
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈపీఫ్ఓవో సంస్థ ఈపీఎఫ్‌వో అకౌంట్‌లలో పలు కీలక మార్పులు చేపట్టింది. ఈపీఎఫ్‌వో క్లయిమ్, వివరాలను చేర్చడం, తొలగించడం, ఎగ్జిట్ అవ్వడాన్ని సులభతరం చేసింది.
తాజాగా, ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఫోన్‌పే,గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఈపీఎఫ్‌వో విత్ర్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది
వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరుపుతుంది. సాధ్యసాధ్యాలను బట్టి సౌకర్యాన్ని ఈ ఏడాది మే, లేదా జూన్ నాటికి ప్రారంభించే యోచనలో ఈపీఎఫ్‌వో ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
దీంతో పాటు ఈపీఎఫ్‌వో3.0లో ఏటీఎం ద్వారా ఈపీఎఫ్‌వో విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు
యూపీఐ ద్వారా ఈపీఎఫ్‌వో విత్ డ్రా వల్ల ఉద్యోగలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డబ్బుల్ని తక్షణమే పొందవచ్చు. పారదర్శకతతో పాటు ఈపీవోఎఫ్‌వో విత్ డ్రా ప్రక్రియ మరింత సజావుగా జరగనుంది.
ఈపీఎఫ్‌వో 3.0 ప్రారంభం
ఈపీఎఫ్‌వో 3.0 అమల్లోకి వస్తే, సభ్యులు తమ పొదుపులను సాధారణ బ్యాంకు అకౌంట్‌ల నుంచి డబ్బులను ఉపసంహరించుకోవడం మరింత సులభం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment