షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | house burnt of short circuit | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Published Sat, Dec 10 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

house burnt of short circuit

అనంతపురం సెంట్రల్‌ : షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమైంది. వివరాల్లోకెళితే.. నెల్లూరుకు చెందిన భాస్కర్‌ అనంతపురంలోని సాయినగర్‌ మెయిన్‌ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. పానీపూరి వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో మంటలు వ్యాపించాయి. టీవీతో పాటు దుస్తులు, సామాన్లు కాలిపోయాయి.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఫైర్‌స్టేషన్‌ ఆఫీసర్‌ కె.పి.లింగమయ్య, సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కాస్త ఆలస్యమై ఉంటే పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో లక్ష రూపాయల దాకా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement