్లేడ్‌తో దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... రహ్మత్‌నగర్ బంగారు మైసమ్మ టెంపుల్ వద్ద నివసించే సాయి చైతన్య(19) ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న తన అక్క కూతురు(17)ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. తమ ఇద్దరి ప్రేమకు సహకరించాల్సిందిగా స్నేహితులైన ఇద్దరు బాలురు (17)ను సాయిచైతన్య కోరాడు. అయితే, వారు చైతన్యను మోసగించి ఆ యువతితో ప్రేమాయణం నడిపిస్తున్నారు. అంతేకాకుండా నీ ప్రేమను త్యాగం చేయాలంటూ రెండు రోజుల క్రితం సాయి చైతన్యకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన చైతన్య ఎల్ఆర్ కిషోర్ స్కూల్ సమీపంలోని గ్రౌండ్‌కు వస్తే తేల్చుకుందామని వారిని హెచ్చరించాడు. దీంతో స్నేహితులతో పాటు చైతన్య గ్రౌండ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సాయిచైతన్య తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో స్నేహితుల్లోని ఓ బాలుడి మెడపై గాట్లు పెట్టాడు. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న బాధితుడిని ఆస్పత్రిలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాయి చైతన్యపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తనను చంపేస్తానని బెదిరించడంతో ముందుగానే స్నేహితుడిని చంపేందుకు పథకం వేసి బ్లేడ్‌తో దాడి చేశానని నిందితుడు చైతన్య తెలిపాడు. చదవండి: బంజారాహిల్స్: ప్రేమిస్తావా.. చస్తావా.. చావాలా.. ! ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే! -
బయటకు వెళ్లకుండా తల వెంట్రుకలను కట్ చేయించి..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సాకు చెందిన పరమేశ్వర్ 20ఏళ్ల కిందట లక్ష్మీగూడలో నివాసం ఏర్పా టు చేసుకున్నాడు. ఆయనకు నలుగురు సంతానం. ఇదే ప్రాంతానికి చెందిన అక్రం అలియాస్ అప్సర్(20) నివసిస్తున్నాడు. పరమేశ్వర్ చిన్న కూతురు లీజా(20) అప్సర్ ఒకే కళాశాలలో ఇంటర్ చదువుకున్నారు. వీరి ఇళ్లు కూడా దగ్గరగా ఉండడంతో కళాశాలకు వెళ్తూ, వచ్చే సమయంలో ప్రేమలో పడ్డారు. విషయం గమనించిన లీజా కుటుంబ సభ్యులు పలుమార్లు అప్సర్‌ను హెచ్చరించారు. చదవండి: బ్యుటిషియన్ ఆత్మహత్య లీజాను బయటకు వెళ్లనీయకుండా తల వెంట్రుకలను కట్ చేయించి ఇంట్లోనే ఉంచారు. దీంతో ఆ యువతి మానసికంగా కుంగిపోయింది. దీనికి తోడు అప్సర్ తరుచూ ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేని యువతి ప్రియుడితో సుమారు గంటపాటు ఫోన్లో మాట్లాడాక ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమె మృతి చెందాక కూడా అఫ్సర్ 135 సార్లు ఫోన్ చేశాడు. ఇరువురు ఫోన్ మాట్లాడుకుంటూనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్నేహితులు, బంధువులు వాపోతున్నారు. ఈ మేరకు అఫ్సర్‌ను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చదవండి: బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని.. -
పాపం, పెళ్లి చేసుకోమని ఇంటికెళితే...
సాక్షి, నిర్మల్: ఏడడుగులు వేస్తానని ఏడేళ్లు ప్రేమాయణం నడిపించిన ఓ ప్రబుద్ధుడు చివరికి మొహం చాటేశాడు. చెట్టాపట్టాలు వేసుకుని చెలిమి చేసి పెళ్లికి నిరాకరించాడు. తనకు అన్యాయం చేయొద్దని బాధితురాలు వారి ఇంటికి వెళితే అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ప్రియుడి బంధువులు ఆమెపై దాడికి దిగారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. ప్రియుడు అడ్లూరి మనోజ్ తనను మోసం చేశాడని ప్రియురాలు అతని ఇంటి మందు ధర్నాకు దిగింది. (చదవండి:సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమ.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..) ఏడేళ్లు ప్రేమ పేరుతో దగ్గరైన వ్యక్తి, పెళ్లికి ఒప్పుకోవడం లేదని తెలిపింది. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట మౌన దీక్ష చేసింది. దీంతో ప్రియుడి బంధువులు ఆ యువతిని చితకబాదారు. తీవ్రగాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రియుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనను యువతి కుటుంబ సభ్యులు, బంధువులు మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. న్యాయం కోసం తలుపు తడితే ఇంత కర్కషంగా ప్రవర్తిస్తారా అని యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. (చదవండి: హాట్ టాపిక్‌గా మారిన సివిల్స్ టాపర్స్ విడాకులు) -
నాన్న వద్దు.. ప్రేమికుడే ముద్దు
నూజివీడు : ‘నేను నా తండ్రితో పాటు ఇంటికెళ్లను.. నాకు వేరే పెళ్లి చేస్తారు. నేను ప్రేమించిన యువకుడి దగ్గరికే వెళ్తా.. ’ అంటూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని మొండికేసింది. ట్రిపుల్ ఐటీకి సెలవులు కావడంతో కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రి వెంట తాను వెళ్లేది లేదని భీష్మించుకూర్చుంది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనతో ఏం చేయాలో పాలుపోక ట్రిపుల్ ఐటీ అధికారులు తలలు పట్టుకున్నారు. ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం పూర్తిచేసిన పి.జ్యోత్స్న స్వగ్రామం గుంటూరు జిల్లా వెల్లటూరు. ఏడాది కిందట ఇంటర్న్‌షిప్‌నకు వెళ్లిన సమయంలో విజయవాడలో ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మోహనమురళీతో పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది. ఎంబీఏ చదివిన అతను ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు కుమార్తెను మందలించారు కూడా. ఈ నేపథ్యంలో శనివారంతో పరీక్షలు పూర్తవుతున్నందున కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి శుక్రవారం సాయంత్రమే ట్రిపుల్ ఐటీకి వచ్చాడు. ట్రిపుల్ ఐటీ అధికారులు కూడా ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నూజివీడు సీఐ మిద్దే గీతారామకృష్ణ సైతం వెళ్లి ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ చేసినా తండ్రి వెంట వెళ్లేందుకు ససేమిరా అనడంతో ఏమి చేయాలో తెలియనిస్థితిలో ఉన్నారు. -
ఆమె ప్రేమ యవ్వారం ఈమె ప్రాణాల మీదకు తెచ్చింది!
మదనపల్లె టౌన్ : చిన్ననాటి స్నేహితురాలు అదృశ్యం ఓ అమాయక యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. అదృశ్యమైన అమ్మాయి కుటుంబ సభ్యుల వేధింపులు, సూటిపోటి మాటలకు ఆమె కుంగిపోయింది. వీరి నడుమ ఉంటే తనకే ముప్పు తప్పదని తన బిడ్డతో పాటు ఊరు వదిలి దూరాన ఉన్న పెదనాన్న ఇంటికి వచ్చినా వేధింపుల పర్వకం ఆగలేవు. దీంతో ఆమె ఉరేసుకుని బలవన్మరణం చెందింది. శుక్రవారం రాత్రి మదనపల్లెలో ఈ విషాద సంఘటనకు చోటుచేసుకుంది. రెండో పట్టణ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం..ములకలచెరవు మండలం పాళ్యంవారిపల్లెకు చెందిన గంగరాజు ఐదేళ్లక్రితం మదనపల్లె మండలం బొమ్మన చెరువుకు చెందిన భవాని(22)ని వివాహం చేసుకున్నాడు. కారుడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భవాని పినతల్లికి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో ఆమె తోడుగా ఉండేందుకు రెండు నెలల క్రితం పుట్టినిల్లు అయిన బొమ్మన చెరువుకు వచ్చింది. గ్రామంలో ఉన్న ఓ యువతి భవానికి చిన్ననాటి స్నేహితురాలు. ఆమెకు కూడా వివాహమైంది. అయితే ఆ యువతి కట్టుకున్న భర్తను కాదని ఆదే గ్రామానికి చెందిన మరో యువకుని ప్రేమలో పడింది. వాళ్లిద్దరూ ఇష్టపడి కొంతకాలం సహజీవనం సాగించినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన భవాని స్నేహితురాలు తన ప్రియునితో కలసి పది రోజుల క్రితం అదృశ్యమైంది. దీనికి భవానీయే కారణమంటూ ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెను వేధించసాగారు. అంతుచూస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన భవాని తన పిన తండ్రి ఉంటున్న స్థానిక అనపగుట్టకు చేరుకుని తలదాచుకుంది. అయిననూ అక్కడికి వచ్చి సైతం వారు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైంది. ఇక చావే శరణ్యమని భావించిన భవాని మరణాన్ని ఆశ్రయించింది. సూసైడ్ నోట రాసి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందడంతో టుటౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామ నిర్వహించి మృతదేహాన్ని స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై హత్యకేసు నమోదు చేయాలి ప్రియుని మోజులో పడి వెళ్లిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఏ పాపం తెలియని తన భార్య బలవన్మరణానికి కారణమయ్యారని భవాని భర్త విలపించారు. వారిపై హత్యకేసు నమోదు చేయాలని గంగరాజుతో పాటు మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. శనివారం ఉదయం టూటౌన్ స్టేషన్‌కు వచ్చి కన్నీరు మున్నీరు అయ్యారు. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇచ్చారు. మృతురాలికి మూడేళ్ల కుమారుడు యశ్వంత్ ఉన్నాడు. -
యువతి చున్నీతో ఉరివేసుకున్న యువకుడు
చీపురుపల్లి: తను ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహం నిశ్చయం కావడం, దాన్ని రద్దు చేసుకోమని ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె అంగీకరించకుండా తనను మరచిపోవాలని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆ యువతి చున్నీతోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెరకముడిదాం మండలం భీమవరం గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్ (17), అదే మండలంలోని శ్యామాయవలస గ్రామానికి చెందిన ఓ యువతి చీపురుపల్లిలోని ఓ కంప్యూటర్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అక్కడ దాదాపు ఆరు నెలల క్రితం వారికి పరిచయం ఏర్పడింది. దాన్ని ప్రేమగా మార్చాలని ప్రవీణ్ ప్రయత్నించాడు. అయితే ఆ యువతి కంటే ప్రవీణ్ ఏడాది చిన్నవాడు కావడంతో ఆమె అంగీకరించలేదు. అయినప్పటికీ వెంట పడి ఎట్టి పరిస్థితుల్లో తన ప్రేమను అంగీకరించాలని కోరాడు. ఇంతలో ఆ యువతికి ఇంట్లో పెద్దలు వివాహం కుదిర్చారు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ ఆ పెళ్లి రద్దు చేసుకోవాలని కోరుతున్నా ఆమె పట్టించుకోలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేస్తూ వచ్చింది. శుక్రవారం చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మాట్లాడుకుందాం రమ్మని ప్రవీణ్ ఆ యువతిని పిలిచాడు. ఆమె వెళ్లేసరికి ప్రవీణ్ అక్కడ లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకుని వెనుదిరిగింది. ఆ తరువాత వచ్చిన ప్రవీణ్ తాను వచ్చానని రమ్మని ఫోన్‌చేసి పిలిచాడు. ఆమె వెళ్లగా పెద్దలు కుదిర్చిన పెళ్లి రద్దు చేసుకోవాలని మరోసారి కోరాడు. ఆమె ససేమిరా అంటూ నచ్చజెప్పింది. మనస్తాపం చెందిన ఆ యువకుడు కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని అక్కడే కూర్చోమని, ఎండగా ఉంది చున్నీ ఇవ్వాలని అడిగాడు. చాలా సేపటి తరువాత ఫోన్ చేసి ‘ఇదే ఆఖరి మాట గుడ్‌బై’ అని ఫోన్ పెట్టేశాడు. ఆ యువతి పరుగులు తీసి వెళ్లగా అక్కడ ఓ చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ప్రియుడి కోసం రూ.1.50లక్షల..
చిన్నచింతకుంట (దేవరకద్ర): ఆరేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు సహజీవనం చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని కోరగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నాకి దిగిన సంఘటన చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మద్దూర్ గ్రామానికి చెందిన జుట్ల నర్మద, చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన మక్క మోహన్‌కుమార్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇలా ప్రేమించుకుంటున్న సమయంలోనే నర్మద, మోహన్‌కుమార్ ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లారు. నర్మద చిక్కడపల్లి ప్రాంతంలోని ఓ ఉమెన్స్‌కాలేజీలో 2010 నుంచి 2014 సంవత్సరం వరకు విద్యనభ్యసిస్తూనే ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. అలాగే, మోహన్‌కుమార్ ఓ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించి కాగ్నిజెంట్ డీఎల్ఎఫ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రియుడి చదువు కోసం రూ.1.50లక్షల ఖర్చు ఈ క్రమంలోనే మోహన్ పైచదువు కోసం నర్మద రూ.1,50,000 వరకు సాయం అందించింది. 2014సంవత్సరంలో నర్మద కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన మోహన్ మేమిద్దరం పెళ్లిచేసుకుంటామని, వేరే సంబంధాలు చూడవద్దని చెప్పడంతో నర్మద కుటుంబీకులు కూడా ఆమె సంబంధాల గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2014 నుంచి 2019వరకు దాదాపుగా 5ఏళ్లుగా వీరిద్దరు కలిసి సహజీవనం కొనసాగించారు. ఇదే తరుణంలో నన్ను పెళ్లిచేసుకోమని మోహన్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా మా చెల్లెలి పెళ్లి తర్వాత మనం పెళ్లి చేసుకుందామని దాటవేస్తూ వచ్చాడు. అనంతరం మోహన్‌కుమార్ చెల్లెలి పెళ్లి కూడా పూర్తయింది. తల్లి ఒప్పుకోవట్లేదని పెళ్లికి నిరాకరణ.. ఇదిలాఉండగా, గత 6నెలల క్రితం ఇరు గ్రామాలకు చెందిన పెద్దల సమక్షంలో మోహన్‌కుమార్ నర్మదతో పెళ్లికి అంగీకారం కుదుర్చుకున్నారు. అప్పటి నుండి పెళ్లి చేసుకుందామని నర్మద, మోహన్‌కుమార్‌ను పట్టుపడుతూ వచ్చింది. ఇటీవల నిన్ను పెళ్లిచేసుకుంటే మా అమ్మ చనిపోతానని అంటుందని, అందుకే నీతో పెళ్లికి నిరాకరిస్తున్నానని మోహన్ తేల్చిచెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి కొన్నిరోజుల కిందట ఎస్పీని కలిసే ప్రయత్నం చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించడంతో నర్మద గత మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఇక్కడ కూడా జాప్యం జరగడంతో గత్యంతరం లేక ప్రియుడు మోహన్‌కుమార్ ఇంటి ఎదుట గత మూడురోజులుగా ధర్నాకి కూర్చుంది. పెళ్లంటూ జరిగితే మోహన్‌తోనే జరగాలని, లేదంటే న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని నర్మద తెలిపారు. చిన్నచింతకుంటలో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు నర్మద చిన్నచింతకుంటలో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు నర్మద -
ప్రేమపేరుతో మోసం చేశాడని.. యువతి
మానకొండూర్: ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. కలకాలం తోడుంటానన్నాడు. నమ్మిన ఆ యువతి ప్రేమను అంగీకరించింది. ఐదేళ్లకు పైగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చదువైపోగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇద్దరి చదువు పూర్తయ్యింది. ఇక పెళ్లి చేసుకుందామని యువతి కోరింది. అంతా సిద్ధం చేసుకుని ఆలయానికి వెళ్లారు. విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. యువతి పోలీసులను ఆశ్రయించగా.. ఇప్పుడా యువకుడు పెళ్లికి ముఖం చాటేశాడు. తాను ప్రేమించిన అమ్మాయి వద్దని ఇంటినుంచి పారిపోయాడు. దీంతో సదరు యువతి ప్రియుడి ఇంటిఎదుట బైఠాయించింది.ఈ ఘటన మానకొండూర్ మండలం వెల్ది గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఐదేళ్లనుంచి ప్రేమ.. మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన అంతగిరి లక్ష్మయ్య– పరమేశ్వరి దంపతుల పెద్దకూతురు నందిని(25) ఏంబీఏ పూర్తిచేసింది.ఇదే గ్రామానికి చెందిన ఎనగంటి గణపతి, గంగా దంపతుల చిన్నకొడుకు ఎనగంటి శ్రీధర్ ఊరాఫ్ లక్ష్మణ్(24) డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం పెద్దపల్లిలో ఉంటున్నాడు. ఐదేళ్లక్రితం నందినిని ప్రేమించమని శ్రీధర్ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ప్రేమను అంగీకరించింది. ఇద్దరి చదువు పూర్తయ్యింది. మధ్యలో నందినికి వచ్చిన పెళ్లి సంబంధాలను శ్రీధర్ చెడగొడుతూ వచ్చాడు. తమ కూతురును పెళ్లి చేసుకుంటానని నందిని తల్లిదండ్రులకూ మాటిచ్చాడు. పెళ్లి వరకు వెళ్లి.. ఇటీవల శ్రీధర్ సోదరుడి వివాహమైంది. ఇదే క్రమంలో నందిని – శ్రీధర్ ప్రేమ వ్యవహారం ఇరువురి ఇంట్లో తెలిసింది. దీంతో బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందాని అనుకున్నారు. గత ఆదివారం తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్‌లోని నృసింహుని ఆలయం వద్దకు వెళ్లారు. తాళి కట్టేసమయంలో శ్రీధర్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. వారి వర్గానికి చెందిన ఓ పెద్దమనిషి సాయంతో శ్రీధర్‌ను తీసుకెళ్లారు. పోలీసులను ఆశ్రయించిన యువతి.. నందిని మానకొండూర్ పోలీసులను ఆశ్రయించింది. ఇరుకు టుంబాలను పిలిపించి సీఐ ఇంద్రసేనారెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చా రు. నందినిని పెళ్లి చేసుకోవాలని శ్రీధర్‌కు సూచించగా నిరాకరించాడు. మరుసటి రోజునుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. మోసపోయానని బైఠాయింపు.. మోసపోయానని గ్రహించిన నందిని తనకు న్యాయం చేయా లని శనివారం ఉదయం ప్రియుడి ఇంటిఎదుట బైటాయించింది. శ్రీధర్ తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడే ఉంటానని భీష్మించుకు కూర్చుంది. నందినికి రజక కులస్తులు, గ్రామస్తులు, మహిళా సంఘం నాయకులు మద్దతుగా నిలిచారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నందినితో మాట్లాడుతున్న క్రమంలోనే కిరోసిన్ పోసుకునేందుకు యత్నించింది. పోలీసులు అడ్డుకుని నచ్చజెప్పారు. నందినిని మద్దతుగా నిలిచిన రజకసంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్ మాట్లాడుతూ... శ్రీధర్‌కు దగ్గర బంధువైన శ్రీనివాస్ అనే వ్యక్తి కారణంగానే పెళ్లికి నిరాకరించాడని ఆరోపించారు. న్యాయం చేయకుంటే మూడువేల మందితో శ్రీధర్ ఇంటిఎదుట ఆందో ళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు నడిగొట్టు రవి, శాతరాజు యాదగిరి, సంపత్, ముత్తూరి కొంరయ్య రాయికంటి కిరణ్, గంగధర లక్ష్మయ్య, అంతగిరి సంపత్ తదితరులు మద్దతుగా నిలిచిన వారిలో ఉన్నారు. -
రవళికి కన్నీటి వీడ్కోలు
సంగెం: ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన రవళికి కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అశ్రు నివాళులర్పించారు. గ్రామానికి చెందిన తోపుచర్ల పద్మ, సుధాకర్‌రావు ఏకైక కూతురు రవళిపై తోటి విద్యార్థి ఫిబ్రవరి 27న హన్మకొండలోని రాంనగర్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో రవళి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం స్వ గ్రామానికి.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి హన్మకొండ, పర్వతగిరి సీఐలు సంపత్‌రావు, శ్రీధర్‌రావు పంచానామా నిర్వహించిన తర్వాత పోస్టుమార్టమ్ చేపట్టారు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులు రవళి మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య రామచంద్రాపురం గ్రామానికి తీçసుకు వచ్చారు. విద్యార్థి్థని మృతదేహాన్ని చూడగానే బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రవళిపై దాడి చేసిన నిందితుడిని కాల్చి చంపాలని గట్టిగా నినాదాలు చేశారు. అరటి మొక్కతో పెళ్లి.. రవళి మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అరటి మొక్కతో పెళ్లి జరిపించారు. అయ్యగారు పెళ్లి తంతు జరిపిస్తుండగా రవళి తల్లితండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బందోబస్తు మధ్య అంత్యక్రియలు.. రవళి మృతదేహాన్ని ఇంటి నుంచి ఊరచెరువు శ్మశాన వాటిక వరకు పోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపుగా తరలించారు. తండ్రి సుధాకర్‌రావు తలకొరివి పెట్టి రవళి చితికి నిప్పంటించాడు. అయ్యో రవళి అంటూ అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మామునూర్ ఏసీపీ జి.శ్యాంసుందర్, హన్మకొండ, గీసుకొండ, పర్వతగిరి సీఐలు సంపత్‌రావు, సంజీవరావు, శ్రీధర్‌రావు, సంగెం, ఐనవోలు ఎస్సైలు నాగరాజు, నర్సింహరావు, 40 మంది కానిస్టేబుళ్లు, 8 మంది మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. కడసారి చూపుకు నోచుకోలేక.. కన్నకూతురును కడసారి చూసుకోని పరిస్థితి మరే తల్లితండ్రులకూ రావద్దని రవళి తల్లితండ్రులు పద్మ, సుధాకర్‌రావు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పెట్రోలు దాడిలో పూర్తిగా కళ్లు, ముఖం కాలిపోయిన కూతురు ముఖంను చూసుకోలేకపోయామని బావురుమన్నారు. -
ప్రేమే గెలిచింది..
భీమారం: ప్రేమించిన వాడిని మనువాడడం కోసం చేసిన పోరాటంలో ఆమె గెలవడంతో పాటు ప్రేమను జయించింది. తన ప్రియుడితో మరో యువతికి నిశ్చితార్థమైందని తెలిసిన ఆమె సెల్ టవరు ఎక్కింది. 7 గంటల హైడ్రామా అనంతరం టవర్ పైనుంచి కిందికి దిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు, బంధువుల ఆందోళన అన ంతరం ప్రేమ కథ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. రంగంలోని దిగిన ఏసీపీ ప్రియుడిని పిలిపించి ప్రేమ జంటకు కౌనెల్సింగ్ ఇచ్చారు. అనంతరం రాత్రి పోలీసుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. వివరాల ప్రకారం .. హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన దామెర మాలిక, నక్క బాబు పదేళ్ల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. బాబు సింగరేణి ఉద్యోగి కాగా, మాలిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల బాబుకు అదే గ్రామానికి చెందిన మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈవిషయమై మాలిక అదే రోజు కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. అయినా నిశ్చితార్థం తంతు ఆగలేదు. ప్రియుడి విచారణ. ఇదిలా ఉండగా పోలీసులు బాబును కూడా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. మాలికతో ఉన్న సంబంధంపై అడిగి తెలుసుకున్నారు. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం వరకు సమయం ఇస్తాం... ఆలోచించుకోవాలని సూచించారు. కొద్దిసేపు వారు మాట్లాడుకునే అవకాశం కల్పించారు. ఒక్కటయ్యారు.. ఎట్టకేలకు మాలిక తన పంతం నెగ్గిచ్చుకుంది. చివరికి ప్రియుడితో వివాహం జరిగింది. పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాబు. మాలిక ఒక్కటయ్యారు. పెళ్లి చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమాచారం మేరకు అక్కడికి చేరిన ఏసీపీ చంద్రయ్య ఆందోళనకారులను శాంతింజేశారు. అనంతరం ఇద్దరికి కౌన్సెలింగ్ నిర్వహించడమే కాకుండా పెద్దమనుషులతో మాట్లాడారు. అనంతరం ఇరువురి అంగీకారం మేరకు మాలిక–బాబు పోలీస్‌స్టేషన్ ఎదుట పూలదండలు మార్చుకున్నారు. ఈసందర్భంగా మాలిక మెడలో తాళి కట్టాడు. న్యాయం జరగలేదని.. పోలీసుల నుంచి ఆశించిన న్యాయం జరగకపోవడంతో మాలిక మంగళవారం ఉదయం 4.30 గంటలకు పెగడపల్లి సమీపంలోని ఓసెల్టవర్ ఎక్కింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. సెల్ టవర్ నుంచి కిందకు దిగాలని కోరారు. అయినప్పటికీ ఆమె దిగడానికి నిరాకరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితురాలు ఉదయం 11.30 నిమిషాలకు సెల్ టవర్ దిగింది. పోలీసులు మాలికను తమ వాహ నంలో కూర్చోబెట్టి ముందుకు సాగారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బాబుతో పెళ్లి జరపాలని వాహనం ఎదుట కూర్చున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు మాలికను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స నిర్వహించారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన రవళి
-
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి
వరంగల్ క్రైం: ప్రేమను నిరాకరించిదనన్న అక్కసుతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీ వ్రంగా గాయపడిన తోపుచర్ల రవళి(22) మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం యశోద ఆస్పత్రిలో కన్ను మూసింది. హన్మకొండ రాంగనర్‌లో ఫిబ్రవరి 27న లలితారెడ్డి హాస్టల్ ముందు ప్రేమోన్మాది పెండ్యాల సాయిఅన్వేష్ చేతిలో దాడికి గురైన విద్యార్థిని ఆరు రోజుల పాటు నరకం అనుభవించి మృత్యువు ఒడిలోకి చేరింది. ఐసీయూలో ఆరు రోజుల నరకయాతన.. ఫిబ్రవరి 27వ తేదీన హన్మకొండలోని రాంనగర్లో ఉదయం 9.05 గంటలకు హాస్టల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న రవళిపై ప్రేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన తరువాత చివరగా తన స్నేహితురాలు కావ్యతో నిందితుని వివరాలు చెప్పింది. ఆ తరువాత ఎంజీఎం ఆస్పత్రికి ఉదయం 9.30 గంటలకు చేరుకున్న రవళి మధ్యాహ్నం 12 గంటల వరకు చికిత్స పొందింది. మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా 3.15 గంటలకు యశోద ఆస్ప త్రిలో ఐసీయూలో చేర్చారు. అప్పటి నుంచి సోమవారం సాయంత్రం 6.10 గంటల వరకు ప్రాణా లతో పోరాడింది. ఆరు రోజుల పాటు నరకయాతన అనుభవించి చివరకు రవళి ప్రాణాలను వదిలింది. శ్వాస నాళాలు ఉబ్బి.. పెట్రోల్ దాడిలో గాయపడిన రవళి ముఖం ఎక్కువ మొత్తంలో కాలిపోయింది. తీవ్రమైన గాయాల వల్ల శ్వాసనాళాలు ఉబ్బిపోయాయి. చర్మంపై ఉన్న మూడు పొరలు పూర్తి స్థాయిలో దెబ్బతిని, ఊపిరితిత్తులు పాడైపోయాయి. ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి. శ్వాస నాళాలు దెబ్బతినడం వల్ల శ్వాస తీసుకోలేక మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఐసీయూలో ఆరు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. నేడు గాంధీలో పోస్టుమార్టం.. మృతదేహానికి సోమవారం పంచనామా అనంతరం ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సెంట్రల్ జైల్లో ప్రేమోన్మాది సాయిఅన్వేష్ 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపిం చారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు సాయిఅన్వేష్పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటంతో నిందితుడు సాయి అన్వేష్‌పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు. హన్మకొండ ఇన్స్పెక్టర్ సంపత్‌రావు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. హైదరబాద్‌లో పంచనామా నిర్వహించిన తరువాతనే పోస్టుమార్టం చేపడుతారు. ఆరు రోజుల పాటు హన్మకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ ఎస్సై రవళి ఆరోగ్య పరిస్థితిని దగ్గర ఉండి పర్యవేక్షించారు. సెంట్రల్ జైల్లో పేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా కాల్చిన ప్రేమోన్మాది సాయిఅన్వేష్ వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. హన్మకొండ పోలీసులు 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. న్యాయమూర్తి 14 రోజుల రిమైండ్ విధించారు. మృతురాలు రవళి ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడు సాయిఅన్వేష్పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటం నిందితుడు సాయి అన్వేష్‌పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు. రవళి మృతిపై మంత్రి ఎర్రబెల్లి సంతాపం పాలకుర్తి: ఇటీవల హన్మకొండలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ రవళి సోమవారం మృతి చెందింది. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తిలో విలేకరులతో మాట్లాడారు. రవళి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రవళి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. అత్యంత భాధకరం పెట్రోల్ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ రవళి మృతి చెందటం అత్యంత బాధాకరం. ప్రేమోన్మాది సాయిఅన్వేష్ను అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇన్స్పెక్టర్ సంపత్‌రావును హైదరాబాద్‌కు పంపించి పోస్టుమార్టం నిర్వహిస్తాం. పోలీసు శాఖాపరంగా సరైన అధారాలు కోర్టుకు అందజేసి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటాను. యువతులు, మహిళలను ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. షీ టీమ్స్, 100కు డయల్ చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రవీందర్, సీపీ సంగెం : రవళి స్వగ్రామం రామచంద్రాపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంగెం ఎస్సై ఎం.నాగరాజు పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంగళవారం రవళి మృతదేçహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్న క్రమంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. మరో తల్లికి గర్భశోకం లేకుండా చూడాలి.. ప్రేమ పేరుతో రవళిని వేధించి చివరకు పెట్రోల్ పోసి నిప్పటించి తన పైశాచికానికి బలి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి. అతడికి విధించిన శిక్షను చూసి మరో మృగాడు ఏ ఆడపిల్ల వైపు కూడా కన్నెత్తి చూడకూడదు. రవళి తల్లితండ్రులకు కలిగిన గర్భశోకం మరే తల్లిదండ్రులకు రాకుండా చూడాలి. ప్రేమ పేరుతో వేధించే వారి పట్ల చట్టాలు కఠినంగా అమలు చేయాలి. బొంపల్లి జయశ్రీ, సర్పంచ్, రామచంద్రాపురం ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి.. సమాజంలో అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు పోతున్న ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి. దీంతో వారిని కళాశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రేమ పేరుతో వేధించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఒక్కగానోక్క కూతురును పొట్టన పెట్టుకున్న అన్వేష్‌ను కఠినంగా శిక్షించాలి. రవళి తల్లిదండ్రులకు తగిన న్యాయం జరిగేలా అతనిని శిక్షించాలి. కత్తి రాధిక, ఎంపీటీసీ సభ్యురాలు,రామచంద్రాపురం -
శ్రీధరణి హత్యకేసులో పురోగతి ఏదీ
ఏలూరు టౌన్ : శ్రీధరణి హత్య కేసులో పోలీసు అధికారుల పురోగతి కనిపించటంలేదని, కేసు దర్యాప్తులో అలసత్వం వహిస్తే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఇటీవల హత్యకు గురైన శ్రీధరణి కేసుకు సంబంధించి బుధవారం రాజకుమారి భీమడోలు మండలం ఎంఎం పురం గ్రామంలోని శ్రీధరణి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంత రం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఘటనలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న నవీన్‌కుమార్‌ను ఆమె పరామర్శించారు. తలకు తీవ్రగాయాలెన నవీన్ నుంచి వైద్యుల సమక్షంలో వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకేమీ గుర్తురావటంలేదని, పోలీసులకు ముం దు నుంచి చెప్పే సమాధానమే రాజకుమారికీ అతడు చెప్పాడు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నవీన్ కూడా నేరస్తుడే అనంతరం మహిళా కమిషన్ చైర్మన్ రాజకుమారి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు నవీన్కుమార్పైనా అనుమానాలు ఉన్నాయని, ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడని అనుకుంటున్నట్టు తెలిపారు. శ్రీధరణిని అక్కడకు తీసుకువెళ్లాడు కాబట్టి నవీన్ కూడా నేరస్తుడే అవుతాడన్నారు. ఘటన జరిగి నాలుగురోజులు కావస్తున్నా నేరస్తులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. ఆడపిల్లలు కూడా తమ హద్దుల్లో ఉండాలని, గుడ్డిగా ప్రేమపేరుతో నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. పర్యాటక కేంద్రమైన బౌద్ధారామాల వద్ద భద్రత, రక్షణ లేకపోవటం దారుణమన్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, న్యూరోసర్జన్ డాక్టర్ వి జయప్రసాద్, ఐసీడీఎస్ జేడీ విజయకుమారి, మహిళా కమిషన్ డైరెక్టర్ డాక్టర్ రాజ్యలక్ష్మి, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఉన్నారు. శ్రీధరణి కుటుంబాన్ని ఆదుకుంటాం భీమడోలు: తెర్లి శ్రీధరణి అనే యువతి దారుణ హత్యకు గురికాగా ఆమె కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. పూళ్ల పంచాయతీ శివారు ఎంఎం పురంలో శ్రీధరణి కుటుంబాన్ని బుధవారం ఆమె పరామర్శించారు. ఈసందర్భంగా శ్రీధరణి తల్లిదండ్రులు అప్పారావు, అలివేలు మంగ చైర్పర్సన్ రాజకుమారి కాళ్లపై çపడి తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుటుంబానికి వచ్చిన కష్టం మరో ఆడబిడ్డ కుటుంబానికి రాకూడదంటూ బోరుమన్నారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బా«ధిత కు టుంబాన్ని చైర్పర్సన్ రాజకుమారి ఓదార్చారు. ప్రభుత్వ పరంగా పక్కా ఇల్లు అందిస్తామని, ఆర్థిక సాయం చేస్తామన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకూ పె చ్చుమీరుతున్న అఘాయిత్యాలను తీవ్రంగా ఖండించారు. తెనాలి, తాడేపల్లిలో ఘటనలు, ఏలూరులో తాజా ఘటన బా«ధిస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలను కమిషన్ సహించేది లేదన్నారు. దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించమని హెచ్చరించారు. దోషులను 24 గంటల్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించారు. బెయిల్ రాకుండా చూడాలన్నారు. నిందితుడికి నెల రోజుల్లో శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కళాశాలలు, వసతి గృహల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశిం చామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మరింత ని ఘా పెంచుతామన్నారు. రాష్ట్ర కమిషన్ సభ్యురా లు రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ కె.విజయకుమారి, కమిషన్ అధికారులు సూయజ్, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ ఎస్‌సీహెచ్ కొండలరావు, ఎస్సై ఐ.వీర్రాజు, పీఓ ఏలూరు తులసి తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలి మృతి
బీబీనగర్ (భువనగిరి) : వివాహానికి పెద్దలు అంగికరించలేదని మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘ టనలో ప్రియురాలి మృతి చెందగా.. ప్రియుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాదకర ఘటన బీబీనగర్ మండలం గూడూరులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన మేకల నవీన్ స్థానిక టోల్‌ప్లాజాలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బింగి స్లావణ్య(19) ఇంటర్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. ఇద్దరి ఇళ్లు ఎదురెదురుగా ఉండడంతో నవీన్, స్లావణ్యల మద్య ఏర్పడిన స్నేహం ప్రేమగా చిగురించింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరి విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పెళ్లి సంబధాలు చూడడం మొదలు పెట్టారు. దీంతో నవీన్‌కు ముందుగా పెళ్లి కుదరడం, ఆ తంతు పనులు జరుగుతుండడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రేమికులిద్దరూ ఆదివారం స్లావణ్య ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఘటనను గమనిం చిన స్థానికులు వారిని సిఇకంద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ స్లావణ్య సోమవారం మృతి చెందింది. నవీన్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా తన కూతురును నవీన్ ప్రేమ వేధింపులకు గురి చేయడంతోనే అత్మహత్యకు పాల్పడిందని స్లావణ్య తండ్రి నర్సింహ్మ బీబీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ సుధాకర్‌గౌడ్ తెలిపారు. -
ప్రియురాలిపై దాడి చేసిన ప్రియుడి అరెస్టు
జ్యోతినగర్(రామగుండం): ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే అనుమానంతో ప్రియురాలిని అంతం చేయాలని చూశాడు ప్రియుడు. ఇందుకు ఆమెపై కత్తితో దాడి చేశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. హత్యాయత్నానికి పాల్పడిన నస్పూరి శ్రీనివాస్(30)ను ఎన్టీపీసీ ఎస్సై శంకరయ్య అరెస్ట్ చేయగా.. వివరాలను గోదావరిఖని ఏసీపీ రక్షిత కే.మూర్తి, రామగుండం సీఐ బి.స్వామి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఆటోనగర్‌కు చెందిన యువతి, భీమునిపట్నంకు చెందిన నస్పూరి శ్రీనివాస్ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. 2013లో యువతికి వేరే వ్యక్తితో వివాహమైంది. అయినా.. శ్రీనివాస్ యువతి వెంటపడ్డాడు. ఆమె భర్త నుంచి విడాకులు ఇప్పించాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని కోరగా వాయిదా వేస్తూ వచ్చాడు. అదే సమయంలో యువతిని అనుమానిస్తూ గొడవపడేవాడు. ఈనెల 21న యువతి ఇంటికొచ్చిన శ్రీనివాస్.. మార్చి 10న వివాహం చేసుకుందామని చెప్పి.. రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. మార్గంమధ్యలో కత్తితో దాడి చేశాడు. బాధితురాలు తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు చేరింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. సోమవారం ఉదయం ఓపెన్‌కాస్ట్–4 ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు. యువతిపై దాడి చేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
రామన్నపేట (నకిరేకల్) : ప్రేమించిన యువకుడితోనే వివాహం జరిపించాలని యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఆదివారం రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాయిగూడెం గ్రామానికి చెం దిన వీరమల్ల ప్రసన్న, అదేగ్రామానికి చెందిన రేపాక గణేశ్‌లు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించు కుంటున్నారు. వీరిద్దరు వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల గణేశ్‌కు వేరే యువతితో వివాహం కుదిరింది. విష యం తెలుసుకున్న యువతి రామన్నపేట పోలీ స్స్టేషన్లో గణేశ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుం టానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని అతడిపై ఈనెల 16న రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు, గ్రామపెద్దలు ఇద్దరికీ పలు దఫాలుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. యువకుడు గణేశ్ ప్రసన్న తనకు సోదరితో సమానమని బుకాయించసాగాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయువతి గణేశ్‌తో వివా హం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆదివా రం కొమ్మాయిగూడెంలో అతడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఆమెకు గ్రామస్తులు, బంధువులు మద్దతు పలికారు. కుటుంబసభ్యులు అక్కడే వంటచేసుకుని భుజించారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సీహెచ్ సాయిలు యు వతి ధర్నా చేస్తున్న ఇంటివద్దకు వెళ్లి ఆమెతో మా ట్లాడారు. మోసంచేసిన యువకుడిపై ఫిర్యాదుచేస్తే కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. తనను ప్రేమించాలని చాలా కాలం వేధించాడని, కులాలు వేరైనా పెద్దలు అంగీకరించక పోయినా తప్పకుండా పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి గణేశ్ తనను మోసం చేశాడని, మధ్యలో తనకు వివాహ సంబంధాలు వచ్చినా చేసుకోనీ యలేదని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. కట్నం డబ్బులకు ఆశపడి తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. అతనితో తన వివాహం జరిపించాలని వేడుకున్నది. జీడీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇచ్చిన యువతి ఆందోళన విరమించలేదు. -
ప్రేమికుడు మోసం చేశాడని.. యువతి ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు తనను ప్రేమించడంతో పాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్ ఎస్సై సీహెచ్.రమేష్‌బాబు కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్‌కు చెందిన బూర్గుల యాకమ్మ, పాపయ్య మనుమరాలు బూర్గుల ప్రవళిక(19)కు తల్లి ఉపేంద్రమ్మ చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో ఆమె అమ్మమ్మ ఇంటి వద్దే ఉంటోంది. ఇదే కాలనీకి చెందిన బల్లెం మార్కయ్య కుమారుడు చంటి, ప్రవళికలు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద మనుషుల వద్ద పంచాయితీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ప్రవళికను పెళ్లి చేసుకుంటానని చంటి కాగితం కూడా రాసి ఇచ్చాడు. అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బల్లెం చంటిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. మృతదేహన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. -
యువకుడి వేధింపులకు విద్యార్థిని బలి
మాగనూర్ (మక్తల్): ప్రేమ పేరుతో వేధింపులకు ఓ విద్యార్థిని బలైంది. ఈ సంఘటన మాగనూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మాగనూర్‌కు చెందిన సౌందర్య(20) హైదరాబాద్‌లో ఉంటూ డిగ్రీ చదువుతుంది.ఈ క్రమంలో మంగళవారం స్వగ్రామానికి వచ్చింది. అయితే మక్తల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం యువకుడు ఏకంగా తన తల్లితోపాటు యువతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడు. అయితే తాను ప్రేమించకున్నా ఇంటికి రావడాన్ని తట్టుకోలేని యువతి అవమానభారంతో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయమై ఏఎస్ఐ మహిభూషన్రెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో సీఐ వెంకట్ అక్కడికి చేరుకొని విద్యార్థిని కుటుంబ సభ్యులతో వివరాలు తెలుసుకున్నారు. -
ప్రేయసితో పెళ్లి కోసం.. సెల్‌టవర్ ఎక్కాడు
మదనాపురం (కొత్తకోట): ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. ఈ సంఘటన బుధవారం మదనాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీధర్ తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని బుధవారం స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ ఆత్మహత్యకు పాల్పడుతానని బెదిరించాడు. దీంతో ఈ విషయం గ్రామం మొత్తం వ్యాపించడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తోటి స్నేహితులు, తల్లిదండ్రులు ఎంతనచ్చజెప్పినా యువకుడు వినిపించుకోకుండా సెల్‌టవర్‌పైనే భీష్మించి కూర్చున్నాడు. చివరికి పోలీసులు రంగప్రవేశం వచ్చి నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో స్నేహితులు, పోలీసులు నీవు ప్రేమించిన యువతితోనే పెళ్లి చేయిస్తామని హామీ ఇవ్వడంతో యువకుడు కిందకి దిగాడు. అనంతరం పోలీసులు యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన
పార్వతీపురం: వాళ్లిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. నువ్వు లేకపోతే నేను లేనంటూ బాసలు చేసుకున్నారు. ఇంతలో యువకుడు ముఖం చాటేయడంతో కథ అడ్డం తిరిగింది. బాధిత యువతి, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జమదాల గ్రామానికి చెందిన కళింగపట్నం పద్మ (రజక కులానికి చెందిన యువతి) అదే గ్రామానికి చెందిన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కొర్ర సంతోష్‌కుమార్ ప్రేమించుకున్నారు. సంతోష్‌ను పూర్తిగా నమ్మిన పద్మ శారీరకంగా దగ్గరైంది. పద్మ తల్లిదండ్రులు సంబంధాలు తీసుకువచ్చినా ఎవర్నీ పెళ్లి చేసుకోవద్దని... తానే చేసుకుంటానని సంతోష్ చెప్పడంతో బాధిత యువతి వచ్చిన సంబంధాలను వదులుకుంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని పద్మ కోరగా కొద్దికాలం నుంచి సంతోష్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా సంతోష్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట పద్మ ప్రియుడి ఇంటిముందు తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించగా.. పెద్ద మనుషుల ముందు సం తోష్ పెళ్లికి ఒప్పుకున్నాడు. మరలా మాట తప్పడంతో పద్మ శుక్రవారం యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేసే వరకూ దీక్ష విరమించేది లేదని బాధితరాలు స్పష్టం చేస్తోంది. మాకు ఇష్టమే.. తమ కుమారుడు సంతోష్‌కి నచ్చితే పెళ్లి చేయడానికి తమకు ఇబ్బంది లేదని యువకుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఈ నాటకమంతా వారే ఆడిస్తున్నారని బాధిత యువతి ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటే చనిపోతామని తల్లిదండ్రులు బెదిరించడం వల్లే సంతోష్ తనతో వివాహానికి వెనకడుగు వేస్తున్నాడని చెప్పింది. ఇదిలా ఉంటే తనతో పాటు తమ కుటుంబ సభ్యులపై దాడి కూడా చేస్తున్నారని ఆరోపించింది. చివరకు ఈ కేసు పార్వతీపురం రూరల్ పోలీసు స్టేషన్‌కు చేరింది. ఎస్సై లోవరాజు ఇరువర్గాలతో మాట్లాడినా సంతోష్ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అనేక మలుపులు..! ప్రేమికుల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఒకసారి చేసుకుంటాను.. మరోసారి చేసుకోను.. అంటూ ప్రియుడు మాట మార్చడం వెనుక కొంతమంది పెద్దల దన్ను ఉందని బాధిత యువతి తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య గొడవలు సృష్టించి ఆ నెపం మామీద వేసి కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రెచ్చిపోయిన ప్రేమోన్మాది..
గంగవరం: ఓ ప్రేమోన్మాది మళ్లీ రెచ్చిపోయాడు. ఈ పర్యాయం యువతి తల్లిదండ్రులు, సోదరుడు, మామయ్యపై తన అనుచరులతో దాడి చేశాడు. కర్రలతో కొట్టి, చితకబాదడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపైనా తిరగబడ్డాడు. తనను ప్రేమించకపోతే అంతుచూస్తానంటూ యువతిని తీవ్రంగా హెచ్చరించాడు. శుక్రవారం ఈ సంఘటన మండలంలోని మార్జేపల్లెలో చోటుచేసుకుంది. బాధితులు కథనం..డిగ్రీ సెకండియర్ చదువుతున్న గ్రామానికి చెందిన ఓ యువతిని జులాయిగా తిరిగే చరణ్‌రాజ్ (25) ఏడాది కాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక ఆరు నెలల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ సమయంలో అతనిపై చర్యలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టు నుంచి చరణ్‌రాజ్ యాంటిసిపేటరీ బెయిల్ పొంది దర్జాగా తిరగసాగాడు. అంతేకాకుండా ఆ యువతిని మరింత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఆ యువతికి తోడుకు బస్ స్టాప్ వరకు ఆమె సోదరుడు చంద్రశేఖర్ వచ్చాడు. ఇది చూసిన చరణ్‌రాజ్ ..తోడుగా వస్తే భయపడతాననుకున్నావా? అంటూ అతడిని దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. దీంతో చంద్రశేఖర్ తన తల్లిదండ్రులు, మామయ్యకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని చరణ్‌రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తెను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. దీంతో ఆగ్రహించి చరణ్‌రాజ్ ఫోన్లో తన అనుచరులు సుబ్బరామయ్య, విశ్వేశ్వరయ్య, జగదీష్, అశోక్, యువరాజు, వెంకటరమణ, అక్కడికి రప్పించి కర్రలతో యువతి తల్లిదండ్రులు, సోదరుడు, మామయ్య మంజుపై దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన గ్రామస్తులు కొందరు వారిని అడ్డుకుని చరణ్‌రాజ్ అతని అనుచరులను మందలించారు. వారిపై కూడా చిందులేసిన చరణ్‌రాజ్ అంతు చూస్తానంటూ యువతి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వెళ్లిపోయాడు. దాడి ఘటనలో గాయపడిన యువతి తల్లిదండ్రులు, అన్న, మామయ్యను చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం యువతి తల్లిదండ్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై సెక్షన్ 354, సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు
కోటపల్లి(చెన్నూర్): ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించింది. కోటపల్లి మండలంలోని పుల్లగామ గ్రామంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. పుల్లగామకు చెందిన నిమ్మల స్వప్న, అదే గ్రామానికి చెందిన ఎతం సమ్మయ్య గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. స్వప్న, సమ్మయ్యది వేర్వేరు కులాలు. స్వప్న అన్నయ్య స్నేహితుడు కావడంతో సమ్మయ్య నిత్యం ఇంటికి వచ్చే వాడు. ఈ క్రమంలో స్వప్న, సమ్మయ్య మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవల స్వప్న పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ప్రియుడు సమ్మయ్య నిరాకరించాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ స్వప్న మంగళవారం సమ్మయ్య ఇంటి ఎదుట పురుగల మందు డబ్బాతో బైఠాయించింది. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రేమ పేరుతో సమ్మయ్య తనను లొంగదీసుకున్నాడని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని పేర్కొంది. స్వప్నకు తెలంగాణ రజక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. స్వప్నకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల మధుకర్ తెలిపారు. కాగా ప్రియుడు సమ్మయ్యతో పాటు కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. -
మైనర్ల ప్రేమ వ్యవహారం... ఒకరి దారుణ హత్య
భీమ్‌గల్: మైనర్ల మధ్య కలిగిన ప్రేమ వ్యవహారం పెద్దల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ వ్యవహారంలో జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానై చివరికి ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. భీమ్‌గల్ మండలంలోని సిద్దపల్లి గ్రామానికి చెందిన కూనె రాజేశ్వర్(50) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి కుమారుడు కూనె రవి భీమ్‌గల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దళితుడైన మృతుడు కూనె రాజేశ్వర్ సమీప బంధువుకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మైనర్ బాలిక తన తండ్రి ఇంట్లో దాచిన రూ.18 వేల నగదును ఈనెల 4న బైక్ కొనుక్కొమ్మని ప్రియుడికి ఇచ్చింది. దీంతో ఆ బాలుడు భీమ్‌గల్‌లో సెకండ్ హ్యాండ్ బైక్ కొనుకున్నాడు. ఈ క్రమంలో బాలిక తండ్రి తన ఇంట్లో డబ్బు గల్లంతైన విషయం గమనించి సదరు మైనర్ బాలుడిపై అనుమానంతో చోరీ నెపం మోపి గ్రామంలో పంచాయతీ నిర్వహించాడు. పెద్దలు విచారించి అసలు విషయం తెలుసుకుని బైక్ అమ్మి నగుదును లింబాద్రికి వాపసు ఇవ్వాలని తెలుపడంతో బాలుడి తరపువారు ఇచ్చేసారు. ఈ విషయాన్ని మనసులో ఉంచుకున్న లింబాద్రి మృతుడు రాజేశ్వర్‌ను దూషించగా, మీ డబ్బులు ఇచ్చినం కదా ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించాడు. దీంతో రాజేశ్వర్‌పై మనసులో కక్ష పెంచుకున్న లింబాద్రి నీ అంతు చూస్తా.. అంటూ వెళ్లిపోయాడు. అయితే గురువారం రాత్రి 12 గంటల సమయంలో రాజేశ్వర్ బహిర్భూమి కోసం గ్రామ పొలిమేరల్లోని చెరువు కట్ట వద్దకు వెళ్లాడు. వెనుక నుంచి లింబాద్రి కర్రతో మోది హత్య చేశాడన్నారు. తన తండ్రి ఎంత సేపటికీ రాకపోయే సరికి అనుమానంతో తాను వెళ్లగా లింబాద్రి సీసీ రోడ్డుపై ఉన్న రక్తం మరకలను కడిగివేస్తున్నాడన్నారు. అనుమానంతో ముందుకు వెళ్లి చూడగా తన తండ్రి రక్తం మడుగులో కొట్టుకుంటున్నాడన్నారు. వెంటనే తాను స్థానికుల సాయంతో ఆర్మూర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారన్నారు. హత్య విషయం తెలిసి ఉదయమే పోలీస్ కమిషనర్ కా ర్తికేయ, ఏసీపీ రాములు, సీఐ సైదయ్యలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. దళిత వ్యక్తిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కర్నె శ్రీధర్ రెడ్డి తెలిపారు. -
ప్రేమ పేరిట వంచన
ప్రేమ పేరిట బాలికను మోసం చేశాడు ఓ యువకుడు. తమకు న్యాయం చేయాలని బాలికతో పాటు తల్లి నాలుగు నెలలుగా గ్రామ పెద్దలు చుట్టూ తిరిగారు. నాలుగు రోజుల కిందట పోలీసుస్టేషన్‌కూ వెళ్లారు. అయినా న్యాయం దక్కలేదు. ఇక న్యాయం జరగదని భావించిన తల్లీకూతుళ్లు పోలీసుస్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్ప డ్డారు. ఈ సంఘటన శనివారం లక్కవరపుకోటలో కలకలం రేపింది. దీనికి సంబంధించి ఎస్ఐ కె.ప్రయోగమూర్తి, బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... లక్కవరపుకోట: మండలంలోని రేగ గ్రామానికి చెందిన బాలిక కళ్లేపల్లి గ్రామానికి చెందిన కోరాడ సాయిశంకర్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. కలిసి తిరిగారు. విషయం కాస్త బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో సాయిశంకర్‌ను నిలదీశారు. నాలుగు నెలల కిందట పెద్దల సమక్షంలో పెట్టారు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టారు. ప్రేమికులకు నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాలని సాయిశంకర్‌కు చెప్పారు. దీనికి ప్రియుడు నిరాకరించాడు. తరువాత పలుసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నాలుగు రోజుల కిందట బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. జరిగిన విషయం చెప్పి న్యాయం చేయాలని పోలీసులను కోరింది. పోలీసులు సాయిశంకర్‌తో పాటు తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను స్టేషనకు రప్పించి చర్చిం చారు. అయినా సాయిశంకర్ నిరాకరించాడు. కేసులొద్దు... తనకు సాయిశంకర్‌తో పెళ్లి చేయాలని, కేసులొద్దని బాలిక పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగింది. స్పందించిన పోలీసులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని చెప్పినా బాలిక ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది. దీంతో చేసేది లేక పోలీసులు మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బాలిక తన తల్లితో పోలీసుస్టేషన్‌కు వచ్చి మరోసారి పోలీసులకు విన్నవించింది. దీంతో ఎస్ఐ, ఏఎస్ఐ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలోనే పోలీ సుస్టేషన్ వెలుపలికి వచ్చి ఇంటి నుంచి తెచ్చుకున్న పురుగుల మందును ఒక్కసారిగా తాగేశారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు విషయం చెప్పారు. తల్లీకూతుళ్లను ఆటోలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించినట్టు చెప్పారు. తల్లీకూతుళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రియుడు కోసం ఆరా... పురుగుల మందు తాగి ఎస్.కోట సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాలిక, తల్లి నుంచి పోలీసులు స్టేట్మెంటు రికార్డు చేశారు. ప్రియుడు సాయిశంకర్ కోసం ఆరా తీస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కౌన్సెలింగ్ చేశాం... ఈ ఘటనపై ఎస్ఐ ప్రయోగమూర్తి మాట్లాడుతూ ఇద్దరు మైనర్లు కావడంతో పలుసార్లు కౌన్సెలింగ్ చేశామని చెప్పారు. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ప్రియుడిపై ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినా బాలిక నిరాకరించడంతో తామేమి చేయలేకపోయామని పేర్కొన్నారు. ఎస్.కోట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీకూతుళ్లు ప్రియుడు సాయిశివశంకర్ -
ప్రియురాలి మరణం తట్టుకోలేక..
వాంకిడి(ఆసిఫాబాద్): ఇంట్లో పెద్దలు ప్రేమకు ఒప్పుకోలేదని తీవ్ర మనస్థాపానికి గురై ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడగా.. అది చూసి ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన వాంకిడి మండలంలోని మహాగాంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్సెంగ్ గౌరుబాయి(18) అదే గ్రామానికి చెందిన మడపచ్చి భరత్(22) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు వరుసకు బావమరుదళ్లు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో గౌరుబాయిని తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. అప్పటి నుంచి మనస్థాపానికి గురైన గౌరుబాయి తన ప్రేమకు తల్లిదండ్రులు ఇక ఒప్పుకోరన్న బాధతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఇంటి పక్కవారు గమనించి మహారాష్ట్రలోని చికిలి పాటన్ గ్రామానికి చెందిన గౌరుబాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో గౌరుబాయి మృతిచెందింది. బహిర్భూమికి వెళ్లి ప్రియుడు.. ప్రియురాలి మరణ వార్త తెలుసుకున్న ప్రియుడు మడపచ్చి భరత్(22) శనివారం ఉదయం బహిర్భూమికి అని వెళ్లి ఇంటి పక్కనే గల చేనులో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే భరత్ స్పృహా కోల్పోతున్న భరత్ జరిగిన విషయాన్ని అన్నయ్య తిరుపతికి చెప్పాడు. దీంతో వెంటనే భరత్‌ను వాంకిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆసిఫాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో భరత్ కూడా మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. చిన్న వయసులోనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదచాయలు కమ్ముకున్నాయి. ఇరువైపులా కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. -
యువకుడి అనుమానాస్పద మృతి
భీమ్‌గల్: మండలంలోని సికింద్రాపూర్ గ్రామాని కి చెందిన మొండి సందీప్(24) అనే యువకుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందా డు. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అవివాహితుడైన సందీప్ బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లి ఆర్నెళ్ల క్రితం గ్రామానికి తిరిగివ చ్చాడు. అయితే బుధవారం ఇంటి నుంచి వెళ్లిన సందీప్ ఎంతకూ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఎన్ని సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు పలుచోట్ల గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం ఉదయం తలోవైపు గాలించిన గ్రామస్తులకు గ్రామ శివారులోని సందీప్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో విగత జీవిగా కనిపించాడు. అక్కడే పొలంలో వాడే క్రిమి సంహారక మందులు ఉన్నాయి. సందీప్‌కు ఎటువంటి సమస్యలు లేవని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవస రం లేదని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. అయితే సందీప్‌కు గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం విషయంలో రెండ్రోజులుగా కొందరితో గొడవ జరుగుతున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో సందీప్ మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం మేరకు భీ మ్‌గల్ ఎస్ఐ– 2 భీమ య్య సంఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్‌కు తరలించారు. అయితే ఆర్మూర్‌లో మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వారు పోస్టుమార్టం చే సేందుకు నిరాకరించి నిజామాబాద్‌కు సిఫారసు చేయడంతో మృతదేహాన్ని నిజామాబాద్‌కు తరలించారు. మృతుడికి తండ్రి లేడు. తల్లి, ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. కాగా సోదరుడు గల్ఫ్ లో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కర్నె శ్రీధర్ రెడ్డి తెలిపారు. -
యువతి మృతి.. ప్రేమ వ్యవహారమే కారణమా..?
చందుర్తి(వేములవాడ): దాదాపు నెలన్నర క్రితం అదృశ్యమైన యువతి చందుర్తి మండలం మల్యాల గ్రామశివారులోని వ్యవసాయబావిలో గురువారం శవమై కన్పించింది. పోలీసుల వివరాల ప్రకారం..చందుర్తి మండల కేంద్రానికి చెందిన చిలుక ప్రియాంక(24) 2018 డిసెంబర్ 7న ఇంట్లోంచి వెళ్లిపోయింది. రెండ్రోజులైనా రాకపోవడంతో తండ్రి కృష్ణహరి డిసెంబర్ 13న పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేశారు. వేములవాడలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న రాజుపై అనుమానం ఉందనడంతో అతడ్ని ఠాణాకు పిలిపించి విచారించారు. థైరాయిడ్ పరీక్షకు ఆస్పత్రికి వచిందని, అంతకన్నా.. తమకేమి తెలియదని చెప్పడంతో వదిలిపెట్టారు. ప్రియాంక్ సెల్‌ఫోన్ డాటా ఆధారంగా పలువురిని ప్రశ్నించారు. వాసన వస్తోందని.. మల్యాల గ్రామానికి చెందిన పెద్దిగిరి గంగయ్యకు సమీప అటవీప్రాంతంలోని గుట్టల్లో వ్యవసాయ పొలం ఉంది. నీరందించేందుకు గురువారం బావివద్దకు వెళ్లాడు. కుళ్లిన వాసన రావడంతో అందులోకి చూడగా శవం కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి కుళ్లిన మృతదేహాన్ని బావిలోంచి వెలికితీసి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ప్రియాంక మృతదేహంగా గుర్తించారు. చందుర్తి సీఐ విజయ్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నివేదిక ఆధారంగా వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. పెళ్లి ఇష్టంలేకనేనా..? వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ అసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తున్న యువకుడితో బైక్‌పై ప్రియాంక తిరిగేదని తండ్రి పోలీసుల ఎదుట వాపోయాడు. ప్రియాంకకు కథలాపూర్ మండలంలోని తన మేనబావతో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. డిసెంబర్ 12న పెళ్లి నిశ్చయానికి ఏర్పాటు చేశారు. ఇంతలోనే ఇంట్లోంచి వెళ్లిపోయి శవంగా మారిందని తల్లిదండ్రులు రోదించారు. -
చెల్లెల్ని ప్రేమించిన వ్యక్తిని కత్తితో పొడిచాడు!
హైదరాబాద్: ప్రేమ వ్యవహారం చివరికి కత్తితో దాడికి దారి తీసింది. ఈ సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చివరికి కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.....కాకతీయనగర్‌కు చెందిన టి. వినయ్ కొన్ని రోజుల నుంచి సమతానగర్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి సోదరితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ విషయమై మంగళవారం భాస్కర్‌రెడ్డి, వినయ్ మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన భాస్కర్‌రెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్‌పై దాడి చేశాడు. దీంతో వినయ్ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వినయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
కూతురి ప్రేమాయణం.. పరువు హత్య!
పావగడ (కర్ణాటక): కూతురు ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతుండటాన్ని అవమానంగా భావించిన ఓ తండ్రి ఆమెను హతమార్చాడు. పావగడ తాలూకా కిలార్లహళ్లి సమీపంలో ఎనిమిది నెలల క్రితం జరిగిన ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పావగడ సీఐ ఆనంద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మడకశిర మండలం తిరుమలదేవరపల్లి (టీడీపల్లి) తండాకు చెందిన శంకరనాయక, గౌరమ్మ కుమార్తె సరిత(18) అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన ఆనందనాయక అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శంకరనాయక కుమార్తెను మందలించాడు. కొన్నాళ్ల పాటు కూతుర్ని బంధువుల ఇళ్లలో ఉంచాడు. అయినా ఆమె మనసు మారలేదు. దీంతో కుమార్తెను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా పావగడ తాలూకాలోని తన అత్త ఊరు కిలార్లహళ్లికి తీసుకెళుతున్నానని చెప్పి గతేడాది సెప్టెంబర్ 22న కుమార్తెతోపాటు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కిలార్లహళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి రాగానే గొంతుకు చున్నీ బిగించి, తలపై బండ రాయితో మోది ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గుర్తు తెలియని యువతి హత్యకు గురైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఓ వ్యక్తి అందించిన సమాచారంతో హత్యకు గురైంది సరిత అని, చంపింది తండ్రేనని నిర్ధారణకు వచ్చారు. నిందితుణ్ని బుధవారం అరెస్ట్ చేసి మధుగిరి కోర్టులో హాజరుపరిచారు. -
ప్రేమజంటకు సహకరించాడని..
కొత్తకోట(మహబూబ్‌నగర్): ఓ బాలిక ప్రేమ వ్యవహారంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ ఆమె బంధువులు శనివారం ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన గుజ్జుల ఊహ (17)అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు ఆనంద్ (22)ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం ఇద్దరూ కలిసి ఎటో వెళ్లిపోయారు. దీంతో మైనర్ కూతురిని కిడ్నాప్ చేశారంటూ ఆమె తండ్రి ఆంజనేయులు కొత్తకోట పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే, పోలీసులు మాత్రం బాలిక తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు. గత నెల 25వ తేదీన ఆనంద్, ఊహ కొత్తకోట పోలీసులను ఆశ్రయించారు. వైద్యులు బాలిక వయస్సు 17 ఏళ్లుగా నిర్ధారించగా పోలీసులు ఆమెను వనపర్తిలోని స్టేట్ హోంకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బాలకృష్ణ (30) శనివారం గ్రామానికి రావటంతో అతన్ని బాలిక కుటుంబ సభ్యులు కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని విడిపించారు. దాడికి పాల్పడ్డ 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. గాయపడ్డ బాలకృష్ణను వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. -
ప్రేమ.. విషాదం
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : ప్రేమ వ్యవహారం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. నాలుగు రోజుల వ్యవధిలో రెండు నిండుప్రాణాలను బలిగొన్నది. ప్రియుడు మోసం చేశాడనే కారణంతో కుమార్తె మృతి చెందగా, ఆమె మృతిపై అనుమానాలు రావడంతో తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హుస్నాబాద్ మండలం గౌరవెళ్లి గ్రామానికి చెందిన ఎండీ.షర్పొద్దీన్ భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామకార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన నాల్గవ కుమార్తె షెష్మా(18) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే గ్రా మానికి చెందిన ఓ యువకుడు, షెష్మా ప్రేమించుకున్నారని సమాచారం. ఈనెల ఒకటిన షెష్మా ఇంట్లో మృతి చెందగా, కుమార్తె మరణం తట్టుకోలేక ఆమె తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. గౌరవెళ్లికి చెందిన ఓ యువకుడు షెష్మాను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని, దీంతో ఆమె క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తండ్రి షర్పొద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షెష్మా మృతదేహానికి హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె క్రిమిసంహారక మందు తాగి చనిపోలేదని, శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని పోలీసులకు నివేదిక ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న షెష్మా గాయాలపాలు కావడంపై పోలీసులు అనుమానించారు. ఆమె శరీరంలోని పలు భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. షెష్మా ఆత్మహత్య చేసుకుందా.. లేక ఇతరత్రా ఏమైనా జరిగిందా.. అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టడంతోపాటు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. షెష్మా ప్రేమ వ్యవహారంతోపాటు ఆమె మృతిపై పదిమందిలో పలు రకాలుగా చర్చ సాగడం ఆ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేసింది. దీంతో మనస్తాపం చెందిన షర్పొద్దీన్ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తె మరణంతో మనోవేదకు గురై షర్పొద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్య రమిజా ఫిర్యాదు చేసినట్లు హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్ తెలిపారు. షెష్మా మృతిపై అనుమానాలున్నాయి.. షెష్మా మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ఆమె క్రిమిసంహారక మందు తాగలేదని, శరీరంపై మూడు చోట్ల గాయాలున్నాయని పోస్టుమార్టంలో తేలిందని సీఐ సదన్‌కుమార్ తెలిపారు. దీంతో గాయాలున్న ఆమె శరీర భాగాలను ఫోరెన్సిన్ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాతే షెష్మా మృతిపై వాస్తవాలు వెల్లడవుతాయని వివరించారు. షర్పొద్దీన్ మృతిపై గ్రామస్తులను విచారించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.