
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్‌పై 8.55 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్మిక శాఖ త్వరలోనే ప్రకటన చేయనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని నిర్ణయించి ఫిబ్రవరిలోనే ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించింది.
అయితే, ఆర్థిక శాఖ ఆమోదం ఆలస్యం కావటంతోపాటు ఈనెల 12న కర్ణాటకలో ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల నియమావళి అడ్డుగా నిలిచింది. వచ్చే వారంలో ఎన్నికల సంఘం అనుమతి రాగానే కార్మిక శాఖ ప్రకటన చేస్తుందనీ, ఆ వెంటనే సభ్యుల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ అవుతుందని ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి. గత ఐదేళ్లలో ఈపీఎఫ్‌వో చందాదారులకు చెల్లిస్తున్న అతి తక్కువ వడ్డీ ఇదే కావటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment