Man Threatens Woman in the Name of Love, Burnt House in Jawahar Nagar - Sakshi
Sakshi News home page

Delivery Boy: డెలివరీ బాయ్‌ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో

Published Wed, Oct 27 2021 7:55 AM | Last Updated on Wed, Oct 27 2021 6:02 PM

Man Threats Woman in the Name Of Love, burnt House In Jawahar Nagar - Sakshi

కాలిపోయిన ఇల్లు

సాక్షి, జవహర్‌నగర్‌: ప్రేమ పేరుతో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడి ఆ ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బీజేఆర్‌నగర్‌కు చెందిన నవీన్‌(23) ఫుడ్‌ డెలివరీ బాయ్‌. రెండు సంవత్సరాలుగా స్థానికంగా ఉండే యువతిని పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు.
చదవండి: Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌..

ఇటీవలే యువతికి వారి తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న నవీన్‌ యువతి బంధువులను బెదిరించి యువతి ఇంటిని తగలబెడతానని హెచ్చరించాడు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు వారి నానమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ నెల 10న ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఈ నెల 23న యువతి ఇల్లు కాలిపోయినట్లు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితులు నవీన్‌ ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement