Provident Fund
-
ఈపీఎఫ్‌వోలో కొత్త ఏడాది ముఖ్యమైన మార్పులు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మార్గదర్శకాలు, విధానాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురానుంది. వీటిలో చాలా మార్పులు రాబోయే కొత్త సంవత్సరంలో అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. వీటితోపాటు పలు కొత్త సేవలను పరిచయం చేయనుంది. పీఎఫ్ ఖాతాదారులకు సౌకర్యాన్ని మెరుగుపరచడమే ఈ అప్డేట్ల ప్రధాన లక్ష్యం. కొత్త ఏడాదిలో ఈపీఎఫ్‌వోలో వస్తున్న ముఖ్యమైన మార్పులు.. చేర్పులు ఏంటన్నది ఇక్కడ తెలుసుకుందాం.ఉద్యోగి కంట్రిబ్యూషన్ పరిమితిఈపీఎఫ్వో ముఖ్యమైన అప్డేట్లో ఉద్యోగుల ఈపీఎఫ్ ( EPF ) కంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు ఒకటి. ప్రస్తుతం, ఉద్యోగులు ప్రతి నెలా వారి ప్రాథమిక వేతనంలో 12% తమ ఈపీఎఫ్ ఖాతాకు కేటాయిస్తున్నారు. ఈ బేసిక్ వేతనాన్ని రూ. 15,000 లుగా ఈపీఎఫ్‌వో నిర్దేశించింది. దీనికి బదులుగా ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా ఈపీఎఫ్ ఖాతాకు కేటాయించుకునేలా కొత్త ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పదవీ విరమణ నిధిని భారీగా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా నెలవారీ పెన్షన్ చెల్లింపు ఎక్కువగా ఉంటుంది.ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బుఈపీఎఫ్వో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును ఏటీఎం ( ATM ) కార్డ్‌తో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో చందాదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానుంది. ఇది అందుబాటులోకి వస్తే సభ్యులు తమ బ్యాంకు ఖాతాల్లోకి పీఎఫ్ డబ్బును పొందడానికి 7 నుండి 10 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా విలువైన సమయం ఆదా అవుతుంది.ఈపీఎఫ్‌వో ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్పీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారులు తమ డిపాజిట్లను సులభంగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్‌వో తన ఐటీ (IT) వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఈ అప్‌గ్రేడ్ 2025 జూన్ నాటికి పూర్తవుతుందని అంచనా. ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత, సభ్యులు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లు, మెరుగైన పారదర్శకత, మోసపూరిత కార్యకలాపాల తగ్గుదలని ఆశించవచ్చు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ ( ETF ) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుండి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. -
ఉద్యోగులకు రూ.160 కోట్లు చెల్లించిన స్పైస్‌జెట్
ప్రముఖ విమానయాన సంస్థ 'స్పైస్‌జెట్' రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 160.07 కోట్ల విలువైన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) బకాయిలన్నింటినీ క్లియర్ చేసినట్లు స్పష్టం చేసింది. అనేక సంఘాలను ఎదుర్కొన్న తరువాత కంపెనీ రూ.3000 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులను ఉపయోగించి అన్ని రకాల పెండింగ్ బిల్లులకు సంస్థ క్లియర్ చేస్తోంది.చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు అన్నీ కూడా కంపెనీ చెల్లించడంతో.. సంస్థ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, కార్యకలాపాల నిర్వహణకు ఉన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి.పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన సందర్భంగా స్పైస్‌జెట్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పిఎఫ్ బకాయిల క్లియరెన్స్‌ను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. స్పైస్‌జెట్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నారు.SpiceJet has settled pending employee provident fund dues of ₹160.07 crore accumulated over the past two years, along with other statutory liabilities such as TDS, GST, and employee salaries. This was made possible through internal cash flows and the ₹3,000 crore raised via a… pic.twitter.com/QFgbBXGmxZ— SpiceJet (@flyspicejet) December 13, 2024 -
రూ.25,820 కోట్లకు చేరిన పీఎఫ్ బకాయిలు!
ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) వాటాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)కు చెల్లించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. ఈపీఎఫ్ఓ డిఫాల్ట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023-24లో ఈపీఎఫ్ఓ డిఫాల్ట్‌లు రూ.25,820.88 కోట్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 69.3 శాతం అధికంగా ఉంది. ఇది గతంలో రూ.15,254.06 కోట్లు ఉండేదని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల బకాయిలు తెలంగాణలోనే అధికంగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని కంపెనీల్లో తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు, పరిపాలనాపరమైన లోపాలు లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ ఎగవేతలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరడం, ఎగవేతదారుల వివరాలను పబ్లిక్ డొమైన్లో ప్రచారం చేయడం, ఎగవేతదారుల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలుఈపీఎఫ్ఓ రికవరీ ఇలా..రాష్ట్ర ప్రభుత్వ సహాయం: బకాయిల రికవరీకి వీలుగా ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. స్థానిక ప్రభుత్వాల మద్దతుతోపాటు అక్కడి పరిపాలనా యంత్రాంగాన్ని ఉపయోగించడం వల్ల రికవరీకి అవకాశం ఉంటుందని నమ్ముతుంది.డిఫాల్టర్ల వివరాలు ప్రచారం చేయడం: కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వారికి అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలు పాటించకపోవడంపై సంస్థలకు సమాచారం అందించేందుకు డిఫాల్ట్ కంపెనీల పేర్లను ప్రచారం చేస్తున్నారు.ఆస్తుల అటాచ్మెంట్: ఈపీఎఫ్‌వో యాజమాన్యాల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేస్తోంది. ఈ చట్టపరమైన చర్యల వల్ల నగదుగా మార్చగల ఆస్తులను స్వాధీనం చేసుకుని బకాయి వసూలు చేస్తోంది.చట్టపరమైన చర్యలు: దీర్ఘకాలిక ఎగవేతదారులపై ఈపీఎఫ్ఓ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం, కఠిన శిక్షలు విధించేలా చూస్తోంది. -
బీమా సొమ్ము.. ఆర్టీసీ సొంత అవసరాలకు
సాక్షాత్తూ భవిష్యనిధి(పీఎఫ్) సంస్థ కల్పించిన బీమా పథకానికి ఆర్టీసీ గండి కొట్టింది. ఆ పథకం ద్వారా మృతుడి కుటుంబ సభ్యుల(నామినీకి)కు గరిష్టంగా రూ.7 లక్షలు అందే ఓ చట్టబద్ధ ప్రయోజనాన్ని ఏడాదిన్నరగా అందించటం లేదని తెలిసింది. ఇప్పుడు ఈ ఆర్థిక ప్రయోజనం కోసం దాదాపు 300కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: భవిష్యనిధిలో అంతర్భాగంగా ‘‘ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూ్యరెన్స్ (ఈడీఎల్ఐ)’’స్కీమ్ ఆర్టీసీలో కొనసాగుతోంది. ఓ సంస్థలో 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులుండి, వారికి ఇంతకంటే మెరుగైన మరే బీమా పథకాన్ని సంస్థ అమలు చేయని పక్షంలో, కచ్చి తంగా దీనిని అమలు చేయాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగి నుంచి ఎలాంటి ప్రత్యేక కాంట్రిబ్యూషన్ అంటూ లేకుండా సాగుతుంది. ఉద్యోగి బేసిక్ ప్లస్ డీఏ (మూల వేతనం ప్లస్ కరువు భత్యం)మీద 0.5 శాతం లేదా గరిష్టంగా రూ.75 చొప్పున ప్రతినెలా సంస్థ ఉద్యోగిపక్షాన అతని/ఆమె భవిష్య నిధి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. భవిష్యనిధిలో సభ్యత్వం ఉన్న ప్రతి ఉద్యోగి (అర్హతలను అనుసరించి) దీని ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగి చనిపోతే అతని/ఆమె నామినీకి కనిష్టంగా రూ.రెండున్నర లక్షలు.. నెలవారీ వేతనం, భవిష్యనిధి నిల్వ తదితరాల ఆధారంగా గరిష్టంగా రూ.ఏడు లక్షల వరకు చెల్లిస్తారు. ఉద్యోగి నయాపైసా కాంట్రిబ్యూషన్ లేకుండా ఇది అందుతుంది. ఇష్టారాజ్యానికి ఇదే కారణం.. భవిష్యనిధి ఖాతాల నిర్వహణలో ఆరీ్టసీకీ ప్రత్యేక మినహాయింపు ఉంది. సొంతంగానే పీఎఫ్ ట్రస్టును నిర్వహిస్తుంది. దీనికి ఓ నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది (ప్రస్తుతం కమిటీ లేదు). ఈ వెసులుబాటే ఇప్పుడు ఆర్టీసీ ఇష్టారాజ్యానికి కారణమైంది. భవిష్యనిధి చెల్లింపులు పూర్తి చట్టబద్ధమైనమే అయినా, కాంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది. దాదాపు పదేళ్ల క్రితం ఈ కట్టు తప్పే సంప్రదాయం ఆర్టీసీలో మొదలైంది. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని కొంతమేర తగ్గించి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా.. సంస్థ ఆర్థిక అవసరాలు, ప్రభుత్వం నుంచి సకాలంలో సాయం అందకపోవటం లాంటి వాటి వల్ల దానికి పూర్తిగా అడ్డుకట్ట పడలేదు. ఈ క్రమంలోనే ఈ బీమా పథకం కోసం యాజమాన్యం చెల్లించే వాటాను ట్రస్టులో డిపాజిట్ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది. ఫలితంగా ఏడాదిన్నరగా దీని చెల్లింపులు నిలిచిపోయాయి. గతేడాది మార్చి వరకు భవిష్యనిధి బీమా పథకం చెల్లింపులు జరిగాయి. ఆ తర్వాత నిలిచిపోయినట్టు సమాచారం. ప్రతి మూడు నెలలకోమారు ఈ పథకం కోసం ఆర్టీసీ నిధులు విడుదల చేసే పద్ధతి ఉండేది. ఏడాదిన్నరగా అవి కూడా నిలిచిపోయాయి. అప్పటి నుంచి దాదాపు 300 మందికిపైగా ఉద్యోగులు మరణించారు. వీరి కుటుంబ సభ్యుల(నామినీ)కు ఆ బీమా మొత్తాన్ని చెల్లించటం లేదని తెలిసింది. -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
వేతన జీవుల కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రాయిల్ నిబంధనల్ని మార్చింది.ఈ నిబంధనలు ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఈపీఎఫ్ఓలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? వాటివల్ల ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు ఎలాంటి లాభం చేకూరనుంది?గతంలో ఈపీఎఫ్ఓ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఆధార్ తప్పని సరి. అయితే ఆధార్ లేకపోవడం, లేదంటే తప్పులు దొర్లడం వంటి పలు సందర్భాలలో ఈపీఎఫ్ఓ డబ్బులు విత్ డ్రాయిల్ చేయడం కష్టంగా మారింది. దీంతో సకాలంలో డబ్బులు అందక బాధిత కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఓఐసీ అనుమతి తప్పని సరిఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ దారులు ఎవరైనా మరణిస్తే.. ఆధార్ కార్డ్ లేకుండా పీఎఫ్ విత్ డ్రాయిల్ చేసుకునే వెసులుబాటు ఈపీఎఫ్ఓ కల్పించింది. మరణించిన ఉద్యోగి సంస్థ హెచ్ఆర్ విభాగం.. సదరు ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (ఓఐసీ)అనుమతి ఇవ్వాలి. అనంతరం ఈపీఎఫ్ఓ విత్ డ్రాయిల్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.ఇది ఎవరికి వర్తిస్తుంది? ఈపీఎఫ్ఓ మే 17న అధికారికంగా విడుదల చేసిన ప్రకటన మేరకు యూఏఎన్‌లో సభ్యుని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆధార్ డేటాబేస్‌లో సరికాని/అసంపూర్ణంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పై సూచనలు వర్తిస్తాయి.ఆధార్ కార్డ్ లేకపోతే మరణించిన ఈపీఎఫ్ఓ దారుడికి ఆధార్ కార్డ్ లేకపోతే ఈపీఎఫ్ఓ 26.03.2024న విడుదల చేసిన జాయింట్ డిక్లరేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వెర్షన్-2 ప్రకారం ఆధార్ లేని సభ్యుడు మరణిస్తే నామినీ ఆధార్ సిస్టమ్‌లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడానికి అనుమతి ఉంటుంది. జాయింట్ డిక్లరేషన్ ఫారంతో పాటు ఇతర ప్రక్రియలు ఒకే విధంగా ఉంటాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. -
ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై త్వరలో నిర్ణయం - ఇదే జరిగితే పదేళ్లలో..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అకౌంట్లో ఉన్న డబ్బుపై ఇచ్చే వడ్డీ రేటుపైన కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సుమారు 8% వడ్డీ రేటును ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం. 2022-23లో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.15 శాతం, 2022-21 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.10 శాతం ఉండేది. ప్రస్తుతం ఇది 8 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద ప్రస్తతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పెట్టుబడులపై రాబడిని మెరుగుపరిచేందుకు స్టాక్స్‌లో పెట్టుబడిని ప్రస్తుత 10% నుంచి 15%కి పెంచడానికి EPFO బోర్డు నుంచి ఆమోదం పొందాలని కూడా యోచిస్తోంది. ప్రభుత్వం ఎన్నికల సంవత్సరం కావడంతో, ప్రావిడెంట్ ఫండ్ (PF) డిపాజిట్లపై స్థిరమైన రాబడి రేటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఎటువంటి ఎదురుదెబ్బలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న రేట్లకు అనుగుణంగా చూసే అవకాశం ఉందని EPFO బోర్డు సభ్యుడు వెల్లడించారు. 2013-14 నుంచి 2022-23 వరకు ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు 8 శాతానికి రాలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వడ్డీ రేటు 8 శాతంగా నిర్ణయిస్తే.. గత పది సంవత్సరాలకంటే తక్కువ వడ్డీ రేటు ఇదే అవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇదీ చదవండి: సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్! -
ఆర్టీసీలో గ్రాట్యుటీ గల్లంతు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చరిత్రలో తొలిసారి గ్రాట్యుటీకి గండిపడింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగుల హక్కుగా పొందే ఈ గ్రాట్యుటీని ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి నిలిపేసింది. గతంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా గ్రాట్యుటీని మాత్రం ఆపలేదు. గత జనవరి నుంచి వీటి చెల్లింపుల్లో ప్రతిష్టంభన నెలకొంది. డిసెంబర్లో పదవీ విరమణ పొందినవారికి కాస్తా ఆలస్యంగా చెల్లించారు. జనవరి నుంచి రిటైర్ అవుతున్నవారికి చెల్లించే విషయంలో ఆర్టీసీ వెనకాముందు ఆడుతోంది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలను వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. వారు రిటైర్ అయ్యే సమయానికల్లా సెటిల్మెంట్లను సిద్ధం చేస్తారు. కానీ, ఇప్పుడు మొదటిసారి గతి తప్పింది. ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ ఆధారంగా రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీ అందుతుంది. ఆర్టీసీలో ప్రస్తుతం పింఛన్ విధానం లేనందున గ్రాట్యుటీ పెద్ద ఊరట, దాన్ని భవిష్యత్తు ఆసరాకు వీలుగా డిపాజిట్ చేసుకునేవాళ్లు, ఇంటి ప్రధాన అవసరాలకు వాడేవారు ఎక్కువగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు గ్రాట్యుటీ నిలిచిపోవటం, ఎప్పుడు విడుదలవుతుందో తెలియని అయోమయం నెలకొనటంతో రిటైర్ అవుతున్న ఉద్యోగులలో తీవ్ర ఆవేదన నెలకొంది. తక్కువ వేతనాలుండే శ్రామిక్, డ్రైవర్, కండక్టర్ కుటుంబాల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది. చివరి నెల వేతనం కూడా గల్లంతేనా.. ఆర్టీసీలో తొలి నుంచి రిటైర్ అయ్యేచివరి నెలవేతనం ఆలస్యంగా చెల్లిస్తూ వచ్చే పద్ధతి ఉంది. వారు జాయిన్ అయినప్పుడు నెల మధ్యలోనో, చివరలోనో విధుల్లో చేరినప్పుడు ఆ నెల మొత్తానికి అడ్వాన్సుగా పూర్తి మొత్తం చెల్లిస్తున్నారు. రిటైర్ అయ్యే చివరి నెల వేతనం నుంచి నాటి అడ్వాన్స్ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. ఈ లెక్కలు చూసేందుకు సమయం పట్టనున్నందున ఓ నెల ఆలస్యంగా చివరి వేతనం చెల్లించేవారు. ఇప్పుడు గ్రాట్యుటీతోపాటు ఆ నెల వేతనం చెల్లింపునకు కూడా ఆటంకం ఏర్పడింది. వెరసి ఇటు గ్రాట్యుటీ రాక, చివరి వేతనం అందక ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఇళ్లకు వెళ్తున్నారు. రిటైర్మెంట్ ఫంక్షన్‌రోజు కుటుంబసభ్యులను పిలిపించి సన్మానం చేసి సెటిల్మెంట్ల తాలూకు డబ్బు అందజేసి పంపించేరోజులు పోయి, ఖాళీ చేతులతో పంపటం ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆవేదనకు కారణమవుతోంది. ఆర్ఈఎంఎస్ సిబ్బందిలో అవగాహన లేక.. ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా అందుతోంది. రిటైర్ అవగానే ఆ వెసులుబాటు నిలిచిపోతుంది. అప్పుడు సిబ్బంది హోదా ఆధారంగా రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు నిర్ధారిత మొత్తాన్ని వసూలు చేసుకుని ‘రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ బెనిఫిట్ స్కీం(ఆర్ఈఎంఎస్)’లో సభ్యత్వం కలి్పస్తారు. అప్పుడు వారికి తార్నాక ఆసుపత్రి ద్వారా మెరుగైన చికిత్సకు వేరే ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ చేస్తే రూ.4 లక్షల వరకు బిల్లు కవర్ అవుతుంది. ఆర్ఈఎంఎస్ సభ్యత్వం కోసం ఉద్యోగులు చెల్లించాల్సిన మొత్తాన్ని గ్రాట్యుటీ నుంచి మినహాయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు గ్రాట్యుటీ నిలిచిపోవటంతో కొన్ని డిపోల్లో సంబంధిత సెక్షన్ ఉద్యోగులు ఆర్ఈఎంఎస్ సభ్యత్వం కోసం ఏర్పాట్లు చేయటం లేదు. కొన్నిచోట్ల మాత్రం, నిర్ధారిత మొత్తాన్ని తగ్గించి గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం ఉన్నతాధికారులకు ఫైల్ పంపుతున్నారు. దీంతో కొన్ని డిపోల్లో రిటైర్ అయినవారికి ఆర్‌ఈఎంస్ సభ్యత్వం లభించటం లేదు. ఏప్రిల్‌లో శుభకార్యాలు లేకపోవటంతో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య కూడా తగ్గించి ఫలితంగా రోజువారీ టికెట్ ఆదాయం రూ.14.50 కోట్లు రావాల్సి ఉండగా, రూ.12 కోట్ల వద్దే ఆగిపోతోంది. ఇలాంటి తరుణంలో ఈ నెల తాలూకు జీతాల చెల్లింపు ఎలా అన్న విషయంలో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జీతాలకే దిక్కులేని తరుణంలో గ్రాట్యుటీ సెటిల్మెంట్ కష్టంగా మారింది. -
EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు..
భారతదేశంలో చట్టబద్దమైన 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO) సంస్థ ఉద్యోగుల భవిష్య నిధిని నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇది ఉద్యోగి పదవి విరమణ పొందిన తరువాత ఎంతగానో ఉపయోగపడే ఒక రకమైన పొదుపు. అయితే కొన్ని సందర్భాల్లో కొంత ప్రావిడెంట్ ఫండ్ తీసుకునే వెసులుబాటు ఉంది. ఉద్యోగి పదవి విరమణ పొందకముందే ఎలాంటి సందర్భాల్లో ఫండ్ తీసుకోవచ్చు, ఎంత శాతం తీసుకోవచ్చనే మరిన్ని వివరాలు మీ కోసం.. నిరుద్యోగం విషయంలో.. పిఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఏదైనా సందర్భంలో తన ఉద్యోగం కోల్పోతే, లేదా ఉద్యోగం లభించకుండా ఎక్కువ కాలం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పటికే పొదుపు చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ నుంచి 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళా నిరుద్యోగ సమయం రెండు నెలలకంటే ఎక్కువ ఉంటె మిగిలిన 25 శాతం కూడా తీసుకోవచ్చు. ఉన్నత చదువుల కోసం.. పిఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఉన్నత చదువులు చదవటానికి, లేదా 10వ తరువాత పిల్లల విద్యా ఖర్చులను భరించడానికి 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. వివాహం కోసం.. ఈ ఆధునిక కాలంలో పెళ్లి ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి, కావున ఉద్యోగులు తమ పెళ్లి ఖర్చుల కోసం కూడా తమ పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును 50 శాతం తీసుకోవచ్చు. దీని కోసం ఖచ్చితమైన వివరాలు అందించాల్సి ఉంటుంది. వికలాంగుల కోసం.. పిఎఫ్ ఖాతా కలిగిన వికలాంగులు 6 నెలల విలువైన బేసిక్ పే & డియర్నెస్ అలవెన్స్ లేదా వడ్డీతో కూడిన ఉద్యోగుల వాటాను 2023 నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రత్యేకంగా వారి ఆర్ధిక ఇబ్బందులను తగ్గించడానికి ఉద్దేశించబడింది. (ఇదీ చదవండి: తక్కువ రేటుకే భారత్‌కు చమురు సరఫరా.. రష్యా కీలక నిర్ణయం) వైద్య అవసరాల కోసం.. పిఎఫ్ అకౌంట్ కలిగిన ఉద్యోగి అనుకోని పరిస్థితుల్లో రోగాల భారిన పాడినప్పుడు వైద్యం చేయించుకోవడానికి డబ్బుని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది సొంత వైద్య ఖర్చుల కోసం లేదా కుటుంబ సభ్యుల చికిత్స కోసం ఉపయోగించుకోవచ్చు. ఆరు నెలల బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ లేదా ఉద్యోగి వాటాతో పాటు వడ్డీని తీసుకోవచ్చు. ఇల్లు లేదా భూమిని కొనుగోలు కోసం.. ఖాతాదారుడు భూమిని కొనుగోలు చేయడానికి లేదా నివాస గృహాలు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కూడా పిఎఫ్ బ్యాలెన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే దీనిని విత్‌డ్రా చేసుకోవడం సాధ్యమవుతుంది. (ఇదీ చదవండి: భారత్‌లో 2023 టయోట ఇన్నోవా క్రిస్టా లాంచ్ - ధర ఎంతో తెలుసా?) ఇంటి మరమ్మత్తుల (Home Renovation) కోసం.. వివాహం, వైద్య ఖర్చులు మొదలైన వాటికి మాత్రమే కాకుండా కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ప్రకారం.. హోమ్ రెనోవేషన్ కోసం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో 12 నెలల బేసిక్ పే & డియర్నెస్ అలవెన్స్‌తో పాటు ఉద్యోగి వాటాలో తక్కువ మొత్తం తీసుకోవచ్చు. -
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌కు మీరు అర్హులేనా? ఇలా అప్లయ్ చేసుకోండి!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సంస్థ ఉద్యోగులు ఎక్కువ పెన్షన్ పొందేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో అప్లయ్ చేసుకునే వీలు కల్పించింది. ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్(ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం)లో జమ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 4న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. అధిక పెన్షన్ పొందేందుకు అర్హులైన ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో అప్లయి చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ రిటైర్డ్ ఫండ్ బాడీ పోర్టల్‌ను సిద్ధం చేసింది. ఈపీఎఫ్ఓలో ఎలా అప్లయ్ చేయాలి ♦ అర్హులైన ఈపీఎఫ్ఓ ఖతాదారులు ఈ-సేవ పోర్టల్(e-Sewa portal)ను సందర్శించాలి ♦అందులో అధిక పెన్షన్ అప్లయ్ చేసేలా Pension on Higher Salary: Exercise of Joint Option under para 11(3) and para 11(4) of EPS-1995 on or before 3rd May 2023 అనే ఆప్షన్ పాపప్ అవుతుంది. ♦ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో అధిక పెన్షన్ కోసం (pensionOnHigherWages) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ♦ అనంతరం అప్లికేషన్ ఫారమ్ ఫర్ జాయింట్ ఆప్షన్‌తో యూఏఎన్ నెంబర్, పేరు, మీ పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ వివరాల్ని ఎంటర్ చేసి ఓటీపీ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. ♦ ట్యాప్ చేసిన తర్వాత మీరు అర్హులైతే అధిక పెన్షన్ పొందే సౌలభ్యం కలుగుతుంది. లేదంటే రిజెక్ట్ అవుతుంది. -
మాజీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ కొత్త యజమాని– జలాన్–ఫ్రిట్ష్ కన్సార్టియంకు (మురారి లాల్ జలాన్– ఫ్లోరియన్ ఫ్రిచ్) అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌లైన్ మాజీ ఉద్యోగుల భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని ఆదేశిస్తూ, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఇచ్చిన రూలింగ్‌కు వ్యతిరేకంగా కన్సార్టియం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరించలేదు. ‘‘ఎవరైనా ఏదైనా డీల్‌లో అడుగుపెడుతున్నప్పుడు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల గురించి తెలుసుకుంటారు. చెల్లించని కార్మికుల బకాయిలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఈ విషయంలో అంతిమ నిర్ణయం ఉండాలి. క్షమించండి, మేము ట్రిబ్యునల్ తీర్పులో జోక్యం చేసుకోవడం లేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కన్సార్టియం వాదన ఇది... కన్సార్టియం తరఫున సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్ తన వాదనలు వినిపిస్తూ, కన్సార్టియంకు అందించిన సమాచార పత్రంలో (ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్) కార్పొరేట్ రుణగ్రహీత (జెట్ ఎయిర్వేస్) భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలను పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. బకాయిల కింద ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా అదనపు మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని, దీనివల్ల విమానయాన సంస్థను పునరుద్ధరించడం కష్టమని అన్నారు. ఒకసారి ఆమోదించిన తర్వాత రిజల్యూషన్ ప్లాన్‌ను సవరించడం లేదా వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని కూడా పేర్కొన్నారు. ఈ తరహా ఉద్యోగులకు ఆశాకిరణం సుప్రీం రూలింగ్‌తో జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కన్సార్టియం అప్పీల్‌కు వెళుతుందన్న అభిప్రాయంతో జెట్ ఎయిర్వేస్ అగ్రివ్డ్ (బాధిత) వర్క్‌మెన్ అసోసియేషన్ (ఏఏడబ్ల్యూజేఏ) సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ భట్నాగర్, న్యాయవాది స్వర్ణేందు ఛటర్జీ తమ వాదనలు వినిపించారు. ‘‘ఈ ఉత్తర్వు ఈ వివాదంలో మార్గనిర్దేశం చేయడమే కాదు, ఈ రకమైన వ్యాజ్యాలలో చిక్కుకున్న ఈ తరహా కార్మికులు, ఉద్యోగులందరికీ ఇది ఒక ఆశాకిరణం’’ అని అడ్వకేట్ ఛటర్జీ విలేకరులతో అన్నారు. రికార్డ్ తేదీ... 2019 జూన్ 20 ఆర్థిక సంక్షోభం కారణంగా 2019 ప్రారంభంలో కార్యకలాపాలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ కోసం బిడ్‌ను దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా జలాన్–ఫ్రిట్ష్ కన్సార్టియం గెలుచుకుంది. విమానయాన సంస్థ ఇప్పుడు తన సేవలను పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం, రాజీనామా చేసిన లేదా పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులందరికీ పూర్తి గ్రాట్యుటీ మరియు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలి. ఈ లెక్కలకు 2019 జూన్ 20 వరకు తేదీని (దివాలాకు సంబంధించి అడ్మిషన్ తేదీ వరకు) పరిగణనలోకి తీసుకోవాలి. సుప్రీం రూలింగ్‌తో ప్రయోజనం పొందుతున్న వారిలో జెట్ ఎయిర్వేస్ కార్మికులు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. -
ఆ ఉద్యోగులకు శుభవార్త, ఈపీఎఫ్‌వో కొత్త గైడ్‌లైన్స్ విడుదల.. అవేంటో తెలుసా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) సంస్థ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎక్కువ శాలరీ తీసుకుంటున్న ఉద్యోగులు సైతం పీఎఫ్‌కు అర్హులేనని కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసింది. సుప్రీం ఇచ్చిన ఆదేశాల్ని పారాగ్రాఫ్ 11(3) 1995 స్కీమ్ కింద సంస్థలు 8 వారాల్లో అమలు చేయాలని సూచించింది. ఈపీఎఫ్ఓ సర్క్యులర్ విడుదల ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో 1995 స్కీమ్‌లోని పేరా 11(3) ప్రకారం సెప్టెంబర్ 1, 2014కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ నిబంధనల పరిధిలోకి వస్తారు. అంటే సెప్టెంబర్ 1,2014కి ముందు రిటైరైన ఉద్యోగులు, రిటైర్మెంట్కు ముందే సదరు ఉద్యోగులు అధిక పింఛన్ కోసం ఆప్షన్ తీసుకొని ఉండంతో పాటు ఇతర కొన్ని నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి ఉన్న ఉద్యోగులు మాత్రమే అర్హులు. పూర్తి స్థాయి సమాచారం కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాలని విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. పీఎఫ్ పరిమితిని సుప్రీం ఎందుకు పెంచింది? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (epfo) 2014లో ఓ సవరణ చేసింది. ఆ సవరణ ప్రకారం..ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. సవరణకు ముందు ఇది రూ.6,500గా ఉండేది. ఈ పథకాన్ని కేరళ, రాజస్తాన్, ఢిల్లీ హైకోర్టులు గతంలోనే కొట్టేశాయి. వీటిని సవాలు చేస్తూ ఈపీఎఫ్ఓ, కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశూ ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్‌లో తీర్పును వెలువరించింది. ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకం–2014 చెల్లుబాటును సమర్థించింది. అయితే, పీఎఫ్‌లో చేరేందుకు రూ.15,000 నెలవారీ కనీస వేతనం పరిమితిని కొట్టేసింది. చదవండి👉 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త! -
ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. వాళ్లకి ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పెన్షన్!
మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తూ 10 సంవత్సరాలు పూర్తి చేశారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ప్రయివేటు రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కొన్ని షరతులకు లోబడి ప్రభుత్వం ఈ పెన్షన్‌ని అందిస్తోంది. అవేంటో చూద్దాం! నిబంధనలు ఏం చెప్తోంది! ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం.. సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 10 ఏళ్ల పూర్తయిన వారికి పింఛన్ సౌకర్యం లభిస్తుంది. అయితే సదరు ఉద్యోగికి 58 ఏళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెలా వారికి పెన్షన్ అందుతుంది. కాగా ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుంచి కొంత సొమ్ము మినహాయించడమే ఇందుకు కారణం. 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఏ ఉద్యోగి అయినా పెన్షన్ పొందడానికి అర్హత పొందుతాడు. అయితే ఉద్యోగ కాలపరిమితి మాత్రం ఖచ్చితంగా 10 ఏళ్లు ఉండాలనే నిబంధన ఉంది. ఇందులో ఒక మినహాయింపు కూడా ఉంది. ఉద్యోగి 9 సంవత్సరాల 6 నెలల సర్వీస్‌ను కూడా 10 సంవత్సరాలకు సమానంగా లెక్కిస్తారు. ఉద్యోగం పదవీకాలం తొమ్మిదిన్నర సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే, అది 9 సంవత్సరాలుగా మాత్రమే పరిగణిస్తారు. ఉద్యోగి పదవీ విరమణ వయస్సు కంటే ముందు పెన్షన్ ఖాతాలో జమ చేసిన నగదుని విత్‌డ్రా చేసుకుంటే అటువంటి వారికి పెన్షన్‌కు అర్హత ఉండదు. కాగా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల ప్రాథమిక జీతం, డియర్నెస్ అలవెన్స్‌లో 12 శాతం ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్‌కు ఇవ్వబడుతుంది. అలాగే, ఉద్యోగి వాటా మొత్తం ఈపీఎఫ్‌కి వెళ్తుంది. కంపెనీలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో డిపాజిట్ అవుతుంది. అదే సమయంలో, ప్రతి నెలా 3.67 శాతం ఈపీఎఫ్‌కి వెళుతుంది. ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి ►పని చేస్తున్న సంస్థను విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగంలో గ్యాప్ ఉంటే, మీరు మళ్లీ ఉద్యోగం ప్రారంభించినప్పుడు, మీ UAN నంబర్‌ను మార్చకూడదు. ►ఉద్యోగాలు మారినప్పుడు, మీ కొత్త కంపెనీ తరపున ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది. అలాగే, మీ మునుపటి ఉద్యోగం మొత్తం పదవీకాలం కొత్త ఉద్యోగానికి జత చేస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు మళ్లీ 10 సంవత్సరాల ఉద్యోగాన్ని పూర్తి చేయవలసిన అవసరం లేదు. ►ఉద్యోగి 5-5 సంవత్సరాలు రెండు వేర్వేరు సంస్థలలో పనిచేసినట్లయితే, అటువంటి ఉద్యోగికి కూడా పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. చదవండి: ట్రెండ్ మారింది.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు కొత్త తరం కార్లు వస్తున్నాయ్! -
భవిష్య నిధి అందేదెప్పుడు?.. ఆర్థిక శాఖ వద్దే పెండింగ్..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా కి చెందిన వారిద్దరే కాదు రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ల పరిధిలో పనిచేసే ఉద్యోగులు భవిష్యత్తులో తమ అత్యవసరాల కోసం దాచుకున్న భవిష్య నిధి డబ్బులు సకాలంలో అందడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ పరిధిలోని నాన్ ఇంజనీరింగ్ సిబ్బంది తమ వేతనంలో కొంత మొత్తాన్ని జిల్లా పరిషత్ జీపీఎఫ్ ఖాతాలో దాచుకుంటున్నారు. తమకు అవసరమైన సందర్భంలో దాచుకున్న దానిలో 50 శాతం వినియోగించుకోవచ్చు. కానీ ఉద్యోగులు తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న తమ డబ్బులను తీసుకునేందుకు ఎదురు చూడక తప్పడంలేదు. చదవండి: భర్తలేని సమయంలో మహిళా సీఐ ఇంట్లో మరో సీఐ.. అసలేం జరిగింది? తగ్గించినా ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1వ తేదీ కంటే ముందు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలవుతోంది. వారికి జీపీఎఫ్‌లో డబ్బులు దాచుకునే అవకాశం ఉంది. అలాంటి వారంతా తాము దాచుకున్న డబ్బులో వారి అత్యవసరాల కోసం అందులోని డబ్బును డ్రా చేసుకొని వాడుకునే వీలుంది. గతంలో ఇది 70 శాతం వరకు తీసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ తరువాత 50 శాతానికి తగ్గించింది. ఆ మొత్తాన్ని కూడా సకాలంలో ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా జీపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు దాదాపు లక్ష మంది ఉన్నారు. అన్ని జిల్లాల పరిధిలోని ఉద్యోగులు దాచుకున్న సొమ్ము రూ.వేయి కోట్ల వరకు భవిష్య నిధి కిందే ఉంది. ఆ మొత్తాన్ని దాచుకున్న వారిలో ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 9వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ సొమ్ము దాదాపు రూ.200 కోట్లు ప్రభుత్వం వద్దే ఉంది. వారిలో 395 మంది తమ అవసరాల కోసం డబ్బును ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. వారికి దాదాపు రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గత మార్చి నాటికే డబ్బులను మంజూరు చేసింది. ఆ తరువాత ఏప్రిల్ నుంచి డబ్బులు మంజూరు చేయలేదు. దీంతో వారంతా జిల్లా పరిషత్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఆర్థిక శాఖ వద్దే పెండింగ్.. ఉద్యోగులు భవిష్య నిధి పొందేందుకు ఉమ్మడి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. సంబంధిత జిల్లా పరిషత్ జీపీఎఫ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆన్లైన్ చెక్కులను కూడా సిద్ధం చేసి ఆర్థిక శాఖ ఆమోదానికి çపంపించారు. అవన్నీ అక్కడే ఆగిపోయాయి. గతంలో జిల్లా స్థాయిలోనే మంజూరు చేసినా ‘ఈ కుబేర్’విధానం వచ్చాక ఆర్థిక శాఖ పరిధిలోకి వెళ్లిపోయింది. జిల్లాల నుంచి వచ్చే ప్రతిపాదనలను ఆర్థిక శాఖ అధికారులు పరిశీలించి సీరియల్ ప్రాతిపదికన మంజూరు చేస్తుండటంతో తీవ్ర జాప్యం తప్పడం లేదు. -
జూలైలో 18 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో కొత్తగా 18.23 లక్షల మందికి జూలైలో ఉపాధి లభించింది. ఇంత మంది సభ్యులు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పేరోల్‌లో సభ్యులుగా చేరారు. ఈ మేరకు గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ మంగళవారం విడుదల చేసింది. 2021 జూలై నెలకు సంబంధించి కొత్త సభ్యుల సంఖ్యతో పోలిస్తే 25 శాతం వృద్ధి ఉన్నట్టు తెలిపింది. ఇక జూలైలో కొత్త సభ్యులు 18.23 లక్షల మందిలో నికరంగా మొదటిసారి ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చిన వారు 10.58 లక్షలుగా ఉన్నారు. మిగిలిన వారు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరిన వారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్‌వో సభ్యుల చేరికలో వృద్ధి కనిపిస్తూనే ఉంది. కొత్త సభ్యుల్లో 57.69 శాతం మంది 18–25 వయసులోని వారున్నారు. మహిళా సభ్యుల సంఖ్య 4.06 లక్షలుగా ఉంది. 2021 జూలైలో మహిళా సభ్యుల చేరికతో పోలిస్తే 35 శాతం పెరిగింది. జూలైలో మొత్తం కొత్త సభ్యుల్లో మహిళల శాతం 27.54 శాతంగా ఉంది. గడిచిన 12 నెలల్లోనే ఇది అత్యధికం. సంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నికర సభ్యుల చేరిక పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచే 12.46 లక్షల మంది సభ్యులు చేరడం గమనార్హం. మొత్తం సభ్యుల చేరికలో ఈ రాష్ట్రాల వాటా 68 శాతంగా ఉంది. చదవండి: India WinZo: ఇది కేవలం కొందరి కోసం.. గూగుల్ పాలసీ సరికాదు -
ఈపీఎఫ్ఓలో ఇంటి దొంగలు.. రూ.1000 కోట్ల స్కాం!
ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సంస్థలో గోల్ మాల్ జరిగింది. సంస్థ ఉద్యోగులే సుమారు రూ.1000 కోట్ల నిధిని కాజేసినట్లు తెలుస్తోంది. డమ్మీ కంపెనీలు, డమ్మీ ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అందులోకి నిధుల్ని మళ్లించారు. ఇందుకోసం జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు ఖాతాల్ని ఉపయోగించుకున్నట్లు తేలింది. ముంబై సబర్బన్ ఉద్యోగులు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పలు కథనాలు వెలుగోలోకి వచ్చాయి. ఈ స్కాం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎంత మంది నిధుల్ని కాజేశారనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నిధుల దుర్వినియోగంపై ఈపీఎఫ్ఓ సెంట్రల్ బ్రోర్డర్ ఆఫ్ ట్రస్ట్రీ ప్రభాకర్ బాణాసురే స్పందించారు. ఉద్యోగుల తీరుతో ఈపీఎఫ్ఓ రూ.1000కోట్లు నష్టపోయే అవకాశం ఉందన్నారు. కాగా, ముంబైలోని కండివాలి కార్యాలయంలో ఈ మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. విదేశాల్లో ఉన్న భారతీయులతో పాటు, జెట్ ఎయిర్‌వేస్‌లోని అప్పటి పైలట్లు, సిబ్బంది ఉద్యోగాలను ఉపయోగించడం ద్వారా స్కామ్ జరిగినట్లు సమాచారం. చదవండి👉 ఈపీఎఫ్ఓలో ఫోటో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు! -
మీ పీఎఫ్ ఖాతాకు ఈ-నామినేషన్ కంపల్సరీ.. సులభమైన అప్డేట్ కోసం 10 స్టెప్స్ ఇవే!
మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్లో నామినీ వివరాలు అప్డేట్ చేసి ఉన్నాయా? లేదంటే ఇప్పుడు చేయండి. ఎందుకంటే పీఎఫ్ క్లెయిమ్ సమయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే నామినీ పేరు తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని వల్ల ఉద్యోగులు తమ ప్రయోజనాలు పొందడంతో పాటు ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) లాంటివి బెనిఫిట్స్‌తో పాటు అనేక ఇతర ప్రయోజనాలపై ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్లు కూడా ఉంటాయి. కనుక ఇప్పుడే ఆలస్యం కాకుండా త్వరగా మీ ఈపీఎఫ్ ఈ- నామినేషన్ చేయండి. ఈ నామినేషన్ సులభంగా చేసేయండి ఇలా... ►ఈపీఎఫ్ఓ( EPFO ) వెబ్సైట్లోకి వెళ్లి, ‘సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లండి. ►‘ఫర్ ఎంప్లాయిస్’ విభాగంలో ‘మెంబర్ UAN/ఆన్లైన్ సర్వీస్’ ఆఫ్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ►మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ►లాగిన్ అయ్యాక 'మేనేజ్' ట్యాబ్ కింద, 'ఇ-నామినేషన్' ఎంచుకోండి. ►ఇప్పుడు అందులో మీ 'వివరాలను నింపి' ట్యాబ్ కింద ఉన్న 'సేవ్' క్లిక్ చేయండి. ►తర్వాత మీ కుటుంబ డిక్లరేషన్‌ను అప్డేట్ చేసేందకు మీ కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, జెండర్,రిలేషన్, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు (ఆఫ్షనల్), గార్డియన్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటి అవసరమైన వివరాలను నింపిన తర్వాత ‘ఎస్’పై క్లిక్ చేయండి. ►ఇక ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులను వివరాలను నింపే ఆఫ్షన్ ఉంటుంది. అక్కడ ఉన్న 'యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్'పై క్లిక్ చేయండి. ►ఇందులో మీ కుటుంబ సభ్యుల వివరాలు నింపిన తర్వాత వారి నగదు వాటాను నిర్ణయించుకుని ఆ మొత్తాన్ని అందులో నింపాలి. ఆపై ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి. ►ఇప్పుడు 'ఈ-సైన్' ఆఫ్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని(otp) సబ్మిట్ చేయండి. ►అయితే ఈ-నామినేషన్‌ను దాఖలు చేసేందుకు, ఈపీఎఫ్ సభ్యలు ముందుగా యూఏఎన్( UAN )మెంబర్ పోర్టల్‌లో వారి యూఏఎన్ ఖాతాను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వారి మెంబర్ ఐడీ, ఎస్టాబ్లిష్మెంట్ ఐడీ, పేరు, పుట్టిన తేదీ, తండ్రి/భార్య పేరు, సంబంధం, ఉద్యోగంలో చేరిన తేదీని నిర్ధారించుకోవాలి. వీటితో పాటు ప్రతి నామినీకి కేవైసీ( KYC) వివరాలను సమర్పించడంతో పాటు వారి PF/ EDL మొత్తం వాటాను కూడా తెలిపాల్సి ఉంటుంది. చదవండి: షావోమీ భారీ షాక్, లాభాలు రాలేదని వందల మంది ఉద్యోగులపై వేటు! -
5.23 కోట్లకు పీఎఫ్ఆర్డీఏ పింఛను చందాదారులు
న్యూఢిల్లీ: పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహణలోని పింఛను పథకాల్లో సభ్యుల సంఖ్య ఏప్రిల్ చివరికి 5.23 కోట్లకు చేరింది. 2021 ఏప్రిల్ నాటికి ఉన్న సభ్యులు 4.26 కోట్ల మందితో పోల్చి చూస్తే ఏడాది కాలంలో 23 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలను పీఎఫ్ఆర్డీఏ చూస్తోంది. ఎన్పీఎస్, ఏపీవై కింద సభ్యులకు చెందిన పింఛను ఆస్తుల విలువ రూ.7,38,765 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఉన్న విలువ నుంచి 25 శాతం పెరిగింది. -
ఎన్ఎస్సీ, పీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్లలో వడ్డీరేట్లు.. పన్ను రాయితీలు ఇలా
ట్యాక్స్ ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ వారం మరికొన్నింటి గురించి తెలుసుకుందాం. ప్రతి ఉద్యోగికి పి.పి.ఎఫ్. తప్పనిసరే. యజమాని తప్పనిసరిగా పీఎఫ్ రికవరీ చేసి, తాను మరికొంత చేర్చి, భవిష్య నిధికి జమ చేస్తారు. ఇది కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ.1,50,000 ఉంటుంది. కాస్త ఎక్కువ జీతం ఉన్న వారికి పీఎఫ్ మొత్తం రూ. 1,50,000 దాటిపోతుంది. వీరికి 80సి కింద సేవింగ్స్ చేసినా ఎటువంటి మినహాయింపు ఉండదు. ఇతర అంశాల జోలికి పోవడంవల్ల ఉపయోగం ఉండదు. తక్కువ రికవరీ ఉన్నవారు అవసరం అయితే పెంచుకోవచ్చు. వడ్డీ 8.5 శాతం వస్తుంది. వడ్డీ మీద ఎటువంటి పన్ను భారం లేదు. 15 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 3 సదుపాయాలు ఉంటాయి. దీన్ని E,E.E. అంటారు. ఇన్వెస్ట్ చేసినందుకు మినహాయింపు, వడ్డీకి మినహాయింపు, విత్‌డ్రా చేసుకున్నప్పుడు వచ్చే మొత్తానికి కూడా మినహాయింపు లభిస్తుంది. అంటే పన్నుభారం లేదు. దాచిన మొత్తాన్ని ఏడాదికి ఒకసారి విత్‌డ్రా చేసుకోవచ్చు (5వ సంవత్సరం తర్వాత నుండి). కోర్టుద్వారా ఎటువంటి అటాచ్మెంట్ చేయరు. రుణం తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. జాయింట్‌గా తీసుకోవడానికి వీలుండదు. ఎన్నారైలకు వర్తిం చదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆలోచించుకోండి. ఉన్నవాటిలో ఇది అత్యుత్తమమైనది. కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ఇక ఎన్ఎస్సీలు.. అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు. ఒకప్పుడు ఆరు సంవత్సరాల్లో రెట్టింపై ఎంతో లాభసాటిగా ఉండేవి. క్రమేపీ వడ్డీ రేటును తగ్గించేశారు. ఇప్పుడు 6.8 శాతం వస్తుంది. ఇక్కడ E.E.E నియమం వర్తిస్తుంది. కనీసం రూ. 1,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. వడ్డీని అసలుకు కలుపుతారు. 80సి కింద దక్కే ప్రయోజనం పరిమితి రూ. 1,50,000. కొన్ని సందర్భాల్లో ముందుగానే నగదుగా మార్చుకోవచ్చు. ఏడాదిలోపే తీసేసుకుంటే వడ్డీ ఇవ్వరు. మొదటి సంవత్సరం దాటి 3 సంవత్సరాల లోపల అయితే సాధారణ వడ్డీ ఇస్తారు. నామినేషన్ సదుపాయం ఉంది. మరోవైపు, పోస్టాఫీస్‌లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంటులో జమకి 80సి మినహాయింపు లేదు. ఏటా 4 శాతం వడ్డీ ఉంటుంది. కనీసం రూ. 50 నుంచి గరిష్టంగా ఎంతైనా ఉంచవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా కొనసాగించవచ్చు. జాయింటుగా చేరవచ్చు. సింగిల్‌లో రూ. 3,500, జాయింటులో రూ. 7,000 వడ్డీకి మినహాయింపు ఉంటుంది. కానీ 80 టీటీఏ కింద రూ. 10,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు 80 టీటీబీ కింద రూ.50,000 వరకూ మినహాయింపు ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఒక స్కీమ్ ఉంది. వడ్డీ 7.4 శాతం లభిస్తుంది. కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 15,00,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. 5 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. వడ్డీకి మినహాయింపు ఉంటుంది. వడ్డీ రూ. 50,000 దాటితే టీడీఎస్ ఉంటుంది. దీనికి 80సి వర్తిస్తుంది.60 సంవత్సరాల వారికే ఇది వర్తిస్తుంది. 55 సంవత్సరాలు దాటిన వారు రిటైర్ అయిపోతే ఇందులో చేరవచ్చు (కొన్ని షరతులకు లోబడి). జాయింటు అకౌంటు తెరిచేందుకు వీలుంటుంది. ఇలా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం ఊహించని షాక్, 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం షాకివ్వనుంది. 40 ఏళ్ల తరువాత తొలిసారి ఈపీఎఫ్ఓపై ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫర్ ట్రస్ట్రీ (సీబీటీ) సభ్యులు 2021 -2022 సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వచ్చే వడ్డీరేట్లపై సమావేశమైంది. ఈ భేటీలో ఖాతాదారులకు 8.1శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ వడ్డీ రేట్లు 40ఏళ్ల మందుకు అంటే 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఖాతాలపై 8శాతం ఇవ్వడం గమన్హారం. మళ్లీ 40ఏళ్ల తరువాత అదే తరహాలో వడ్డీ రేట్లు ఇవ్వడానికి కోవిడ్ తో పాటు ఖాతాదారుల నుంచి జమయ్యే నిధి తక్కువ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకుముందు ఎలా ఉన్నాయ్! 2011 -2012 లో 8.25శాతం 2012-2013 లో 8.5శాతం 2013-2014 లో 8.75శాతం 2015 -2016లో 8.8శాతం 2016 - 2017లో 8.65శాతం 2017 - 2018లో 8.55శాతం 2018 -2019 లో 8.65శాతం 2019-2020లో 8.5శాతం 2020-2021లో 8.5శాతం 2021 -2022లో 8.1శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు రిపోర్ట్‌లో హైలెట్ చేస్తున్నాయి. తాజా వడ్డీరేట్ల తగ్గుదల నిర్ణయాన్ని సీబీటీ సభ్యులు కేంద్ర ఆర్ధిక శాఖకు పంపనున్నారు. ఆర్ధిక శాఖ నిర్ణయంతో ఈ తగ్గిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?! -
ఈ సారు ఎంత మంచోడో.. కూడబెట్టిన 40 లక్షలు ఇచ్చేశాడు
ప్రపంచంలో బాధలను ఎవరూ తగ్గించలేరు, కానీ మనం చేయగలిగినంత మంచి చేయాలి.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యం లాంటి మాట ఇది. మాటే కాదు.. ఆయన మనసూ స్వచ్ఛమే. విజయ్ కుమార్ చాన్సోరియా.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఖాందియాలో ప్రభుత్వ టీచర్‌గా పని చేశారు. 39 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఈ మధ్యే ఆయన సర్వీస్ నుంచి దిగిపోయారు. సోమవారం ఆయన ఉద్యోగ విరమణ సన్మానం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమంలో పీఎఫ్, సేవింగ్స్ ద్వారా వచ్చిన 40 లక్షల రూపాయల్ని పేద విద్యార్థులకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారాయన. భార్యతో విజయ్ కుమార్ సార్ ఉపాధ్యాయుడిగా వేలాదిమందిని తీర్చిదిద్దినప్పటికీ అది నాకు సంతృప్తినివ్వలేదు. వారి కోసం ఇంకేదో చేయాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారాయన. రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నా. నాలాగే ఎంతో మంది ఇప్పటికీ కష్టపడుతున్నారు. చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు నాలాంటి కష్టం రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రకటించగానే.. అంతా చప్పట్లతో ఆయన్ని స్వాగతించారు. అంతమాత్రాన ఆయనకు భార్యాపిల్లలు లేరనుకోవడం పొరపాటే. అక్కడ చప్పట్లు కొట్టిన వాళ్లలో ఆయన భార్యా, కూతురూ ఉన్నారు కూడా. విజయ్ కుమార్ భార్య బాగానే చదువుకుంది. ఆయన కూతురికి ఆల్రెడీ పెళ్లైంది. ఇద్దరు కొడుకులూ ఉద్యోగాలు చేస్తూ మంచిగానే సెటిల్ అయ్యారు. వాళ్ల అనుమతితోనే తాను ఇన్నాళ్లుగా దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను పేద విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు విజయ్ కుమార్ చాన్సోరియా. చదవండి: కారడవిలో అడవి బిడ్డల భవిష్యత్తు కోసం 14కి.మీ. నడక! -
ట్యాక్స్ ఫ్రీ పీఎఫ్.. కేంద్రం గుడ్ న్యూస్!
పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే సూచనలు బడ్జెట్ 2022-2023లో స్పష్టంగా కనిపిస్తున్నాయి!. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ చేసుకునే ఉద్యోగులందరికీ(ప్రైవేట్ కూడా!) వడ్డీపై పన్ను ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయలుగా ఉన్న పీఎఫ్ ట్యాక్స్ ఫ్రీ పరిమితిని.. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రెట్టింపు చేసే అవకాశం కనిపిస్తోంది. జీతం ఉన్న ఉద్యోగులందరికీ సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు చేయొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేట్ ఉద్యోగులను ఈ గొడుగు కిందకు తీసుకొచ్చేందకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు కొన్ని ఆర్థిక సంబంధమైన బ్లాగుల్లో కథనాలు కనిపిస్తున్నాయి. 2021-22 ఉద్యోగుల సమయంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. అయితే పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని, ఇది వివక్షతో కూడుకున్నదని నిపుణులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో.. తాజా నిర్ణయం అమలులోకి వస్తే.. జీతం ఎత్తే ఉద్యోగులందరికీ ఈ లిమిట్‌ను 5 లక్షల దాకా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనను సవరించాలంటూ ప్రభుత్వానికి అనేక ప్రాతినిధ్యాలు అందాయి. ప్రాథమికంగా ఈ నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే అంశం కాబట్టి, ఇది వివక్షత లేనిదిగా ఉండాలని, జీతాలు తీసుకునే ఉద్యోగులందరినీ దీని పరిధిలోకి తీసుకురావాలని నొక్కిచెప్పాయి. చదవండి: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త.. లక్ష రూ. దాకా.. -
కరోనా కష్టకాలంలో.. ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త..! లక్షవరకు!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త. కరోనా కష్టకాలంలో అకౌంట్ నుంచి లక్షరూపాయలు అడ్వాన్స్‌గా విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సంస్థ అవకాశం కల్పించింది. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్లు ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్ఓ సభ్యులు అకౌంట్ నుంచి రూ.1లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ఖతాదారులు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా లక్ష వరకు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. అయితే కొన్ని నిబంధనలకు లోబడి పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు షరతులు ►వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రి/సీజీహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేరాలి. ►ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే.., ఆస్పత్రిలో చేరేముందే విత్ డ్రా చేసుకోవచ్చు. ►పీఎఫ్ ఆఫీస్ వర్కింగ్ డే రోజు దరఖాస్తు చేస్తే, ఆ మరుసటి రోజే డబ్బు అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది ►డబ్బును ఉద్యోగి పర్సనల్ అకౌంట్ లేదంటే ఆసుపత్రి బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఇలా డ్రా చేయండి ►పీఎఫ్ అకౌంట్ నుంచి లక్షరూపాయిల విత్ డ్రా ఎలా అంటే? ►ముందుగా అధికారిక వెబ్సైట్ www.epfindia.gov.inను సందర్శించాలి. ►వెబ్ పోర్టల్‌లో 'ఆన్లైన్ సేవలు'పై క్లిక్ చేయండి ►అనంతరం 31, 19, 10C మరియు 10D ఫారమ్‌లను పూర్తి చేయాలి ►ధృవీకరించడానికి మీ బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలను ఎంట్రీ చేయాలి ►తర్వాత 'ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్'పై క్లిక్ చేయండి ►డ్రాప్-డౌన్ మెను నుండి ఫారమ్ 31ని సెలక్ట్ చేసుకోవాలి ►డబ్బును విత్ డ్రా ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలి. ►అనంతరం ఆసుపత్రి బిల్లు కాపీని అప్లోడ్ చేయండి ►మీ ఇంటి అడ్రస్ ను ఎంట్రీ చేసి 'సబ్మిట్' బటన్ పై పై క్లిక్ చేయండి. దీంతో పీఎఫ్ విత్ డ్రా ప్రాసెస్ పూర్తవుతుంది. మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. చదవండి: ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త..! భారీగా పెరగనున్న పెన్షన్..! ఎంతంటే..? -
దివాళీ స్పెషల్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
దివాళీ సందర్భంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020-21 సంవత్సరానికి ఖాతాదారులకు 8.5శాతం వడ్డీని అందిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. తద్వరా 6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్లకు లబ్ధి చేకూరనుంది. వడ్డీ రేట్లను కొనసాగిస్తుంది ఈపీఎఫ్ఓ బోర్డ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఖాతాదారులు ఈపీఎఫ్ఓ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నట్లు, వారికి తక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్ ఇవ్వడంపై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈపీఎఫ్ఓ సభ్యుడు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ కోవిడ్ వల్ల ఆర్ధిక మాంద్యం ఉన్నప్పటికీ 2020-21 సంవత్సరానికి వడ్డీ రేట్లను కొనసాగించడంపై కేంద్రప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు. ఈపీఎఫ్‌లో ఏదైనా సమస్య ఆన్లైన్లో ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి? ►మొదట https://epfigms.gov.in/ పోర్టల్ సందర్శించండి ►ఫిర్యాదు చేయడం కొరకు 'Register Grievance' మీద క్లిక్ చేయండి. ►ఇప్పుడు పీఎఫ్ సభ్యుడు, ఈపీఎస్ పెన్షనర్, యజమాని, ఇతర అనే ఆప్షన్ లలో ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి. ►పీఎఫ్ ఖాతా సంబంధిత ఫిర్యాదు కోసం పీఎఫ్ మెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ►ఆ తర్వాత యుఏఎన్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి 'Get Details' మీద క్లిక్ చేయండి. ►యుఏఎన్ తో లింక్ చేయబడ్డ మీ వ్యక్తిగత వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తాయి. ►ఇప్పుడు 'గెట్ ఓటిపి' మీద క్లిక్ చేయండి. (ఈపిఎఫ్ఓ డేటాబేస్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు/ ఈమెయిల్ ఐడీకి ఒక్కసారి ఓటీపీ వస్తుంది) ►ఓటీపీ, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు చేయాల్సిన పీపీ నెంబరుపై క్లిక్ చేయండి. ►ఇప్పుడు స్క్రీన్ పై పాప్-అప్ కనిపిస్తుంది. దీనిలో, మీ ఫిర్యాదుకు సంబంధించిన బటన్ ఎంచుకోండి. ►గ్రీవియెన్స్ కేటగిరీని ఎంచుకొని మీ ఫిర్యాదు వివరాలను ఇవ్వండి. ఒకవేళ మీ వద్ద ఏవైనా రుజువులు ఉన్నట్లయితే, వాటిని అప్ లోడ్ చేయవచ్చు. ►ఫిర్యాదు రిజిస్టర్ చేసిన తరువాత, 'Add' మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ►దీని తర్వాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్/మొబైల్ నెంబరుకు ఫిర్యాదు రిజిస్టర్ నెంబర్ వస్తుంది. చదవండి: తరచుగా పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే రూ. 35 లక్షలు నష్టపోయినట్లే! -
ఈపీఎఫ్‌వోలో కొత్తగా 15 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో కొత్త సభ్యుల నమోదు జూన్‌తో పోలిస్తే జులైలో నికరంగా 31.28 శాతం పెరిగింది. జూన్‌లో ఈ సంఖ్య 11.16 లక్షలుగా ఉండగా జులైలో 14.65 లక్షలుగా నమోదైంది. వీరిలో 9.02 లక్షల మంది తొలిసారిగా చేరిన వారు. ఇక మిగతా వారు గతంలో ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగి..మళ్లీ కొత్త ఉద్యోగంలో చేరడం ద్వారా తిరిగి సభ్యత్వం పొందారు. దేశీయంగా సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన మెరుగుపడటాన్ని ఇది ప్రతిబింబిస్తోందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్‌వో సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నాలుగు నెలలుగా చందాదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్‌లో కొత్త సభ్యుల నమోదు నికరంగా 8.9 లక్షలుగా ఉండగా, మే నెలలో 6.57 లక్షలుగా నమోదైంది. ఏప్రిల్ మధ్య నుంచి కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తితో పలు రాష్ట్రాల్లో కొత్తగా లాక్డౌన్ విధించాల్సి రావడం కాస్త ప్రతికూల ప్రభావం చూపింది. -
ఇన్‌కంట్యాక్స్ నుంచి మినహాయింపు కావాలా? ఇవిగో మార్గాలు
వ్యాపారం ఎంతో రిస్క్‌తో కూడిన పని. అనేక కష్టనష్టాలకు ఓర్చితేనే ఏదైనా కంపెనీ లాభాల బాట పడుతుంది. అయితే ఈ లాభాల నుంచి ఆదాయపన్ను కట్టాల్సి వస్తుంది. బడా కంపెనీలకు ఇది పెద్ద సమస్య కాకపోయినా ఎదుగుతున్న కంపెనీలు పన్ను మినహాయింపు ఆశిస్తాయి. ప్రతీనెల జీతం తీసుకునే ఉద్యోగులు ఆదాయం పన్ను మినహాయింపును కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం చట్ట పరంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చే వాటిలో కొన్ని.. టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మనకు, మన కుటుంబానికి ఇన్సురెన్స్ భద్రత అందిస్తుంది. ఆదాయపన్ను కడుతున్నవారు ఇన్వెస్ట్ చేయాల్సిన వాటిలో ఇన్సురెన్స్ ప్రధానమైంది. ఇన్సురెన్స్ పాలసీ ప్రీమియంగా చెల్లించిన మొత్తానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం కడితే ఆ ఏడాదికి సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చట్టపరంగా ఇన్‌కంట్యాక్స్‌ను తగ్గించుకునేందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం చక్కనగా ఉపకరిస్తుంది. ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ప్రారంభించి, అందులో జమ చేసిన సొమ్ముకు పన్ను నుంచి మినహయింపు ఉంటుంది. అయితే ఇందులో జమ చేసే మొత్తాన్ని 15 ఏళ్ల వరకు విత్‌డ్రా చేయడానికి వీలులేదు. ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు ఎక్కువ మంది ఎంచుకునే మార్గాల్లో ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఒకటి. ఈక్విటీ మార్కెట్లతో పోల్చితే రిస్క్ తక్కువ, గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అయితే డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ పథకం ద్వారా పన్ను రాయితీ పొందవచ్చు. తక్కువ ఆదాయం పొందే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. రిటర్న్స్ కూడా ఎక్కువగా అందిస్తుంది. ఈ పథకం ద్వారా రూ. 1.50 లక్షల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం అరవై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు పన్ను రాయితీ కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఐదేళ్లు మెచ్యూరిటీ పీరియడ్‌గా ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. -
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆధార్ లింక్ చేయండి?
ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారులకు అలర్ట్. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. కొత్త నిబంధనలు జూన్ 1, 2021 నుంచి అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. లేకపోతే పీఎఫ్ లో జమ చేసే మొత్తంపై ప్రభావం పడనుంది. ఉద్యోగుల ఖాతాలను ఆధార్ లింకు చేసే బాధ్యతను ఈపీఎఫ్ఓ, యజమానులకు అప్పగించింది. ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతా ఆధార్ లింకు కాకపోతే యజమాని జమ చేసే నగదు మీ ఖాతాలో ఇకనుంచి జమకాదు. కాబట్టి, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింకు చేయాలని తెలుసుకోండి. అలాగే, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యుఎఎన్) ఆధార్‌తో లింకు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. కొత్త నియమం ఏమిటి? సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి, పీఎఫ్ ఖాతా ఆధార్‌తో లింకు చేయకపోతే లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్(యుఎఎన్) ఆధార్‌తో ధృవీకరించబడకపోతే, ఈసీఆర్(ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్) దాఖలు చేయబడదు. అంటే, ఉద్యోగులు తమ సొంత పీఎఫ్ ఖాతాలో సంస్థ యజమాని జమ చేసే వాటాను ఇక నుంచి పొందలేరు. జూన్ 1లోగా తమ ఉద్యోగుల ఖాతాలను ఆధార్‌తో లింక్ చేసి ధృవీకరించాలని ఈపీఎఫ్ఓ యజమానులందరినీ ఆదేశించింది. ఈ కొత్త నియమం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా? దశ 1: అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్( www.epfindia.gov.in) ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. దశ 2: ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఈ-కెవైసి పోర్టల్‌కు వెళ్లి యుఎఎన్ ఆధార్ లింక్ పై క్లిక్ చేయండి దశ 3: యుఎఎన్ ఖాతాలో నమోదు చేసిన మీ యుఎఎన్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. దశ 4: మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ నంబర్‌ను పొందుతారు. ఓటీపీని, 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి ఫారమ్‌ను సమర్పించండి. ఇప్పడు ఓటీపీ ధృవీకరణ ఎంపికపై క్లిక్ చేయండి. దశ 5: మీ ఆధార్ వివరాలను ధృవీకరించడానికి మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, మెయిల్లో ఓటీపీ వస్తుంది. ఈ ధృవీకరణ తర్వాత మీ ఆధార్ మీ పీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. చదవండి: రూ.50 వేలు దాటేసిన బంగారం ధర -
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి పీఎఫ్ కొత్త రూల్స్
ఏప్రిల్ 1 నుంచి సంవత్సరానికి రూ.2.5 లక్షలకుపైగా జమ అయ్యే ప్రావిడెంట్ ఫండ్ నగదుపై పన్ను విధించబడుతుంది. దీనికి సంబందించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో ప్రకటించారు. 2.5 లక్షల వరకు డిపాజిట్ అయ్యే నగదుపై ఎలాంటి పన్ను విధించరని ఆర్థిక మంత్రి అన్నారు. ఫైనాన్స్ బిల్లు 2021లో ప్రభుత్వం ఈ నిబంధనకు సవరణను ప్రవేశపెట్టింది. సాధారణంగా, ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అవుతుంది. అంతే మొత్తంలో కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమచేస్తుంది. అయితే, తాజా నిబంధనల ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టం, సూపర్ న్యూ నేషన్ ఫండ్‌కు సంవత్సరానికి రూ.7,50,000 కంటే ఎక్కువ మొత్తంలో యజమాని సహకారం కింద పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నగదుపై మాత్రమే ప్రభావం పడనుంది. సంవత్సరానికి రూ.20.83 లక్షలకు పైగా సంపాదించే వారిపై పన్ను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈపిఎఫ్ సహకారంపై అతని లేదా ఆమె ఆసక్తిని ఆకర్షిస్తారు. సుమారు 93 శాతం మంది రూ.2.5 లక్షల పరిమితికి లోబడి ఉన్నారు. ఇందులో జమ అయ్యే నగదుపై వడ్డీ లభిస్తుంది. దీని వల్ల పదవి విరమణ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతికి అందుతుంది. తద్వారా, పదవి విరమణ తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! మళ్లీ పెరిగిన బంగారం ధరలు! -
పీఎఫ్ డిపాజిట్ రూ.5 లక్షలపై పన్ను లేదు!
న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై 5 లక్షల వరకు జమ చేసుకునే వారికి వడ్డీపై పన్ను ఉండదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. 2021–22 బడ్జెట్లో భాగంగా.. భవిష్యనిధి ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి జమలు రూ.2.5లక్షలకు మించితే వడ్డీపై పన్ను వర్తిస్తుందంటూ మంత్రి ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆర్థిక బిల్లు 2021పై చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. 127 సవరణలకు కేంద్రం అంగీకారం తెలపడంతో ఫైనాన్స్ బిల్లు సభామోదం పొందింది. బుధవారం ఇది రాజ్యసభ ముందుకు రానుంది. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్‌పై చర్చకు సిద్ధం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను తీసుకురావాలన్న ప్రతిపాదనపై తదుపరి జీఎస్టీ కౌన్సిల్ భేటీలో చర్చించేందుకు సుముఖంగా ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల పన్నుల వాటాయే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో అధిక శాతంగా ఉన్న విషయం తెలిసిందే. పెట్రోల్ రిటైల్ ధరలో 60 శాతం, డీజిల్ విక్రయ ధరలో 53 శాతం పన్నులే. కేంద్రం, రాష్ట్రాలు రెండూ పెట్రోల్, డీజిల్‌పై పన్నులు విధిస్తున్నాయని మంత్రి పేర్కొంటూ.. అయినప్పటికీ కేంద్రం వసూలు చేసిన పన్నులను రాష్ట్రాలతో పంచుకుంటున్నట్టు చెప్పారు. తదుపరి జీఎస్టీ సమావేశంలో రాష్ట్రాలు ఈ ప్రతిపాదనతో ముందుకు వస్తే చర్చించేందుకు సంతోషంగా ఉన్నట్టు ప్రకటించారు. -
ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ యథాతథం
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) యథాతథంగా 8.5 శాతంగా కొనసాగనుంది. రిటైర్మెంట్ ఫండ్ వ్యవహారాలను నిర్వహించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ (ఈపీఎఫ్ఓ) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ కీలక నిర్ణయం తీసుకుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019–20లో కూడా ఈపీఎఫ్ఓ 8.5 శాతం వడ్డీని తన చందాదారులకు అందించింది. ప్రకటన ప్రకారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో గురువారం కార్మిక, ఉపాధి శాఖల సహాయంత్రి (ఇండిపెండెంట్ చార్జ్) సంతోష్ కుమార్ నేతృత్వంలో సీబీటీ సమావేశం జరిగింది. వడ్డీరేటుపై తన నిర్ణయాన్ని సీబీటీ ఆర్థిక శాఖ ఆమోదం కోసం నివేదిస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. అనంతరం తన క్రియాశీల చందాదారుల అకౌంట్లలో 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. ఐదు కోట్లకుపైగా చందాదారులు ప్రకటన ప్రకారం, ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఐదు కోట్లకుపైగా చందాదారులను కలిగిఉంది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీటీ తాజా నిర్ణయం తీసుకుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీ అసెట్స్‌లో తన మొత్తం నిధుల్లో 5%తో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు ప్రస్తుతం 15%కి చేరాయి. 2018–19లో ఈపీఎఫ్ఓ చందాదారులకు లభించిన వడ్డీ 8.65%. దీన్ని 8.5%కి తగ్గిస్తూ, గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం, భారీ ఉపసంహరణల నేపథ్యంలో వడ్డీరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలకు భిన్నం గా ట్రస్టీల బోర్డ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
కరోనా దెబ్బకు పీఎఫ్ ఉఫ్!
ఓ కార్పొరేట్ కంపెనీలో సీనియర్ ట్రైనర్‌గా పదేళ్ల పాటు పనిచేసిన అమర్నాథ్ రెడ్డి గతేడాది ఆగస్టులో ఉద్యోగం కోల్పోయాడు. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల సర్దుబాటు క్రమంలో అమర్ పింక్‌స్లిప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆర్నెల్లుగా అమర్ ఉద్యోగవేట సాగిస్తూనే ఉన్నాడు. ఉద్యోగం లేకపోవడంతో నెలవారీ ఖర్చుల నిమిత్తం అప్పుల జోలికి పోకుండా తన భవిష్యనిధి ఖాతాలో డబ్బును కోవిడ్–19 పరిస్థితి కింద గతేడాది సెప్టెంబర్ నెలాఖరులో రూ.30 వేలు విత్‌డ్రా చేశాడు. అనంతరం ఉద్యోగం దొరక్కపోవడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు డిసెంబర్లో మరో రూ. 30 వేలు ఉపసంహరించుకున్నాడు. భవిష్యత్తు అవసరాల కోసం పదేళ్లుగా కూడబెట్టుకున్న నిధిలో 35 శాతం నగదు ఆర్నెల్లలోనే కుటుంబ పోషణకు ఖర్చయింది. సాక్షి, హైదరాబాద్: పైసాపైసా కూడబెట్టి భావి అవసరాలకు ఉపయోగించాలనుకునే ‘భవిష్యనిధి’కరిగిపోతోంది. ఉద్యోగి తన జీవితంలో కన్న కలలను సాకారం చేసుకునేందుకు ధీమా ఇచ్చే భవిష్యనిధిని నెలవారీ ఖర్చులకు వాడాల్సిన పరిస్థితి వస్తోంది. కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన విలయంతో సగటు ఉద్యోగి విలవిలలాడుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన వాణిజ్య, వ్యాపార సంస్థలు ఉద్యోగుల వేతనంలో కోతలు, కొన్నిచోట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాయి. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోతుండగా.. కొత్త కొలువుల సంగతి ప్రశ్నార్థకమవుతోంది. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు పీఎఫ్ ఉపసంహరణ వైపు మళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. అత్యవసర పరిస్థితిలో ఈ నిధిని వినియోగించుకునే వెసులుబాటు ఉండగా... కోవిడ్–19తో ఏర్పడిన ఎమర్జెన్సీ ధాటికి భవిష్య‘నిధి’లో ఉపసంహరణల పర్వం కొనసాగుతోంది. ప్రతి ఇద్దరిలో ఒకరు... ఉద్యోగి భవిష్యనిధి నుంచి ఉపసంహరణ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పరిస్థితిని పరిశీలిస్తే దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు పీఎఫ్ విత్‌డ్రా కోసం దరఖాస్తు సమర్పిస్తున్నారు. దేశంలో గతేడాది మార్చిలో మొదలైన లాక్‌డౌన్‌తో వాణిజ్య, వ్యాపార సంస్థలు, పరిశ్రమల ఆర్థిక స్థితి కుప్పకూలింది. ఈ ప్రభావం వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై పడింది. కొన్ని కంపెనీలు నెలల తరబడి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదు. ఇంకొన్ని ఉద్యోగులను పనిలో నుంచి తొలగించాయి. ఫలితంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరికి తక్షణ సాయం కోసం కేంద్ర ప్రభుత్వం కోవిడ్–19 నేపథ్యంలో పీఎఫ్ ఉపసంహరణకు అవకాశం కల్పించింది. ఉద్యోగి భవిష్య నిధి నుంచి గరిష్టంగా మూడు నెలల వేతనం మేర విత్‌డ్రా చేసుకోవచ్చని సూచిస్తూ... దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కొందరు కోవిడ్–19 కారణంతో, మరికొందరు అత్యవసర స్థితిని, ఇంకొందరు ఇతరత్రా అవసరాలను చూపి విత్‌డ్రాలకు దిగారు. దేశంలో మొత్తంగా 6.44 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలు యాక్టివ్‌గా ఉండగా... ఇందులో 2020–21 సంవత్సరంలో ఇప్పటివరకు 2.85 కోట్ల మంది క్లెయిమ్స్ సమర్పించారు. మొత్తం ఖాతాదారుల్లో 44.35 శాతం మంది విత్‌డ్రాలకు మొగ్గు చూపారు. కోవిడ్ కేటగిరీలో 15 వేల కోట్లు గత నెల 30వ తేదీ నాటి గణాంకాల ప్రకారం... దేశంలోని ఈపీఎఫ్ ఖాతా దారుల్లో 60.88 లక్షల మంది కోవిడ్–19 కారణంతో నగదు ఉపసంహరణ దరఖాస్తులు సమర్పించారు. గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 30వ తేదీ నాటికి కోవిడ్–19 కేటగిరీలోనే ఏకంగా రూ.15,256.05 కోట్లు ఖాతాదారులు ఉపసంహరించుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన దరఖాస్తుదారుల్లో సగటున ఒక్కో చందాదారుడు రూ.25 వేల చొప్పున ఉపసంహరించుకున్నట్లే. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జనవరి ఆఖరుకు వచ్చిన 2.85 కోట్ల క్లెయిమ్స్‌కు సంబంధించి దాదాపు రూ.70 వేల కోట్లకు పైగా విత్‌డ్రా చేసుకున్నట్లు అంచనా. కోవిడ్–19 కేటగిరీలో సగటున రూ.25 వేల చొప్పున ఉపసంహరించుకోగా.. ఇతర కేటగిరీల్లో 3 నెలల వేతన సీలింగ్ నిబంధన ఉండదు. పర్సనల్ లోన్‌కు బదులుగా గతేడాది నవంబర్‌లో మా కంపెనీలో చాలామంది ఉద్యోగులు జాబ్ కోల్పోయారు. అందులో నేను ఒకదాన్ని. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నాకు నెలకు సగం వేతనం మాత్రమే వస్తుండడంతో ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయాల్సి వచ్చింది. పీఎఫ్ ఖాతాలో 1.2 లక్షలు ఉండటంతో పర్సనల్ లోన్‌కు బదులుగా ఈ నిధిని విత్‌డ్రా చేసుకున్నా. నెలనెలా తిరిగి చెల్లించడం, వడ్డీభారం ఉండదనే ఉద్దేశంతో పీఎఫ్ నిధిని వాడుకోవడం మేలని నిర్ణయించుకున్నా. భవిష్యత్ అవసరాల సంగతి అటుంచితే.. ఇప్పుడున్న ఇబ్బందుల అధిగమించడానికి ప్రాధాన్యమిచ్చా. – వి.వైదేహి, ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ విభాగం ఉద్యోగి నాన్న కరోనా చికిత్సకు రూ. 1.8 లక్షలు ఖర్చయింది కరోనా వైరస్ మా కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గతేడాది జూన్‌లో నాకు కరోనా సోకింది. వారంలో కోలుకున్నాను. కానీ అంతలోనే నాన్నకు వైరస్ సోకడం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో పరిస్థితి చేయిదాటింది. ఆసుపత్రిలో చేర్పిస్తే రూ. 1.8 లక్షలు ఖర్చయింది. కానీ నాన్న చనిపోయారు. ఆసుపత్రి బిల్లు కోసం స్నేహితుడి వద్ద అప్పు చేసి చెల్లించాను. పద్నాలుగు సంవత్సరాలుగా పీఎఫ్ నిధిలో పోగుచేసిన రూ.1.6 లక్షలు విత్‌డ్రా చేసి స్నేహితుడి అప్పు చెల్లించాను. – నదీమ్, అటోమొబైల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ -
ఏప్రిల్ నుంచి టేక్ హోమ్ శాలరీలో కోత!
న్యూఢిల్లీ, సాక్షి: వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) నుంచీ ఉద్యోగులకు లభించే నికర వేతనాలలో కోతపడే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం ఇకపై అలవెన్సుల వాటా 50 శాతానికి మించరాదు. దీంతో బేసిక్ శాలరీని 50 శాతంగా నిర్ణయించవలసి ఉంటుందని సంబంధితవర్గాలు చెబుతున్నాయి. 2019 కొత్త వేతన నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలయ్యే వీలున్నట్లు పేర్కొన్నాయి. దీంతో కంపెనీలు పే ప్యాకేజీలలో సవరణలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డాయి. ఫలితంగా ఏప్రిల్ నుంచీ టేక్ హోమ్ శాలరీ తగ్గే చాన్స్ ఉన్నట్లు తెలియజేశాయి. తాజా నిబంధనలపై నిపుణులు ఏమంటున్నారంటే... చదవండి: (23,000 క్యాంపస్ ఉద్యోగాలకు రెడీ) రిటైర్మెంట్ లబ్ది కొత్త వేతన నిబంధనలు అమలైతే జీతాలలో అలవెన్స్ వాటా 50 శాతానికి మించరాదు. దీంతో బేసిక్ శాలరీ వాటా 50 శాతానికి చేర్చవలసి ఉంటుంది. ఫలితంగా గ్రాట్యుటీకోసం చెల్లింపులు, ప్రావిడెండ్ ఫండ్‌కు ఉద్యోగుల జమలు పెరిగే అవకాశముంది. వెరసి ఉద్యోగులు అందుకునే నికర వేతనాలలో ఆమేర కోత పడే చాన్స్ ఉంది. అయితే ఈ మార్పులతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరగనున్నాయి. ప్రయివేట్ రంగంలో చాల కంపెనీలు అలవెన్సుల వాటాను అధికంగా ఉంచుతూ.. నాన్అలవెన్స్ వాటాను 50 శాతానికంటే తక్కువ స్థాయిలో అమలు చేస్తున్నాయి. ఫలితంగా కొత్త వేతన నిబంధనలు ప్రయివేట్ రంగ కంపెనీలపై అధికంగా ప్రభావం చూపే వీలుంది. అయితే తాజా నిబంధనలు ఉద్యోగులకు సామాజిక భద్రతతోపాటు.. పదవీ విరమణ లాభాలను పెంచే వీలుంది. కొత్త వేతన నిబంధనలు అమలుచేస్తే కంపెనీలకు 10-12 శాతం మేర ఉద్యోగ వ్యయాలు పెరగవచ్చు. వేతన కోడ్‌ను గతేడాది పార్లమెంట్ ఆమోదించింది. తుది నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రస్తుతం ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. చదవండి: (జనవరి 1 నుంచి విప్రో వేతన పెంపు!) -
వాట్సాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) వాట్సాప్ హెల్ప్ లైన్ సేవను ప్రారంభించింది. చందాదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఈ సేవను తీసుకొచ్చినట్టు కార్మిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కారానికి ఈపీఎఫ్ ఐజీఎంఎస్ పోర్టల్, సీపీజీఆర్ఏఎంఎస్, సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా సేవలు అందిస్తుండడం గమనార్హం. వాట్సాప్ సేవలు వీటికి అదనం. వారంలో అన్నిరోజులు, రోజులో 24 గంటల పాటు సేవలు అందించే కాల్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది. ‘‘సభ్యులకు మరింత సౌకర్యార్థం ఈపీఎఫ్ఓ తాజాగా వాట్సాప్ ఆధారిత హెల్ప్ లైన్, ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో సభ్యులకు ఎటువంటి ఆటంకాల్లేని సేవలు అందించడమే దీని లక్ష్యం’’ అని కార్మిక శాఖా తన ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 138 ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాయాల పరిధిలో వాట్సాప్ హెల్ప్ లైన్ పనిచేస్తుంది. సభ్యులు ఈపీఎఫ్ఓ సేవకు సంబంధించి ఏ విచారణ అయినా వాట్సాప్ నంబర్‌కు మెస్సేజ్ పంపించడం ద్వారా వివరాలు, సాయం పొందొచ్చు. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ పోర్టల్ లో ప్రాంతీయ కార్యాలయాల వారీగా వాట్సాప్ నంబర్ల వివరాలను పేర్కొన్నట్టు ఈపీఎఫ్ఓ తెలిపింది. -
పీఎఫ్ జమ ఆలస్యం అయితే పెనాల్టీ ఉండదు...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ రోజుల్లో కంపెనీలు తమ ఉద్యోగుల తరఫున భవిష్యనిధి(పీఎఫ్) చందాలను జమ చేయడంలో జాప్యం జరిగితే, ఎటువంటి పెనాల్టీలు వసూలు చేయరాదని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించినట్టు సెంట్రల్ ప్రావిడెండ్ కమిషనర్ సునీల్ బర్త్వాల్ ఓ వెబినార్ సందర్భంగా తెలిపారు.. మార్చి 25 నుంచి కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయడంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు నగదు పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయానికొచ్చింది. ఈపీఎఫ్ పథకం 1952 కింద కంపెనీలు పీఎఫ్ జమలను సకాలంలో చేయకపోతే నష్ట చార్జీ లేదా పెనాల్టీని విధించొచ్చు. గడిచిన నెలకు సంబంధించిన పీఎఫ్‌ను తర్వాతి నెల 15వ తేదీ వరకు జమ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కూడా10 రోజుల గడువుంటుంది. తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా 6.5 లక్షల సంస్థలకు ఉపశమనం కల్పించనుంది. -
80 వేల మంది ఖాతాల్లో.. రూ.258.44 కోట్లు జమ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ఉద్యోగులు తమ భవిష్యనిధి (పీఎఫ్) ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించగా... ఇప్పటివరకు రాష్ట్రంలో 80వేల మంది సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో అధికంగా ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాల జీ) ఇంజనీర్లే ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందు కు దేశవ్యాప్తంగా మార్చి 24వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు వారి పీఎఫ్ ఖాతా నుంచి మూడు నెలల వేతనం మేర విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80,647 మంది ఉద్యోగులు పీఎఫ్ నుంచి నగదు ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు.వీటిని మూడు రోజుల్లో పరిష్కరించిన భవిష్యనిధి కార్యాలయ అధికారులు...దాదాపు 98% మేర దరఖాస్తులను పరిష్కరించారు. వారి ఖాతాల్లో రూ.258.44 కోట్లు జమ చేసినట్లు ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్లు విపిన్ కుమార్, చంద్రశేఖర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కోవిడ్–19తో సంబంధం లేకుండా వచ్చిన మరో 49,755 దరఖాస్తులను సైతం పరిష్కరించినట్లు చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద రాష్ట్రంలో 4,805 ఎస్టాబ్లిష్మెంట్లు అర్హత సాధించాయన్నారు.వీటికి కంపెనీ చందా కింద కట్టాల్సిన రూ.9.24 కోట్లు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. -
పీఎఫ్ ఉపసంహరణకు పోటెత్తిన ఉద్యోగులు..
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో భవిష్య నిధి (పీఎఫ్) ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక వెసులుబాటను హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 57,445 మంది వినియోగించుకున్నారని పీఎఫ్ కమిషనర్ వీకే శర్మ తెలిపారు. ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ యోజన కింద తెలంగాణలో 11 వేల సంస్థలు వస్తాయని పేర్కొన్నారు. అందులోని ఉద్యోగుల పీఎఫ్.. కంపెనీ తరఫున మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిచేస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు 4805 కంపెనీల ఉద్యోగులు పీఎఫ్ విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 15 వేల లోపు జీతం కలిగి100 మంది లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీల, ఉద్యోగుల తరఫున పీఎఫ్ మొత్తం కేంద్రమే వేస్తోందని చెప్పారు. మూడు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో నగదు పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులను వేగంగా పరిస్కరిస్తున్నామని, పీఎఫ్ దరఖాస్తు చేసుకున్నవారికి మూడు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో నగదు వేస్తున్నామని పీఎఫ్ కమిషనర్ చంద్రశేఖర్(హైదరాబాద్) వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 80 వేల 647 మంది ఉద్యోగులు పీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని. వారికి 258 కోట్ల రూపాయల అకౌంట్ లో వేశామన్నారు. పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసినవారిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే ఉన్నారని తెలిపారు. చదవండి : కరోనా విపత్తు: భారీ ఉపశమనం -
57 వేల అర్జీలు.. 33,500 పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: పీఎఫ్(భవిష్యనిధి) ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు చివరగా పీఎఫ్ విత్‌డ్రా వైపు మొగ్గు చూపుతుండటంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో దాదాపు అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. దీంతో ఆయా యాజమాన్యాలు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితి తలెత్తడం... కొన్ని కంపెనీలు వేతనాల్లో సగం మాత్రమే ఇవ్వడంతో సగటు ఉద్యోగికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితిని అధిగమిం చేందుకు ఉద్యోగి పీఎఫ్ ఖాతా నుంచి మూడు నెలల వేతనానికి సమానమైన నగదు ఉపసంహరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు పెట్టుకుంటున్నారు. 57 వేలు దాటిన అర్జీలు... కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పీఎఫ్ ఖాతాదారులు వారి పీఎఫ్ నుంచి మూడు నెలల వేతనానికి సరిపడా నిధులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీన్ని గత నెలలో కేంద్రం ప్రకటించగా... ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 57 వేల మంది అర్జీలు పెట్టుకున్నారు. వీటిని మూడు రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో... ఆదిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్పీఎఫ్సీ (రీజినల్ ప్రావిడెంట్ కమిషనర్ ) కార్యాలయంలో ఉద్యోగులకు వీటి పరిష్కార బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ఉద్యోగులు పరిమిత సంఖ్యలో వస్తుండటంతో రోజువారీ హాజరును బట్టి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం పీఎఫ్ విత్‌డ్రా దరఖాస్తులన్నీ ఆన్లైన్ పద్దతిలోనే వస్తుండటంతో వాటిని వేగంగా తెరిచి పరిష్కరించేందుకు ఆర్పీఎఫ్సీ కార్యాలయంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఒక దరఖాస్తును గరి ష్టంగా మూడు పనిదినాల్లో పరిష్కరించేలా సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 33,500 దరఖాస్తులు పరిష్కరించినట్లు సమాచారం భారీగా పెరిగే అవకాశం... పీఎఫ్ విత్‌డ్రా దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలంతా లాక్‌డౌన్‌తోనే గడుస్తుంది. గత నెలలో పది రోజుల పాటు లాక్డౌన్ ఉన్నప్పటికీ మెజార్టీ కంపెనీలు పూర్తి వేతనాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో చాలా కంపెనీల్లో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో ఉద్యోగి అవసరాలకు పీఎఫ్ నిధులే శరణ్యమనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈనెల 20 తర్వాత దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనుంది. వచ్చే నెలలో ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉందని ఆర్పీఎఫ్సీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు కొనసాగింపు!!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20)లో ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 5న జరిగే ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2018–19లో కూడా ఇదే రేటు ఉంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని 8.5 శాతానికి తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. పోస్టాఫీస్ పొదుపు పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మొదలైన ఇతరత్రా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల స్థాయికి ఈపీఎఫ్ వడ్డీ రేటును కూడా సవరించాలంటూ కార్మిక శాఖపై ఆర్థిక శాఖ ఒత్తిడి తెస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో ఆర్థిక శాఖ అభిప్రాయాలను కూడా కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగులకు భవిష్యనిధి సంస్థ తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచినట్టు ఈపీఎఫ్ఓ బుధవారం ప్రకటించింది. ఆరు కోట్ల మందికి పైగా చందాదారుల ఖాతాలపై రూ 54,000 కోట్ల మేర వడ్డీ జమ చేస్తామని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై 8.65 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక 2017-18లో గత ఐదేళ్లలో అత్యంత కనిష్టస్ధాయిలో 8.55 శాతం వడ్డీరేటును వర్తింపచేశారు.ఇక 2013-14లో ఈపీఎఫ్ఓ పీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేటును 8.75 శాతం అందించింది. -
ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతం
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) చందాదారులందరికీ శుభవార్త. 2018– 19 ఆర్థిక సంవత్సరానికిగాను ఈపీఎఫ్ చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని 8.65 శాతం చొప్పున ఈ పండగ సీజన్‌కు ముందే చెల్లించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాతీయ భద్రతా అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాల్లోని మొత్తాలపై 8.55 శాతం వడ్డీ చెల్లించారు. 2018–19 సంవత్సరానికి ఈ వడ్డీరేటును 8.65 శాతానికి పెంచాలని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాగా ఈపీఎఫ్ చందాదారులకు చెల్లించే వడ్డీని 8.65 శాతానికి పెంచనున్నామని గంగ్వార్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ
న్యూఢిల్లీ: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. పీఎఫ్ రేటును పెంచడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. 2015–16లో 8.8 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2016–17లో 8.65 శాతానికి, అటుపై 2017–18లో అయిదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ తెలియజేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతామన్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరానికి అధిక వడ్డీ రేటు ఇవ్వాలని ట్రస్టీలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపుతాం. వారినీ ఒప్పిస్తాం‘ అని గంగ్వార్ చెప్పారు. 8.65 శాతం వడ్డీ రేటునిస్తే.. ఈపీఎఫ్ వద్ద రూ.151.67 కోట్ల మిగులు ఉంటుందని అందుకే ఈ రేటును నిర్ణయించామని ఆయన చెప్పారు. అదే 8.7 శాతం ఇస్తే రూ.158 కోట్ల లోటు ఉంటుందని తెలియజేశారు. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించవచ్చంటూ ముందుగా వార్తలు వెలువడ్డాయి. అయితే, త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని పెంచవచ్చంటూ అధికార వర్గాల నుంచి సంకేతాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌వో నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈపీఎఫ్‌వోలో ప్రస్తుతం 6 కోట్ల పైచిలుకు చందాదారులున్నారు. పింఛను పెంపుపై నిర్ణయం వాయిదా... కనీస నెలవారీ పింఛనును రూ.2,000కు పెంచాలన్న ప్రతిపాదనపై నిర్ణయాన్ని మార్చిలో జరిగే తదుపరి సమావేశం దాకా వాయిదా వేసినట్లు ఈపీఎఫ్‌వో ట్రస్టీ పీజే బానాసురే తెలిపారు. కనీస నెలవారీ పింఛనును రెట్టింపు చేయాలంటే అదనంగా రూ.3,000 కోట్లు అవసరమవుతాయి. అందుకని ఆర్థిక శాఖ అనుమతిస్తే తప్ప దీనిపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ పింఛను పథకం (పీఎంఎస్‌వైఎం) కింద అసంఘటిత రంగ ఉద్యోగులకు కనీసం రూ.3,000 నెలవారీ పింఛను ఇస్తామంటూ ఇటీవల మధ్యంతర బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పీఎఫ్ చందాదారుల పింఛనును కూడా రెట్టింపు చేయాల్సి రానుంది. ప్రభుత్వం నిర్వహించే అన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఒకే మొత్తం పింఛను ఉండాలని, అందుకే ఈపీఎఫ్‌వో చందాదారులకు కూడా పింఛనును రూ. 3,000 చేయాలని తాము కోరుతున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జనరల్ సెక్రటరీ వీర్జేష్ ఉపాధ్యాయ్ చెప్పారు. -
మున్సిపల్ ఉపాధ్యాయులకు సర్కారు షాక్
విశాఖ సిటీ : ఎక్కడా లేని విధంగా మున్సిపల్ ఉపాధ్యాయుల భవిష్య నిధి(పీఎఫ్) సొమ్ముపై వచ్చే వడ్డీలో 2 శాతం సొమ్మును నిర్వహణ చార్జీల పేరుతో వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మున్సిపల్ ఉపాధ్యాయ సం ఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపా«ధ్యాయులు, ఉద్యోగుల జీతాలను గతంలో లోకల్ ఫండ్(ఎల్ఎఫ్) ఆడిట్ ద్వారా చెల్లించేవారు. వారి పీఎఫ్ ఖాతాలను మున్సిపాలిటీలే నిర్వహించేవి. అనంతరం 010 పద్దు కింద జీతాల చెల్లింపులను ప్రారంభించడంతో పీఎఫ్ అకౌంట్ల నిర్వహణ బాధ్యతలను మున్సిపాల్టీలు నిలిపివేశాయి. దీంతో పీఎఫ్ ఖాతాలు ట్రెజరీ పరిధిలోకి వెళ్లాయి. తమను పీఎఫ్ ఖాతాల నుంచి జీపీఎఫ్ ఖాతాలకు మార్చాలంటూ మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖాధికారులను కోరాయి. దీంతో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(డీఎంఏ) 2017 జూలై 10న మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అమలు చేయాలని సూచించారు. కానీ, ఇప్పటికీ పట్టించుకోలేదు. నిర్వహణ చార్జీల పేరుతో.. తమను జీపీఎఫ్ పరిధిలో చేర్చాలంటూ మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాలు పదేపదే కోరడంతో ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ఏడాది క్రితం డీఎంఏ జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టి, మున్సిపల్ ఉపాధ్యాయులకు ట్రెజరీ పరిధిలో పీఎఫ్ అమలు కోసం కమిటీ వేశారు. ఇందులో మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి ఒక్కరు కూడా లేరు. ఈ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు ఉపాధ్యాయుల పాలిట గొడ్డలిపెట్టులా మారాయి. మున్సిపల్ టీచర్ల పీఎఫ్ ఖాతాలను ప్రస్తుతం ట్రెజరీలు నిర్వహిసున్నారు. ఇందుకుగాను ప్రతి ఖాతా నిర్వహణకు 2 శాతం మెయింటెనెన్స్ చార్జీలు వసూలు చేయనున్నట్లు విధివిధానాల్లో పేర్కొన్నారు. పీఎఫ్ సొమ్ముపై వడ్డీలో ఈ 2 శాతం కోత విధించనున్నట్లు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతా నిర్వహణకు ఈ విధంగా మెయింటెనెన్స్ చార్జీలు వసూలు చేయడం లేదు. రాష్ట్రంలో 14 వేల మంది టీచర్లుండగా, వీరిలో 4 వేల మంది సీపీఎఫ్ పరిధిలోకి వస్తున్నారు. మిగిలిన 10 వేల మంది మున్సిపల్ ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల్లోంచి 2 శాతం కోత విధించనున్నారు. మున్సిపల్ టీచర్లంటే చిన్నచూపా? ఒకే డీఎస్సీలో ఎంపికైనా ఇతర ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పోలిస్తే మున్సిపల్ పాఠశాలల టీచర్లు పలు హక్కుల్ని కోల్పోతున్నారు. మున్సిపల్ టీచర్లకు ఎల్టీసీ, జీపీఎఫ్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించలేదు. జిల్లా పరిషత్ పాఠశాలల హెచ్ఎంలకు ఉన్న డీడీవో అధికారాలు మున్సిపల్ స్కూళ్ల టీచర్లకు లేవు. 2009లో అప్పటి ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో మున్సిపల్ టీచర్ల పరిస్థితిపై అధ్యయనానికి ఒక కమిటీని నియమించింది. ఇతర రాష్ట్రాల్లో మున్సిపల్ టీచర్లకు డీడీవో అధికారాలు, జీపీఎఫ్ సౌకర్యాలు ఉన్నాయని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. దాంతో మున్సిపల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించడంతోపాటు డీడీవో అధికారాలు, జీపీఎఫ్ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కానీ, డీడీవో అధికారాలు, జీపీఎఫ్ సౌకర్యాలు ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ప్రభుత్వం పునరాలోచించాలి ‘‘పీఎఫ్ సొమ్ముపై వచ్చే వడ్డీ నుంచి 2 శాతం కోత విధించాలన్న సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం ఉంది. మన రాష్ట్రంలో పుంగనూరు మున్సిపల్ ఉపాధ్యాయులకు మాత్రమే జీపీఎఫ్ సౌకర్యం కల్పించారు. ఈ విధానాన్ని అన్నిచోట్లా అమలు చేయాలి’’ – బి.హేన, ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు, విశాఖపట్నం జీపీఎఫ్ విధానం కావాలి ‘‘మున్సిపల్ టీచర్లకు పీఎఫ్ కాకుండా జీపీఎఫ్ విధానాన్ని అమలు చేయాలి. 2 శాతం నిర్వ హణ చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరిం చుకోవాలి. మున్సిపల్ టీచర్ల భవిష్య నిధి విధివిధానాల్ని రూపొందించేందుకు నియ మించిన కమిటీలో మున్సిపల్ ఉపాధ్యాయులకు స్థానం కల్పించకపోవడం దారుణం’’ – శ్రీనివాసరావు, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ -
కార్మికులు పీఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవాలి
కాశీబుగ్గ శ్రీకాకుళం : కార్మికులంతా ఫ్రావిడెంట్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని జిల్లా ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ కమిషనర్ జీ సుధాకర్ తెలిపారు. స్థానిక మున్సిపల్ సర్వసభ్య సమావేశం మందిరంలో మంగళవారం కార్మికులకు ఆయన అవగాహన కల్పించారు. ప్రతీ కార్మికుడు ఆధార్, పాన్, రేషన్‌కార్డు, కార్మికుని గుర్తింపుకార్డు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతాతో నమోదు చేసుకోవాలన్నారు. కార్మికులు అవసరమైనపుడు ఇళ్లు, పిల్లల వివాహాలకు, ముఖ్యమైన సందర్భంలో వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ రమేష్‌నాయుడు, కార్మిక నాయకుడు మురగన్, సీఐటీయూ నాయకుడు ఎన్ గణపతి, తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి పీఎఫ్ మనీ తీసుకోవచ్చు
న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఇటీవలే నిరుద్యోగిగా మారిన నెల అనంతరం 75 శాతం ఈపీఎఫ్ కార్పస్‌ను, 2 నెలలకు పైగా నిరుద్యోగిగా ఉంటే మిగతా ఆ 25 శాతం కూడా విత్‌డ్రా చేసుకునేలా అవకాశం కల్పించిన ఈపీఎఫ్ఓ మరో అద్భుత అవకాశాన్ని కూడా కల్పించబోతుంది. పెళ్లికి, ఇంటి కొనుగోలుకు, పిల్లల చదువుకు వంటి ఖర్చులకు సగం ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేలా ఈపీఎఫ్ఓ అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఫార్మ్ 31ను నింపాల్సి ఉంటుంది. పోస్టు మెట్రిక్యూలేషన్ స్టడీస్ కోసం 50 శాతం మొత్తాన్ని వడ్డీతో తీసుకునేలా ఈపీఎఫ్ఓ తన నిబంధనలను మార్చుతోంది. అలాగే ఇళ్లు కొనుకునేందుకు లేదా కట్టించుకునేందుకు కూడా 24 నెలల బేసిక్ వేతనాలను, డీఏను విత్‌డ్రా చేసుకోవచ్చని రిటైర్మెంట్ ఫండ్ బాడీ చెప్పింది. 24 బేసిక్, డీఏ లేదా 36 నెలల బేసిక్ వేతనాలను విత్‌డ్రా చేసుకునేలా ఈపీఎఫ్ఓ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అయితే పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే కనీసం ఐదేళ్లు సభ్యుడిగా ఉండాలి. దీని కోసం ఉద్యోగి నుంచి డిక్లరేషన్ అవసరం. మిగతా ఏ డాక్యుమెంట్లను ఉద్యోగులు సమర్పించాల్సినవసరం లేదు. -
30 రోజుల్లో ముప్పావు వంతు వెనక్కి తీసుకోవచ్చు!
న్యూఢిల్లీ: ఉద్యోగం పోయిన నెల తర్వాత పీఎఫ్ మొత్తంలో 75 శాతం వరకూ వెనక్కి తీసుకునే వెసులుబాటును రిటైర్మెంట్ నిధి, ఈపీఎఫ్ఓ(ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) కల్పిస్తోంది. మిగిలిన మొత్తాన్ని ఈపీఎఫ్ఓ వద్దే అట్టిపెట్టుకోవచ్చని కార్మిక శాఖ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఉద్యోగం పోయిన 2 నెలల తర్వాత మిగిలిన 25 శాతాన్ని తీసుకోవచ్చని, ఫైనల్ సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చని వివరించారు. ఈ మేరకు ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ స్కీమ్, 1952లో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించామని ఈపీఎఫ్ఓ, ట్రస్టీల కేంద్ర బోర్డ్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న సంతోష్ వివరించారు. ప్రస్తుతానికి... ఉద్యోగం పోయిన రెండు నెలల తర్వాతనే ఈపీఎఫ్ఓ సభ్యుడు తన పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఫైనల్ సెటిల్మెంట్ కూడా అప్పుడే చేసుకోవచ్చు. మరోవైపు ఐదు ఫండ్ మేనేజర్ల కాలపరిమితిని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ పొడిగించామని గంగ్వార్ తెలిపారు. పోర్ట్‌ఫోలియో మేనేజర్ల ఎంపికకు కన్సల్టెంట్ నియామక ప్రతిపాదన కూడా ఆమోదం పొందిందన్నారు. ఈ ఏడాది మే కల్లా ఈటీఎఫ్ పెట్టుబడులు రూ.47,431 కోట్లకు చేరాయని, త్వరలోనే ఈ పెట్టుబడులు రూ.లక్ష కోట్లకు చేరతాయని చెప్పారు. ఈ ఏడాది మేతో ముగిసిన సంవత్సరానికి 16% రాబడి వచ్చిందని వివరించారు. -
ఉద్యోగుల పీఎఫ్‌పై 8.55 శాతం వడ్డీ
న్యూఢిల్లీ: ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి 8.55 శాతం వడ్డీరేటును జమ చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఆదేశించింది. కార్మికశాఖ మంత్రి నేతృత్వంలో ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీ బోర్డు ఈ రేటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఈ రేటును గతంలోనే ఖరారు చేసినప్పటికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నియమావళి కారణంగా అమలు చేయలేదని తెలిపింది. దాదాపు 5 కోట్ల మంది ఖాతాదారులున్న ఈపీఎఫ్‌వో అత్యల్ప వడ్డీరేటును ప్రకటించడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. 2016–17లో ఈ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. -
పీఎఫ్‌పై వడ్డీ 8.55 శాతం
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్‌పై 8.55 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్మిక శాఖ త్వరలోనే ప్రకటన చేయనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని నిర్ణయించి ఫిబ్రవరిలోనే ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించింది. అయితే, ఆర్థిక శాఖ ఆమోదం ఆలస్యం కావటంతోపాటు ఈనెల 12న కర్ణాటకలో ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల నియమావళి అడ్డుగా నిలిచింది. వచ్చే వారంలో ఎన్నికల సంఘం అనుమతి రాగానే కార్మిక శాఖ ప్రకటన చేస్తుందనీ, ఆ వెంటనే సభ్యుల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ అవుతుందని ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి. గత ఐదేళ్లలో ఈపీఎఫ్‌వో చందాదారులకు చెల్లిస్తున్న అతి తక్కువ వడ్డీ ఇదే కావటం గమనార్హం. -
పీఎఫ్ వెబ్సైట్ హ్యాక్.. భారీగా డేటా చోరీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైంది. ఆధార్ అనుసంధానిత సైట్ aadhaar.epfoservices.comను హ్యాకర్లు తమ అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయించారు. సమారు 2.7 కోట్ల మంది ఇందులో సభ్యులుగా ఉండగా.. వారి డేటా చోరీకి గురైనట్లు సమాచారం. ఈ మేరకు సాంకేతిక సమాచార శాఖకు ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జోయ్ ఓ లేఖ రాశారు. డేటా చోరీకి గురైందని.. ప్రస్తుతం సైట్‌ను తాత్కాలికంగా మూసేసినట్లు ఆయన తెలిపారు. టెక్నికల్ టీమ్ త్వరగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కమిషనర్ లేఖలో విజ్ఞప్తి చేశారు. మరోపక్క నిఘా వ్యవస్థ గతంలోనే ఈపీఎఫ్‌వోకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలపై సైబర్ భద్రతా నిపుణులు ఆనంద్ వెంకట్ నారాయణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్సైట్లో ఆధార్ అనుసంధానం అయి ఉండటంతో జీతభత్యం, బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలను కూడా హ్యాకర్లు సులువుగా గుర్తించే వీలుండొచ్చని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. గతంలో ఐబీ విభాగం జారీ చేసిన హెచ్చరిక నోట్ -
‘భవిష్య’ చందాదారులకు మరింత వెసులుబాటు
న్యూఢిల్లీ: సంస్థలు తమ వాటాను భవిష్య నిధికి నిర్దిష్ట గడువులోగా జమ చేయకుంటే ఆ సమాచారం ఇకపై సదరు ఉద్యోగికి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కేవలం జమ చేసిన వివరాలనే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఉద్యోగులకు పంపుతోంది. ‘ఇప్పటి వరకు సంస్థలు తమ వాటాను చెల్లించకుంటే ఆ సమాచారం ఆ ఉద్యోగులకు తెలిసేది కాదు. ఎవరి తరఫున వారి సంస్థ కంట్రిబ్యూషన్‌ను చెల్లించలేదో ఇకపై ఆ వివరాలు సదరు ఉద్యోగికి ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపుతాము’ అని ఈపీఎఫ్‌వో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌ను తమ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఎఎన్)తో అనుసంధానం చేసుకున్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. -
ఉద్యోగం పోతే.. పీఎఫ్‌ను తీసేసుకోవాలా?
నా దగ్గర ప్రస్తుతం రూ.25 లక్షలు ఉన్నాయి. నాలుగేళ్ల తర్వాత సొంత ఇల్లు సమకూర్చుకోవడం నా లక్ష్యం. అందుకని ఈ నాలుగేళ్ల కాలానికి ఈ మొత్తాన్ని ఏదైనా అగ్రెసివ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫలితంగా నేను కొనుగోలు చేయబోయే ఇంటికి తీసుకోవలసిన రుణ మొత్తం తగ్గుతుంది కదా ! ఒకేసారి ఈ రూ.25 లక్షలను పూర్తిగా ఏదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా ? తగిన సూచనలివ్వండి. –వైభవ్, హైదరాబాద్ పిల్లల ఉన్నత చదువుల కోసం, రిటైర్మెంట్ నిధి కోసం ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయడం... దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనలో మొదటి అడుగు. కానీ నాలుగేళ్లలో సొంత ఇల్లు సమకూర్చుకోవడం దీర్ఘకాల ఆర్థిక లక్ష్యం కాదు. నాలుగు లేదా ఐదేళ్లలోనే ఈ సొమ్ములు మీకు అవసరం పడతాయి. కాబట్టి ఈ సొమ్ముల ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అగ్రెసివ్ ఫండ్ కంటే కూడా బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. స్వల్పకాలంలో మార్కెట్ గమనాన్ని అంచనా వేయడం చాలా కష్టం. మీరు ఒకేసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే, మార్కెట్ బాగా లేకపోతే, నాలుగేళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలన్న మీ ప్లాన్ మొత్తం తల్లకిందులు కావచ్చు. అందుకని ఎప్పుడైనా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైన వ్యూహం కాదు. కాబట్టి మీ దగ్గర ఉన్న మొత్తాన్ని కనీసం 12 భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని ఒక నిర్దేశిత కాలానికి(నెల/మూడు నెలలు/ఆరు నెలలు) ఒక మంచి బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 42 సంవత్సరాలు. ఇటీవల నేను ఉద్యోగం కోల్పోయాను. మిత్రులతో కలసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను. వ్యాపారానికి పెట్టుబడి సమస్యలు లేవు. కాగా ఇప్పటివరకూ నా ప్రావిడెంట్ ఫండ్ మొత్తం రూ.35 లక్షలైంది. ఈ మొత్తాన్ని మరో 15 ఏళ్ల వరకూ వాడుకోకూడదనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మంచి సలహా ఇవ్వండి. –రవి, విశాఖపట్టణం మరో పదిహేనేళ్ల పాటు ఈ ఈపీఎఫ్(ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్) సొమ్ములను వాడుకోకూడదని మీరు నిర్ణయించుకున్న పక్షంలో కొంచెం రిస్క్ తీసుకుంటే మంచిది. మీరు ఉద్యోగంలో ఉన్నంత వరకూ ఈపీఎఫ్‌లో నిల్వలు కొనసాగించడమే మంచిది. మీరు ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈపీఎఫ్‌లో ఉండే మీ మొత్తంపై వచ్చే వడ్డీఆదాయంపై పన్ను భారం పడుతుంది. అందుకని మీరు ఉద్యోగం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈపీఎఫ్ మొత్తాన్ని తీసేసుకోవడమే మంచి నిర్ణయం. ఇటీవల కాలం నుంచే ప్రావిడెంట్ ఫండ్ నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ఆరంభించారు. అయితే ఈ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పారదర్శకత పెద్దగా లేదు. అందుకని మీ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించి మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్(ఎమ్ఐపీ)కు సంబంధించిన గ్రోత్ ఆప్షన్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ స్కీమ్‌లు తమ నిధుల్లో 10–15 శాతం మేర ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే ఈ రూ. 35 లక్షల మొత్తాన్ని ఒకేసారి వీటిల్లో ఇన్వెస్ట్ చేయకండి. ఈ మొత్తాన్ని కనీసం 12 నుంచి 18 నెలల్లో ఇన్వెస్ట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. మీరు ఒకేసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన పక్షంలో మీ స్కీమ్స్ విలువ 5 శాతం తగ్గినా అది పెద్దమొత్తం నష్టం కిందే లెక్క. మీరు ఇటీవలే ఉద్యోగం కోల్పోయారు. సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నారు. సొంత వ్యాపారంలో పూర్తి స్థాయిలో కుదురుకోకముందే మీ పీఎఫ్ సొమ్ములపై నష్టాలు రావడం మంచిది కాదు కదా ! నేను కొంత మొత్తాన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఫండ్స్ లాక్–ఇన్ పీరియడ్ పూర్తయింది. ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని మరింత మెరుగైన రాబడులు వచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. కొంతమంది మిత్రులు ఈఎల్ఎస్ఎస్ల్లోనే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి? –కళ్యాణ్, విజయవాడ ఈఎల్ఎస్ఎస్ల నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని మెరుగైన రాబడుల కోసం మరో ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ తగిన రాబడులు ఇవ్వని పక్షంలోనే లాక్–ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఈఎల్ఎస్ఎస్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలి. లిక్విడిటీ సమస్య కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ఈఎల్ఎస్ఎస్ల లాక్ ఇన్ పీరియడ్ పూర్తి కాగానే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటారు. ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. ఈఎల్ఎస్ఎస్ల నుంచి వెనక్కి తీసుకున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తగిన విధంగా ఇన్వెస్ట్ చేయకపోతే, మీకు తగిన రాబడులు రావు. పైగా అధికంగా పన్ను భారం పడుతుంది. ఈఎల్ఎస్ఎస్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కేవలం రెండు కారణాల వల్లే వెనక్కి తీసుకోవాలి. మొదటిది ఈ ఫండ్స్ పనితీరు సరిగ్గా లేకపోవడం, రెండవది... మీకు నగదు కొరత తీవ్రంగా ఉన్నప్పుడు.. కేవలం ఈ రెండు సందర్భాల్లోనే ఈఎల్ఎస్ఎస్ల్లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలి. అలా కానప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడమే మంచిది. ఈఎల్ఎస్ఎస్ల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించినప్పుడు మంచి రాబడులు పొందవచ్చు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పీఎఫ్ రుణాల్లో భారీ కుంభకోణం..!
సాక్షి, గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో మరో కుంభకోణం వెలుగు చూసింది. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి పీఎఫ్ రుణాల వ్యవహారంలో వారికి సంబంధం లేకుండా దళారులు మార్చేసిన వైనం బయటపడింది. ఏకంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్వో), ఓ క్లర్క్ సంతకాలను ఫోర్జరీ చేసి పారిశుద్ధ్య కార్మికులకు తెలియకుండా వారి పీఎఫ్ ఖాతాల నుంచి రుణాలు మంజూరు చేస్తూ ఆ డబ్బును వేరే ఖాతాలకు మళ్లిస్తున్నట్లు అధికారులు మంగళవారం గుర్తించి, వాటిని నిలిపివేయడంతోపాటు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అధికారులు వెళ్లే సమయానికి ఐదుగురు కార్మికులకు పీఎఫ్ రుణాలు మంజూరు చేయడంతోపాటు డీడీలు సైతం సిద్ధం చేశారు. తాను పీఎఫ్ లోనుకు దరఖాస్తు చేసుకోకపోయినా తన పేరుతో రుణం రావడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఓ కార్మికుడు ఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయడం, ఆమె పీఎఫ్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయడంతో పీఎఫ్ రుణాల కుంభ కోణం బయటపడింది. రుణాలను నిలిపివేయించి విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... నిరక్షరాస్యులే లక్ష్యంగా.. గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులకు 2000 సంవత్సరం నుంచి పీఎఫ్ కట్ చేస్తూ నగరపాలక సంస్థ సైతం పీఎఫ్ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. అయితే పారిశుద్ధ్య కార్మికుల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులు కావడంతో వారికి పీఎఫ్ చెల్లింపులు, ఈఎస్ఐ వ్యవహారాలు చూస్తూ చనిపోయిన వారికి క్లయిమ్‌లు ఇప్పించేందుకు ఓ కాంట్రాక్టు సంస్థను అప్పట్లో నగరపాలక సంస్థ అధికారులు నియమించారు. అయితే కార్మికులకు సంబంధించి పీఎఫ్ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిన కాంట్రాక్టు సంస్థ పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో దళారులు చేరి పారిశుద్ధ్య కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి అప్పులు ఇవ్వడం, ఖాళీ పేపర్ల మీద సంతకాలు చేయించుకుని వారి డబ్బులు కాజేయడం పరిపాటిగా మారింది. దీంతో కష్టపడి పనిచేసిన డబ్బు ఇళ్లకు చేరక, కుటుంబాలకు గడవక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ వ్యవహారం బయటపడిందిలా.. నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలోని మలేరియా విభాగంలో గోడౌన్ కీపర్‌గా పనిచేస్తున్న కేశవరావు అనే కార్మికునికి బుధవారం ఓ మెసేజ్ వచ్చింది. మీరు పెట్టుకున్న పీఎఫ్ లోను మంజూరు అయిందనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో అవాక్కు అయిన కేశవరావు తాను పీఎఫ్ లోను కోసం అసలు దరఖాస్తు చేయలేదని ఫిర్యాదు చేశాడు. రికార్డులు పరిశీలించిన ఎంహెచ్వో డాక్టర్ శోభారాణి కేశవరావు పేరుతో పీఎఫ్ లోనుకు ఎటువంటి సిఫార్సు చేయలేదని నిర్ధారించుకున్నారు. వెంటనే పీఎఫ్ కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించగా కేశవరావు పేరుతో ఉన్న దరఖాస్తులో తన సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన ఆమె మరో నాలుగు లోన్లకు సంబంధించి డీడీలు సైతం సిద్ధమైనట్లు తెలుసుకుని వాటిని నిలిపివేయించారు. సదరు డబ్బును చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి అకౌంట్‌కు జమ చేసేలా ఏర్పాట్లు చేయడంపై పూర్తి వివరాలు తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాంట్రాక్టు సంస్థ, అధికారులు పాత్ర ఏ మేరకు ఉందనేది వేచి చూడాల్సి ఉంది. పారిశుద్ధ్య కార్మికులకు తెలియకుండా పీఎఫ్ లోన్లు కాజేస్తున్న వైనం బయటకు రావడంతో గతంలో సైతం ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరిగాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరెవరి పేర్లతో ఎంతెంత లోన్లు మార్చుకున్నారో తెలియక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో క్రిమినల్ కేసు పెడతాం నా సంతకాన్ని ఫోర్జరీ చేసి కేశవరావు అనే పారిశుద్ధ్య కార్మికునికి తెలియకుండా ఆయన పీఎఫ్ ఖాతా నుంచి లోన్లు మంజూరు చేయించుకుని కాజేస్తున్న వైనం బయటపడింది. దీనిపై పీఎఫ్ అధికారులతో పాటు, మేము పూర్తి విచారణ జరుపుతాం. గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా అనేదానిపై ఆరా తీస్తున్నాం. ఫోర్జరీ వ్యవహారంపై కమిషనర్ ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదు చేయిస్తాం. ఇకమీదట పారిశుద్ధ్య కార్మికుల ఆధార్ కార్డులను ఆన్లైన్ చేసి వారి బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసి పీఎఫ్ లోన్లు నేరుగా వారి అకౌంట్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ శోభారాణి, ఎంహెచ్వో -
గుడ్‌న్యూస్! నిర్ణయం మార్చుకున్న ఈపీఎఫ్ఓ
న్యూఢిల్లీ : గుడ్‌న్యూస్..ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తన నిర్ణయం మార్చుకుంది. రూ.10 లక్షలకు పైన ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రా క్లయిమ్స్‌ను ఆఫ్‌లైన్‌గా కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. అంతకముందు ఈ విత్‌డ్రాను కేవలం ఆన్‌లైన్‌గా మాత్రమే చేపట్టాలని ఈపీఎఫ్ఓ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగితరహిత సంస్థగా ఈపీఎఫ్ఓను మార్చడానికి, ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుతం ఆఫ్‌లైన్‌గా కూడా ఈ క్లయిమ్స్‌ను చేపట్టవచ్చని పేర్కొంది. 2018 ఏప్రిల్ 13న ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ ఎంప్లాయూస్, పెన్షన్ స్కీమ్ విత్‌డ్రాయల్స్‌ను సమీక్షిస్తూ ఓ సర్క్యూలర్ జారీచేసింది. ఈ సర్క్యూలర్ ప్రకారం రూ.10 లక్షలకు పైన ఉన్న అన్ని పీఎఫ్ క్లయిమ్స్‌ను ఆఫ్‌లైన్‌గా సమర్పించే దరఖాస్తుల ద్వారా కూడా సెటిల్ చేయాలని పేర్కొంది. అదేవిధంగా ఈపీఎస్ విషయంలో రూ.5 లక్షలకు పైన ఉన్న పీఎఫ్ క్లయిమ్స్‌ను ఆఫ్‌లైన్‌గా చేపట్టవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌గా క్లయిమ్ చేసుకునేటప్పుడు ఈపీఎఫ్ఓ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కేసుల్లోనూ ఈ ఆఫ్‌లైన్ క్లయిమ్స్‌ను చేపట్టనున్నారు. ఆఫ్‌లైన్‌గా సమర్పించిన దరఖాస్తులను ఈపీఎఫ్ఓ, ఎంప్లాయర్స్(ఆర్గనైజేషన్స్)కు ఆన్‌లైన్‌గా పంపించనుంది. దీంతో తుదిపరి వెరిఫికేషన్ చేపట్టి, మోసాలను తగ్గించవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది. అయితే ఎంప్లాయర్స్ పొందిన ఆ క్లయిమ్ దరఖాస్తులను ఆమోదిస్తున్నటా? లేదా తిరస్కరిస్తున్నటా? తెలుపుతూ మూడు రోజుల్లోగా తిరిగి ఈపీఎఫ్ఓ ఆఫీసుకు పంపించాలి. -
ఏలూరులో సీబీఐ దాడులు
ఏలూరు టౌన్:ఏలూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా జిల్లా ఈపీఎఫ్ కార్యాలయ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎల్.ఆనందరావును సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాయంత్రం 3.30 గంటలకు ఏలూరు వచ్చిన విశాఖపట్నం సీబీఐ అధికారుల బృందం జిల్లా ఈపీఎఫ్ కార్యాలయాన్ని జల్లెడపడుతున్నారు. రాత్రి 11.30 గంటల వరకూ కార్యాలయంలో సోదాలు చేస్తూనే ఉన్నారు. లంచావతారం ఎత్తిన అ«ధికారితోపాటు, కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని సైతం ప్రశ్నించారు. గతంలో పీఎఫ్ మంజూరు రికార్డులను, ఇతర ఆసుపత్రులకు సంబంధించిన ఫైళ్లు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరు అమీనాపేటలోని చైత్ర ఆసుపత్రి యాజమాన్యం అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ చెల్లించటంలేదని జిల్లా ఈపీఎఫ్ కార్యాలయానికి కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు మేరకు ఈపీఎఫ్ కార్యాలయ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎల్.ఆనందరావు ఆసుపత్రి తనిఖీ చేసేందుకు వెళ్ళారు. తనిఖీలు చేసిన అధికారి ఆనందరావు తనకు సొమ్ములు ఇస్తే ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటానని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తాము నిబంధనల మేరకు పీఎఫ్ వాటా చెల్లిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. అయినా అధికారి రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం విశాఖపట్నంలోని సీబీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. సీబీఐ అధికారులు పక్కా ప్లాన్ వేసి బుధవారం సాయంత్రం ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఎల్ఐసీ కార్యాలయం రోడ్డులోని ఈపీఎఫ్ జిల్లా కార్యాలయానికి వెళ్ళి ఆసుపత్రి సిబ్బంది రూ.40 వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయ రికార్డుల మేరకు అధికారి ఆనందరావును సీబీఐ అధికారులు అర్ధరాత్రి వరకూ విచారిస్తునే ఉన్నారు. -
ఒక్క మిస్డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్..
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటును కల్పించింది. కేవలం ఒక్క మిస్డ్ కాల్తోనే ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకునే వీలుకల్పించింది. ఉద్యోగస్తులు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను సులువుగా పొందడానికే ఈ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్(ఈపీఎఫ్ఓ) స్కీమ్‌లోని ఉద్యోగులు ఎవరైతే యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్) పోర్టల్‌లో కూడా రిజస్టర్ అయి ఉంటారో వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు పొందే మాదిరిగానే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను కూడా తెలుసుకోవచ్చన్న మాట. యూఏఎన్ పోర్టల్‌లో ఉద్యోగులు పేర్కొన్న తమ ఫోన్ నెంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇస్తే చాలూ.. వెంటనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. ఈ సర్వీస్‌కు ఎలాంటి చార్జీలు ఉండబోవని కార్మిక శాఖ తెలిపింది. అదే విధంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా కూడా వివరాలు పొందవచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో బ్యాలెన్స్ వివరాలు పొందవచ్చని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. -
పీఎఫ్ సమాచారం వ్యక్తిగతమా?
సందర్భం కార్మికుల జీతంనుంచి కోత విధించి దాన్ని వారి పీఎఫ్ ఖాతాలో వేయకపోవడం పెద్ద అవినీతి. అలాంటి యాజమాన్యాలపైన చర్యతీసుకోకుండా కార్మికులకు నష్టం కలిగించే అధికారులపైన చట్టపరమైన చర్య తీసుకోవలసి ఉంటుంది. ప్రయివేటు రంగంలో, కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ వర్కర్లకు ఒకే ఒక సంక్షేమ ప్రయోజనం భవిష్యనిధి. వేతనంలో 12శాతం భవిష్యనిధికి కార్మికుడి వాటాను చెల్లింపు సమయంలోనే తీసి, భవిష్యనిధి ఖాతాకు జమచేయాలి. యాజమాన్యం వారి వాటాను కూడా కలిపి కార్మికుడి ఖాతాలో వేయాలి. భవిష్యత్తులో కార్మికుడి ఆరోగ్య సంక్షేమాలకు ఆ డబ్బునుంచి సాయం లభిస్తుంది. చాలామంది కార్మికులు పీఎఫ్ వాటాను చెల్లించినా యాజమాన్యాలు వారి ఖాతాలో వాటిని జమచేయడం లేదు. వారిపైన చర్యతీసుకోవలసిన పీఎఫ్ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తారు. వారికి జవాబుదారీ ఎవరు? సమాచార హక్కు చట్టం వల్ల కార్మికులకి, వారి నాయకులకు, సంఘాలకు మరొక చేయూత దొరికింది. మా వాటా డబ్బు చెల్లించారా? యాజమాన్యం వాటా కలిపారా? చెల్లించని యాజమాన్యంపై ఏ చర్యతీసుకున్నారు? ఏ చర్యా తీసుకోని అధికారుల బాధ్యత ఏమిటి అని ఆర్టీఐ కింద అడుగుతున్నారు. కానీ ఇవ్వడం కుదరదని ప్రజాసమాచార అధికారులు నిరాకరిస్తున్నారు. వేతనం నుంచి పీఎఫ్ వాటాను తీసి అతని ఖాతాలో జమచేశారా లేదా, యాజమాన్యం వాటా చెల్లించారా అని జనార్దన్ పాటిల్ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కోరారు. ఈ సమాచారం ఇస్తే ఏం నష్టం? ఇవ్వకపోతే తమకు వచ్చే లాభం ఏమిటి? అని ఎవరూ ఆలోచించడం లేదు అధికారులు. మూడో వ్యక్తి సమాచారం అనీ వ్యక్తిగత సమాచారం అనీ నిరాకరించారు. మొదటి అప్పీలు అధికారి కూడా ఆ నిరాకరణను సమర్థించారు. ఈ సమాచారం ఇవ్వవలసిందే అని ఈపీఎఫ్ఓను కమిషన్ ఆదేశించింది. సమాచారం ఇవ్వనందుకు గరిష్ట జరిమానా ఎందుకు విధించకూడదో తెలియజేయాలని ప్రజాసమాచార అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆర్టీఐ దరఖాస్తు వేసినప్పుడు తాను సీపీఐఓను కాదని, ప్రస్తుత సీపీఐఓ ఏసీ పగారే వివరణ ఇచ్చారు. అప్పటి అధికారితోపాటు, సమాచారం ఇవ్వని ఇప్పటి సీపీఐఓ కూడా అందుకు బాధ్యత వహించాలని ఇద్దరికీ కమిషన్ జరిమానా నోటీసులు జారీ చేసింది. సీఐసీ ఆదేశించిన తరువాత సమాచారం ఇచ్చామని, కనుక తనపై జరిమానా విధించరాదని ప్రస్తుత అధికారి పగారే వివరణ ఇచ్చారు. 2016 ఫిబ్రవరి 2న వచ్చిన దరఖాస్తును వెంటనే ఫిబ్రవరి 23న సంబంధిత శాఖకు పంపానని, దానికి సమాధానం ఆ అధికారే ఇవ్వాల్సి ఉందని ఆ నిర్ణయం సరైనదే అని మొదటి అప్పీలు అధికారి కూడా ఒప్పుకున్నారని, తనకు సమాచారం ఇవ్వకూడదనే దురుద్దేశం లేనేలేదని అప్పటి సీపీఐఓ జగదీష్ టాంబే వివరణ ఇచ్చారు. కార్మికుడి భవిష్యనిధి అతడి వ్యక్తిగత సమాచారం కనుక ఇవ్వరాదని ఆయన వివరించారు. రికార్డులు పరిశీలిస్తే తేలిందేమంటే మొత్తం 15 నెలల తరువాత కార్మికుడికి చెందిన పీఎఫ్ సమాచారం ఇచ్చారు. అందాకా సమాచారం ఇవ్వకుండా వేధించారు. ఆ తరువాత కూడా రెండు అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని దరఖాస్తుదారుడు వివరించారు. ఇవ్వకుండా వదిలేసిన సమాచారాన్ని కూడా ఇవ్వాలని కమిషన్ మళ్లీ ఆదేశించింది. కార్మికుల వేతన సమాచారం వ్యక్తిగత సమాచారం కాదు. ఎందుకంటే అందరు కార్మికులకు ఒక లెక్క ప్రకారం, వేతన బోర్డు నిర్ణయం ప్రకారం ఒక స్కేలు పద్ధతిన వేతనం ఇస్తారు. అది అందరికీ తెలిసిన సమాచారమే. అందులో 12 శాతం భాగాన్ని భవిష్యనిధికి కార్మికుడి వాటాగా కేటాయించాలని. అంతే సొమ్మును యాజమాన్యం వాటాగా చెల్లించాలని చట్టం ఆదేశించింది. వేతనం వలెనే వేతనంలో భాగమైన పీఎఫ్ సొమ్ము వ్యక్తిగత రహస్యం అయ్యే అవకాశమే లేదు. పీఎఫ్ ఖాతాలో కార్మికుడి వాటా, యాజమాన్యం వాటా తప్ప మరేదీ ఉండదు. అందులో కార్మికుడు ఎక్కువ సొమ్ము జమచేయడం, మరో విధంగా ఖర్చుచేయడం జరగదు. అలాంటప్పుడు పీఎఫ్ ఖాతాను బ్యాంకు ఖాతాతోనూ, ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలతోనూ పోల్చి సమాచారాన్ని నిరాకరించడం సమంజసం కాదు. పీఎఫ్ వాటా చెల్లింపులు చేసినా అతని ఖాతాలో ఆ డబ్బును తన వాటాతో కలిపి యాజమాన్యం జమ చేయకపోతే, అది చట్టవిరుద్ధమైన పని అవుతుంది. దానివెనుక మోసం ఉంటుంది. కార్మికుడికి ద్రోహం జరుగుతుంది. అతని జీతంనుంచి కోత విధించి అతని ఖాతాలో వేయకపోవడం పెద్ద అవినీతి కూడా అవుతుంది. ఈ పనిచేసిన యాజమాన్యాలపైన చర్యతీసుకునే అధికారం పీఎఫ్ అధికారులకు ఉంది. ఆ అధికారాన్ని వినియోగించకుండా కార్మికులకు నష్టం కలిగించే అధికారులపైన చట్టపరమైన చర్యతీసుకోవలసి ఉంటుంది. ఇవన్నీ తప్పించుకోవడానికి అధికారులు పీఎఫ్ సమాచారాన్ని వ్యక్తిగత సమాచారం అంటూ ఇవ్వకుండా దాస్తున్నారు. ఇందుకు సమాచార అధికారిపై కమిషన్ 25 వేల రూపాయల జరిమానా విధించింది. (నాగరాజ్ జనార్దన్ వర్సెస్ ఈపీఎఫ్ఓ నంబరు EPFOG/ A/2016/294053, కేసులో 20.2.2018 నాడు కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఇక ఈపీఎఫ్‌లో ఆన్లైన్ క్లెయిమ్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి తమ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మళ్లించనున్నట్టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పేర్కొంది. రూ 10 లక్షలు మించిన పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు విధిగా ఆన్లైన్లోనే క్లెయిమ్ చేయాలని స్పష్టం చేసింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద రూ 5 లక్షలు దాటిన విత్‌డ్రాయల్స్‌కు ఆన్లైన్ క్లెయిమ్‌లను అనివార్యం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం నాటికి పూర్తిగా ఆన్లైన్ సేవలు అందించాలని ఈపీఎఫ్ఓ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈపీఎఫ్ఓ కార్యాలయాలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. నూతన మార్పులకు అనుగుణంగా రాబోయే రెండు నెలల్లో కాగితరహిత సేవలపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. వాణిజ్య సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్ క్లెయిమ్‌లను విధిగా ఆన్లైన్లోనే చేపట్టాలని పేర్కొంది. అన్ని ఈ-కోర్టు కేసులనూ ఎలక్ర్టానిక్ ఫైలింగ్ ప్రక్రియలోనే ప్రాసెస్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తమ కార్యాలయాల్లో అవసరమైన మౌలిక వసతులను ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తేనుంది. -
10 లక్షలు దాటితే ఆన్లైన్లోనే..
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్ రూ. 10 లక్షలకు మించితే తప్పనిసరిగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయం తీసుకుంది. అలాగే, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద విత్‌డ్రా చేసుకునే మొత్తం రూ. 5 లక్షలు మించినా.. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి కానుంది. ఈ పింఛను పథకం కింద.. పాక్షికంగా కూడా పెన్షన్‌ను విత్‌డ్రా చేసుకునే వీలుంది. ఇందుకోసం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌తో పాటు మ్యాన్యువల్‌గా కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఉమంగ్ యాప్ నుంచే పీఎఫ్‌కు ఆధార్ లింక్ ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పీఎఫ్ ఖాతాను (యూనివర్సల్ అకౌంట్) ఆధార్‌తో అనుసంధానించుకోవడం మరింత సులభతరం అయింది. ఉమంగ్ యాప్ నుంచి అనుసంధానించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సభ్యుల సౌకర్యం కోసం యూఏఎన్–ఆధార్ లింకింగ్ సదుపాయాన్ని ఉమంగ్ యాప్‌లో కల్పించినట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది. పలు రకాల ప్రభుత్వ సేవలను ఒకే చోట అందించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉమంగ్ యాప్‌ను తీసుకువచ్చింది. -
పీఎఫ్ రేటు 8.55 శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో 2017–18 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై వడ్డీ రేటును 8.65 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గించింది. దీంతో రూ. 586 కోట్ల మేర మిగులు నమోదు కానుందని ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశం అనంతరం కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 8.65 శాతం వడ్డీ రేటునివ్వడంతో.. రూ. 695 కోట్లు మిగులు నమోదైనట్లు వివరించారు. దాదాపు 6 కోట్ల చందాదారులపై ఇది ప్రభావం చూపనుంది. తాజా నిర్ణయానికి కార్మిక సంఘాలు సైతం అంగీకరించగలవని గంగ్వార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఉమంగ్ మొబైల్ యాప్ ద్వారా ఈపీఎఫ్‌వో యూఏఎన్‌కి ఆధార్‌ను అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని మంత్రి ఆవిష్కరించారు. అడ్మినిస్ట్రేటివ్ చార్జీలను 0.65 శాతం నుంచి 0.50 శాతానికి తగ్గించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయించినట్లు గంగ్వార్ వివరించారు. అటు, ఇకపై పది మంది ఉద్యోగులున్న సంస్థలు కూడా ఈపీఎఫ్‌వో స్కీములో భాగమయ్యేలా చేయాలని సీబీటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిబంధన 20 మంది పైగా ఉద్యోగులన్న సంస్థలకే వర్తిస్తోంది. తాజా నిర్ణయంతో ఈపీఎఫ్‌వో చందాదారుల సంఖ్య ప్రస్తుతమున్న 6 కోట్ల నుంచి దాదాపు 9 కోట్ల దాకా పెరగవచ్చని గంగ్వార్ పేర్కొన్నారు. -
పీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతం!
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఈ ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీనే కొనసాగించే అవకాశాలున్నాయి. నేడు(బుధవారం) జరిగే సమావేశంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. ఈపీఎఫ్ఓ ఈ నెలలో ఈటీఎఫ్‌లపై రూ.1,054 కోట్ల రాబడులు సాధించిందని దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీరేటును ఇవ్వడం సాధ్యమవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వడ్డీరేట్లపై నిర్ణయంతో పాటు నిర్వహణ చార్జీలను 0.65 శాతం నుంచి 0.50 శాతానికి తగ్గించే ప్రతిపాదనపై కూడా నేటి సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఈపీఎఫ్ఓ 2015 ఆగస్టు నుంచి ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటివరకూ రూ.44,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటివరకైతే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విక్రయించలేదు. ఇప్పటివరకైతే ఈటీఎఫ్‌లపై 16 శాతం రాబడి వచ్చింది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటు 8.8 శాతంగా ఉంది. -
రూ. 400 కోట్ల పీఎఫ్.. ఉఫ్!
-
రూ. 400 కోట్ల పీఎఫ్.. ఉఫ్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణరోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) మళ్లీ దారి తప్పింది. కార్మికుల వేతనాల నుంచి మినహాయించి వారి భావి అవసరాలకు వినియోగించాల్సిన భవిష్య నిధి (పీఎఫ్)ని స్వాహా చేసింది. ఆ నిధికి సంస్థపరంగా చెల్లించాల్సిన వాటాతోపాటు స్వయంగా కార్మికుల వేతనాల నుంచి మినహాయించిన మొత్తాన్ని కూడా వాడేసుకుంది. ఇప్పుడు ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. గతంలో ఇదే తరహా తప్పిదంతో భవిష్య నిధి కమిషనర్ ఆగ్రహానికి గురైన సంస్థ మరోసారి ఆ కమిషనర్ నుంచి సమన్లు అందుకోవాల్సి వచ్చింది. పీఎఫ్ సొమ్ముపై కన్ను... ఆర్టీసీకి ఇటీవల 35 డిపోల్లో లాభాలు మొదలయ్యాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి ఆర్టీసీ లాభాల రుచి చూసింది. దీంతో మిగతా డిపోలను కూడా లాభాల జాబితాలోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. కానీ కొండలా పేరుకుపోయిన అప్పు, దానికి ప్రతినెలా చెల్లించాల్సిన వడ్డీ, ఆర్టీసీ వేతన సవరణ తర్వాత భారీగా పెరిగిన వేతనాల భారం, డొక్కు బస్సులు పెరగటంతో తడిసిమోపెడవుతున్న వాటి నిర్వహణ వ్యయం... ఇలా ఖర్చుల పద్దు లాభాలను మింగేస్తున్నాయి. దీంతో నిర్వహణ కోసం దిక్కులు చూస్తున్న ఆర్టీసీ కన్ను కార్మికుల భవిష్య నిధిపై పడింది. ఏడాదిన్నర కిందట నుంచి... ప్రతి నెలా కార్మికుల వేతనాల నుంచి ఆర్టీసీ దాదాపు రూ. 13 కోట్ల వరకు సంస్థ మినహాయించడంతోపాటు అంతే మొత్తాన్ని దానికి జత చేసి భవిష్య నిధి ట్రస్టులో జమ చేయాలి. అయితే ఆర్టీసీకి ఉన్న ప్రత్యేక వెసులుబాటు దృష్ట్యా ఆర్టీసీ అధీనంలోనే ఎండీ చైర్మన్‌గా ఉండే భవిష్యనిధి ట్రస్టులో జమ చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని ఇతర సంస్థలకు వడ్డీలకు ఇచ్చి తిరిగి ఆదాయాన్ని పొందే వెసులుబాటు ఉంది. కార్మికులకు అవసరమైన రుణాలను ఈ మొత్తం నుంచి ఇస్తారు. అయితే ఆర్టీసీ 2016 జూన్ నుంచి సంస్థ వాటా నిధులను ట్రస్టుకు జమ చేయకుండా సొంతానికి వాడుకోవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత కార్మికుల వాటా నిధులనూ దారి మళ్లించటం మొదలుపెట్టింది. నాలుగు నెలలుగా ఆ తంతు జరుగుతోంది. విషయం భవిష్య నిధి కమిషనర్ దృష్టికి చేరడంతో ఆర్టీసీ యాజమాన్యానికి సమన్లు జారీ చేశారు. సొంతంగా ట్రస్టు ఏర్పాటు చేసుకొని అందులోనే పీఎఫ్ మొత్తాన్ని జమ చేసే వెసులుబాటును ఎందుకు రద్దు చేయకూడదని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. సర్దుబాటు సమస్యే... భవిష్య నిధి నుంచి ఆర్టీసీ వాడుకున్న రూ. 400 కోట్లను తిరిగి సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారనుంది. దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఇదే తరహాలో రూ. 160 కోట్లను వాడేసుకోగా అందులో 25 శాతాన్ని చెలించి మిగతా దాన్ని సర్దుబాటు చేయడం ఇప్పటివరకు పూర్తిగా కుదరలేదు. ప్రభుత్వ సాయం లేకపోవడం, జీహెచ్ఎంసీ నిధులు ఇస్తామని చెప్పినా ఆ సంస్థ కాదనడంతో ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దారి మళ్లించిన నిధుల్లో సంస్థ వాటా రూ. 335 కోట్లు ఉండగా కార్మికుల వేతనాల నుంచి మినహాయించిన మొత్తం రూ. 65 కోట్ల వరకు ఉన్నట్టు తెలిసింది. -
పీఎఫ్ ఎవరు చెల్లిస్తారు?
వారంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. నెలకు అందే వేతనం రూ.8 వేల నుంచి రూ.10వేలు మాత్రమే. వారి భవిష్యత్ దృష్ట్యా అధికారులు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించారు. వారిని భర్తీ చేసిన ఏజెన్సీ పీఎఫ్ వాటా జమచేయకుండా రూ.25 లక్షలు దిగమింగింది. ఆ మొత్తం తమకు అందుతుందో లేదోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, మచిలీపట్నం: తిరువూరు నియోజకవర్గంలో ఉన్న రెడ్డిగూడెం, గంపలగూడెం గ్రామాల్లోని మోడల్ స్కూళ్లలో 16 ఉద్యోగాలు (కంప్యూటర్ టీచర్, అటెండర్, వాచ్మెన్ తదితర), కస్తూర్బా విద్యాలయాల్లో 18 (అటెండర్, వాచ్మెన్ తదితర) ఖాళీగా ఉన్న పోస్టులు 2014వ సంవత్సరంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో రాహుల్ యూత్ ఏజెన్సీ భర్తీచేసింది. ఉద్యోగంలో చేరే సమయంలో హామీ ఇచ్చిన మేరకు పోస్టును బట్టి ఒక్కొక్కరికీ ప్రతినెలా రూ.10 వేల నుంచి రూ.8 వేలు ఉద్యోగుల స్థాయిని బట్టి చెల్లిస్తున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతినెలా వేతనంలో 14 శాతం కోత విధించి పీఎఫ్, ఈఎస్ఐ కింద జమ చేయాల్సి ఉంది. ఉద్యోగులను ఏజెన్సీ ద్వారా నియమించినా, ఆ నిధులు సంబంధిత శాఖ అధికారులు చెల్లించాలి. ఇదే అదునుగా భావించిన ఏజెన్సీ నిర్వాహకులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో అక్రమార్జనకు అర్రులు చాచారు. ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ పేర ప్రతినెలా అందే జీతంలో కొంతమేర కోత విధించి, వారు ఉద్యోగం వదిలి వెళ్లిన సమయంలో ఆ మొత్తానికి రెట్టింపు మొత్తం జమచేసి ఇవ్వడం సాధారణం. ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైనా ఈఎస్ఐ ద్వారా వైద్యం పొందే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ ఏజెన్సీ నిర్వాహకులు ఆ మొత్తంపై కన్నేశారు. అక్రమం జరిగింది ఇలా.. 34 మంది ఉద్యోగులకు సంబంధించి 2014వ సంవత్సరం నుంచి ఒక్కో ఉద్యోగికి వారి స్థాయిని బట్టి (ఉదాహరణకు 2014లో ఉద్యోగంలో చేరిన వ్యక్తికి రూ.లక్ష, 2015లో చేరిన వ్యక్తికి రూ.70వేలు ఇలా..) రూ.లక్ష నుంచి రూ.70 వేలు, రూ.60 వేలు వేతనంలో కోత విధిస్తూ ఆ మొత్తాన్ని పీఎఫ్, ఈఎస్ఐకు జమ చేస్తామని నమ్మబలికారు. తీరా ఖాతాల్లో జమ చేయకుండా స్వాహాపర్వానికి తెర తీశారు. ఇలా మూడేళ్లకు సంబంధించి దాదాపు రూ.25 లక్షలు మింగారు. ఈ దోపిడీ వ్యవహారాన్ని పసిగట్టిన ఉద్యోగులు 3 నెలల క్రితం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణ నిర్వహించగా, అవినీతి గుట్టురట్టయ్యింది. దీంతో సదరు ఏజెన్సీని ఉద్యోగాల ఎంపిక బాధ్యతను తప్పించి, ఆ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగులను సెప్టెంబర్‌లో నారాయణ సేవా సంఘానికి బదిలీ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. పీఎఫ్ ఎవరు చెల్లిస్తారు? ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం ఏజెన్సీ నిర్వాహకులు స్వాహా చేసిన రూ.28 లక్షల పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము రికవరీ ఎలాగన్న సందిగ్ధం నెలకొంది. తమకు ఆ మొత్తం అందుతుందో లేదోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించే ఏజెన్సీపై సదరు శాఖ పర్యవేక్షణ ఉండాలి. అయితే ఆ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో పడి పర్యవేక్షణ గాలికొదిలేశారు. ఏజెన్సీ పనితీరుపై ప్రతి మూడు నెలలకోసారి పీఎఫ్, ఈఎస్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించాలి. అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో ఆమ్యామ్యాలు తీసుకుని మిన్నకుండిపోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఉన్నంతకాలం ఊడ్చుకోవడం తప్ప మిగిలిన వాటిపై ఏజెన్సీ నిర్వాహకులు దృష్టి సారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగులకు ఏజెన్సీ బదలాయింపు జరిగింది. జిల్లాలో మొత్తం 29 అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, వాటిలో అత్యధిక శాతం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి ఏజెన్సీలపై ఓ నిఘా వేస్తే అక్రమ బండారం బట్టబయలయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. పీఎఫ్ చెల్లించే బాధ్యత మాదే.. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదన్న అంశం మా దృష్టికి వచ్చింది. మా శాఖ పరిధిలో ఎవరికీ అన్యాయం జరగలేదు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులకు పక్కాగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లిస్తేనే తప్ప నిధులు విడుదల చేయబోమని ఏజెన్సీలకు చెప్పాం. ఆ ప్రక్రియ మా ఆధ్వర్యంలో నడిచేలా చూస్తున్నాం. – కె.వి.డి.ఎం.ప్రసాద్‌బాబు, ఆర్వీఎం పీవో -
ఆధార్ సీడింగ్‌తో ఇక ఒక్కటే పీఎఫ్ ఖాతా
కోల్‌కతా: పీఎఫ్ ఖాతాతో ఆధార్ సీడింగ్ పూర్తయితే ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న ఖాతాలను తొలగించడం సులభమవుతుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం వల్ల బహుళ పీఎఫ్ ఖాతాలను గుర్తించి తొలగించడానికి వీలవుతుందని అడిషనల్ సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ సిన్హా శుక్రవారం తెలిపారు. కోల్‌కతాలో పీఎఫ్ ఫండ్ నిర్వహణపై నిర్వహించిన సదస్సు సందర్భంగా స్థానిక పీఎఫ్ కమిషనర్ నవేందు రాయ్ మాట్లాడారు. సార్వత్రిక ఖాతా సంఖ్యను ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఉద్యోగులు కొత్త సంస్థకు తమ పీఎఫ్ ఖాతాను బదిలీచేయనవసరం లేదని, అది ఆటోమేటిక్‌గా బదిలీ అవుతుందన్నారు.గడువు ముగియక ముందే ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు స్వీయ ధ్రువీకరణ విధానాన్ని ప్రారంభించామని తెలిపారు. -
మొత్తం విత్‌డ్రా చేయొద్దు: ఈపీఎఫ్‌వో
చండీగఢ్: భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలోని మొత్తం డబ్బును చందాదారులు చిన్న చిన్న కారణాలతో విత్‌డ్రా చేసుకోవడం మంచిది కాదని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సూచించింది. ఖాతాలో నిరంతరం డబ్బు నిల్వ ఉన్నప్పుడే సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు చందాదారులకు పూర్తిస్థాయిలో అందుతాయని ఈపీఎఫ్‌వో పేర్కొంది. పీఎఫ్ ఖాతాను సాధారణ బ్యాంకు ఖాతాలాగ చూడకూడదనీ, సామాజిక భద్రతను అందించేందుకే పీఎఫ్ సొమ్ము ఉందని ఈపీఎఫ్‌వో తెలిపింది. చిన్న చిన్న కారణాలకు పీఎఫ్ డబ్బులను వాడుకోవడం వల్ల చందాదారులు జీవిత చరమాంకంలో ఇబ్బంది పడతారనీ, మొత్తం విత్‌డ్రాకు తాము వ్యతిరేకమని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కేంద్ర పీఎఫ్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇప్పుడు పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుతో చాలా సులభంగా రుణం పొందే అవకాశం కూడా ఉందనీ, ఉద్యోగులు దీనిని వినియోగించుకోవాలని కోరారు. -
ఈపీఎఫ్‌ఎఓ సబ్స్క్రైబర్లకు మరో గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : ఐదు కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్లకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. షేర్లలో పెట్టుబడులుగా పెట్టే పీఎఫ్ మొత్తాన్ని, మార్కెట్ ధరలో సబ్స్క్రైబర్లు రిడీమ్ చేసుకునే ప్రతిపాదనను ఆమోదించింది. గురువారం భేటీ అయిన రిటైర్మెంట్ ఫండ్ బాడీ సెంట్రల్ బోర్డు ట్రస్టీలు, ఈక్విటీ లింక్ అయ్యే పెట్టుబడులకు కొత్త అకౌంటింగ్ పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ కింద 15 శాతం పీఎఫ్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లాగా ఈక్విటీల రూపంలో సబ్స్క్రైబర్లకు ఇవ్వనున్నారు. ఎప్పుడైతే సబ్‌స్క్రైబర్ ఫండ్ నుంచి బయటికి వచ్చేస్తారో ఆ సమయంలో ఈ మొత్తాన్ని రిడీమ్ చేసుకోవచ్చని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల తర్వాత జరిపిన 219వ సమావేశం అనంతరం కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఎక్స్చేంజ్ ట్రేడెట్ ఫండ్ల ద్వారా ఈక్విటీ రూపంలో 15 శాతం వరకు పీఎఫ్ మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనుమతి కల్పిస్తుందని పేర్కొన్నారు. గురువారం జరిపిన భేటీలో సెంట్రల్ బోర్డు ట్రస్టీలకు కార్మిక మంత్రి చైర్మన్ లాగా ఉండగా.. ట్రేడ్ యూనియన్లు, ఎంప్లాయర్ అసోసియేషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ప్రతినిధులుగా ఉన్నారు. ఇక వచ్చే ఏడాది నుంచి పీఎఫ్ సబ్స్క్రైబర్లకు రెండు అకౌంట్లు ఉండనున్నాయి. ఒక అకౌంట్ ద్వారా 85 శాతం మొత్తాన్ని డెట్‌లో ఇన్వెస్ట్ చేయనున్నారు. దీనికి ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లించనుంది. మిగతా 15 శాతాన్ని ఈక్విటీలో పెట్టుబడులుగా పెట్టనున్నారు. ఈక్విటీ భాగంలో రిటర్నులు మార్కెట్ ధరపై ఆధారపడి ఉంటాయి. 85 శాతం మొత్తాన్ని వడ్డీతో చెల్లిస్తే, మిగతా 15 శాతాన్ని సేకరించిన యూనిట్ల సంఖ్యను మార్కెట్ ధరతో గుణిస్తారు. మంచి రిటర్నులు కావాలనుకుంటే, మూడేళ్ల వరకు ఈ ఈక్విటీ పెట్టుబడుల మొత్తాన్ని విత్‌డ్రా చేయకుండా సబ్‌స్క్రైబర్ వాయిదా వేసే ఆప్షన్ కలిగి ఉండవచ్చు. -
విదేశాల్లోని భారతీయులకు పీఎఫ్ సౌకర్యం
న్యూఢిల్లీ: ఇక నుంచి విదేశాల్లో పనిచేసే భారతీయులు ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)లో భాగస్తులు కావచ్చు. ఈ పథకంలో భాగంగా ఉద్యోగులు వారు పనిచేస్తున్న దేశంలో సోషల్ సెక్యూరిటీ పథకాన్ని వదులుకుని ఈపీఎఫ్ఓలో చేరే అవకాశాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ చెప్పారు. ఇందుకోసం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన వెల్లడించారు. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు పీఎఫ్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ) పొందవచ్చని, విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా సీవోసీకి దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. -
‘ఔట్’ సోర్సింగ్!
– డిపాజిట్లు , పీఎఫ్ నష్టపోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు – వర్సిటీ చెల్లింపులకు, అందించే జీతాలకు పొంతన కుదరని వైనం – స్వాహా చేసి ఉడాయించిన ఏజెన్సీ నిర్వాహకుడు – నూతన ఏజెన్సీకి కట్టబెట్టినా.. మూడు నెలలుగా అందని జీతాలు ఎస్కేయూ: ఎస్కేయూలో ఉద్యోగాల కల్పన పేరుతో అందినకాడికి దోచుకున్నారు. ఔట్ సోర్సింగ్ ముసుగులో రూ. లక్షలు కొల్లగొట్టి ఉడాయించారు. శ్రమ దోపిడీతో ఉద్యోగులకు చివరకు మిగిలింది నిరాశే! శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లలో భద్రతా నిమిత్తం 2015 ఆగస్టులో తొలి దశలో 40 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. అనంతరం మరో 20 మంది నియామకం చేపట్టారు. వీరందరి నిర్వహణ బాధ్యతను వెంగమాంబ ఏజెన్సీకి అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రకటించిన వేతనంలోనూ కోత సెక్యూరిటీ గార్డుగా ఎంపిక చేసిన ప్రతి ఒక్కరితో విధుల్లో చేరేందుకు ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.25 వేలు కట్టించుకున్నారు. నియామకం సమయంలో ఒక్కొక్కరికి నెలకు రూ.10,200 వేతనం చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా నెలకు రూ. 6,700 చొప్పున అందిస్తూ వచ్చారు. పీఎఫ్, ఇతరత్రా పన్నుల పేరుతో నిర్ధేశిత జీతం కన్నా రూ. 3,500 తక్కువ చెల్లించారు. తమకు తక్కువ జీతం అందుతోందంటూ పలువురు వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ కింద పనిచేసేవారి బాధ్యత వర్సిటీది కాదంటూ, ఏదైనా ఏజెన్సీ నిర్వాహకులతో తేల్చుకోవాలని అధికారులు స్పష్టం చేయడంతో గత ఏడాది సెక్యూరిటీ గార్డులు ఆ మేరకు నిర్వాహకుడిని నిలదీశారు. ఆ సమయంలో వారికి సర్ది చెప్పిన నిర్వాహకుడు నవంబర్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రతి నెలా వ్యత్యాసం ఉన్న రూ. 3,500, రూ.25 వేలు డిపాజిట్ మొత్తం స్వాహా అయినట్లు తెలుసుకున్న సెక్యూరిటీ గార్డుల వేదనకు అంతులేకుండా పోతోంది. ఉద్యోగులను వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడు మోసం చేయడంతో .. కార్తికేయ ఏజెన్సీకు సెక్యూరిటీ గార్డులను అప్పగించారు. అయినప్పటికీ ఈ సంస్థ కూడా ఎవరికీ మూడు నెలలుగా జీతాలు అందించలేదు. ఉదయం పూట కూలీ పనికి ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనంతపురంలో కమ్మీ పనికి వెళుతున్నాను. రూ. 150లు ఇస్తారు. గతంలో ఉన్న ఏజెన్సీ కట్టించుకున్న రూ. 25 వేలు డిపాజిట్, పీఎఫ్ మొత్తాన్ని ఇవ్వలేదు. నిర్వాహకుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. వర్సిటీ అధికారులు మా మీద దయతలచి సహకరిస్తున్నారు. – సురేంద్ర, సెక్యూరిటీ గార్డు సెంట్రింగ్ పని చేస్తున్నా మూడు నెలలుగా జీతాలు అందలేదు. దీంతో డ్యూటీ ఒక షిప్టు చేసి, మరో షిప్టులో సెంట్రింగ్ పనికి వెళుతున్నాను. వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడు తక్కువ జీతం ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు. మా సమస్యలను వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పరిష్కరిస్తామన్నారు. మా ఉద్యోగాలు కొనసాగించి. మరో ఏజెన్సీకి అప్పగించి ఉద్యోగాలు నిలబడేలా చేశారు. – ఆదిశేషయ్య. సెక్యూరిటీ గార్డు. పీఎఫ్ అందలేదు పీఎఫ్ , ఇతరత్రా అలవెన్సులు వెంగమాంబ ఏజెన్సీ వారు ఇవ్వకుండా స్వాహా చేశారు. ప్రతి నెలా రూ.3,500 జీతం తక్కువగా ఇచ్చారు. పైగా రూ.25 వేలు డిపాజిట్‌ను తిరిగి ఇవ్వలేదు. – వన్నూరప్ప, సెక్యూరిటీ గార్డు -
సొంతింటి కల నెరవేరుస్తాం
పీఎఫ్ కేంద్ర కమిషనర్ వీపీ జాయ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పీఎఫ్ ఖాతాదారులందరికీ సొంతింటి కల నెరవేరుస్తామని పీఎఫ్ కేంద్ర కమిషనర్ వీపీ జాయ్ తెలిపారు. ఇందుకు కనీసం పదిమంది ఖాతాదారులు ఒక బృందంగా ఏర్పాటు కావాలన్నారు. ఉద్యోగులు పీఎఫ్ కింద జమ చేసుకున్న మొత్తంలో గరిష్టంగా 90 శాతాన్ని రుణ రూపంలో ఇస్తామని, నెలవారీగా చెల్లించే పీఎఫ్ మొత్తాన్ని వాయిదాల కింద జమ చేసుకుంటామన్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ పింఛన్‌దారుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల ప్రతి ఖాతాదారుడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. సోమవారం పీఎఫ్ ప్రాంతీయాధికారి విజయ్ కుమార్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. పీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానానికి ఉద్యోగి పీఎఫ్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. -
జాబ్ మారితే, పీఎఫ్ అకౌంట్ కూడా...
న్యూఢిల్లీ : పీఎఫ్ అకౌంట్ ప్రతి ప్రైవేట్ ఉద్యోగి కలిగి ఉండే ఓ పొదుపు ఖాతా. ఇన్ని రోజులు ఉద్యోగి సంస్థ మారినప్పుడల్లా ఆ అకౌంట్‌ను మూసివేయడం, మళ్లీ కొత్త సంస్థల్లో చేరిన తర్వాత కొత్త పీఎఫ్ అకౌంట్ తెరవడం చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ అందించింది. ఒకవేళ మీరు ఉద్యోగం మారితే, ఆటోమేటిక్‌గా పీఎఫ్ అకౌంట్ కూడా మారుతుందని చీఫ్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ తెలిపారు. కార్మికులకు అనుకూలమైన రీతిలో ఎన్నో చర్యలను ఈపీఎఫ్ఓ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం మారినప్పుడు, చాలా ఖాతాలు మూతపడుతున్నాయని, తర్వాత వారి అకౌంట్లను పునఃప్రారంభిస్తున్నారని అలా జరుగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని జాయ్ చెప్పారు. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ను తప్పనిసరి చేస్తున్నామని పేర్కొన్నారు. పీఎఫ్ అకౌంట్ అనేది శాశ్వత అకౌంట్ అని, సామాజిక భద్రత కోసం ఒకే ఖాతాను ఉద్యోగులు కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఉద్యోగం మారితే, ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే మూడు రోజుల్లో నగదును ట్రాన్సఫర్ చేయడానికి ప్రయత్నిస్తామని కూడా భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లి పనిచేసినా ఒక్క ధృవీకరణ ఐడీ, ఆధార్‌తో ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే అకౌంట్‌ను ట్రాన్సఫర్ చేస్తామన్నారు. ఈ సిస్టమ్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని జాయ్ పేర్కొన్నారు. -
వచ్చే నెల్లో పీఎఫ్ వడ్డీ రేట్లపై నిర్ణయం
న్యూఢిల్లీ: 2017–18 సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేట్లను వచ్చే నెల్లో జరిగే సమావేశంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో నిర్ణయించనుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం మాట్లాడుతూ.. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల(సీబీటీ) సమావేశం అనంతరం.. వడ్డీరేట్లపై కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని, వచ్చే నెల్లో సమావేశం ఉండవచ్చని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపై రాబడి అంచనాల మేరకు వడ్డీ రేట్లను సీబీటీ ప్రతిపాదిస్తుందని, అనంతరం చైర్మన్ హోదాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ ఏడాది పీఎఫ్ వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు(0.25 శాతం) తగ్గించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీలు, బాండ్ల రూపంలో ఈపీఎఫ్‌వో పెట్టిన పెట్టుబడులపై రాబడి తగ్గవచ్చనే అంచనా మేరకు ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. -
పీఎఫ్‌పై మరో 5 బ్యాంకులతో ఈపీఎఫ్‌వో జట్టు
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ బకాయిల స్వీకరణ, పీఎఫ్ విత్‌డ్రాయల్స్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో మరో అయిదు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వీటిలో ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న సంస్థలు అగ్రిగేటర్ విధానంలో కాకుండా పీఎఫ్ బకాయిలను ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించి నేరుగా ఈపీఎఫ్‌వో ఖాతాలోకే జమచేయొచ్చు. వసూళ్లు, చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ ఒప్పందాలు తోడ్పడగలవని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. ఈపీఎఫ్‌వోకు వ్యయం దీనివల్ల ఏటా రూ. 125 కోట్లకు తగ్గనుంది. ఈ ఒప్పందాలు లేకపోతే.. ఈపీఎఫ్‌వో అగ్రిగేటర్ విధానంలో స్వయంగా బకాయిలను వసూలు చేసుకుని, చెల్లింపులు జరపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతీ లావాదేవీ వ్యయం సుమారు రూ. 12 మేర ఉంటోంది. వివిధ బ్యాంకుల్లో ఖాతాలున్న సభ్యులకు చెల్లింపులు జరిపేందుకు ఏటా తమకు రూ. 350 కోట్ల మేర లావాదేవీ వ్యయాలు అవుతున్నాయని.. ఎస్బీఐతో పాటు పీఎన్బీ తదితర బ్యాంకులతో టైఅప్ కారణంగా ఇది ఇప్పటికే రూ. 175 కోట్లకు తగ్గిందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ తెలిపారు. తాజాగా మరో అయిదు బ్యాంకులతో ఒప్పందాల వల్ల లావాదేవీ వ్యయాలు మరో రూ. 50 కోట్ల దాకా తగ్గుతాయన్నారు. ఇంకో ఏడు బ్యాంకులతో కూడా చర్చలు జరుపుతున్నామని, అవి కూడా ఫలవంతమైతే వ్యయాలు ఏటా కేవలం కొన్ని కోట్లకు మాత్రమే పరిమితం కాగలవని జాయ్ చెప్పారు. -
పీఎఫ్ కౌంటర్‌పై ఐడీబీఐ అభ్యంతరం
► క్రెడిట్ సొసైటీకి తాళం వేసిన అధికారులు ► డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎస్పీఎం కార్మికులు ► డీఎస్పీ జోక్యంతో సద్దుమణిగిన వివాదం కాగజ్‌నగర్: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు సంబంధించిన భవిష్య నిధి (పీఎఫ్) డబ్బులు చెల్లించేందుకు మిల్లులో ఏర్పాటు చేసిన పీఎఫ్ కౌంటర్ నిర్వహణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ కౌంటర్ నిర్వహణపై ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) అధికారులు అభ్యంతరం తెలపడంతో ఈ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. కార్మికులకు సంబంధించిన పీఎఫ్ దరఖాస్తులు స్వీకరించేందుకు స్టాఫ్ గేట్ పక్కన గల క్రెడిట్ సొసైటీ కార్యాలయంలో పీఎఫ్ కౌంటర్ ఏర్పాటు చేసి ఎస్పీఎం డీజీఎం రమేశ్‌రావు ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తుండగా శుక్రవారం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఐడీబీఐ అధికారుల ఆదేశాల మేరకు సెక్యూరిటీ సిబ్బంది ఉదయం 9 గంటలకు క్రెడిట్ సొసైటీ కార్యాలయానికి తాళం వేయడంతో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన కార్మికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. తాము పీఎఫ్ కోసం శాంతియుతంగా దరఖాస్తు చేసుకుంటే పీఎఫ్ కౌంటర్‌కు తాళం వేయడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కార్మికులు దీనిపై ఎస్పీఎం డిప్యూటీ జనరల్ మేనేజర్ రమేశ్రావుకు సమాచారం అందించారు. దీంతో రమేశ్‌రావు అక్కడికి చేరుకొని సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కార్మికులు సైతం అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రమేశ్‌రావు కార్మికులతో వెళ్లి స్థానిక డీఎస్పీ హబీబ్ఖాన్కు విషయాన్ని వివరించారు. పీఎఫ్ కార్యాలయాన్ని శాంతియుంగా కొనసాగిస్తున్నా ఐడీబీఐ అధికారులు తాళం వేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో డీఎస్పీ ఐడీబీఐ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఎస్పీఎం కార్మికులకు సంబంధించిన పీఎఫ్ దరఖాస్తులు క్రెడిట్ సొసైటీ కేంద్రంగా స్వీకరిస్తే బ్యాంక్ అధికారులకు ఎటువంటి నష్టం జరగదని, ఈ విషయంలో సహకరించాలని సూచించారు. డీఎస్పీ జోక్యంతో సొసైటీకి వేసిన తాళాన్ని సిబ్బంది తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా రమేశ్‌రావు మాట్లాడుతూ పీఎఫ్ దరఖాస్తులు స్వీకరించడానికి మాత్రమే క్రెడిట్ సొసైటీని వినియోగిస్తున్నామని, ఇందులో అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదన్నారు. ఉదయం 11గంటలకు క్రెడిట్ సొసైటీ తాళం తీయడంతో కార్మికులు తిరిగి దరఖాస్తులు చేసుకున్నారు. శుక్రవారం 70 మంది కార్మికులు పీఎఫ్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు రమేశ్‌రావు తెలిపారు. -
లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులపై పన్నులుంటాయా?
లిక్విడ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి? లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి వాటిపై లాభాలనార్జిస్తే, ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? – సాగర్, విశాఖపట్టణం లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే గడించే మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన లిక్విడ్ ఫండ్స్ యూనిట్లను మూడేళ్లలోపు విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలపై మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి జత చేసి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. ఒక వేళ మూడేళ్ల కాలానికి మించిన తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే, వీటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 20 శాతం పన్ను (ఇండెక్సేషన్ ప్రయోజనంతో కలుపుకొని) చెల్లించాల్సి ఉంటుంది. నా భార్య ఒక ప్రైవేట్ కంపెనీలో ఆరేళ్లు పనిచేసి మానేసింది. ఇటీవలే ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్) మొత్తాన్ని విత్‌డ్రా చేసింది. ఈ విత్‌డ్రా చేసిన మొత్తంపై పీఎఫ్ డిపార్ట్మెంట్ ఎలాంటి పన్నుకోత విధించలేదు. ఐటీ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ పీఎఫ్ విత్‌డ్రాయల్‌ను చూపించాలా ? ఒక వేళ చూపించాల్సి వస్తే, ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద చూపించాలి? – వివేక్, హైదరాబాద్ రెండు సందర్భాల్లో ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) పీఎఫ్ విత్డ్రాయల్స్పై టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) ను విధిస్తుంది. మొదటి సందర్భం,..ఈపీఎఫ్ విత్‌డ్రాయల్ మొత్తం రూ.50,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఇక రెండోది. ఎవరైనా ఉద్యోగి ఒక కంపెనీలో నిరంతరంగా ఐదేళ్లలోపే పనిచేసి, పీఎఫ్ విత్‌డ్రాయల్ మొత్తం రూ.50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ రెండు సందర్భాల్లోనే పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై టీడీఎస్ ఉంటుంది. మీ భార్య ఒక కంపెనీలో 5 ఏళ్లకు మించి పనిచేసినందున పీఎఫ్ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి టీడీఎస్‌ను ఈపీఎఫ్ఓ విధించలేదు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు ఈ పీఎఫ్ మొత్తాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. వేతనం నుంచి ఆదాయం అనే పద్దు కింద ఈ మొత్తాన్ని చూపించాల్సి ఉంటుంది. నేను కొంత మొత్తానికి హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ అనే టర్మ్ ప్లాన్‌ను తీసుకున్నాను. అయితే ఈ ప్లాన్‌లో యాక్సిడెంట్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్లకు కవరేజ్ లేదు. ఈ రెండు కవరేజ్‌లు ఉన్న మరో టర్మ్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ ఐ స్మార్ట్–లైఫ్ ఆప్షన్‌ను అదనంగా తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా అదనపు టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలా ? లేక హెచ్డీఎఫ్సీ సంస్థనే ఈ రెండు కవరేజ్‌లు కూడా జత చేయమని అడిగి కొంచెం ఎక్కువగా ప్రీమియమ్ చెల్లించాలా ? తగిన సలహా ఇవ్వగలరు ? – నాగేశ్, విజయవాడ క్రిటికల్ ఇల్నెస్, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ప్రయోజనాలు ఉన్న మరో టర్మ్ ప్లాన్‌ను తీసుకుంటే ఎక్కువ ప్రయోజనమా ?లేక ప్రస్తుతమున్న టర్మ్ప్లాన్కే రైడర్లను జత చేస్తే ఎక్కువ ప్రయోజనమా అనే విషయాలపై మీరు ముందుగా మదింపు చేయండి. మీరు ప్రస్తుతం తీసుకున్న హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ టర్మ్ ప్లాన్‌కు క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేయవచ్చు. కొంత అధిక ప్రీమియమ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక 30 ఏళ్ల పొగ తాగని వ్యక్తికి 30 ఏళ్ల బేసిక్ లైఫ్ కవర్‌కు ప్రీమియమ్ ఏడాదికి రూ.10,332గా ఉంటుంది. దీనికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేశారనుకోండి, అప్పుడు చెల్లించాల్సిన ప్రీమియమ్రూ.15,979కు పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను కూడా జత చేస్తే, ప్రీమియమ్ రూ.21,698కు పెరుగుతుంది. ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ ఐ స్మార్ట్ను తీసుకుంటే, ఈ ప్లాన్‌కు సంబంధించి బేసిక్ కవరేజ్ ఒక 30 ఏళ్ల పొగ తాగని వ్యక్తికి 30 ఏళ్ల బేసిక్ లైఫ్ కవర్‌కు ప్రీమియమ్ ఏడాదికి రూ.8,906గా ఉంది. దీనికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను జత చేస్తే, అప్పుడు చెల్లించాల్సిన ప్రీమియమ్ రూ.13,074కు పెరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ను కూడా జత చేశారనుకోండి, ప్రీమియమ్ రూ.18,742కు పెరుగుతుంది. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాకు ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిగణించవచ్చా ? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను సూచించండి? – తేజశ్విని, ఈమెయిల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాతో పోల్చితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ దాదాపు లిక్విడ్ ఫండ్స్లాంటివే. ఈ ఫండ్స్ ద్వారా వచ్చే డివిడెండ్లపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు ఉన్న మంచి ఆకర్షణీయ అంశాల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ములపై వచ్చే రాబడుల కన్నా, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడులే అధికంగా ఉంటాయి మీరు ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని ఫండ్స్‌ను సూచిస్తున్నాం. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, ఐడీఎఫ్సీ ఆర్బిట్రేజ్ ఫండ్, జేఎం ఆర్బిట్రేజ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రేజ్ ఫండ్, కోటక్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, రిలయన్స్ ఆర్బిట్రేజ్ అడ్వాండేజ్ ఫండ్, ఎస్బీఐ ఆర్బిట్రేజ్ అపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్స్‌లో ఏదో ఒకదానిని ఎంచుకొని ఆ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి. -
ఉద్యోగులకు పీఎఫ్ అందించే ప్రయోజనాలివే!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఇటీవల ప్రావిడెంట్ ఫండ్ క్లయిమ్స్ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త కొత్త ఆవిష్కరణలతో ఉద్యోగుల ముందుకు వస్తోంది. క్లయిమ్స్ ను ఆన్ లైన్ లోనే దరఖాస్తు కోవడం నుంచి పేమెంట్లను ఎలక్ట్రానిక్ గా ట్రాన్స్ ఫర్ చేసుకునేలా అన్ని సౌకర్యాలను అందిస్తోంది. ఈపీఎఫ్ఓ కొత్తగా తీసుకొస్తున్న ఈ సులభతర మార్గాలతో నాలుగు కోట్ల మంది ఉద్యోగులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఈపీఎఫ్ఓ ఇటీవల తీసుకొచ్చిన, తీసుకురాబోతున్న ప్రయోజనాలివే... చెల్లింపులను ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ ఫండ్ ట్రాన్సఫర్ ద్వారా చేసుకునేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది.. నెలవారీ ఈఎంఐ చెల్లించుకునే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) అందుబాటులోకి తీసుకొస్తోంది. వెనువెంటనే ఫండ్స్ ట్రాన్సఫర్ చేసుకోవడం, సులభతరంగా ట్రాకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం వంటి ప్రక్రియలను ప్రవేశపెట్టనున్నట్టు రిటైర్ మెంట్ బాడీ పేర్కొంది. దీంతో 4 కోట్ల మంది ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్లకు, 54 లక్షల మంది పెన్షనర్లకు ఎంతో మేలు చేకూరనుందని తెలిపింది. ఈ-గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా, ఎవరైతే యూఏఎన్( రిటైర్ మెంట్ ఫండ్ బాడీ జారీచేసే యూనివర్సల్ అకౌంట్ నెంబర్), కేవైసీ(ఆధార్)లను యాక్టివేట్ చేసుకుంటారో ఆ సబ్ స్క్రైబర్లకు ఆన్ లైన్ లోనే పీఎఫ్ ఫైనల్ సెటిల్ మెంట్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. రిటైర్మెంట్ బాడీ జారీచేసే ఈ యూఏఎన్ నెంబర్ తో ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లను ఒక ఎంప్లాయర్ నుంచి ఇంకో ఎంప్లాయర్ కు పోర్టబులిటీ పెట్టుకోవచ్చు. రిటైర్మెంట్ సంస్థ క్షేత్రస్థాయి కార్యలయాలకు, ఎంప్లాయర్స్ వద్దకు వెళ్లకుండానే ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లు తమ మొత్తం పీఎఫ్ ప్రక్రియను ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. క్లయిమ్ ను సమర్పించిన వెంటనే ఈపీఎఫ్ఓ డేటాబేస్ నుంచి ఫండ్స్, అప్లయ్ చేసిన దరఖాస్తుదారుడి బ్యాంకు అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి. విత్ డ్రాయల్స్ లో కూడా నిబంధనలను ఈపీఎఫ్ఓ సరళీకరం చేసింది. స్వీయ ధృవీకరణతోనే అడ్వాన్స్ క్లయిమ్ ను ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. అంతేకాక డౌన్ పేమెంట్ కోసం 90 శాతం పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు తెలిపింది. -
పీఎఫ్ కార్యాలయం ఆఫీసర్ ఇన్చార్జిగా అద్దంకి
కాకినాడ సిటీ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, కేంద్ర శ్రామిక మంత్రిత్వశాఖ చేపట్టిన సరళీకృత విధానంలో భాగంగా కాకినాడలో ఏర్పాటు చేసిన జిల్లా పీఎఫ్ కార్యాలయం ప్రథమ ఆఫీసర్ ఇ¯ŒSచార్జిగా అద్దంకి అమరేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎఫ్ సభ్యుల సేవలు విస్తృతం చేసేందుకు, ఉద్యోగుల పీఎఫ్ సభ్యత్వం నమోదు పెంచేందుకు, పీఎఫ్ బకాయిలు వసూలు చేసేందుకు త్వరలో రాజమండ్రి పీఎఫ్ ఆఫీస్ నుంచి అదనపు సిబ్బందిని ఇక్కడ కాకినాడ పీఎఫ్ ఆఫీస్‌కు బదలాయిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, సంస్థ యజమానుల సేవలకు, పీఎఫ్ సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా కాకినాడ పీఎఫ్ కార్యాలయం విస్తరణ జరుగుతుందన్నారు. పీఎఫ్ పెన్ష¯ŒSదారులు ఆధార్ లింక్‌లో వారిలో జీవన ప్రమాణ పత్రాలను దాఖలు చేయాలని కోరారు. -
ఏ సర్టిఫికేట్స్ లేకుండానే పీఎఫ్ విత్ డ్రా
న్యూఢిల్లీ : నాలుగు కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అనారోగ్యం పాలైనప్పుడు చికిత్సకు అవసరమయ్యే నగదు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఫండ్స్ విత్ డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది. దివ్యాంగులు కూడా పరికరాలు కొనుక్కోవడానికి ఎలాంటి మెడికిల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినవసరం లేదని, నగదు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952ను సవరించినట్టు ప్రకటించింది. ఇన్నిరోజులు అనారోగ్యం పాలైనప్పుడు చికిత్స కోసం, అంగవైకల్యం వారు పరికరాలు కొనుకునేందుకు ఈపీఎఫ్ ఫండ్ విత్ డ్రాకు పలు సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉండేది. ప్రస్తుతం కాంపొజిట్ ఫామ్ తో సెల్ఫీ డిక్లరేషన్ ఇచ్చి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952లోని క్లాస్ 68-జే, 68-ఎన్ లకు కార్మిక మంత్రిత్వ శాఖ సవరణ చేసిందని, నాన్-రిఫండబుల్ అడ్వాన్సులను వైద్య చికిత్స కోసం తీసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. ప్రస్తుతం పేరా 68-జే కింద వైద్య చికిత్స కోసం ఈపీఎఫ్ సభ్యులు అడ్వాన్స్ ను కోరవచ్చు. అదేవిధంగా పేరా 68-ఎన్ కింద అంగవైకల్యం కలవారు పరికరాలు కొనుక్కునేందుకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. 2017 ఏప్రిల్ 25న చేపట్టిన సవరణతో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ జారీచేసిందని అధికారి పేర్కొన్నారు. -
పీఎఫ్ చందాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: సుమారు నాలుగుకోట్లమంది పీఎఫ్ చందాదారులకు శుభవార్త. ఇకనుంచి ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) ఖాతా నుంచే నెలవారీ ఈఎంఐ చెల్లించుకునే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) అందుబాటులోకి తెస్తోంది. అంతేకాదు ఈ ఖాతా నుంచే ప్రాథమిక చెల్లింపు(డౌన్ పేమెంట్)కోసం 90శాతం పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ మేరకు ఇపిఎఫ్ఓ 1952 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ (ఇపిఎఫ్) పథకాన్ని సవరించింది. సవరణ ద్వారా కొత్త పేరా - 68 బిడి చేర్చి ఈ పథకాన్ని అందుబాటులోకి తేనుంది. క్రొత్త నిబంధన ప్రకారం, ఒక ఈపీఎఫ్ చందాదారుడు సహకార లేదా హౌసింగ్ సొసైటీలో సభ్యులు కనీసం 10 మంది తమ ఖాతా నిధుల నుంచి 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. నివాస గృహం లేదా ఫ్లాట్ లేదా నివాస గృహ నిర్మాణం కోసం ఈ విత్ డ్రా చేసుకోవచ్చు. దీంతోపాటుగా ప్రభుత్వం, హౌసింగ్ ఏజెన్సీ, ప్రాధమిక రుణసంస్థలు, బ్యాంకులకి సంబంధించిన రుణాలు, రుణాలపై ఇతర పెండింగ్ వడ్డీలను నెలవారీ వాయిదాలుగా చెల్లించేందుకు అనుమతినిస్తుంది. అయితే ఈపీఎఫ్ఓ నిబంధనలకు లోబడి ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ సదుపాయాలను పొందాలంటే పీఎఫ్ ఖాతాలో కనీసం మూడేళ్లు కొనసాగాలి. అలాగే ఈ సదుపాయం అతనికి లేదా ఆమెకి జీవితంలో ఒకసారి మాత్రమే వినియోగించుకునే అవకాశం. జీవిత భాగస్వాములతో కలిసి ఉన్న వారి పీఎఫ్ ఖాతాలలో రూ. 20వేల కనీస నిల్వ ఉండాలి. -
పీఎఫ్ సమాచారం ఇవ్వరా?
విశ్లేషణ కార్మిక శాఖ అధికారులు ఆర్టీఐ కింద పీఎఫ్ వివరాలను అడిగితే తిరస్కరించడం, కొత్త దరఖాస్తు వేసుకోమని వేధించడం న్యాయం కాదు. అది తప్పు చేసిన యాజమాన్యాలను పరోక్షంగా సమర్థించడమే. గుజరాత్ అమ్రేలీ జిల్లా చావంద్లోని శ్యాంగోకుల్ టీబీ హాస్పిటల్ వారు భవిష్య నిధి (ప్రావిడెంట్ ఫండ్) కోసం కార్మికుల జీతాలలో ఎంత కోత పెడుతున్నారు, వారి íపీఎఫ్ ఖాతాలలో ఎంత జమ చేస్తున్నారు, ఏ తేదీ నుంచి వడ్డీని కలుపుతున్నారు, ఖాతాలోంచి డబ్బుని తిరిగి పొందే విధానం ఏమిటి మొదలైన అంశాలను తెలియజేయాలని కార్మిక నాయకుడు రాథోడ్ సమాచార హక్కు చట్టం కింద అడిగారు. కొన్ని కాగితాలు ఇచ్చిన అసిస్టెంట్ పీఎఫ్ కమిష నర్, ‘పోనీ మీరే స్వయంగా వచ్చి మొత్తం దస్తావే జులు చూసుకోండి, కావలసిన కాగితాలు ఇస్తాం’ అని పిలిచారు. రాథోడ్ వచ్చి చూసి, అదనపు కాగి తాలు అడిగితే ‘‘ఇవ్వం, ఇంకోసారి ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకోండి’’ అని వారు సెలవిచ్చారు. కార్మికులందరి సమస్య గురించి ఈ ఆర్టీఐ వేశారు. కార్మికుల సంక్షేమం ఇందులో ఇమిడి ఉంది. యాజమాన్యాలు సరిగ్గా కార్మికుల వేతనాల నుంచి వారి పీఎఫ్ వాటా సొమ్మును కత్తిరించుకుని, దానికి తమ వాటాను కలిపి వారి ఖాతాలలో వేస్తు న్నారో, లేదో తెలుసుకోవలసిన బాధ్యత కార్మిక సంఘాలకు ఉంది. వారు ఆర్టీఐ కింద అడగకపో యినా, ఒక ఉత్తరం రాస్తే చాలు ఈ వివరాలన్నీ ఇవ్వడం అవసరం. కాని ఆర్టీఐ వేసిన తరువాత కూడా ఇవ్వకపోవడం, ఇంకో ఆర్టీఐ దరఖాస్తు పెట్టండి అని ఉచిత సలహా ఇవ్వడం సరైంది కాదు. 1991 నుంచి ఆ సంస్థలో ఉద్యోగులు పనిచేస్తుంటే 1994 నుంచి మాత్రమే పీఎఫ్ వాటాలను ఖాతాల్లో జమచేశారు. 7 ఎ కింద ఆ సంస్థపైన దర్యాప్తు చేయ వలసిన బాధ్యత ఉన్నా పట్టించుకోలేదు. పీఎఫ్ తది తర బకాయిలకు సంబంధించి ఇవ్వవలసిన ఫారం 3, 6 ఎ, 12 ఎ ఇచ్చినా సంస్థ తన బాధ్యత నిర్వ హించలేదు. ఇద్దరు ఉద్యోగులు 2008, 2009లో విరమణ చేశారు. 2009లో ఆస్పత్రి మూతబడటం వల్ల 20 మంది ఉద్యోగం కోల్పోయారు. కావాలని ఆలస్యం చేయడం వల్ల పీఎఫ్ కోసం కార్మికులు క్లెయిమ్ దరఖాస్తులు పెట్టుకోలేకపోయారు. కావల సిన వివరాల పత్రాలు ఇవ్వలేదు. మీరు అడిగిన వివరాలు స్పష్టంగా లేవు అని తాత్సారం చేశారు. స్పష్టంగా లేకపోతే కార్మిక నాయకుడిని పిలిచి అడి గితే ఏం పోయింది? రోజ్ కామ్ రిజిస్టర్‌ను, మరి కొన్ని రికార్డులను చూడాలని అడిగితే రమ్మన్నారు కాని, కావలసిన కాగితాలు ఇవ్వలేదు. అప్పీలు వేయమన్నారు. అందులోనూ న్యాయం జరగలేదు. ఫలానా కాగితాలు కావాలని అడిగితే మొదటి అప్పీలును ముగించామని, మళ్లీ కొత్తగా ఆర్టీఐ దర ఖాస్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. వారి దగ్గర సమాచారం ఉన్నా ఇవ్వడం లేదని రాథోడ్ కమి షన్‌కు వివరించారు. 17 మంది కార్మికుల క్లెయిమ్ ఫారాల కాపీలు అడిగారు. ఇతర పత్రాలు కావాల న్నారు. కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ వాటా తీసుకుని, జమ చేయకపోవడం, వారి వంతు డబ్బు ఇవ్వకపోవడం చట్ట ఉల్లంఘనలే. అర్థం అయ్యేట్టు ఆర్టీఐ అడగడం పౌరుని బాధ్యతే అయినా, స్పష్టంగా అడిగినా అర్థం కాలేదని వాదించడం బాధ్యతారాహిత్యం. కార్మికుల వేతనాల డబ్బును జమచేయకపోవడం అంటే, వారి డబ్బును యాజ మాన్యం అక్రమంగా వాడుకున్నట్టే. చాలా వివ రంగా దరఖాస్తు ఉన్నప్పడికీ అర్థం కావడం లేదని తిరస్కరించే అధికారం ఈ చట్టం కింద లేదు. కార్మికులకు సక్రమంగా వారి హక్కులు అందేట్లు చూడవలసిన కార్మిక శాఖ అధికారులు ఆ పని చేయకపోగా, దానికి సంబంధించిన వివరా లను ఆర్టీఐ కింద అడిగితే తిరస్కరించడం, కొత్త దరఖాస్తు వేసుకోమని వేధించడం న్యాయం కాదు. ఇందువల్ల తప్పు చేసిన యాజ మాన్యాలను కార్మిక శాఖ పరోక్షంగా సమర్థిస్తూ నష్టపోయిన కార్మికుల న్యాయమైన హక్కులను రక్షించడంలో నిర్లక్ష్యం చేసి నట్టు స్పష్టమవుతున్నది. ఈ కేసులో కమిషన్ కొన్ని ఆర్టీఐ సూత్రాలను నిర్ధారించింది. అవి: 1. సమాచార దరఖాస్తు అర్థం కాకపోతే దర ఖాస్తుదారుని పిలిచి తెలుసుకొనే ప్రయత్నం చేయ డం పీఐఓ బాధ్యత. అర్థం కాలేదని తిరస్కరించడం చట్ట వ్యతిరేకం. 2. పర్యవేక్షణ అధికారం కూడా సమాచార హక్కులో భాగం. దస్తా వేజులు పరిశీలిం చిన తరువాత కొన్ని కాగితాల ప్రతులు అడిగితే, ఇంకో తాజా ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకోవాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదు. పర్యవేక్షణ అధికారంలో కావ లసిన కాగితాలు కోరే హక్కు కూడా ఇమిడి ఉంది. మరోసారి దరఖాస్తు చేయడం వల్ల, మరోసారి వారి శ్రమ, సమయం శక్తి వెచ్చించవలసి వస్తుంది. అది ప్రజావనరుల వృథా అవుతుంది. కోరిన సమాచారం మొత్తం ఇవ్వాలని, ఇటు వంటి అన్యాయాలను కేంద్ర కార్మిక మంత్రి దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. (రాథోడ్ వర్సెస్ ఈపీఎఫ్ఓ, కార్మిక మంత్రిత్వశాఖ CIC/BS/A/ 2015/001969 కేసులో 2017 మార్చి 10న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఫోన్ ద్వారానే పీఎఫ్ క్లయిమ్?
న్యూఢిల్లీ: ఫోన్ ద్వారానే అన్ని లావాదేవీలు క్షణాల్లో పూర్తి చేసుకునేలా ఇప్పటికే పలు యాప్స్ రూపొందుతున్నాయి. తాజాగా పీఎఫ్ క్లయిమ్ కూడా ఇక ఫోన్ ద్వారానే చేసుకోవచ్చట. సుమారు నాలుగు కోట్ల మంది రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈ మేరకు సన్నాహాలు చేస్తుంది. ఈపీఎఫ్ విత్ డ్రాయల్ వంటి పీఎఫ్ క్లయిమ్స్ ను మొబైల్ అప్లికేషన్ యుమాంగ్ ద్వారానే సెటిల్ చేసుకునేలా త్వరలోనే లాంచ్ చేయబోతుంది. ఆన్ లైన్ లోనే దరఖాస్తులు స్వీకరించి, ఆన్ లైన్ ద్వారానే క్లయిమ్స్ సెటిల్ చేసుకునే ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ లోక్ సభకు తెలిపారు. యూనిఫైడ్ మొబైల్ యాప్ తో ఇది ఇంటిగ్రేట్ అయి ఉంటుందని, ఆన్ లైన్ లోనే క్లయిమ్స్ ను స్వీకరించి, ప్రక్రియను పూర్తిచేస్తుందన్నారు. అయితే ఎప్పుడు లాంచ్ చేయాలో ఇంకా తేదీలను ఖరారు చేయలేదని తెలిపారు. ఈ సేవలను ప్రారంభించడానికి సెంట్రల్ సర్వర్ తో అన్ని రీజనల్ ఆఫీసులను కనెక్ట్ చేయడానికి ఇంకా కొంత సాంకేతికత అవసరమని ఈపీఎఫ్ఓ ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఇప్పటికే కొన్ని రీజనల్ ఆఫీసులను సెంట్రల్ సర్వర్ తో అనుసంధానించిన్నట్టు తెలిపారు. అప్లికేషన్ దాఖలు చేసిన కొన్ని గంటల్లోనే పీఎఫ్ క్లయిమ్స్ చేపట్టే లక్ష్యంతో ఈ ప్రక్రియను ప్రారంభించబోతున్నామని ఈపీఎఫ్ఓ చెప్పింది. ప్రస్తుతం పీఎఫ్ క్లయిమ్స్ పూర్తికావడానికి 20 రోజుల వరకు సమయం పడుతుంది. ఈపీఎఫ్ విత్ డ్రాయల్స్ కోసం దాదాపు కోటి అప్లికేషన్లు వస్తుంటాయి. -
తగ్గని కిరణ్
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ఏ మాత్రం తగ్గడం లేదు. సీఎం నారాయణ స్వామి సర్కారును ఢీ కొట్టే విధంగా ముందుకు సాగుతున్నారు. పీఎఫ్ నిధిలో రూ.36 కోట్లను దారి మళ్లించి ఉండడాన్ని ప్రస్తుతం వెలుగులోకి తెచ్చారు. సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ, సీఎం నారాయణ స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. గత వారం రోజులుగా కిరణ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ నేతృత్వంలో ఏర్పడ్డ అఖిల పక్షం తీవ్ర నినాదాల్ని అందుకుంది. ఆమెను బర్తరఫ్ చేయాలని, డిస్మిస్ చేయాలని, వెనక్కు తీసుకోవాలన్న నినాదాలతో ఢిల్లీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదుల్ని వెల్లువెత్తించారు. ఈ వివాదాల నేపథ్యంలో శనివారం కిరణ్‌బేడీ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో రెండు రోజుల పాటుగా బేటీలతో బిజీ అయ్యారు. ఆ పెద్దల అండదండాలతో కూడిన భరోసా దక్కిందో ఏమోగానీ దూకుడు పెంచే పనిలో లెఫ్టినెంట్ గవర్నర్ నిమగ్నం కావడం గమనార్హం. నారాయణ స్వామి ప్రభుత్వంతో ఢీ కొట్టే విధంగా సోమవారం ఆమె స్పందించారు. పీఎఫ్ నిధి దారి మళ్లించి ఉండడాన్ని పసిగట్టి, వెలుగులోకి తెచ్చారు. క్రిమినల్ కేసు నమోదుకు తగ్గ చర్యల్లో భాగంగా న్యాయ శాఖ అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్ణయించడంతో పుదుచ్చేరిలో సాగుతున్న అధికార ఆధిపత్య సమరానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. పీఎఫ్ దారి మళ్లింపు ప్రభుత్వ రంగ సంస్థలు, సహకారం సంస్థల్లోని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధిలో రూ.36 కోట్లను ఇతర పనులకు దారి మళ్లించినట్టు కిరణ్ గుర్తించారు. తన పరిశీలనలో వచ్చిన అంశాన్ని వెలుగులోకి తెస్తూ తొలుత ట్విట్టర్లో రూ.36 కోట్లు ఏమైనట్టు అని ప్రశ్నించడంతో నారాయణ స్వామి ప్రభుత్వ వర్గాలకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. దీంతో మంత్రి కందస్వామి సమాధానం ఇస్తూ, ఇది తమ హయాంలో జరిగింది కాదని, ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు తెర మీదకు తెచ్చి తమ మీద నిందలు వేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సిద్ధమైనట్టున్నారని మీడియా ముందు విరుచుకు పడ్డారు. తాము గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దృష్ట్యా, తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా, చెడ్డ పేరు తీసుకొచ్చే రీతిలో ఆమె చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. దీంతో కిరణ్ స్పందించారు. మంత్రి వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకుని, అస్సలు ఆ నగదు దారి మళ్లింపు అన్నది క్రిమినల్ నేరంగా అభివర్ణిస్తూ, అందుకు తగ్గ చర్యలకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు గాను న్యాయ శాఖ అభిప్రాయాన్ని తీసుకునేందుకు నిర్ణయించి, ఆ శాఖ కార్యదర్శికి ఓ లేఖ రాయడం గమనార్హం. అందులో పీఎఫ్ నిధి దారి మళ్లింపు అన్నది క్రిమినల్ చర్య కిందకు వస్తుందన్న విషయం తన పరిశీలనలో తేలిందని గుర్తు చేశారు. పీఎఫ్ దారి మళ్లింపు ఎలా జరిగింది, పీఎఫ్ నిధి విషయంలో ఏమి జరుగుతున్నదో, మంత్రి 11 నెలలుగా ఏమి చేశారో, సమగ్ర వివరాలతో పాటుగా క్రిమినల్ కేసు విషయంలో అభిప్రాయం తెలియజేయాలని ఆ లేఖ ద్వారా కోరారు. అయితే, పీఎఫ్ దారి మళ్లింపు వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదుకు తగ్గ చర్యల్లో భాగంగా న్యాయ శాఖ అభిప్రాయాన్ని స్వీకరించేందుకు కిరణ్ నిర్ణయించడం పుదుచ్చేరిలో సాగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. -
పీఎఫ్ సీలింగ్ పరిమితి పెంపు?
న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పీఎఫ్ అర్హతకు ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసేందుకు అడుగులు వేస్తోంది. నెలకు రూ. 15 వేలుగా ఉన్న వేతన పరిమితిని రూ. 25 వేలకు పెంచాలని ఈపీఎఫ్‌వో యోచిస్తోంది. వచ్చే నెలలో జరుగబోయే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయంపై చర్చించనుందని తెలుస్తోంది. ధరల పెరుగుదల, వేతన సమీక్షలో భాగంగా ఈపీఎఫ్ఓ ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు సమాచారం. అంతేకాక సంఘటిత రంగంలో ఉన్న 60 లక్షలకు పైగా ఉద్యోగులను కూడా తమ సోషల్ సెక్యురిటీ పరిధిలోకి చేకూర్చుకోనుందట. ఇప్పటివరకు ఈ రంగంలో 4 కోట్ల మంది ఉద్యోగులు మాత్రమే ఈపీఎఫ్ఓ ఖాతాదారులుగా ఉన్నారు. మరోవైపు ఈపీఎఫ్ఓ బోర్డు ప్రతిపాదించిన రూ.25వేల కనీస వేతన పరిమితికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టి దాన్ని తగ్గించనుందని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ కవరేజ్ వ్యవహారంలో మధ్యే మార్గాన్ని అనుసరిస్తూ కనీస వేతనాన్ని 21వేల రూపాయలుగా నిర్ణయించనున్నట్టు ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. కాగ, 2014 సెప్టెంబర్ 1న వేతన సీలింగ్ నెలకు 15వేల రూపాయలుగా ఉండేటట్టు ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. అప్పటివరకు ఈ పరిమితి రూ.6500గా ఉండేది. కాగా, ఈపీఎఫ్ఓ ప్రతిపాదన అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వంపై రూ.2,700 కోట్ల అదనపు భారం పడే అవకాశముంది. దాదాపు 4 కోట్ల మంది ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రసుత్తం రూ.6,700 కోట్లు వెచ్చిస్తోంది.