
కాలిపోతున్న అప్పనమ్మ ఇల్లు, టీ దుకాణం
పాలకొండ రూరల్: పాలకొండలోని వీరఘట్టం వెళ్లే దారిలో ఫైర్‌స్టేషన్ ఎదుట జరిగిన అగ్ని ప్రమాదంలో బూరి అప్పన్నమ్మకు చెందిన ఇల్లు, టీ దుకాణం కాలిబూడిదయ్యాయి. అప్పన్నమ్మ తన ఇంటి ముందు టీ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తోంది. సోమవారం సాయంత్రం రోజువారీ సరుకుల కోసం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఈ సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఎదురుగా గ్యాస్ గొడౌన్ ఉండటంలో అక్కడి వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
ఆ సమయంలో వాహనం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం విశాఖకు వెళ్లిపోయింది. అక్కడి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికి ఏం చేయలేకపోయారు. దీంతో అప్పన్నమ్మ ఇంటితోపాటు రూ.20 వేలు నగదు, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment