వేతన జీవుల కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రాయిల్ నిబంధనల్ని మార్చింది.ఈ నిబంధనలు ఈపీఎఫ్‌ఓ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఈపీఎఫ్‌ఓలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? వాటివల్ల ఈపీఎఫ్‌ఓ సబ్‌స్క్రైబర్లకు ఎలాంటి లాభం చేకూరనుంది?
గతంలో ఈపీఎఫ్‌ఓ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఆధార్ తప్పని సరి. అయితే ఆధార్ లేకపోవడం, లేదంటే తప్పులు దొర్లడం వంటి పలు సందర్భాలలో ఈపీఎఫ్‌ఓ డబ్బులు విత్ డ్రాయిల్ చేయడం కష్టంగా మారింది. దీంతో సకాలంలో డబ్బులు అందక బాధిత కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
ఓఐసీ అనుమతి తప్పని సరి
ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ దారులు ఎవరైనా మరణిస్తే.. ఆధార్ కార్డ్ లేకుండా పీఎఫ్ విత్ డ్రాయిల్ చేసుకునే వెసులుబాటు ఈపీఎఫ్‌ఓ కల్పించింది. మరణించిన ఉద్యోగి సంస్థ హెచ్‌ఆర్ విభాగం.. సదరు ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఈపీఎఫ్‌ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (ఓఐసీ)అనుమతి ఇవ్వాలి. అనంతరం ఈపీఎఫ్‌ఓ విత్ డ్రాయిల్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.
ఇది ఎవరికి వర్తిస్తుంది?
ఈపీఎఫ్‌ఓ మే 17న అధికారికంగా విడుదల చేసిన ప్రకటన మేరకు యూఏఎన్‌లో సభ్యుని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆధార్ డేటాబేస్‌లో సరికాని/అసంపూర్ణంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పై సూచనలు వర్తిస్తాయి.
ఆధార్ కార్డ్ లేకపోతే
మరణించిన ఈపీఎఫ్‌ఓ దారుడికి ఆధార్ కార్డ్ లేకపోతే ఈపీఎఫ్‌ఓ 26.03.2024న విడుదల చేసిన జాయింట్ డిక్లరేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వెర్షన్-2 ప్రకారం ఆధార్ లేని సభ్యుడు మరణిస్తే నామినీ ఆధార్ సిస్టమ్‌లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడానికి అనుమతి ఉంటుంది. జాయింట్ డిక్లరేషన్ ఫారంతో పాటు ఇతర ప్రక్రియలు ఒకే విధంగా ఉంటాయని ఈపీఎఫ్‌ఓ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment