ప్రమాదవశాత్తూ ఇల్లు దగ్ధం | house fires in chittor district | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ ఇల్లు దగ్ధం

Published Thu, Aug 6 2015 6:18 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

house fires in chittor district

చౌడేపల్లి: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల కేంద్రంలోని నాయిని వారి పల్లిలో ప్రమాదవశాత్తూ ఓ పూరిల్లు పూర్తిగా కాలిపోయింది.  వివరాలు.. మండల కేంద్రానికి చెందిన కె.మోహన్, కళావతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  ఆ క్రమంలోనే గురువారం కూడా కూలీ పనులకు వెళ్లారు. అయితే తిరిగి వచ్చే సమయానికి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదం ఎలా జరుగుటకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement