
ఢిల్లీ: ఏటీఎంలో నగదు లావాదేవీలపై కస్టమర్లకు షాకిచ్చేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. సొంత బ్యాంక్ ఏటీఎం నుంచి నెలలో ఉచితంగా ఐదు లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే, మే 1 నుంచి వీటి పరిమితి దాటితే ఒక్కో లావాదేవీపై రూ.23 వసూలు చేసేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం, వినియోగదారులు ఉచిత లావాదేవీ పరిమితిని దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అదే వేరే బ్యాంకు ఏటీఎం నుంచి అయితే మెట్రో ప్రాంతాల్లో ఐదు లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో 3 లావాదేవీలకు అనుమతి ఉంది. ఆర్‌బీఐ తాజాగా అనుమతించిన నేపథ్యంలో ఆ మొత్తం రూ.23కి పెరగనుంది.