ఈటీఎఫ్‌ల్లో రూ.750 కోట్ల ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు | EPFO to invest additional Rs 750 crore in ETFs in FY16 | Sakshi
Sakshi News home page

ఈటీఎఫ్‌ల్లో రూ.750 కోట్ల ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు

Published Mon, Nov 23 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

ఈటీఎఫ్‌ల్లో రూ.750 కోట్ల ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు

ఈటీఎఫ్‌ల్లో రూ.750 కోట్ల ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌ఓ ఈ ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్‌ల్లో  రూ.5,750 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. గతంలో రూ.5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) భావించింది. అయితే ఇంక్రిమెంటల్ డిపాజిట్లు రూ. లక్ష కోట్లు వస్తాయని ఈ సంస్థ గతంలో అంచనా వేసింది. ఇప్పుడు ఈ ఇంక్రిమెంటల్ డిపాజిట్లు 1.15 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనాలుండటంతో అదనంగా రూ.750 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఈపీఎఫ్‌ఓ యోచిస్తోందని సమాచారం.

ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ ఈపీఎఫ్‌ఓ రూ.2,322 కోట్లు ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసింది. ఈ నెల 24న(మంగళవారం) జరిగే ఈపీఎఫ్‌ఓకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సమావేశంలో ఈ విషయమై చర్చ జరగనున్నదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement