money withdrawal
-
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
వేతన జీవుల కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రాయిల్ నిబంధనల్ని మార్చింది.ఈ నిబంధనలు ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఈపీఎఫ్ఓలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? వాటివల్ల ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు ఎలాంటి లాభం చేకూరనుంది?గతంలో ఈపీఎఫ్ఓ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఆధార్ తప్పని సరి. అయితే ఆధార్ లేకపోవడం, లేదంటే తప్పులు దొర్లడం వంటి పలు సందర్భాలలో ఈపీఎఫ్ఓ డబ్బులు విత్ డ్రాయిల్ చేయడం కష్టంగా మారింది. దీంతో సకాలంలో డబ్బులు అందక బాధిత కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఓఐసీ అనుమతి తప్పని సరిఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ దారులు ఎవరైనా మరణిస్తే.. ఆధార్ కార్డ్ లేకుండా పీఎఫ్ విత్ డ్రాయిల్ చేసుకునే వెసులుబాటు ఈపీఎఫ్ఓ కల్పించింది. మరణించిన ఉద్యోగి సంస్థ హెచ్ఆర్ విభాగం.. సదరు ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (ఓఐసీ)అనుమతి ఇవ్వాలి. అనంతరం ఈపీఎఫ్ఓ విత్ డ్రాయిల్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.ఇది ఎవరికి వర్తిస్తుంది? ఈపీఎఫ్ఓ మే 17న అధికారికంగా విడుదల చేసిన ప్రకటన మేరకు యూఏఎన్‌లో సభ్యుని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆధార్ డేటాబేస్‌లో సరికాని/అసంపూర్ణంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పై సూచనలు వర్తిస్తాయి.ఆధార్ కార్డ్ లేకపోతే మరణించిన ఈపీఎఫ్ఓ దారుడికి ఆధార్ కార్డ్ లేకపోతే ఈపీఎఫ్ఓ 26.03.2024న విడుదల చేసిన జాయింట్ డిక్లరేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వెర్షన్-2 ప్రకారం ఆధార్ లేని సభ్యుడు మరణిస్తే నామినీ ఆధార్ సిస్టమ్‌లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడానికి అనుమతి ఉంటుంది. జాయింట్ డిక్లరేషన్ ఫారంతో పాటు ఇతర ప్రక్రియలు ఒకే విధంగా ఉంటాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. -
దేశంలో వర్చువల్ ఏటీఎంలు.. ఇకపై ఏటీఎం మెషిన్లతో పనిలేదు!
మన దేశంలో యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల కారణంలో చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. తగినంత ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తవుతున్నాయి. కానీ ఇలాంటి సేవల వల్ల డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డ్‌ల అవసరం తగ్గి పోయింది. ఒక వేళ ఏదైనా మారుమూల ప్రాంతానికి వెళితే ఇంటర్నెట్ నెట్ వర్క్ సరిగ్గా లేకపోతే యూపీఐ పేమెంట్స్ లావాదేవీలు సవ్యంగా జరగవు. చేతిలో డెబిట్ కార్డ్ ఉంటే ఏటీఎం సెంటర్‌కి వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. కాబట్టే, ఇకపై మనదేశంలో ఫిజికల్ ఏటీఎం స్థానంలో వర్చువల్ ఏటీఎంలు రాబోతున్నాయి. ఈ వర్చువల్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్ తప్పని సరిగా అవసరం. చండీగఢ్‌కు చెందిన ఫిన్‌టెక్ కంపెనీ పేమార్ట్ ఇండియా వర్చువల్, కార్డ్‌లెస్, హార్డ్‌వేర్ లెస్ మనీ విత్ డ్రాయిల్ సేవతో ముందుకు వచ్చింది. వినియోగదారులకు డబ్బులు కావాలంటే ఏటీఎం మెషిన్, పిన్ నెంబర్ అవసరం లేదు. వర్చువల్ ఏటీఎం వినియోగించాలంటే ఇవి తప్పని సరి ఈ వర్చువల్ ఏటీఎం ద్వారా డబ్బుల్ని డ్రా చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. డబ్బుల్ని డ్రా చేసే సమయంలో మీ బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ చేసిన ఫోన్ నెంబర్ సాయంతో మొబైల్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవ్వాలి వర్చువల్ ఏటీఎంలో డబ్బుల్ని ఎలా డ్రా చేయాలంటే? వర్చువల్ ఏటీఎంలో డబ్బుల్ని డ్రా చేయాలంటే ముందుగా మీ సమీపంలో ఉన్న కిరాణా స్టోర్లకు పేమార్ట్ అనుమతులు ఉండాలి. మీ మొబైల్లో పేమార్ట్తో వర్చువల్ ఏటీఎం కోసం నమోదు చేసుకున్న దుకాణదారుల జాబితా, పేర్లు, లొకేషన్, ఫోన్ నంబర్లతో సహా అందుబాటులో ఉంటాయి. అందుబాటులో ఉన్న కిరాణ స్టోర్‌లో www.vatm.inని ఉపయోగించాలి. ఇందులో లాగిన్ అయిన వెంటనే మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేసి అంనతరం ఫోన్‌కి వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. డబ్బుల్ని డ్రా చేసుకునేందుకు డెబిట్ కార్డ్ లేదా సాంప్రదాయ ఏటీఎం మెషీన్ లేదా కియోస్క్, యూపీఐ ఆప్షన్ అవసరం లేదు. కిరాణా స్టోర్ యజమాని వర్చువల్ ఏటీఎంలా పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ వర్చువల్ ఏటీఎం ఎవరు ఉపయోగించుకోవచ్చు? ‘వర్చువల్ ఏటీఎం సేవలు ఆరు నెలలుగా ఐడీబీఐ బ్యాంక్‌తో విజయవంతంగా కొనసాగుతున్నాయని పేమార్ట్ వెల్లడించింది. కస్టమర్లకు ఈ వర్చువల్ ఏటీఎం సేవల్ని అందించేందుకు ఫిన్‌టెక్ సంస్థ ఇండియన్ బ్యాంక్ , జమ్మూ - కాశ్మీర్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం, చండీగఢ్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో అందుబాటులో ఉన్నాయి.మార్చి నెలలో పేమార్ట్ తన భాగస్వామి బ్యాంకులతో వర్చువల్ ఏటీఎం సేవల పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి ఈ వర్చువల్ ఏటీఎంని ఉపయోగించడానికి కస్టమర్ ఎలాంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదని నారంగ్ తెలిపారు. వర్చువల్ ఏటీఎంలలో ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చు? ఒక వినియోగదారు ప్రతి లావాదేవీకి కనిష్టంగా రూ. 100 నుంచి గరిష్టంగా రూ. 2,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. వర్చువల్ ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి గరిష్ట పరిమితి నెలకు రూ. 10,000. చిన్న మొత్తాలను పొందడానికి వర్చువల్ ఏటీఎం ఉపయోగపడుతుంది. షాప్కీపర్ చేతిలో పెద్ద మొత్తంలో నగదు ఉండకపోవచ్చు కాబట్టి పెద్ద మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఈ ఫీచర్ అంతగా ఉపయోగపడదు. వర్చువల్ ఏటీఎంలతో బ్యాంక్ వచ్చే లాభం వర్చువల్ ఏటీఎంల వల్ల మారుమూల గ్రామాల్లో బ్యాంక్‌లు కస్టమర్లకు సేవల్ని ఉపయోగించికుంటారు. తద్వారా, బ్యాంకులు పెట్టే నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.ఇంకా, వర్చువల్ ఏటీఎం ఉన్న కిరాణా స్టోర్ యజమాని కస్టమర్లు డబ్బులు ఎంత డ్రా చేస్తే అంత మొత్తంలో కమిషన్ పొందే సదుపాయం ఉంది. -
ఎస్బీఐ కస్టమర్లకు మరో శుభవార్త
భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంల నుంచి ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణకు సమయం పొడిగించినట్లు ప్రకటించింది. దీనిని వినియోగదారులు శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచి వినియోగించుకోవచ్చు. జనవరిలో నెల నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ సదుపాయం కేవలం ఉదయం8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు రోజంతా ఆ సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీని ద్వారా 10,000 నగదు వరకు ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం వద్ద జరిగే మోసలను నివారించడం కోసం ఎస్బీఐ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కస్టమర్‌కు ఓటీపీ వస్తేనే నగదును తీసుకోవచ్చు. వినియోగదారులు నగదు భద్రత కోసం ఎస్బీఐ తీసుకువచ్చిన గొప్ప సంస్కరణగా దీనిని పేర్కొనవచ్చు. నగదు ఉపసంహరణ ఓటీపీని వినియోగదారుడు బ్యాంకులో నమోదు చేసుకున్న కస్టమర్ మొబైల్ నంబర్‌కు పంపిస్తారు. దీంతో వినియోగదారుడి అనుమతి లేకుండా ఎవరు నగదు తీసుకునే అవకాశం లేకండా ఉంటుంది. అయితే ఈ సౌకర్యం కేవలం ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు మాత్రమే ఉపయోగపడుతుంది. లావాదేవీలకు ఇది వర్తించదు. ఇది కేవలం ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు మాత్రమే వీలవుతుంది. వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి ఉపయోగపడదు. కార్డ్ హోల్డర్ నగదు ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు ఎంత డబ్బు డ్రా చేయాలో ఎంటర్ చేసిన తరువాత, ఏటీఎం స్క్రీన్ ఓటీపీ విండోను చూపిస్తుంది. లావాదేవీని పూర్తి చేయడానికి కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. చదవండి: ఎస్బీఐ ఏటీఎంకు మొబైల్ తీసుకెళ్లండి! -
ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ
ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు.. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10,000 ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్ డ్రాయల్స్ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. ఈ అదనపు ఆథెంటికేషన్ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరగకుండా నిరోధిస్తుంది’’ అని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే. -
ఏటీఎంలో నకిలీ నోట్లు.!
ఎదులాపురం(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకు ఏటీఎం కేంద్రం నుంచి వచ్చిన రూ.500ల నోట్లు నకిలీవిగా కలకలం రేగింది. దక్కన్ గ్రామీణ బ్యాంకు సమీపంలో ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం పట్టణానికి చెందిన శంకర్‌గౌడ్, గంగాధర్ అనే వ్యక్తులు డబ్బులు డ్రా చేశారు. ఆ సమయంలో ఎర్రా సిరాతో రాసిన.. ప్రింట్ కనిపించకుండా.. ఇతర రంగుతో కూడిన నోట్లు వచ్చాయి. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. బ్యాంకుల్లో సిరాతో రాయబడిన, ఇతర రంగుల్లో ఉన్న నోట్లను తీసుకోవడం లేదని, ఏటీఎం ద్వారా ఇలాంటి నోట్లు రావడం ఏంటని వాపోయారు. సంబంధిత బ్యాంకు అధికారులు స్పందించి ఇకనైనా ఇలాంటి నోట్లు రాకుండా చూడాలని వినియోగదారులు కోరారు. -
‘మీ సేవ’ నుంచి డబ్బులు!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ ముందుందని మీసేవ రాష్ట్ర కమిషనర్ జీటీ వెంకటేశ్వర్రావు తెలిపారు. జూలై 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో కొత్తగా మనీ విత్‌డ్రా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు శనివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ బేస్డ్ పెమెంట్ సిస్టమ్ ద్వారా విత్‌డ్రా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4,500 మీసేవ కేంద్రాలు ఉన్నాయని.. బ్యాంకు ఏటీఎంలు అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఈ తరహా విధానం అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు రూ.2 వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశముందని.. త్వరలోనే రోజుకు రూ.10 వేలు విత్‌డ్రాకు పెంచుతామని తెలిపారు. ఇందుకు కస్టమర్ల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయబోమన్నారు. 30వ తేదీన నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 60 మీసేవ కేంద్రాల్లో ఈ సౌకర్యం ప్రారంభించనున్నట్లు వివరించారు. నెల తర్వాత రాష్ట్రంలోని మిగతా మీసేవ కేంద్రాల్లో క్యాష్ విత్‌డ్రా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. -
హడలెత్తిస్తున్న ఫోన్ కాల్
తాడిపత్రి టౌన్: అగంతకుడు: ‘హలో.. నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నా. మీ ఏటీఎం కార్డు బ్లాక్ చేస్తున్నాం’ ఖాతాదారుడు: అయ్యో సార్.. ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? అగంతకుడు: అయితే మీ కార్డు సీక్రెట్ నంబర్ సహా, కార్డు నంబర్ కూడా చెప్పండి. ఖాతాదారుడు: కార్డు నంబర్, సీక్రెట్ నంబర్ చెప్పారు. ఆ తరువాత ఏం జరిగింది: ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి. అరె.. డబ్బులే డ్రా చేయలేదు. ఎలా మాయమయ్యాయ్ అంటూ ఖాతాదారుల ఆందోళన. ఇలా ప్రతి రోజూ ఎవరికో ఒకరి సెల్‌ఫోన్‌కు 7354943632 నంబర్ నుంచి కాల్ రావడం, వారు భయపడి తమ వివరాలు తెలపగానే డబ్బులు మాయం కావడం వరుసగా జరుగుతున్నాయి. తాడిపత్రిలో ఆర్టీసీ కార్మికులు చాలా మంది ఇలా వేలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ విషయం కార్మికులందరికీ తెలసిపోవడంతో బాధితులందరూ ఆదివారం డిపో వద్ద ఒక్కటై తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువుపెట్టుకున్నారు. తాడిపత్రి ఆర్టీసీ డిపో పరిధిలో 547 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మోకానిక్లు ఉన్నారు. వారం రోజులుగా 7354943632 నంబర్ నుంచి పలువురు కార్మికులకు వరుసగా కాల్స్ వచ్చాయి. తాను ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్‌నంటూ అగంతకుడు హిందీలో ఖాతాదారులను భయపెట్టి వారి వివరాలు రాబట్టుకోవడం, ఆ తరువాత వారి ఖాతాలో డబ్బు డ్రా చేసినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో కంగుతిన్నారు. ఇలా గ్యారేజీ మెకానిక్ గౌస్మోహిద్దిన్ ఖాతాలో రూ.13 వేలు డ్రా కాగా, పెయింటర్ రమేశ్ ఖాతాలో రూ.800, మరో మెకానిక్ రుద్రముని ఖాతాలో రూ.6 వేలు, డైవర్ లక్షుమయ్య ఖాతా నుంచి రూ.7 వేలు, కండక్టర్ ఎస్పీ రావు ఖాతా నుంచి రూ.35 వేలు మాయమయ్యాయి. ఇంకా ఏడీసీ హమీద్ ఖాతాలో రూ.3 వేలు డ్రా అయ్యాయి. ఫోన్ నంబర్ గురించి ఆరా తీస్తే బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చినట్లు వెల్లడైందని గుర్తించారు. తమకు జరిగిన అన్యాయం గురించి కార్మికులు డీఎం నరేంద్రరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సూచన మేరకు బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దీనిపై పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఏటీఎం కార్డు లేకున్నా డబ్బులు విత్‌డ్రా
నర్మెట : బ్యాంకు అధికారులు ఏటీఎం కార్డులు జారీ చేయకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అయినట్లు ఖాతాదారుల సెల్‌కి మెసేజ్ వచ్చిన సంఘటన వరంగల్ జిల్లాలో మంగళవారం జరిగింది. జిల్లాలోని నర్మెట మండలంలోని ఎల్లండ గ్రామానికి చెందిన దొండకాయల గట్టయ్య బ్యాంక్ అఫ్ బరోడా నర్మెట శాఖలో ఖాతా తెరిచాడు. అతనికి బ్యాంకు అధికారులు ఇప్పటివరకు ఏటీఎం కార్డు జారీ చేయలేదు. అయితే అకౌంట్ నుంచి రూ. 1800 ఏటీఎం ద్వారా విత్‌డ్రా అయినట్లు ఆయన సెల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అదే విధంగా అదే గ్రామానికి చెందిన పంతెంగి లక్ష్మయ్య ఖాతా నుంచి కూడా 900 విత్‌డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. వీరిద్దరికి ఏటీఎం కార్డులు జారీ చేయకుండా శాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం ఏమిటని వారు బ్యాంక్ అధికారులను నిలదీశారు. అయితే సంఘటనపే విచారణ చేస్తున్నామని బ్యాంక్ అధికారులు తెలిపారు.