ఏటీఎంలో కలర్ జెరాక్స్ వంద నోటు | Color Xerox ATM hundred note | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో కలర్ జెరాక్స్ వంద నోటు

Published Tue, Jul 22 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

ఏటీఎంలో కలర్ జెరాక్స్ వంద నోటు

ఏటీఎంలో కలర్ జెరాక్స్ వంద నోటు

పాలకొండ రూరల్: సామాన్య మనుషులనే కాదు... బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన యంత్రాలకు సైతం జల్లకొట్టగల ఉద్దండులు తయారయ్యారు. గతంలో ఏటీఎంల ద్వారా దొంగనోట్లు వచ్చిన దాఖలాలు ఎక్కువగా ఉండేవి. తాజాగా సోమవారం పాలకొండ పట్టణంలో ఆర్‌సీఎం స్కూల్ ఎదురుగా ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో కలర్ జెరాక్స్ వందనోటు వచ్చింది. పట్టణానికి చెందిన ఉదయాన దిలీప్‌కుమార్ 12 గంటల సమయంలో ఏటీఎం నుంచి రూ.1500 విత్‌డ్రా చేయగా, అందులో ఒక వందనోటు ప్రత్యేకంగా కనిపించింది. దీన్ని పరీక్షించగా కలర్ జెరాక్స్ తీసిన వందనోటుగా తేలింది. ఈ విషయమై సీతంపేటలో ఉన్న ఇండియన్ బ్యాంకు ఉన్నతాధికారులకు ఫోన్‌ద్వారా సదరు వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే ఏటీఎంలో నగదు నింపే విషయం తమ పరిధిలో ఉండదని, థర్డ్‌పార్టీ వ్యక్తులు కాంట్రాక్ట్ విధానంతో ఏటీఎంలో నగదు ఉంచుతారని బ్యాంకు ప్రతినిధి పేర్కొవడంతో దిలీప్ కుమార్ తెల్లముఖం వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement