house burnt
-
ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
-
మణిపూర్ నిందితుడి ఇల్లు దహనం.. కుటుంబం వెలివేత
ఢిల్లీ/ఇంఫాల్: కేవలం 26 సెకండ్ల నిడివి ఉన్న వీడియో.. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చేసి.. ఆపై జరిగిన రాక్షాస క్రీడపై సభ్యసమాజం రగిలిపోతోంది. కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే.. ఈ ఘటనపై ప్రజాగ్రహం మాత్రం చల్లారడం లేదు. ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ సింగ్ ఇంటిని ఓ మూక తగలబెట్టేసింది. పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్ ఇంటిని చుట్టుముట్టిన కొందరు గ్రామస్తులు.. తాళం వేసిన ఆ ఇంటిని టైర్లతో కాల్చేశారు. ఆపై ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా.. భద్రతా బలగాలు ఆ ఊరిలో మోహరించాయి. మణిపూర్‌లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడ్ని వీడియో ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు హుయిరేమ్. అయితే అప్పటికే వీడియో వైరల్ కావడంతో భయంతో కుటుంబాన్ని వేరే చోటకి తరలించి.. తాను మాత్రం మరో చోట తలచాచుకున్నాడు. ఇదీ చదవండి: ఎవరీ మెయితీలు.. కుకీలతో ఉన్న గొడవలేంటంటే.. బుధవారం రాత్రి థౌబల్ జిల్లాను జల్లెడ పట్టిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అకృత్యానికి సంబంధించి మరో ముగ్గురినీ సైతం అరెస్ట్ చేసినట్లు గురువారం సాయంత్రం ప్రకటించారు. వీళ్ల ద్వారా మిగతా నిందితులను పట్టకునే పనిలో ఉన్నారు మణిపూర్ పోలీసులు. Manipur | The main culprit who was wearing a green t-shirt and seen holding the woman was arrested today morning in an operation after proper identification. His name is Huirem Herodas Meitei (32 years) of Pechi Awang Leikai: Govt Sources (Pic 1: Screengrab from viral video, Pic… pic.twitter.com/e5NJeg0Y2I — ANI (@ANI) July 20, 2023 మెయితీల గిరిజన హోదా డిమాండ్‌తో మొదలైన వ్యవహారం.. మే 3వ తేదీన కుకీ-మెయితీల మధ్య ఘర్షణలు మొదలై మణిపూర్ హింసకు ఆజ్యం పోసింది. ఆ సమయంలో ఓ ఫేక్ వీడియో వైరల్ కావడంతో రగిలిపోయిన మెయితీ వర్గం.. కుకీ ప్రజలపై దాడులకు సిద్ధపడింది. ఈ క్రమంలో మే 4వ తేదీన.. బి ఫైనోమ్ గ్రామంలో కర్రలు వంటి ఆయుధాలు చేతపట్టిన సుమారు 800 మంది మెయితీ వర్గానికి చెందిన వారు, కుకీ గిరిజన వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను పోలీసుల నుంచి బలవంతంగా లాక్కెళ్లి.. నగ్నంగా ఊరేగించారు. అడ్డొచ్చిన ఇద్దరిపైనా దాడి చేసి చంపినట్లు(వాళ్లలో 21 ఏళ్ల యువతికి చెందిన తండ్రి, సోదరుడు ఉన్నారు) తెలుస్తోంది. ఆపై ఆ మహిళలిద్దరినీ ఊరేగించి.. సామూహిక లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదీ చదవండి: మే 4న జరిగింది ఇదే.. మణిపూర్ హైకోర్టు ఆదేశాలనుసారం.. ఇటీవల కొన్నిచోట్ల ఇంటర్నెట్ బ్యాన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈ ఈ హేయమైన సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట హఠాత్తుగా ప్రత్యక్షమైంది. బుధవారం సోషల్‌మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. దేశం ఉలిక్కిపడింది. దీంతో వైపు రాజకీయ దుమారం చెలరేగగా.. ప్రధాని మోదీ సైతం నిందితులను వదిలిపెట్టమని ప్రకటించారు. మరోవైపు కేంద్రంతో మాట్లాడిన మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్.. నిందితులకు మరణ శిక్ష పడేలా చూస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా నుంచి వీడియోలను తొలగించాలని కేంద్రం అన్ని ఫ్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మహిళా కమిషన్ సైతం స్పందించి ఆ వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఇక.. ఘటనను హేయనీయమైన చర్యగా అభివర్ణించిన సుప్రీం కోర్టు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనుక చర్యలు తీసుకోకుంటే తామే రంగంలోకి దిగుతామని స్పష్టం చేస్తూ.. వచ్చే శుక్రవారానికి(జులై 28కి) విచారణ వాయిదా వేసింది. ఇదీ చదవండి: మణిపూర్ వీడియో పాతది.. అందుకే.. -
ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. పెళ్లి ఫోటోలు వాట్సాప్‌లో పెట్టడంతో.
సాక్షి, నల్గొండ: తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామానికి చెదిన యువతీయువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. వివరాలు.. గంధమల్ల గ్రామానికి చెందిన వేముల భాను అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం పెళ్లికి సంబంధించిన ఫొటోలను భాను అదే గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ పెళ్లి విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనై యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవండతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇబ్రహీంపట్నం ఘటన.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్‌ను రద్దు చేసిన హైకోర్టు -
సిద్దిపేట జిల్లాలో ఘోరం.. ఎలక్ట్రిక్ వాహనం పేలి ఇల్లు దగ్దం
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పేలుళ్ల కారణంగా వెహికిల్స్ కాలిపోవడమే కాకుండా వ్యక్తులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ ఘటనలు పెట్రోల్ ధరలు మండిపోతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకున్న వారిలో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా సిద్ధిపేట జిల్లాలో చార్జింగ్‌పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోయినా ఇల్లు పూర్తిగా దగ్దమైంది. దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇంటి ముందు చార్జింగ్‌లో పెట్టాడు. అయితే అనూహ్యంగా బైక్ బ్యాటరీ పేలడంతో ఇల్లు పూర్తి కాలి దగ్దమైంది. చదవండి: ట్యాంక్‌బండ్‌పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది! -
డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో
సాక్షి, జవహర్‌నగర్: ప్రేమ పేరుతో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడి ఆ ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌కు చెందిన నవీన్(23) ఫుడ్ డెలివరీ బాయ్. రెండు సంవత్సరాలుగా స్థానికంగా ఉండే యువతిని పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. చదవండి: Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇటీవలే యువతికి వారి తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న నవీన్ యువతి బంధువులను బెదిరించి యువతి ఇంటిని తగలబెడతానని హెచ్చరించాడు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు వారి నానమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ నెల 10న ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఈ నెల 23న యువతి ఇల్లు కాలిపోయినట్లు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితులు నవీన్ ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! -
అరుణాచల్ డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి
-
అరుణాచల్ డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నిరసనకారుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. పోలీసు కాల్పుల్లో శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి మరణించిన ఘటన అనంతరం అరుణాచల్‌లో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ బంగళాను ఆందోళనకారులు దగ్ధం చేశారు. జిల్లా కమిషనర్ నివాసాలకు సైతం ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఎస్పీ స్ధాయి పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. అరుణాచల్‌ప్రదేశేతర షెడ్యూల్డ్ తెగలవారికి శాశ్వత నివాస ధ్రువపత్రాలు జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ ప్రైవేటు నివాసంపైనా ఆందోళనకారులు దాడి చేశారు. మరోవైపు ఘర్షణలు తీవ్రమవుతుండటంతో సైన్యాన్ని రప్పించగా, వారు ఇటానగర్‌లో కవాతు నిర్వహించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు నగరంలో అంతర్జాల సేవలను నిలిపివేసి కర్ఫ్యూ విధించారు. -
ఫైర్ స్టేషన్ ఎదుటే అగ్ని ప్రమాదం
పాలకొండ రూరల్: పాలకొండలోని వీరఘట్టం వెళ్లే దారిలో ఫైర్‌స్టేషన్ ఎదుట జరిగిన అగ్ని ప్రమాదంలో బూరి అప్పన్నమ్మకు చెందిన ఇల్లు, టీ దుకాణం కాలిబూడిదయ్యాయి. అప్పన్నమ్మ తన ఇంటి ముందు టీ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తోంది. సోమవారం సాయంత్రం రోజువారీ సరుకుల కోసం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఈ సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఎదురుగా గ్యాస్ గొడౌన్ ఉండటంలో అక్కడి వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఆ సమయంలో వాహనం ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం విశాఖకు వెళ్లిపోయింది. అక్కడి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికి ఏం చేయలేకపోయారు. దీంతో అప్పన్నమ్మ ఇంటితోపాటు రూ.20 వేలు నగదు, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు -
సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
బెజ్జూర్(సిర్పూర్) : మండలంలోని మర్తడిలో గురువారం రాత్రి స్రవంతికి చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి దగ్దమైంది. ప్రమాదంలో ఇంట్లోని ఆహార ధాన్యాలు, బట్టలు అన్ని పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న బెజ్జూర్ ఎస్సై శివప్రసాద్, తహసీల్దార్ రఘునాధ్‌లు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. సర్పంచ్ ఉమ్మెర పోచక్కలింగయ్య, ఎంపీటీసీ బూస సుశీలసారయ్య, కోఆప్షన్ సభ్యులు బసరాత్ ఖాన్, వార్డు మెంబర్ శంకర్ బాధితురాలిని పరామర్శించారు. బాధిత మహిíßళకు మండల కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నహీర్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్, మండల శాఖ అధ్యక్షుడు దేవనపల్లి సత్యనారాయణ, నాయకులు పూల్లూరి సతీష్, జిల్లాల సుధాకర్‌గౌడ్, శంకర్, పెంటయ్య, బాపు, తిరుపతి, ఎంపీటీసీ తాళ్ళ ఇందిరా రామయ్య, నియోజక వర్గ నాయకులు రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 25కిలోల బియ్యం, బట్టలతో పాటు వెయ్యి రూపాయల నగదు అందజేశారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
అనంతపురం సెంట్రల్ : షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమైంది. వివరాల్లోకెళితే.. నెల్లూరుకు చెందిన భాస్కర్ అనంతపురంలోని సాయినగర్ మెయిన్ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. పానీపూరి వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. టీవీతో పాటు దుస్తులు, సామాన్లు కాలిపోయాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ కె.పి.లింగమయ్య, సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కాస్త ఆలస్యమై ఉంటే పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో లక్ష రూపాయల దాకా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. -
ప్రమాదవశాత్తూ ఇల్లు దగ్ధం
చౌడేపల్లి: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల కేంద్రంలోని నాయిని వారి పల్లిలో ప్రమాదవశాత్తూ ఓ పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన కె.మోహన్, కళావతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ క్రమంలోనే గురువారం కూడా కూలీ పనులకు వెళ్లారు. అయితే తిరిగి వచ్చే సమయానికి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదం ఎలా జరుగుటకు గల కారణాలు తెలియరాలేదు.