Palakonda
-
పాలవలస కుటుంబానికి జగన్ పరామర్శ (ఫోటోలు)
-
వైఎస్ జగన్ పర్యటన.. పోటెత్తిన పాలకొండ (ఫోటోలు)
-
జగనన్న కోసం పాలకొండలో పోటెత్తిన అభిమానం
-
పాలవలస రాజశేఖరం కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
పాలవలస కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
మన్యం, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. పాలవలస కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్‌సీశ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు.నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అంతకు ముందు రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ఫోన్ ద్వారా ఆ కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు నేరుగా ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.పాలకొండ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ తొలుత విశాఖపట్నం చేరుకున్నారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కాసేపు జగన్ చర్చించారు.పాలసవలస కుటుంబం తరతరాలుగా రాజకీయాల్లో ఉంది. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజశేఖరం.. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. వైఎస్సార్‌తోనూ రాజశేఖరం మంచి అనుబంధం కొనసాగించారు. ఆపై వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రాజశేఖరం తనయుడే. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె. -
బెదిరించారు.. బరితెగించారు
అసలు బలమే లేని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవుల కోసం టీడీపీ అధికార బలంతో బరితెగించింది. సంఖ్యా బలం లేకపోయినా వాటిని బలవంతంగా తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నింది.పిడుగురాళ్ల మున్సి పాల్టీ లో టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకపోయినా సోమవారం జరిగిన ఎన్నికలో వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసైగ మేరకు పోలీసులు, రెవిన్యూ అధికారులు వేధించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చ కండువా కప్పి.. మాదే మెజార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. తుని, పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులను కూడా అదే రీతిలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నిం చినా వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.సాక్షి, నరసరావుపేట/తుని/పాలకొండ: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి అరాచకం çసృష్టించారు. పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని మరచి ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లను భయాందోళనకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లేలా తమవంతు సాయం చేశారు. వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీ చేయడానికి టీడీపీ తరఫున కనీసం ఒక్క కౌన్సిలర్ సైతం లేకపోయినా పోటీలో నిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్ చైర్మన్‌గా ముక్కంటి అనే వ్యక్తిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్‌ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్సార్సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడటంతో మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీకి ఎన్నికను వాయిదా పడింది. అయితే రాత్రికి రాత్రే యరపతినేని ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పాత కేసులు పేరిట వేధించి ఎన్నికకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 17న సోమవారం మరోసారి వైస్ చైర్మన్ ఎన్నికలకు అవకాశం కల్పించింది. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు సుమారు రెండు వారాలు సమయం ఉండటంతో టీడీపీ నేతలు.. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను వేధించడం మొదలుపెట్టారు. తునిలోనూ టీడీపీ బల ప్రయోగం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్ హాల్లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.మరుసటి రోజూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్ తెలిపారు. కాగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చైర్పర్సన్ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్‌కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలును హౌస్ అరెస్ట్ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.బెదిరింపుల పర్వం... వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులను పంపించి స్టేషన్‌కు రావాలని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. మరికొంతమందికి కాంట్రాక్టులు, బిల్లుల పేరుతో తాయిలాలు ఆశచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు రోజూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి కచ్చితంగా మీరు పార్టీ మారాల్సిందేనని ఒత్తిడి చేశారు. యరపతినేని శ్రీనివాసరావు నిర్ణయించిన వైస్ చైర్మన్ అభ్యర్థికే మీరు ఓటు వేయాలంటూ బెదిరించారు. తెలుగుదేశం రౌడీల బెదిరింపులతో కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీంతో పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల బంధువులను బెదిరించి భయపెట్టి వాళ్ల శిబిరంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలా సుమారు 17 మందిని టీడీపీ వైపు లాగేశారు. వారితో వైస్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు వ్యాపారాలను అడ్డుకుంటామని బెదిరించి పార్టీ మారేలా చేశారని పట్టణంలోని ఆర్య వైశ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగక పోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లను పొక్లెయినర్‌తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.పాలకొండలోనూ అదే తీరు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ కుర్చీ కోసం కూటమి నాయకులు వేస్తున్న ఎత్తులు పారడం లేదు. ముచ్చటగా మూడోసారి సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గురు సభ్యులు, బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.కాగా, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 19వ వార్డు కౌన్సిలర్ ఉద్యోగ రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీ నేతలు బలవంతంగా వారి వైపు తిప్పుకున్నారు. ఈ లెక్కన టీడీపీ బలం ఐదుకు చేరిందనుకున్నా, వైఎస్సార్సీపీ బలం 14గా ఉంది. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి సంధ్యారాణి ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచి్చనప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
పాలకొండ టికెట్ జనసేనకే..!
పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం టీడీపీలో టికెట్ ఎవరికి ఇస్తారో తెలియని గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ గ్రూపుల గోలతో తరచూ రచ్చకెక్కుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్ధకంగా మారింది. పాలకొండ టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వర్గ పోరు గతేడాది జూలై 12న చంద్రబాబు చేపట్టిన బస్సుయాత్రలో బహిర్గతమైంది. బస్సు యాత్రకు వచ్చిన చంద్రబాబు వీరఘట్టం అంబేడ్కర్ జంక్షన్లో బహిరంగ సభలో మాట్లాడారు. టీడీపీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు ప్రకటిస్తారని అతని వర్గీయులు ఆశించారు. అయితే చంద్రబాబు కనీసం జయకృష్ణ పేరు ప్రస్తావించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో నియోజకవర్గంలో ఉన్న నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి వర్గీయులు చాపకింద నీరులా ఒకరిపై ఒకరి కత్తులు దూసుకుంటున్నారు. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీలో వీరు వర్గపోరుకు బీజం పోస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వర్గ పోరుకు టీడీపీ అధిష్టానం చెక్ పెట్టేందుకు ఇక్కడ ప్రత్యామ్నాయంగా జనసేన అభ్యర్థికి టికెట్ ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. తమ అభ్యర్థులకు వ్యతిరేకత ఉన్నచోట జనసేనకు టికెట్లు ఇచ్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు టీడీపీ నాయకులే చెబుతుండడం గమనార్హం. ఇక్కడ జనసేనకే టికెట్ ఇస్తే ఇన్నాళ్లు టీడీపీని నమ్ముకున్న నిమ్మక జయకృష్ణకు నిరాశ తప్పదని, భూధేవికి భంగపాటే మిగులుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏది ఏమైనా పాలకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి గెలుపు తథ్యమని, ఈమె హ్యట్రిక్ విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈమె హయాంలోనే పాలకొండ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఫోన్ కాల్స్ కలకలం పాలకొండ టీడీపీ టికెట్ ఎవరికిస్తే బాగుంటుందని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాయిస్‌తో వచ్చిన ఫోన్ కాల్స్ టీడీపీలో కలకలం రేపాయి. ఇవి బోగస్ ఫోన్స్ కాల్స్ అని టీడీపీలో ఓ వర్గం కొట్టిపడేసింది. ఇదిలా ఉండగా 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఇందులో 2004, 2009లో మాజీ ఎమ్మెల్యే దివంగత నిమ్మక గోపాలరావు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వరుసగా 2014, 2019లలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిపై గోపాలరావు తనయుడు జయకృష్ణ టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఇక 2024లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి గెలుస్తుందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. -
సామాజిక సాధికార యాత్ర ఈరోజు షెడ్యూల్
-
పాలకొండలో సామాజిక జైత్రయాత్ర
-
అమ్మా.. నీకిది తగునా..!
పాలకొండ రూరల్: అల్లారు ముద్దుగా లాలించాల్సిన నాలుగేళ్ల చిన్నారిపై ఓ తల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. చెప్పినమాట వినలేదన్న కోపంతో చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి తన విధులకు వెళ్లిపోయింది. చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానికులు తండ్రికి సమాచారం ఇవ్వడంతో కట్లబంధం నుంచి విముక్తి కలిగింది. వివరాల్లోకి వెళ్తే... పాలకొండ ఇందిరానగర్ నివసిస్తున్న కెల్ల శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రోజులాగానే భర్త హోటల్ çపనులు చేసేందుకు వెళ్లిపోయాడు. భార్య లక్ష్మి కూడా ఓ వసతి గృహంలో తాత్కాలిక సహాయకురాలిగా పనిచేస్తోంది. ప్రతిరోజు తన నాలుగేళ్ల పెద్దకుమార్తె పూరి్ణమను అంగన్వాడీ కేంద్రానికి పంపించి చిన్నకుమార్తెను తీసుకుని విధులకు హాజరయ్యేది. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లనని పూర్ణిమ శుక్రవారం మారాం చేసింది. ఎంత చెప్పిన వినకపోవడంతో సహనం కోల్పోయిన తల్లి... పూర్ణిమ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి తమ ఇంటికి ఎదురుగా ఉన్న ఓ ఇంటి వద్ద కూర్చోబెట్టి చిన్నకుమార్తెను తీసుకుని విధులకు వెళ్లిపోయింది. తల్లితండ్రులు ఇద్దరూ ఇంటి వద్ద లేకపోడం, కదిలేందుకు వీలులేకుండా ఉన్న కట్లబంధనంలో చిన్నారి కన్నీరు కార్చుతూ ఉండిపోయింది. దీనిని గమనించిన స్థానికులు విషయాన్ని తండ్రి శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఆయన వెంటనే వచ్చి కుమార్తె కట్లు విప్పాడు. భార్య చేసిన పనికి కోపంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తనపై కోపంతో తరచూ ఇటువంటి చర్యలకు పూనుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్ఐ బి.శివప్రసాద్ చిన్నారి తల్లితండ్రులిద్దరినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బతుకు బాటలో కలిసి నడిచి.. కష్టంలోనూ ఒక్కటిగా
సాక్షి, శ్రీకాకుళం(పాలకొండ రూరల్): రెక్కల కష్టం నమ్ముకొని జీవించే కుమ్మరి దంపతుల కుటుంబం అప్పులు ఊబిలో కూరుకుపోయింది. కరోనా కష్ట సమయంలో తాము నమ్ముకున్న ఇటుక బట్టీ నడవక పోవటంతో దొరికిన చోటల్లా అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అయితే కోవిడ్ తగ్గుముఖం పట్టినా వారు చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయి. ఇటుకల బట్టీ సక్రమంగా నడవకపోవటంతో అప్పు ఇచ్చినవారికి ముఖం చూపించలేని పరిస్థితి దాపురించింది. ఏమి చేయాలో పాలుపోక చావే శరణ్యమని భావించారు. గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టారు. బతుకు బాటలో కలిసి నడిచిన వారు కష్టంలోనూ ఒక్కటిగా తనువులు చాలించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాద ఘటనలో భర్త మరణించగా భార్య మృత్యువుతో పోరాడుతోంది. ఈ సంఘటన పాలకొండ మండలం చిన్నమంగళాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగవరపు రామారావు (47), తవిటమ్మ దంపతులు. వృత్తిరీత్యా కుమ్మరులు కావటంతో గ్రామ సమీపంలో ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు గౌరితో కలసి ఉంటున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఇటుకల తయారీ పనులు నిలిచిపోవడంతో ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. దీంతో చేసేది లేక తెలిసిన వారివద్ద, దొరికినచోటల్లా అప్పులు చేసి కాలం నెట్టుకొచ్చారు. అయితే పనుల్లేక.. చేసిన అప్పులు తీర్చే దారిలేక లోలోన కుంగిపోయారు. చేసేది లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం అందరితో కలివిడిగా ఉన్న వీరు ఆ రాత్రి గడ్డి నివారణకు వాడే మందును ఇంట్లోనే తాగేసి అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో కుమారుడు గౌరి నీరు తాగేందుకు ఇంట్లోకి వెళ్లగా తల్లిదండ్రులు స్పృహతప్పి పడిపోయి ఉండటాన్ని గుర్తించాడు. చదవండి: (విషాదం: బిడ్డ మరణాన్ని తట్టుకోలేక...) చుట్టపక్కల వారికి తెలియజేయటంతో వారు వచ్చి రామారావు, తవిటమ్మలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రామారావు మరణించగా తవిటమ్మ మృత్యువుతో పోరాడుతోంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం వైద్యులు శ్రీకాకుళం రిఫర్ చేయగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ జి.శంకరరావు, ఎస్సై సీహెచ్ ప్రసాద్‌లు మంగళవారం చిన్నమంగళాపురం వెళ్లి దర్యాప్తు చేపట్టారు. రామారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కుమారుడు గౌరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తవిటమ్మ వద్ద వీడియో రూపంలో వాంగ్మూలం సేకరించగా అప్పులు బాధలే కారణమని ఆమె తెలిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులు తీసుకున్న నిర్ణయంతో చిన్నమంగళాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఇంటినే వ్యభిచార గృహంగా మార్చిన మహిళ.. పదేళ్లుగా అమ్మాయిలతో గుట్టుగా..
శ్రీకాకుళం: పాలకొండ పట్టణం.. గటాలడెప్పి వీధిలోని ఒక ఇంట్లో జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. సోమవారం సాయంత్రం ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు పక్కాగా దాడిచేసి నలుగురు విటులతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన ఒక మహిళ తన ఇంటినే వ్యభిచార గృహంగా నడుపుతోంది. గత పదేళ్లుగా ఈ వ్యవహారాన్ని గుట్టుగా సాగిస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తోంది. దీన్ని గమనించిన స్థానికులు అందించిన సమాచారంతో ఇంటిపై దాడి చేయగా నలుగురు యువకులు, ఒక మహిళ పట్టుబడినట్లు ఎస్సై చెప్పారు. యువకులపై కేసు నమోదు చేశామని, సంబంధిత మహిళను ఆసుపత్రికి తరలించామన్నారు. నిర్వహకురాలుని అదులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై చెప్పారు. -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కళావతి
సాక్షి,శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎటువంటి సాయం అందక కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రునికి పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సాయమందించారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో సీతంపేట మండలం పత్తికగూడ మీదుగా వస్తున్న ఎమ్మెల్యేకు రహదారి పక్కన ప్రమాదానికి గురైన క్షతగాత్రుడు కనిపించాడు. అతడుపాలకొండ మండలం ఓని గ్రామానికి చెందిన కనపాక రాంబాబుగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న రాంబాబును ఎమ్మెల్యే తన వాహనంలో వ్యక్తిగత సిబ్బంది ద్వారా బాధితున్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు. సిబ్బంది దగ్గరుండి చికిత్స చేయించారు. -
ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి: శ్రావణి
లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండడంతోపాటు.. అందుకు తగ్గట్టుగా సాధన చేస్తే ఉన్నత శిఖరాన్ని చేరుకోవడం ఖాయమని పాలకొండ డీఎస్పీ మల్లంపాటి శ్రావణి అన్నారు. కృషి.. పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని చెప్పారు. 2018 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన ఈమె అప్పటి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 14, మహిళా విభాగంలో నాలుగో ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలుత కృష్ణా జిల్లా బందర్ సబ్‌డివిజన్ ఇన్చార్జి డీఎస్పీగా విధులు నిర్వహించిన శ్రావణి ఈ నెల 19న పాలకొండ పోలీస్ సబ్‌డివిజన్ అధికారిగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆమెను కలిసిన ‘సాక్షి’తో ముచ్చటించారు. – పాలకొండ రూరల్ సాక్షి: మీ కుటుంబ నేపథ్యం? డీఎస్పీ: మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. అక్కడ బీఈ ఎలక్ట్రానిక్స్ చదివా. తండ్రి గాంధీ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శేషపద్మ గృహిణి. నాకో సోదరుడు ఉన్నారు. సాక్షి: పోలీస్ శాఖను ఎంచుకోవడంలో ఉద్దేశం? డీఎస్పీ: మిగాతా ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే పోలీస్ శాఖ ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్స్‌కు సిద్ధమై విజయం సాధించాను. సాక్షి: భవిష్యత్ లక్ష్యాలు? డీఎస్పీ: ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి వచ్చాను. అన్నివర్గాల ప్రజలకు చట్టం సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం. భవిష్యత్‌లో ఎక్కడ విధులు చేపట్టినా మంచి పేరు తెచ్చుకోవాలి. ఓ ఉద్యోగిగానే కాకుండా ప్రజలు మెచ్చిన అధికారిగా ఉంటా. సాక్షి: పాలకొండలో తొలి పోస్టింగ్ కదా.. ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తారు? డీఎస్పీ: ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల భద్రత, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాను. ఏజెన్సీ కలబోసి ఉన్న ఈ సబ్‌డివిజన్‌లో సారా అమ్మకాలు, తయారీపై కఠినంగా వ్యవహరిస్తా. సమస్యల పరి ష్కారం కోరి వచ్చిన వారితో గౌరవంగా సిబ్బంది మెలి గేలా చొరవ తీసుకుంటా. ట్రాఫిక్ సమస్యను గాడిలో పెట్టేందుకు ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై అపోహలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా. సాక్షి: ఈ సబ్‌డివిజన్‌లో ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతాలున్నాయి. మావోల ప్రభావం కూడా ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఎస్పీ: సరిహద్దు గ్రామాల వద్దగల చెక్ పోస్టులు మరింత పటిష్టంగా నిర్వహిస్తాం. గస్తీ, ముందస్తు సమాచార సేకరణపై దృష్టిసారిస్తా. మా పరిధిలో గల పోలీస్ స్టేషన్లను పరిశీలించి, లోపాలు గుర్తించి ఉన్నతాధికారుల సూచనలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నాకు తెలిసి మావోయిస్టుల ప్రభావం గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం లేదు. సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎటువంటి చర్యలు చేపడతారు? డీఎస్పీ: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరించనుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపడతాం. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని ముందుగానే బైండోవర్ చేస్తాం. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తాం. సాక్షి: నేటితరం యువతకు, ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు? డీఎస్పీ: యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. లక్ష్యం కోసం కృషిచేస్తే కోరుకునే ఆనందం దక్కుతుంది. ఆ లక్ష్యం చేరుకున్నప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుంది. కన్నవారు సంతోషిస్తారు. ఈ ప్రాంత ప్రజలకు శాఖా పరంగా అందుబాట్లో ఉంటా. ఏ సమస్య ఉన్నా నేరుగా కలిసి తెలియజేయవచ్చు. -
ఆయన దారి.. జాతీయ రహదారి
ఎక్కడి అరదలి.. ఎక్కడి ఢిల్లీ. ఎక్కడి కుగ్రామం.. ఎక్కడి రాజధాని నగరం! కాలినడకకు ఆనాడు మామూలు బాట కూడా లేని వెనుకబడిన వాతావరణం నుంచి.. నిరాశాజనక నేపథ్యం నుంచి ఇంత దూరం ప్రయాణం అంటే.. నేడు అత్యున్నత స్థాయి పదవీ పురస్కారమంటే.. అదో అద్భుతం కాదూ.! అదో అసాధారణం కాదూ! నీకూ నాకూ అది అసాధ్యమేమో. కానీ తనకు మాత్రం అది సాధ్యమని ఒక్కడు నిరూపించాడు. నడిచే సంకల్పమే ఉంటే ఎంతదూరమైనా.. ఎంత దుర్భరమైనా.. మంచినీళ్ల ప్రాయమని మన హైవే మీద నిలబడి మరీ ప్రపంచానికి చాటి చెప్పాడు. అతి సామాన్య పరిస్థితుల నుంచి వచ్చిన అతడు ఆత్మస్థైర్యంతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. తానే ఓ శిఖరమై నిలిచాడు. అతడే బుగత మురళీధరరావు. కుగ్రామం నుంచి వచ్చి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిని అందుకున్న ఆ సంకల్ప ధీరుడి విజయాన్ని వర్ణించాలంటే నిజంగా మాటలు రావు. పేరు బుగత మురళీధరరావు. కొలువు ఎన్హెచ్ఏఐలో చీఫ్ జనరల్ మేనేజర్. స్వస్థలం పాలకొండ మండలం అరదలి గ్రామం... ఈ సాధారణ పరిచయం ఆయనకు సరిపోదు. మట్టి దారుల్లో నడుస్తూ అత్యున్నత శిఖరాలను పాదం కింద ఉంచుకోవచ్చని తెలిపే ఆయన ప్రయాణం అందరికీ తెలియాలి. జీరో నుంచి నడక మొదలుపెట్టి హీరోగా పరుగులు పెడుతున్న ప్రస్థానం అంతా తెలుసుకోవాలి. తండ్రికి ఉద్యోగం పోయి, అన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల నుంచి ఆయన ఎదిగిన వైనం స్ఫూర్తి రగిలించాలి. రోడ్డే లేని ఊరిలో చదివిన రోజుల నుంచి రహదారుల శాఖలో అత్యున్నత పదవి అధిరోహించే వరకు ఆయన సాగించిన విజయ విహారాన్ని ఓ బ్లాక్‌బస్టర్ సినిమాను తెరపై చూసినంత ఇష్టంగా ఆస్వాదించాలి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం కుగ్రామం నుంచి.. పాలకొండ మండలం అరదలి గ్రామం జిల్లా వాసులకే తెలీని ఓ చిన్న పల్లెటూరు. పాలకొండకు దాదాపు 5 కిలోమీటర్లలో ఉంటుంది. బొబ్బిలి ఇనాం గ్రామం. 1987 వరకు ఈ ఊరికి రోడ్డు కూడా లేదు. ఆ ఊరిలో పుట్టి అక్కడే చదువుకున్న మురళీధర్ ఇప్పుడు జాతీయ రహదారుల శాఖలో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఉత్తర భారతీయుల ఆధిపత్యం ఉండే ఈ శాఖలో ఫైనాన్స్ విభాగానికి చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఢిల్లీలో గురువారం బాధ్యతలు స్వీకరించడం గొప్ప విశేషం. ఈ విజయం వెనుక ఓ కథ దాగి ఉంది. ఆ కథ తెలియాలంటే ముందు మురళీ తండ్రి గురించి తెలియాలి. మురళీధర్ తండ్రి జోగినాయుడు అరదలి గ్రామ కరణంగా పనిచేశారు. 1987లో గ్రామ ఉద్యోగుల వ్యవస్థను ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఉన్న కరణం ఉద్యోగం పోయింది. కుటుంబ పోషణ కష్టంగా మారింది. పెద్ద కొడుకు కృష్ణారావు విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవారు. కుటుంబమంతా ఆశలన్నీ పెద్ద కొడుకుపైనే పెట్టుకుంది. అప్పటికి మురళీ ఇంకా చిన్న పిల్లాడే. ఇలాంటి సమయంలో కృష్ణారావు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి జోగినాయుడుకు పరీక్ష కాలం మొదలైంది. కష్టకాలం.. ఉద్యోగం పోయింది. పెద్ద కొడుకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మానసికంగా కుంగిపోతారు. కానీ జోగినాయుడు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగారు. అరదలిలోనే నాగవంశం వీధిలో కిరాణ దుకాణం ప్రారంభించారు. మిగిలిన దుకాణాలతో పోటీపడలేక నష్టపోయారు. చివరికి కన్న ఊరును, ఉన్న ఇంటిని విడిచిపెట్టి పాలకొండ వలసపోయారు. మంచి కరణంగా పేరున్న జోగినాయుడు తన కలాన్నే నమ్ముకున్నారు. ఆ కలంతోనే పిల్లలను ప్రభుత్వ బడుల్లోనైనా చదివించారు. నాన్న కష్టం గమనించి.. సొంత గ్రామంలో ఐదో తరగతి వరకు, పాలకొండలోని ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్లు చదివిన మురళీధర్ నాన్న కష్టాన్ని కళ్లారా చూశారు. చదువులో ఎప్పుడూ వెనకబడలేదు. బీటెక్‌లో సీటు రావడం ఆయన జీవితం మేలిమలుపు. అదే ఊపులో ఎంఈ కూడా చేశారు. సింగరేణిలో ఇంజినీర్ ఉద్యో గం వచ్చింది. దాదాపు 30 ఏళ్లు సింగరేణిలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. అక్కడితో ఆగిపోతే ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం ఎందుకవుతుంది. అన్నేళ్లు పనిచేశాక కూడా మురళీధర్ విద్యా దాహం తీరలేదు. మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలనే ధ్యేయం పెట్టుకున్నాడు. జాతీయ స్థాయి అధికారికి కావాల్సిన అర్హత కోసం ఐసీడబ్ల్యూఏ పరీక్ష రాశారు. దేశంలో 48వ ర్యాంకు వచ్చింది. ఆయనకు గల అర్హతలను, సింగరేణికి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల శాఖకు తీసుకొచ్చింది. లక్షా 30వేల కోట్ల బడ్జెట్ గల విభాగం అది. ఫైనాన్స్ విభాగానికి జనరల్ మేనేజర్‌గా వెళ్లిన మురళీధర్ తన నిబద్ధతను, నిజాయితీ సేవలను నిరూపించుకున్నారు. కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వ విభాగం ఆయనను చీఫ్ జనరల్ మేనేజర్‌గా ప్రమోట్ చేసి అదే ఫైనాన్స్ విభాగానికి అధిపతిని చేసింది. కృషి ఉంటే.. కృషి, నిబద్ధత, ధ్యేయం ఉంటే మనిషి ఏ స్థాయికైనా చేరగలడని ‘ఫోన్’లో సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ మురళీధర్ అన్నారు. డబ్బు కంటే చదువు గొప్పదనే సత్యం అందరికీ తెలియాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు దీన్ని గుర్తించాలన్నారు. ఢిల్లీలో తాను ఉన్నా తన పల్లె అరదలిని మరచిపోలేనని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు గతం కన్నా మేలు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి తన కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో మురళీధర్‌ను గుర్తు చేసుకున్న బాల్య మిత్రుల్లో నల్లి ధర్మారావు ఒకరు. మురళీతో బాల్య స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ తనతో వీధుల్లో, పొలాల్లో తిరిగిన మిత్రుడు ఈ స్థాయికి చేరడం తనకు ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర జర్నలిస్టు యూనియన్ నాయకుడు నల్లి ధర్మారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మురళీ ఈ స్థాయికి చేరడం చాలా ఆనందంగా ఉందని, ఊరి పేరును ఢిల్లీ స్థాయిలో నిలబెట్టడం గర్వకారణమని ధర్మారావు తండ్రి, గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన 94 ఏళ్ల కృష్ణంనాయుడు చెప్పారు. నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లి శివప్రసాద్ మాట్లాడుతూ ఏ స్థాయికి చేరినా అహంలేని మనిషి, మూలాలు మరచిపోలేని నిరాడంబరుడని ఆనందం వ్యక్తం చేశారు. -
ఎంత పనిచేశావమ్మా..!
సాక్షి, పాలకొండ: ఆ విద్యార్థిని చదువే లోకం అనుకుంది... కష్టజీవులైన తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని తపన పడింది... టెన్త్, ఇంటర్ ఫస్టియర్‌లో మంచి మార్కులు సాధించి, శుక్రవారం వెలువడిన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో పరీక్ష తప్పడంతో మనస్తాపం చెందింది... ఇంతటితో ఏం అయిపోలేదని, పడి లేచిన కెరటంలా విజయ తీరాన్ని చేరవచ్చని తెలుసుకోలేకపోయింది... బలవంతంగా ప్రాణాలు తీసుకుంది... కన్నవారికి కన్నీళ్లు మిగిల్చింది. పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. దూశి లక్ష్మణరావు, సరోజిని దంపతుల ఏకైక కుమార్తె అయిన స్వర్ణలత (17) శనివారం తెల్లవారేసరికి విగత జీవిగా కనిపించింది. ఏకైక కుమార్తె కావడంతో... స్వర్ణలత తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డాక్టర్ కావాలన్న ఆశతో ఆమె ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకుంది. తొలి ఏడాది మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. శుక్రవారంనాటి ఫలితాల్లో రెండు పరీక్షలు తప్పడాన్ని తట్టుకోలేకపోయింది. కన్నీరు పెట్టుకుంది. ఇంట్లో ముభావంగా ఉండిపోయింది. తల్లిదండ్రులు నచ్చచెప్పటంతో కొంతమేర ఆ కష్టం నుంచి ఉపశమనం పొందినట్లు కనిపించింది. కానీ రాత్రి అన్నం తిన కుండా పడుకుంది. ఉదయానికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చా లించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఏకైక కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. చదవండి: వారిపై హింస, అకృత్యాలు భారత్‌లోనే కాదు.. ఇంటర్ ఫెయిల్ కావటంతో ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాలనీలో, కళాశాలలో అందరితో కలివిడిగా ఉండటంతో విషయం తెలుసుకున్న సన్నిహితులు, కాలనీవాసులు మృతురాలి ఇంటి వద్దకు చేరుకుని రోదించా రు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి లక్ష్మణరావు ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు, సీపీఎం సభ్యుడు కావటంతో ఆటో డ్రైవర్లు ఆయనను పరామర్శించేందుకు ఆసుపత్రికి చేరుకున్నా రు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి దావాల రమణారావు, కాదరాము తదితరులు ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి విద్యార్థిని స్వర్ణలత ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఈ విధంగా అనాలోచిత నిర్ణయాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని హితవు పలికారు. మృతురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంటర్ తప్పిన విద్యార్థి అదృశ్యం రేగిడి: కొమెర గ్రామానికి చెందిన వావిలపల్లి సత్యనారాయణ (సాయిరాం) అదృశ్యమయ్యాడని ఎస్సై బి.రేవతి శనివా రం విలేకరులకు తెలిపారు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం పరీక్ష తప్పడంతో సత్యనారాయణ మనస్థాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడని తండ్రి కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. -
నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు
కొత్తూరు: మద్యం షాపులు, రద్దీగా ఉండే చిల్లర దుకాణాలే లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. గత కొద్ది రోజులుగా కొత్తూరు, భామినితోపాటు పలు గిరిజన ప్రాంతాల్లో జోరుగా సాగుతున్న ఈ తంతుపై గత నెల 22న ‘నకిలీ నోట్లు చలామణి’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన పోలీసులు కొన్ని రోజుల నుంచి నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1,23,400 నకిలీ నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. ఈ మేరకు కొత్తూరు పోలీసు స్టేషన్లో శుక్రవారం పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం... కేసు దర్యాప్తులో భాగంగా స్థానిక ఇన్చార్జి సీఐ రవిప్రసాద్, ఎస్ఐ బాలకృష్ణ, కానిస్టేబుల్ బాబూరావు రవికుమార్, ఎస్పీవో ప్రసాద్‌పాత్రో మండలంలోని నివగాం బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అయిదుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారిలో కొత్తూరు మండలం ఎన్ఎన్ కాలనీకి చెందిన మీసాల ప్రకాష్ అలియాస్ ప్రశాంతకుమార్, ఇదే మండలం మహసింగి గ్రామానికి చెందిన షేక్ నబీ, భామిని మండలానికి చెందిన పొట్నూరు రామారావు, ఒడిశా రాష్ట్రం సార గ్రామానికి చెందిన రామచంద్ర సుందరరరావు పాత్రో, అదే రాష్ట్రం కాశీనగర్‌కు చెందిన సాసుబిల్లి రాజేష్ ఉన్నారు. వీరి నుంచి రూ. 2 వేలు, రూ.500, రూ. 200, రూ. 100 నకిలీ నోట్లు మొత్తం రూ. 1,23,400 స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో ఏ1 నిందితుడు ప్రకాష్‌పై 2017లో నకిలీ కరెన్సీ కేసు నమోదై ఉండటం గమనార్హం. ఈయన కొంతకాలంగా దీనికి దూరంగా ఉన్నాడు. మరలా నకిలీ కరెన్సీ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ముఠా సభ్యులకు ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ తయారైన నకిలీ నోట్లను తీసుకొచ్చి మన జిల్లాలో వస్తువులు కొనుగోలు చేసి చలామణి చేసేవారు. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేస్తేగాని, నకిలీ నోట్ల బాగోతం బయటపడదని డీఎస్పీ తెలిపారు. ఇటువంటి ముఠాల ఊబిలో పడి అమాయక ప్రజలు మోసపోవద్దని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సీఐ రవిప్రసాద్, ఎస్ఐ బాల కృష్ణ, పీసీలు బాబూరావు, రవికుమార్, హెచ్‌సీ చంద్రినాయుడు, రాంబాబు పాల్గొన్నారు. ఇన్నాళ్లు గోప్యంగా ఎందుకు ఉంచినట్టు...! నకిలీ నోట్ల చలామణి వ్యవహారంపై సాక్షిలో కథనం రాగానే అప్రమత్తమైన పోలీసులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. అయితే నకిలీ నోట్ల ముఠాను మూడు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ వివరాలు ఇంతవరకు గోప్యంగా ఉంచి, తాజాగా డీఎస్పీ సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠా వెనుక పెద్ద తలకాయల హస్తం కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వారిని తెరముందుకు తెస్తారో.. లేదో చూడాలి. -
ఏ కష్టమొచ్చిందో...
పాలకొండ రూరల్: అప్పటి వరకు రోగులకు సేవలు చేస్తూనే ఉంది.. విధి నిర్వహణలో భాగంగా వైద్యులకు సహాయమందించింది.. అంతలో ఏమైందో.. ఏ కష్టం ఆమెను కుంగదీసిందో గానీ ఆస్పత్రి డ్యూటీ రూమ్‌లోనే స్పాఫ్‌నర్స్ బలవన్మరణానికి పాల్పడింది.. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులతోపాటు సహచర ఉధ్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. పాలకొండ వంద పడకల ఏరియా ఆస్పత్రిలో కాకర్ల హేమలత (32) 2016 నుంచి స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. స్వగ్రామమైన రాజాం నుంచి నిత్యం విధి నిర్వహణలో భాగంగా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఎప్పటిలాగే బీ–షిఫ్ట్ విధులకు మధ్యాహ్నం రెండు గంటలకు ఆస్పత్రికి చేరుకున్న ఆమె సాయంత్రం వరకు యధావిధిగా విధులు నిర్వహించారు. తమతో మామూలుగానే వ్యవహరించిందని సహచర నర్సులు, డ్యూటీ డాక్టర్లు చెబుతున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తన డ్యూటీ రూమ్‌కు వెళ్లిన ఆమె గంట వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఎప్పటికీ స్పందించకపోవటంతో కుటుంబీకులు సహచర సిబ్బందికి ఫోన్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది డ్యూటీలో ఉన్న వైద్యాధికారి డి.వి.శ్రీనివాస్‌కు ఈ విషయం తెలియజేశారు. తక్షణమే స్పందించిన వైద్యాధికారి ఆమె ఉన్న గది వద్దకు వెళ్లి తలుపును తట్టారు. ఎంతకూ తలు పు తీయకపోవటంతో కిటికి నుంచి చూడగా హేమలత ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే గది తలుపులు తెరచి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శోక సముద్రంగా మారిన ఆస్పత్రి... అప్పటి వరకు తమతో మామూలుగా విధులు చేపట్టిన హేమలత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న సహోద్యోగులు శోక సముద్రంలోకి మునిగిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో ఖిన్నులైపోయారు. ఏం కష్టం వచ్చిందోనని రోదించారు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ జె.రవీంద్రకుమార్, స్త్రీవైద్య నిపుణురాలు భారతి ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. గుండెలు బాదుకున్న కుటుంబ సభ్యులు రాజాం నగర పంచాయితీ లచ్చయ్య పేటలో నివాసముంటున్న సూరయ్య, సరస్వతి దంపతులకు ఆరుగురు కుమార్తెలు. వీరిలో ఆఖరి కుమార్తె హేమలత. కుటుంబానికి ఎంతో ఆసరాగా మెలిగేదని, ఎందుకిలా చేసిందో తెలీడం లేదని మృతురాలి పెద్దక్క పుణ్యవతి గుండెలు బాదుకుని రోదించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సనపల బాలరాజు సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరకుని మృతదేహం ఉన్న తీరును పరిశీలించారు. అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, బతకాలని లేదని రాసి ఉన్నట్లు వార్తలు వినిపించాయి. దీనిని పోలీసులు ధ్రువీకరించలేదు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై స్పష్టం చేశారు. లచ్చయ్యపేటలో విషాదఛాయలు రాజాం సిటీ: రాజాం నగర పంచాయతీ పరిధి లచ్చయ్యపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. లచ్చయ్యపేటకు చెందిన కాకర్ల హేమలత (33) పాలకొండ ఏరియా ఆస్పత్రిలో గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె మృతితో లచ్చయ్యపేటవాసులు విచారంలో మునిగిపోయారు. -
పాలకొండలో కారు బీభత్సం..
సమయం మధ్యాహ్నం ఒంటి గంట... అప్పుడే కళాశాలలు, పాఠశాలలకు భోజన విరామం ఇచ్చారు... ఇంతలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్నట్లుండి హాహాకారాలు... రోడ్డుపై పాదచారులు పరుగులు తీస్తున్నారు. ఈ హఠాత్పారిణామంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం... ఏమైందో తెలుసుకునేలోపే ఓ ఎరుపు రంగు ఇండికా కారు ప్రజలపైకి అమాంతం దూసుకు వచ్చేసింది. నాలుగు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసింది. ఇద్దరిని గాయాల పాల్జేసింది. ఈ ఘటన శుక్రవారం శ్రీకాకుళం– పాలకొండ ప్రధాన రహదారిపై తీవ్ర కలకలం రేపింది. పాలకొండ రూరల్: పట్టణంలోని గారమ్మ కాలనీకి చెందిన ఆర్మీ ఉద్యోగి సంతోష్ తన ఇండికా కారులో శ్రీకాకుళం రహదారి నుంచి పట్టణంలోకి వస్తున్నాడు. ఈ సమయంలో స్థానిక వడమ కూడలికి వచ్చేసరికి ఉన్నట్లుండి తన వాహనం అదుపు తప్పి మితిమీరిన వేగంతో జనాలపైకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో సమీప పాఠశాలలో పిల్లలకు భోజనం పెట్టి వస్తున్న వారణాశి ప్రతిభ, బూర్జ మండలం పాలవసకు చెందిన వృద్ధుడు పోమాటి చిన్నంనాయుడును వెనుక నుంచి కారు బలంగా ఢీ కొట్టింది. వారు ఉన్నపళంగా గాలిలోకి ఎగిరి కారు ముందు భాగంపై పడ్డారు. కొంత దూరం కారుతో సహా ముందుకు వెళ్లి కింద పడ్డారు. ఈ ఘటనలో రహదారికి ఇరువైపులా పార్కింగ్‌లో ఉన్న మరో నాలుగు ద్విచక్రవాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. ఈ క్రమంలో కారు రహదారి పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లి ఆగటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియక పాదచారులు పరుగులు తీశారు. క్షతగాత్రురాలి కాలు, మోకాలికి, తలకు బలమైన గాయాలు కావటంతో స్థానిక వైద్యులు రాజాం కేర్‌కు రిఫర్ చేశారు. మరో క్షతగాత్రుడికి వైద్యసేవలు అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
విధి చేతిలో ఓడిన యువకుడు
సాక్షి, పాలకొండ : విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఆ యువకుడు విధి చేతిలో ఓడిపోయాడు. ఆ కుటుంబ ఇంకా ఆనందం నుంచి తేరుకోక ముందే తీవ్ర విషాదం నెలకొంది. పేద కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. ప్రతి ఒక్కరికి సహాయం అందించే వ్యక్తి రెప్పపాటులో విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదం అలముకుంది. మండలంలోని నవగాం గ్రామానికి చెందిన బెహరా రమేష్ (35) గ్రామంలో ఒప్పంద పద్ధతిలో విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సచివాలయ ఉద్యోగాల నియమాకంలో జూనియర్ లైన్‌మన్‌గా ఉద్యోగం పొందాడు. వంగర మండలంలో ఇటీవల విధుల్లో చేరాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటిలోనే ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో పక్క ఇంటిలో విద్యుత్ రావడం లేదని పిలవడంతో పరిశీలించడానికి వెళ్లాడు. ఈ సమయంలో విద్యుత్ బోర్డు తగిలి షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు రమేష్‌ను పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఉషారాణి, ఎనిమిది నెలల పాప, తల్లిదండ్రులు ఉన్నారు. రమేష్ గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండేవాడని, ఎవరి ఇంటిలో విద్యుత్ సమస్య వచ్చినా తక్షణం స్పందించేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. డబ్బులు కూడా తీసుకోకుండా సాయం అందించేవాడన్నారు. భర్త మృతిచెందిన విషయం తెలుసుకున్న భార్య ఉషారాణి బోరున విలపించింది. ఉద్యోగం వచ్చిన ఆనందం ఎన్నో రోజులు నిలవలేదని తమకు ఇక దిక్కెవరంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదించారు. -
అవలంగిలో వ్యక్తి దారుణ హత్య
సాక్షి, పాలకొండ(శ్రీకాకుళం) :ప్రశాంతతకు మారుపేరైన పాలకొండ మండలం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్నపాటి నేరాలు తప్పితే హత్యోదంతాలు అంతగా లేని ఈ ప్రాంతంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆపై కాళ్లు, చేతులు కట్టేసి చెరువులో పడేశారు. అవలంగి గ్రామ సమీపాన నాయుడు చెరువులో తేలిన మృతదేహం గ్రామానికి చెందిన కురమాన జమ్మయ్య(58)గా బుధవారం ఉదయం స్థాని కులు గుర్తించారు. ఏడాది క్రితమే మృతుడు కుమారుడు ఆదినారాయణ (30) అనుమానా స్పదంగా మృతి చెందగా, తాజాగా తండ్రి హత్యతో సర్వత్రా చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తొలుత ఎవరో బహిర్భూమికి వెళ్లి చెరువులో పడి ఉంటారని స్థానికులు భావించారు. వీరి నుంచి సమాచారం అందుకు న్న ఎస్సై ఎస్ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. కాళ్లు, చేతులు నైలాన్ తాడుతో కట్టేసి, శరీరంపై కత్తిగాట్లు ఉండటాన్ని గుర్తించారు. హత్యగా కేసు నమోదు... అత్యంత పాశవికంగా జమ్మయ్య హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించారు. పోలీసులు తీసుకువచ్చిన కుక్కలు చెరువు సమీపంలో ఓ మదుము వరకు, సమీపంలో మరో గిరిజన గ్రామమైన బర్న రహదారికి పరుగులు తీసి ఆగిపోయాయి. అలాగే క్లూస్ టీమ్ మృతదేహంపై వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ పీఆర్ఆర్ ప్రసాద్, సీఐ ఎస్ ఆదాం చేరుకుని మరిన్ని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. .ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు, క్లూస్ టీమ్ -
పేదింటికి పెద్ద కష్టం
సాక్షి, పాలకొండ రూరల్: అసలే మధ్య తరగతి కుటుంబం. అటుపై రెక్కాడితే గానీ డొక్కాడని వైనం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. అంది వస్తాడని అనుకున్న చిన్న కుమారుడిపై బోన్ కేన్సర్ రూపంలో పంజా విసిరింది. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో ఆ కుర్రాడిని మంచా నికి పరిమితం చేసింది. బిడ్డను రక్షించుకునేం దుకు తల్లిదండ్రులను అప్పులపాలు చేస్తోంది. పాలకొండ పట్టణం కోరాడ వీధి సమీ పంలో నివాసముంటున్న జోగ ఎర్రంనాయు డు, లక్ష్మి దంపతుల మూడో కుమారుడు గంగరాం స్థానిక పెదకాపువీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తున్న గం గారంకు మూడు నెలల కిందట వెన్ను, భుజం భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో తల్లిదండ్రులు తమ బిడ్డను శ్రీకాకుళం తీసుకువెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. భుజం లో ఎముక చిట్లి ఉంటుందని వైద్యులు భా వించి అందుకు తగ్గట్టుగా మందులు అందించారు. అయినప్పటికీ వ్యాధి నయం కాలేదు. దీంతో పాటు బిడ్డ శరీరంలో స్వల్ప మార్పులు రావడం తల్లిదండ్రులు గమనించారు. మెరుగైన వైద్యం కోసం మహాత్మాగాంధీ కేన్స ర్ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు రూ.3 లక్షలు ఖర్చుచేయడంతో తమ కుమారుడికి బోన్ కేన్సర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న గంగా రాం తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నకొడుకును ప్రాణాంతక వ్యాధి రోజు రోజుకూ కబళిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే గంగారాం కీమోథెరపీ చేయించుకునే పరిస్థితికి చేరుకున్నాడు. ఒక్కో ఇంజెక్షన్ రూ.3,500, తనకు అందిస్తున్న మాత్రలు రూ.1600 ఖర్చు చేయడం ఆ తల్లిదండ్రులకు తల కు మించిన భారమైంది. ఆటో నడుపుకుని కుటుం బాన్ని పోషిస్తున్న బాధితుడు గంగారాం తండ్రి ఎర్రంనా యు డు అప్పు చేసి కుమారుడిని రక్షించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. కళ్ల ముందే కుంగిపోతున్న కుమారుడి దయనీయ స్థితికి ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. దాదాపు రూ.10 లక్షలు ఉంటే గానీ మెరుగైన వైద్యం, ఆపరేషన్లు చేయలేమని విశాఖకు చెందిన పికానికి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారని తల్లిదండ్రులు చెబుతుతున్నారు. మనసున్న మారాజులు ముందుకు వచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు సహకరిస్తారని ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పాలకొండ ప్రభుత్వ బాలికల కళాశాల యాజమాన్యం కొంతమేర ఆర్థిక సాయం అందించింది. ఈ కోవలోనే మానవతా దృక్పథంతో సహకరించాలని ఆ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ దయనీయమైన పరిస్థితిపై ఆరా తీసేందుకు 9346877720, 7729055065 నంబర్లకు ఫోన్ చేయాలని, చెమర్చిన కళ్లతో అభ్యర్థిస్తున్నారు. -
శునకంతో మార్జాలం.. బహు ఇంద్రజాలం
సాక్షి,పాలకొండ(శ్రీకాకుళం) : శునకం.. మార్జాలం పుట్టుకతోనే శత్రువులు. సాధారణంగా కుక్కలకు పిల్లులు ఎదురుపడితే వెంటపడి మరీ తరుముతాయి. అలాంటిది పాలకొండ మండలం యరకారాయపురం గ్రామానికి చెందిన బొత్స బావాజీ నాయుడు ఆరు నెలల కిందట తెచ్చుకున్న శునకం ఓ పిల్లితో నేస్తరికం కట్టుకుంది. మనిషిని సాటి మనిషే ద్వేషించుకుంటున్న ఈ సమాజంలో జంతువులై ఉండి, జాతి వైరాన్ని మరచి స్నేహాన్ని చాటడం అక్కడి గ్రామస్తులను ఆకట్టుకుంటోంది. -
శిథిల గదులు – సిబ్బంది వ్యథలు
సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): నియోజకవర్గంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో విలువైన ఫైల్లు, ఇతర సామగ్రికి భద్రత లేకుండా పోయింది. వీటిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో మొత్తం 57 ప్రభుత్వ కార్యాలయాలకు గాను వీటిలో 13 వరకు శిథిలభవనాల్లో నడుస్తున్నాయి. అన్ని మండలాల్లో వ్యవసాయశాఖ కార్యాలయాలు పూర్తిగా పాడయ్యాయి. సీతంపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయం శిథిలమైంది. అయితే ఈ భవన సముదాయానికి సంబంధించి నూతన భవనాలు నిర్మాణానికి ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేశారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అలాగే గిరిజన సహకార సంస్థ భవనాలు, మండల రెవెన్యూ కార్యాలయం, ఎంఆర్సీ కార్యాలయం పూర్తిగా పాడయ్యాయి. చిన్నపాటి వర్షం పడినా వరదతో నిండిపోతున్నాయి. స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. భామిని మండలంలో భామిని, బత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు మరమ్మతులకు గురయ్యాయి. పాలకొండలో మండల విద్యావనరుల కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, ఇరిగేషన్ కార్యాలయం, ట్రెజరీ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం శిథిలమయ్యాయి. వీరఘట్టం మండలంలో వ్యవసాయ కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయలాది ఆదేదారి. వీటి స్థానంలో కొత్తవి ఎప్పుడు నిర్మిస్తారనేది ప్రశ్నగా మారింది. మరికొన్ని కార్యాలయాలు పరాయి పంచన నడుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, ప్రజలు వేడుకుంటున్నారు.ఽ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు.. మండలం ప్రభుత్వ కార్యాలయాలు శిథిలమైనవి సీతంపేట 18 4 పాలకొండ 15 5 వీరఘట్టం 14 2 భామిని 10 2 మొత్తం 57 13 ఎప్పటి నుంచో సమస్య ఉంది శిథిల భవనాల స్థానంలో నూతన భవనాలు మంజూరు చేయాలని గతంలో పలు మా ర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. చాలా ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా.. పట్టించుకున్న దాఖలాలు లేవు. రికార్డులకు భద్రత లేకుండా పోతోంది. చిన్నపాటి వర్షం కురిసినా సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ కార్యాలయాలన్నీ అలాగే ఉన్నాయి రెవెన్యూ, వ్యవసాయశాఖ ఇలా మండలంలో ఏ కార్యాలయాలు చూసినా శిథిల భవనాలే దర్శనమిస్తున్నాయి. ఎంపీడీవో కార్యాయలం పూర్తిగా పాడైంది. అయితే తప్పదన్నట్లు అక్కడే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేయాలి. – ఎస్.భాస్కరరావు, కారెంకొత్తగూడ -
రైతు నెత్తిన బకాయిల భారం
సాక్షి, పాలకొండ (శ్రీకాకుళం): కూలీల కొరత, పెరగిన పెట్టుబడులు, ప్రకృతి సహకరించక పోవడం, దిగుబడులు లేకపోవడం..అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక లభించకపోవడం తదితర కారణాలతో రైతులు వ్యవసాయం చేయడం అంటేనే భయపడున్నారు. ఈ ఏడాది రైతులకు కష్టాలు మరింత రెంటిపు స్థాయిలో వెంటాడాయి. దీంతో పెట్టుబడులు కూడా తిరిగి రాక వలసలు పోతున్నారు. కాస్త పండిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సేకరించకపోవడంతో రైతులు దీన స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి నీటి తీరువా వసూలు కోసం రైతులపై వత్తిని నెలకొంది. ఎన్నికల్లో లబ్ధి కోసం గత ఐదేళ్లుగా నీటితీరువాపై నామమాత్రంగా స్పందించిన ప్రభుత్వం ఎన్నికల అనంతరం నీటితీరువా వసూలుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు రైతుల నుంచి పాత బకాయిలతో పాటు నీటితీరు వసూలుకు రంగం సిద్ధం చేశారు. వాస్తవానికి పాలకొండ నియోజకవర్గంలో ఇంతవరకూ ఈ ఏడాది నీటితీరువా 447.12కోట్లు వరకూ ఉంది. ఈ మొత్తం రైతుల నుంచి వసూళ్లు చేసేందుకు అధికారులు తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. నీటి తీరువా బకాయిలు ఉన్న రైతులకు అవసరమైన ధ్రువపత్రాలు జారీ నిలిపివేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి పని ఉన్నా ముందుగా నీటితీరువా కట్టాలని నిబంధనలు పెడుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు అందించకుండా నీటితీరువా? నిబంధనల ప్రకారం సంవత్సరంలో కాలువల ద్వారా 150 రోజులు రైతులకు నీరు అందిస్తేనే నీటి తీరువా వసూలు చేయాలి. 150 రోజుల నీరు అందిస్తే కేటగిరీ ఏ కింద ఎకరానికి రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంది. 100 రోజులు పైబడి నీరు అందిస్తే కేటగిరి 2 కింద ఎకరానికి రూ.100 చొప్పున చెల్లించాలి. కాని పాలకొండ డివిజన్లో ఇంతవరకూ మేజర్, మైనర్ ఇరిగేషన్ల ద్వారా 90 రోజుల కూడా నీరు అందించలేదని రైతులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం నీరు అందించకుండా నీటితీరువా మాత్రం బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జీవో ఏం చెబుతుంది? రైతుల నుంచి భూమి శిస్తు వసూలు విధానంపై 1996లో జీవో విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి భూమి శిస్తును రద్దు చేసి 11/88 జీవోను తీసుకువచ్చారు. ఈ జీవో ప్రకారం రైతులు వాడుకున్న నీటిని ఆధారంగా తీరువా వసూలు చేయాలని నిబంధన తీసుకువచ్చారు. దీని ప్రకారం 150 రోజులు నీరు అందించకపోతే తీరువా వసూలు చేయడానికి అవకాశం లేదు. ఈ నిబంధన ప్రకారం అయితే నీటితీరువా చెల్లించాల్సిన అవసరం లేదని రైతు సంఘాలు వాధిస్తున్నాయి. నియోజకవర్గంలో మండలాల వారిగా నీటి తీరువా బకాయిలు మండలం బకాయిలు పాలకొండ 148.86 కోట్లు వీరఘట్టం 289.06 కోట్లు సీతంపేట 001.16 లక్షలు భామిని 008.04 లక్షలు మొత్తం 447.12 కోట్లు రైతులపై వత్తిడి తగదు నీటి తీరువా కోసం రైతులపై వత్తిడి తగదు. నీరు అందించక పోయినా తీరువా చెల్లిస్తున్నాం. అయినా అధికారులు పాత బకాయిలు కూడా చెల్లిం చాలని వత్తిడి తెస్తున్నారు. రైతులకు అçప్పులే మిగిలాయి. అధికారులు ఆచోలించాలి. – లోలుగు విశ్వేశ్వరరావు, రైతు సంఘం నాయకుడు, అంపిలి 90 రోజులు కూడ నీరు అందించడంలేదు అధికారులు తోటపల్లి కాలువల ద్వారా ప్రతి ఏటా కనీసం 90 రోజులు కూడా నీరు అందించడంలేదు. జనవరి నుంచి నవంబర్ నెల ఆఖరకు నీరు అందించిన రోజులు లెక్కించాల్సి ఉంది. అధికారులు మాత్రం రెండు సంవత్సరాలు అందించిన రోజులను లెక్కిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. – కండాపు ప్రసాదరావు, రైతు, రుద్రిపేట ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నీటి తీరువా వసూలు చేయడం వాస్తవం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఆర్ఓలకు ఆదేశాలు జారి చేశాం. పాత బకాయిలతో పాటు నీటితీరు వసూలు చేయడంపై లక్ష్యాలు విధించాం. అదేశాల ప్రకారమనే అధికారులు పనిచేస్తున్నారు. – ఎల్ రఘుబాబు, ఆర్డీవో, పాలకొండ -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
సాక్షి, పాలకొండ రూరల్ (శ్రీకాకుళం): రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతి మరకలు అంటని నేత. నీతి, నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం. మాయ మాటలు చెప్పడం రాదు. నమ్మిన వాళ్లను అక్కున చేర్చుకుంటారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా నిరాడంబర జీవితం గడపడంలో ఆమెకు ఆమే సాటి. ఆమే వైఎస్సార్సీపీ పాలకొండ అసెంబ్లీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరఫున నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల అండదండలతో ఫ్యాన్ హోరు గాలిలో ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం అధికంగా ఉండే ఈ రోజుల్లో.. ప్రజల విశ్వాస నియత, ప్రేమానురాగాలతో విజయ సాధనకు కృషి చేస్తున్నారు. కళావతితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. సాక్షి: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు? కళావతి: ఈ ప్రాంతంలో పుట్టిన ఆదివాసీ బిడ్డగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టాలు తెలసుకున్నాను. ఆసెంబ్లీలో ప్రాంత సమస్యలపై గళమెత్తాను. అధికారం లేకపోయినా నçన్ను ప్రజలు ఆదరించారు. అధికార పార్టీ నన్ను ఇబ్బంది పెట్టినా ప్రజలు నాకు అండగా నిలిచారు. సాక్షి: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రత్యేక సమస్యలు ఏమిటి? కళావతి: ఈ ప్రాంతలంలో అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. సాగు నీరు లేక ఏటా వారు పడుతున్న కష్టాలు నన్ను కలచి వేశాయి. అలాగే గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఏనుగుల సమస్యతో సతమతమవుతున్నారు. భామిని మండంలో వంశధార పనులు, జంపరకోట జలాశయం వంటి సాగునీటి ప్రాజెక్టుల సమ్యలు వేధిస్తున్నాయి. సాక్షి: సమస్యల పరిష్కారానికి ఏలా కృషి చేస్తారు? కళావతి: ఇప్పటికే నియోజకవర్గ సమస్యలు మా పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాను. పాదయాత్ర ద్వారా జగన్ ఇక్కడి సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పాలకొండ నియోజవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని ఇక్కడి బహిరంగ సభలో కూడా చెప్పారు. ఆయన మాటపై నమ్మకం ఉంది. అవసరమైతే నేను ఈ ప్రాంత అభివృద్ధికి పోరాటాలకు వెనుకాడను. సాక్షి: నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? కళావతి: నియోజకవర్గంలో యువత, నిరుద్యోగులు ఉపాధి లేక వలసలు పోతున్నారు. దీనిపై దృష్టి పెడతాను. ఈ ప్రాంతంలో చిన్నతరహా పరిశ్రములు ఏర్పాటుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ పారిశ్రామికికరణతోపాటు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుపై చర్యలు తీసుకుంటాం. తద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి, ఆర్థిక పురోగతి చేకూరుతుంది. సాక్షి: పట్టణ ప్రజల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? కళావతి: పాలకొండ పట్టణంలో ఇంటి పన్నులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమిస్తాం. అలాగే తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. నన్ను నమ్మిన ప్రజలకు ఊపిరి ఉన్నంతవరకు సేవలందిస్తాను. సాక్షి: ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మీ వ్యూహాలు ఏమిటి? కళావతి: నేను వ్యూహాలతో విజయం సాధించే వ్యక్తిని కాను. ఎందుకంటే నేను ప్రజల మనిషిని. నా విశ్వసనీయత, జగనన్నపై ప్రజలకున్న విశ్వాసమే నన్ను విజయతీరం దాటిస్తుంది. టీడీపీ మాదిరి అధికారం కోసం అడ్డదారులు తొక్కను. గడిచిన ఐదేళ్లలో ఎన్నో ప్రలోభాలకు అధికారు పార్టీ గురిచేసింది. తలొగ్గలేదు. చివరకు నా ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి అవమాన పర్చినా భరించాను. దీనిని ప్రజలు గమనించారు. ప్రజా ఆశీస్సులే తిరుగులేని విజయానికి బాటలు వేస్తాయన్న నమ్మకముంది. సాక్షి: టీడీపీ పాలనలో పలు ఇబ్బందులకు గురైన బాధితులకు మీరు ఎలా న్యాయం చేస్తారు? కళావతి: టీడీపీ పాలనలో ప్రజలే కాదు నేను ఇబ్బందులు పడ్డాను. ఓ మహిళగా ప్రజల కష్టాలను ఐదేళ్లగా దగ్గరగా చూశాను. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా, అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తాను. ఎటువంటి వివక్ష లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరీ సమస్య పరిష్కరానికి ఎంత దూరమైనా వెళ్తాను. -
పాలకొండ రూటు..విశ్వసనీయతకే ఓటు..
సాక్షి, పాలకొండ రూరల్: గిరిజనులు అధికంగా ఉన్న పాలకొండ నియోజకవర్గాన్ని టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచీ ఓటు బ్యాంకుగానే చూసింది. గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తామని 2014 ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించింది. ఇక్కడి ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అంతే అప్పటి నుంచి నియోజకవర్గంపై వివక్ష మొదలైంది. గిరిజన ఉత్పత్తులు, వ్యవసాయ వనరులున్నా ఎటువంటి వ్యవసాయరంగ, పారిశ్రామికీకరణ జరగకపోవటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పంటలకు సాగునీరు లేక, పండిన పంటలకు గిట్టుబాలు లేక ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గ ప్రత్యేకతలు... 1952లో పాలకొండ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఒకే పేరుతో నియోజకవర్గం కొనసాగుతోంది. తొలుత జనరల్‌గా ప్రారంభమై తర్వాత ఎస్సీలకు అనంతరం ఎస్టీలకు కేటాయించారు. 2009లో పునర్విభజనకు ముందు నియోజకవర్గంలో పాలకొండ, రేగిడి, సంతకవిటి, వంగర మండలాలు ఉండేవి. పునర్విభజన అనంతరం కొత్తూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న భామిని, వీరఘట్టం, సీతంపేట మండలాలు పాలకొండలో చేరాయి. ఈ ప్రాంత ప్రజలు వ్యవసాయాధారితంగా జీవనం సాగిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రం పాలకొండ చదువులకు నిలయంగా ఉంది. ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ కొలువుతీరిన ఈ ప్రాంతానికి బ్రిటీష్ కాలం నుంచీ చారిత్రక నేపథ్యం ఉంది. వీరఘట్టం కూరగాయల పంటలకు, ఆంధ్రా ఒడిశాలను కలిపే భామిని మండలం, ఏజెన్సీ అందాలకు సీతంపేట ప్రసిద్ధి. అభివృద్ధిలో వైఎస్సార్మార్క్... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పాలకొండ మండలంలో వరద కరటక్టలు, ఎం.సింగుపురంలో పీహెచ్సీ భవనం, జంపరకోట మినీ జలాశయం పనులు, అక్కడి నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ వర్తింపజేశారు. సీతంపేటలో మండలంలో అభివృద్ధి పనులు, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. భామిని మండలానికి సంబంధించి నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి(ఐఏపీ) ద్వారా నిధులు కేటాయించారు. జలయజ్ఞంలో భాగంగా వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4వందల కోట్లు కేటాయింపులు, మారుమూల గ్రామాల్లో పూర్తిస్థాయిలో రహదారుల నిర్మాణం. విశ్వాసానికే మద్దతు 2009లో అప్పటి ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారి రాజకీయ రంగప్రవేశం చేసిన విశ్వాసరాయి కళావతి 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచి టీడీపీపై విజయం సాధించారు. అయితే పార్టీ అధికారంలోకి రాకపోయినా నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి విశ్వాసాన్ని పొందారు. ఐదేళ్లగా ప్రభుత్వం సహకరించకపోయినా వెరవలేదు. నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తూవచ్చారు. అక్కడి గిరిజనుల, రైతులు తరఫున, ప్రత్యేకహోదా కోసం పోరాటాలు చేస్తూ కళావతమ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిరాయింపుల సమయంలోనూ చలించకుండా విశ్వసనీయత కట్టుబడి నిలబడ్డారు. ఇదే విషయాన్ని పాదయాత్రగా వచ్చిన తమ పార్టీ అధినేత జగన్ పాలకొండ బహిరంగ సభలో ప్రస్తావించడం ఈమె నిబద్ధతకు నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు. ఓ వైపు ప్రత్యర్థి పార్టీ నాయకులు, క్యాడర్ వైసీపీలోకి వలస రావటం, ప్రజల్లో ఉన్న గుర్తింపును రానున్న ఎన్నికల్లో కళావతి విజయానికి కలిసొచ్చే అంశాలుగా పేర్కొంటున్నారు. టీడీపీ హయాంలో.. గత ఐదేళ్లగా నియోజకవర్గంలో అభివృద్ధికి గండి పడింది. కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే విశ్వారాయి కళావతికి పేరు రాకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేసింది. స్థానిక ఎమ్మెల్యేకు ప్రాధాన్యత కల్పించలేదు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జికి ప్రాధాన్యత కల్పించి అభివృద్ధి నిధులు ఆయన పేరిట మంజూరు చేసింది. దీంతో వారికి నచ్చిన పనులు, వారికి కనుసన్నల్లో ఉండేవారికి కట్టబెట్టారు. దీంతో పాలనలో లోపాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వంశధార ప్రాజెక్టు నేటికీ పూర్తికాలేదు. పాలకొండ మండల రైతుల కల అయిన జంపరకోట ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. కిమ్మి – రుసింగి వంతెన పనులకు మోక్షం కలగలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నగర పంచాయతీలో ఇంటి పన్నుల భారం అధికం కావడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. విమర్శలు మూటగట్టుకున్నారు తండ్రి నిమ్మక గోపాలరావు మరణంతో టీడీపీ నుంచి 2014లో బరిలో నిలిచిన నిమ్మక జయకృష్ణ 1620 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తండ్రి చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణకు స్వపక్షంలో విపక్షం అసమ్మతి బలహీనంగా మారింది. నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడంలో విఫలమయ్యారు. తాజా ఎన్నికల సమయంలో టికెట్ దక్కించుకునే క్రమంలో టీడీపీ వర్గాలు ఈయనకు చుక్కలు చూపించాయి. నామినేషన్ సమయంలో కూడా టీడీపీలో కొన్ని వర్గాలు దూరంగా ఉండిపోయాయి. ప్రజల్లో మమేకం కాలేరని, సొంత క్యాడర్‌ను కలుపుకుపోలేరని ఆ పార్టీకి చెందిన నాయకులే ఆరోపిస్తున్నారు. మంత్రి కళా కనుసన్నల్లో పనిచేస్తున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు. పార్టీలో సీనియర్ నాయకులు వలస కట్టడం వంటి పరిణామాలు ఈ ఎన్నికల్లో జయకు ఇబ్బందిగా మారనున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. పాలకొండ ముఖచిత్రం 1952 నుంచి 2014 వరకు 14సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజాగా నోటిఫికేషన్ విడుదల కావడంతో 15వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. 1952 నుంచి 1962 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న పాలకొండలో 1967 నుంచి 2004 వరకు ఎస్సీ రిజర్వేషన్ కొనసాగింది. 2009 నుంచి ఎస్టీ రిజర్వేషన్ కొనసాగుతోంది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, ఇండిపెండెంట్లు 4సార్లు, జనతా పార్టీ ఒకసారి, 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రస్తుత 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి విశ్వాసరాయి కళావతి, టీడీపీ నుంచి నిమ్మక జయకృష్ణలు ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు: 1,74,219 పురుషులు: 86,107 స్తీలు: 88,100 ఇతరులు: 12 మొత్తం పంచాయతీలు 104 పోలింగ్ బూత్‌లు 283 ఎమ్మెల్యేల వివరాలు సంవత్సరం విజేత పార్టీ 1952 పాలవలస సంగంనాయుడు కాంగ్రెస్ 1955 పైడినరసింహ అప్పరావు ఇండిపెండెంట్ 1962 కెంబూరి సూర్యనారాయణ ఇండిపెండెంట్ 1967 జెమ్మాన జోజి ఇండిపెండెంట్ 1972 కొత్తపల్లి నరసింహయ్య కాంగ్రెస్ 1978 కంబాల రాజరత్నం జనతా పార్టీ 1983 గోనేపాటి శ్యామలరావు టీడీపీ 1985 తలే భద్రయ్య టీడీపీ 1989 పీజే.అమృతకుమారి కాంగ్రెస్ 1994 తలే భద్రయ్య టీడీïపీ 1999 పీజే.అమతకుమారి ఇండిపెండెంట్ 2004 కంబాల జోగులు టీడీపీ 2009 నిమ్మక సుగ్రీవులు కాంగ్రెస్ 2014 విశ్వాసరాయి కళావతి వైఎస్సార్ కాంగ్రెస్ -
ఆపరేషన్ గజేంద్ర
సాక్షి,వీరఘట్టం, సీతంపేట: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీడీఏలో మొదటి పాలకవర్గ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరై ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏజెన్సీలో ఏనుగులు అడుగుపెట్టి 12 ఏళ్లవుతున్నా వాటి గురించి పట్టించుకునే నాథుడు లేడు. ఈ ప్రభుత్వ హయాంలో మరింత నిర్లిప్తతతో పాటు గిరిజనులకు భద్రత కరువైంది. ఇదీ విషయం 2007 మార్చి నెలలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల గుంపు అడుగుపెట్టాయి. వాటిని తరలించేందుకు అదే ఏడాది అక్టోబర్‌లో అప్పటి అటవీశాఖా మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తీసుకున్న నిర్ణయం మేరకు ఆపరేషన్ గజ చేపట్టారు. జయంతి, గణేష్ అనే శిక్షణ పొందిన ఏనుగులను తీసకువచ్చి వాటి సహాయంలో ఏనుగుల గుంపును ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించేందుకు అధికారులు శ్రమించారు. అయితే ఈ క్రమంలో ఏనుగులు ఒక్కొక్కటిగా మృతి చెందడం, ఒడిశా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో ఆపరేషన్ గజ నిలిచిపోయింది. అనంతరం ఆపరేషన్ గజేంద్ర పేరుతో మళ్లీ ఏనుగుల తరలించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 7 ఏనుగులు మృతి చెందగా, ఏనుగుల దాడిలో 13 మంది మృత్యువాతపడ్డారు. కానీ మృతుల కుటుంబాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఏనుగులను తరలించేందుకు 11 ఏళ్లలో రూ. 2.25కోట్లు ఖర్చు చేశారు. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మందస, మెళియాపుట్టి, కొత్తూరు, పాతపట్నం మండలాల్లో గజరాజుల సంచారం ఎక్కువగా ఉంది. కొండపోడు ప్రాంతాల్లో ఏనుగుల కదలికలు అధికంగా ఉన్నాయి. గజరాజుల దాటికి గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. భారీగా పంటలు నష్టం గిరిజనులకు చెందిన వందలాది ఎకరాల్లో పంటలను ఏనుగులు నాశనంచేశాయి. 274.98 హెక్టార్లలో పంటలు ధ్వంసం కాగా 1059 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 42లక్షలు నష్టపరిహా రం చెల్లించినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పంటల నష్టం ఇంతకు రెండింతలు ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోతే వందల ఎకరాల్లోనే చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ, ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని వాపోతున్నారు. ఏనుగుల తరలింపులో నిర్లక్ష్యం ఏనుగుల తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో సమస్యను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఐదేళ్లుగా ఏజెన్సీలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. – ఎన్.ఆదినారాయణ, చిన్నబగ్గ, సీతంపేట ఒడిశా అడవుల్లోకి తరలిస్తున్నాం ప్రస్తుతం ఏనుగుల గుంపును ఒడిశా అడవుల్లోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఏనుగులకు ఎటువంటి హాని జరగకుండా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాటిని కవ్వించే చర్యలు చేపట్టవద్దని ప్రజలను కోరుతున్నాం. నిత్యం ఏనుగుల కదలికలపై నిఘా వేస్తున్నాం. – జి.జగదీష్, ఫారెస్ట్ రేంజర్, పాలకొండ గిరిజనుల ప్రాణాలతో చెలగాటం వద్దు ఏనుగులు తరలిస్తున్నామంటూ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారే తప్ప వాటిని తరలించడంలో అధికారులు చిత్తశుద్ధి చూపడం లేదు. ప్రభుత్వం కూడా ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతమంది గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ -
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
సాక్షి, పాలకొండ : జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన పాలకొండ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్తగా ఓటు నమోదు కోసం 84వేల దరఖాస్తులు అందాయని, అందులో ఇంకా 24వేల దరఖాస్తులు పరిశీలించి ఓటరు కార్డులు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. వీరందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇంతవరకూ జిల్లాలో 2,674 ఓట్లు తొలగించామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పీవో, ఏపీవోలను నియమించామని వారికి 16వ తేదీన నియోజకవర్గాల్లో శిక్షణ అందిస్తామని వివరించారు. వచ్చేనెల 3వ తేదీన మరో మారు శిక్షణ అందించాల్సి ఉందని తెలిపారు. ప్రతి మండలానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. వారితో పాటు 50మందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిఘా పెంచామని వివరించారు. ఉధ్యోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 470 పోలింగ్ కేంద్రాలకు ర్యాంపులు ఏర్పాటు చేశామని, 62 కేంద్రాలకు మరుగుదొడ్లు, 71 కేంద్రాల్లో తాగునీటి బోర్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మద్యం, ధనం, ఎన్నికల నియమావళి అమలుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆయన డీఎస్పీ ప్రేమ్‌కాజల్‌తో మాట్లాడి బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు అందజేశారు. ఈవీఎంలను భద్రపరచనున్న డిగ్రీ కళాశాలను సందర్శించి పరిశీలించారు. పర్యటనలో కలెక్టర్‌తో పాటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎల్.రఘుబాబు, తహసీల్దార్ నరసింహ, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. -
టీడీపీలో తేలని పంచాయితీ
సాక్షి, పాలకొండ: నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విషయంలో ఇప్పటికీ పంచాయితీ తేలలేదు. నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కుమార్తె స్వాతిల మధ్య టికెట్ కోసం వర్గపోరు కొనసాగుతోంది. జయకృష్ణకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు మద్దతు అందిస్తుండగా, స్వాతికి ఇటీవలే పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్ వెన్నుదన్నుగా నిలిచారు. తల పట్టుకున్న పార్టీ అధిష్టానం టికెట్ కేటాయింపులో ఇప్పటికీ ఫోన్ సర్వేలపైనే ఆధారపడుతోంది. జయకృష్ణకు టికెట్ ఇస్తే తాము పార్టీకి పనిచేయమని పాలకొండ, వీరఘట్టం మండలాలకు చెందిన మండల స్థాయి నాయకులు చంద్రబాబు సమక్షంలోనే తేల్చారు. దీనికి తోడు చంద్రబాబుకు పలుమార్లు జయకృష్ణ తీరుపై ఫిర్యాదులు అందాయి. ఈ విషయాలను పరిగణనలోనికి తీసుకుని టికెట్ కేటాయించే పరిస్థితి లేదని జయకృష్ణ వ్యతిరేక వర్గం గట్టిగా చెబుతున్నారు. ఇక స్వాతి విషయంలో పార్టీలో చేరిన వారం రోజుల్లోనే టికెట్ ఎలా ఇస్తారని జయకృష్ణ వర్గం వాదిస్తోంది. దీంతో ఈ వ్యవహారం ముదిరింది. ప్రస్తుతం పాలకొండ టికెట్ విషయంలో కిషోర్‌చంద్ర దేవ్, కళా వెంకటరావుల మధ్య ఆధిపత్య పోరుకు తెరతీసింది. పార్టీ కార్యకర్తల్లో ఈ ఇద్దరి నేతల మధ్య ఎవరు పైచేయి సాధిస్తారని చర్చించుకుంటున్నారు... పాతపట్నం... పాతపట్నంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కలమటకు ఈసారి వింత పరిస్థితి నెలకొంది. అవినీతి ఆరోపణలతో ఈసారి టికెట్ కష్టంగా మారింది. అయితే దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామోహన్నాయుడు పట్టుతో టికెట్ రేసులో నిలిచారు. అధికారికంగా టికెట్ ప్రకటించక పోయినా వస్తుందన్న ప్రచారం జరిగింది. దీంతో పాతపట్నం నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలమటకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ పరిణామాలతో కంగుతిన్న చంద్రబాబు వెంటనే పాతపట్నం నాయకులను అమరావతి రావాలని కబురు పంపారు. మండల స్థాయి నాయకులకు నచ్చచెప్పే పనిని కింజరాపు కుటుంబం నెత్తిన పెట్టుకుంది. ఈ పరిణామాల మధ్య ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. -
కూలిన సిగ్నల్ టవర్
పాలకొండ శ్రీకాకుళం : స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్ టవర్ కూలిపోయింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో టవర్ పూర్తిగా విరిగి పాలకొండ-శ్రీకాకుళం రహదారిపై పడింది. 100 అడుగుల ఎత్తు ఉన్న టవర్‌తో పాటు దీనికి ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లుకూడా రహదారికి అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఉదయం ఈ సంఘటన జరిగితే ప్రమాదం జరిగేదని స్థానికులు వివరిస్తున్నారు. ఆర్డీవో కార్యాలయం సిబ్బంది దీనిని తొలగించారు. -
మాజీ ఎమ్మెల్యే రుక్మిణమ్మ కన్నుమూత
పాలకొండ: శ్రీకాకుళం జిల్లా ఉనుకూరు మాజీ ఎమ్మెల్యే పాలవలస రుక్మిణమ్మ (89) శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పాలకొండ మండలం వడమలో 1929లో జన్మించిన రుక్మిణమ్మ 1944లో వీరఘట్టం మండలం నీలానగరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పాలవలస సంగన్నాయుడును వివాహం చేసుకున్నారు. 1952లో పాలకొండ నుంచి, 1962లో ఉనుకూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సంగన్నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన 1970లో మృతి చెందడంతో రుక్మిణమ్మ 1972లో ఉనుకూరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 1980లో పాలకొండ సమితికి తొలి ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. రుక్మి ణమ్మ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడిగా, వ్యవహరిస్తుండగా, మనుమరాలు రెడ్డి శాంతి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
అత్యాచార నిందితులపై కఠిన చర్యలు
పాలకొండ : బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధిం చి నిందితులపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని కమిషన్ రాష్ట్ర సభ్యుడు పి.వి.వి.ప్రసాద్ అన్నా రు. సీతంపేట మండలానికి చెందిన 8 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసును పరిశీలించేందు గురువారం రాత్రి పాలకొండ ఏరి యా ఆస్పత్రికి వచ్చిన ఆయన వైద్యులతో మాట్లాడారు. డీఎస్పీ జి.స్వరూపరాణికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసు నమోదైన వెంటనే బాధితురాలికి రూ.4లక్షలు పరిహారం అందజేస్తామని తెలిపారు. కేసు నీరు గార్చకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయనతో పాటు చైల్డ్‌లైన్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ రమణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎల్.శాంతకుమారి ఉన్నారు. -
బంతి బంతికీ బెట్టింగ్!
వీరఘట్టం/ శ్రీకాకుళం సిటీ: ఐ.పి.ఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బెట్టింగ్‌రాయుళ్లు రంగంలోకి దిగారు. పెద్ద మొత్తం సొమ్ము వస్తుందని ఆశ చూపుతూ అమాయక యువతను ముగ్గులోకి దింపుతున్నారు. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగ్‌లు నేడు గ్రామీణ ప్రాంతాలకు పాకడంతో రూ.లక్షల బెట్టింగ్‌లు కాస్తూ కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టిన చాపకింద నీరులా బెట్టింగ్ జోరు కొనసాగుతునే ఉంది. ముఖ్యంగా వీరఘట్టంలో రోజూ రూ.10 లక్షల మేర బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. వీరఘట్టం అంబేడ్కర్ జంక్షన్లో ఉదయం 7 నుంచి 9గంటల వరకూ ఇవే చర్చలు. వెయ్యి, మూడు వేలకు పందాలు కాస్తూ బెట్టింగ్ బంగార్రాజులు చెలరేగిపోతున్నారు. చిన్నచిన్న కిరాణషాపులు, పకోడి బడ్డీలు, బంగారం షాపులు, పాన్‌షాపుల వద్ద ఈ తతంగం జరుగుతోంది. ఒక్క వీరఘట్టంలోనే కాకుండా దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అరెస్టులు చేసినా.. ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి ఇక్కడ విధులు నిర్వహించిన సమయంలో బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బెట్టింగ్‌లతో సంబంధాలు ఉన్న వ్యక్తి జిల్లాకు చెందిన వాడు కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్ల్ దారా రూ.కోట్లల్లో బెట్టింగ్‌లకు పాల్పడినట్లుగా ఈ ముఠా పోలీసులు గుర్తించారు. పట్టణంలో పుప్పాలవారివీధిలో ఓ వ్యక్తి నివాసంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి బెట్టింగ్ కిరణ్‌తో పాటు మరో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.18 లక్షల నగదు, 11 తులాల బంగారం, కేజీ వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతా ఆన్లైన్లోనే.. గతంలో ముఖాముఖిగా బెట్టింగ్‌లు కాసేవారు. కంప్యూటర్ పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఆండ్రాయిడ్ ఫోన్లతో ఆన్లైన్ బెట్టింగ్‌కు తెర తీశారు. పాలకొండ, తోటపల్లి, పార్వతీపురం, విశాఖపట్నం, బరంపురం తదితర పట్టణాల్లో క్రికెట్ మాఫియాతో కొంతమందికి సంబంధాలు ఉండడంతో బెట్టింగులు జోరందుకున్నాయి. చర్యలు తప్పవు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు చేపడతాం. యువత ఇటువంటి బెట్టింగ్‌ల జోలికి వెళ్లి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో నిఘా వేసి బెట్టింగ్ రాయుళ్లను అడ్డుకుంటాం. – స్వరూపారాణి, డీఎస్పీ, పాలకొండ డయల్ 100కు సమాచారం ఇవ్వండి బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు. ఆధారాలు లేవనుకుంటే పొరపాటే. మొబైల్ ఫోన్, ఆన్లైన్ ద్వారా ఇటువంటి బెట్టింగ్‌లకు పాల్పడితే ఆ సమాచారం క్షణాల్లో ముందుంటుంది. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. – టి.పనసారెడ్డి, అడిషనల్ ఎస్పీ, శ్రీకాకుళం -
ఫైర్ స్టేషన్ ఎదుటే అగ్ని ప్రమాదం
పాలకొండ రూరల్: పాలకొండలోని వీరఘట్టం వెళ్లే దారిలో ఫైర్‌స్టేషన్ ఎదుట జరిగిన అగ్ని ప్రమాదంలో బూరి అప్పన్నమ్మకు చెందిన ఇల్లు, టీ దుకాణం కాలిబూడిదయ్యాయి. అప్పన్నమ్మ తన ఇంటి ముందు టీ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తోంది. సోమవారం సాయంత్రం రోజువారీ సరుకుల కోసం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఈ సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఎదురుగా గ్యాస్ గొడౌన్ ఉండటంలో అక్కడి వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఆ సమయంలో వాహనం ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం విశాఖకు వెళ్లిపోయింది. అక్కడి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికి ఏం చేయలేకపోయారు. దీంతో అప్పన్నమ్మ ఇంటితోపాటు రూ.20 వేలు నగదు, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు -
వరకట్నం వేధింపుల కేసులో నలుగురు అరెస్టు
పాలకొండ రూరల్: అత్యాశకు పోయి కట్టుకున్న ఇల్లాలిని అదనపు కట్నం కోసం వేధించి ఆమె మృతికి కారణమైన అత్తింటి కుటుంబం చివరకు కటకటాల పాలైంది. సీతంపేట మండలం గుజ్జి గ్రామానికి చెందిన వివాహిత గత నెల 29న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం పాలకొండ పోలీస్‌స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ జి.స్వరూపారాణి కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గుజ్జి గ్రామానికి చెందిన నారాయణశెట్టి శివకృష్ణకు హిరమండలానికి చెందిన కేతన అలియాస్ ప్రశాంతి(22)తో 2017 మార్చిలో వివాహమైంది. నిరుపేద కుటుంబానికి చెందిన కేతన వివాహ సమయంలో వారి బంధువులు చందాలు పోగు చేసి కట్నంగా రూ.40వేల నగదుతోపాటు నాలుగు తులాల బంగారాన్ని అందించారు. అయితే వరుడి తల్లిదండ్రులు సూర్యనారాయణ, హేమలతలు తోడికోడలైన కుసుమ అదనపు కట్నం తీసుకురావాలని కేతనను 10 నెలలుగా వేధిస్తూ వచ్చారు. ఇటీవల సంక్రాంతి పండగకు కేతనను పుట్టింటికి తీసుకువచ్చిన భర్త శివకృష్ణ తనకు తులం బంగారం ఇవ్వాలని అత్తమామలను అడిగాడు. అంత ఇచ్చుకోలేక వారు కొంత బంగారాన్ని ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని శివకృష్ణ భార్యను పుట్టింట్లో వదిలి వెళ్లాడు. ఈ క్రమంలో కేతన తండ్రి సర్దిచెప్పి కూతుర్ని భర్త వద్దకు చేర్చాడు. తాను అడిగిన బంగారం తేకపోవటంతో మళ్లీ వేధింపులు ప్రారంభం కావడంతో గత నెల 29న కేతన ఇంటి సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీతంపేట పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి కేతన భర్త, అత్తమామలు, తోటికోడలిని శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
ఉద్యమానికి సై!
♦ ఏకీకృత సర్వీస్ రూల్స్‌లో గిరిజన సంక్షేమ ♦ ఉపాధ్యాయులకు అన్యాయం ♦ ఉద్యమాలకు సన్నద్ధమవుతున్న గురువులు ♦ జూలై మూడో తేదీ నుంచి ఆందోళన బాట ఉమ్మడి సర్సీస్ రూల్స్ వర్తింపజేయకపోవడంపై గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి దశలవారీ ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. మూడున ఐటీడీఏల వద్ద ధర్నాలు చేయతలపెట్టారు. 9న విశాఖపట్టణంలో రాష్ట్రస్థాయిలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమావేశం జరపడానికి నిర్ణయించారు. ఏళ్ల తరబడి గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమకు అన్యాయం జరగడాన్ని సహించలేకపోతున్నారు. సీతంపేట(పాలకొండ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 10 వేల మంది గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ఉండేవారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఆరు వేలమంది వరకు పనిచేస్తుండగా.. శ్రీకాకుళం జిల్లాలో 600 మంది వివిధ గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ వర్తింపచేస్తూ ఇటీవల రాష్ట్రపతి ఉత్వర్వులు వెలువడ్డాయి. అయితే గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ఎటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ వర్తింపజేయలేదు. దీంతో తమకు అన్యాయం జరిగిందని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 1975లోనే విద్యాశాఖ ఉపాధ్యాయులతో సమానంగా 674, 675 జీవోలను, 25.05.76 ప్రకారం 1976లో గిరిజన సంక్షేమ టీచర్లకు లోకల్ కేడరు ఆర్గనైజేషన్ కాబడిందని, 1988లో జీవో నంబర్ 32 తెలుపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆవిర్భావం నుంచి 010 పద్దు కింద జీతాలు డ్రా చేస్తున్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ పొందడానికి అన్ని అర్హతలు ఉన్నా 40 ఏళ్లుగా గిరిజన సంక్షేమ టీచర్లు ఎటువంటి పరిపాలనా పరమైన, ఉన్నతమైన పదోన్నతులు పొందలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం మెమో నంబర్ 1656 కె.కె.1/68 ప్రకారం ప్రభుత్వ విద్యాశాఖ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని ఉత్తర్వులు గిరిజన సంక్షేమ శాఖ టీచర్లకు వర్తించాలి. 2006 మార్చి పదో తేదీన ఆర్సీ నంబర్–ఏ 4145 ప్రకారం ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ 27, 2005 చట్టానికి సవరణలు చేస్తూ ఆ చట్టములో గిరిజన సంక్షేమ శాఖ టీచర్లను కూడా ఆర్డినెన్స్‌లో చేర్చమని, కామన్ సర్వీస్ రూల్స్‌లో కూడా వీరిని చేర్చాలని, కామన్ సర్సీస్ రూల్స్‌లో కూడా చేరుస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిపారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏపీ ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ 2008లో 17 మంది గిరిజన ఎంఎల్ఏలు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గిరిజన సంక్షేమ టీచర్లను, విద్యాశాఖ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌లోకి తీసుకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. ఇవీ డిమాండ్లు.. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. వాటిలో ప్రధానమైనవి.. పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ కార్యదర్శుల సమక్షంలో గిరిజన సంక్షేమ శాఖ సర్వీస్ రూల్స్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ప్రభుత్వ సర్వీస్ రూల్స్ తయారీలో ఏర్పాటు చేసిన కమిటీలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఒక రాష్ట్రస్థాయి అధికారిని, గిరిజన సంక్షేమశాఖ సర్వీస్ రూల్స్ సాధన కమిటీ నుంచి ఒక రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిని నియమించాలని, ఇక నుంచి సర్వీస్ రూల్స్‌పై పంపే ప్రతీ ఫైల్లోనూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ అని రాసినప్పుడు ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ అని రాయాలని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. -
‘తోటపల్లి’ ఆధునికరించాలి
► ‘తోటపల్లి’ ఆధునికీకరణ విస్మరించిన ప్రభుత్వం ► తోటపల్లి కాలువల పోరాట సమితి వీరఘట్టం: రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ.. రైతులను ఏటా మోసగిస్తోందని తోటపల్లి కాలువల ఆధునికీకరణ పోరాట సమితి అధ్యక్షుడు బుడితి అప్పలనాయుడు ఆరోపించారు. వీరఘట్టంలో అన్నదాతలతో కలిసి బుధవారం రాస్తారోకో చేపట్టారు. అంబేద్కర్ జంక్షన్లో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. నీరు–చెట్టు పేరుతో నిధులు దోపిడీ చేస్తోందే తప్ప తోటపల్లి కాలువల ఆధునికీకరణ అంశాన్ని మాత్రం పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. వందేళ్లు దాటిన తోటపల్లి పాత ఆయకట్టు కుడి, ఎడమ కాలువల గట్లు ఆధ్వానంగా ఉన్నాయని.. తరుచూ గండ్లు పడుతుండడంతో సకాలంలో సాగునీరు అందక రైతులు ఏటా పంటలు కోల్పోతున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారీ తోటపల్లి కాలువల ఆధునికీకరణ చేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతూ రైతులను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో సాధన కమిటీ సభ్యులు రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. కాలువల ఆధునికీకరణ జరిగే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ రాస్తారోకో, సమావేశంలో మండల నలుమూలల రైతులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని మహిళ దుర్మరణం
► మరో వ్యక్తికి తీవ్రగాయాలు పాలకొండ: మండలంలోని మంగళాపురం గ్రామ కూడలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముంజు అక్కమ్మ(40) మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన అక్కమ్మ.. భర్త చనిపోవడంతో ఇద్దరి పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఆదివారం కావడంతో మంగళాపురం గ్రామంలో ఉన్న తన చెల్లి ఎనేతల రమణమ్మ ఇంటికి బియ్యం, ఇతర సామగ్రి తీసుకువెళ్లింది. మధ్యాహ్నం వరకూ అక్కడే ఉండి భోజనం చేసి, తిరుగు ప్రయాణమైంది. బస్టాప్ వరకూ వస్తానంటూ చెల్లి రమణమ్మ కుమారుడు మురళి అనడంతో, ఇద్దరూ కలసి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. పాలకొండ–రాజాం రహదారిపైకి వచ్చేసరికి రాజాం వెళ్తున్న లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి అక్కమ్మ ముద్దలా మారింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అక్కడి నుంచి 50 మీటర్ల దూరం వరకూ లారీ దూసుకుపోయి ఆగింది. ద్విచక్రవాహనం లారీ కింది భాగంలో ఉండిపోయింది. బయటకు తుళ్లిపోయిన మురళికి కాలు విరిగింది. అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వెంటనే అతనిని రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఎం.చంద్రమౌళి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఐటీడీఏ పాలకవర్గ సమావేశం @ : 7 నెలలు
సీతంపేట(పాలకొండ): ‘ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తున్నాం.. కేవలం మూడుగంటల్లోనే ముగిస్తున్నాం.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.. గిరిజన సమస్యలపై సుదీర్గ చర్చ సాగాలి.. సమావేశాలు ప్రతి మూడునెలలకు ఒకసారి కాకుండా రెండునెలలకు ఒకసారి నిర్వహిద్దాం’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర శివాజీ గత పాలకవర్గ సమావేశంలో మొదటి ప్రశ్న లేవనెత్తారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సభ్యులు కలిసి తీర్మానం చేశారు. తరచి చూస్తే... రెండు నెలలు కాదు.. మూడు నెలలు కాదు.. ఏకంగా ఏడు నెలలైంది. పాలకవర్గ సమావేశానికి అతీగతీ లేదు. గతే ఏడాది జూన్ 23న పాలకవర్గ సమావేం నిర్వహించారు. అంతే.. అప్పటి నుంచి సమావేశం నిర్వహణకు చర్యలు తీసుకున్నవారే కరువయ్యారు. ఫలితం.. గిరిజన పల్లెల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా చర్చించేవారే లేరు. మౌలిక సదుపాయాల కల్పన, నిధుల వినియోగం, సమస్యల గుర్తింపు వంటి వాటిపై ప్రశ్నిం చే అవకాశం లేకుండా పోయిందంటూ గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. నేతలు, ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నా యి. సమస్యలు వెంటాడుతున్నా... ఐటీడీఏ పరిధిలోని 150 గ్రామాల్లో ఏటా తాగునీటి సమస్య తలెత్తుతోంది. నివార ణా చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. చాలా గ్రామాలకు రోడ్డు సదుపాయాలు లేవు. నిర్మాణానికి వేసవి కాలం అనువైనది. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదు. పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. జీసీసీ గిట్టుబాటు ధరలు కల్పన, విద్య, వైద్యసదుపాయాల కల్పన, హార్టీకల్చ, ఐడబ్ల్యూఎంపీ, చిన్ననీటి వనరులు తదితర శాఖలపై చర్చించాల్సి ఉంది. గిరిజనుల అభివృద్ధికి పునాది పడాల్సిన సమావేశం నిర్వహణలో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన సమస్యల పరిష్కారంలో టీడీపీ ప్రభుత్వం అలక్ష్యం చేస్తోందంటూ గిరిజన సంఘాల నేతలు దుయ్యబడుతున్నారు. ఇదే విషయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎల్.శివశంకర్ వద్ద ఫోన్లో ప్రస్తావించేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఐడీడీఏ ఏపీవో ఆర్.శ్యామ్యుల్ వద్ద ప్రస్తావించగా ఐటీడీఏ సమావేశ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. గిరిజన సమస్యలంటే ప్రభుత్వానికి లెక్కలేదు.. గిరిజన సమస్యలను పట్టించుకోవడం మానేశారు. రెండు నెలలకు పాలక వర్గ సమావేశాలు పెడతామని ఏడు నెలలకు కూడా పెట్టకపోతే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పటికే గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. గవర్నింగ్ బాడీ సమావేశాలు పెట్టడం ఆలస్యమైనా కనీసం ఐటీడీఏ ఉన్నతాధికారులైనా క్షేత్రస్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోనైనా సమావేశం పెట్టి సమస్యలు తెలుసుకుంటే బాగుండేది. –విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
మంగళం!
పాలకొండ రూరల్ : విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం మరో భారం మోపింది. గతంలో వినియోగదారులు తమ సమస్యలను కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదు చేసుకుంటే అక్కడి సిబ్బంది సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దాని పరిష్కారానికి 24 గంటల్లో చర్యల్లో చేపట్టేవారు. దీనికి సంబంధించి ప్రత్యేక వ్యవస్థ(కాల్‌సెంటర్)ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఈ సేవలు దూరం కానున్నాయి. ఇప్పటికే యువత ఉద్యోగాల్లేక, నిరుద్యోగ భృతి కొరవడి ఇక్కట్లు పడుతున్న క్రమంలో ఒక్కొక్కొటిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భృతి పొందుతున్న వారిపై చర్యలకు దిగడం విమర్శలకు తావిస్తుంది. అయితే కాల్ సెంటర్లలో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిని నిలిపి వేయక ప్రస్తుతానికి ప్రత్యామ్నాయం చూపించారు. నియోజకవర్గానికి ఒకటి... జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి వంతున 10 సెంటర్ల పరిధిలో విద్యుత్ వినియోగదారులకు సేవలందించేవారు. ఈ సేవలను ఏడు భాగాలుగా విభజించారు. వాటిలో కేటగిరి-1లో సాధారణ గృహాల నూతన మీటర్లు, కేటగిరి రెండులో సాధారణ వ్యాపారాలు(దుకాణాలు), కుటీర పరిశ్రమలు వంటివి, మూడులో ఇండస్ట్రీయల్, నాలుగులో చేతివృత్తులు, ఐదులో వ్యవసాయం, ఆరులో గ్రామీణ పంచాయతీలు, ఏడులో దేవాలయాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఏ చిన్న తరహా సమస్యలు తలెత్తిన కాల్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే చాలు సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు ఈ తరహా సేవలను మీ-సేవా కేంద్రాలకు బదలారుుంచారు. ఈ నేపథ్యంలో 7 కేటగిరీల్లో ఉన్న వినియోగదారులు ఇక నూతన మీటర్లు, ట్రాన్సఫార్మర్లు, నూతన విద్యుత్ లైన్లు తదితర అవసరాలకు మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిందే! సమస్యలు ఇలా .... ఇకపై వినియోగదారులకు ఎప్పుడు ఏచిన్న సమస్య వచ్చినా అందుబాట్లో ఉన్న మీ-సేవా కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ నిబంధనల మేరకు తమ ఫిర్యాదు తీవ్రతను బట్టి కొంత రుసుము వదిలించుకుని ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. అంతవరకు బాగానే ఉన్నా ఈ నూతన విధానంపై మీ-సేవా కేంద్ర నిర్వాహకులకు ఎటువంటి అవగాహనా లేదు. ఇప్పటి వరకు వీరికి ఎటువంటి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం లేదు. దీంతో వినియోగదారు తమ సమస్యలు తెలిపేందుకు మీ-సేవకు వెళ్లినా ఫలితం లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ సేవలు అందించేందుకు మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు ముందుకు రాకపోవటం కొసమెరుపు. -
శ్రీకాకుళం జిల్లా పాలకొండ గుడిలో అపచారం
-
ఎవరీ బాలుడు?
పాలకొండ : పట్టణంలో పాలకొండ-శ్రీకాకుళం రహదారిలో శుక్రవారం సాయంత్రం నుంచి అయోమయంగా తిరుగుతున్న ఈ బాలుడు ఎవరో తెలియరాలేదు. సుమారు నాలుగు సంవత్సరాలు వయస్సు ఉన్న ఈ బాలుడు పేరు సిద్దూ అని, తండ్రి బంగారు, తల్లి సుధారాణి అని చెబుతున్నాడు. వచ్చిరాని మాటలతో తమది సీతంపేట అని చెబుతున్నాడు. రహదారిలో ఏడస్తూ తిరుగుతున్న ఈ బాలుడుని బూర్జ వీఆర్వో జడ్డు నీలకంఠం గుర్తించి చేరదీశారు. ఆచూకీ కోసం పాలకొండ, బూర్జ, సీతంపేట పోలీసుస్టేషన్లలో సంప్రదించినా ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో బాలుడుని వారి సంరక్షణలోనే ఉంచారు. బాలుడుని గుర్తించిన వారు పాలకొండ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
ఎమ్మెల్యేలను లాక్కోవడమే మీ పనా..?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాలకొండ ఎమ్మెల్యే కళావతి సీతంపేట: ఎమ్మెల్యేలను లాక్కోవడానికే ప్రభుత్వం సమయమంతా ఖర్చు చేస్తోందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తోందని పాలకొండ ఎమ్మెల్యే కళావతి ఘాటుగా విమర్శించారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించి నెలలు గడుస్తున్నా ఎలాంటి పరిహారం అందలేదని తెలి పారు. కనీసం ఎన్టీఆర్ జలసిరిలో తీస్తామన్న బోర్లు కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరుగురు ఏజెన్సీ ఎమ్మెల్యేలం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఐటీడీఏ టీఎస్పీ పరిధిలో వెలు గు, యూత్‌ట్రైనింగ్ కేంద్రాలకు కంప్యూటర్లు, వివిధ రకాల మెటీరియల్ కొనుగోలులో లక్షలాది రూపాయల అ వినీతి జరిగినా దర్యాప్తు చేయకపోవ డం అన్యాయమన్నారు. ఉపకార వేతనా ల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. దీనిపై సీబీసీఐడీ ద ర్యాప్తు చేయాలన్నారు. ఎస్డీఎఫ్ జి ల్లాకు నిధులు రూ.50 కోట్లు కేటాయిస్తే ఇంతవరకు దాన్ని 10 నియోజకవర్గాలకు ఎలా పంపిణీ చేశారో చెప్ప డం లేదన్నారు. స్పోర్ట్స్ పాఠశాల ఎచ్చెర్లలో నిర్మిస్తామని, ఇప్పుడు లంబసిం గిలో పెడతామనడం ఎంతవరకు సమంజసమన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా వృద్ధులు, వితంతువుల పింఛన్లను కూడా తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పచ్చికగూడ వద్ద సోమవారం మధ్యాహ్నం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పాలకొండకు చెందిన డీఏవీ స్కూల్ బస్సును చెరకు లోడుతో వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఆ సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. గాయపడిన విద్యార్థులను సీతంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
జన్మభూమి కమిటీల తీరును కోర్టులో తేల్చుకుంటాం
పాలకొండ: ప్రజాప్రతినిధులను కాదని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలపై కోర్టులో తేల్చుకుంటామని వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం పాలకొండలో సీనియర్ నాయకుడు పాలవస రాజశేఖరం నివాస గృహంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జన్మభూమి కమిటీలు చేపడుతున్న అన్యాయాలను ఆయనకు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఇప్పటికే ఈ కమిటీలపై కోర్టులో పిల్ దాఖలు చేశామన్నారు. ఈ కేసు విచారణలో ఉందని, త్వరలోనే న్యాయం జరుగుతుందని వివరించారు. గ్రామాల్లో అర్హులకు అన్యాయం జరిగితే సంబంధిత వివరాలతో తమకు తెలియజేయాలని చెప్పారు. అటువంటి వాటిని కోర్టు దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రతి గ్రామంలోనూ సంక్షేమ పథకాలు అందించడంలో వివక్షత కొనసాగుతోందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు. ప్రతి పథకానికి జన్మభూమి కమిటీలకు పెత్తనం అందిండంతో రాజకీయూలు చేస్తూ పేదలకు పథకాలు దక్కకుండా చేస్తున్నారని వివరించారు. ఈ సమస్యలపై పోరాటం సాగిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేయాలని, ప్రజలకు మేలు జరిగేలా పోరాటాలు సాగించాలని తెలిపారు. -
జన్మభూమి కమిటీలపై న్యాయపోరాటం: బొత్స
పాలకొండ (శ్రీకాకుళం): జన్మభూమి కమిటీలపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కోర్టును ఆశ్రయించినట్టు ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం నివాసానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జన్మభూమి కమిటీల వల్ల అన్యాయానికి గురైనవారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొస్తే వారి తరఫున పార్టీయే న్యాయ పోరాటం చేస్తుందన్నారు. -
ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు మృతి
పాలకొండ రూరల్/సీతంపేట : సీతంపేట మండలం సరిహద్దుగూడ ప్రాంతంలో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాలకొండ నుంచి ట్రాక్టర్‌తో ఇసుకను తీసుకువెళ్తుండగా సరిహద్దుగూడ గ్రామానికి సమీపించగానే ట్రాక్టర్ ఘాట్ రోడ్డు దిగుతుండగా అదుపు తప్పి చెట్టుకు ఢీకొని లోయలో పడింది. ఇసుక తొట్టెపై కూర్చున్న సవర తోటయ్య(25) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ బాపయ్య(32)ను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. తోటయ్యకు భార్య అలివేలు, ఒక కుమార్తె ఉన్నారు. అంతకు ముందు తీవ్రంగా గాయపడ్డ బాపయ్య, సుగయ్యలను పాలకొండ ఏరియూ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. సుగయ్యను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పోస్ట్‌మార్టానికి నిరాకరణ చర్చి నిర్మాణానికి ఇసుక తీసుకువస్తుండగా మృతి చెందిన తోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఎస్ఐ శ్రీనివాసరావు, సర్పంచ్ సారుుకుమార్, చర్చి పాస్టర్ వసంత్‌కుమార్ వారికి నచ్చజెప్పి ఒప్పించారు. కూలికని వెళ్లి... రోజూలాగే తోటయ్య, బాపయ్య కూలికని ట్రాక్టర్‌తో వెళ్లారు. సాయంత్రం వేళ ఇంటికి వస్తారని ఎదురు చూసిన వారి కుటుంబ సభ్యులకు వారి మృతి వార్త అందింది. తమ కుటుంబ పెద్దలు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. ఇక తమ దిక్కెవరూ అంటూ రోదించారు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించారుు. ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. పాలకొండ డివిజన్ పరిధిలో నాగావళి, వంశధార నదీ తీరాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనటానికి ఈ ఘటన అద్దం పడుతోంది. కాసుల కక్కుర్తితో ఇసుక ట్రాక్టర్ల యాజమానులతో పాటు మరి కొంత మంది నాటు బళ్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇదే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విలువైన కలపతో పాటు ఇతర ముడి సరకులు వక్రమార్గాన పక్కదారి పడుతున్నాయి. వీటన్నింటిని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్, ఐటీడీఏ అధికారులు సైతం ఇటువంటి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపకపోవటం అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలని పలువురు సూచిస్తున్నారు. -
మంత్రిగారూ...మీరిచ్చిన హామీ ఏమైంది?
పాలకొండ రూరల్ : ‘పార్టీలకు అతీతంగా నూతన కార్డులు పంపిణీ చేశాం.. సీఎం ఆదేశాల మేరకు కొత్త కార్డుదారులకు కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా చంద్రన్న కానుకలు అందించండి.. దయచేసి డీలర్లు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.. మీలో కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.. కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించండి...’ ఇది సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీత వారం రోజుల క్రితం పాలకొండ పట్టణ ంలో చెప్పిన మాటలు. పట్టణంలోని 6వ వార్డు జన్మభూమి సభలో పాల్గొన్న ఆమె ఈ విషయూన్ని సభా ముఖంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలో దాదాపు మండల వ్యాప్తంగా 32 పంచాయతీల పరిధిలో 16 వేలకు పైబడి కార్డులు మంజూరు కాగా పట్టణానికి సంబంధించి 2,200 పైచిలుకు కార్డులు మంజూరయ్యాయి. అయితే వీటికి సంబంధించి చంద్రన్న కానుకల విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండగంటి పూట... ఇప్పటికే చంద్రన్న కానుకల పేరిట ఆరు వస్తువులతో కూడిన సరుకుల సంచిలో వచ్చిన సరుకుల్లో డొల్లతనం బయట పడింది. దీనికి తోడు డీలర్లు ఈ సంచిని లబ్ధిదారులకు అందించేందుకు చలాన పేరిట రూ.10, పండగ మామూళ్లు అంటూ మరో రూ.20 బహిరంగంగానే వసూలు చేశారు. ఇంత జరిగినా మళ్లీ వేలిముద్రలు పడలేదంటూ, నూతన కార్డుదారులు తమ పాత కుటుంబ సభ్యుల కార్డుల్లో పేర్లు ఉన్నాయంటూ లేనిపోని నిబంధనలు సృష్టించి సరుకులు ఇచ్చేందుకు అయిష్టాన్ని వ్యక్తం చేయడంతో పాటు అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు స్పష్టంగా నూతన కార్డులకు సంబంధించి సంక్రాంతి కానుకలు అందించాలని జాబితాలను డీలర్లకు అందించినప్పటికీ ఆ తరహా లబ్ధిదారులకు కూడా సరుకులు అందించడం లేదు. ఆఖరి నిమిషంలో... ఇప్పటికే ఐరిష్‌లు, వేలిముద్రలు పడక ఇవ్వకపోవడం ఒకెత్తయితే దీనిపై వచ్చిన ఆరోపణలపై వీఆర్ఒ, సంబంధిత పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో గ్రామాల్లో, పట్టణానికి వచ్చేసరికి కౌన్సిలర్ల సమక్షంలో సరుకులు అందించాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అలా కాకుండా డీలర్లు సరుకులు పంపిణీ చేయకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ సరుకులు ఇవ్వకపోతే మిగిలిన సరుకులను వారే రికార్డుల్లో నమోదు చేసి చేతివాటం కనపర్చే అవకాశం ఉందని అందుకే సరుకులు అందించడం లేదంటూ పలువార్డుల్లో లబ్ధిదారులు, కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కార్డుల పంపిణీ విషయంలో జంబ్లింగ్ కారణంగా వార్డులు మారిపోవడంతో ప్రతి డీలరుకు 10శాతం బ్యాగులు అదనంగా ఇచ్చారని అయినప్పటికీ పం పిణీ విషయంలో వీరు వెనుకడుగు వేయ డం విడ్డూరంగా ఉందని పేర్కొంటున్నా రు. దీంతో ప్రతి రేషన్ డిపో వద్ద ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం నాటికి పాలకొండ పట్టణంలో ఈ తరహా ఘటనలు అధికం కావడం కొసమెరుపు. ఇదే విషయమై సీఎస్‌డీటీ సోమేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఎటువంటి నిబంధనలు లేకుండా సరుకులు అందించాలని డీలర్లును ఆదేశించామని, సమస్యలుంటే సరి చే స్తామన్నారు. -
కుక్కల భీభత్సం:15 మందికి గాయాలు
పాలకొండ: శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కుక్కలు భీభత్సం సృష్టించాయి. పట్టణంలోని మేదర వీధి, వెంకటరాయుని కోనేరు దరి ప్రాంతాల్లో కుక్కలు దాడి చేసి 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కుక్కల బెడదతో పట్టణ వాసులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. -
108లో గర్భిణీ మృతి
పాలకొండ (శ్రీకాకుళం) : 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణి పరిస్థితి విషమించి కన్నుమూసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం సాంబం పంచాయతీ బిదిండిగూడ గ్రామానికి చెందిన సవర అనురాధ(22) ప్రసవ వేదనతో బాధపడుతుండగా పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో అక్కడి వైద్యులు శ్రీకాకుళం రెఫర్ చేశారు. అక్కడి నుంచి 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా బూర్జ మండలం పాలవలస గ్రామం వద్ద గర్భిణీ కన్నుమూసింది. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పాలకొండలో తెలుగుతమ్ముళ్ల బాహాబాహీ
పాలకొండ (శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. శుక్రవారం పాలకొండ మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ పంక్షన్ హాల్లో నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు శిరీష, నియోజకవర్గ ఇన్చార్జ్ జైకృష్ణ ఇతర పార్టీ నాయకులు హాజరయ్యారు. కాగా నియోజకవర్గ ఇన్చార్జ్ ఏకపక్ష తీరును ఆ పార్టీ కార్యకర్తలు అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షురాలి సమక్షంలోనే జైకృష్ణ వర్గం..ఇతర పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల తెలుగు తమ్ముళ్లను శాంతపరిచారు. -
మూడో విడతలోనూ మతలబే..
పాలకొండ: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్పించిన రుణమాఫీలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గత రెండు విడతల్లో నమోదైన తప్పులే పునరావృతమయ్యాయి. గతంలో రైతుల నుంచి వివరాలు సేకరించి సరి చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మూడో విడతలో జిల్లాలో 15వేల మందికి లబ్ధిచేకూరుతుందని అధికారులు ప్రకటిస్తున్నారు. గతంలో రుణ మాఫీ వర్తించని దాదాపు 40వేల మంది రైతులు తప్పులు సరి చేయమంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎవ్వరికీ మూడో విడతలో మాఫీ కాలేదు. ఫిర్యాదులు ఏమయ్యాయి.. ప్రభుత్వ ఆదేశాలతో గత నెల వరకు అధికారులు హడావుడిగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రోజుల తరబడి రైతులు ఈ కేంద్రాల చుట్టూ తిరిగి అవస్థలు పడి ఆధారాలు అందించారు. ప్రస్తుతం దీని ప్రకారమే మూడో విడత ప్రకటించినట్లు చెబుతున్నారు. మరి రైతులు అందించిన ఫిర్యాదులు ఏమి అయ్యాయి.. ఎందుకు సరి చేయలేదన్నదానికి అధికారుల వద్ద సమాధానం లేదు. మేము సరి చేశాం.. బ్యాంకులకు వచ్చిన వివరాల ప్రకారం రైతు ఖాతాల్లో వివరాలు సరి చేశాం. సుమారు 3వేల ఖాతాలకు రైతుల జాబితాలను అనుసంధానం చేశాం. అయినా రుణ మాఫీ జాబితాలో తమ పేర్లు లేవని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేశాం. ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాం. - ఎస్.మదుసూదన్- స్టేట్‌బ్యాంకు మేనేజర్, పాలకొండ రైతులను మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం రుణ మాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతోంది. తప్పును బ్యాంకర్ల మీదకు నెట్టివేసే ప్రయత్నం చేస్తోంది. సవాలక్ష నిబంధనలతో 20 శాతం రైతులకు కూడా రుణమాఫీ వర్తించకుండా చేశారు. అందులోనూ మాఫీ అయిన మొత్తం రైతులు వడ్డీకే చాలడంలేదు. ఖరీఫ్‌లో రైతులకు రుణమాఫీ కాలేదు. కొత్త రుణం మంజూరు కాలేదు. కేవలం మాఫీ పేరును ప్రకటనలకే పరిమితం చేశారు. - విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ - రేగిడి మండలం బొడ్డవలసకు చెందిన మజ్జి మోహనరావు పాలకొండ స్టేట్‌బ్యాంకులో 4.93 ఎకరాల భూమిపై రుణం తీసుకున్నారు. మొదటి విడత రుణమాఫీ సమయంలో ఈయనకు రెండు ఎకరాల పొలం మాత్రమే ఉన్నట్టు చూపించారు. ఆయన రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే సర్వే నంబర్ల ప్రకారం ఆయన భూమికి సంబంధించిన వివరాలతో తహశీల్దారు ధ్రువపత్రాలు జారీ చేశారు. ఈ ధ్రువపత్రం జత చేసి బ్యాంకుకు సమర్పించటంతో రుణ మాఫీ అవుతుందని ఆశించారు. ప్రస్తుతం మూడో విడతలోను ఆయనకు రెండెకరాలే ఉన్నట్టు చూపిస్తున్నారు. - సరుబుజ్జిలి మండలం కొత్తకోటకు చెందిన సురవరపు కృష్ణారావుకు మొదటి, రెండో విడతల్లో ఆధార్, రేషన్ కార్డుల నంబర్లు తేడాగా ఉన్నాయంటూ మాఫీ వర్తింపచేయలేదు. దీంతో ఆయన ఆ వివరాలు తీసుకుని జిల్లా కలెక్టర్‌కు, అనంతరం లీడ్ బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. వారు స్థానిక రెవెన్యూ కార్యాలయానికి, బ్యాంకుకు సమాచారమిచ్చి సరి చేశామని సెల్‌ఫోన్‌కు మెసేజ్ పెట్టారు. తాజాగా ప్రకటించిన మూడో విడతలోనూ ఆయనకు మొండి చెయ్యే ఎదురైంది. ఆయన బ్యాంకు మేనేజర్‌ను ప్రశ్నిస్తే తాము సరి చేసినట్టు ధ్రువపత్రం అందించారు. ఇదీ రుణమాఫీ పథకంలో రైతులకు ఎదురవుతున్న సమస్యలు. వీరిద్దరే కాదు ఎంతో మందిరైతులకు లేనిపోని ఆంక్షలు చూపి రుణమాఫీ వర్తింపజేయకుండా జాప్యం చేస్తున్నారు. -
ఆయిల్‌పై జీసీసీ బాదుడు
సీతంపేట: గిరిజనులకు వెన్నుదన్నుగా నిలిచి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) పరోక్షంగా వారిపై అధిక ధరల భారం మోపుతోంది. తక్కువ ధరలకే నిత్యావసర సరకులను విక్రయించాల్సిన జీసీసీ మార్కెట్ ధర కంటే అధికంగా వసూలు చేస్తూ గిరిజనులను నిలువుదోపిడీ చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ డిపోల ద్వారా పామాయిల్ సరఫరా ఏడాదిగా నిలిపివేయడంతో అందరూ సన్‌ఫ్లవర్ నూనెలనే వాడుతున్నారు. సీతంపేట ఏజెన్సీలోని పల్లెలు మారుమూలన ఉండడంతో జీసీసీ డీఆర్‌డిపోల(రేషన్) ద్వారా గిరిజనులకు కావాల్సిన సరుకులను విక్రయిస్తుంటారు. మార్కెట్ ధర కంటే రూపాయి, రెండు రూపాయలు తగ్గించి అమ్మకాలు జరపాల్సిన జీసీసీ ఆ నిబంధనలను తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా రిఫైన్డ్ సనఫ్లవర్ ఆయిల్‌ను చెప్పుకోవచ్చు. ఆధార్ నూనె ప్యాకెట్లు లీటర్‌వి కొన్ని డీఆర్‌డిపోల్లో రూ. 81, మరికొన్ని చోట్ల రూ.82 కి విక్రయిస్తున్నారు. సీతంపేటలోని బయట మార్కెట్లో రూ.76కి విక్రయిస్తుండగా, పాలకొండలో రూ. 75కే దొరుకుతోంది. బయట మార్కెట్ రేటు కంటే జీసీసీ మరో ఐదారు రూపాయలు అధికంగా విక్రయించడం పట్ల గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ ప్యాకెట్‌పై ముద్రిత ధర వంద రూపాయలున్నప్పటికీ హోల్‌సేల్‌గా తక్కువ ధరకే ప్రైవేట్ షాపుల్లో విక్రయిస్తున్నారు. ప్రైవేట్ దుకాణాల కంటే ప్రభుత్వ షాపులో ఎక్కువ ధరలకు విక్రయించడమేమిటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. హోల్‌సేల్‌గా ఎక్కువ ప్యాకెట్లు బాక్సుల రూపంలో కొనుగోలు చేస్తే రూ.73 లోపే ధర పడుతుందని పలువురు వ్యాపారులే తెలియజేస్తున్నారు. -
నాటుతుపాకుల కలకలం
పట్టపగలు ఓ ఆటోలో రహస్యంగా నాటు తుపాకుల రవాణా గుట్టురట్టు కావడం పాలకొండలో కలకలం రేపింది. ఏజెన్సీ ప్రాంతంనుంచే ఇవి రవాణా కావడం పోలీసుశాఖకు సవాల్‌గా మారింది. వన్యప్రాణుల వేటకోసం వినియోగిస్తున్నారా.. లేక ఇంకే అవసరానికా... అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పాలకొండ : ఒక ఆటోలో దర్జాగా ఎనిమిది నాటుతుపాకులు రవాణా జరుగు తూ పోలీసులకు పట్టుబడి న సంఘటన పాలకొండ పట్టణంలో చర్చనీయాంశమైంది. పోలీసు స్టేషన్ ముందు నుంచే వీటిని తరలించేసినా... ఎవరూ గుర్తు పట్టలేదు. అయితే ఆటో ఓ వ్యక్తిని ఢీకొనడంతో వారు అందించిన సమాచారం మేరకు వెంబడించి పట్టుకోగా అందులో అసలు గుట్టు రట్టయింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో కొద్ది కాలంగా వన్యప్రాణుల వేట నిరాటంకంగా సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వన్యప్రాణుల వేటనే కొందరు వృత్తిగా మలచుకుని జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. సీతంపేట మండలం ఈతమానుగూడ నుంచి తాజాగా ఆటోలో ఎనిమిది తుపాకులు పెట్టి గొనె సంచులు కప్పారు. వెనుక భాగంలో రెండు చురకత్తులు, బియ్యం, ఉప్పు, ఉల్లిపాయలు ఇతర సామగ్రితోపాటు ఐదు రోజులకు సరిపడే దుస్తులు పట్టేలా ఐదు బ్యాగ్‌లు లభించాయి. ఆటో డ్రైవర్ పప్పల చంద్రశేఖర్ మద్యం మత్తులో ఉండి పోలీసులకు చిక్కగా మరో ఎనిమిది మంది పారిపోయినట్టు చెబుతున్నారు. దీనిని బట్టి ఏజెన్సీలో అడవి పందులు, దున్నలు, జింకలను వేట సాగిస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. చంపిన జంతువుల చర్మం తొలగించి మాంసంగా మార్చేందుకు పదునైన చురకత్తులు వినియోగించవచ్చని భావిస్తున్నారు. అడవి పందులను హతమార్చేందుకేనా... పాలకొండ ప్రాంతంలో విరివిగా చెరకు పంటను సాగు చేస్తున్నారు. వాటిని అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈతమానుగూడకు చెందిన గిరిజనులను గోపాలపురం గ్రామంలో చెరకు పంటల్లో పడుతున్న అడవి పందులను హతమార్చేందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో నాటు తుపాకులు, కత్తులు, నాటు బాంబులకు వినియోగించే మందుగుండు సామగ్రి వెలుగు చూడటంతో వన్యప్రాణులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న తీరు ఇట్టే అర్థమౌతోంది. సంబంధిత ఆటవీశాఖ అధికారులు కాని, పోలీసులు కాని దీనిపై దృష్టిసారించలేదు. దీనికి తోడు అటవీశాఖలో కొంత మంది సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న కృష్ణ జింకుల వేటసైతం సాగుతున్నట్టు తెలుస్తోంది. మాంసం ఏమి చేస్తున్నట్టు.. దట్టమైన ఆడవిలతోపాటు చెరుకు తోటల్లో వేట సజావుగా సాగుతోంది. వన్యప్రాణులను చంపి ఆ మాంసాన్ని ఎక్కడ విక్రయిస్తున్నారన్న దానిపై అధికారులు దృష్టిసారించాల్సి ఉంది. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లో మాంసం విక్రయాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అడవిలోనే మాంసాన్ని ప్యాక్ చేసి పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారించి దర్యాప్తు జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. కాగా నాటుతుపాకుల స్వాధీనంపై డీఎస్పీ సిహెచ్.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రాధమికంగా అడవి పందుల వేట కోసమే వీటిని వినియోగించినట్టు నిర్థారణకు వచ్చామన్నారు. పారిపోయిన నిందితులను పట్టుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందున్నారు. హత్యలు, దోపిడీల కోసం వీటిని వినియోగించినట్టు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. -
పోలీసులకు సవాల్‌గా ప్రమీల హత్య కేసు !
పాలకొండ: సంచలనం కలిగించిన పాలకొండకు చెందిన ప్రమీల హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని త్వరగా పట్టుకోవడానికి పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. హంతకులు ఏ ఒక్క ఆధారాన్ని ఉంచకుండా ప్రణాళిక ప్రకారం హ త్య చేసి జారుకోడంతో దీన్ని ఎలాగైనా ఛేదించాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. శుక్రవారం దారుణ హత్యకు గురైన ప్రమీల మృతదేహానికి శనివారం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం కేసును ఛేదించే పనిలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. హత్యకు ప్రోత్సహించేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఇప్పటికే కేసుపై ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. పోస్టుమార్టంలో ప్రాథమికంగా కొన్ని ఆధారాలు బయటపడినట్టు సమాచారం. హంతకులు అత్యంత కిరాతకంగా హతమార్చారని వైద్యులు నిర్ధారించారు. మెడ, గెడ్డంపైన కత్తిపోట్లతో పాటు తలపై మెదడు బయటకు వచ్చేలా కర్రతో బాదిన ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం. కేసులో కీలకంగా మారే మరికొన్ని అంశాలను గోప్యంగా ఉంచారు. కాగా హత్య జరిగిన ఇంట్లో రెండు ప్లేట్లలో ఆమ్లెట్ లు వేసి ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా మృతిరాలి భర్త శుక్రవారం నాన్‌వేజ్ తీసుకోరని, ఇవి ఎందుకోసం వేసి ఉంటారన్న దానిపైన పోలీసులు దృష్టిసారించారు. మరోవైపు హంతకులు బీరువాల జోలుకుపోకుండా కేవలం హత్యకు గురైన మహిళ మెడలోనూ, చేతికి ఉన్న బంగారు ఆభరణాలను తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. రక్తపు మడుగులో ఒక చైన్ దొరికినట్టు సమాచారం. దొంగతనానికి వచ్చిన వారైతే బీరువాలను సైతం విరగొట్టేవారని, కేవలం అందుబాటులో ఉన్న బంగారం ఎత్తుకుపోవడం, అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరంపై పోలీసులు దృష్టిసారించారు. పరిసరాలను పరిశీలించాక పూర్తిగా వీరి కోసం తెలిసిన వ్యక్తి సహాయం లేకుండా ఇంట్లోకి చొరబడడం సాధ్యం కాదని చెబుతున్నారు. స్థానికుల సహాయంతోనే ఈ సంఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసు జాగిలాలు ఆస్పత్రి రహదారిగుండా వెళ్లి పక్కనే ఉన్న వీధులో నుంచివెంకటరాయుని కోనేరు గట్టుకు చేరుకున్నాయి. అనంతరం చెరువులో దిగడం, సేదతీర్చేందుకు ఏర్పాటు చేసిన బల్ల చుట్టూ తిరిగి ఉండిపోయాయి. దీంతో నిందితుడు చెరువులో రక్తపు మరకలు కడుక్కొని బళ్లపై సేదదీరినట్టు భావిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఈ దారులు తెలుసుకోవడం కష్టమని, ఈ పరిస్థితిలో హత్యకు పాల్పడింది తెలిసిన వారిగా భావిస్తున్నారు. ఎస్పీ సందర్శన ఎస్పీ ఏ.ఎస్.ఖాన్ శనివారం 12 గంటలకు సంఘటన జరిగిన ఇంటికి చేరుకొని గంటపాటు పరిశీలన చేశారు. చుట్టుపక్కల వారిని ఆరా తీయడంతో పాటు పరిసరాలను గమనించారు. ఇంట్లో అన్నింటినీ పరిశీలించారు. డీఎస్పీ ఆదినారాయణకు కేసుపై సూచనలు చేశారు. -
గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం
పాలకొండ: రేగిడి మండలం సంకిలి గ్రామం వద్ద రెండ్రోజుల కిందట నాగావళి నదిలో గల్లంతైన రాజాం మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన యువకుడు కోనాడ తిరుపతిరావు (22) మృతదేహం లభ్యమైంది. పాలకొండ మండలం అంపిలి గ్రామ పరిసరాల నాగావళి నదిలో మృతదేహం ఉండటాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై ఎల్.చంద్రశేఖర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ నగర పంచాయతీ సమన్వయకర్త పల్లా కొండలరావులు మృతదేహం వద్దకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం బాగా కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో నది ఒడ్డునే శవపంచనామ, పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై గాయాలైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. కేసును రేగిడి పోలీసులకు రిఫర్ చేయనున్నట్టు పాలకొండ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. యువకుని మృతిపై దర్యాప్తు రేగిడి : రాజాం నగర పంచాయతీ బుచ్చెంపేటకు చెందిన యువకుడు కోరాడ తిరుపతి నాగవళి నదిలో గల్లంతై మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిరావుతోపాటు మంగళాపురానికి చెందిన వడ్డాది వినోద్, పొనుగుటివలసకు చెందిన పూతిక సింహాచలంలు కూడా నదిలో స్నానానికి వెళ్లారు. తిరుపతిరావు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడా, ఇంకేమైనా సంఘటన జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎన్.కామేశ్వరరావు విలేకరులకు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వాస్తవం వెలుగు చూస్తుందన్నారు. -
నిండుకున్న ఇసుక !
పాలకొండలోని గారమ్మ కాలనీకి చెందిన వితంతువు కోనారి సరస్వతమ్మ ప్రభుత్వమిచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని ఏడాది కిందట తలపెట్టింది. నిర్మాణం జరపకపోతే రద్దు చేస్తామని అధికారులు ఆదేశించడంతో అప్పు చేసి పునాదులేసింది. ఇందిరమ్మ ఇల్లు బిల్లులు మంజూరు కాకపోవడంతో సొంతంగానైనా గూడు నిర్మించుకోవాలని ఆరాట పడింది. అప్పు చేసి పునాదులు నిర్మిస్తున్న సమయంలో ఇసుక ధరలు రెట్టింపు కావడంతో నిర్మాణాన్ని నిలిపేసి వలస బాట పట్టింది. పాలకొండకు చెందిన ఓ ఉపాధ్యాయుడు వేసవి సెలవుల్లో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నారు. సిమెంట్, ఇనుము ధరలతోపాటు ఇసుకకు కూడా రెట్టింపు ధర చెల్లించాల్సి ఉన్నా ప్రత్యామ్నాయ మార్గం లేక ఆ మేరకు ప్రణాళిక తయారు చేసుకున్నారు. అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత ఎంత ధర చెల్లించినా.. ఇసుక దొరకని పరిస్థితి. దీంతో నిర్మాణానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం సొంత గూడు నిర్మించుకోవాలనుకున్న వారికి ఎదురౌతున్న ఇసుక కష్టాలకు ఇవి తార్కాణం. ఇది ఏ ఒకరిద్దరి సమస్య కాదు ఇది. జిల్లా అంతటా గృహ నిర్మాణదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. పాలకొండ : నూతన ఇసుక విధానంతో ఖజాన నింపుకోవడమే ప్రధాన ధ్యేయంగా జిల్లాలో 28 ర్యాంపులను ప్రభుత్వం ప్రారంభించింది. వీటి పరిధిలో 20,82,253 క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయించేందుకు సిద్ధం చేసింది. ఇందులో ఇంత వరకు 7,40,182 క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.42,42,36,012 ఆదాయం సమకూరింది. ఇంత వరకు విక్రయించిన ఎనిమిది ర్యాంపుల్లో పూర్తిగా ఇసుకను తోడేశారు. మిగిలిన 20 ర్యాంపుల్లో పది వివాదాల్లో చిక్కుకున్నాయి. గ్రామ పంచాయతీలకు ముంపు వాటిల్లేవిగా ఉండటం, అధికార పార్టీ నాయకులు హవా, కోర్టు వివాదాలతో ఇలా పది ర్యాంపులు నిలిచిపోవడంతో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రధానంగా వంశధార నదీతీరంలో ఉన్న ఆకులతంపర, సింగూరు, తమరాం, గోపాలపెంట తదితర ఇసుక ర్యాంపుల నుంచి లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. కొనసాగుతున్నవి ఐదే జిల్లాలో ప్రస్తుతం ఐదు ఇసుక ర్యాంపులే కొనసాగుతున్నాయి. క.ఖాండ్యం, ముద్దాడపేట, పర్లాం, పొన్నాడ, బుచ్చిపేట ర్యాంపులు ప్రస్తుతం పని చేస్తున్నాయి. వీటిలో కూడా ఇసుక నిల్వలు దాదాపు 80 శాతం పూర్తికావచ్చాయి. మరో పది, పదిహేను రోజుల్లో ఇసుక ర్యాంపుల లక్ష్యాలు పూర్తి కానున్నాయి. దీంతో కొత్త ర్యాంపులు ఏర్పాటయ్యే వరకు జిల్లాలో ఇసుకకు తీవ్రత కొరత తప్పేటట్టు లేదు. ఇతర ప్రాంతాలకు తరలిన ఇసుక ఇంతవరకు జిల్లా నుంచి విక్రయించిన ఇసుకలో 80 శాతం ఇతర ప్రాంతాలకే తరలిపోయింది. జిల్లా వాసులకు కేవలం 20 శాతం కూడా చేరలేదు. అందుబాటులో ర్యాంపులు లేకపోవడంతో గృహ నిర్మాణదారులకు ఇసుక ఇబ్బందులు తప్పటం లేదు. ట్రాక్టర్ ఇసుక కోసం రూ.3,500 చెల్లిస్తే రవాణా ఖర్చులకు మరో రూ. 3,500 చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఇళ్లు నిర్మాణాలు 90 శాతం మేర తగ్గాయి. పెరుగుతున్న వలసలు ! జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో కూలీలగా పని చేస్తున్న వారు సుమారు ఆరు లక్షల మంది ఉన్నారు. ఇసుక కొరతతో నిర్మాణాలు నిలిచిపోయిన కారణంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులంతా గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర నగరాలకు వలస బాట పడుతున్నారు. రోజూ వందలాది మంది బతుకు తెరువు కోసం వలస వెళ్తున్నారు. -
కేంద్ర ఆస్పత్రి ఆశలు ఆవిరి !
దశాబ్దాల కలనెరవేరుతోందని ఆశించిన పాలకొండ ప్రాంతవాసుల ఆశలు ఆవిరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రిని పాలకొండలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు పాతరేసే దిశగా ఓ ముఖ్యనేత పావులు కదుపుతుండడంతో ఈ ప్రాంత వాసులు రగిలిపోతున్నారు. ఏజెన్సీ ముఖద్వారమైన ఇక్కడకు శ్రీకాకుళంలో ఉన్న కేంద్ర ఆస్పత్రిని తరలించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. దీని కోసం దాదాపు అన్ని రకాల అనుమతులు, పరిశీలనలు పూర్తయ్యాయి. ఆస్పత్రి ఏర్పాటే తరువాయి అనే సమయంలో ప్రభుత్వం మారడంతో విషయం మరుగున పడింది. తాజాగా కేంద్ర ఆస్పత్రిని టెక్కలి డివిజన్ కేంద్రానికి తరలించే యోచన తెరపైకి రావడంతో పాలకొండకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ: పదేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో రిమ్స్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. దీంతో కేంద్ర ఆస్పత్రిని జిల్లాలోని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో నేతల మధ్య పోటీ పెరిగి తమ ప్రాంతంలోనే ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చాయి. అప్పటి కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి టెక్కలి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయాలని పట్టుపట్టగా.. జైడ్పీ చైర్మన్‌గా పని చేసిన పాలవలస రాజశేఖరం పాలకొండలో ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో జిల్లాలో ఎక్కడ కేంద్ర ఆస్పత్రి అవసరమన్నది గుర్తించేందుకు కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని ప్రాంతాల్లో సర్వే జరిపి పాలకొండ ప్రాంతానికి అవసరమని నివేదికలు అందించింది. ఇదే విషయమై అప్పటి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో 250 పడకల కేంద్ర ఆస్పత్రిని పాలకొండలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుతమున్న వంద పడకల ఏరియా ఆస్పత్రిలో పరిశీలిన పూర్తి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రైన రోశయ్య కూడా పాలకొండలో కేంద్ర ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని ప్రకటించారు. అయితే ఆ తరువాత ప్రభుత్వాలు మారడంతో ఈ విషయం మరుగునపడిపోయింది. తాజాగా కేంద్ర ఆస్పత్రిని టెక్కలిలో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అనడంపై ఈ ప్రాంతంలో అసంతృప్తి రగులుతుంది. ఏజెన్సీకి అన్యాయం.. పలుమార్లు జరిపిన సర్వేలో పాలకొండలోనే కేంద్ర ఆస్పత్రి నిర్మాణం జరపాలనడానికి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలన్నది సారాంశం. నిత్యం వ్యాధులు విజృభిస్తుండటం, స్థానికంగా వైద్యం అందకపోవడంతోప్రతి చిన్న రోగానికి జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సి వస్తుంది. పాలకొండను ఆనుకుని ఉన్న వీరఘట్టం, సీతంపేట, భామిని, కొత్తూరు, రేగిడి తదితర మండలాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యం కొంతమంది నేతల తీరు కారణంగా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలి: పాలవలస ప్రభుత్వాలు మారుతుంటాయి.. పాలకలు మారుతుంటారు.. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరముందని జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం అన్నారు. ఏజెన్సీ ప్రాంతంతో కూడుకున్న పాలకొండలో కేంద్ర ఆస్పత్రి ఏర్పాటుకు అన్ని రకాల అడ్డంకులు గతంలోనే తీరిపోయావని, సర్వేలో సైతం పాలకొండలో ఏర్పాటు చేయాలని తేలిందన్నారు. ప్రధానంగా గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం కృషి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం నాయకులు తమ స్వార్థం కోసం గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని కుంటిపర్చటం సమంజసం కాదన్నారు. దీనిపై అన్ని పక్షాల నేతలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. -
అసెంబ్లీ కమిటీల సభ్యులుగా మన ప్రతినిధులు
రాజాం, పాలకొండ రూరల్: రాష్ట్ర శాసనసభకు సంబంధించిన పలు కమిటీల్లో జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం లభించింది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయం మేరకు ఈ నియామకాలు జరిగాయి. షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) లెజిస్లేటివ్ కమిటీ సభ్యుడిగా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులును నియమించారు. ఈ కమిటీలో ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను నియమించారు. రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఈ కమిటీ పర్యవేక్షించి అసెంబ్లీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మహిళాశివు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి 11 మంది సభ్యులతో నియమించిన లెజిస్లేటివ్ కమిటీలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి చోటు లభించింది. ఈ కమిటీలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి తమకు అప్పగించిన శాఖలకు సంబంధించిన పథకాల అమలు తీరు, లోటుపాట్లు పరిశీలిస్తాయి. -
ఆన్లైన్ మాయ
పాలకొండ: పరశురాంపురం గ్రామానికి చెందిన సీహెచ్ చిన్నారావు ఫిబ్రవరి 10న పాలకొండ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో 63 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. నెల రోజులు దాటినా బిల్లు చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా వందలాది రైతుల దుస్థితి ఇదే. ధాన్యం విక్రయాలకు సంబంధించి బిల్లుల కోసం నెలల తరబడి బ్యాంకులు, కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. అధికారులు మాత్రం ఆన్లైన్లో మాయ చేస్తున్నారు. చెల్లింపులన్నీ పూర్తి చేసేశామని.. పెండింగు బిల్లులే లేవని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. మరి తమ సంగతేమిటని బిల్లులు అందని రైతులు ఆందోళనగా ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఈ సీజన్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రేడ్-1 రకం 351.86 క్వింటాళ్లు, సాధారణ రకం 4,47,675.75 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 31,957 మంది రైతుల నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు ఆన్లైన్లో పేర్కొన్నారు. వీటికి సంబంధించి రూ.609 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.470 కోట్లు రైతులకు చెల్లించారు. ఇంకా రూ.139 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు నిలిపేశారు. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించినట్లు ఆన్లైన్లో చూపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది రైతులు విక్రయించిన ధాన్యానికి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగింది. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే సొమ్ము చెల్లిస్తారన్న జిల్లా అధికారులు, మంత్రుల హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. కొనుగోళ్ల ప్రారంభం నుంచే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. మొదట్లో 20 రోజుల వ్యవధిలో బిల్లులు అందించారు. తర్వాత ఆ జాప్యం నెల రోజులకు పెరిగింది. ఇప్పుడు కొనుగోళ్లు నిలిచిపోయినా.. నెలలు దాటిపోతున్నా ఇంకా చెల్లింపులు జరగలేదు. కనీసం రైతులకు దానిపై స్పష్టత ఇచ్చే వారు కూడా కరువయ్యారు. తేలని రవాణా ఛార్జీలు రైతులు విక్రయించిన ధాన్యానికి రవాణా చార్జీల చెల్లింపు వ్యవహారం కూడా ఇప్పటికీ తేలలేదు. ఈ ఏడాది ధాన్యం తరలింపు బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే ధాన్యం తరలించడంలో కాంట్రాక్టర్లు విఫలం కావడంతో నేరుగా రైతులే సొంత ఖర్చులతో మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటాకు రూ.32 చొప్పున రైతులకు రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి రూ. 1.47 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులను కాంట్రాక్టర్లకు అందిస్తారా.. లేదా ధాన్యం తరలించుకున్న రైతులు చెల్లిస్తారా అన్న దానిపై ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేదు. ప్రభుత్వ మౌనం వెనుక కాంట్రాక్టర్లకు నిధులు ధారాదత్తం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని కొంత మంది అధికారులు చెబుతున్నారు. రైతులు ఈ విషయాన్ని మరిచిపోయే స్థితికి తీసుకొచ్చి అనంతరం చెల్లింపులు చేయాలని అధికార పార్టీ నాయకులు సూచించినట్లు చెబుతున్నారు. కాగా రవాణా ఛార్జీలపై స్పష్టత ఇవ్వకపోతే మంత్రులు ఇళ్లును మట్టడిస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. -
నిరాశే మిగిలింది
కేంద్ర బడ్జెట్‌పై జిల్లా వాసుల అసంతృప్తి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో శనివారం ప్రవేశపెట్టిన 2015-16 సాధారణ బడ్జెట్‌పై జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటు అవుతాయని ఆశగా ఉన్న ప్రజలకు బడ్జెట్ చూసి నిరాశ చెందారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లాను స్మార్ట్ జిల్లాగా మారుస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కనీస వనరులపై కూడా దృష్టిసారించకపోవడంపై పెదవి విరిచారు. ఆదాయ పన్ను మినహాయింపు పెంచకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. - పాలకొండ ఆశించిన స్థాయిలో బడ్జెట్ లేదు మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టినప్పటికీ ఆశిం చిన స్థాయిలోలేదు. రాజ దాని నిర్మాణానికి ఎటువంటి కేటాయింపులు లేవు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయించడం దారుణం. విభజన చట్టంలో ఉండే అంశాలకు తక్కువ నిధులు కేటాయించడం దారుణం. వ్యవసాయరంగాన్ని విస్మరించడం దారుణం. బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగేది శూన్యం. బడ్జెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. - ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్ర విభజనకు కారణమైన టీడీపీ నవ్యాంధ్ర నిర్మాణం కోసం నిధు లు రాబట్టడంలో, ప్రత్యేకహోదాను తెప్పించుకోవడంలో గానీ పూర్తిగా విఫలం చెందింది. రాష్ట్ర విభజన వల్ల కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం రూ. 16 వేల కోట్లు లోటు బడ్జెట్లో ఉంది. లోటు భర్తీకి కావాల్సిన నిధులు విడుదల చేయించుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకపోవడం దారుణం. - రెడ్డి శాంతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు వేతనదారులు, మధ్య తరగతి వారి నడ్డివిరిచే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ వేతనదారులు, మధ్యతరగతి ప్రజానీకం నడ్డి విరిచేదిగా ఉంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలు పెరిగినప్పటికీ పన్ను పరిమితి పెరగకపోవడంతో మధ్యతరగతి ప్రజలు ఆర్థిక పరిస్థితి ఆగమ్మగోచరం అవుతుంది. పన్ను పరిమితి రూ.2.50 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని, పొదుపు పరిమితి రూ. లక్షన్నర నుంచి రూ. 3 లక్షలకు పెంచితే బాగుండేది. వ్యవసాయ కార్మికులకు, పేద ప్రజలకు ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించక పోవడం దారుణం. - మజ్జి చినబాబు, వైఎస్ఆర్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పేదలకు అన్యాయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాధారణ బడ్జెట్లో పేద ప్రజలకు అన్యాయం జరిగింది. కార్పొరేట్ వర్గాలు, ధనికులకు కొమ్ముకాసేలా బడ్జెట్ ఉంది. రెండు రోజుల క్రితం ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లోను, ఇప్పటి సాధారణ బడ్జెట్‌లోను ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే జరిగింది. మోదీ ప్రభుత్వం చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పింది. - కలమట వెంకటరమణ, ఎమ్మెల్యే, పాతపట్నం అన్ని వర్గాలకు నిరాశే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాలకు నిరాశే మిగిలింది. ప్రధానంగా జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నా ఆ దిశగా చర్యలు లేవు. రైతుల కోసం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు లేవు. సాగునీటి వనరుల ప్రస్తావన లేదు. కొత్తగా విశ్వవిద్యాలయాలు, వైద్యశాలలు కోసం నిధుల కేటాయింపులు లేవు. బడ్జెట్ కేటాయింపులు కేవలం కార్పొరేట్‌కు అనుకూలంగా ఉంది. - విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ వ్యవసాయ రంగాన్ని విస్మరించారు కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకే అనుకూలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాభివృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం దారుణం. పేద, మధ్యతరగతి వారిని నిరుత్సాహ పరిచింది. కార్పొరేట్ల సహకారంతో అధికారం చేపట్టిన ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం వారి రుణం తీర్చుకునే విధంగా నిధులు కేటాయింపు ంది. - కె.మోహనరావు, రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి సాగునీటి ప్రాజెక్టుల మాటే లేదు బడ్జెటలో సాగునీరు ప్రాజెక్టుల మాటే లేదు. ఇప్పటికే మన రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పనులు పూర్తికాక సగంలో నిలిచిపోయాయి. వాటిపై కనీసం నోరెత్తిన వారే లేరు. నదులు అనుసంధానానికి, సాగునీరు అందించే విషయాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయం. - చాపర సుందర్‌లాల్, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఎటువంటి ప్రయోజనం లేదు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆదాయపన్ను పరిమితి గతంలో రూ. రెండున్నర లక్షలు ఉండేది. ప్రస్తుత బడ్జెట్లో ఎటువంటి మార్పు చేయకపోవడం వలన పన్ను భారం అందరిపైనా పడే అవకాశం ఉంది. - హనుమంతు సాయిరాం, ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విభజన నష్టం పూడ్చే చర్యలు లేవు రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. ప్రత్యేక హోదాతో బడ్జెట్లో నిధుల కేటాయింపులు భారీగా ఉంటాయని అందరూ అశించారు. బీహర్, పశ్చిమబెంగాళ్ వంటి రాష్ట్రాలతో పాటు ఆర్థిక ప్యాకేజీ అందజేస్తామని ప్రభుత్వం భావించటం న్యాయం కాదు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించక పోవటం అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. -ప్రొఫెసర్ గుంటతులసీరావు, ప్రిన్సిపాల్, బీఆర్‌ఏయూ పోలవరానికి పూర్తి నిధులు కేటాయించాల్సింది జాతీయ హోదా కల్పించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు సైతం కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు సరిపడవు. ప్రాజెక్టుకు రూ. వెయ్యికోట్లు మంజూరు చేయాల్సింది. - తమ్మినేని కామరాజు, విభాగాధిపతి, బీఆర్‌ఏయూ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉంది. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రజలు ఆధార పడ్డ ప్రాథమిక రంగంపై నిర్లక్ష్యం తగదు. -బిడ్డిక అడ్డయ్య,అర్థశాస్త్ర విభాగాధి పతి, బీఆర్‌ఏయూ సంక్షేమ పథకాలు ఉండవు కేంద్ర బడ్జెట్ చూస్తే భవిష్యత్‌లో సంక్షేమ పథకాలు ఉండవనే నుమానం కలుగుతోంది. అరుణ్‌జైట్లీ బడ్జెట్ కార్పొరేట్ రంగానికి అనుకూలంగా ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం పూర్తిగా రాయితీలు ఎత్తేసే దిశగా ప్రయత్నిస్తుంది. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం పూడ్చే చర్యలు కనీసం చేపట్టలేదు. - గొర్లె కిరణ్‌కుమార్, ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చారు బడ్జెట్లో సంక్షేమ పథకాల కంటే సంస్కరణ లకు ప్రాధాన్యమిచ్చారు. అర్థిక సంస్కరణలు అమలైతే ద్రవ్యలోటు తగ్గి అర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. - వి.మల్లికార్జున రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అర్థశాస్త్రం, బీఆర్‌ఏయూ సంతృప్తికరంగా లేదు బడ్జెట్ ్ల సంతృప్తి పరచలేదు. బంగారంపై సుంకం పెంచారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా కనీసం రాష్ట్ర అభివృద్ధికి నిధులు సమకూర్చుకోలేకపోవడం చేతకానితనానికి నిదర్శనం. - మండవిల్లి రవి, వ్యాపారవేత్త -
పాలకులు సిబ్బందీ లేరు
పాలకొండ: పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో సహకరిస్తూ రైతులకు వెన్నుదన్నుగా ఉండాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్జీవంగా మారాయి. సిబ్బంది కొరత కారణంగా చెక్‌పోస్టులు మూతపడుతూ ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా దూరం చేస్తున్నాయి. పాలకవర్గాలు లేకపోవడంతో ఇన్చార్జి కార్యదర్శుల ఏలుబడిలో మార్కెట్ కమిటీల పాలన పూర్తిగా కుంటుపడింది. జిల్లాలో 14 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో కమిటీలో 14 మంది వరకు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒకరిద్దరితోనే కాలక్షేపం చేస్తున్నారు. పొందూరు, రాజాం, పాలకొండ తదితర మార్కెట్ కమిటీల్లో ఇద్దరు చొప్పున సిబ్బంది ఉన్నారు. అలాగే ఎచ్చెర్ల, హిరమండలం, ఇచ్ఛాపురం మార్కెట్ కమిటీలకు మాత్రమే పూర్తిస్థాయి కార్యదర్శులున్నారు. మిగతా 11 కమిటీలకు సూపర్వైజర్లే కార్యదర్శులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూతపడుతున్న చెక్‌పోస్టులు మార్కెట్ కమిటీల పరిధిలో జిల్లాలో 28 చెక్‌పోస్టులు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ. 25 లక్షల నుంచి రూ. 45 లక్షల ఆదాయం లభించాల్సి ఉంది. ఇతర ప్రాంతాలకు తరలించే వ్యవసాయ ఉత్పత్తులకు ఈ చెక్‌పోస్టులు రుసుం వసూలు చేస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో సిబ్బంది కొరతతో చెక్‌పోస్టులు మూతపడుతున్నాయి. ఇటీవల భామిని చెక్‌పోస్టు మూతపడగా అక్రమంగా సరుకు తరులుతున్న విషయం వెలుగు చూసింది. సరిపడినంత సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బంది పగటిపూట మాత్రమే విధులు నిర్వహించి రాత్రి సమయాల్లో వీటిని మూసివేస్తున్నారు. అందులోనూ రసీదు ఇచ్చే అధికారం గార్డులకు లేకపోవడంతో వాచ్మెన్లే ఆ పని చేస్తున్నారు. ఈ కారణాలతో లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. మందగించిన సేవలు మార్కెట్ కమిటీల్లో రైతులకు అన్ని రకాల సేవలు అందించాల్సి ఉంది. పండిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోతే రైతు బంధ పథకం ద్వారా ఉత్పత్తులను నిల్వ చేసి, రుణ సాయం అందించి ఆదుకోవాలి. అలాగే మార్కెట్లో ఉన్న ధరల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందించాలి. మార్కెట్ కమిటీ పరిధిలో పండిన పంటలు, వాటి కొనుగోళ్లు తదితర వివరాలను నమోదు చేయాలి. ప్రస్తుతం ఇవేవీ రైతులకు కనిపించడం లేదు. రైతు బంధు పథకం వినియోగించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. పాలకవర్గాల ఎంపిక లో జాప్యం మార్కెట్ కమిటీలకు చైర్మన్లతో పాటు పాలకవర్గ సభ్యులను ఎంపిక చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఇటీవల కమిటీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించి ఆశావహులను సంతృప్తిపరిచే చర్యలు చేపట్టినా అధికార పార్టీ నేతల నుంచి తీవ్రమైన పోటీ తప్పడం లేదు. ఈ పదవులు దక్కించుకొనేందుకు వర్గాల వారీగా అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు వర్గాల పేరుతో పలువురు నాయకులు పదవుల కోసం తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వీటి నియామకాలు జరిపితే వర్గ రాజకీయాలు గుప్పుమంటాయన్న భయంతో ముఖ్యమంత్రి ఈ నియామకాల్లో జాప్యం చేస్తున్నారు. -
సరుకులిచ్చిన నెలకు..సంచులొచ్చాయ్!
పాలకొండ: సంక్రాంతి వెళ్లి నెలైంది. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో సర్కారు ఆర్భాటంగా సరఫరా చేసిన సరుకులూ జీర్ణమైపోయాయి. కానీ ఆ సరుకుల సరఫరాకు ఉద్దేశించిన సంచులు తీరిగ్గా ఇటీవల మండలాలకు చేరాయి. వాటిని ఏం చేయాలో తెలియక అధికారులు ఆ మూటలు సైతం విప్పకుండా కార్యాలయాల్లో అలాగే ఉంచేశారు. వీటి విలువ ఎంత లేదన్నా కోటి రూపాయలకు పైనే ఉంటుంది. ఇవన్నీ వృథా అయినట్లే. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని పదే పదే చెబుతూ చెల్లింపులపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం ఇటువంటి అనవసర ఆర్భాటాలకు పోయి కోట్లాది రూపాయలు వృథా చేయడమెందుకున్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రలో తొలి సంక్రాంతిని ప్రభుత్వపరంగా జరుపుతామంటూ సంబరాల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అందులో భాగంగా చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో రేషన్‌కార్డుదారులకు ఆరు రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. వాటిని గిఫ్ట్ ప్యాక్‌గా అందించేందుకు చంద్రబాబు ఫొటోతో సంచుల తయారీకి కూడా పురమాయించింది. జనవరి 10-14 తేదీల మధ్య లబ్ధిదారులకు ఉచిత సరుకులు పంపిణీ చేశారు. అయితే నిర్దేశించిన అన్ని రకాల సరుకులు పూర్తిస్థాయిలో అందకపోవడం, అందినవి నాసిరకంగా ఉండటం విమర్శలపాలైన విషయం తెలిసింది. దాన్ని పక్కన పెడితే సరుకుల ప్యాకింగ్‌కు నిర్దేశించిన సంచులు సకాలంలో అందకపోవడంతో చాలా చోట్ల రేషన్ డీలర్లు సొంత డబ్బులతో పాలిథిన్ కవర్లు కొనుగోలు చేసి సరుకులను ప్యాక్ చేసి లబ్ధిదారులకు అందించారు. సంక్రాంతి సంబరాలు ముగిసి సంచుల విషయం అందరూ మరచిపోయిన తరుణంలో ఇటీవల సంచులు జిల్లా కేంద్రానికి చేరాయి. వాటిని మూడు నాలుగురోజుల క్రితం మండల కేంద్రాలకు పంపించారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలో తెలియక స్థానిక అధికారులు మూలన పడేశారు. జిల్లాలో తెల్ల రంగు, అంత్యోదయ, అన్నపూర్ణ, చేనేత కేటగిరీలకు చెందిన 785056 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటితోపాటు 52వేల గులాబీ కార్డులు ఉన్నాయి. గులాబీ కార్డులు మినహాయించి మిగిలిన వాటికి ఉచిత సరుకులు అందించారు. ఈ లెక్కన కార్డుకు ఒకటి చొప్పున 785056 సంచులు అందాయి. వీటి తయారీ బాధ్యతను ఒక్కో సంచికి రూ.14 రేటుకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సరుకుల సరఫరా సమయంలో ఇది అందకపోవడం, ఇప్పుడు వచ్చినా ఉపయోగం లేకపోవడంతో వీటి కోసం చేసిన ఖర్చు వృథా అయినట్లే. జిల్లాకు అవసరమైన సంచుల తయారీకి రూ. 1.99 కోట్లు ఖర్చయినట్లు అంచనా. అయితే కొన్ని ప్రాంతాలకు సంచులు సకాలంలో అందినట్లు చెబుతుండగా.. ఎలా చూసుకున్నా రూ.కోటికి పైగా వృథా అయ్యిందని అంటున్నారు. సకాలంలో అందని సంచుల తయారీ ఆర్డర్‌ను అప్పుడే రద్దు చేసి ఉంటే ఈ ఖర్చు మిగిలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
డిపోలపై తమ్ముళ్ల దృష్టి!
పాలకొండ రూరల్:అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక ప్రయోజనం కల్పించే అన్ని రకాల పదవుల, పోస్టులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తాజాగా రేషన్ డిపోలను దక్కించుకోవడంపై దృష్టి సారించారు. త్వరలో భర్తీ కానున్న డీలర్ పోస్టులను తమ అనుయాయులకు ఇప్పించుకునేందుకు ఆయా ప్రాంతాల నాయకులు పావులు కదుపుతున్నారు. జిల్లాలో పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల పరిధిలో 85 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని కారుణ్య నియామకాల కింద గత డీలర్ కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి ఉంది. అవి పోగా మిగిలిన పోస్టుల నియామక ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. టెక్కలి డివిజన్ పరిధిలో ఉన్న రెండు రెగ్యులర్ ఖాళీలకు సంబంధించి ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. వాటిని దక్కించుకునేందుకు స్థానిక టీడీపీ నేతలు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని తెలిసింది. శ్రీకాకుళం డివిజన్లో రోస్టరైజేషన్ పూర్తి చేసి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పాలకొండ డివిజన్‌కు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు పౌరసరఫరా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వీటిని తమ వారికి కట్టబెట్టేందుకు ఇప్పటికే స్థానిక చోటా నాయకులు మొదలుకుని బడా నేతలు వరకు పైరవీలు మొదలుపెట్టారు. కొత్త డిపోలకు అవకాశం ఇదిలా ఉండగా 300 నుంచి 400 కార్డులున్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా నిర్థారించి కొత్త రేషన్ డిపోల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. ఆ ప్రకారం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1989 డిపోలకు తోడు మరో 500 డిపోలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇది కూడా టీడీపీ నేతల అవకాశాలను పెంచనుంది. కాగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిపోలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న నేతలు కొన్ని ప్రాంతాల్లో వీటికి రేట్లు కూడా నిర్ణయించేశారని తెలిసింది. 11న ఉప ముఖ్యమంత్రి జిల్లాకు రాక శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ నెల 11వ తేదీన జిల్లాకు రానున్నారని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం శనివారం తెలిపారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లాకు చేరుకొని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. 10 గంటలకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తనయుని వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. -
బాబుది కుటిల రాజకీయం
పాలకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబువి కుటిల రాజకీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బుధవారం పాలకొండలోని ఓ కల్యాణ మండపంలో జిల్లాలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని ప్రకటించడంతో గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చామన్నారు. ఎన్నికల సమయంలో మాలలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపు ఉన్నారని, మాదిగల తరఫున ఆంధ్రాలో ప్రచారం చేయమని కోరితే ఆయన గెలుపు కోసం ప్రయత్నించామన్నారు. వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని ప్రకటించి ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేక శక్తులతో చేయి కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై అసెంబ్లీకి వెళ్లి కలిస్తే మాలలు ఎక్కువగా ఉన్నారు కదా అంటూ దాటవేసే ధోరణితో మాట్లాడారన్నారు. మంత్రులు కూడా చంద్రబాబు చేసిన ప్రకటనలను, ప్రవర్తిస్తున్న తీరును తన వద్దకు వచ్చి తప్పుబట్టారని తె లిపారు. ఇచ్చిన మాట నెరవేర్చకపోగా నమ్మించి మోసగించారని ధ్వజమెత్తారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపి సీట్లు ఇస్తానని ఎరవేసినా మాదిగ జాతి కోసం పదవులు త్యజించానన్నారు. ఇంతటి నయ వంచనకు పాల్పడిన చంద్రబాబుపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో త్వరలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ ద్వారా టీడీపీ పతనాన్ని శాసించాలన్నారు. ఆ పార్టీ పతనమే ధ్యేయంగా ఎంఆర్పీపఎస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మండంగి నాగరాజు, యందవ నారాయణమాదిగ, అలజంగి నాగభూషణ్మాదిగ, బోసు మన్మథరావుమాదిగ, కళింగ ప్రేమభూషణ్మాదిగ, సైల రామారావు, ఎస్.సింహాద్రి పాల్గొన్నారు. -
కౌలు రైతు కుదేలు !
పాలకొండ : అందరికీ అన్నం పెట్టే రైతన్న పరిస్థితి గందరగోళంగా మారింది. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. హుద్‌హుద్ తుపాను సృష్టించిన బీభత్సంతో పంటలు కోల్పోయిన కౌలు రైతులకు నష్టపరిహారం అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం రెండు లక్షల మంది కౌలు రైతులున్నారని అంచనా. వీరంతా సామాన్య, భూస్వామ్య రైతుల వద్ద పొలాలను కౌలుకి తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 12వ తేదీన వచ్చిన హుద్‌హుద్ తుపాను పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. సరాసరి దిగుబడులు బాగా పడిపోయూరుు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వరి ఎకరాకు 15 నుంచి 19 బస్తాలకే పరిమితమైంది. ఇందులోనూ ధాన్యం బురద పట్టి పోవడంతో రంగుమారాయి. దీంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. జిల్లాలో ఎకరాకు సరాసరి పొలం సొంతదారుకు 11 నుంచి 13 బస్తాల వరకు కౌలు రూపేణా చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన కౌలు రైతులు పండిన పం డంతా కౌలు కింద చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేలు చొప్పున పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులు, రేషన్‌కార్డుల అనుసంధానంతో పరిహారం అందజేశారు. పాస్‌పుస్తకాలు ఉన్నవారి పేరునే పరిహారం అందజేయడంతో కౌలు రైతులు బిక్కుముఖం వేసుకున్నారు. గుర్తింపు కార్డులు ఉంటే... వాస్తవానికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఉండి ఉంటే పరిహారం పొందేందుకు అవకాశముండేది. రైతుల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వం దీనిపై కనీస చర్యలు చేపట్టకపోవడంతో గుర్తింపు కార్డులు పొందిన రైతులు పదుల సంఖ్యలో మాత్రమే మిగిలారు. రెవె న్యూ, వ్యవసాయాధికారులుకౌలుదారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంలో ఆసక్తి కనబర్చలేదు. ప్రభుత్వం కూడా సహకరించకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. పైసా పరిహారం రాలేదు మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేశాను. వరదలు ముంచి వేయడంతో ఎకరాకు పది బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ.25 వేలు చొప్పున అయింది. రైతుకు కౌలు చెల్లిస్తే పైసా మిగలక తిరిగి అప్పు మిగిలింది. పరిహారం కూడా అందలేదు. - గుమ్మిడి గురువులు, కౌలు రైతు, అంపిలి ప్రభుత్వ నిర్లక్ష్యం కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తుంది. గుర్తింపు కార్డుల కోసం పలుమార్లు ఆందోళన చేపట్టాం. అయినా కనీస చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపలేదు. ఈ కారణంతోనే కౌలు రైతులు అప్పుల బారిన పడాల్సి వచ్చింది. - బుడితి అప్పలనాయుడు, రైతు సంఘం నాయకుడు -
ఇక పచ్చపాలికలు!
పాలకొండ : పచ్చ కాంట్రాక్టర్లకు పనుల పందేరానికి ప్రభుత్వం గేట్లు తెరవడంతో జిల్లాలో టీడీపీ నేతలు, సీనియర్ కార్యకర్తలు పనులు దక్కించుకొని కాసులు దండుకునేందుకు ఉబలాటపడుతున్నారు. పురపాలక సంఘాల్లో రూ.5 లక్షల వరకు పనులను టెండర్లతో పని లేకుండా నామినేషన్ పద్ధతిలో కేటాయించే వెసులుబాటు కల్పిస్తూ మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనిలో పనిగా ఈ పనులను కేటాయించే అధికారాన్ని టీడీపీ నేతలకు కల్పించింది. ఫలితంగా మున్సిపాలిటీల్లో చేపట్టే అభివృద్ధి పనులపై ‘పచ్చ’ ముద్ర స్పష్టంగా కనిపించనుంది. ఈ నిర్ణయాన్ని సొమ్ము చేసుకునేందుకు అప్పుడే నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలో శ్రీకాకుళం, పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలతోపాటు రాజాం, పాలకొండ నగర పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటివరకు వీటి పరిధిలో అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేపట్టడానికి ఈ-టెండర్ ప్రక్రియ నిర్వహించేవారు. గ్రేడ్-1 కాంట్రాక్టర్లు మాత్రమే ఇందులో పాల్గొని పోటీ పడి టెండర్లు దక్కించుకోవాల్సి వచ్చేది. దీంతో అధికార పార్టీ నేతలు, వారి అనుయాయులు పనులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బినామీలను కాంట్రాక్టర్లుగా రంగంలోకి దించినా నిధులు వెనకేసుకొనేందుకు పెద్దగా అవకాశం దొరికేది కాదు. దీంతో పలుమార్లు మున్సిపాలిటీల్లో పనులు పొందేందుకు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తేవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా పార్టీ ప్రయోజనాల పేరిట తమ పార్టీ నేతలకు మార్గం సుగమం చేసింది. దీనిలో భాగంగానే మూడు రోజుల కిందట రూ.5 లక్షల వరకు పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించుకొనే అవకాశాన్ని మున్సిపాలిటీలకు కల్పించించింది. అక్కడితో ఆగకుండా పనులను కేటాయించే అవకాశాన్ని తెలుగు తమ్ముళ్ల చేతికి అప్పగించింది. జీవో జారీ కావడమే ఆలస్యం.. జిల్లాలో నాయకుల హడావుడి మొదలైంది. చేపట్టాల్సిన పనులు ఏం ఉన్నాయి.. వాటిని ఎలా దక్కించుకోవాలి.. పోటీ ఎక్కువగా ఉన్న చోట పనులు ఎలా పంచుకోవాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా తాజా ఉత్తర్వుల వల్ల పనుల్లో పర్యవేక్షణ, నాణ్యత దెబ్బతింటాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పనులు పారదర్శకంగా జరిగేవని, కొత్త విధానంతో అవినీతి పెరుగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కార్యకర్తల లబ్ధికోసమే ఈ విధానాన్ని ప్రకటించినా మున్సిపాలిటీల స్థాయిలో వర్గపోరు మొదలవుతుందని పలువురు టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ప్రతి 3 నె లలకు రూ.30 కోట్ల నష్టం
పాలకొండ: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ జిల్లాలో నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. రోజురోజుకు సంస్థ నష్టాలబాట పడుతోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలు ఫలించకపోగా కార్మికులు ప్రభుత్వంలో విలీనం వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో యాజమాన్యం, కార్మికులకు మధ్య అంతరాయం పెరుగుతూ వస్తోంది. జిల్లాలో శ్రీకాకుళం-1,2 డిపోలతో పాటు పాలకొండ, పలాస, టెక్కలి డిపోలు ఉండగా వీటి పరిధిలో 426 బస్సులు ప్రజల అవసరాల కోసం వివిధ రహదారుల్లో తిప్పుతున్నారు. వీటి పరిధిలో సుమారు 2,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా బస్సులు మొరాయిస్తుండడం, ఆదాయం తగ్గుతూ రావడం జరుగుతోంది. ప్రతి మూడు నెలలకు జిల్లా నుంచి రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుంతోందని అంచనా. నష్టాల నుంచి బయటపడేందుకు పలుమార్లు సంస్థ చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇవ్వలేదు. ఆర్టీసీ వైపు ప్రజలను ఆకర్షించుకొనే పథకాలు ప్రవేశపెట్టినా వీటివల్ల ఒనగూరేది లేదని కార్మికులు చెబుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న యాజమాన్యం అంకిత భావంతో పనిచేయడంలేదని.. కేవలం తమనే బలిచేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వం విలీనం చేసుకొని సేవలందిస్తే తప్ప ఆర్టీసీకి మనుగడ కష్టమని ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ర్ట నాయకులు పలిశెట్టి దామోదరరావు అంటున్నారు. ఆర్టీసీ నష్టాలబాట పట్టడానికి యాజమాన్యమే కారణమని ఎంప్లాయీస్ నెక్ రీజియన్ అధ్యక్షుడు భాసూరు కృష్ణమూర్తి ఆరోపించారు. ప్రైవేటు వాహనదారులతో కుమ్మక్కైన యాజమాన్యం ఆర్టీసీని దెబ్బతీస్తోందని అంటున్నారు. -
ఇచ్చిందే స్వల్పం..అందులోనూ స్వార్థం
పాలకొండ:గత అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపాను కారణంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు సుమారు రూ.1300 కోట్ల నష్టం వాటిల్లినట్లు జిల్లా అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నా.. పునరుద్ధరణ పనుల పేరుతో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.50 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకొంది. తుపాను దాటికి జిల్లాలో విద్యుత్, రవాణా, నీటిపారుదల, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు కమిటీలు వచ్చి నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించాయి. రెండు నెలలు గడిచిన తర్వాత కూడా ఆ కోటిన్నర తప్ప ప్రభుత్వం నుంచి ఇంకేమీ అందలేదు. వచ్చిన ఆ కొద్దిపాటి నిధులనైనా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు.. ముఖ్యంగా ఎక్కువ నష్టం వాటిల్లిన నియోజకవర్గాలకు కేటాయించాల్సిన బాధ్యతను అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు విస్మరించారు. విడుదలైన మొత్తంలో కార్మిక మంత్రి అచ్చెన్ననాయుడు నియోజకవర్గమైన టెక్కలికి రూ.90 లక్షలు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గానికి రూ.60 కేటాయించారు. మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు ఒక్కపైసా అయినా కేటాయించలేదు. జిల్లాలకు తుపాను సాయం కింద ఇప్పటివరకు ఈ 1.50 కోట్లే వచ్చాయని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదని, మరిన్ని నిధుల విడుదల గురించి తామేమీ చెప్పలేమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చిన నిధులను ఆ రెండు నియోజకవర్గాలకే తరలించుకుపోతే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కువ నష్టం ఎక్కడంటే.. వాస్తవానికి తుపాను వల్ల టెక్కలి, ఆమదాలవలస నియోజకవర్గాల కంటే శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, పాతపట్నం తదితర నియోజకవర్గాల్లో ప్రభుత్వ శాఖలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్, ఆర్అండ్బి రహదారులు, గ్రామీణ నీటిపారుదలకు సంబంధించి విద్యుత్ మోటార్లు కాలిపోవడ ంతో పాటు పలు రకాల మౌలిక వసతులపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. అయితే ఈ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడం గమనార్హం. ఉన్న నిధులను పలుకుబడి ఉన్న నేతలే పట్టుకుపోవడంతో మిగతా నియోజకవర్గాల పరిస్థితి దయనీయంగా మారింది. -
సారథులు లేని మండలాలు !
పాలకొండ :జిల్లాను మండలాభివృద్ధి అధికారుల కొరత వేధిస్తోంది. గ్రామాలను అభివృద్ధి బాటలో నడపాల్సిన వీరికి కనీస సౌకర్యాలు లేక, రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. కొంతమంది విధులకు సెలవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికితోడు ఇన్చార్జిల బాధ్యత వీరిని మరింత వేధిస్తోంది. ఇంత ఒత్తిళ్లులోనూ గ్రామాల్లో పర్యటించేందుకు కనీస వాహన సదుపాయం లేకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. బాధ్యతలు బోలెడు ఎంపీడీవోల బాధ్యతలు చూస్తే ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసినా సమయం సరిపోదన్నది వాస్తవం. జన్మభూమి గ్రామసభలు మొదలుకొని సాధికారిత సదస్సులు, పింఛన్ల పరిశీలన, మంజూరు, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా, రుణాల మంజూరుకు ఎంపికలు, సాక్షరభారత్ ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి మొత్తం వీరి చేతులతోనే చేపట్టాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అధికారులు పని ఒత్తిడిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్చార్జిల గోల... ఇప్పటికే పనిభారంతో ఇబ్బందులు పడుతున్న ఎంపీడీవోల్లో సగం మందికి ఇన్చార్జి బాధ్యతలు మరింత భారంగా మారాయి. రేగిడి, వంగర, బూర్జ, ఇచ్ఛాపురం, సోంపేట, మెళియాపుట్టి, టెక్కలి, జలుమూరు, కోటబొమ్మాళి, పాతపట్నం, హిరమండలం, వజ్రపు కొత్తూరు, కవిటి, సారవకోట మండలాభివృద్ధి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి బాధ్యతలను పక్క మండలాల్లో ఉన్న ఎంపీడీవోలకు అప్పజెప్పడంతో వారంతా పని భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తీవ్ర ఒత్తిళ్లు పనిభారంతో నలిగిపోతున్న అధికారులకు అధికార పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు తీవ్ర మనస్తాపానికి కలిగిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ఎంపీడీవోలు దీర్ఘకాలిక సెలవులు పెట్టి వెళ్లిపోగా మిగతా వారు అదే బాట పట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరికొంతమంది ఇతర శాఖలకు డిప్యుటేషన్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. ప్రధానంగా పింఛన్ల మంజూరు వ్యవహారంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంపీడీవోలు ఈ సమస్య పరిష్కారం కాకపోతే విధుల్లో కొనసాగడం కష్టమేనని చెబుతున్నారు. వాహన యోగం లేదు గతంలో ఎంపీడీవోలు విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం వాహనాన్ని సమకూర్చేది. అరుుతే వీరి పరిధి నుంచి ఉపాధి హామీని తొలగించాక వాహనాలను తీసివేశారు. దీంతో వీరు ఎక్కడకు వెళ్లాలన్నా సొంత ఖర్చులు తప్పడం లేదని చెబుతున్నారు. మరోవైపు చిన్నస్థాయి అధికారులకే వాహనాలు సమకూర్చిన ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణపై ఉండాల్సిన ఎంపీడీవోలకు వాహన సదుపాయం కల్పించకపోవడంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. -
ఎవరిని ముంచడానికి ఆ జీవో?
పాలకొండ:కార్మికుల పొట్ట కొట్టారు.. రైతులను ముంచారు... వృద్ధులను ఏడిపించారు.. కూలీలకు నోటికాడ కూడు తీసేశారు. తాత్కాలిక ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఇప్పుడు అధికారుల వంతు వచ్చింది. ఆరు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వ నిజస్వరూపాన్ని ఇప్పుడిప్పుడే అధికారులు చూడగలుగుతున్నారు. జరుగుతున్నదేమిటో తెలుసుకొని ప్రభుత్వానికి నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. జన్మభూమి కమిటీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.350తో టీడీపీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. తన పాత నైజాన్ని ఆ ప్రభుత్వం బయటపెడుతున్న విషయం తేటతెల్లమైంది. తెలివిగా తమతోనే తప్పు మీద తప్పు చేయించి ప్రజలు దాడులకు పాల్పడే స్థితికి దిగజారుస్తున్నారని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్వార్థం కోసం అధికార పార్టీ నాయుకులు తమను బలి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. జీవో నెంబర్ 350పై స్పష్టత ఇచ్చే వరకు పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల అధికారులు, ఉద్యోగులు సోమవారం సాయంత్రానికి జిల్లా కేంద్రానికి వెళ్లి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీ సీఈవో, జిల్లా కలెక్టర్లను కలిసి పరిస్థితిని వివరించినట్లు కొందరు అధికారుల ద్వారా తెలిసింది. కమిటీ పేరుతో పెత్తనం అధికారుల, ఉద్యోగులను ఆగ్రహానికి గురి చేసిన జీవో నెం.350లో ఏముందంటే.. గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, ఎంపికలకు జన్మభూమి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. పింఛన్ల మంజూరు, రుణమాపీ, రుణాల మంజూరు, పక్కా ఇళ్లు.. ఇలా అన్ని సంక్షేమ కార్యక్రమాల ఎంపిక, పర్యవేక్షణను ఈ జన్మభూమి కమిటీలకే కట్టబెట్టారు. అయితే ఈ కమిటీల సభ్యులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలనే నియమించడంతో అసలు సమస్య ప్రారంభమైంది. సంక్షేమ పథకాల వర్తింపులో రాజకీయాలకు పాల్పడుతూ, ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు కమిటీలను వేదికగా చేసుకుంటున్నారు. అర్హత ఉన్నా ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులకు పథకాలు అందకుండా ఈ కమిటీలు అడ్డుకట్ట వేస్తున్నాయి. కమిటీల ముసుగులో టీడీపీవారు ఉండగా.. వారు తీసుకున్న నిర్ణయాలను అధికారులు, ఉద్యోగులే అమలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా వారే ప్రత్యక్షంగా ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. అర్హత పత్రాలతో కొందరు లబ్ధిదారులు అధికారులను నేరుగా నిలదీస్తున్న సంఘటనలు జిల్లాలో పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. కొందరు బాధితులు కార్యాలయాలకు వచ్చి అందరి సమక్షంలోనే సంబంధిత అధికారులు, ఉద్యోగులను దూషిస్తున్నారు. ఇంకొందరు కోర్టులకు వెళ్లేందుకూ వెనుకాడటం లేదు. ఫలితంగా ప్రభుత్వ సిబ్బంది భయం భయంగానే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో విధులు నిర్వహించలేమని, జీవో నెంబర్ 350పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘం నాయుకులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ప్రకారం ఎంపికలు జరపాలా లేక కమిటీ సూచించిన వారినే అర్హులుగా ప్రకటించాలా అన్నది స్పష్టంగా తెలియజేయాలంటున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న 500 మంది ఉద్యోగులు సామూహిక సెలవులు పెడతామని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు వివరించినట్లు తెలిసింది. -
ఇది మాఫీయా!
మాఫీ పత్రాల్లో మాయాజాలం రుద్రిపేట గ్రామానికి చెందిన ఖండాపు సుందరమ్మ ఆంధ్రా బ్యాంకులో రెండున్నర ఎకరాల భూమిపై రూ.50 వేల పంట రుణం తీసుకున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన రైతు సాధికార సదస్సులో ఆమెకు అధికారులు రుణ విముక్తి పత్రం అందజేశారు. రూ.50 వేల వరకు ఉన్న రుణం పూర్తిగా ఒకేసారి మాఫీ అవుతుందని అందులో ఉంది. అయితే తర్వాత పేరాలో మాత్రం సుందరమ్మకు రూ.3,749.21 రుణ విముక్తి లభించిందని.. అందులో మొదటి విడతగా రూ.749.50 బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు అదే పత్రంలో పేర్కొన్నారు. రూ.50 వేల లోపు ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించి పత్రంలోనే మొదటి విడతంటూ కేవలం రూ.750 జమచేయడం ఏమిటో అర్థం కాక ఆమె అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారూ సమాధానం చెప్పలేకపోతున్నారు. పాలకొండ: రుణమాఫీకి సంబంధించి మా వద్ద ఎలాంటి వివరాలు లేవు. ప్రభుత్వం నుంచి ఆదేశాలూ రాలేదు. రైతు సాధికార సదస్సుల్లో రుణమాఫీ పత్రాలు అందజేయమన్నారు. అంతకుమించి వివరాలు తెలియదు... - ఇది ఓ తహశీల్దార్ మాట జాబితాలు ఎలా తయారు చేశారో తెలియదు. మాకు వచ్చిన జాబితాలనే ప్రకటిస్తున్నాం. దీనిపై మార్గదర్శకాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం గ్రామాలకు వెళ్లాం. ఆన్లైన్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు.. - ఇవి ఓ వ్యవసాయాధికారి వ్యాఖ్యలు మా వద్ద ఆధార్ నమోదు చేసుకొనే అవకాశం లేదు. రుణమాఫీకి సంబంధించి వెబ్‌ల్యాండ్ సైట్ ఓపెన్ కాలేదు. ఇప్పుడు వచ్చిన జాబితాలు ఎలా ఇచ్చారన్నది తెలియదు. రుణమాఫీ ఎవరికి వచ్చిందన్నది చెప్పలేం. ఇప్పటికే పలుమార్లు మేము ఆధార్, రేషన్ కార్డులు రుణ ఖాతాలకు అనుసంధానం చేశాం.. ఓ బ్యాంక్ మేనేజర్ స్పందన ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ విషయంలో అధికారుల్లో నెలకొన్న గందరగోళానికి పై వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. అనర్హుల జాబితాలో చేరిన మాట అటుంచితే.. మాఫీ వర్తించిన వారు కూడా ప్రభుత్వం చెబుతున్నదేమిటో.. తమకు అందుతున్న మాఫీ మొత్తం ఎంతో చూసుకొని కళ్లు తేలేస్తున్నారు. అధికారులు సైతం వీరికి సమాధానాలు చెప్పలేకపోతున్నారు. రూ.50 వేల లోపు రుణాలు పూర్తిగా మాఫీ చేసేశామని ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం ఆన్లైన్లో జాబితాలు పెట్టింది. రైతు సాధికార సదస్సులు పెట్టి రుణవిముక్తి పత్రాలు అందజేయాలని ఆదేశించింది. ఆరు రోజులపాటు జరిగిన ఈ సదస్సులు మంగళవారంతో ముగిశాయి. ఈ సదస్సులతో అయినా రుణమాఫీపై స్పష్టత వచ్చిందా అంటూ అధికారుల నుంచి లబ్ధిదారులు, బాధితుల వరకు అందరి ముఖాల్లోనూ ప్రశ్నార్థకాలే కనిపిస్తున్నాయి. రుణమాఫీ ఎవరికి ఇచ్చా రో, మిగతా వారికి ఎందుకివ్వలేదో ఎవరికీ అర్థం కాలే దు. అట్టహాసంగా తొలి విడత రుణమాఫీ జాబితా ప్రకటించినా.. అందులో 60 శాతం మంది రైతుల పేర్లు లేకపోవడంతో గత శుక్రవారం రాత్రి జాబితాలో చోటు ఎందుకు లేదో తెలియజేస్తూ మరో జాబితాను ఆన్లైన్లో పెట్టారు. దాన్ని పరిశీలిస్తే అంతా మాయగా కనిపిస్తోంది. రేషన్, ఆధార్ కార్డుల నెంబర్ల నుంచి రుణ మొత్తాల వరకు అన్నీ తప్పుల తడకలే. ఒకే రేషన్ కార్డు నెంబర్‌తో వందల మంది రైతుల పేర్లు ఉన్నా యి. ఒకే ఆధార్ నెంబర్‌తో పెద్ద సంఖ్యలో రైతుల పేర్లు నమోదై ఉన్నాయి. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే అంతా ఆన్లైనే. మా వద్ద ఎటువంటి వివరాలు లేవని సమాధానం వస్తోంది. మరికొంతమంది అకౌంట్లు నాట్ ఫౌండ్ అంటూ ఆన్లైన్లో పెట్టారు. వీటన్నింటిపైనా రైతులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సాధికార సదస్సుల్లో ఎక్కడికక్కడ అధికారులను నిలదీశారు. అయితే అప్పటికప్పుడు ఏదో సర్దిచెప్పడం తప్ప స్పష్టత గానీ, నిర్ధిష్ట హామీ గానీ ఇచ్చే స్థితిలో లేక అధికారులు సైతం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. టోల్‌ప్రీ ఎర్రర్ ఆన్లైన్లో మాఫీ జాబితా లు పెట్టిన ప్రభుత్వం రైతు ల సందేహాలు నివృత్తి చే యడానికంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రకటించింది. అయితే ఈ నెంబర్(1800-100322066) ఒక్కసారైన పని చేస్తే ఒట్టు. ఎన్నిసార్లు చేసినా ‘ఎర్రర్ ఇన్ కనెక్షన్’ అనే సమాధానమే వస్తోంది. దీంతో బాధిత రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
కొనుగోల్‌కు దూరం
‘కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి’..అన్నట్లు తయారైంది ఖరీఫ్ వరి పండించిన రైతుల పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు, సుడిదోమ కారణంగా చాలా పంట పోగా.. చేతికొచ్చిన కాస్త పంటనైనా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడా పెద్దగా కొనుగోళ్లు జరగడం లేదు. పైగా సవాలక్ష నిబంధనలు పెట్టడంతో ప్రభుత్వ కేంద్రాల వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. ఇదేఅదనుగా మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు నచ్చిన ధరకు కొంటూ రైతులను నిలువునా దోచేస్తున్నారు. పాలకొండ:రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రైతుల్లో అవగాహన లోపం, అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్ వ్యాపారులకు వరంగా పరిమిస్తున్నాయి. జిల్లాలో వంద కేంద్రాల్లో రెండు లక్షల క్వింటాళ్లు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 16 కేంద్రాల ద్వారా 981 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకా చాలాచోట్ల కేంద్రాలే తెరుచుకోలేదు. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావంతో ఆలస్యంగా నాట్లు పడ్డాయి. దాన్ని ఎలాగో అధిగమించి పంట సాగు చేస్తే.. అక్టోబర్ సంభవించిన హుద్‌హుద్ తుపాను, ఆ వెంటనే వచ్చిన వరదలు చాలావరకు పంటను నాశనం చేశాయి. అటు తర్వాత సుడిదోమ దాడి చేసింది. ఫలితంగా చివరికి కొద్దిపాటి పంట మాత్రమే రైతుకు దక్కింది. దాన్ని సొమ్ము చేసుకుందామని రైతు తాపత్రయ పడుతుంటే ఇక్కడా పరిస్థితులు అనుకూలించడంలేదు. లభించని ‘మద్దతు’ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతును మద్దతు ధర, మిగిలిన ధాన్యం కొనగోలు విషయంలో అండగా ఉంటామని ప్రభుత్వం ఆర్భాటం చేసింది. జిల్లాలో వివిధ ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అలాగే రకాలవారీగా మద్దతు ధర కూడా ప్రకటించింది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే.. జిల్లాలో ఇప్పటివరకు 16 కేంద్రాల్లోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల కేంద్రాలే ప్రారంభం కాకపోగా, ప్రారంభమైన పలు చోట్ల కొనుగోళ్లు చేపట్టడంలేదు. ప్రస్తుతం రైతు సాధికార సదస్సులు, రుణమాఫీ వ్యవహారాలతో అధికారులు బిజీ అయిపోవడంతో మరికొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. కాగా ఏ గ్రేడ్ క్వింటాలు రూ.1400, కామన్ రకం క్వింటాలు రూ.1360 మద్దతు ధరగా ప్రకటించి, దానికంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గ్రేడ్-1 రకం కొనుగోళ్లే ఇంతవరకు జరపకపోవడం విశేషం. అన్నీ సమస్యలే కొనుగోలు కేంద్రాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. కేంద్రాలకు ధాన్యం తీసుకెళితే నాణ్యత పరీక్షల పేరుతో సవాలక్ష వంకలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గ్రామాల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించాలి. 16 కి.మీ. లోపు దూరానికి టన్నుకు రూ.300 చొప్పున, 16 కి.మీ. మించిన దూరానికి క్వింటాకు 4 రూపాయలు చొప్పున చెల్లించాలి. వాస్తవానికి ధాన్యం రవాణాకు ఈ చార్జీలు ఏమాత్రం సరిపోవు. అలాగే గత ఏడాది కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యానికి రవాణా చార్జీలు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదు. మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల నుంచి ఇక్కడికి ధాన్యం రవాణా సమస్యగా మారుతోంది. దీంతో రైతులు ఈ ఏడాది కేంద్రాల వైపు చూడడం మానేశారు. అధికారులు ఈ కేంద్రాలు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యత పేరుతో కొర్రీలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మాలనుకున్న రైతులు ముందుగా నాణ్యత పరీక్షల కోసం రెండు మూడు కేజీల ధాన్యాన్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందులో తేమ శాతం, పొల్లు, రాళ్లు తదితర పరీక్షలు జరిపి ధర నిర్ణయిస్తున్నారు. ఈ ధర ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్న దాని కంటే తక్కువగానే ఉంటోందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే లభించడం లేదన్నది రైతుల వాదన. తుపానుకు పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో నాణ్యత ఎక్కడ ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటాడుతున్న వర్షాల భయం కాగా కొద్దిరోజులుగా వాతావరణం మబ్బు పెట్టి అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో భయం మొదలైంది. అమ్ముకునే పరిస్థితి లేక కళ్లాల్లో నే ధాన్యం కుప్పలుగా నిల్వ చేశారు. ఈ తరుణంలో వర్షాలు పడితే పడితే పూర్తిగా తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. దాంతో గత్యంతరం లేక అందుబాటులో ఉన్న వ్యాపారులకే ధాన్యం విక్రయిస్తున్నారు. నిబంధనలు ఇలా.. ప్రతి మండలంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా రెండు మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి కేంద్రం వద్ద ప్యాడీ క్లీనర్లు, తేమను నిర్థారించే మాయిశ్చర్ మీటర్లు, నాణ్యత నిర్థారణకు క్యాలీపర్స్, కాటాలు, జల్లెడలు ఉంచాలి. ప్రతి కేంద్రం వద్ద ఐదుగురు సభ్యులతో కూడిన బృందం రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యత పరిశీలించి ధర నిర్ణయిస్తుంది. ఆ ధరకు అమ్మకానికి ధాన్యం తెచ్చే రైతు ఆన్లైన్లో డబ్బు చెల్లించేందుకు వీలుగా బ్యాంకు ఖాతా వివరాలు తెలిపే పత్రాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నాణ్యత, ధర నిర్ణయించిన తర్వాత ధాన్యం అమ్మకానికి సిద్ధపడే రైతుకు పౌరసరపరాల సంస్థ ఖాళీ గోనెసంచులు రైతులు వాటిలో ధాన్యాన్ని నింపి కొనుగోలు కేంద్రంలో అప్పగించాలి. ధాన్యం పండించిన భూమి సర్వే నెంబర్, విస్తీర్ణం వివరాలతో కూడిన అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకం, రుణ అర్హత కార్డు వంటి వాటి జెరాక్స్ కాపీలు కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు అందజేయాలి. దీనివల్ల ఆ ధాన్యం సదరు రైతువేనని నిర్థారించుకునేందుకు వీలవుతుంది. కేంద్రం వద్ద ధాన్యం అన్లోడింగ్, కాటా వేయించడం, బస్తాలు కుట్టడానికి అయిన ఖర్చుల్లో రైతు, పౌరసరఫరాల సంస్థ కలిసి భరించాలి. -
ఎలా వెళ్లాలి.. ఏం చెప్పాలి?!
పాలకొండ:పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లు తయారైంది అధికారుల పరిస్థితి. ‘రుణమాఫీ జాబితాలు ఆన్లైన్లో పెట్టేశాం. బ్యాంకులకు ఆదేశిలిచ్చేశాం. ఇక మీరు సదస్సులు పెట్టి రుణ ఉపశమన పత్రాలు ఇచ్చేయండి’ అని ప్రభుత్వం ఆదేశించి చేతులు దులుపుకొంది. అయితే జాబితాలు ఇంకా పూర్తిస్థాయిలో అందక.. అందినవాటిలో అర్హులైన రైతుల పేర్లు గల్లంతైన పరిస్థితుల్లో సదస్సులు ఎలా నిర్వహించాలో.. ఆగ్రహంతో ఉన్న రైతులను ఎలా అనునయించాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గురువారం నుంచే సదస్సులు నిర్వహించాల్సి ఉండటంతో బుధవారం మండలస్థాయిలో సమావేశాలు పెట్టుకొని తర్జనభర్జనలు పడ్డారు. ఇప్పటికే తీరిక లేని షెడ్యుల్‌తో సతమతం అవుతుంటే.. సదస్సులు పెట్టమనడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో సదస్సుల పేరుతో గ్రామాల్లోకి వెళితే ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రైతు సాధికార సదస్సుల్లో ప్రధానంగా రుణమాఫీ జాబితాలు ప్రకటించడం, కొత్త పింఛన్లు పంపిణీ చేయడం, హుద్‌హుద్ తుపాను పరిహరం పంపిణీతో పాటు, స్వచ్ఛ భారత్ కార్యక్రామాలు చేపట్టాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అయితే రుణమాఫీపై నెలకొన్న గందరగోళం, చాలామంది రైతుల పేర్లు జాబితాల్లో లేని పరిస్థితుల్లో గ్రామాల్లోకి వెళ్ళి పరిహారం, రుణమాఫీలపై ప్రచారం చేయడం కష్టతరమని అధికారులు బావిస్తున్నారు. ఇప్పటికీ వివరాలు పూర్తి రాకపోవడం, అందుబాటులో ఉన్న వివరాల్లో చాలా తప్పుల వల్ల అర్హుల పేర్లు కనిపించక ఆగ్రహం, అసంతృప్తితో బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కనీసం 40 శాతం మంది పేర్లు కూడా రుణమాఫీ జాబితాలో లేవని, పైగా ప్రభుత్వం బ్యాంకులకు వెళ్లమని చెప్పడాన్ని బ్యాంకర్లు తప్పుపడుతున్నారు. రైతులకు ఇదే విషయం చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తుపాను పరిహారంపైనా అధికారులకు ఇంత వరకు ఆదేశాలు లేవు. దీనిపై ఏం చెప్పాలన్న స్పష్టత లేదని పలువురు అధికారులు చెబుతున్నారు. పింఛన్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామాల్లో వందలాదిమంది అర్హులపై వేటు పడింది. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లోకి వెళితే ఆయా పథకాల బాధితుల ఆగ్రహానికి గురికాకతప్పదని అధికారులు భయపడుతున్నారు. రుణమాఫీ, పింఛన్లు తదితర అంశాల్లో రోజుకో ప్రకటనతో ప్రభుత్వం అనవసర హడావుడి చేస్తుండటం వల్లే ప్రస్తుత గందరగోళానికి దారితీసిందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండో శనివారం, ఆదివారాలు కూడా విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. దీనికి తోడు ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్‌లు, సెట్ కాన్ఫరెన్స్‌లతో రాత్రి 10 గంటల వరకు కార్యాలయాలకు అంకితం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సదస్సుల పేరుతో గ్రామాల్లోకి వెళ్లమంటూ తమకు వ్యక్తిగత జీవితం లేకుండా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. -
చుక్కలు చూపిన మందు!
పాలకొండ రూరల్:‘మా డ్రాప్స్ వేసుకుంటే పిల్లల్లో ధాతుపుష్టి ఏర్పడుతుంది. ఆకలి పెరుగుతుంది. శారీరక ఎదుగుదల బాగుంటుంది. రూ. 13 చెల్లిస్తే.. ఓ హెల్త్ కార్డు ఇస్తాం. నాలుగు వారాలు డ్రాప్స్ వేస్తాం’.. గత రెండు రోజులుగా పాలకొండ నగర పంచాయతీ, మండల పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఓ ప్రైవేట్ సంస్థ చేసిన ప్రచారం స్థానికులను బాగా ఆకట్టుకుంది. బుధవారం సుమారు 67 మంది పిల్లలకు వారి తల్లిదండ్రులు ఈ డ్రాప్స్ వేయించారు. అయితే కొన్ని గంటల్లోనే పరిస్థితి తిరగబడింది.. చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి వంటి బాధలతో పిల్లలు పడుతున్న బాధ చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పిల్లలను పట్టుకొని పాలకొండ ఏరియా ఆస్పత్రికి పరుగులు తీశారు. రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్దసంఖ్యలో పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకోవడంతో అక్కడ వాతావరణం మారిపోయింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ అయి న చిన్నపిల్లల వైద్య నిపుణుడు రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో వారందరినీ పరీక్షించి కడుపునొప్పితో కూడిన అస్వస్థతగా నిర్థారించి చికిత్స అందించారు. ఎటువంటి ప్రమాదం లేదని తేల్చడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎన్.చరణ్(2), ఎన్.గోపి(4), సంజన(5), శ్రీలత(1)తో పాటు 33 మంది చిన్నారులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఆయుర్వేదానికి చెందిన ఈ డ్రాప్స్ కొందరికి పడవచ్చు.. కొందరికి పడకపోచ్చని చెప్పారు. ఆ విషయం నిర్థారించుకోకుండా వేయడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. విచారణ జరిపిస్తాం:డీఎంహెచ్‌వో విస్తృత ప్రచారం చేసి, పిల్లలకు డ్రాప్స్ వేసిన శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఈ సంస్థకు అనుమతులు ఉన్నాయా? అన్న విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్ శ్యామలను ప్రశ్నించగా ఈ తరహా సంస్థ గూర్చి తమకేమీ సమాచారం లేదన్నారు. దీనిపై స్థానిక అధికారులతో చర్చిస్తామని, విచారణ కూడా చేపడతామన్నారు. స్థానిక పోలీసులను సంప్రదించగా ఏరియా ఆస్పత్రి నుంచి తమకు సమాచారం లేదని, వైద్యులు సమాచారం అందిస్తే మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ ఎల్.చంద్రశేఖర్ చెప్పారు. ఈ తరహా సంస్థలు, గుర్తింపు లేని వైద్య బృందాలు ఇచ్చే వ్యాక్సిన్లు, డ్రాప్స్ వేసుకునేముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలని, వెద్యుల సూచనలు తీసుకోవాలని ఏరియా ఆస్పత్రి వైద్యులు సూచించారు. అవి బాల్కాల్విన్ డ్రాప్స్ కాగా డ్రాప్స్ వేసిన సంస్థ ప్రతినిధి ఈశ్వరి, మరో అమ్మాయిని ‘సాక్షి’ ప్రశ్నించగా శ్రీకాకుళంలోని కృష్ణాపార్కు వద్ద నుంచి హెల్త్‌కేర్ సెంటర్ నుంచి వచ్చామని చెప్పారు. పాల కొండ పట్టణంతో పాటు మండల పరిధిలో ప్రచారం చేసి బాల్కాల్విన్(కాల్షియం) డ్రాప్స్ వేశామని వివరించారు. 1-5 ఏళ్ల పిల్లలకు ఒక డ్రాప్, 5-10 మధ్య వారికి రెండు డ్రాప్స్, 10-15 మధ్య వారికి మూడు డ్రాప్స్ చొప్పున నాలుగు వారాలపాటు వేయాల్సి ఉంటుందన్నారు. అయితే పిల్లలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారో అర్థం కావడంలేదని.. ఇంతకుముందు చాలా చోట్ల వేసినా ఇటువంటి సమస్య ఎదురుకాలేదన్నారు. -
డ్వాక్రాకు టోకరా
పాలకొండ: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వమే మహిళా స్వయంశక్తి సంఘాల ఏర్పాటును ప్రోత్సహించింది. ఇప్పుడే అదే ప్రభుత్వం ఈ సంఘాలు ఆర్థికంగా దివాలా తీసేలా చేస్తోంది. ఎన్నికల ముందు రైతుల రుణాలతోపాటు డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేస్తామ ని హామీ ఇచ్చిన తెలుగుదే శం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయిం చిం ది. రుణాలు మాఫీ అవుతాయన్న ఆశ తో నెలవారీ వాయిదాలు చెల్లించని మహిళా సంఘాల పై ఇప్పుడు బ్యాం కులు ప్రతాపం చూపుతున్నాయి. రుణ వాయిదాలు చెల్లించని సంఘాల కు 14 శాతం వడ్డీతో సహా రికవరీకి నోటీసులు జారీ చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా సంఘాల పొదుపు ఖాతాల నుంచి సొమ్మును అప్పుల ఖాతాకు జమ చేస్తున్నాయి. ఈ విధంగా ఇప్పటికే జిల్లా లో రూ.4 కోట్ల వరకు బ్యాంకులు జమ చేసుకున్నాయి. సంక్షోభంలో సంఘాలు గత ఏడాది డిసెంబర్ వరకు డ్వాక్రా సంఘాలు సక్రమంగా నడిచేవి. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాం తాల్లో 36583, మున్సిపాలిటీల్లో 5319.. మొత్తం 41902 సంఘాలు కొనసాగుతున్నాయి. ఈ సంఘాలు ప్రభుత్వం నుంచి రూ.54,498.16 కోట్ల రుణాలు పొందాయి. కాగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. అప్పటి నుంచి మహిళా సంఘాలు ప్రతి నెలా చెల్లించాల్సిన రుణ వాయిదాలను కట్టడం నిలిపివేశాయి. టీడీపీ అధికారంలోకి వచ్చినా రుణమాఫీప ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో బ్యాంకర్లు సంఘాలు బకాయి పడిన సొమ్ముకు నెలకు 14 శాతం చొప్పున వడ్డీ విధించాయి. అసలు, వడ్డీ చెల్లించడం పెనుభారంగా మారడంతో మహిళా సంఘాలు దిగాలు పడ్డాయి. ఈ విధంగా జిల్లాలో ఇప్పటి వరకు మహిళా సంఘాలు చెల్లించాల్సిన బకాయిలు రూ.3425 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనికి ప్రతి నెలా వడ్డీ కలుస్తుండటంతో మొత్తం బకాయిలు రూ.5794 కోట్లకు పెరిగాయి. వీటిని త్వరగా చెల్లించాలని బ్యాంకుల నుంచి మహిళా సంఘాలప ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రూ. 4 కోట్ల పొదుపు సొమ్ము బదిలీ వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు స్త్రీ నిధి కింద మహిళా సంఘాలు బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు సొమ్మును అప్పుల ఖాతాకు జమ చేసుకున్నాయి. ఆ ఖాతాలు ఖాళీ కావడంతో మిగిలిన అప్పుల రికవరీ కోసం ప్రస్తుతం ఐకేపీ ద్వారా సంఘాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 758 సంఘాలకు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. తక్షణమే అప్పులు చెల్లించకపోతే వడ్డీతోసహా బలవంతంగానైనా వసూలు చేస్తామని ప్రత్యేకంగా రుణ వసూళ్ల కోసం ఏర్పాటు చేసిన బృందాలు మహిళా సంఘాలను హెచ్చరిస్తున్నాయి. లక్ష్యానికి దూరంగా... ఈ పరిణామాలతో జిల్లాలో ప్రస్తుతం మహిళా సంఘాలకు రుణాల చెల్లింపు లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. ఈ ఏడాది రూ. 356 కోట్ల రుణాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇంత వరకు రూ.130 కోట్లు మాత్రమే చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా సంఘాలు అప్పులు చెల్లించకపోవడంతో రుణాలు మంజూరు కాలేదు. ఇప్పటికే 120 సంఘాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి బ్యాంకు రుణాలు తీర్చి, తిరిగి కొత్తగా అప్పు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీరికి మాత్రమే బ్యాంకర్లు కొత్త రుణాలు అందజేశారు. పాలకొండ మండలంలో 27 సంఘాలు ఉండగా.. వీటన్నింటిపైనా రుణ బకాయిలు చెల్లించాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు ఆ సంఘాల సభ్యులు చెబుతున్నారు. కాగా బ్యాంకర్లు ఇప్పటికే 7300 సంఘాలను నాన్పేమెంట్ జాబితాలో చేర్చారు. ఈ సంఖ్య ప్రతి నెలా పెరుగుతూ వస్తోందని అధికారులు చెబుతున్నారు. -
పుట్టినూరును మర్చిపోవద్దు...
పాలకొండ రూరల్:సమాజంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కన్నతల్లిని, పుట్టినూరును మర్చిపోరాదని సినీ హాస్య నటుడు అల్లెన వెంకటరమణ అన్నారు. తన స్వగ్రామమైన పాలకొండకు బుధవారం వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలా మంది ఉన్నత పదవులు, స్థాయిలో ఉండి కూడా పుట్టిపెరిగిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించకపోవడం విచారకరమన్నారు. దేశవిదేశాల్లో స్థిరపడిన వ్యక్తులందరూ తమ లాభాల్లో కొంత మొత్తాన్ని పాలకొండ అభివృద్ధికి కేటాయించాలని కోరారు. పాలకొండలో పుట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందంటూ తమ జీవన ప్రస్థానాన్ని వెల్లడించారు. 1976లో చదువులు నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడిన తనకు నటనపై ఉన్న మక్కువతో సినీ పరిశ్రమకు వెళ్లానని, తొలినాళ్లలో టీవీ, రేడీయో రంగాల్లో అవకాశాలు రాగా 1981లో ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ చిక్కడపల్లి వెంకటేశ్వర దేవాలయంలో ఈవోగా విధులు నిర్వహిస్తున్నానన్నారు. తను నాల్గవ తరగతి చదువుతున్నప్పుడు పాలకొండ కోమటిపేట స్కూల్లో చాచానెహ్రూ వేషం వేశానని, అప్పటినుంచి కళలపై మక్కువ పెంచుకున్నట్టు చెప్పారు. పాలకొండలోనే ఆర్సీఎం, ప్రభుత్వోన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి పలు నాటకాల్లో తన ప్రతిభ చాటినట్టు వివరించారు. సినీరంగంలో తన తొలిసినిమాలు ప్రతిఘటన, అల్లరిప్రియుడు కాగా తాజాగా విడుదలైన గలాటాతో పాటు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించిన ప్రతి సినిమాలోను నటించానన్నారు. అప్పటి హాస్యనటులు రేలంగి, చెదలవాడ తనకు స్ఫూర్తిదాయకులుగా పేర్కొన్నారు. ప్రజల్లో సామాజిక సృహపట్ల చైతన్యం కలిగించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా ప్రస్తుతానికి సినీరంగానికి దూరంగా ఉన్నా త్వరలోనే విశ్రాంతి తీసుకుని పాలకొండ వచ్చి ఇక్కడ నుంచి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి అందిస్తానన్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారిని ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. -
‘రియల్’ తిరోగమనం
పాలకొండ: జనాభా పెరుగుతోంది. ఇళ్ల నిర్మాణాలు పెరిగాయి. ఫలితంగా భూముల ధరలు అడ్డూఅదుపూ లేకుండా పైపైకి ఎగబాకాయి. రియల్ ఎస్టేట్ రంగం మూడు స్థలాలు.. ఆరు లే అవుట్లుగా వర్థిల్లింది. అయితే ఇది ఏడాది క్రితంనాటి ముచ్చట. ఏడాది కాలంగా పరిస్థితి తిరగబడింది. ఆకాశాన్నంటిన స్థలాల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిం చాయి. కొనుగోలు చేయలేని స్థాయికి పెరిగిపోయాయి. ఫలితంగా రియల్ బూ మ్.. గాలి బుడగలా ఢామ్మని పేలిపోయింది. స్థలాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం చతికిలబడింది. పాలకొండ డివిజన్‌తోపాటు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. దీని ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యాలపైనా పడింది. ఏడాది క్రితం వరకు ఇళ్ల స్థలాలకు విపరీతమైన గిరాకీ ఉండేది. ప్రధాన పట్టణాలతోపాటు పాలకొండ డివిజన్‌లోనూ క్రయవిక్రయాలు జోరుగా సాగేవి. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కనిపించిన భూమినంతా కొనేసి లే అవుట్లు వేసి.. ప్లాట్లుగా అమ్మేసి లక్షలకు లక్షలు వెనకేసుకునేవారు. ఫలితంగా భూముల ధరలు ఆకాశాన్నంటాయి. అప్పటివరకు రూ.30 వేలు పలికిన ఎకరా భూమి అమాంతం కోటి రూపాయల వరకు చేరిన ఉదంతాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖాళీ భూములన్నీ రియల్ ఎస్టేట్ లే అవుట్లగా మారిపోయాయి. అయితే రేట్లు అందుబాటులో లేకుండా పోవడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేయడం ప్రారంభించారు. ఇప్పటికే భూములు పలు చేతులు మారి.. రేట్లు పెంచుకుంటూ పోవడంతో.. తగ్గితే చూద్దాం అన్న ధోరణి మొదలైంది. ఫలితంగా కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. అడ్వాన్సులు చెల్లించి, ఒప్పందాలు చేసుకున్న వారు సైతం పూర్తి మొత్తాలు చెల్లించలేక, అగ్రిమెంట్ సమయం పూర్తి అయినా రిజిస్ట్రేషన్ చేయించుకోలేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి చివరి దశలో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన వారిని ముంచేశాయి. లక్షలు పెట్టుబడి పెట్టి కొన్న స్థలాల్లో వేసిన ప్లాట్లు అమ్ముడుపోక.. చేతిలో డబ్బులు ఆడక ఇప్పటికే పలువురు అర్ధాంతరంగా ఈ రంగం నుంచి పలాయనం చిత్తగించారు. మరికొందురు అప్పులపాలయ్యారు. రిజిస్ట్రేషన్లు అంతంత మాత్రమే రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను గత ఏడాది నవంబర్ నాటితో పోల్చి చూస్తే ఈ ఏడాది నవంబర్ నాటికి రిజిస్ట్రేషన్లు 21 శాతం కూడా జరగలేదు. పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ ఆర్థిక సంవత్సరానికి సుమారు 5 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే నవంబర్ నెలాఖరునాటికి సుమారు కోటి రూపాయల ఆదాయం మాత్రమే లభించింది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు లేక కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యాల మాట అటుంచితే కనీస ఆదాయం లభించడమే కనాకష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బాబోయ్... దొంగనోట్లు
పాలకొండ : దొంగనోట్లు... దొంగనోట్లు.. ప్రస్తుతం పాలకొండలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎక్కడ చూసినా దొంగనోట్లు దర్శనమిస్తున్నాయంటూ పలువురు చెబుతున్నారు. పోస్టాఫీసు, ఏటీఎంలలో కూడా దొంగనోట్లు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏజెన్సీ ముఖద్వారం కావడంతో కొంత మంది వ్యక్తులు దొంగనోట్లును మార్చేందుకు పాలకొండను కేంద్రంగా మార్చుకున్నారని తెలుస్తోంది. రోజూ కొంత మంది వ్యక్తులు పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగేచోటుకు దొంగనోట్లును అందిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా రూ.1000, రూ.500 నోట్లు కట్టల్లో ఫేక్ నోట్లు అధికంగా ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. సంత లే కేంద్రాలు దొంగనోట్లు మార్చేవారు వారపుసంతలనే కేంద్రాలుగా ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పశువుల సంతల్లో రూ.లక్షల్లో మార్పిడి జరుగుతున్నట్టు పలువురు చెబుతున్నారు. ఇక్కడైతే అధికారుల పర్యవేక్షణ గాని, నోట్లు గుర్తించగలిగే సామర్థ్యం గానీ ఉండకపోవడం అవకాశంగా కనిపిస్తోంది. ఒకే సారి పెద్ద మొత్తంలో నగదు మార్చేందుకు వీలు కలుగుతుందని పలువురు అంటున్నారు. మరో వైపు గిరిజన గ్రామాలు అధికంగా ఉండటంతో వీరికి నోట్లుపై అవగాహణ ఉండదన్న విషయాన్ని తనకు అనుకూలంగా దొంగనోట్ల మార్పిడిదారులు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గుర్తించడం కష్టమే ప్రస్తుతం చలామణి అవుతోన్న దొంగనోట్లును గుర్తించడం కష్టతరంగా మారింది. అసలు నోట్లుకు వీటికి ఏ విధమైన తేడాలు కనిపించకపోవడం గమనార్హం. నగదు బ్యాంక్‌ల లో జమచేసే సమయాలలో మాత్రమే ఇవి వెలుగు చూస్తున్నాయి. రోజూ బ్యాంక్‌లలో దొంగనోట్లు పట్టుబడుతుండటం సర్వసాధారణంగా మారింది. అయితే బ్యాంకర్లు ఆ నోట్లును తీసుకుని అక్కడే చించి వేస్తున్నారు. ఇటీవల పోస్టాఫీసు నుంచి ఓ వ్యక్తి నగదు తెచ్చి బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళితే అక్కడ రూ.500 నోట్లు నకిలీవిగా బ్యాంక్ సిబ్బంది గుర్తించి చించి వేశారు. అయితే ఎలాంటి కేసులు ఎదుర్కొనాల్సి వస్తుందోనని బాధితులు విషయం చెప్పేందుకు ముందుకు రావడదం లేదు. ఇటీవల ఓ బ్యాంకు ఏటీఎంలో నగదు తీస్తే రూ.వెయ్యి కాగితం దొంగనోటు వచ్చిం దని ఒక వ్యక్తి తెలిపారు. అయితే ఆ నోట్‌ను బ్యాంక్ సిబ్బందికే విడిచి పెట్టినట్టు చెప్పాడు. అవగాహన కల్పిస్తున్నాం : స్టేట్‌బ్యాంక్ మేనేజర్ జగన్నాథ పండా దొంగనోట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించక తప్పదని స్థానిక ఎస్బీఐ మేనేజర్ జగన్నాథ పండా అన్నారు. అసలు నోట్లుకు, వీటికి పెద్దగా తేడా లేకపోవడంతో ప్రజలు మోసపోతున్నారన్నారు. బ్యాంక్‌కు వచ్చేవి దొంగనోట్లుగా తెలిస్తే ఫేక్ నోట్లు అని రాసి పెడుతున్నట్టు చెప్పారు. సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేస్తున్నామన్నారు. దొంగనోట్లను ఎలా గుర్తించాలి అనే అంశంపై వినియోగదారులకు అవగాహన కల్పి స్తూ బ్యాంకులో బోర్డులు ఏర్పాటు చేశామని చెప్పారు.