Central Board of Trustees
-
ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పింఛను
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో నిర్వహణలోని ‘ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్’ (ఈపీఎస్) 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాల మండలి అయిన ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్’కు కారి్మక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈపీఎస్ 1995 పరిధిలోని ఉద్యోగులకు కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ(సీపీపీఎస్)కు ఆమోదం తెలిపినట్టు మాండవీయ ప్రకటించారు. దీని ద్వారా ఏ బ్యాంక్ శాఖ నుంచి అయినా పింఛను చెల్లింపులకు వీలుంటుంద న్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆధునికీకరణలో సీపీపీఎస్ ఓ మైలురాయిగా అభివరి్ణంచారు. -
ఈపీఎస్ నుంచీ డబ్బు తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) తీసుకుంది. ఒక ఉద్యోగి ఒక సంస్థలో చేరి ఆరు నెలల్లోపు మానేస్తే, కేవలం తన పీఎఫ్ ఖాతాలోని బ్యాలన్స్ వరకే వెనక్కి తీసుకోగలరు. పెన్షన్ ఖాతా (ఈపీఎస్–95)లోని జమలను తీసుకోవడానికి లేదు. కానీ, ఆరు నెలల సర్వీసు కూడా లేకుండా ఉద్యోగం మానేసే వారు పెన్షన్ ఖాతాలోని బ్యాలన్స్‌ను సైతం వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సోమవారం నాటి 232వ సమావేశంలో నిర్ణయించింది. ఇక ఈటీఎఫ్‌లలో తన పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన విధానానికీ ఆమోదం తెలిపింది. 2018లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్ యూనిట్లకు సంబంధించి లాభాలను వెనక్కి తీసుకుని, 2022–23 సంవత్సరానికి వడ్డీ ఆదాయం లెక్కింపులోకి పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. -
రిటైర్మెంట్ ఫండ్ సంస్థకు ‘ఈటీఎఫ్’ బొనాంజా
న్యూఢిల్లీ: ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) భారీ బొనాంజా పొందుతోంది. కార్మిక, ఉపాధి వ్యవహారాల శాఖ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మార్చి 2022 వరకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో ఈపీఎఫ్ఓ రూ. 1,59,299.46 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడుల ప్రస్తుత (నోషనల్) మార్కెట్ విలువ రూ. 2,26,919.18 కోట్లు. 2019–20లో రూ.31,501 కోట్లు, 2020–21లో రూ.32,071 కోట్లు, 2021–22లో రూ.43,568 కోట్లు ఈటీఎఫ్‌లలోకి ఈపీఎఫ్ఓ పెట్టుబడులు వెళ్లాయి. ► ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడి విలువ రూ.12,199.26 కోట్లు. ఇదే కాలంలో డెట్ ఇన్స్ట్రమెంట్లలోకి వెళ్లిన మొత్తం పెట్టుబడి విలువ రూ.84,477.67 కోట్లు ► నిఫ్టీ 50, సెన్సెక్స్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ), భారత్ 22 సూచీల ఆధారంగా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. 15 శాతం వరకే పెట్టుబడులు పరిమితి... ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో దాదాపు రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ప్రారంభంలో ఈపీఎఫ్ఓ తన పెట్టుబడి పరిమితుల్లో 5 శాతం స్టాక్ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించుకుంది. తరువాత ఈ నిష్పత్తిని 2016–17లో 10 శాతానికి పెంచడం జరిగింది. 2017–18లో 15 శాతానికి పెంచారు. డెట్ ఇన్‌స్ట్రమెంట్లలో 85 శాతం నిధులను పెట్టుబడులుగా పెట్టే అవకాశం ఉంది. (క్లిక్: ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?) -
ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ యథాతథం
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) యథాతథంగా 8.5 శాతంగా కొనసాగనుంది. రిటైర్మెంట్ ఫండ్ వ్యవహారాలను నిర్వహించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ (ఈపీఎఫ్ఓ) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ కీలక నిర్ణయం తీసుకుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019–20లో కూడా ఈపీఎఫ్ఓ 8.5 శాతం వడ్డీని తన చందాదారులకు అందించింది. ప్రకటన ప్రకారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో గురువారం కార్మిక, ఉపాధి శాఖల సహాయంత్రి (ఇండిపెండెంట్ చార్జ్) సంతోష్ కుమార్ నేతృత్వంలో సీబీటీ సమావేశం జరిగింది. వడ్డీరేటుపై తన నిర్ణయాన్ని సీబీటీ ఆర్థిక శాఖ ఆమోదం కోసం నివేదిస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. అనంతరం తన క్రియాశీల చందాదారుల అకౌంట్లలో 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. ఐదు కోట్లకుపైగా చందాదారులు ప్రకటన ప్రకారం, ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఐదు కోట్లకుపైగా చందాదారులను కలిగిఉంది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీటీ తాజా నిర్ణయం తీసుకుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీ అసెట్స్‌లో తన మొత్తం నిధుల్లో 5%తో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు ప్రస్తుతం 15%కి చేరాయి. 2018–19లో ఈపీఎఫ్ఓ చందాదారులకు లభించిన వడ్డీ 8.65%. దీన్ని 8.5%కి తగ్గిస్తూ, గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం, భారీ ఉపసంహరణల నేపథ్యంలో వడ్డీరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలకు భిన్నం గా ట్రస్టీల బోర్డ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
పీఎఫ్‌పై వడ్డీ 8.55 శాతం
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్‌పై 8.55 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్మిక శాఖ త్వరలోనే ప్రకటన చేయనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని నిర్ణయించి ఫిబ్రవరిలోనే ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించింది. అయితే, ఆర్థిక శాఖ ఆమోదం ఆలస్యం కావటంతోపాటు ఈనెల 12న కర్ణాటకలో ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల నియమావళి అడ్డుగా నిలిచింది. వచ్చే వారంలో ఎన్నికల సంఘం అనుమతి రాగానే కార్మిక శాఖ ప్రకటన చేస్తుందనీ, ఆ వెంటనే సభ్యుల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ అవుతుందని ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి. గత ఐదేళ్లలో ఈపీఎఫ్‌వో చందాదారులకు చెల్లిస్తున్న అతి తక్కువ వడ్డీ ఇదే కావటం గమనార్హం. -
ఈపీఎఫ్‌పై వడ్డీ శాతంపై కేంద్రం కోత
-
ఈపీఎఫ్‌పై వడ్డీ 8.65 శాతం
0.15 శాతం తగ్గించిన కేంద్రం ► ఇది పీపీఎఫ్, జీపీఎఫ్‌పై వడ్డీ కంటే ఎక్కువే: దత్తాత్రేయ ► 50 లక్షల మంది కొత్త సభ్యుల నమోదు లక్ష్యం బెంగళూరు: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీపై కేంద్రం కోత విధించింది. 2015–16కు వడ్డీ రేటు 8.8 శాతం ఉండగా ప్రస్తుతం దీనిని 8.65 శాతానికి తగ్గించింది. గత నాలుగేళ్లలో ఇదే అతి తక్కువ వడ్డీ రేటు. స్వల్ప మిగులు కారణంగా వడ్డీ రేటు తగ్గించాల్సి వచ్చిందని భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పేర్కొంది. 2016–17 సంవత్సరా నికి గాను ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం నాడిక్కడ చెప్పారు. ఈపీఎఫ్ఓకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 215వ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీఎఫ్ వాటాదారులతో విస్తృత సంప్రదింపుల నేపథ్యంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు సీబీటీ చైర్మన్ కూడా అయిన దత్తాత్రేయ చెప్పారు. 8.65 శాతం వడ్డీ రేటు ఇచ్చిన తర్వాత సంస్థ రూ.269 కోట్ల మిగుల్లో ఉంటుందన్నారు. వడ్డీ రేటు తగ్గినప్పటికీ ఇలాంటి మిగతా సంస్థలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్ (8.1%)), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్ (8%) వంటి వాటితో పోల్చుకుంటే ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు చెల్లిస్తున్నది ఎక్కువేనన్నారు. ఇలాఉండగా ఈపీఎఫ్ఓ పరిపాలన పరమైన చార్జీలను 0.85 శాతం నుంచి 0.65 శాతానికి తగ్గించాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. కొత్త సభ్యుల నమోదు పెంచే కార్యక్రమాన్ని చేపట్టను న్నామని, మొదటి దశలో 50 లక్షల మంది కొత్త సభ్యుల ను చేర్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. గత ఏడాది ఆదాయంతోపాటు అప్పుడు మిగులు రూ.1,600 కోట్లు ఉండగా, ఈ ఏడాది ఈ మొత్తం రూ.410 కోట్లేనని సీపీఎఫ్ కమిషనర్ జాయ్ చెప్పారు. -
ఈడీఎల్ఐ బీమా మొత్తం 6 లక్షలకు పెంపు..
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) స్కీమ్ కింద ప్రయోజనాన్ని కేంద్రం పెంచింది. ప్రస్తుతం రూ.3.6 లక్షలుగా ఉన్న బీమా మొత్తాన్ని రూ.6 లక్షలకు పెంచింది. దాదాపు 4 కోట్ల మంది చందాదారులకు ఈ ప్రయోజనం అందుతుంది. నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అత్యున్నత స్థాయి నిర్ణయ కమిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) ఈడీఎల్ఐ ప్రయోజన పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. అయితే అమలుకు తాజా నోటిఫికేషన్ జారీ అయ్యింది. సామాజిక భద్రతకు సంబంధించి శిక్షణ, పరిశోధనా శిక్షణ వ్యవహారాల జాతీయ అకాడమీ (ఎన్ఏటీఆర్ఎస్ఎస్)ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీమా ప్రయోజనం పెంపు నోటిఫికేషన్ జారీ విషయం వెల్లడించారు. యాజమాన్యం చందాతో జతపడిన ఈ జీవిత బీమా... ఈడీఎల్ఐ స్కీమ్‌ను... ఒకవేళ సంబంధిత ఉద్యోగి ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా ‘రిబేట్ చందాతో’ కొంతకాలం కొనసాగించేలా కసరత్తు చేస్తున్నట్లు గతంలో మంత్రి వెల్లడించారు. -
ఈటీఎఫ్‌ల్లో రూ.750 కోట్ల ఈపీఎఫ్ఓ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ ఈ ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్‌ల్లో రూ.5,750 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. గతంలో రూ.5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) భావించింది. అయితే ఇంక్రిమెంటల్ డిపాజిట్లు రూ. లక్ష కోట్లు వస్తాయని ఈ సంస్థ గతంలో అంచనా వేసింది. ఇప్పుడు ఈ ఇంక్రిమెంటల్ డిపాజిట్లు 1.15 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనాలుండటంతో అదనంగా రూ.750 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోందని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ ఈపీఎఫ్ఓ రూ.2,322 కోట్లు ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసింది. ఈ నెల 24న(మంగళవారం) జరిగే ఈపీఎఫ్ఓకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సమావేశంలో ఈ విషయమై చర్చ జరగనున్నదని సమాచారం. -
స్టాక్స్‌లోకి పీఎఫ్ నిధులు..!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు, ఈక్విటీ సంబంధిత పథకాల్లోకి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) నిధులను మళ్లించడం దాదాపు ఖాయమయినట్లు కనబడుతోంది. మొదట మొత్తం నిధుల్లో ఒక శాతాన్ని ఈక్విటీ మార్కెట్లు, ఆయా స్కీమ్‌లలోకి మళ్లించి, అటు తర్వాత ఈ పెట్టుబడులను 5 శాతం వరకూ పెంచాలన్నది కార్మిక మంత్రిత్వశాఖ ప్రతిపాదనని సీనియర్ అధికారులు తెలియజేస్తున్నారు. తరువాతి క్రమంలో ఎప్పటికప్పుడు సమీక్ష, తదనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. త్వరలో ఈ అంశంపై విధివిధానాలను ఆవిష్కరించనున్నట్లు కూడా అధికారులు తెలిపారు. మంగళవారం నాడు ఇక్కడ ఈపీఎఫ్ఓ సెంట్రల్ ట్రస్టీల బోర్డ్ సమావేశమై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 సమగ్ర సవరణలపై చర్చలు జరిపింది. ఈ సందర్భంగా సీనియర్ అధికారులు కొందరు విలేకరులకు ఈ అంశాలు తెలిపారు. అందరి అభిప్రాయాలమేరకే: దత్తాత్రేయ ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు 5 కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. 2015-16 బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా కనీసం 5% వరకూ ఈపీఎఫ్ఓ నిధులను ఈక్విటీ, సంబంధిత పథకాల్లో పెట్టుబడులను ప్రతిపాదించారు. గరిష్టంగా 15% వరకూ ఈ నిధులు ఉండవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా అనుభవాలను చూస్తే... ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వల్ల అధిక లాభాలు వస్తాయన్న విషయం రుజువవుతోందని కార్మిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కాగా మంగళవారం సమావేశం అనంతరం కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈపీఎఫ్ఓ నిధుల పెట్టుబడులపై కేంద్ర నిర్ణయం ఉంటుందని -
పింఛను స్కీం రిటైర్మెంట్ వయసు పెంపు!
ప్రతిపాదనను పరిశీలించనున్న ఈపీఎఫ్ఓ ట్రస్టీల బోర్డు న్యూఢిల్లీ: ఉద్యోగుల పింఛను పథకం పరిధిలోకి వచ్చే సంఘటిత రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) అత్యున్నత నిర్ణాయక మండలి అయిన ట్రస్టీల కేంద్ర మండలి(సీబీటీ) నెల 5న జరిగే సమావేశంలో పరిశీలించనుంది. కేంద్ర కార్మిక మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో.. 20 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి రెండేళ్ల బోనస్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించాలన్న ప్రతిపాదనపైనా చర్చించనున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్-95) కింద చందాదారులు సభ్యత్వాన్ని వదులుకుని పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంటే వారు 58 ఏళ్ల తర్వాత పథకంలో కొనసాగలేరు. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలకు చందాలు జమచేయడానికి ఎలాంటి వయోపరిమితి లేదని ఈపీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎస్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచితే 27 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి కలుగుతుంది. కార్మిక శాఖకు అందజేసిన మెమొరాండంలో ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనలను పొందుపరచింది. ఈపీఎస్ పథకం కింద కనీస పింఛనును రూ.1,000కి పెంచేందుకు ఆర్థిక శాఖ ఆమోదించడం తెలిసిందే.